ఆకాశాన్ని తాకుతున్నట్లుండే ఎతె్తైన పర్వతశ్రేణులు... కనుచూపుమేర పరుచుకున్న పచ్చదనం... అక్కడ అడుగుపెట్టగానే చల్లని పిల్లతిమ్మెరలు ఒడలికి ఒక విచిత్ర అనూభూతిని కలిగిస్తాయి... చల్లని వాతవరణం... చుట్టూ పచ్చని చెట్లు... రంగురంగుల పక్షుల కిలకిలరావాలు... ఆ అనుభూతే వేరు. రాష్ట్రంలో ఉన్న ఎకైక వేసవి విడిదికేంద్రం హర్సిలీ హిల్స్. సముద్రమట్టానికి 1314 మీ ఎత్తులో ఉన్న ఈ అద్భుత విహారకేంద్రం... పచ్చని అడువులు, ఔషధ గుణాలు కల చెట్లుతో అలరారుతోంది. గ్రీష్మతాపంతో తల్లడిల్లుతోన్న ప్రజలు ఆహ్లాదకర వాతావరణంలో సేదదీరడానికి, మధురానుభూతులను మిగుల్చుకోవడానికి వచ్చే జనసందడితో నేడు హార్సిలీ హిల్స్ కళకళ లాడుతోంది
ఆహ్లదకర వాతావరణం, ప్రకృతి సౌందర్యం హార్సిలీహిల్స్ ప్రత్యేకతలు. ఇక్కడికి వేళ్ళే కొండ దారి.. వంకలు తిరిగి ఎంతో అందంగా వుంటుంది. రెండువైపులా నీలగిరి వంటి అనేక జాతుల చేట్లు, కొండ చుట్టూ అడవులు, కం టికి ఇంపుగా కనిపించే సువిస్తారమైన పచ్చదనం మదిని పులకరింప చేస్తాయి.
మత్తేకించే పూల ఘమఘమలు...
హార్సీలీహిల్స్.. సువాసనలను వెదజల్లే సంపంగి పూలకు ప్రసిద్ది. సంపెంగ సువాసనలతో హర్సిలీ హిల్స్ ఘమఘమలు పర్యాటకులను మరో ప్రపంచం లోకి తీసుకేళ్తాయి. వీటితోపాటిగా చందనం, ఎర్రచందనం, కలప, రీటా, శీకా కాయ, ఉసిరిగ చెట్లు ఇక్కడ కోకొల్లలుగా వున్నాయి.
ఆ పేరు ఎలా వచ్చిందంటే...
ప్రస్తుతం చిత్తూరు జిల్లాలో వున్న ఈ ప్రాంతం.. ఒకప్పుడు కడప జిల్లాలో వుం డేది. కడప అసలే వేడి ప్రదేశం. బ్రిటీషు హయంలో కలెక్టర్‌గా వున్న డబ్ల్యూ.డి హర్సీలీ వేసవి తాపాన్ని తట్టుకునేందుకు ఎక్కువగా ఇక్కడికి వచ్చేవారు. ఆయ నకు విశ్రాంతి నిలయంగా వున్న ఈ ప్రాంతం కొన్నాళ్ల తరువాత మెల్లగా ఆయ నకు వేసవి నివాసంగా మారిపోయింది. అన్ని ఆధికారిక కార్యక్రమాలు అక్కడి నుంచే సాగేవి. దీంతో ఈ కొండ ప్రాంతాలకు ‘హర్సీలీహిల్స్’గా పేరు ముద్ర పడిపోయింది. 1863లో ఆయన వేసివి విడిదిగా ఇక్కడ ఒక ఇంటిని నిర్మిం చారు. దీనిని ఫారెస్టు బంగ్లా అంటారు. అ తరువాత కార్యలయ భవనం నిర్మిం చారు. ఈ భవనాలు ఇప్పటికీ నివాసా యోగ్యంగా వుండి వాడుకలో వుండడం విశేషం! ఫారెస్టు బంగ్లాలోని 4 గదులలో ఒక దానికి హర్సీలీ పేరు పెట్టారు.
ఆహ్లాదాన్నిచ్చే చల్లగాలులు...
చల్లని పిల్లగాలులు పర్యటకుల శరీరాన్ని తాకుతూ వేళ్తుంటే ఆ అనుభూతే వేరు. తూర్పు కనుమలలోని దక్షిణ భాగంలో విస్తరించిన కొండలే హర్సీలీ కొండలు. చలికాలంలో 3 డిగ్రీల సెంటీగ్రేడ్ నుంచి మండువేసవిలో 30 డిగ్రీల సెంటీగ్రేడ్ వరకు ఉష్ణోగ్రత వున్న ఈ ప్రాంతం, చల్లటిగాలిలో తేలుతూ వచ్చే సంపెంగల సువాసనలు పర్యాటకులను ఈ ప్రాంతానికి మళ్ళీమళ్లీ రప్పిస్తాయి. దట్టమైన చెట్లు, విస్తారమైన పచ్చిక బయళ్లు జనాన్ని అకర్షిస్తాయి. ఇలా వివిధ రకాల చెట్లు, చేమల మధ్య చెంచుజాతి కి చెందిన వారు ఈ ప్రాంతలో జీవనం సాగిస్తున్నారు. హర్సీలీకొండల వాలుపై సంపెంగ పూల మొక్కలను నాటింది ఈ చెంచులే.
చూడముచ్చటైన చెంచు జానపదం...
ఈ విహర స్థలానికి ఏనుగు మల్లమ్మ కొండ అనే పేరు కూడా ఉంది. జాన పదుల కథనం మేరకు పూర్వాశ్రమమంలో మల్లమ్మ అనే చిన్నారిని గజరాజు రక్షిస్తూ వుండేవాడట. కొండమీద చెంచులకు ఏ ఆపద వచ్చినా, జబ్బులు వచ్చినా చిన్నారి మల్లమ్మ అభయ హస్తం ఇచ్చి కాపాడేదట. ఉన్నట్టుండి ఒక రోజు చిన్నారి మల్లమ్మ అదృశ్యంమైంది. కొండా, కోనా, వాగు-వంకా, చెట్లు - పుట్ట వెతికి వేసారిపోయిన చెంచులు ఆమెకు కోవెల కట్టి, తమ ఇలవేల్పుగా చేసుకొని ఈ నాటికి కొలుస్తూనే వున్నారు. నేటికి కొండమీద వున్న బస్టాండ్ సమీపంలోని మల్లమ్మ కోవెలలో నిత్యం ధూపదీప పూజార్చనలు జరుగుతూ వుండడం చెంచుల అచంచల భక్తికి నిదర్శనం. ఏటా చెంచులందరూ... పర్యా టకులు, పరిసర గ్రామీణులతో కలిసి నేటికి ఏనుగు మల్లమ్మ జాతర అంగరం గ వైభవంగా జరుపుతారు.
అరుదైన వన్యసంపద...
భూతల స్వర్గాన్ని తలపించే అందాలతో పాటు 152 సంవత్సరాల వయస్సు కల్గిన ‘కళ్యాణి’ - అనే పేరుగల యూకలిప్టస్ చెట్టు ఇక్కడ ప్రధాన అకర్షణలలో ఒకటి. 1859లో డబ్ల్యూ.డి.హర్సీలీ నాటిన ఈ వృక్ష రాజం ఎత్తు 40 మీటర్ల పైమాటే. దుప్పులు, అడవికోళ్ళు, నక్కలు, ఎలుగుబంట్లు, గజరాజులు, కుందే ళ్ళు, కొండ ఎలుకలు, జింకలు, చిరుతపులులు, లేళ్ళు, అడవి పిల్లు లతో కూడిన అత్యంత అకర్షణీయ మైన వన్యమృగ కేంద్రం పర్యాటకు ల మనసును కట్టిపడేస్తుంది. ఆంధ్ర ప్రదేశ్ పర్యాటక శాఖ ఏర్పాటు చేసి న ‘పున్నమి’ వేసవి విడిది బంగ్లా ముందు కాండాలు కలిసిపోయి రెం డుగా చీలి ఏపుగా పెరిగిన రెండు మహవృక్షాలు చూపరులను అలరి స్తాయి. మొసళ్ళు మిసమిసలాడు తూ పర్యాటకుల వైపు ఎగబాకే క్రోకడైల్ పూల్ చూపరుల ఒళ్లు జలదరింపజేస్తుంది. రంగురంగుల ఈకలతో చిటారి శబ్దాలు చేసే పక్షి కేంద్రంతో పాటు జింకల పార్కు అల రిస్తుంది. ప్రేమికులు మనసు విప్పి మదిలోని ఊసులను గుసగుసలాడడానికి హర్సీలీహిల్స్‌లో వేదికాగా మారిన ‘గాలిబండ’ పైనుంచి మంచుకురిసే వేళా సూర్యోదయం, సూర్యాస్తమయం చూసే పర్యాటకులకు గుండె ఝల్లుమన డం ఖాయం. ఇక ఏనుగు మల్లమ్మ కోవెల అందాలు చెప్పనలివి కానివి.
సాహసవీరుల ఖిల్లా...
హర్సీలీహిల్స్ సాహసవీరులకు అరుదైన అవకాశం కల్పిస్తుంది. ట్రెక్కింగ్, రాక్‌క్లైంబింగ్, బంజీ రన్నింగ్, గోర్బింగ్, రాపెల్లింగ్, బర్మాబ్రిడ్జి వాకింగ్, బర్మాలూప్స్, ఎర్త్‌కేక్ లాంటి సాహసకృత్యాల కోసం విదేశాలకు, లేదా పక్కరాష్ట్రాలకు పరుగు తీయాల్సిన అవసరం లేదు. ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ ఇలాంటి అవకాశాలను హర్సీలీ హిల్స్‌పై కల్పించడంతో పాటు పగలు, రాత్రివేళల్లో అక్కడే గడేపే విధంగా ప్యాకేజీలను రూపోందించింది. ఇక వసతి, భోజన సౌకర్యాలను కూడా ఆశాఖ ఏర్పాటు చేసింది. పిల్లలు ఆడుకొవడానికి వీలుగా ప్లేగ్రౌండ్, పెద్దలకు బార్, సిమ్మింగ్‌పూల్ మొదలు ఆర్డర్ ఇస్తే గంటలో వేడి వేడిగా వండివార్చే హోటల్స్ ఇక్కడ వున్నాయి. అంతేకాక పర్యాటకుల జిహ్వ చాపల్యానికి తగినరీతిలో... మైమరిపించే రాయలసీమ స్పెషల్ ‘సంగ టి-నాటుకొడి కూర’ క్షణాల్లో అందించే ప్రైవేట్ కుక్స్ కూడా ఇక్కడ ఉండడం విశేషం.
వసతి సౌకర్యాలు...
పర్యాటక శాఖ పున్నమి రిసార్ట్‌స, హరితా హిల్స్ రిసార్ట్‌స, గవర్నర్ బంగ్లా, ఫార ెస్టు బంగ్లా, చిత్తూరు సహకార సమాఖ్య అతిధి గృహం, ఎ.డి.సి క్వార్టర్స్ ఇలా లెక్కకు మించిన కాటేజీలు ఇక్కడ వున్నాయి. వీటితో పాటు హెల్త్ కబ్ల్, మసాజ్ సెంటర్ కాన్షరెన్సు హల్, స్విమ్మింగ్ పూల్ కూడా అందుబాటులో వున్నాయి. పర్యాటకులకు మరిన్ని వివరాలు అందించడానికి 09440272241, 08571 27932324 నెంబర్లుకు సిద్ధంగా ఉన్నాయి.
ఇలా చేరుకోవాలి...
విమానల ద్యాదా వచ్చే దూరప్రాంత పర్యాటకులు బెంగళూరు లేదా తిరుపతి విమానశ్రయాలకు చేరుకొని, అక్కడి నుంచి రోడ్డు మార్గం ద్యారా మదనపల్లికి చేరుకొని హార్సీల్‌హిల్స్ వెళ్ళవచ్చు. రైలు మార్గం ద్వారా వచ్చే ప్రయాణీకులు మదనపల్లె రోడ్ రైల్వే స్టేషన్‌లో దిగి అక్కడి నుండి రోడ్డు మార్గం ద్వారా హార్సీలీ హిల్స్ చేరుకోవచ్చు. మదనపల్లి నుంచి దాదాపు ప్రతి అరగంటకు ఒక బస్సు వుంది. అలాగే అద్దె వాహనాల్లో కూడా కొండ మీదకు వేళ్ళవచ్చు.
- ఎస్.ఎం.రఫీ, మదనపల్లి
కర్టసీ : సూర్య Daily
No comments:
Post a Comment