విహారాలు

India

Gamyam

Showing posts with label విహారాలు. Show all posts
Showing posts with label విహారాలు. Show all posts

Saturday, August 11, 2012

'' బ్రూనై '' .... గాంధీ కలగన్న దేశం

'గాంధి కలలుగన్న దేశం ఇదే. ఇక్కడ ఎంత రాత్రిపూటయినా సరే ఆడపిల్ల ఒక్కతే నడుచుకుంటూ వెళ్ళగలదు. ఈ దేశంలో గత 20 ఏళ్ళలో ఒక్క హత్యా నమోదు కాలేదంటే ఆలోచించండి ఎంత ప్రశాంతమైన దేశమో'... బ్రూనై దారుస్సలాంలో తొమ్మిదేళ్ళుగా ఇంగ్లీషు లెక్చరర్‌గా పనిచేస్తున్న వాసుదేవ్ అడారి చెప్పిన  విశేషాలివి.

బోర్నియో ద్వీపకల్పంలో వాయవ్యాన ఉన్న ఓ చిన్న అందమైన దేశం బ్రూనై దారుస్సలాం. 2010 జూలై లెక్కల ప్రకారం ఈ దేశ జనాభా కేవలం నాలుగు లక్షలు. భారతదేశపు ఏ ఒక్క కాలనీలో మొహల్లాలోనో కనిపించే జనసాంద్రత ఇది. అలాంటిది దేశం మొత్తంమీద అంత తక్కువమంది ఉన్నారంటే అది ఎంత ప్రశాంతంగా ఉంటుందో, ముఖ్యంగా ఎంత పరిశుభ్రంగా ఉంటుందో పాఠకులు ఊహించుకోవచ్చు. ఈ నాలుగు లక్షల ప్రజల కోసం దాదాపు లక్షన్నర మంది విదేశీయులు వివిధ ఉద్యోగాల్లో సేవలందిస్తున్నారు.

అధికారిక మతం ఇస్లాం, భాష మలయ్. మలేషియా, ఇండొనేషియా, సింగపూర్‌లలో కూడా అధికార భాష అదే. నిజానికి మలయ్ అన్న పదం ఓ జాతి ప్రజల పేరుగా వాడుకలో ఉంది. దేశ జనాభాలో అరవై ఏడు శాతం ప్రజలు మలయ్‌లుగా పిలువబడుతూ మలయ్ భాషని మాట్లాడేవారిగా ఉన్నారు. రెండు మూడు స్థానాల్లో ఇంగ్లీష్, చైనీస్ భాషలు ఉన్నాయి. దాదాపు అందరూ కాస్తో కూస్తో ఇంగ్లీష్ మాట్లాడతారు. కాబట్టి విదేశీయులకి, టూరిస్టులకి భాష సమస్య కాదు. దేశాన్ని నాలుగు జిల్లాలుగా విభజించారు. 1906లో బ్రిటిష్ ప్రొటెక్టోరేట్‌గా ఉన్న ఈ బ్రూనై దారుస్సలాం 1984 జనవరిలో పూర్తి స్వాతంత్య్రం సంపాదించుకుంది. గల్ఫ్ దేశాల వలె పూర్తి స్థాయి రాజరికం ఉన్న అతి తక్కువ దేశాల్లో ఇదొకటి. ఈ దేశానికి ఆర్థిక వనరులు చమురు, సహజ వాయువే.

బ్రూనై అనగానే అందరికీ బ్రూనై సుల్తానే గుర్తుకు వస్తాడు. నిజమే ప్రపంచ అత్యంత ధనవంతుల జాబితాలో ఒకడైన హసనల్ బోల్కియా ఈ దేశపు రాజే. 1967 నుంచి ఈ దేశాన్ని పరిపాలిస్తున్న 29వ రాజు. దాదాపు అరవై బిలియన్ డాలర్ల ఆస్తితో 1990 దశకంలో ఇతను ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడు. ఫోర్బ్స్ మేగజైన్ ప్రకటించిన వివరాల ప్రకారం ఈ దేశపు చమురు, సహజవాయువు నిక్షేపాల విలువ సుమారు 22 బిలియన్ డాలర్లు. సాధారణంగా నీళ్ళో, చమురో మాత్రమే ఉండే దేశాలు మనకు తెలుసు. కానీ ఈ బ్రూనై దారుస్సలాం ప్రత్యేకతల్లో ఒకటి అవి రెండూ పుష్కలంగా లభ్యం కావటం.

ఇస్లాం-రామరాజ్యం

క్రీస్తు శకం 6-7 శతాబ్దాల వరకు మహారాజు శ్రీవిజయన్ ఈ దేశాన్ని పరిపాలించాడు. దేశంలో అందరూ సంస్కృతం మాత్రమే మాట్లాడాలని శాసనం చేసి ఓ కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టాడు. ఆ తర్వాత 15వ శతాబ్దంలో ఇస్లాం ప్రాబల్యం పెరిగి అదే అధికారిక మతంగా మారింది. అయితే భాషాపరంగా మాత్రం సంస్కృతమే ఇక్కడ అధికారిక భాషగా కొనసాగుతోంది. చరిత్ర ఆవిష్కరించే చిత్రాల్లో ఇదొకటి.

ప్రజలందరికీ ఉచిత విద్య, వైద్యం సదుపాయాలతో పాటు అందరికీ ఇల్లు, కారు సమకూర్చుకోవడానికి తక్కువ వడ్డీతో బ్యాంకు ఋణాలు ఇస్తారు. ఇవన్నీ సాధ్యం కావడానికి ప్రధాన కారణం వారి తక్కువ జనాభానే. ఇక్కడ ప్రతీ వ్యక్తికి ఓ కారు తప్పనిసరి. పబ్లిక్ ట్రాన్స్‌పోర్టేషన్ చాలా తక్కువ. అక్కడక్కడ విదేశీ శ్రామికుల కోసం మినీ బస్సులు కనబడతాయి. టాక్సీలు, ఆటోల్లాంటివి లేకపోవడం ఒక్కోసారి ఇబ్బందికరమేగాని ఏం చేస్తాం? టీవీ ఛానళ్ళు రోజుకి కొన్ని గంటలు మాత్రమే పనిచేస్తాయి. అందులో నేరాలు-ఘోరాలు లాంటి కార్యక్రమాలు అసలు ఉండవు. గత రెండు దశాబ్దాలుగా ఇక్కడ ఒక హత్య కూడా జరగలేదు. దానికి కారణం హత్యలు, ఆత్మహత్యలు, రేప్‌ల్లాంటి వార్తలు మచ్చుకైనా వినపడవు. కనపడవు. చిన్న చిన్న దొంగతనాలు, అవీ విదేశీ కార్మికులు చేసిన వాటి గురించే వింటూంటాం. ఇక్కడ మనుషులు అతి నెమ్మదిగా మాట్లాడతారు. భావావేశాలకు, ఉద్రేకాలకు పూర్తి విరుద్ధంగా వ్యవహరించే వీళ్ళ నుండి మనం నేర్చుకోవాల్సింది చాలా ఉంది అన్పిస్తూంటూంది.

రామరాజ్యం గురించి నేనెక్కడా చదవలేదు, వినడమే తప్ప. కానీ ఇక్కడ ప్రత్యక్షంగా చూస్తున్నాను. రాత్రి... అర్ధరాత్రి ఏ సమయంలోనైనా ఏ స్త్రీ అయినా రోడ్డుమీద ఒంటరిగా ఒక్కర్తే నడవగలిగే దేశం, ప్రదేశం ఇంకెక్కడైనా ఉందో లేదో తెలియదు కాని, ఇక్కడ మాత్రం ఉంది. అందుకే ఇది ఇస్లాంలో రామరాజ్యం అనుకుంటాను.

రాజు... రాజరికం... విలాసత్వం

బ్రూనై సుల్తాన్ హాజీ హసనల్ బోల్కియా గురించి, ఆయన విలాసవంతమైన జీవన విధానం గురించి ఎన్నయినా చెప్పుకోవచ్చు. ఉదాహరణకు- ప్రతీ సెకనుకి ముగ్గురు పిల్లలు పుడుతుంటారు ఈ భూమ్మీద!
అలాగే ప్రతి సెకనుకీ ఓ పది సెల్‌ఫోన్లు అమ్ముతుంటారు ప్రపంచవ్యాప్తంగా!
ప్రతి సెకనుకి ఈ ప్రపంచం 37 మిలియన్ల డాలర్లని ఖర్చుపెడుతుంటుంది కేవలం రక్షణ కోసం.
కానీ మన ఈ హసనల్ బోల్కియా ఆదాయం ప్రతీ సెకనుకి 90 యూరోల రూపంలో పెరుగుతూ ఉంటుంది...
అంటే వారానికి ఆయన ఆదాయం 54 మిలియన్ల యూరోలన్నమాట. ఇంకా చెప్పమంటారా నెలకి... సంవత్సరానికి.. వద్దులెండి... 'నో ఎన్వీ ప్లీజ్' అని ఆయన అధికారిక వెబ్‌సైట్ రాసింది... కాబట్టి ఆ విషయాన్ని వదిలేద్దాం. అయితే ఆయన నివాస గృహం గురించి రాయకుండా ఈ వ్యాసం ముగిస్తే నాకే అసంతృప్తిగా ఉంటుంది.

అతిపెద్ద రాజప్రాసాదం

'ఇస్తానా నూరుల్ ఇమాన్' ఆయన నివాసం పేరు. ఇస్తానా అంటే ఇక్కడి భాషలో రాజభవనం అని అర్థం. ఇలాంటివి ఇక్కడే ఓ నాలుగున్నా ఈ పేరుగల భవనం ప్రపంచంలోనే అతిపెద్ద రాజప్రాసాదంగా పేర్కొనబడింది. బ్రూనై నది ఒడ్డున పూర్తి ఇస్లామిక్ సంస్కృతిలో నిర్మితమైన ఈ రాజభవనంలో 1788 గదులు (అంటే రోమ్‌లోని వాటికన్ కంటే 388 ఎక్కువ గదులు), 650 సూట్లు, ప్రతీ అంతస్థుకీ ఎస్కలేటర్స్. ఒకేసారి 500 మంది కూర్చోవడానికి వీలుగా డైనింగ్ హాల్, సుమారు 1500 మంది ఒకేసారి ప్రార్థన చెయ్యడానికి అనువైన ఓ మసీదు రాజభవనం లోపలే నిర్మించడం కొన్ని ప్రత్యేకతలు. ఇక హిజ్ మెజెస్టీ కోసమని ఓ హెలిపాడ్, 300 కార్లు పట్టే పార్కింగ్ ప్లేస్, క్లినిక్, స్పోర్ట్స్ కాంప్లెక్స్ వగైరాలెన్నో ఉన్నాయి. దీని నిర్మాణానికి కావలసిన సామాగ్రిని 30 దేశాల నుంచి తెప్పించారు. ఈ రాజప్రాసాదం చూడ్డానికి ప్రతీ సంవత్సరం రంజాన్ పండుగ సందర్భంగా మూడు రోజులు ప్రజలందరినీ (విదేశీయుల్ని కూడా) అనుమతిస్తారు. ఆ రోజు మగవాళ్ళందరూ రాజుగారితో, ఆడవాళ్ళందరూ రాణీగారితో కరచాలనం చేసే సంప్రదాయం ఉంది ఇక్కడ.

రాజు తలచుకుంటే...

మహారాజు హసనల్ బోల్కియా తనకంటూ ఓ ప్రత్యేకమైన విమానాన్నే ఏర్పరచుకున్నారని రాసేసి వదిలేస్తే పెద్ద విశేషమేముంది? వంద మిలియన్ డాలర్లు ఖరీదు చేసే విమానాన్ని కొని మరో వంద మిలియన్ల డాలర్ల ఖర్చుతో దాన్ని మరింత అందంగా బంగారంతో తాపడం చేయించుకున్న ఘనత ఈ రాజుగారిది. ఈ విమానంతో పాటు ఆరు చిన్న విమానాలు, నాలుగు హెలికాప్టర్లు కూడా ఉన్నాయి. ఈయన మన రాజీవ్ గాంధీ లాగా ఖుద్దు (పైలట్), వీలయినప్పుడల్లా తన విమానాన్ని తనే నడుపుకుంటూ వెడతాడు.
http://upload.wikimedia.org/wikipedia/commons/thumb/5/59/Sultan_Omar_Ali_Saifuddin_Mosque_02.jpg/350px-Sultan_Omar_Ali_Saifuddin_Mosque_02.jpg
http://upload.wikimedia.org/wikipedia/commons/thumb/5/59/Sultan_Omar_Ali_Saifuddin_Mosque_02.jpg/350px-Sultan_Omar_Ali_Saifuddin_Mosque_02.jpghttp://upload.wikimedia.org/wikipedia/commons/thumb/5/59/Sultan_Omar_Ali_Saifuddin_Mosque_02.jpg/350px-Sultan_Omar_Ali_Saifuddin_Mosque_02.jpghttp://upload.wikimedia.org/wikipedia/commons/thumb/5/59/Sultan_Omar_Ali_Saifuddin_Mosque_02.jpg/350px-Sultan_Omar_Ali_Saifuddin_Mosque_02.jpg
65 ఏళ్ళ బోల్కియా ఈ మధ్య మన దేశాన్ని సందర్శించినప్పుడు కూడా తన విమానాన్ని తానే నడుపుకుంటూ వచ్చి మన వాళ్ళని ఆశ్చర్యపరిచాడు. తన ఐశ్వర్యానికి తగ్గట్టుగానే తన జీవన విధానాన్ని సాగించే ఈయన, తన కూతురి 18వ పుట్టినరోజుకి ఏకంగా ఓ ఎయిర్‌బస్‌నే కానుకగా ఇచ్చాడు. తన 50వ పుట్టిన రోజు సంబరాల్లో భాగంగా మైఖెల్ జాక్సన్‌ని ఈ దేశానికి పిలిపించి కార్యక్రమాన్ని చేయించడం బోల్కియా రాజరిక వైభోగానికి మరో ఉదాహరణ.
కొసమెరుపు : పేరులో దారు ఉన్నా ఇది పూర్తిగా డ్రై కంట్రీ. టూరిజం అంతగా అభివృద్ధి చెందకపోవడానికి ఉన్న కారణాల్లో ఇదొకటని కొంతమంది వాపోతుంటారు.

ఇక్కడా మన రాముడే!
ప్రస్తుతం కాంబోడియా అని పిలువబడుతున్న కాంభోజ రాజ్యం వరకూ మన భారత రామాయణాలు పరిఢవిల్లేవనే విషయం కాస్తో కూస్తో బయట తిరిగే టూరిస్టులకి తెలియంది కాదనుకుంటాను. దీనికి బ్రూనై దారుస్సలాం అతీతం కాదు. ఇక్కడ కూడా రామాయణం పూర్తి స్థాయిలో రాణించడమే కాక రామాయణంలోని ముఖ్యపాత్రల పేర్లన్నీ ప్రతి ఇంట్లోను విన్పిస్తుంటాయి. పురుషులకు రమ్‌లీ అని, భుజాంగ్ అని, స్త్రీలకి సితి అని పేర్లు పెట్టుకుంటారు. ఇంకో ఆశ్చర్యకరమైన విషయం లక్ష్మణుడి పేరు మాత్రం ఎటువంటి మార్పు లేకుండా ఓ ప్రత్యేకవర్గంగా ఉండడం. రాజుగారి ఆంతరంగిక రక్షకభటులుగా ఇప్పటికీ ఈ 'లక్ష్మణ' వర్గం పనిచేస్తుంటూంది. మలయ్ భాషలో దాదాపు నలభై శాతం సంస్కృత పదాలే వినపడడం కొంతలో కొంత మనదేశపు వాతావరణాన్ని గుర్తుకు తెస్తుంది.

గట్టిగా మాట్లాడితే..

ప్రశాంతతకి ఇచ్చే విలువ గురించి ఓ సంఘటన మీకు చెప్పి తీరాల్సిందే... ఓ పబ్లిక్ ప్రదేశంలో ఇద్దరు తమిళులు కూర్చుని 'మామూలు'గా మాట్లాడుకుంటున్నారట... ఓ పదిహేను నిమిషాలకి ఓ పోలీస్ వ్యాన్ వాళ్ళు కూర్చున్న దగ్గరకొచ్చి ఆగింది. అందులోంచి ఇద్దరు ఆఫీసర్లు దిగి "ఏంటి సమస్య? మీరిద్దరూ దెబ్బలాడుకుంటున్నారట కదా? పదండి స్టేషన్‌కి'' అన్నారట నెమ్మదిగానే... దానికి వాళ్ళిద్దరూ ఒకరి మొహం ఒకరు చూసుకుని "అయ్యో! అలాంటిదేమీలేదే... మేం మామూలుగా మాట్లాడుకుంటున్నాం'' అన్నారట... దానికి అక్కడే ఉన్న ఓ చిన్న దుకాణదారుడు బయటకొచ్చి "నేనే పోలీసుల్ని పిల్చా... ఏంటి మీరు కొట్టుకోట్లేదా... కొంచెంసేపాగితే ఒకర్నొకరు చంపేసుకుంటారేమోనని భయమేసి...'' అన్నాడట. అలా ఉంటాయి ఇక్కడ సంస్కారానికి సంబంధించిన విషయాలు.

నీటి నివాసం

వాటర్ విలేజ్ అని పిలవబడే ఎనిమిది కిలోమీటర్ల గ్రామం ఒకటి ఉంది ఇక్కడ. అక్కడ ఇళ్ళన్నీ నీటిపైనే. పూర్తి చెక్కతో చెయ్యబడ్డ ఈ ఇళ్ళు మామూలు వాటికి దేనిలోనూ తీసిపోవు. కొన్ని శతాబ్దాలుగా అక్కడే నీటిపైన నివాసం ఉంటున్నారు 30 వేల ప్రజలు. వాళ్లు వేరే గృహాల్లోకి వెళ్ళడానికి కూడా ఇష్టపడరు. ప్రభుత్వమే వారికి అన్ని సదుపాయాలు కల్పిస్తుంది. టూరిస్టులు తప్పనిసరిగా చూడవలసిన ప్రదేశం ఈ వాటర్ విలేజ్. దీన్ని మలయ్ భాషలో 'కంపోంగ్ ఐర్' అంటారు. కంపోంగ్ అంటే గ్రామం అని ఐర్ అంటే నీరు అని అర్థం.

- vasudevadari@gmail.com


Friday, May 11, 2012

తులిప్స్ తొలిప్రేమ

"దేఖా ఏక్ క్వాబ్‌తో యే సిల్ సిలె హుయె, దూర్ తక్ నిగాహోమే హై గుల్ ఖిలే హుయె గిలా హై ఆప్ కి నిగాహోసే, ఫూల్ భి హై దరిమియాతో ఫాస్లే హుయె!'' తులిప్ చూడగానే 'సిల్ సిలా' సినిమాలోని పాట, అందులో రకరకాల రంగుల తులిప్స్ భూమిపై పరుచుకున్న దృశ్యమే గుర్తొస్తుంది.
వసంతం మొదట్లోనే వచ్చే పూలు కొన్నయితే, ఏప్రిల్ నెల మధ్య నుంచి మే నెల మధ్య వరకు విరబూసి నయనానందం కలిగించే పూలల్లో తులిప్స్ పూలు ముందుంటాయి. వీటిని పెద్ద పెద్ద తోటల్లో నాటుతారు కాబట్టే మనం'సిల్ సిలా' సినిమాలో చూసినట్టుగా మొత్తం భూమిపై పరుచుకుని పలకరిస్తాయి.https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEiz4KwrnNw3ts7_tfuHEwmBYMU1JlhiIRL4DSPXBfotJ3RQGzCl3PSXNsAN5bBwd2aLuCh4xU76pqzDJuNhjC3VZ5SngRYEmBNCnkBrVfF_y_PZj4q5P24KklfWM-6zL8YPUiAuZE9T2L0/s1600/Red_White_Tulips.jpg
తులిప్స్ మొదట ఒట్టోమాన్ సామ్రాజ్యంలో ప్రాచుర్యం పొందాయి. ఈ పూలని టర్కీ వారు భగవంతుని పూలుగా భావిస్తారు. టర్కిష్ భాషలో తులిప్స్ అని రాయడంలో అల్లా అని రాయడంలో ఉండే అక్షరాలే ఉంటాయి. అందుకని మానవుల ఆనందం కోసం దేవుడే వాటిని సృష్టించాడని అనుకుంటారు.

టర్కీ చరిత్రలో ఈ తులిప్స్ చాలా ముఖ్యమైన పాత్ర వహించాయి. మూడవ సుల్తాన్ అహ్మద్ రాజ్యంచేసే సమయంలో దాదాపు 1718 నుంచి 1730 వరకు ఉన్న కాలాన్ని 'తులిప్‌యుగం' అంటారు. ఈ కాలాన్ని అందరూ ఆనందంగా ఉన్న యుగంగా చెప్పుకుంటారు. ఎంబ్రాయిడరీ పనుల్లో, నేత పనిలో తివాచీలు, బొమ్మలపైన కూడా తులిప్స్ డిజైన్స్, ఆకారాలు చోటుచేసుకునేవి. ధనవంతుల సందర్శన కోసం తులిప్స్ తోటలు తయారు చేసేవారు.
http://farm5.static.flickr.com/4013/4515191813_3dfa943241.jpg
తులిప్స్ పూలు టర్కీ నుంచి ఇతర దేశాలకు ముఖ్యంగా యూరప్‌లోని హాలెండ్‌కి చేరాయి. అయితే హాలెండ్ దేశం ఎన్నో అందమైన రకాల తులిప్ గడ్డలను ఇతర దేశాలకు పంపిణీ చేయడంతో ఎక్కువమంది తులిప్స్ హాలెండ్ నుంచే వచ్చాయనుకుంటారు. యూరప్‌కి చేరకముందే ఎన్నో రకాల హైబ్రిడ్, అందమైన తులిప్స్‌ను టర్కీలోనే సిద్ధం చేశారు. ఇప్పుడు హాలెండ్ దేశస్థులు వాటిపై చాలా ప్రయోగాలు చేస్తూ కొత్తవి సృష్టిస్తున్నా తులిప్స్ గొప్పతనం టర్కీకే చెందుతుంది.https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEhpvZxv634AcH91fjVz_xiEh7uxZjFVvrI4U1OlKdNjt-_Bq7sagof6jr0W6vJ1nrGpsK9m_hP8WoOx-6HsdgPwu9ecYc9ldCw7gGn5m7mj4uJyT5Q-LGt6cbFvde2-IQQpIU8QP3gqfWg/s1600/tulip3.jpg
తులిప్స్‌లో లెక్కలేనన్ని జాతులున్నాయి. హైబ్రిడ్ తులిప్స్‌ని పెంచేవారు పెద్ద తోటలనే ఎంచుకుంటారు. వీటిని ఇళ్లల్లో కుండీల్లో పెట్టి కూడా పెంచుకోవచ్చు. శిశిరంలో తులిప్ గడ్డలు పాతితే అవి వసంతకాలంలో మొలకేసి పూలు పూస్తాయి. పర్షియన్ కవులు ఈ పూలను 'టర్బన్' అనేవారట.http://expresstourinua.com/wp-content/uploads/2012/04/tulips6.jpg
తులిప్స్ గురించి ఒక కథ కూడా ప్రచారంలో ఉంది. తులిప్స్ పూలు చాలాకాలం పాటు విరియకుండానే మొగ్గగా ఉండేవట. ఒకరోజు ఒక తల్లి తన పాపని ఆడుకోవడానికి తోటకు తీసుకుని వెళ్లింది. తులిప్ మొగ్గని చూడగానే పాప నవ్వింది. పాప నవ్వగానే తులిప్ మొగ్గ వికసించింది. అప్పటి వరకు ఎవరూ చేయలేని పని ఆ పాప చేసింది. అప్పటినుంచే ఇతరులను సంతోష పరచలాలనుకున్నపుడు తులిప్స్ పూలని తీసుకెళ్లే సంప్రదాయం వచ్చింది.http://www.drakealgar.com/images/tulip.jpg
తులిప్స్ పూలని సుగంధ ద్రవ్యాల్లో విరివిగా వాడతారు. ఈ పూల సుగంధంతో తయారు చేసిన ఫర్‌ఫ్యూమ్స్ ప్రపంచ వ్యాప్తంగా ప్రాచుర్యం పొందాయి.http://images.tulipholidays.com/960a984f-3375-418f-8741-d4543bc6f55e.jpg
టర్కీలో ప్రతి ఏడాది వేసవిలో తులిప్స్ ఫెస్టివల్ జరుగుతుంది. హాలెండ్‌లో జరిగే తులిప్ ఫెస్టివల్ కోసం ఇతర దేశాల నుంచి కూడా జనం తరలివస్తారు. తులిప్స్ పూలనే టర్కీ పర్యాటక లోగోగా వాడుకున్నారు. 
టర్కిష్ ఎయిర్‌లైన్స్ వారు ప్రతి విమానంపై తులిప్ బొమ్మని పెయింట్ చేస్తారు.http://cache.virtualtourist.com/6/2732880-WHITE_TULIP_FROM_ISTANBUL_Istanbul.jpg
లిల్లీపూల గ్రూప్‌కి చెందిన ఈ పూలు ఎన్నో రంగుల్లో పూస్తాయి. రెండు రంగులు కలిసిన రకాలూ ఉన్నాయి. ప్రస్తుతం వంద రకాల జాతుల నుంచి మూడువేలకుపైగా రకాల తులిప్స్‌ని ప్రపంచ వ్యాప్తంగా పెంచుతున్నారు. పెన్సిల్వేనియా లాంగ్ ఉడ్ గార్డెన్స్‌లో రకరకాల రంగుల తులిప్స్‌ను చూస్తే కొత్తలోకంలోకి ప్రవేశిస్తున్నట్టుగా అనిపిస్తుంది. అక్కడి నుంచి కదలిరావడానికి మనస్కరించదు. తులిప్స్ పూలు కేవలం అందంగా ఉండడమే కాదు, శాంతికి చిహ్నాలు కూడా. మన దేశంలో వీటిని చూడాలనుకుంటే కాశ్మీర్‌లోని శ్రీనగర్ తులిప్స్‌తోటలకు వెళ్లొచ్చు.

ఒకరోజు ఒక తల్లి తన పాపని ఆడుకోవడానికి తోటకు తీసుకుని వెళ్లింది. తులిప్ మొగ్గని చూడగానే పాప నవ్వింది. పాప నవ్వగానే తులిప్ మొగ్గ వికసించింది. అప్పటి వరకు ఎవరూ చేయలేని పని ఆ పాప చేసింది. అప్పటినుంచే ఇతరులను సంతోష పరచలాలనుకున్నపుడు తులిప్స్ పూలని తీసుకెళ్లే సంప్రదాయం వచ్చింది.

- కనకదుర్గ, అమెరికా నుంచి

Tuesday, December 20, 2011

కమనీయ ప్రకృతి ‘తీరం’.... కనపర్తి

సెలవు దినాల్ని ఆహ్లాదకరంగా గడపాలనుకునేవారు ముఖ్యంగా పార్క్‌లకు బీచ్‌లకు వెళ్లడం చేస్తుంటారు. అయితే... ఆ బీచ్‌లకు దగ్గరే గుళ్లూ, గోపురాలు, చారిత్రక స్థలాలు కూడా ఎలా ఉంటే ఎలావుంటుంది? ప్రకృతి ఆహ్లాదంతో పాటు... ఆధ్యాత్మిక అనుభూతి, చారిత్రక విజ్ఞానం కూడా మీ సొంతమవుతుంది కదూ! మరి అలాంటి అరుదైన ప్రదేశమే... ఒంగోలు జిల్లాలోని కనపర్తి. శాతవాహనుల ఏలుబడిలో ఎంతో పేరుగాంచిన కనపర్తిలో... ఈ బీచ్‌తోపాటు విశిష్టతను సంతరించుకున్న ధారాలింగం, ఒక పురవాస్తు శాల వంటివెన్నో మీకు ఆధ్యాతిక, వైజ్ఞానిక విషయాలను ఎన్నో బోధిస్తారు. నాగులుప్పలపాడు మండలంలోని "కనపర్తి". వయ్యారాలు ఒలికించే సముద్ర తీరం.. విజ్ఞానానికీ, ఆధ్యాత్మికతకు నెలవైన మ్యూజియం ఉన్న ఈ ప్రదేశాన్ని సందర్శిస్తే అద్భుతమైన అనుభూతులను పదిలం

Kanaparthi_Beach 
బ్రహ్మకుండి అని పిలువబడే గుండ్లకమ్మ నది, అనంతసాగరంలో కలగలసిపోయే ప్రాంతంలో వెలసిన ప్రదేశమే కనపర్తి. శాతవాహన పాలకులు పరిపాలించిన, పవిత్ర పుణ్యక్షేత్రంగా అలరారిన కనపర్తిలో ఈనాటికీ అనేక బౌద్ధస్తూపాలు, శిల్పాలు దర్శనం ఇస్తున్నాయి. సముద్ర తీర ప్రాంతంలో వెలసిన కనపర్తి క్రీస్తుపూర్వం నుంచి క్రీస్తు శకం 15వ శతాబ్దం వరకూ విజయనగర రాజుల ఏలుబడిలో ఉన్నట్లు చారిత్రక ఆధారాల ద్వారా తెలుస్తోంది.
గొప్ప నాగరికత, సంస్కృతి, శిల్పకళారీతులతో ఆ రోజుల్లో "కనకాపురి" పట్ణణంగా విరాజిల్లిన కనపర్తి ప్రాచీన చరిత్రకు నిదర్శనంగా అక్కడి పురాతన విగ్రహాలు పర్యాటకులు స్వాగతం పలుకుతాయి. ఇలా చరిత్రకు సాక్షీభూతాలుగా మిగిలిన ఈ విగ్రహాలతో రాష్ట్ర ప్రభుత్వం పురావస్తు ప్రదర్శనశాలను ఏర్పాటు చేసింది.
ఈ ప్రదర్శనశాలలో వివిధ రకాల బ్రహ్మపాశాలు కలిగిన శివలింగాలు, వివిధ ఆకృతుల్లో కనిపించే నంది, విఘ్నేశ్వర, దుర్గాదేవి విగ్రహాలు.. నాగబంధాలు, బిక్షాటన చేస్తున్నట్లుగా ఉండే భైరవుడు, నాగ భైరవుడు, లింగోద్భవమూర్తి, పరశురాముడు, సూర్య విగ్రహం, సరస్వతీ ప్రతిమ, ధారాలింగం, సప్తమాతృకలు మొదలైన అద్భుత కళాఖండాలు ఆనాటి చరిత్రకు సజీవ సాక్ష్యాలుగా మనకు దర్శనమిస్తుంటాయి.
బ్రహ్మపాశంగల ధారాలింగం...
కనపర్తి పురావస్తు ప్రదర్శనశాలలో అందరినీ కనువిందు చేసే వాటిల్లో ముఖ్యమైనది బ్రహ్మపాశంగల ధారాలింగం. దీనిపై పాలుపోస్తే శివలింగం చుట్టూ 32 ధారలుగా పాలు కిందకు కారే విధంగా ప్రత్యేకంగా చెక్కబడి ఉంటుంది. గొప్ప నాగరికత, సంస్కృతి, శిల్పకళారీతులతో ఆ రోజుల్లో కనకాపురి పట్ణణంగా విరాజిల్లిన కనపర్తి ప్రాచీన చరిత్రకు నిదర్శనంగా అక్కడి పురాతన విగ్రహాలు పర్యాటకులు స్వాగతం పలుకుతాయి. ఇలా చరిత్రకు సాక్షీభూతాలుగా మిగిలిన ఈ విగ్రహాలతో రాష్ట్ర ప్రభుత్వం పురావస్తు ప్రదర్శనశాలను ఏర్పాటు చేసింది.

ఈ ప్రదర్శనశాలలో వివిధ రకాల బ్రహ్మపాశాలు కలిగిన శివలింగాలు, వివిధ ఆకృతుల్లో కనిపించే నంది, విఘ్నేశ్వర, దుర్గాదేవి విగ్రహాలు.. నాగబంధాలు, బిక్షాటన చేస్తున్నట్లుగా ఉండే భైరవుడు, నాగ భైరవుడు, లింగోద్భవమూర్తి, పరశురాముడు, సూర్య విగ్రహం, సరస్వతీ ప్రతిమ, ధారాలింగం, సప్తమాతృకలు మొదలైన అద్భుత కళాఖండాలు ఆనాటి చరిత్రకు సజీవ సాక్ష్యాలుగా మనకు దర్శనమిస్తుంటాయి.

పూర్వకాలంలో కనాపురి పట్టణంలో వాడిన రాతి గొడ్డళ్లు, ఇటుకలు, అలంకరణ సామగ్రి, పూసలు.. తదితర వస్తువులు పురావస్తు శాఖ జరిపిన తవ్వకాల్లో బయల్పడ్డాయి. అలాగే అనేక బావులు, వాటి నిర్మాణానికి వినియోగించిన పెద్ద పెద్ద ఇటుకలు, బ్రహ్మలిపిలో ఉండే బౌద్ధ స్తూపాలు, ప్రాకృత భాషలో గల విజయనగర రాజు శ్రీకృష్ణదేవరాయులవారి శాసనాలు, ద్రావిడ భాషల్లో గల తూర్పు చాళుక్యుల, చోళుల శాసనాలను మనం అక్కడ చూడవచ్చు.

ఇక కనపర్తి గ్రామంలోని శైవ, వైష్ణవ ఆలయాలు ఆనాటి ప్రజల జీవన చిత్రాన్ని కళ్లకు కట్టేటట్లుగా ఉన్నాయి. కనపర్తి పురావస్తు ప్రదర్శనశాలలో అందరినీ కనువిందు చేసే వాటిల్లో ముఖ్యమైనది బ్రహ్మపాశంగల ధారాలింగం. దీనిపై పాలుపోస్తే శివలింగం చుట్టూ 32 ధారలుగా పాలు కిందకు కారే విధంగా ప్రత్యేకంగా చెక్కబడి ఉంటుంది. దీంతో ఈ శివలింగం పర్యాటకుల్ని విశేషంగా ఆకట్టుకునేలా ఉంటుంది.
పురావస్తు ప్రదర్శన శాలకు 3 కిలోమీటర్ల దూరంలో ఉండే కనపర్తి సముద్ర తీరం సౌందర్యం వర్ణనాతీతం. సాధారణంగా సముద్ర తీరానికి వెళ్లిన వారికి దూరంగా మాత్రమే ఒంపు కన్పిస్తుంది. ఒంపు వద్దకు వెళ్లాలని ప్రయత్నిస్తే, మరికొంచెం దూరంలో కన్పిస్తుంది. అయితే కనపర్తి తీరంలో మాత్రం ఒయ్యారాలు ఒలకబోస్తున్నట్లుండే సముద్ర తీరపు ఒంపుసొంపులను దగ్గర్నించే చూడవచ్చు.

కనపర్తికి ఎలా చేరుకోవాలంటే.. ఒంగోలు నుంచి 35 కిలోమీటర్ల దూరంలోనున్న కనపర్తికి చేరుకోవాలంటే ఒంగోలు డిపోనుంచి ఉదయం 5 గంటలనుంచే ప్రతి రెండు గంటలకు ఒకసారి బస్సు సౌకర్యం అందుబాటులో ఉంది. కనపర్తిలో మ్యూజియం, శివాలయం, సీతారామచంద్రుల ఆలయాలు కూడా దర్శనీయ స్థలాలే. మ్యూజియంలో ఎల్లప్పుడూ గైడ్‌ అందుబాటులో ఉంటారు. అక్కడి నుంచి సముద్ర తీరానికి చేరుకోవాలంటే మ్యూజియం నిర్వాహకులే వాహన సౌకర్యం ఏర్పాటు చేస్తారు. ప్రైవేటు వాహనాలలో కూడా కనపర్తి సముద్ర తీరానికి చేరుకోవచ్చు.

Wednesday, November 23, 2011

ఇంద్రలోకాన్ని తలపించే... ఇండోనేషియా

 http://www.indonesiatravel.org.uk/gifs/indonesia-travel.jpg
పర్యాటకులకు స్వర్గధామం ఇండోనేషియా. 23 కోట్ల ముస్లిం జనాభా ఉన్న ఈ దేశంలో హిందూ మూలాలు అనేకం... ఈ దేశంలోని బాలి పట్టణంలో 90% హిందువులు నివసించే ఎప్పటికీ వింతే... 30 లక్షల జనాభా ఉన్న బాలికి సంవత్సరానికి 40 లక్షల మంది పర్యా టకులు వస్తుండటం విశేషం. 
http://www.worldwidehomestay.com/res/default/indonesiaborobud.jpg
హిందూ, ముస్లిం సంస్కృతుల సమ్మేళనంతో, అందమైన సెలయేళ్ళు, పచ్చని అడవుల ప్రకృతి అందాలతో కనువిందు చేసే ఇండోనేషియా... అన్నీ దీవి పట్టణాలే... జకార్తా, బాలి, బాండుంగ్‌, మేడాన్‌... ఇలా చెప్పుకుంటూ పోతే... చాలానే ఉన్నాయి . మరి ఆ దీవుల్లో విహరిద్దామా..!

Art_Center_Bali 

ఇండోనేషియాలో జావా, సుమత్ర, సులవేసి, మలుకు, కాలీమంతన్‌, ఇరియన్‌ జయ అనే ఆరు ముఖ్యమైన దీవులున్నాయి. నిజానికి ఇండోనేషియా 14 వేల దీవుల సమాహారం అయినప్పటికీ... పైన చెప్పుకున్న ఆరింటిలో మాత్రమే జనావాసం ఉంది. ఇండోనేషియా రాజధాని నగరం జకార్తా, జావా ద్వీపంలో ఉంటుంది. ఈనగరంతో పాటు సురబయ, బాలి, బాండుంగ్‌, మేడాన్‌, సెమారంగ్‌లు ఇక్కడి ప్రధానమైన ఇతర పట్టణాలు ఉన్నాయి.జకార్తాని 17వ శతాబ్దంలో జయకర్త అని పిలిచేవారట. అంటే... గొప్ప విజయానికి చిహ్నమైన నగరం అని దానర్థం.

అదే రానురాను వాడుకలో జకార్తాగా మారిపోయింది. జకార్తాలో చూడదగ్గ మ్యూజియంలు అనేకం ఉన్నాయి. ఇక్కడి జాతీయ ప్రదర్శనశాల, పపెట్‌ మ్యూజియం, టెక్స్‌టైల్‌ మ్యూజియం, స్టాంప్‌ మ్యూజియం, ఫ్రీడం మ్యూజియం.. లాంటివి ఎన్నెన్నో ఉన్నాయి. వీటిలో దేని ప్రత్యేకత దానిదే. ఒకచోట ఇండోనేషియా చరిత్రను కళ్లకు కట్టినట్లు కనిపిస్తే, మరోచోట రకరకాల బొమ్మలు కనువిందు చేస్తాయి. ఇంకోచోట జాతీయ ఉద్యమ ఘట్టాలు, మరోచోట అక్కడి ప్రజల మత విశ్వాసాలు దర్శనమిస్తాయి. అయితే ఈ మ్యూజియంలు ఉన్న భవనాలన్నీ పురాతనమైనవే కావడం గమనార్హం.

జకార్తాలో చూడదగ్గ మరో ప్రాంతం నేషనల్‌ మాన్యుమెంట్‌. దీన్నే మోనాస్‌ అంటుంటారు. ఇదో పెద్ద స్తూపం. 137 సెంటీమీటర్ల ఎత్తులో ఉండే దీనిపై వెలుగుతున్న దివిటీలాంటి నిర్మాణం ఉంది. 35 కిలోల బంగారంతో ఈ స్తూపాన్ని నిర్మించారట. దీన్ని ఆ దేశ స్వాతంత్య్రానికి చిహ్నంగా భావిస్తారు. ఈ నగరంలోని మరో ఆకర్షణ తమన్‌ మినీ ఇండోనేషియా ఇండా అనే మీనియేచర్‌ పార్క్‌. దీన్ని చూస్తే, ఆ దేశం మొత్తాన్ని చూసినట్లే...! బీచ్‌లు, దీవులూ, మధ్యయుగంనాటి భవనాలు, చారిత్రక కట్టడాలు.. ఎన్నె ఎన్నెన్నో ఈ పార్కులో కొలువుదీరి ఉంటాయి.

పుష్పవనం... బోగోర్‌...

http://w22.indonetwork.co.id/pfimage/15/s_530715_foto_location.jpg
జకార్తాకు దాదాపు వంద కిలోమీటర్ల దూరంలో ఉండే బోగోర్‌ పట్టణం కూడా పర్యాటక ప్రాంతమే. సముద్ర మట్టానికి 300 మీటర్ల ఎత్తులో ఉండే ఈ పట్టణంలోని ప్రధాన ఆకర్షణ బొటానికల్‌ గార్డెన్‌. దీన్ని 1811వ సంవత్స రంలో సర్‌ స్టాన్‌ఫోర్డ్‌ రఫెల్స్‌ నిర్మించాడట. 

https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEirxqrmITA2-1If-hH1bYQNT_3XMj0n5wlSTQg70SycULvrTHn03sugQY5BCT0nZyvs2Ay6RoW2ANs-lSSndpHnc8tSRhXUrCqpMuR2NeZYfZ8v6ptkqeqkFBTCzD5Yyh0oFZ9yrZ1sVwE/s1600/528px-Bunga_bangkai.jpg
ప్రపంచంలోని అతిపెద్ద పుష్పం నుంచి అతి చిన్న పువ్వుదాకా ఈ గార్డెన్‌లో మనకు కనువిందు చేస్తాయి. ఈ పార్కులో చిన్న చిన్న వెదురు వంతెనలు భలే తమాషాగా ఉంటాయి. ఈ గార్డెన్‌ మెయిన్‌ గేట్‌కు దగ్గర్లోనే ఒక జువలాజికల్‌ మ్యూజియం కూడా ఉంటుంది. ఇందులో దాదాపు 30 వేల స్పెసిమన్లు ఉంటాయి. స్టఫ్డ్‌ ఖడ్గ మృగం, వేల్‌ చేప, కొమొడొ డ్రాగన్‌లు మన చూపుల్ని కట్టిపడేస్తాయి.

locations 

దేవాలయాల విషయానికి వస్తే... ఈ బోగోర్‌ పట్టణంలో శివాలయం, సాయిమందిరం, కృష్ణుడి గుడి అంటూ హిందూ దేవతల ఆలయాలు చాలానే కనిపిస్తాయి. ఈ ప్రాంతంలో భారతదేశం నుంచి వచ్చిన స్థిరపడినవారు ఎక్కువగా నివసిస్తుంటారు. ఇంకో గమ్మత్తయిన విషయం ఏంటంటే... ఇక్కడ హిందువులతో పాటు ముస్లిం ప్రజలు కూడా హిందూ పండుగలను జరుపుకోవడం. రామాయణం చదివే ముస్లింలు బోగోర్‌లో చాలామందే కనిపిస్తుంటారు.http://ilove-indonesia.com/wp-content/uploads/2010/11/Welcome-to-Bali.jpg
బాలి విహారం భలే.. భలే..
బాలి గురించి తెలుసుకోవాలంటే నెట్‌లో, పుస్తకాల్లో దొరికే సమాచారం కాదు అదంతా పర్యాటకులు వివరించాల్సిందే. మనదేశంలో వేళ్లూనుకొని ఉన్న హిందూ సాంప్రదాయ సమాజమే బాలిలో కూడా ఉంది. ఇలాంటి సాంప్రదాయ సమాజాల్లో సంస్కృతీ సాంప్రదాయాలను ఒక తరం నుంచి మరొక తరానికి అందించేది ముఖ్యంగా స్ర్తీలే. గృహ జీవితంలో, పిల్లల పెంపకంలో, ఆహారం తయారు చెయ్యటంలో, ఇలా వివిధ నిత్య గృహ కృత్యాల్లో తమ చర్యల ద్వారా సాంప్రదాయాల్ను కొత్త తరానికి అందజేస్తుంటారు ఇక్కడి స్ర్తీలు. ఇండోనేషియాలోని జావా, లాంబాక్‌ దీవుల మధ్యనున్నది బాలి దీవి.
http://www.indonesiatravel.org.uk/gifs/bali-in-indonesia.jpg
మొత్తం 17వేల దీవులతో కూడిన ఇండోనేషియాలో బాలి అందం ప్రత్యేకత మరి దేనికీ లేదంటారు. బాలి తూర్పునుంచీ పశ్చిమానికి 140 కి.మీ., ఉత్తరం నుంచీ దక్షిణానికి 80 కి.మీ విస్తరించి ఉంది. అయితే తూర్పు నుంచీ పశ్చిమానికి నిప్పులు చెరిగే పర్వతాలు ఉండటం దురదృష్టంగానూ భావిస్తారు. వీటిలో అత్యంత పెద్దది గునుంగ్‌ అగుంగ్‌ పర్వతం 1963లో పేలి నిప్పు నది ప్రవహించింది. ఆ తర్వాత ఇంతవరకూ అలాంటవి సంభవించలేదు. ఈక్వేటర్‌కి ఎనిమిది డిగ్రీలు దక్షిణంగా ఉన్న ఈ బాలి వాతావరణం చిత్రంగా ఉంటుంది. ఇక్కడ కేవలం రెండు సీజన్లే ఉంటాయి. ప్రతీ సంవత్సరం చలి, పొడి వాతావరణం ఉంటుంది. కానీ సాధారణంగా ఇక్కడ 28 డిగ్రీల సెల్సియస్‌ వేడిమి ఉంటుంది.భారీ వర్షాల కాలంలో పచ్చగా మెరుస్తూ మహాద్బుతంగా ఉంటుంది బాలి. ఎంతో మాగాణి భూమి కావడంతో పంటలు బ్రహ్మాండంగా పండుతాయి. బాలి దక్షిణాన కొండప్రాం తాల్లో ధాన్యం, ఉత్తర తీర ప్రాంతాల్లో కాఫీ, కూరగాయలు బాగా పండుతాయి.

ఇక్కడ హిందువులే అధికం...
అత్యధిక ముస్లిం జనాభా వున్న ఇండోనేషియాలోని బహు చక్కని దీవి బాలి. బాలిలో అత్యధికభాగం హిందువులే ఉన్నారు. దీన్ని దేవతల నివాసంగా పిలుస్తారు. అంత ప్రశాంతంగా, మనోహరంగా ఉంటుంది. 2.5 మిలియన్ల జనాభా లో 90 శాతం హిందువులే ఉన్నారు. తమను ప్రశాంతంగా ఉండేట్టు చేయమని, ఎలాంటి ఆపదలు రాకుండా కాపాడాలని కోరుతూ ప్రతీ ఇంటాపూజలు నిత్యం జరుగుతూనే ఉంటాయి. ఆ మంత్రోచ్ఛారణ అంతటా వినవస్తూంటుంది. ప్రతీ దేవాలయంలోనూ సాయింత్రాలు పూజలు, మంత్రాల పఠనంతో ఆ ధ్యాత్మిక వాతావరణం కట్టేస్తుంటుంది.
http://www.traveljournals.net/pictures/l/15/157387-hindu-statue-in-downtown-kuta-bali-indonesia.jpg
భజనల్లో అక్కడక్కడ సంస్కృత పదా లు వినపడుతూంటాయి. బాలి ప్రజల్లో మతం, ఆధ్యాత్మిక చింతన ఎక్కువ. పలు దేశాల నుంచి ఎందరో పర్యాటకులు వస్తూ పోతున్నప్పటికీ ఇక్కడి సంస్కృతీ సంప్రదాయాలకు మాత్రం ఎలాంటి ఆపదా కలగలేదు. ఇక్కడి ప్రధాన మతం ఆగమ హిందూ ధర్మం. 11వ శతాబ్దంలో సుమత్రా, జావాల్లో హిందూ ప్రచారం బాగా జరగడంతో బాలిలో ఆగమ హిందూ ధర్మం ఏర్పడింది. భారత దేశం నుంచీ వచ్చిన మతమే అయినప్పటికీ బాలిలో హిందు, బౌద్ధ, జావా మతాలు ఆచారంలో ఉన్నా యి. 15వ శతాబ్దంలో జావాకు ఇస్లాం రావడంతో అక్కడి కళాకారులు, సంగీతకారులు అనేకమంది బాలికి పారిపోయారంటారు. http://www.photoatlas.com/photo/indonesia_bali_01.jpg
పురాణాలంటే మహా ఇష్టం...
బాలి ప్రజలు ఎంతో సృజన సంపన్నులు. సంప్రదాయసిద్ధమైన శక్తి సామర్ధ్యా లు ఎక్కువగా మతపరమైన కార్యకలాపాలకే వినియోగిస్తారు. రామాయణం, భారతం పట్ల అపార భక్తి శ్రద్ధలున్నాయి. వాటిలోని కథలతో ఇక్కడి ప్రజలు స్పూర్తి పొందుతున్నారు. ప్రతీ పండుగ సందర్భం ఎంతో ఆనందంగా, కళాత్మకంగాచేసుకోవడం వారి ప్రత్యేకత. ప్రతీ పని, ప్రతీ అంశంలోనూ సౌందర్యం తొణికిసలాడుతుంది. వారిది కళా దృష్టి కావడమే అందుకు కారణం.
Sunset at Kuta, Bali
అందాల కుగ్రామం... కూటా... Sunset at Kuta, Bali
బాలిలోని దిన్‌పాసార్‌, సింగరాజా పట్టణాలు ఎంతో బావుంటాయి. టూరిస్టులును అమితంగా ఆకట్టుకుంటున్న కూటా బాలి విమానాశ్రయానికి సమీపంలోనే ఉంది. ఇదో కుగ్రామం. ఎంతో ప్రశాంతంగా ఉంటుంది. 

Sunset at Kuta, Bali
ఇక్కడి బీచ్‌లు, ఎంతో ఆకట్టుకునే సూర్యోదయ, సూర్యాస్తమయాలు టూరిస్టులను కట్టిపడేస్తాయి. 1970ల నుంచీ పర్యాటకుల రాక ఎక్కువయింది. ఇపుడు ఇది రిజార్ట్‌ టౌన్‌గా మారింది. వందల హోటళ్లు, బార్లు, రెస్టారెంట్లు, అనేక రకాల దుకాణాలు ఉన్నాయి. విశ్వకవి రవీంద్రనాథ్‌ టాగోర్‌ తన ‘సాగరిక’ అనే కవిత 80ఏళ్ల క్రితం ఇక్కడ పర్యటనికి వచ్చినపుడు రాశారు.

Sunset at Kuta, Bali
Sunset at Kuta, Bali
‘‘విదేశీయునిగా నేను మొదటగా ఇక్కడికి వచ్చినపుడు ఆరాతి తీరంలో నువ్వు కూర్చుని వున్నావు. నన్ను ఆహ్వానించావు. మనం ఇద్దరం పువ్వుల్ని సేకరించాం. నేను మరోసారి వచ్చినపుడు నువ్వు వాణిజ్య రాకుమారుడివి. మళ్లీ నన్ను ఎంతో ఆప్యాయంగా ఆహ్వానించావు. దేవతలను కలిసి ప్రార్ధించాం. నా ఆస్తులు తరగిపోయాయి. ఇవాళ నా వీణతో వచ్చాను. నీలో నన్ను దర్శిస్తున్నాను. నన్ను గుర్తించావా?’’ అని ప్రశ్నించారు టాగోర్‌ తన కవితలో. ఇవాళ బాలివాసులు సమాధానంతో సిద్దంగా వున్నారు. భారతీయులను ఎంతో ఆదరంగా ఆహ్వానిస్తూన్నారు. ఇండోనేషియా సందర్శించే పర్యాటకులలో సగంపైగా పర్యాటకులు బాలిలో ఒక్కరోజైనా గడపడానికి వెళతారు. ఇక్కడి ఉబుద్‌ అనే గ్రామం సంప్రదాయ హస్తకళలకు ఎంతో ప్రసిద్ధి.

ఎప్పుడైనా రావచ్చు...
ఏడాది పొడవునా ఏ సీజన్‌లో అయినా సరే ఇండోనేషియా పర్యటనకు వెళ్లవచ్చు. రాజధాని జకార్తా నగరం షాపింగ్‌కు అనుకూలం. మకదువా, బోటనీ స్క్వేర్‌లలో ఎలక్ట్రానిక్‌ ఉపకరణాలు, దుస్తులు చాలా చౌకగా లభిస్తాయి. ఈ దేశానికి వీసా పొందటం కూడా చాలా సులభం. వీసా ఆన్‌ ఎరైవల్‌ పద్ధతిలో జకార్తాకు చేరుకున్నాక విమానాశ్రయంలోనే వీసాను పొందవచ్చు.

ఎలా వెళ్లాలంటే...
హైదరాబాదులోని శంషాబాద్‌ విమానాశ్రయం నుంచి థాయ్‌ ఎయిర్‌లైన్స్‌ విమానంలో మూడు గంటలపాటు ప్రయాణిస్తే థాయ్‌లాండ్‌ రాజధాని బ్యాంకాక్‌ చేరుకుంటాం. అక్కడి నుంచి ఇండోనేషియా రాజధాని నగరం జకార్తాకు మరో మూడు గంటలపాటు విమానంలో ప్రయాణించాల్సి ఉంటుంది. హైదరాబాద్‌ నుంచి జకార్తాకి నేరుగా విమాన సౌకర్యం లేదు కాబట్టి, బ్యాంకాక్‌ లేదా మలేషియాల మీదుగా వెళ్ళాల్సిందే...!!

Tuesday, August 30, 2011

మదిని పులకరింప జేసే ఛత్తీస్‌గఢ్‌ అందాలు

ఛలో... ఛలో... ఛత్తీస్‌గఢ్‌
http://www.thehindubusinessline.in/bline/2009/09/30/images/2009093050361701.jpg
ఛత్తీస్‌గఢ్‌ అంటే... నక్సల్స్‌ స్థావరమనీ, మందుపాతరలకు పుట్టినిల్లని మాత్రమే తెలుసు. అసలు ఆ రాష్ట్రం పేరు వింటేనే మావోయిస్టుల కనుసన్నుల్లో మెదిలే గిరిజనుల దయనీయ కథనాలు కళ్లముందు సాక్షాత్క రిస్తాయి. కానీ, ఇదంతా నాణేనికి ఒకవైపు మాత్రమే. మరోవైపు పరికిస్తే... ప్రకృతికాంత తన అందాలను ఆరబోసి... పరిచిన వెన్నెలలా... పడతి పూబంతి నవ్వులా పర్యాటకులను కనువిందు చేస్తోంది. ఎన్నో చారిత్రక పర్యాటక కేంద్రాలకు ఛత్తీస్‌గఢ్‌ అడవితల్లి కేరాఫ్‌ అడ్రస్‌గా ఉంది. మదిని పులకరింప జేసే ఆ అందాలను వీక్షించేందుకు మరి మీరు సిద్ధమా?!

Chitrakoot-Waterfals 

ఒకప్పుడు బస్తర్‌ అడవులంటే మంత్రగాళ్ళు, చేతబడులు చేసేవారికి ఆలవాలంగా ఉండేవి. పర్యాటకులు వెళ్ళాలంటేనే భయపడేవారు. కాలక్రమేణా మావోయిస్టుల కార్యకలాపాలకు కేంద్రంగా తయారైంది. అప్పట్లో ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో పరిస్థితి మరింత జఠిలమైంది. అయితే గత కొన్నేళ్ళలో ప్రభుత్వం చొరవ చూపి ఛత్తీస్‌గఢ్‌ను పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దటంతో క్రమంగా పర్యాటకుల తాకిడి ఎక్కువైంది. ఆ బస్తర్‌ అడవుల గుండా వెళ్తే ఎన్నెన్నో ప్రకృతి అందాలు మనల్ని పలకరిస్తాయి. ప్రపంచంలోనే అత్యంత పురాతన తెగలవాళ్ళు అక్కడ ఉంటున్నారని ప్రతీతి. ‘‘నిరుపేదలు నివసించే ధనిక భూమి’’ అని దీనికి పేరు.http://www.thehindu.com/multimedia/dynamic/00011/VBKN5-WATER_FALLS_11188f.jpg
ఈ భూమి నిజంగానే చాలా గొప్పది. సహజ సౌందర్యానికి కూడా ఈ ప్రాంతానిది పెట్టింది పేరు. జీవితంలో ఎప్పుడూ చూడని సరికొత్త అందాలు, విభిన్న పార్శ్వాలను ఇక్కడ చూడొచ్చు. జానపద సంప్రదాయం, సంస్కృతి, పురావస్తు స్థలాలు, కొండలు, కొన్ని తరాలుగా ఇక్కడ నివసిస్తున్న గిరిజనుల ఆత్మీయత వీటన్నింటినీ ఏ ఒక్కరూ వదులుకోకూడదు. ఇక బస్తర్‌ అడవుల గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. చివరకు సూర్యకిరణాలు కూడా ప్రసరించలేనంత దట్టంగా ఇక్కడి అడవులుంటాయి.https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEjrTDR7xZGf0-zPp2OLYSQLc5HS-P9hjd1V5VJSml584gtPjA8CJtXOgsowTbJqJrGsIMVxP_arPguzWaocYC6McMkMk59I0lvW9XQ5fhjTiayss8_bQyW3aYnknA91a-f_cP7V4Zf3VfE/s320/hiicorva.jpg
పాతరాతియుగంలోకి...
అబూజ్‌మాడ్‌ పేరు వినే వింటారు. ఒక్కసారి ఈ ప్రదేశాన్ని సందర్శిస్తే.. మీకు పాతరాతి యుగానికి వెళ్లిపోయిన అనుభూతి కలుగుతుంది. భూగ్రహం మీద ఇప్పటివరకు సజీవంగా ఉన్న అత్యంత పురాతన గిరిజనలు ఇక్కడే ఉన్నారు. దట్టమైన అడవుల్లో ఈ గిరిజనులు స్వేచ్ఛగా, నగ్నంగా సంచరిస్తూ వేటే జీవనాధారంగా గడుపుతున్నారు. ఒకప్పుడు మావోయిస్టుల ప్రభావం వలన ఛత్తీస్‌గఢ్‌ ప్రభుత్వం ఈ ప్రాంతాన్ని నిషిద్ధప్రాంతంగా ప్రకటించినా, ఇప్పుడు మాత్రం పర్యాటకులను అనుమతిస్తోంది.

Indravati-River 

పాతరాతియుగం నాటి జీవనశైలిని చూడాలనుకుంటే ముందుగా పర్యాటక శాఖ అనుమతి తీసుకుని అక్కడకు వెళ్తే సరిపోతుంది. గిరిజన జీవనశైలి, అడవుల్లో నుంచి వచ్చే సుగంధ పరిమళాలు, పెద్దపెద్ద జలపాతాలు, గుహల గోడల మీద చిత్రాలు ఇవన్నీ మనల్ని ఏదో తెలియని లోకంలోకి తీసుకెళ్లిపోతాయి. 
 http://www.indiatoureasy.com/wp-content/uploads/Chattisgarh-Cultural-touris.jpg
ప్రకృతికి, ఈ గిరిజనులకు మధ్య ఉన్న అనుబంధాన్ని ఇంతవరకు ఎవ్వరూ చెడగొట్టకపోవడం అదృష్టం. ఇలాంటి వాతావరణం మనకు ఇంకెక్కడా కనిపించదు. 
http://farm3.static.flickr.com/2028/2437307506_4c41dd1ab5.jpg
దండకారణ్యం కూడా దట్టంగానే ఉన్నా, అక్కడా గిరిజనలున్నా... అదంతా నగరజీవన ప్రభావానికి లోనై గందరగోళంగా ఉంటుంది. రాముడు అరణ్యవాసంలో ఉన్నప్పుడు ఇక్కడే ఎక్కువ రోజులు గడిపాడని పురాణాల్లో చెబుతారు. ఆయనకు, రాక్షసులకు పలు యుద్ధాలు జరిగిన ప్రాంతం కూడా ఇదేనంటారు. గుహల గోడల మీద ఉన్న చిత్రాలు మనల్ని దాదాపు ఆ కాలంలోకి తీసుకెళ్లిపోతాయి.

చిత్రమైన గుడ్డిచేపల గుహ...
ఛత్తీస్‌గఢ్‌ పర్యాటక ప్రదేశాల్లో అత్యంత ముఖ్యమైన, ప్రజాదరణ పొందిన పర్యాటక కేంద్రం... గుడ్డిచేపల గుహ. జగదల్‌పూర్‌కు 30 కిలోమీటర్ల దూరంలో ఉండే ఈ గుహలను చూసి తీరాల్సిందే తప్ప వర్ణించడానికి పదాలు చాలవు. అప్పటివరకు చాలా గంభీరంగా కనిపించే కొండచరియ కాస్తా, ఈ గుహద్వారం వద్దకు వచ్చేసరికి ఉన్నట్టుండి అదృశ్యం అవుతుంది. ఈ గుహలో ఉండే గుడ్డిచేపల రహస్యం ఏమిటన్నది ఇప్పటివరకు శాస్తవ్రేత్తలు కూడా కనిపెట్టలేకపోవడంతో ఇది ఇప్పటికీ ఓ భౌగోళిక రహస్యంగానే మిగిలిపోయింది.

KangerValley 

కొన్ని వందలమంది వీటిపై పరిశోధనలు చేసినా, ఏమీ కనిపెట్టలేక ఊరుకుండిపోయారు. గుహలోంచి పొడుచుకుని వచ్చినట్లు కనిపించే సిలిండర్‌ ఆకారాల నుంచి విచిత్రమైన సంగీత ధ్వనులు వస్తుంటాయి. ఈ ప్రాంతానికే అవి ఆకర్షణగా ఉంటాయి. ఇలాంటి స్టాలగ్‌మైట్లు, స్టాలస్‌టైట్లకు కోట్‌ ముసర్‌ గుహలు ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందాయి. వీటిగుండా వెళ్తుంటే కలిగే అనుభవాన్ని జీవితంలో ఎన్నటికీ మరిచిపోలేం. ఈ గుహలను సందర్శించేటప్పుడు ఓ గైడ్‌ సాయం తీసుకోవడం మంచిది.http://www.pinkcity2india.com/blog/wp-content/uploads/2010/07/jharkhand-tourism-300x225.jpg
ప్రకృతికాంత సోయగాలు...
కంగర్‌వ్యాలీ నేషనల్‌ పార్క్‌ పర్యటన దాదాపు ప్రతి ఒక్క పర్యాటకుడికి తిరుగులేని సంతృప్తిని, అత్యంత సహజమైన అనుభూతులను మిగులుస్తుంది. జగదల్‌పూర్‌కు ఇది కేవలం 27 కిలోమీటర్ల దూరంలోనే ఉంది. ఇక్కడ పూర్తి వైవిధ్యభరితమైన మొక్కలు, పూలు, జలపాతాలు, గుహలు, లోయలు అన్నీ ఉండటంతో ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రకృతివాదులు, శాస్తవ్రేత్తలు ప్రతి సంవత్సరం తమ పరిశోధనల నిమిత్తం ఇక్కడికి వస్తుంటారు.

crocodile 

పురావస్తు ప్రదేశాలంటే మీకు ఆసక్తి ఉన్నట్లయితే నేరుగా సిర్పూర్‌ వెళ్లి పోవాలి. ఇక్కడ 245 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉన్న బరణ్వపర వైల్డ్‌ లైఫ్‌ రిజర్వ్‌ కూడా దాని అందాలకు ప్రసిద్ధి చెందినదే. ఇక్కడ బోలెడన్ని చిరుతపులులు, పులులు, ఎలుగుబంట్లు ఉంటాయి. ఇవేకాక 150 రకాలకు చెందిన ఇతర జంతువులు కూడా ఉంటాయి. ఇందులోని కొన్ని వింతైన జంతువులు పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంటాయి.http://www.indianexcursion.net/images/sm-tribal.jpg
సంవత్సరమంతా పర్యాటకుల తాకిడి...
వేసవి, శీతాకాలం అనే తేడా లేకుండా ప్రతి సీజన్‌లోనూ దేశం నలుమూలల నుంచే కాకుండా విదేశాల నుండి కూడా సందర్శకులు పెద్దయెత్తున వస్తుంటారు. ముఖ్యంగా పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంటున్న చిత్రకూట్‌ జలపాతానికి సంవత్సరం పొడవునా పర్యాటకల తాకిడి ఉంటుంది.
http://www.renutraveler.com/wp-content/uploads/2011/01/Chitrakot-waterfall2-300x225.jpg
భారత నయాగరా...
నయాగరా జలపాతం చూడాలంటే న్యూయార్క్‌ వెళ్ళాల్సిందే. అయితే అచ్చంగా నయాగరా కాకపోయినా దాదాపు అలాగే ఉండే చిత్రకూట్‌ జలపాతాన్ని చూస్తే... ఇంచుమించు నయాగరా జలపాతాన్ని చూసిన అనుభూతి మీ సొంతం అవుతుంది. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన నయాగరా అంత వెడల్పు లేకపోయినా ఛత్తీస్‌గఢ్‌లోని ఈ జలపాతం మాత్రం చూపరులను కట్టిపడేస్తుంది. దేశంలోనే దట్టమైన అడవుల గుండా వెళ్తుంటే, అక్కడి లోయలు, గుట్టలు చేతులు చాచి మిమ్మల్ని ఆహ్వానిస్తాయి. జగదల్‌పూర్‌ నుంచి 38 కిలోమీటర్ల దూరంలో ఈ జలపాతం ఉంది.

ఇంద్రావతి నదీ జలాలు ఇక్కడ వంద అడుగుల ఎత్తు నుంచి కిందకు అలా జాలువారుతుంటాయి. వర్షాకాలంలో నది పూర్తిగా ప్రవహిస్తున్నప్పుడు మొత్తం జలపాతమంతా కళకళలాడుతూ హోరెత్తిస్తుంది. ఆ వేగం, ఝరి చూస్తుంటే కళ్ళప్పగించి చూస్తూ ఉండిపోవాల్సిందే. ప్రవాహం దిగువకు వెళ్తుంటే నది మరింతగా విస్తరించి కనపడుతుంది. మీకు వీలైతే మాత్రం పున్నమి రోజునే ఈ జలపాతాన్ని చూడండి. జలపాతం పక్కనే ఓ కొండ చరియమీద పర్యాటక శాఖవారు ఓ చిన్న కుటీరాన్ని ఏర్పాటుచేశారు. అక్కడి నుంచి చూసేందుకు దృశ్యం బాగుంటుంది. జగదల్‌పూర్‌కు 40 కిలోమీటర్ల దూరంలో ఉండే తీర్థ్‌గఢ్‌ జలపాతాలను కూడా మీరు సందర్శించొచ్చు.

Tuesday, July 5, 2011

భారతీయ శిల్పకళాకాణాచి ఖజురహో

అవి కొండలే కావచ్చు... కాని మనసుల్ని దోచే అరు దైన కళాఖండాలు ఆ కొండల మాటున దాగి ఉన్నాయి. అవి రాళ్లే కావచ్చు... కాని జవ్వనులైన జవరాళ్లలా నాట్యం చేస్తాయి. ప్రపంచానికి భారతదేశం అందించిన వరాలీ శిల్పాలు. నిజజీవితంలోని విభిన్న కోణాల్ని ఇక్కడి శిలలు అణువణువునా ఆవిష్కరిస్తున్నాయి. ఛందేలా రాజపుత్రుల కృషికి ఇవి దర్పణాలుగా నిలుస్తాయి.

Khajuraho-Templeఖజురహో దేవాలయాల నిర్మాణానికి దాదాపు వందేళ్లు పట్టింది. ్రశ 950-1050 మధ్య కాలంలో ఛందేలా రాజపుత్ర రాజులు ఈ గుహాలయాల నిర్మాణాన్ని చేపట్టారు. కళాత్మక నైపుణ్యానికి, వైభవానికి ఈ గుహాలయాలు దర్పణాలు. మొత్తం 85 దేవాలయాల్లో ఇప్పటికే నిలిచి ఉన్నవి కేవలం 22 మాత్రమే. ఖజురహో చుట్టూ 8 ద్వారాలతో కూడిన కుడ్యం ఉన్నది. ప్రతి ద్వారం రెండు బంగారు కొబ్బరి కాండముల మధ్య ఉన్నది. సుమారు 8 చదరపు మైళ్ళ అంటే 21 చదరపు కిలో మీటర్ల విస్తీర్ణం లో 80 కి పైగా హిందూ దేవాలయాలు పరుచుకొని ఉన్నాయి.

ఉత్తర భారతంలో ఇతర సాంస్కృతిక స్థానాల వలె ఖజురాహో దేవాలయాలు క్రీశ 1100-1400 ల మధ్య ముస్లిం చొరబాటు దారుల చేత నేలమట్టం కాలేదు. చాలా కాలం నిర్లక్ష్యం తరువాత 19 వ శతాబ్దం లో బ్రిటీష్‌ వారు వీటిలో కొన్నింటిని కనిపెట్టారు. తవ్వకాలు మొదలు పెట్టారు. జులై-మార్చి మధ్య కాలం ఖజురహో సందర్శించడానికి అనువైన సమయం. ఈ పురాతన ఖజురహో దేవాలయాలు యునెస్కో వారసత్వ సంపదగా గుర్తింపబడినాయి. ఇక్కడ నిర్మించిన దేవాలయాలు, హిందూ మరియు జైన దేవాలయాల సమూహం. దీనికి ఆ పేరు హిందీ భాష నుండి మూలంగా వచ్చినది. హిందీలో ఖజూర్‌ అనగా ఖర్జూరము.

శృంగార జగత్తు ఖజురహో...
Khajurahoభారతీయ సంసృతిలోని శృంగార తత్వాన్ని చాటి చెప్పే ఖజురహో మధ్యప్రదేశ్‌లో ఉంది. శృంగార రసాధిదేవతల చిత్రాలున్న ఖజురహో శిల్పకళా సౌందర్యాన్ని చూడాలంటే రెండు కళ్ళూ చాలవు. సుమారు వెయ్యేళ్ళ చరిత్ర కలిగిన ఈ విశిష్ట ఆలయాలు... ఎన్నో ప్రకృతి బీభత్సాలకు గురయ్యాయి. ఎందరో దురాశాపరుల దాడులతో పాడైపోగా మిగిలిన ఆలయాల్లో జీవం ఉట్టిపడే శిల్పకళా సంపద ఈనాటికీ సందర్శకులను మంత్రముగ్ధుల్ని చేస్తోంది. వెయ్యేళ్ల కిత్రం చందేలా రాజవంశీయుల పరిపాలనలో రాజధానిగా వెలుగొందిన ఖజురహో గ్రామం... ఆ రాజుల పరిపాలన అంతమవడంతో అక్కడి అద్భుత శిల్ప సంపద కూడా మరుగున పడిపోయింది.

కాలక్రమంలో ఈ గ్రామం చుట్టూ చెట్లు పెరిగిపోయి ఒక అడివిలా మారిపోయింది. 1839 లో మళ్లీ ఖజురహో వెలుగు చూసింది. ఆనాడు చందేలా రాజులు మొత్తం 80 దేవాలయాలు నిర్మించగా నేడు 22 దేవాలయాలు మాత్రమే కన్పిస్తున్నాయి. ఈ ఆయలయాల మీద ఉన్న శిల్పాలు అపురూపమైనవే కాదు శృంగారాన్ని ఉద్దీపింపజేసేవిగా ఉంటాయి. వెయ్యేళ్లపాటు ఇంతటి కళా ప్రాశస్త్యాన్ని తనలో దాచుకున్న ఖజురహోను మరింతగా ప్రాచుర్యంలోకి తేవడానికి మధ్యప్రదేశ్‌ ప్రభుత్వం ప్రపంచవ్యాప్తంగా పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తోంది. ఇందుకోసం ఈ చిన్నగ్రామంలో విమానాశ్రయాన్ని కూడా ఏర్పాటు చేయడం విశేషం.

ఆలయాలకు ఆలవాలం...
Khajuraho1ఆదినాధ దేవాలయం: జైన తీర్ధాందకరుడు. ఆది నాధుడికి అంకితమైన ఆలయం ఇది.
ఘంటాయ్‌ గుడి: ఇది కూడా జైన దేవాలయం. ఇందులో వర్ధమాన మహావీరుడి తల్లి యొక్క 16 స్వప్నాల్ని ఆవిష్కరించే చిహ్నాలు ఉన్నాయి. గరుడ పక్షిపై ఉన్న జైన దేవత చిహ్నం కూడా ఇక్కడ ఉంది.
పార్శ్వనాధ దేవాలయం: ఇక్కడ ఉన్న జైన దేవాలయాల్లో కెల్లా అతిపెద్ద దేవాలయం ఇది. ఉత్తరం దిక్కున ఉన్న కుడ్యాలపై చిత్రాలు ఎంతో ఆకర్షణీయంగా ఉన్నాయి. నిజజీవితంలోని రోజువారీ కార్యక్రమాల్ని ఇవి ప్రతిబింబిస్తాయి. మొదటి తీర్ధాంకరుడైన ఆదినాధుడి వృషభానికి ఎదురుగా ఉన్న సింహాసనం ఎంతో ఆకర్షణీయంగా ఉంది. 1860లో ఇక్కడ పార్శ్వనాధుడి విగ్రహాన్ని ప్రతిష్ఠించారు.

చతుర్భుజ దేవాలయం: విష్ణుమూర్తిని గర్భగృహంలో కలిగిన దేవాలయమిది.
దూల్‌దాహ దేవాలయం: ఇది శివాలయం. అప్సర, కిన్నెర కింపురుషాదుల కూడ్య చిత్రాలు చాలా ఆకర్షణీయంగా ఉంటాయి.

మాతానాగేశ్వర దేవాలయం: ఇది శివాలయం ఎనిమిది అడుగుల ఎత్తున్న లింగం ఇక్కడ ప్రసిద్ధి.
లక్ష్మణ దేవాలయం: ఇది వైష్ణవాలయం. ఇక్కడ త్రిమ్తూరులైన బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల విగ్రహాలు ఉన్నాయి. విష్ణుమూర్తి అర్ధాంగి లక్ష్మీదేవి విగ్రహం కూడా ఉంది. విష్ణుమూర్తి అవతారాలైన నరసింహావతారం, వరాహావతరాలతో కూడిన విగ్రహం ప్రసిద్ధి చెందింది. ఇలాంటి వరాహావతారం - వరాహ దేవాలయంలో కూడా - తొమ్మిది అడుగుల ఎత్తుతో అలరారుతోంది.
విశ్వనాథ దేవాలయం: మూడు తలల బ్రహ్మ విగ్రహం ఇక్కడ ఉంది.
చిత్రగుప్త దేవాలయం: ఇది సూర్య దేవాలయం. ఉదయించే సూర్యుడిని దర్శిస్తూ తూర్పు ముఖాన ఈ దేవాలయం ఉంది.

చౌంసత్‌ యోగిని దేవాలయం: ఖజురహోలోని గ్రానైట్‌తో తయారైన ఏకైక దేవాలయం ఇది. అన్నింటిలోకెల్లా అత్యంత ప్రాచీనకాలానికి అంటే క్రీశ900 శతాబ్దానికి చెందింది. ఇది కాళిమాతకు చెందిన ఆలయం.

కాందారియ మహాదేవ్‌ దేవాలయం: ఖజురహోలోని అతిపెద్ద దేవాలయం ఇది. దీని ఎత్తు 31 మీటర్లు. ఇది శివాలయం.

నృత్యోత్సవాలు...
ఖజురహో లోని శిలలపై చెక్కిన శిల్పాలు ప్రదర్శించే నృత్యభంగిమలు అన్నీ ఇన్నీకావు. అలా నాట్యాలాడే శిల్పాలను తలదన్నే రీతిలో ఖజురహో నృత్యోత్సవాలు ఏటా కన్నుల పండువగా జరుగుతాయి. భారతీయ శాస్ర్తీయ నృత్య కళాకారులకు ఈ ఉత్సవాలు ప్రధాన వేదికగా నిలుస్తాయి. ఇవి ఏటా ఫిబ్రవరి / మార్చిలో జరుగుతాయి. వారం రోజుల పాటు జరుగే ఈ ఉత్సవాలకు దేశవిదేశాల నుండి పర్యాటకులు విశేషంగా తరలివస్తారు.

చూడాల్సినవివే...

mahesh-khajurahఖజురహో నుంచి 32 కిలోమీటర్ల దూరంలో ఉన్న పన్నా నేషనల్‌ పార్క్‌.. ఇక్క డ ముఖ్యమైన విహారకేంద్రం. ఖజురహో నుండి అరగంట ప్రయాణం. చిరుత పులి, పులి, చింకారా, తదితర వన్యమృగాలకు ఈ పార్క్‌ ఎంతో ప్రసిద్ధి. నేషన ల్‌ పార్క్‌కు వెళ్లే దారిలో ఉన్న పాండవ జలపాతాలు పర్యాటకుల మదిని ఇట్టే ఆకట్టుకుంటాయి. ఇవే కాకుండా చుట్టుప్రక్కల వేణీసాగర్‌ డ్యాం, రాణె జలపా తాలు, రాంగ్వన్‌ సరస్సు, దూబెల మ్యూజియం ఇక్కడ ప్రసిద్ధిగాంచిన పర్యా టక ప్రదేశాలు. అంతేకాకుండా ఇక్కడి 80 కిలోమీటర్ల దూరంలో ఉన్న అజ య్‌గఢ్‌ కోట కూడా ఎంతో ప్రసిద్ధిగాంచింది. ఈ ప్రాంతంలో కొండపైనున్న అ తిపెద్ద కోట ఇది. మరో అత్యంత పురాతన కోట కలింజర్‌. ఇది ఖజు రహో నుండి ఉత్తరదిశగా 25 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది.

ఎలా చేరుకోవాలి?
రోడ్డు మార్గం: సాత్నా, హర్పలూర్‌, ఝాన్సీ, మహోబా నుంచి ఖజురహోకు బస్సులు ఉన్నాయి.
రైలు మార్గం: ఖజురహో నుంచి 94 కిలోమీటర్ల దూరంలో హర్పలూర్‌, 61 కిలోమీటర్ల దూరంలో మహోబా నుంచి రైళ్లు ఉన్నాయి. ఢిల్లీ, చెన్నై నుంచి వచ్చే యాత్రీకులకు ఝ్సానీ నుంచి రైలు సదుపాయాలు ఉన్నాయి. ముంబై, కోల్‌కతా, వారణాసిల నుంచి వచ్చే వారిి ముంబై అలహాబాద్‌ మార్గం ద్వారా సాత్నా నుంచి ఉన్నాయి.

స్థానిక రవాణా మార్గాలు: ఖజురహోలోని దేవాలయాన్ని సందర్శించాలంటే స్థానికంగా ఉండే రవాణా మార్గాలపై ఆధారపడక తప్పదు. ఇక్కడ ప్రధా నంగా సైకిళ్లపై స్థానిక ప్రాంతాల్ని సందర్శించే పర్యాటకులు ఎక్కువ. కాబట్టి సైకిల్‌ రిక్షాలు, సైకిళ్లు అద్దెకు దొరకుతాయి.