విహారాలు

India

Gamyam

Showing posts with label విహార ప్రదేశాలు. Show all posts
Showing posts with label విహార ప్రదేశాలు. Show all posts

Saturday, August 11, 2012

'' బ్రూనై '' .... గాంధీ కలగన్న దేశం

'గాంధి కలలుగన్న దేశం ఇదే. ఇక్కడ ఎంత రాత్రిపూటయినా సరే ఆడపిల్ల ఒక్కతే నడుచుకుంటూ వెళ్ళగలదు. ఈ దేశంలో గత 20 ఏళ్ళలో ఒక్క హత్యా నమోదు కాలేదంటే ఆలోచించండి ఎంత ప్రశాంతమైన దేశమో'... బ్రూనై దారుస్సలాంలో తొమ్మిదేళ్ళుగా ఇంగ్లీషు లెక్చరర్‌గా పనిచేస్తున్న వాసుదేవ్ అడారి చెప్పిన  విశేషాలివి.

బోర్నియో ద్వీపకల్పంలో వాయవ్యాన ఉన్న ఓ చిన్న అందమైన దేశం బ్రూనై దారుస్సలాం. 2010 జూలై లెక్కల ప్రకారం ఈ దేశ జనాభా కేవలం నాలుగు లక్షలు. భారతదేశపు ఏ ఒక్క కాలనీలో మొహల్లాలోనో కనిపించే జనసాంద్రత ఇది. అలాంటిది దేశం మొత్తంమీద అంత తక్కువమంది ఉన్నారంటే అది ఎంత ప్రశాంతంగా ఉంటుందో, ముఖ్యంగా ఎంత పరిశుభ్రంగా ఉంటుందో పాఠకులు ఊహించుకోవచ్చు. ఈ నాలుగు లక్షల ప్రజల కోసం దాదాపు లక్షన్నర మంది విదేశీయులు వివిధ ఉద్యోగాల్లో సేవలందిస్తున్నారు.

అధికారిక మతం ఇస్లాం, భాష మలయ్. మలేషియా, ఇండొనేషియా, సింగపూర్‌లలో కూడా అధికార భాష అదే. నిజానికి మలయ్ అన్న పదం ఓ జాతి ప్రజల పేరుగా వాడుకలో ఉంది. దేశ జనాభాలో అరవై ఏడు శాతం ప్రజలు మలయ్‌లుగా పిలువబడుతూ మలయ్ భాషని మాట్లాడేవారిగా ఉన్నారు. రెండు మూడు స్థానాల్లో ఇంగ్లీష్, చైనీస్ భాషలు ఉన్నాయి. దాదాపు అందరూ కాస్తో కూస్తో ఇంగ్లీష్ మాట్లాడతారు. కాబట్టి విదేశీయులకి, టూరిస్టులకి భాష సమస్య కాదు. దేశాన్ని నాలుగు జిల్లాలుగా విభజించారు. 1906లో బ్రిటిష్ ప్రొటెక్టోరేట్‌గా ఉన్న ఈ బ్రూనై దారుస్సలాం 1984 జనవరిలో పూర్తి స్వాతంత్య్రం సంపాదించుకుంది. గల్ఫ్ దేశాల వలె పూర్తి స్థాయి రాజరికం ఉన్న అతి తక్కువ దేశాల్లో ఇదొకటి. ఈ దేశానికి ఆర్థిక వనరులు చమురు, సహజ వాయువే.

బ్రూనై అనగానే అందరికీ బ్రూనై సుల్తానే గుర్తుకు వస్తాడు. నిజమే ప్రపంచ అత్యంత ధనవంతుల జాబితాలో ఒకడైన హసనల్ బోల్కియా ఈ దేశపు రాజే. 1967 నుంచి ఈ దేశాన్ని పరిపాలిస్తున్న 29వ రాజు. దాదాపు అరవై బిలియన్ డాలర్ల ఆస్తితో 1990 దశకంలో ఇతను ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడు. ఫోర్బ్స్ మేగజైన్ ప్రకటించిన వివరాల ప్రకారం ఈ దేశపు చమురు, సహజవాయువు నిక్షేపాల విలువ సుమారు 22 బిలియన్ డాలర్లు. సాధారణంగా నీళ్ళో, చమురో మాత్రమే ఉండే దేశాలు మనకు తెలుసు. కానీ ఈ బ్రూనై దారుస్సలాం ప్రత్యేకతల్లో ఒకటి అవి రెండూ పుష్కలంగా లభ్యం కావటం.

ఇస్లాం-రామరాజ్యం

క్రీస్తు శకం 6-7 శతాబ్దాల వరకు మహారాజు శ్రీవిజయన్ ఈ దేశాన్ని పరిపాలించాడు. దేశంలో అందరూ సంస్కృతం మాత్రమే మాట్లాడాలని శాసనం చేసి ఓ కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టాడు. ఆ తర్వాత 15వ శతాబ్దంలో ఇస్లాం ప్రాబల్యం పెరిగి అదే అధికారిక మతంగా మారింది. అయితే భాషాపరంగా మాత్రం సంస్కృతమే ఇక్కడ అధికారిక భాషగా కొనసాగుతోంది. చరిత్ర ఆవిష్కరించే చిత్రాల్లో ఇదొకటి.

ప్రజలందరికీ ఉచిత విద్య, వైద్యం సదుపాయాలతో పాటు అందరికీ ఇల్లు, కారు సమకూర్చుకోవడానికి తక్కువ వడ్డీతో బ్యాంకు ఋణాలు ఇస్తారు. ఇవన్నీ సాధ్యం కావడానికి ప్రధాన కారణం వారి తక్కువ జనాభానే. ఇక్కడ ప్రతీ వ్యక్తికి ఓ కారు తప్పనిసరి. పబ్లిక్ ట్రాన్స్‌పోర్టేషన్ చాలా తక్కువ. అక్కడక్కడ విదేశీ శ్రామికుల కోసం మినీ బస్సులు కనబడతాయి. టాక్సీలు, ఆటోల్లాంటివి లేకపోవడం ఒక్కోసారి ఇబ్బందికరమేగాని ఏం చేస్తాం? టీవీ ఛానళ్ళు రోజుకి కొన్ని గంటలు మాత్రమే పనిచేస్తాయి. అందులో నేరాలు-ఘోరాలు లాంటి కార్యక్రమాలు అసలు ఉండవు. గత రెండు దశాబ్దాలుగా ఇక్కడ ఒక హత్య కూడా జరగలేదు. దానికి కారణం హత్యలు, ఆత్మహత్యలు, రేప్‌ల్లాంటి వార్తలు మచ్చుకైనా వినపడవు. కనపడవు. చిన్న చిన్న దొంగతనాలు, అవీ విదేశీ కార్మికులు చేసిన వాటి గురించే వింటూంటాం. ఇక్కడ మనుషులు అతి నెమ్మదిగా మాట్లాడతారు. భావావేశాలకు, ఉద్రేకాలకు పూర్తి విరుద్ధంగా వ్యవహరించే వీళ్ళ నుండి మనం నేర్చుకోవాల్సింది చాలా ఉంది అన్పిస్తూంటూంది.

రామరాజ్యం గురించి నేనెక్కడా చదవలేదు, వినడమే తప్ప. కానీ ఇక్కడ ప్రత్యక్షంగా చూస్తున్నాను. రాత్రి... అర్ధరాత్రి ఏ సమయంలోనైనా ఏ స్త్రీ అయినా రోడ్డుమీద ఒంటరిగా ఒక్కర్తే నడవగలిగే దేశం, ప్రదేశం ఇంకెక్కడైనా ఉందో లేదో తెలియదు కాని, ఇక్కడ మాత్రం ఉంది. అందుకే ఇది ఇస్లాంలో రామరాజ్యం అనుకుంటాను.

రాజు... రాజరికం... విలాసత్వం

బ్రూనై సుల్తాన్ హాజీ హసనల్ బోల్కియా గురించి, ఆయన విలాసవంతమైన జీవన విధానం గురించి ఎన్నయినా చెప్పుకోవచ్చు. ఉదాహరణకు- ప్రతీ సెకనుకి ముగ్గురు పిల్లలు పుడుతుంటారు ఈ భూమ్మీద!
అలాగే ప్రతి సెకనుకీ ఓ పది సెల్‌ఫోన్లు అమ్ముతుంటారు ప్రపంచవ్యాప్తంగా!
ప్రతి సెకనుకి ఈ ప్రపంచం 37 మిలియన్ల డాలర్లని ఖర్చుపెడుతుంటుంది కేవలం రక్షణ కోసం.
కానీ మన ఈ హసనల్ బోల్కియా ఆదాయం ప్రతీ సెకనుకి 90 యూరోల రూపంలో పెరుగుతూ ఉంటుంది...
అంటే వారానికి ఆయన ఆదాయం 54 మిలియన్ల యూరోలన్నమాట. ఇంకా చెప్పమంటారా నెలకి... సంవత్సరానికి.. వద్దులెండి... 'నో ఎన్వీ ప్లీజ్' అని ఆయన అధికారిక వెబ్‌సైట్ రాసింది... కాబట్టి ఆ విషయాన్ని వదిలేద్దాం. అయితే ఆయన నివాస గృహం గురించి రాయకుండా ఈ వ్యాసం ముగిస్తే నాకే అసంతృప్తిగా ఉంటుంది.

అతిపెద్ద రాజప్రాసాదం

'ఇస్తానా నూరుల్ ఇమాన్' ఆయన నివాసం పేరు. ఇస్తానా అంటే ఇక్కడి భాషలో రాజభవనం అని అర్థం. ఇలాంటివి ఇక్కడే ఓ నాలుగున్నా ఈ పేరుగల భవనం ప్రపంచంలోనే అతిపెద్ద రాజప్రాసాదంగా పేర్కొనబడింది. బ్రూనై నది ఒడ్డున పూర్తి ఇస్లామిక్ సంస్కృతిలో నిర్మితమైన ఈ రాజభవనంలో 1788 గదులు (అంటే రోమ్‌లోని వాటికన్ కంటే 388 ఎక్కువ గదులు), 650 సూట్లు, ప్రతీ అంతస్థుకీ ఎస్కలేటర్స్. ఒకేసారి 500 మంది కూర్చోవడానికి వీలుగా డైనింగ్ హాల్, సుమారు 1500 మంది ఒకేసారి ప్రార్థన చెయ్యడానికి అనువైన ఓ మసీదు రాజభవనం లోపలే నిర్మించడం కొన్ని ప్రత్యేకతలు. ఇక హిజ్ మెజెస్టీ కోసమని ఓ హెలిపాడ్, 300 కార్లు పట్టే పార్కింగ్ ప్లేస్, క్లినిక్, స్పోర్ట్స్ కాంప్లెక్స్ వగైరాలెన్నో ఉన్నాయి. దీని నిర్మాణానికి కావలసిన సామాగ్రిని 30 దేశాల నుంచి తెప్పించారు. ఈ రాజప్రాసాదం చూడ్డానికి ప్రతీ సంవత్సరం రంజాన్ పండుగ సందర్భంగా మూడు రోజులు ప్రజలందరినీ (విదేశీయుల్ని కూడా) అనుమతిస్తారు. ఆ రోజు మగవాళ్ళందరూ రాజుగారితో, ఆడవాళ్ళందరూ రాణీగారితో కరచాలనం చేసే సంప్రదాయం ఉంది ఇక్కడ.

రాజు తలచుకుంటే...

మహారాజు హసనల్ బోల్కియా తనకంటూ ఓ ప్రత్యేకమైన విమానాన్నే ఏర్పరచుకున్నారని రాసేసి వదిలేస్తే పెద్ద విశేషమేముంది? వంద మిలియన్ డాలర్లు ఖరీదు చేసే విమానాన్ని కొని మరో వంద మిలియన్ల డాలర్ల ఖర్చుతో దాన్ని మరింత అందంగా బంగారంతో తాపడం చేయించుకున్న ఘనత ఈ రాజుగారిది. ఈ విమానంతో పాటు ఆరు చిన్న విమానాలు, నాలుగు హెలికాప్టర్లు కూడా ఉన్నాయి. ఈయన మన రాజీవ్ గాంధీ లాగా ఖుద్దు (పైలట్), వీలయినప్పుడల్లా తన విమానాన్ని తనే నడుపుకుంటూ వెడతాడు.
http://upload.wikimedia.org/wikipedia/commons/thumb/5/59/Sultan_Omar_Ali_Saifuddin_Mosque_02.jpg/350px-Sultan_Omar_Ali_Saifuddin_Mosque_02.jpg
http://upload.wikimedia.org/wikipedia/commons/thumb/5/59/Sultan_Omar_Ali_Saifuddin_Mosque_02.jpg/350px-Sultan_Omar_Ali_Saifuddin_Mosque_02.jpghttp://upload.wikimedia.org/wikipedia/commons/thumb/5/59/Sultan_Omar_Ali_Saifuddin_Mosque_02.jpg/350px-Sultan_Omar_Ali_Saifuddin_Mosque_02.jpghttp://upload.wikimedia.org/wikipedia/commons/thumb/5/59/Sultan_Omar_Ali_Saifuddin_Mosque_02.jpg/350px-Sultan_Omar_Ali_Saifuddin_Mosque_02.jpg
65 ఏళ్ళ బోల్కియా ఈ మధ్య మన దేశాన్ని సందర్శించినప్పుడు కూడా తన విమానాన్ని తానే నడుపుకుంటూ వచ్చి మన వాళ్ళని ఆశ్చర్యపరిచాడు. తన ఐశ్వర్యానికి తగ్గట్టుగానే తన జీవన విధానాన్ని సాగించే ఈయన, తన కూతురి 18వ పుట్టినరోజుకి ఏకంగా ఓ ఎయిర్‌బస్‌నే కానుకగా ఇచ్చాడు. తన 50వ పుట్టిన రోజు సంబరాల్లో భాగంగా మైఖెల్ జాక్సన్‌ని ఈ దేశానికి పిలిపించి కార్యక్రమాన్ని చేయించడం బోల్కియా రాజరిక వైభోగానికి మరో ఉదాహరణ.
కొసమెరుపు : పేరులో దారు ఉన్నా ఇది పూర్తిగా డ్రై కంట్రీ. టూరిజం అంతగా అభివృద్ధి చెందకపోవడానికి ఉన్న కారణాల్లో ఇదొకటని కొంతమంది వాపోతుంటారు.

ఇక్కడా మన రాముడే!
ప్రస్తుతం కాంబోడియా అని పిలువబడుతున్న కాంభోజ రాజ్యం వరకూ మన భారత రామాయణాలు పరిఢవిల్లేవనే విషయం కాస్తో కూస్తో బయట తిరిగే టూరిస్టులకి తెలియంది కాదనుకుంటాను. దీనికి బ్రూనై దారుస్సలాం అతీతం కాదు. ఇక్కడ కూడా రామాయణం పూర్తి స్థాయిలో రాణించడమే కాక రామాయణంలోని ముఖ్యపాత్రల పేర్లన్నీ ప్రతి ఇంట్లోను విన్పిస్తుంటాయి. పురుషులకు రమ్‌లీ అని, భుజాంగ్ అని, స్త్రీలకి సితి అని పేర్లు పెట్టుకుంటారు. ఇంకో ఆశ్చర్యకరమైన విషయం లక్ష్మణుడి పేరు మాత్రం ఎటువంటి మార్పు లేకుండా ఓ ప్రత్యేకవర్గంగా ఉండడం. రాజుగారి ఆంతరంగిక రక్షకభటులుగా ఇప్పటికీ ఈ 'లక్ష్మణ' వర్గం పనిచేస్తుంటూంది. మలయ్ భాషలో దాదాపు నలభై శాతం సంస్కృత పదాలే వినపడడం కొంతలో కొంత మనదేశపు వాతావరణాన్ని గుర్తుకు తెస్తుంది.

గట్టిగా మాట్లాడితే..

ప్రశాంతతకి ఇచ్చే విలువ గురించి ఓ సంఘటన మీకు చెప్పి తీరాల్సిందే... ఓ పబ్లిక్ ప్రదేశంలో ఇద్దరు తమిళులు కూర్చుని 'మామూలు'గా మాట్లాడుకుంటున్నారట... ఓ పదిహేను నిమిషాలకి ఓ పోలీస్ వ్యాన్ వాళ్ళు కూర్చున్న దగ్గరకొచ్చి ఆగింది. అందులోంచి ఇద్దరు ఆఫీసర్లు దిగి "ఏంటి సమస్య? మీరిద్దరూ దెబ్బలాడుకుంటున్నారట కదా? పదండి స్టేషన్‌కి'' అన్నారట నెమ్మదిగానే... దానికి వాళ్ళిద్దరూ ఒకరి మొహం ఒకరు చూసుకుని "అయ్యో! అలాంటిదేమీలేదే... మేం మామూలుగా మాట్లాడుకుంటున్నాం'' అన్నారట... దానికి అక్కడే ఉన్న ఓ చిన్న దుకాణదారుడు బయటకొచ్చి "నేనే పోలీసుల్ని పిల్చా... ఏంటి మీరు కొట్టుకోట్లేదా... కొంచెంసేపాగితే ఒకర్నొకరు చంపేసుకుంటారేమోనని భయమేసి...'' అన్నాడట. అలా ఉంటాయి ఇక్కడ సంస్కారానికి సంబంధించిన విషయాలు.

నీటి నివాసం

వాటర్ విలేజ్ అని పిలవబడే ఎనిమిది కిలోమీటర్ల గ్రామం ఒకటి ఉంది ఇక్కడ. అక్కడ ఇళ్ళన్నీ నీటిపైనే. పూర్తి చెక్కతో చెయ్యబడ్డ ఈ ఇళ్ళు మామూలు వాటికి దేనిలోనూ తీసిపోవు. కొన్ని శతాబ్దాలుగా అక్కడే నీటిపైన నివాసం ఉంటున్నారు 30 వేల ప్రజలు. వాళ్లు వేరే గృహాల్లోకి వెళ్ళడానికి కూడా ఇష్టపడరు. ప్రభుత్వమే వారికి అన్ని సదుపాయాలు కల్పిస్తుంది. టూరిస్టులు తప్పనిసరిగా చూడవలసిన ప్రదేశం ఈ వాటర్ విలేజ్. దీన్ని మలయ్ భాషలో 'కంపోంగ్ ఐర్' అంటారు. కంపోంగ్ అంటే గ్రామం అని ఐర్ అంటే నీరు అని అర్థం.

- vasudevadari@gmail.com


Thursday, May 3, 2012

రాధాకృష్ణూలు రాసక్రీడలాడిన... మజులి

మహాభారతంలో పేర్కొన్న ప్రాగ్జోతిష్యపురమే... నేటి అస్సాం రాష్ట్రం. ఈశాన్య రాష్ట్రాల పర్యాటకరంగంలో పేరుప్రఖ్యాతులుగాంచిన ఈ రాష్ట్రంలో ఉన్న విశేష పర్యాటక కేంద్రమే మజులి ద్వీపం. ఈ ద్వీపంలో... వందల ఏళ్ళుగా రాజవంశాలు, ఇతర పాలకులు వాడిన ఆయుధాలు, ధరించిన దుస్తులు నేటికీ మనం దర్శించుకోవచ్చు. మజులి ద్వీపవాసులు ఇప్పటికీ అదే తరహా దుస్తులను వాడుతుండడం హర్షించదగ్గ విషయం. హస్తకళలకు ఎంతో పేరుగాంచిన ఈ ప్రాంతం... పర్యాటక సోయగాల విషయంలో కూడా అంతే పేరుప్రఖ్యాతులు పొందింది.

అబ్బురపరిచే ‘రాస్‌లీలా’...
Un9 


అలనాడు రాధాకృష్ణులు రాసక్రీడలాడిన ప్రదేశంగా చెప్పబడుతున్న ఈ ద్వీపంలో... ద్వీపవాసులు ఆ ఆనవాయితీని ఇప్పటికీ పాటిస్తుండడం విశేషం. ప్రతి ఏడాది మూడు రోజులపాటు ఎంతో అట్టహాసంగా జరిగే ఈ ఉత్సవాన్ని ‘రాస్‌లీలా’ ఉత్సవం అంటారు. కన్నులపండువగా జరిగే ఈ ఉత్సవంలో శ్రీకృష్ణుడు, గోపికల రాసలీలలను కళ్ళకు కట్టినట్టు ప్రదర్శిస్తారు. మజులి ద్వీపంలో జరిగే ఓ రకమైన ఆధ్యాత్మిక ఉత్సవం ఇది. ఇక్కడి గిరిజనులు ధరించే రంగురంగుల దుస్తులు, పూసలు ప్రత్యేకమైన ఆకర్షణగా నిలుస్తాయి. యువతీయువకులు రాధామాధవుల వేషధారణలో వీక్షకులను ఇట్టే ఆకట్టుకుంటారు. ముఖ్యంగా గోపికల వేషధారణలో సంప్రదాయ దుస్తులు ధరించిన యువతులు ఒయలుపోతూ ప్రదర్శించే నృత్యాలు ఆద్యంతం విశేషంగా ఆకట్టుకుంటాయి. మొత్తంగా ఈ ఉత్సవం ద్వాపరయుగాన్ని తలపిస్తుంది.


ప్రపంచంలోనే అతిపెద్ద మంచినీటి ద్వీపం...


ద్వీపం అనగానే ఎవరికైనా ఇట్టే గుర్తుకు వచ్చేది సముద్రం మధ్యలో ఉన్న భూమి. అయితే నదుల మధ్య కూడా కొన్ని ద్వీపాలు ఉంటాయి. అలాంటి అరుదైన ద్వీపమే ఈ మజులి ద్వీపం. ప్రపంచంలో ఇలా నదుల మధ్య ఉండే అరుదైన మంచినీటి ద్వీపాల్లో ఇదే పెద్ద ద్వీపం కావడం విశేషం. అస్సాం రాష్ట్రంలోని బ్రహ్మపుత్ర నది మధ్యలో ఏర్పడిన ఈ మజులి ద్వీపం సౌందర్యాన్ని మనసారా వీక్షించడానికి రెండు కళ్ళూ చాలవంటే అతిశయోక్తి కాదు. ఈ ద్వీపం మధ్యలో నిర్మించిన కాటేజ్‌లలో నుండి సూర్యాస్తమయాన్ని చూడటం ఓ మరచిపోలేని మధురమైన అనుభూతి.

కొత్త జంటల మజిలీ...   ఈ ‘మజులి’...
Ra 

మజులి ద్వీపంలో చెట్లు, చేమలూ.. పుట్టలూ, నదీ జలాలు... ఇలా మజులి ద్వీపం గురించి ఏం చెప్పుకున్నా అవన్నీ కాలుష్యానికి దూరంగా, అతీతంగా నిలిచి ఉన్నాయి. మనిషి కాలుష్య కర్కషత్వం ఈ ప్రాంతంపై పడలేదు కాబట్టి ఇప్పటికీ. .. మజులి సౌందర్యం ఏ మాత్రం ధ్వంసం కాకుండా, స్వచ్ఛంగా, ఆహ్లాదాన్ని పంచుతోంది. ఏ రుతువులో చూసినా... తాజాదనం తొణకి సలాడే ఈ అద్భత ద్వీపంలో మానవ సంచారం గత ఐదు వందల ఏళ్ళ నుండి ఉన్నప్పటికీ... నేటికి పచ్చని సౌందర్యంతో ప్రకృతికాంత పరవశిస్తూనే వుంది. 
http://f0.pepst.com/c/01E776/215799/ssc3/home/027/photo.subha/majuli_island.jpg_480_480_0_64000_0_1_0.jpg
అందుకే కొత్తగా పెళ్లైన దంపతులకు ఇదొక స్వర్గధామం అని చెప్పవచ్చు. అస్సాం నుండే కాకుండా ఇతర రాష్ట్రాల నుండి కూడా హనీమూన్‌ కపుల్‌ ఇక్కడ సందడి చేస్తారు. కొత్త వాతా వరణంలో, పూర్తి కొత్తదనంతో గడపాలను కునే జంటలకు ‘మజులి’ ఓ అద్భుతమైన అనుభవాన్నిస్తుందనడం ఏమాత్రం అతిశయోక్తి కాదు.http://www.assaminfo.com/images/majuli.jpg

CANADA TOUR


Monday, March 5, 2012

ట్రెక్కింగ్‌ @‌ నేపాల్‌

 http://www.papatoto.com/images/discovery/567983774359_discoveries.jpg
ప్రపంచంలోనే ఎతైన పర్వతం ఎవరెస్ట్‌ అని అందరికీ తెలిసిన విషయమే... అదొక్కటే కాకుండా భారత్‌ - నేపాల్‌ సరిహద్దులన్నీ హిమా లయాల మయమే..! అందువల్ల ఈ ప్రాంతం ట్రెక్కింగ్‌కు కేరాఫ్‌ అడ్రస్‌ అనడంలో ఆశ్చర్య మేముంది..! అలాంటి ప్రఖ్యాత ట్రెక్కింస్పాట్‌లలో కొన్ని ...

Annapurna
https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEjeJpFcR2GPMjByhCsgcFZ1mq3698AWQVZ6L4e1-hX9LahbjkkUtqVpi0SbTzB7riMIxFK1z9RZEPBqrq3VTOst53-NYHGTjk1xBEAyZFPX-1NLSGAIrsB4w4o1ObhAZH7XeUd4J0Fd5w/s1600/image_trekking.jpg
ఎవరెస్ట్‌ ప్రాంతంలో సెలవులు గడపటానికి వెళితే, అక్కడ మంచుతో బాగా కప్పబడిన హిమాలయాల దర్శనం, కొన్ని మంచి షెర్పా పల్లెలను చూస్తూ సాగే అందమైన, స్పూర్తి ప్రదాయకమైన ప్రయాణం.
http://www.greenkiwi.co.nz/footprints/graphics/rr/rr20a.jpg
aerial view of a Nepalese village
http://www.mynetbizz.com/pages/nepal/jomsom-trek-nepal.jpg http://i.telegraph.co.uk/multimedia/archive/01729/nepal-mountains_1729954c.jpghttp://platform.ak.fbcdn.net/www/app_full_proxy.php?app=161934890497276&v=1&size=o&cksum=7e5be62813c28c6d498a50739cb0a21d&src=http%3A%2F%2Fmedia.tourcms.com%2Fa%2F758%2F18%2F1.jpg
 ప్రాచీన బౌద్ధరామాలు వంటి వాటిని చూడగలగడం, ఇంకా చూపు తిప్పుకోనివ్వని శిఖరాలు మీరా, ఐలాండ్‌, పోకల్డే శిఖరం, ఇంకా మరెన్నో చూడవచ్చు. 
https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEh3sfPTR_IuPWn3tysVYytITWZkSFS1PsRFzewU3ORxxv9OerdmdENyoRNsNHHqTF64SmpSM5FZwJ5KnSmmh4F80WiACLSQCPRH52VBlBQyMHSprRC8MZz2pDVl0HDpWa7RttcLkIDgk7vR/s1600/annapurna-base-camp-trek.jpg https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEi4XiyqQHuIw3BJZIWnZT0U3Ke2NkZ35N3l45_m9YPICsiGxgbHSF-rIo6r-r7HxTCHrpDfayvj9wqLGoTFBIatm1mOTx-4BynjULrQ4f85LA9T0biVceuS_WdvIflS_BiLOpJHj11xkUo/s1600/annapurna-trek.jpg
ప్రపంచ ప్రసిద్దమైన ట్రెక్కింగ్‌ ప్రదేశం అన్నపూర్ణ ప్రాంతం. ఇక్కడ మూడు ముఖ్యమైన ట్రెక్కింగ్‌ దారులు ఉన్నాయి. ఇవి ఉత్తరంగా నేపాల్‌ మధ్యలోకి వచ్చేలా ఉంటాయి. అవి... జామ్సం, అన్నపూర్ణ శాంక్చురీ, అన్నపూర్ణ ప్రాంతమే వలయాల్లా ఉంటుంది. ఇక్కడి విభిన్న సంప్రదాయాలు, ప్రజలు, దీనిని మంచి ట్రెక్కింగ్‌ ప్రదేశంగా చేశాయి. http://www.himalayanmountaintreks.com/wp-content/uploads/2011/07/icefalls4.jpg
https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEjUlZAMN9Jkg1TqHhpKYJAeE_0ED3xKCzw3wuGVaQN1K5KuPULZGfsBEkBIOtyxiE2_kk3Bk2Ei6DW5FkIt09XmrRuex8nlrVszLRMDvm9rJwJcfQl-Xg7cKDPrcIsDtJmAGTtKstKs_Q8/s320/trek.jpghttp://treknepal.files.wordpress.com/2008/06/dhaulagiri.jpghttp://cdn8.wn.com/pd/98/65/ec56bbbafd5d186fae9706e8b899_grande.jpghttp://cdn8.wn.com/pd/98/65/ec56bbbafd5d186fae9706e8b899_grande.jpghttp://farm2.static.flickr.com/1213/1147932444_5b4bd4c741.jpghttp://www.nepalmountaintrek.com/images/tilicho-lake.jpg
Tilicho lake Trekking is one of the newest trekking routes in Annapurna ...
 

Nilgiri above Jomosom, Annapurnas, Nepal

మీరు అద్బుతమైన పర్వతాల అందాలు చూడగలరు. అందులో ధులగిరి, అన్నపూర్ణ, మనస్లు, లమ్జంగ్‌ హిమాల్‌ మంచాపుచ్చారే, టుకుచే శిఖరం, టిలిచో శిఖరం, నీలగిరి ముఖ్యమైనవి. అన్నపూర్ణ, ధులగిరిల మధ్యగా వెళుతున్న కాళి గండకి ప్రపంచంలోనే లోతైనది. హిందు వుల నుండి బౌద్ధుల వరకు, ఆర్యుల నుండి మంగోలుల వరకు, గొప్ప గోర్ఖా సైనికులు, పల్లెలు, లోయలు, బాగా వర్షంపడే ప్రాంతాలు, నేపాల్‌లోని వర్షం పడనివ్వని ప్రాంతాలు ఇలా అన్నీ పూర్తిగా విభిన్నంగా ఉండే విషయాలు, మీ నడకను ఒక ప్రత్యేక అనుభవంగా చేస్తాయి. ఈ మధ్య మోడర్న్‌ మెచ్యూరిటీ (యూయస్‌ఏ) వారు చేసిన సర్వే ప్రకారం, ఈ ప్రాంతం ప్రపంచంలోనే అత్యద్భుతమైన ట్రెక్కింగ్‌ ప్రాంతంగా గుర్తించబడినది. 
http://himalman.files.wordpress.com/2009/10/on-the-left-on-durbar-square-is-the-octagonal-krishna-temple-which-pratapa-malla-built-in-memory-of-two-of-his-favorite-queens.jpg
పోఖరా ది సిటీ అఫ్‌ లేక్స్‌ ఈ అన్నపూర్ణ ప్రాంతంలో ట్రెక్కింగ్‌ మొదలు పెట్టే ప్రాంతం కానీ, లేదా ముగించే ప్రాంతం కానీ అవుతుం ది. సహజ సౌందర్యంతో, చిత్రవిచిత్రం గా కనిపించే ఈ పట్టణం 3000 అడుగుల ఎత్తులో, గొప్ప హిమాలయ పర్వతాల ఒడిలో ఉంది. పర్యాటకులకు స్వర్గధామం అయిన ప్రదేశాలలో ఇది కూడా ఒకటి.

Langtang 

ఖాట్మండు లోయ నుండి ఇది కేవలం 200 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇక్కడకు రోడ్డు మార్గం ద్వారా కానీ లేదా విమానంలో కానీ తేలికగా చేరుకోవచ్చు. 
http://www.himalayanclub.org/hc/wp-content/uploads/hj-58-art-13-b-300x205.jpg
లంగ్‌టంగ్‌ ప్రాంతం ఆశ్చర్యపరిచే ప్రకృతిని తిలకించడానికి సరైన ప్రదేశం! ఇది మరొక అత్యంత ప్రత్యేకమైన ట్రెక్కింగ్‌ స్థానం. ఇది ఉత్తర ఖాట్మండులో, హిమాలయాల మధ్యలో, టిబెటన్‌ సరిహద్దు పై, తేలికగా చేరుకునేలా ఉంది. ఈ ప్రదేశం ఎన్నో రవాల మొక్కలకు, హిమాలయాల రెడ్‌ పాండాతో సహా ఎన్నో రకాల జాతులకు చెందిన జంతువులకు, ఆలవాలంగా ఉన్నది. పికా, దుప్పి, హిమాలయాల నల్ల ఎలుగుబంటి మొదలైనవి ఇక్కడ ఉన్నాయి. ప్రపంచంలోని అన్ని ప్రాంతాల యాత్రికులకు ఇది ఒక చక్కటి సెలవుల విడిది గా పేరుగాంచింది. ఉత్తర ఖాట్మండులో ఉన్న హేలంబు, అద్భుతమైన షెర్పా, తమంగ్‌ పల్లెలతో ట్రెక్కింగ్‌ కు చాలా చాలా అనువుగా ఉంటుంది. 
 http://www.trekkingtourinnepal.com/images/gosainkunda-trek-nepal.jpghttp://www.nepalmountaintrek.com/images/gosaikunda-trek.jpghttp://www.twip.org/photo/2010/photo-gosaikunda-lake-25017.jpg
గోసాయికుండ అనేది ఒక చక్కటి సరస్సు. ఇది తనతో పాటుగా ఉన్న ఇతర చక్కటి సరస్సులతో సహా పేరు పొందినది.

శ్రీరామసేతుకు ఆరంభ కేంద్రం.. ధనుష్కోడి

దక్షిణ భారతదేశంలో అత్యంత పేరెన్నికగన్న తమిళనాడులోని రామేశ్వరానికి దగ్గరల్లో... శ్రీలంకకు వారధి పట్టణంగా ప్రసిద్ధిగాంచిన ధనుష్కోడి ఓ చిన్నగ్రామం. కానీ పర్యాటకంగా ఈ గ్రామానికి ఎంతో ప్రత్యేకత ఉంది.

Dhanushkodi
http://farm3.static.flickr.com/2375/2740412037_25cb4c2fd5.jpg
ధనుష్కోడి, పాంబన్‌ వంతెనకు ఆగ్నేయంగా ఉన్నది. రామేశ్వరం నుండి ధనుష్కోడి వరకూ ఉన్న రైల్వే లైను 1964లో సంభవించిన పెనుతుఫానులో, ప్రయాణీకులతో సహా కొట్టుకుపోయింది. 
http://lh4.ggpht.com/--2SsLo7yNk0/TYmy9YQRKxI/AAAAAAAABTg/vOUHK5WRjC0/pamban_9.JPG
ఆ తరువాత రైల్వే లైనును పునరుద్ధరించినా, ఆరు పెద్ద ఇసుక తిన్నెలు పట్టాలను కప్పివేయగా దాన్ని ఉపయోగించడం నిలిపివేశారు.
http://www.subramaniansuresh.com/images/20081006205938_dhanuskodi%20beach.jpg
 ప్రస్తుతం ధనుష్కోడికి సముద్రతీరం వెంట కాలినడకన లేదా ఇసుకతిన్నెలపై జీపు ద్వారా చేరుకోవచ్చు. పూర్వం కాశీ తీర్ధయాత్ర, రామేశ్వరాల్లో పూజచేసి, ధనుష్కోడి వద్ద మహోదధి (బంగాళాఖాతం), రత్నాకర (హిందూ మహాసముద్రం) ల సంగమస్థలంలో పవిత్రస్నానం చేయనిదే పూర్తికాదని భావించేవారు.http://tn.ellamey.com/Ramanathapuram/image/dhanuskodi3.jpg
http://www.gotachance.com/ram_bridge.jpg
సేతు ధనుష్కోడి నుండే ప్రారంభమవుతుంది. సంస్కృతంలో సేతు అనగా వంతెన. ఇప్పుడు సేతు అనగా రామాయణంలో రాముడు లంకను చేరుటకు నిర్మించాడని భావిస్తున్న వారధి అనే ప్రత్యేకార్ధం కూడా వచ్చినది. 
http://2.bp.blogspot.com/-dsWGwvKI85A/Tg2Nx3sLjkI/AAAAAAAAR4I/a-lgbfE0XXU/s1600/DhanuskodiMap.jpg

Sunday, January 22, 2012

అమెరికా పాపికొండులు

 







మనుషుల్ని పోలిన మనుషులు ఉంటారో లేదో కాని.. ఒక ప్రదేశాన్ని పోలిన మరొక ప్రదేశం ఏదో ఒక దేశంలో తప్పకుండా ఉంటుందేమో అనిపిస్తుంది ఇది చదివితే. గోదావరి దగ్గర పాపికొండలున్నట్లే.. అమెరికాలోని సియాటిల్‌కు దగ్గర్లో 'లేక్ చలాన్' ఉంది. ఆ అద్భుతమైన పర్యాటక ప్రదేశం గురించే ఈ ట్రావెలోకం..
అమెరికాలో మా అబ్బాయి ఉంటే అక్కడికెళ్లాం. "ఎలాగూ ఇంత దూరం వచ్చారు కదా! లేక్ చలాన్ చూసొద్దాం'' అన్నాడు మా వాడు. అంతే టూర్ ఖరారైంది. అమెరికాలో ప్రసిద్ధి చెందిన లేక్‌లలో ఇదొకటి. సియాటల్ నుండి సుమారు 350 మైళ్ల దూరంలో ఉంది ఈ లేక్. లేక్ చలాన్ అంటే లోతైన ప్రదేశం అని స్థానిక భాషల్లో అర్థం ఉంది. తెల్లవారుజామున నాలుగింటికే ప్రయాణం మొదలుపెట్టి ఏడున్నర గంటకల్లా లేక్ చలాన్ చేరుకున్నాం. ప్రయాణం మొత్తం చాలా ఆసక్తిగా సాగింది. ఇంకొక అరగంటలో లేక్ మీద బోట్ ప్రయాణం మొదలవ్వబోతుండగా మెల్లగా ఒక్కొక్కరే కార్ల నుంచి దిగడం మొదలుపెట్టారు. చూస్తుండగానే సుమారు 150 మంది పర్యాటకులు జత కలిశారు. మేము ఇంటి దగ్గరే ఆన్‌లైన్‌లో టికెట్లను రిజర్వు చేసుకున్నాం. నేను, నా భార్య, మనవడు, కొడుకుతో సహా బోటు ఎక్కాం. సువిశాలమైన నదీ జలాలలో హంసలా మందగమనంతో బయలుదేరిన బోటు నెమ్మదిగా వేగాన్ని పుంజుకుంది. ఇరువైపులా పాల నురగలా నీళ్లను వెదజల్లుతున్న సరస్సులో ఆకాశాన్నంటే పర్వత శిఖరాల మధ్య మా ప్రయాణం సాగింది. చల్లటి ఆ వాతావరణం మనస్సుకి ఎంతో హాయిగా అనిపించింది.

ముచ్చటైన మూడు లేక్‌లు

అమెరికాలో అత్యంత లోతున్న మూడు లేక్‌లలో ఒకటి- ఆరెగాన్ స్టేట్‌లోని 'క్రేటర్ లేక్'. ఇది 1932 అడుగుల లోతుతో 5 మైళ్ల వెడల్పుతో ఉంటుంది. రెండవది కాలిఫోర్నియాలోని నెవెడా బార్డర్‌లో ఉన్న 'తాహె' లేక్. ఇది 1645 అడుగుల లోతుతో పదిమైళ్ల వెడల్పుతో ఉంటుంది. మూడవది మేము ప్రయాణిస్తున్న లేక్ చలాన్. దీని లోతు 1486 అడుగులు, పొడవు 5 మైళ్లు. వెడల్పు మాత్రం ఒక్క మైలే. ఈ లేక్‌కు దిగువన వాస్టోబేసిన్, ల్యూసర్న్ బేసిన్ అని రెండు బేసిన్లను నిర్మించారు. వీటిలో ఒకటి సముద్రమట్టానికి నాలుగు వందలు, మరొకటి ఆరువందల అడుగుల దిగువన ఉన్నాయి. ఈ లేక్‌ను 'లేడీ ఆఫ్ ద లేక్' అని కూడా పిలుస్తారు. ఆ చిత్రమైన పేరు ఎలా వచ్చిందో తెలుసా..? దీన్ని మొట్టమొదటిసారి ఓ మహిళ చూసింది కాబట్టి..ట. బోట్ లోపల కూర్చోవడానికి అనుకూలమైన మంచి కుషన్ చైర్‌లు ఉన్నాయి.

బయటి దృశ్యాలను చూసి ఆనందించడానికి గాజు కిటికీలను అమర్చారు. అవసరం అనుకుంటే మధ్య మధ్యలో సేవించడానికి టీ, కాఫీ, బిస్కట్‌లు అమ్మే చిన్న కొట్టును పెట్టారు. అక్కడే చక్కటి బాత్‌రూం ఏర్పాటు చేశారు. బోట్‌లో కూర్చున్న రెండొందల మందిలో ఒకరిద్దరు భారతీయులు తప్పిస్తే మిగతా అందరూ అమెరికన్లే ఉన్నారు. పరిచయమున్నా లేకపోయినా అందరికీ విష్ చేస్తూ, చిరునవ్వులతో వాళ్లంతా లోపలికి వచ్చారు. బోట్‌లోనే బయట కూర్చుని చూసేందుకు వీలుండే పైకప్పులేని స్థలం కూడా ఉంది. కొందరు అక్కడే ఉత్సాహంగా కుర్చీలు వేసుకుని కూర్చున్నారు. వెనక్కి వెళుతున్న ప్రవాహాన్ని చూస్తూ ఫోటోలు దిగుతూ ఎంజాయ్ చేస్తున్నారంతా. మేము కూడా అలాగే చూద్దామని బోటుపైకి చేరుకున్నాం. కాని బోటు ప్రవాహ వేగానికి వస్తున్న ఈదురు గాలికి తట్టుకోలేకపోయాం.

చూడముచ్చటైన చెట్లు, ఎత్తయిన పర్వత శిఖరాలను దాటుతుంటే ఎంతో అద్భుతమనిపించింది. ఆ శిఖరాలు ఎంత ఎత్తుగా ఉన్నాయంటే దాదాపు 8,245 అడుగులు. వందల మైళ్ల విస్తీర్ణంలో అడవి ఉండడంతో ఎటు చూసినా దట్టంగా చెట్లే. మధ్య మధ్యలో ఆ కొండల మీద నుండి కిందకు దూకుతున్న సెలయేర్లు, పూర్తిగా కరగని తెల్లటి మంచు ముద్దలు కనువిందు చేశాయి. బోట్‌లో వెళుతున్నప్పుడు లేక్ ఒడ్డున చిన్న చిన్న పల్లెలు సైతం కనిపించాయి. ఆ పల్లెవాసులు బోట్లలో తిరుగుతూ చేపల్ని పట్టుకుంటున్నారు. కొన్ని చోట్ల మైళ్ల కొద్దీ చెట్లు కాలిపోయి ఉన్నాయి. దావాగ్ని ఫలితమట. అమెరికాలోని అడవుల్లో ఒక చోట నిప్పు రాజుకుంటే.. మైళ్లకు మైళ్లు వ్యాపిస్తుంది. 1929లో లాగే నిప్పు రాజుకుని 'మేథ్యూ' రివర్ వరకు అడవిని నాశనం చేసిందని స్థానికులు చెప్పారు. ఆ అగ్ని 62 రోజుల వరకు మండూతూనే ఉందట. మంటల్ని అర్పే ప్రయత్నంలో ఇద్దరు అగ్నిమాపక దళ సిబ్బంది కూడా చనిపోయారని తెలిసింది. ఈ అడవులకు అగ్ని ప్రమాదాలొక్కటే కాదు, అప్పుడప్పుడు వరదల ముప్పు కూడా వస్తుంటుంది. ఆ ఛాయలు అక్కడ స్పష్టంగా కనిపిస్తున్నాయి.

మొదట్లో స్థానిక అమెరికన్లు (రెడ్ ఇండియన్లు) డేరాలు వేసుకుని వింటర్ విలేజ్‌గా ఉంటున్న ఈ ప్రాంతంలో ఆ తర్వాత బ్రిటిష్ వారు స్థిరపడేందుకు ప్రయత్నించారట. దీంతో ఇద్దరి మధ్యా వైరం వచ్చి కొన్నాళ్ల తర్వాత సమసిపోయిందట. ఇరువర్గాలు ప్రశాంతంగా గడిపే ప్రయత్నంలో భాగంగా.. ఆర్మీ క్యాంపులు ఏర్పాటు అయ్యాయి. అలా ఏర్పడిందే 'లేక్ చలాన్ టౌన్‌షిప్'. ఇక్కడ అద్భుతమైన ప్రశాంతత లభిస్తుంది. మేము సుమారు 12.30 గంటలకు 'స్టీహికెన్' ప్రాంతానికి చేరుకున్నాం. అదే మా ప్రయాణపు చివరి మజిలీ. అక్కడ ఎన్నో విశేష ప్రదేశాలున్నాయి. రెండు మూడు రోజులు గడపడానికి వచ్చిన వాళ్లంతా దిగి హోటల్స్‌కి వెళ్లారు. మాలాగా తిరుగు ప్రయాణం చేసే వాళ్లు మాత్రం మూడునాలుగు కిలోమీటర్ల దూరంలోని 'రైన్‌బో ఫాల్స్' చూసేందుకు రెడీగా ఉన్న బస్సు ఎక్కాం.

మాతోపాటే ఒక గైడు కూడా బస్సెక్కి ప్రయాణిస్తున్నంత సేపూ హాస్యోక్తులతో అందరినీ ఉత్సాహపరిచాడు. మేము వెళుతున్న బస్సును ఓ అరవై అయిదేళ్ల ముసలావిడ నడపడం మరో విశేషం. 312 అడుగుల ఎత్తు నుంచి పడుతున్న 'రైన్‌బో ఫాల్స్'ను చూడటం ఒక మధురానుభవం. అద్భుతమైన ఆ జలపాతం కింద నిలబడి ఆ దృశ్యాన్ని ఎంతోసేపు చూశాం. ఇక్కడికి రావడానికి బస్సే కాదు, అద్దె సైకిళ్లు కూడా దొరుకుతున్నాయి. హిల్ వ్యూ తిలకించేందుకు హెలికాప్టర్ సౌకర్యం కూడా ఉండటం విశేషం.

ఈ హార్బరులో శీతాకాల జింకల పార్క్, ఆ జింకల కోసం గడ్డిపెంచే స్థలాలు, అవి అగ్నికి ఆహుతి కాకుండా ప్రత్యేక ఏర్పాట్లు కూడా ఉన్నాయి. మంచు కాలంలో స్కేటింగ్ చేసే ప్రదేశాలు, గొర్రెల ఫామ్స్ లాంటివి ఎన్నో ఉన్నాయిక్కడ. తిరుగు ప్రయాణంలో పాతకాలం నాటి బ్రిటిష్ స్కూలును చూశాం.
తెల్లగా, పొట్టిగా ఉన్న గైడ్ చార్లీచాప్లిన్‌లా టోపీ పెట్టుకుని.. భలే చమత్కారంగా కనిపించాడు. మేమంతా అక్కడి నుంచి తిరిగి 1.30 గంటలకు బోట్ వద్దకు చేరుకుని, అందులోనే భోజనం చేశాం. ఇక్కడి ప్రకృతిరమణీయతను నెమరేసుకుంటున్నప్పుడు మాకందరికీ పాపికొండలే గుర్తొచ్చాయి. అందుకే ఈ ప్రాంతానికి మేమంతా కలిసి 'అమెరికా పాపికొండలు' అని ముద్దు పేరు పెట్టుకున్నాం. ఆ సంతోషంతోనే రాత్రికి ఇల్లు చేరుకున్నాం.


- డా. జింగరి నరహరి ఆచార్య
ఫోన్: 9866650184

Wednesday, December 28, 2011

అందాల ప్రకృతికి....‘అరుణో’దయం

అక్కడ పేరొందిన పురాతన కట్టడాలు ఎక్కువగా లేవు. చారిత్రాత్మక ఆలయాలకూ ఆ ప్రాంతం ఒకింత దూరమే... అయితే... బౌద్ధ చైత్రాలకు మాత్రం పెట్టింది పేరు. ఎటు చూసినా నిండా పరుచుకున్న పచ్చదనంతో... నీరెండకు మిలమిలా మెరిసిపోయే మంచు శిఖరాల అందాలతో ఆ ప్రాంతం పర్యాటకులను ఇట్టే ఆకట్టుకుంటుంది. భానుడి తొలి కిరణాలు పరుచుకునే ఆ ఈశాన్య సౌందర్యం పేరే... అరుణాచల్‌ ప్రదేశ్‌.
http://www.indialine.com/travel/images/arunachal.jpg
అరుణాచలప్రదేశ్‌ భారతదేశంలో హిమాలయ పర్వత ప్రాంతాలలో వున్న రాష్ట్రాలలో ఇది ఒకటి. ఇది సరిహద్దు రాష్ర్టం. దీనికి తూర్పున చైనా, బర్మా, పశ్చి మాన భూటాన్‌, దక్షిణాన అస్సాం, ఉత్తరాన చైనా సరి హద్దు దేశాలుగా వున్నాయి. ఇది ఎన్నో గిరిజన భాషలమ యంగా వుంది. ఇందులో 330 కి.మీ. జాతియ రహదారి ఉంది. ఇది అతి తక్కువ జనాభాగల ప్రాంతం. ఇందులో అనేక రకాల జాతులు కలగాపులగంగా వున్నాయి. ఒకప్పుడు దీనిని రహస్య ప్రదేశం అని అనేవారు. ఇక్కడ నదీ ప్రవాహాలు, కొండ ప్రాంతాలు ఎక్కువ. http://www.tourotravel.com/wp-content/uploads/2010/09/Roing-Arunachal-Pradesh.jpg
కొండ శిఖరాలు మంచుతో కప్పబడి ఎంతో మనోహరంగా వుం టాయి. యాత్రికులను ఆకర్షించేందుకు ఎన్నోరకాల అవ కాశాలు వున్నాయి. ఈ ప్రాంత ప్రజలు మంగోలియా, టిబెట్‌, బర్మా వంశాది జాతులుగా వుంటారు. అపటానీస్‌ కాంపిటీస్‌ పద్మాజ్‌, మిరీస్‌ జాతులవారు వున్నారు. ఇం దులో ఎక్కువ భాగం బౌద్ధులు. అరుణాచల ప్రదేశ్‌లో నృత్యం జీవితంలో ప్రధాన భాగం. వీరు చేసే నృత్యం యుద్ధానికి సంబంధించినట్లు వుంటంది. అరుణాచలర్‌ ప్రదేశ్‌ వెళ్లాలంటే... అస్సాం గుండా వెళ్ళాలి. ఈ రాష్ట్రం లోని ప్రధాన రైల్వేస్టేషన్‌ రంగ్‌పారలఖింపూర్‌ నార్త్‌, డ్రిబూఘర్‌, ధిమ్స్‌కియా, నహర్క్‌టియా ఇవన్నీ కూడా అస్సాంలోనే వున్నాయి. https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEgaI7eCRuYUJwy0oImuFp5BHx4ZFC7crixKlwFdpi_ZGiepaXD6OrZ2L_5fudd8eo9mIuq6vbQt0r8lcqsV6CrmbnGZWQKjZ8b5KtFDcla-OBvAqVt2C5hwmCa30R3NU5iEAYBaW3wVCP1A/s1600/hilltribal.com.jpghttp://travel.india.com/wp-content/uploads/2011/11/Switchbacks_Himalayas_Arunachal_Pradesh.jpg
దీనికి దగ్గరలో వున్న విమానా శ్రయం గౌహతి, తేజపూర్‌, డిబ్రూఘర్‌ ఈ మూడు ప్రదే శాలు కూడా అస్సాంలోనే వున్నాయి. అన్ని రకాల విహార కేంద్రాలకి వెళ్ళాలన్నా టాక్సీలోనే వెళ్లాలి. అరుణా చల్‌ప్రదేశ్‌కు ఏ విధమైన చారిత్రక రికార్డులు లేవు. కాని దీనికి సాహిత్యం కొన్ని చారిత్రక శిథిలాలు దీని సరిహ ద్దులలో ఉన్నాయి. దీని ఫలితంగా ఎన్నో చారిత్రక శిథిలా లు క్రీస్తుశకానికి ముందువి కనిపించాయి. ఈ ప్రాంతపు ప్రజలు మిగిలిన ప్రాంతపు ప్రజలతో సంబంధాలు వున్నట్లు ఎక్కడా కనిపించలేదు.

చూడవలసిన ప్రదేశాలు...

 http://www.hotelkhoj.com/media/upload/image/hotelstate/Arunachal-Pradesh/ujjayanta-palace.jpg 

తవాంగ్‌ చేరేందుకు 200 మైళ్ళు హిమాలయ పర్వతాలపై ప్రయాణం చేయాలి. ఇక్కడ వున్న భిన్న భిన్న సాంస్కృతులు కెలడియో స్కొపుకు కలసి కలగాపులగం గా కనిపిస్తాయి. తేజపూర్‌ నుంచి ఇక్కడకు 80 నిమిషాల లో హెలికాప్టర్‌ మీద ప్రయాణం చేయవచ్చు. హెలికాప్టర్‌ లో ప్రయాణం చేస్తే రోజు రోడ్డు మీద కనిపించే ఎన్నో సుందరదృశ్యాలు చూడలేని వారం అవుతాం. తవాంగ్‌ లోని ప్రతి ఒక్క భాగాన్ని చూడాలంటే మూడు రోజులు చాలవు. http://travel.sulekha.com/india/arunachal-pradesh/photos/arunachal-pradesh-6.jpg
ఇవన్నీ చూడాలంటే తేజపూర్‌లో వుండి 5 రోజులపాటు చూడాలి. ఈ ప్రాంతం గుండానే అనాది కాలంలో టిబెట్‌ నుండి బ్రహ్మపుత్ర మైదాన ప్రాంతాలకు తేజపూర్‌ ద్వారా ఇక్కడకు వస్తారు. శారిదార్‌ సాంప్రదా యక వ్యాపార కేంద్రం. ఇక్కడ నుండి నమెరివైల్డ్‌ లైఫ్‌ రిజర్వ్‌కు ఏనుగుల రక్షిత ప్రదేశం. భరేలి నది ఎప్పుడూ ప్రవహిస్తుందో, ఎప్పుడు ప్రవహించదో ఎవరికి తెలి యదు. కొన్ని సందర్భాలలో ఈ నదీ ప్రవాహానికి యాత్రి కులు కొట్టుకుపోయిన సందర్భాలూ వున్నాయి.

అంతా అరణ్యాచలమే...

 http://www.t2northeastindia.com/includes/images/arunachal_pic2.jpg 

అస్సాం, అరుణాచలప్రదేశ్‌లను విభజించే భలుక్‌ పాండ్‌ తేజపూర్‌కు 60 మేళ్ళ దూరంలో నది ఒడ్డునగల ప్రదేశం ప్రతి శీతాకాలంలోనూ ఇక్కడకు యాత్రికులు, వినోద పర్యాటకులు వస్తారు. వీటిని చూసేందుకు ఏ విధమైన అనుమతి అక్కరలేదు. ఎంతో ఆసక్తిదాయకమైన బొమ్మ డాల బులెన్‌ పొంగ్‌కు 100 కి.మీ. దూరంలో ఉంది. ఇక్కడ నుంచే హిమాలయా పర్వతాలకు పర్వతారోహణ ప్రారంభిస్తారు. బొమ్మడాల నుంచి 109 కి.మీ. దాటిన తరువాత నిజమైన పర్వతారోహణ ఆరంభం అవుతుంది. 13828 అడుగులు ఎత్తు వరకు కారు మీద ప్రయాణం చేయవచ్చు. ఇక్కడి రోడ్లు సరిగా వుండవు. సంగ్రిల్లా, బైసాకి, ఆర్మి స్థావరాలు దాటిన తరువాత గాలి ఒక్కసారి చల్లబడిపోతుంది. http://travel.sulekha.com/india/arunachal-pradesh/bhalukpong/bhalukpong/photos/arunachal-pradesh-21.jpg
ఈ కొండపై ఒక గుడి వుంది. ఈ గుడి ని హిందూ బౌద్ధులు సమానంగా పూజిస్తారు. ఈ రెండు కూడా ఒకదానికొకటి కలుసుకుని వుంటాయి. ఇంకొం చెం దూరంలో 3వది వుంటుంది. దీనికి దగ్గరలో పైన్‌ అడవులు వున్నాయి. ఇక్కడకు 21 కి.మీ. దూరంలో జస్వంత్‌ఘర్‌ ఒక సైనిక యుద్ధ మ్యూజియం వుంది. తవాంగ్‌లోయ తవాంగ్‌ చైత్యానికి 57 కి.మీ. దూరంలో వుంది. లహుగ్రామం చైనా సరిహద్దు ప్రాంతం అయిన బరల్లాను కలిసి వుంటుంది.

ఇక్కడ అతి పెద్దదైన యుద్ధ స్మారక చిహ్నాలు వున్నాయి. తవాంగ్‌ పట్టణానికి వాలుగా హిమాలయ పర్వత సానువులు వున్నాయి. దక్షిణాన తవాంగ్‌చూ నది ప్రవహిస్తుంది. తూర్పున కొన్ని కొండ శిఖరాలు వున్నాయి. ఇవన్నీ కూడా అవకాశం చేత కప్ప బడి వుంటాయి. అన్ని కూడా పూర్తిగా మంచుచేత కప్పబడి వుంటాయి. పసుపుపచ్చని తవాంగ్‌ చైత్యం కనిపిస్తుంటుంది.

బౌద్ధానికి ఆలవాలం...

 http://www.iitg.ernet.in/scifac/rsw/public_html/tawang_monastery_entrance.jpg 

తవాంగ్‌ చైత్యం 16వ శతాబ్ధిలో నిర్మితమైంది. గెల్‌ గుపా జాతికి చాలా బలహీనమైన కేంద్రం. ఇది ఈ ప్రాంతాన్ని 400 ఏళ్ళ నుం డి ప్రభావితం చేస్తోంది. ఇది హిమాలయ ప్రాంతంలోని భిన్న బౌద్ధ వర్గాలవారిని స్థానిక ప్రజలను ఆకట్టుకుంది. ఇక్కడ వున్న బుద్ధ ప్రధాన ఆచార్యులను నీరాలామా అంటారు. ఆయన ఈ చైత్యం కట్టేందుకు కారకుడు. నీరాలామా తమ వర్గాన్ని మిగిలిన వర్గాల వారితో పోట్లాడేందుకు స్థిరమైన స్థావరంగా దీనిని నియ మించారు. నీరాలామా దలైలామాతో చర్చించి గెల్గ్‌పాను ఈ ప్రాంతంలో బలోపేతం చేసి ఆయన ఆశీర్వాదం పొందారు. http://travel.paintedstork.com/blog/image/buddha_tawang_monastery.jpg
నీరా లామా మొదట కోర్టుగాను తరువాత మత విషయక చైత్యంగాను తయారు చేశాడు. అన్ని రకాల వర్గాల ప్రజలతో పోరాడేందుకు బౌద్ధ సన్యాసులకు ప్రజలకు సైనిక శిక్షణ ఇచ్చాడు. వీరికి 13 బ్రెస్‌ సిరిల్‌ ఇచ్చేవాడు. అందులో 10 కి సైనికంగా చేరేందుకు ఇస్తారు. ఖచ్చితంగా ఏ తేదీన ఈ చైత్యం నిర్మించారనేది తెలియ టం లేదు. సోనా ప్రస్తుతం దక్షిణపు టిబెట్‌లో వున్న సోనా చైత్యం లామాలు తవాంగ్‌కు వచ్చి ఇక్కడి అగ్ని గుండాల వద్ద కూర్చుని వెళ్ళేవారు. 26 అడుగుల ఎత్తు బౌద్ధ విగ్రహాన్ని తమకు అప్పగిం చవలసిందని సోనాలామా లుతవాన్‌ చైత్యాధికారులను అడిగారు. వారు అంగీకరించలేదు. తవాంగ్‌కు చెందిన అనేక ప్రాచీన వ్రాతప్రతులను సోనాలామాలు బలవంతంగా ఎత్తుకుపోయారు.

వాటిలో తవాంగ్‌ చరిత్ర కూడా వుంది. ఈ బంగారు బుద్ధ విగ్ర హం నేడు చూడవచ్చు. వచ్చిన యాత్రికులు వినోద పర్యాటకులు ఫోటోలు తీయవచ్చు. ఇప్పటికి ఈ చైత్యపు గ్రంథాలయంలో అనేకమైన బౌద్ధ వ్రాతప్రతులు వున్నాయి. వీటిలో ఎక్కువభాగం బంగారు సిరాతో రాసినవి. ఎక్కువ భాగం ఎర్రటి గుడ్డతో చుట్టారు. ఎవరయినా యాత్రికులు అడిగితే దానిని ప్రార్థనలు చేసి వాటిని తీసి చదువుతారు. ఈ మొత్తపు గ్రంథాలయపు భవనాన్ని పునరుద్ధరించారు.

లోపల మండలాలు చక్రాలు, కప్పులు పైకప్పు లకు రంగులు వేశారు. ముడ్జిలింగ్‌ అరవదలైలామా పుట్టిన ప్రదేశం దీనికి కొంచెం దూరంలోనే వుంటుంది. ఇక్కడ పెద్ద చెట్టు అయిదవ దలైలామా కాలం నాటిది ఇంకా వుంది. దీనికి కొంచెం దూరంలో సంగే ర్యాబ్‌ గెల్లింగ్‌ సత్రం దీనికి దగ్గరలో వుంది. ఇదంతా చెట్లతోటి నింది వుంది. ప్రస్తుతం ఈ ప్రాంతం అడవు లుగాను నరికివేశారు. కిన్‌మే చైత్యం హిమాలయ పునర్నిర్మాణం. ఇది న్యాంగ్‌పా వర్గంవారిది. ఇది ఈ ప్రాంతంలోని చాలా ప్రాచీన చైత్యం. ఇది తైవాన్‌ బుంలా సింషోర్‌ను నది దగ్గర వుంది. ఇక్కిడ నుండి సాయంకాలం నది వద్దకు నడిచి వెళ్ళవచ్చు. ఇది ఒక గంట నడక.

Tourism in Itanagar
ఐతానగర్‌...
ఇది అరుణాచలప్రదేశ్‌కు రాజధాని. ఇది పెద్ద చారిత్రక పట్టణం. ఇది డాన్‌లిట్‌ మౌంటెన్‌ పర్వత భూమి అని అందరికి తెలుసు. ఇది మాయాపూర్‌ అని 14, 15 శతాబ్ధాలలో పిలిచేవారు. అదే నేటి ఐతానగర్‌, ఇక్కడ ఐతానగర్‌ కోట బుద్ధిస్ట్‌ చైత్యం, జవహర్‌లాల్‌ మెమోరియల్‌ మ్యూజియం, జూ, క్రాఫ్ట్‌ సెంటర్‌, సహర్‌లగూంలో పోలో పార్క్‌ బోటింగ్‌ సౌకర్యాలు ట్రెక్కింగ్‌కు ఇవి ఎంతో అనువైన ప్రదేశం.

తవాంగ్‌
assam--bihu
http://www.traveldealsfinder.com/wp-content/uploads/44339061_india_tribal2_416afp.jpg
ఇది అరుణాచల ప్రదేశ్‌కు వాయువ్యాన వున్న చిన్న పట్టణం. దీనికి ఒకపక్క చైనా రెండవ పక్క భూటా న్‌లతో కలిసి ఉంటుంది. సాధారణంగా ఈ పట్టణాన్ని యుద్ధ సమయాలలో తప్ప మిగిలిన సమయాలలో దీనిని గురించి ఆలోచించరు. ఇది ఎంతో విశాలమై చలికాలంలో మంచుతో కప్పబడి ఉంటుంది. వేసవి కాలంలో పచ్చగా వుంటుంది. ఇక్కడ అకస్మాత్తుగా పడే జలపాతాలు సరస్సులు ఈ తవాంగ్‌లో సరిహద్దులోని మైదాన దృశ్యాలు ఎంతో కష్టంగాను, అందంగాను వుంటాయి. ఇక్కడ 1962లో యుద్ధం (ఇండియా - చైనా) జరిగింది. ఇక్కడ నుండే దలైలామా భారతదేశంలోకి ప్రవేశించారు. 17వ శతాబ్ధిలో బౌద్ధమతంలోని భిన్న వర్గాల మధ్య స్పర్థలు వచ్చాయి. http://www.asianwindow.com/wp-content/uploads/2009/12/tawang-monastery.jpg
మీరాలామా అనే బౌద్ధ సన్యాసి తన తెగకు చెందిన గులుక్‌పా వర్గపు సన్యాసు లను రక్షించుటకై ఒక కోటను నిర్మించాడు. అది నేడు తవాంగ్‌ చైత్యం అని పిలుస్తున్నారు. తరువాత బౌద్ధ సన్యాసులు ఒంటిగా ఈ సత్రంలో నివాసం వుంటున్నా రు. ఇది ఇండియాలోని అతి పెద్దదైన బుద్ధ చైత్యము. ఇందులో 500 మంది బౌద్ధులు వుంటున్నారు. ఇది ప్రభుత్వపు నియమనిబంధనల వల్ల చాలా కాలం పాటు విహార యాత్రకు నోచుకోలేదు. ఇది ఎంతో అందమైన ప్రదేశం. కొన్ని సంవత్సరాల పాటు తవాంగ్‌కు ఎక్కువ గా విదేశీ యాత్రికులు చూసేందుకు అనుమతించారు. హెలికాప్టర్‌ ప్రయాణం దీని ప్రయాణ కాలాన్ని ఎంతో తగ్గించింది. ఈ ప్రాంతంలో బౌద్ధులు యుద్ధాలు ఈ ప్రాంతం చరిత్రను తిరగరాస్తూనే వున్నాయి. ఇక్కడ ప్రజలు తమ స్నేహితులకు వెన్న, టీ ఇచ్చి తరువాత క్షేమ సమాచారాలు అడుగుతుంటారు.Anwesa Chakraborty - A Lake in Arunachal Pradeshhttp://www.tourotravel.com/wp-content/uploads/2010/09/ziro.jpg
జీరో....
ఇది సబన్‌సిరి జిల్లాకు రాజధాని. ఇది సముద్ర మట్టానికి ఎంతో ఎత్తున వున్న చేపల చెరువు. పైన్‌, వాసాలు అడవులు ఇక్కడ వున్నాయి. వరి ఎంతో ధనవంతులు భోజనం చేసే పదార్థం. విమానంలో తేజపూర్‌ వెళ్ళి అక్కడ నుండి వెళ్ళాలి. నార్త్‌ లఖింపూర్‌ దీనికి దగ్గరలోని రైల్వేస్టేషన్‌. బస్సులో ఐతానగర్‌ నుంచి నహరియాగన్‌లో వెళ్ళవచ్చు.