ఆంధ్రప్రదేశ్‌లోనే అత్యంత ప్రకృతి రమణీయత కలిగిన జలపాతం కుంటాల. ఉత్తర తెలంగాణాలోని ఆదిలాబాద్ జిల్లాలో ఉన్న ఈ జలపాతం పర్యాటకులను ఆకట్టుకోవడంలో మొదటిస్థానాన్ని ఆక్రమించింది. దక్షణ భారతదేశంలోనే అతిపెద్దదైన గోదావరి నదికి ఉప నదిఅయిన కడెం నదిపై అలరారుతున్న ఈ జలపాతం రాష్ట్రానికే తలమానికంగా ఉంది. దేశవ్యాప్తంగా అత్యంత ప్రాచూర్యాన్ని పొందిన ఈ జలపాతం రాష్ట్రంలోనే అతి ఎత్తయిన జలపాతం కూడా కావడం విశేషం.
రాష్ట్రంలోనే అత్యంత ఎతైన కొండల నుంచి అడవులను చీల్చుకుంటూ ప్రకృతి రమణీయతనంతా తనలో ఇముడ్చుకొని.. కొండ కోనల నుంచి జాలు వారుతున్న అందాల జలపాతం కుంటాల. సహాజ సిద్దమైన.. దట్టమైన అడవులు, ఎతె్తైన రాళ్లను చీల్చుకుంటు దాదాపు 45 అడుగుల ఎత్తు నుంచి భీకర శబ్దంతో కిందికి జాలువారుతూ పర్యటకులను మంత్ర ముగ్దులను చేస్తుంటుంది కుంటాల జలపాతం. ఆదిలాబాద్ జిల్లా కేంద్రానికి సుమారు 45 కిలోమీటర్ల దూరంలో ఉన్న నేరడిగొండ మండల కేంద్రం నుంచి సుమారు 12 కిలోమీటర్ల దూరం కుడివైపు వెళ్తే అందమైన కుంటాల జలపాతం కనిపిస్తుంది.
కడెం నది పరివాహాక ప్రాంతంలో ఉండే ఈ జలపాతం ప్రతి యేట వర్షకాలంలో భీకర శభ్దంతో భయంకరంగా కనిపిస్తూ పర్యటకుల గుండెల్లో గుబులు రేపుతుండగా.. జనవరి తర్వాత చల్లటి సెలయేర్లు, తెల్లటి నురగలతో కొండ కోనలపై నుంచి జాలువారుతు ఆదిలాబాద్ మనిహారంగా నిలుస్తున్నది. సహ్యాద్రి పర్వత శ్రేణుల నుంచి జాలువారుతున్న ఈ జలపాతాన్ని చూడడానికి జిల్లా నుంచే కాకుండా పొరుగున ఉండే నిజామాబాద్, కరీంనగర్, వరంగల్, ెహదరాబాద్‌తో పాటు మహారాష్టల్రోని నాందేడ్, యవత్‌మల్, చంద్రాపూర్ లాంటి జిల్లాల నుంచి పర్యటకులు భారీగా తరలి వస్తుంటారు. సెలవు దినాలతో పాటు వేసవిలో సైతం పర్యటకులు ఇక్కడి ప్రకృతి కమనీయతను ఆస్వాదించడానికి సుదూర ప్రాంతాల నుంచి వాహానాలలో తరలివచ్చి ఉదయం నుంచి సాయంత్రం వరకు ఇక్కడే వంట వార్పు చేసుకొని వన భోజనాలు చేసి వెళ్తుంటారు. అటవీ ప్రాంతంలో ఉన్న ఈ జలపాతం పూర్వ పరాలను పరిశీలిస్తే అప్పటి శకుంతల దుష్యంతులకు విహార వెడిది కేంద్రంగా ఉండేదని శకుంతల జలపాతంగా మొదట దీనిని పిలువగా ఆతర్వాత ‘కుంతల’ జలపాతంగాను పిలువబడి కాల క్రమేనా ‘కుంటాల’ జలపాతంగా మారింది.
సోమేశ్వరాలయం...
ఈ జలపాతానికి అతి దగ్గరలో సోమేశ్వరాయం ఉంది. మహ శివరాత్రి రోజున ఈ దేవాలయాన్ని అత్యంత సుందరంగా అలంకరిస్తారు. కుంటాల జలపాతంలోని ఎతె్తైన.. నీళ్లు జాలువారే ప్రదేశ సమీపంలోనే ఉన్న గుహలో సోమేశ్వరుడు కొలువై భక్తుల మొక్కులు చెల్లిస్తున్నాడు. ప్రతియేట మహాశివరాత్రి పర్వదినాన ఇక్కడ జాతర అంగరంగవైభవంగా జరుగుతుంది. ఆ సమయంలో వందలాది మంది శివభక్తులు వచ్చి.. అతి ప్రమాదమని తెలిసి కూడా గుహలో పూజలు చేసి తరించడం గమనార్హం. ఈ గుహ నుంచి ఇచ్చోడ ప్రాంతంలోని సిరిచెల్మ మల్లేశ్వర స్వామి ఆలయం వరకు సోరంగ మార్గం ఉందనే వాదన కూడా ఉంది. ఈ గుహను ప్రజలు సోమన్న గుహగా కూడా చెప్పుకుంటారు. ప్రకృతి సహాజ సిద్దమైన జలపాతంగా ఉన్న కుంటాలను రాష్ట్రప్రభుత్వం మరింత అభివృద్ధి పరచాల్సి ఉంది. రెండేళ్ల క్రితం అటవీ శాఖ ప్లానింగ్ విభాగం ‘ఎకో టూరిజం’ పేరుతో కొంత అభివృద్ది చేసినప్పటికీ పర్యాటకులకు మరినిన సౌకర్యాలు కల్పించాల్సివుంది.
చారిత్రక విశేషం...
భార్య శకుంతల నుంచి పేరుతో ఈ జపాతాన్ని ‘కుంటాల’ అనే పేరు వచ్చిందని స్థానికుల అభిప్రాయం.. ఈ జలపాతం పరిసర ప్రాంతాలను వీక్షించి మైమరిచిపోయిన శకుంతల తరుచుగా ఈ జలపాతంలో జలకాలాడేదని ఇక్కడి ప్రలు నమ్ముతారు. ఈ ప్రాంతం.. మూడు జలపాతాలు, గుండాలుగా ఉన్నాయి. ఈ గుండాల్లో ముఖ్యమైన గుండాన్ని స్థానికులు సోమన్న గుండంగా పిలుస్తారు. ఈ జలపాతం వద్ద ప్రకృతి సిద్ధమైన రాతిగుహల్లో శివలింగాలు ప్రతిష్టమై ఉండటం వలన ప్రతి సంవత్సరం శివరాత్రి రోజున భక్తులు ఈ శివలింగాలను సందర్శించుకొని పూజలు నిర్వహిస్తారు. దీనినే ఇక్క డ సోమన్న జాతరగా పిలుస్తారు. శివరాత్రి పర్వదినాన్ని ఇక్కడ రెండు రోజుల పాటు జరుపుకోవడం ఆనవాయితీ. ఇది అనాదిగా వస్తున్న ఆచారం కూడా. ఇదే జిల్లాలో... చదువుల తల్లి సరస్వతీ దేవి కొలువై ఉన్న బాసర దేవాలయాన్ని సందర్శించే భక్తుల టూర్ షెడ్యూల్లో కుంటాల జలపాతం కూడా ఉంటుంది. జపాతానికి చుట్టూ ఉన్న అడవి ఉష్ణమండల శుష్క ఆకురాలు వనాల రకానికి చెంది అన్ని జాతుల వృక్షాలు కిలిగి అధికంగా టేకు చెట్లతో నిండి ఉన్నది. ఈ అడవిలో చాలా రకాల అటవీ జంతువులు, పక్షులు ఉన్నాయి.
ఇలా వెళ్ళాలి...
ఆదిలాబాద్ జిల్లా కేంద్రానికి 60 కిలోమీటర్ల దూరంలో ఈ జలపాతం ఉన్న నేరేడిగొండ అనే గ్రామానికి 12 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌కు సుమారు 275 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ పర్యాటక కేంద్రానికి బస్సు, రైలు సౌకర్యం కలదు. బస్సు ప్రయాణాన్ని ఎంచుకుంటే హైదరాబాద్ - నాగపూర్ జాతీయ రహదారి మీదుగా నగర శివారులోని మేడ్చైఉ నుండి బయలుదేరి కామారెడ్డి, ఆర్మూర్, నిర్మైఉ (నిజామాబాద్ జిల్లా)ల మీదుగా కుంటా చేరుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్ రోడ్డు రవాణా సంస్థ ఇక్కడికి బస్సు సౌకర్యం కూడా కల్పిస్తోంది. రైలు మార్గం గుండా వెళ్తే సికింద్రాబాద్ నుండి ఆదిలాబాద్ చేరుకొని అక్కడి నుండి బస్సు ద్వారా కుంటాలా చేరుకోవచ్చు.
స్విమ్మింగ్ నిషేధం...
45 మీటర్ల ఎత్తు నుంచి జాలువారే నీళ్ళు,ఆ చప్పుడు పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంటుంది. దట్టమైన అడవులలో, సహ్యాద్రి పర్వత పంక్తుల్లో గోదావరికి ఉపనది ఆయన కడెం నదిపై ఈ జలపాతం ఉంది. జలపాతం దిగువభాగంలో సమతలంగా ఉన్న బండరాళ్ళు ప్రత్యేకత ఆకర్షణగా నిలుస్తున్నాయి. జలపాతం వద్ద ఉన్న లోయలు కూడా చాలా లోతుగా ఉండి నీళ్ళు సుళ్ళు తిరిగే దృశ్యం ముచ్చటగొలుపుతుంది. ఇక్కడ నీటిలో స్విమ్మింగ్ చేయడం నిషేధం. ఎందుకంటే ఎంతో లోతైన ఈ జలపాతంలో ఈదటం చాలా ప్రమాదకరం.
కర్టసీ : సూర్య Daily
No comments:
Post a Comment