విహారాలు

India

Gamyam

Showing posts with label Tamilanadu. Show all posts
Showing posts with label Tamilanadu. Show all posts

Monday, March 5, 2012

శ్రీరామసేతుకు ఆరంభ కేంద్రం.. ధనుష్కోడి

దక్షిణ భారతదేశంలో అత్యంత పేరెన్నికగన్న తమిళనాడులోని రామేశ్వరానికి దగ్గరల్లో... శ్రీలంకకు వారధి పట్టణంగా ప్రసిద్ధిగాంచిన ధనుష్కోడి ఓ చిన్నగ్రామం. కానీ పర్యాటకంగా ఈ గ్రామానికి ఎంతో ప్రత్యేకత ఉంది.

Dhanushkodi
http://farm3.static.flickr.com/2375/2740412037_25cb4c2fd5.jpg
ధనుష్కోడి, పాంబన్‌ వంతెనకు ఆగ్నేయంగా ఉన్నది. రామేశ్వరం నుండి ధనుష్కోడి వరకూ ఉన్న రైల్వే లైను 1964లో సంభవించిన పెనుతుఫానులో, ప్రయాణీకులతో సహా కొట్టుకుపోయింది. 
http://lh4.ggpht.com/--2SsLo7yNk0/TYmy9YQRKxI/AAAAAAAABTg/vOUHK5WRjC0/pamban_9.JPG
ఆ తరువాత రైల్వే లైనును పునరుద్ధరించినా, ఆరు పెద్ద ఇసుక తిన్నెలు పట్టాలను కప్పివేయగా దాన్ని ఉపయోగించడం నిలిపివేశారు.
http://www.subramaniansuresh.com/images/20081006205938_dhanuskodi%20beach.jpg
 ప్రస్తుతం ధనుష్కోడికి సముద్రతీరం వెంట కాలినడకన లేదా ఇసుకతిన్నెలపై జీపు ద్వారా చేరుకోవచ్చు. పూర్వం కాశీ తీర్ధయాత్ర, రామేశ్వరాల్లో పూజచేసి, ధనుష్కోడి వద్ద మహోదధి (బంగాళాఖాతం), రత్నాకర (హిందూ మహాసముద్రం) ల సంగమస్థలంలో పవిత్రస్నానం చేయనిదే పూర్తికాదని భావించేవారు.http://tn.ellamey.com/Ramanathapuram/image/dhanuskodi3.jpg
http://www.gotachance.com/ram_bridge.jpg
సేతు ధనుష్కోడి నుండే ప్రారంభమవుతుంది. సంస్కృతంలో సేతు అనగా వంతెన. ఇప్పుడు సేతు అనగా రామాయణంలో రాముడు లంకను చేరుటకు నిర్మించాడని భావిస్తున్న వారధి అనే ప్రత్యేకార్ధం కూడా వచ్చినది. 
http://2.bp.blogspot.com/-dsWGwvKI85A/Tg2Nx3sLjkI/AAAAAAAAR4I/a-lgbfE0XXU/s1600/DhanuskodiMap.jpg

Tuesday, January 10, 2012

ఔషధ గుణాల జలపాతం కుట్రాళం

తమిళనాడులోని టెంకాశికి తూర్పుగా 73 కి.మీ. దూరంలో తిరునల్వేలి వుంది. తిరునల్వేలి నుంచి దక్షిణానికి కన్యాకుమారి వరకు ఉత్తరాన విరుద్ధనగర్‌ మధురైల మీదుగా చెన్నైకి రైలు మార్గం వుంది. కన్యాకుమారి నుంచి టెంకాశికి బస్సులు వున్నాయి. కన్యాకుమారి నుంచి తిరుసల్వేలికి రైళ్ళు ఉన్నాయి. కుట్రాళం అందాలను చూడాలి అనుకుంటే ఒకరోజు మొత్తం కేటాయించవలసి వుంటుంది.
http://www.bloggersbase.com/images/uploaded/original/15c41340297d1c85951872256416766d6da97163.jpeg
కుట్రాళం జలపాతం వున్న ప్రాంతం అంతా పడమటి కనుమలలోని ఒక భాగం. ఈ కొండలలో ఎక్కడో పుట్టిన ఒక జలధారి వర్షపు నీటితో కలిసి పెద్ద ప్రవాహంలాగా పారుకుం టూ వచ్చి ఇక్కడ వున్న కొండ చివర నుంచి జలపాతంలాగా పడుతూ ఉంటుంది. కొండ మీద వున్న అడవులలో పెరిగే రకరకాల ఔషధుల మొ క్కలు, చెట్లను కలుపుకుంటూ ఉంటుంది. ఇక్కడ నీరు ఎంతో నిర్మలంగా స్వచ్ఛంగా వుంటుంది. ఈ నీటిలో శారీరకంగా కలిగే అనేక జబ్బులను నయం చేసే గుణం వుంది. దీర్ఘరోగంతో బాధపడుతూ వుండేవారు ప్రతిరోజూ ఈ ప్రవాహంలో స్నానం చేస్తూ వుంటారు. ఈ జలపాతం పడే చోట చిన్న కోనేరులాగా ఏర్పడింది. ఈ జలపాతం నిజానికి మూడు దశలుగా వుంటుంది. ఇక్కడ స్నానం చేసే కొలనులాంటిది ఆఖరు దశ. ఈ కొలనుకు కొంచెం ఎగువగా అంటే కొండకు పై భాగాన మరొక జలపాతం వుంది. ఇదే నీరు అక్కడ కూడా ఎత్తు నుంచి పడుతూ ఉంటుంది. దీనిని తమిళంలో ‘అంజివళి’ అంటారు. ఇక్కడకు వెళ్ళాలంటే కొంచెం కొండ ఎక్కి వెళ్ళాలి.http://www.filmapia.com/sites/default/files/filmapia/pub/place/courtallam-kutralam-waterfallssouth-indias-most-natural-spa-21359659.jpg
ఈ అంజివళికి సుమారు అయిదు, ఆరు కి.మీ. దూరంలో ఈ అయిదు ధారలు జన్మించిన చోటు వుంది. ఈ స్థలం కూడా ప్రవాహానికి అసలు జన్మస్థలంకాదు.చుట్టూ వున్న కొండలలో పడ్డ వర్షపు నీరు పల్లంగా వున్న ఈ ప్రాంతానికి అన్ని వైపుల నుంచి ప్రవహించుకుంటూ వచ్చి ఇక్కడ అయిదు ధారలుగా ప్రవహిస్తూ వుంటాయి. చెట్ల మధ్యగా రాళ్ళమీదుగా వున్న ఎగుడు దిగుడు కాలిబాట. అందువల్ల ఇక్కడి వరకు వచ్చి వెళ్ళడానికి కనీసం ఐదు గంట లకు తక్కువ పట్టదు. అందువల్ల ఇక్కడకు ఎవరు రారు.
ఈ జలపాతం వున్న కొండలు పడమటి కనుమలలోని భాగం అని చెప్పబడ్డది. ఈకొండల వరుస దక్షిణంగా మరొక నలభై మై ళ్ళు సాగిపోయి కన్యాకుమారికి సుమారు 30 కి.మీ. ముందుగా తూర్పు కనుమల కొనకు కలుస్తాయి.

టెంకాశికి తూర్పుగా 60 కి.మీ. దూరంలో వున్న తిరునల్వేలి చాలా పెద్ద నగరం. దక్షిణ తమిళనాడులో ఈ తిరునలివేలి పెద్ద జంక్షన్‌. ఈ ఊరిలో కూడా నెల్లియప్పన్‌ దేవాలయం అనే గొప్ప ఆలయం వుంది. పూర్తి దారు శిల్పాలయిన ఈ ఆలయం చాలా బాగుంటుంది. గుడి ఆవరణ చాలా పెద్దది. ఈ ఆలయానికి ఆనుకుని తమిళనాడులోని రెండవ పెద్ద నది అయిన పెరియార్‌ నది ప్రవహిస్తుంది.
http://www.bloggersbase.com/images/uploaded/original/d16d74e3473958a47dc3604e23658d7a41fadcb9.jpeg
కొండ మీద వున్న అడవులలో పెరిగే రకరకాల ఔషధుల మొక్కలు, చెట్లను కలుపుకుంటూ ఉంటుంది. ఇక్కడ నీరు ఎంతో నిర్మలంగా స్వచ్ఛంగా వుంటుంది. ఈ నీటిలో శారీరకంగా కలిగే అనేక జబ్బులను నయం చేసే గుణం వుంది. 
- Courtacy - సూర్య Daily 

Wednesday, July 13, 2011

జలపాతాల నిలయం... కుట్రాలం

ప్రకృతి సిద్ధంగా ఏర్పడి పైనుంచి జాలువారే జలపాతంలో తడుస్తూ స్నానం చేయడమంటే ఇష్టపడని వారుండరంటే అతిశయోక్తి లేదు. పైనుంచి పడే నీటిధారలో నిలబడి స్నానం చేస్తే ఆనందంతో పాటు మనసుకు ఎంతో ప్రశాంతత చేకూరుతుందనే విషయం అందరికీ తెలిసిందే. అందుకే పర్యాటకులు జలపాతాలను సందర్శించడానికి ఎక్కువ మక్కువ చూపుతుంటారు. అయితే.. అలాంటివి ఓ ఏడు జలపాతాలు ఒకే చోట దర్శనమిస్తే.. ఇక పర్యాటకులకు పండగే మరి. అలాంటి ప్రదేశమే కుట్రాలం. తమిళనాడులో ఉన్న ఈ ప్రాంతంలో ఒకే చోట ఏకంగా ఏడు జలపాతాలు పర్యాటకులను మంత్రముగ్ధుతను చేస్తున్నాయి. మరి ఆ జలపాతాల్లో జలకాలాటకు సిద్ధమేనా? అయితే పదండి...


new_farms
వారాంతాల్లోనూ, సెలవురోజుల్లోనూ జలపాతాలున్న ప్రదేశాలను సందర్శించడానికి పర్యాటకులు ఎంతో ఉత్సాహాన్ని చూపిస్తుంటారు. ఇంతగా పర్యాటకులకు ఇష్టమైన జలపాతాలతో పాటు ఆద్యాత్మికత కూడా కలగలిసిన ప్రదేశం ఉంటే అక్కడ పర్యాటకుల సందడి ఏ మేరకు ఉంటుందో మనం అర్థం చేసుకోవచ్చు. అలా ఆద్యాత్మికాన్ని, ప్రకృతిసిద్ధ జలపాతాలను తనలో ఇముడ్చుకున్న అద్భుతమైన ప్రదేశమే కుట్రాలం. తమిళనాడు రాష్ట్రంలోని ప్రముఖ పట్టణమైన తిరునల్వేలికి దాదాపు 60 కిలోమీటర్ల దూరంలో ఈ కుట్రాలం ప్రాతం కొలువై ఉంది. ఏడాది పొడువునా ఈ కుట్రాలాన్ని పర్యాటకులు సందర్శిస్తూనే ఉండడం విశేషం.

కుట్రాలం ప్రత్యేకతలు...

కుట్రాలం పేరు చెప్పగానే జలపాతాల హోరుతో పాటు అక్కడ వెలసిన కుట్రాల నాదర్‌ స్వామి ఆలయం అందరికీ గుర్తుకు వస్తుంది. నటరాజు అవతారం కూడా అయిన ఆ పరమేశ్వరుడు కుర్తాల నాదర్‌గా ఇక్కడ వెలిశారని పురాణాలు పేర్కొంటున్నాయి. కుర్తాలంలోని శివలింగాన్ని పురాణకాలంలో అగస్త్య మహర్షి స్వయంగా ప్రతిష్టించారని పురాణాలు చెబుతున్నాయి. కుర్తాలంలోని ఆలయాన్ని తమిళ రాజ్యాధిపతులైన చోళ, పాండ్య రాజులు అభివృద్ధి చేసినట్టు ఇక్కడి శిలాశాసనాలు చెబుతున్నాయి. అత్యంత రమణీయంగా నిర్మించబడ్డ ఈ ఆలయంలోని శిల్పసంపద చూపరులను ఇట్టే కట్టిపడేస్తుంది. కుర్తాలంలోని కుర్తాల నాదర్‌గా వెలసిన పరమేశ్వరుడితో పాటు కొలువైన అమ్మవారిని వేణువాగ్వాదినీ దేవి అని పిలుస్తారు. ఈమెతో పాటు పరాశక్తి కూడా ఇక్కడ కొలువై ఉంది. ఇక్కడ కొలువైన పరాశక్తి అమ్మవారి పీఠం 51 ధరణీ పీఠాల్లో ఒకటిగా విలసిల్లుతోంది. ఈ ఆలయంలో శివుడు లింగాకారంలో వెలసినా ప్రధాన పూజలు మాత్రం నటరాజ స్వరూపానికే జరగడం ఓ విశేషం.

జలపాతాల నెలవు...

Tenkashi_Kutralam
కుట్రాలంలో కుట్రాల నాదర్‌ స్వామి తర్వాత మనల్ని మరింత పులకరింపజేసేది ఇక్కడ ఉన్న జలపాతాలు. పశ్చిమ కనుమల్లోని తిరుకూడమ్‌ ప్రాంతంలో పుట్టిన చిత్తరువి అనే నది కొండ కోనల్లో ప్రవహిస్తూ తన ప్రధాన నది అయిన శివలప్పెరి అనే నదిలో కలిసేముందు కుట్రాలంలోని వివిధ ప్రదేశాల్లో ఏడు జలపాతాలుగా ప్రవహిస్తుంది. అత్యంత అద్భుతంగా కానవచ్చే ఈ ఏడు జలపాతాల్లో కొన్ని అత్యంత ప్రమాద ప్రదేశాల్లో జాలువారే కారణంగా కొన్నిచోట్ల మాత్రమే పర్యాటకులు జలపాతాల్లో స్నానం చేయడానికి అనుమతిస్తారు. కుట్రాలంలోని జలపాతాల్లో తనివితీరా స్నానం చేసేందుకు ఏడాది పొడవునా పర్యాటకుల తాకిడి ఉంటూనే ఉంటుంది.
http://www.bloggersbase.com/images/uploaded/original/6941031133fcb0d04bd1bd891ba0a1e9294e193a.jpeg
కుట్రాలం ప్రాతంలో జాలువారే ఏడు జలపాతాల్లో ప్రధానమైంది కుట్రాల నాదన్‌ ఆలయానికి సమీపంలోనే ఉంది. దాదాపు 60 మీటర్ల ఎత్తు నుంచి జాలువారే ఈ జలపాతాన్ని పర్యాటకులు చూడడానికి మాత్రమే అనుమతి ఉంది. కుట్రాలంలోని జలపాతాల్లో సిత్తరవి అనే జలపాతం పర్యాటకులు స్నానం చేయడానికి అనువుగా ఉంటుంది. ఇక్కడ పర్యాటకులు నిరభ్యంతరంగా స్నానం చేయవచ్చు. కుట్రాలంలోని మరో జలపాతానికి ఓ ప్రత్యేకత ఉంది. పెద్దదైన ఈ జలపాతం ఐదు పాయలుగా క్రిందికి జాలువారుతుంటుంది. అందుకే దీనిని ఐదు జలపాతాలు అనే పేరుతో పిలుస్తుంటారు. ఈ జలపాతం వద్ద కూడా పర్యాటకులు స్నానం చేయడానికి అనుమతి ఉంది.
https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEj36uvk32GDu6KIAEeb-YOfNXEuhyphenhyphenCS8ooMff-xkPwJ-pN0x7goVPJ6JHjbeXhnUHEh_Yyr678ewuWHsAaFZ-GaWUGVZdH8WLcYfzovuihUb7GvlO7U4zREBL0cD7qkMAyEWR35f8ZuyW_-/s320/kutrallam-falls.jpg
‘సౌత్‌ స్పా’ సౌందర్యం కుట్రాలం జలపాతం...
ఎన్నిసార్లు చూసినా తనివితీరని అందం కుట్రాలం జలపాతం సొంతం. కనువిందు చేసే ప్రృతి, ఎత్తయిన కొండల పైనుంచి దుమికే జలపాతాలు, సెలయేటి గలగలలు, ఆహ్లాదపరిచే పచ్చదనంతో ఈ ప్రాంతం ఓ అద్భుతమైన ప్రపంచంలా అనిపిస్తుంది. ఇక వర్షాకాలంలో అయితే కుట్రాలం భూలోక స్వర్గంగా మారుతుందనటంలో అతిశయోక్తి లేదు. సందర్శకుల తాకిడి, వారి హర్షాతిరేకాలతో కుట్రాలం మార్మోగుతూ ఉంటుంది. దక్షిణ స్పాగా వ్యవహరించే ఈ కుట్రాలంలోని జలపాతాలు చాలా ప్రఖ్యాతిగాంచాయి.


Nataraja
ఇక్కడ పలు జలపాతాలు ఉన్నా... వాటిలో మెయిన్‌ శ్హఫాల్స్‌ ప్రధానమైంది. దీనినే స్థానికులు పెరియ అరువి (అరువి అంటే తమిళంలో జలపాతం అని అర్థం) అని పిలుస్తుంటారు. ఈ పెరియ అరువియే కుట్రాలం జలపాతంగా పేరుగాంచింది. దీనికి సమీపంలో షన్బగదేవి, చిట్టరువి, తేనరువి, ఐందరువి, పులి అరువి, పళతోట్ట అరువి, పాత కుట్రాలం, బాలరువి... తదితర జలపాతాలున్నాయి. అయితే వీటన్నింటికంటే కుట్రాలం జలపాతంలో వర్షాకాలంలో సందర్శకుల తాకిడి చాలా ఎక్కువగా ఉంటుంది.

టైగర్‌ ఫాల్స్‌.. గాండ్రింపు..

కుట్రాలంలోని మరో జలపాతమైన టైగర్‌ ఫాల్స్‌కు ఓ ప్రత్యేకత ఉంది. ఈ జలపాతం పైనుంచి జాలువారుతుంటే దాని శబ్ధం పులి గాండ్రింపులా ఉంటుంది. అందుకే ఈ జలపాతానికి టైగర్‌ ఫాల్స్‌ అనే పేరువచ్చింది. ఈ జలపాతంలో సైతం పర్యాటకులు స్నానం చేయవచ్చు. ఇవేకాకుండా కుట్రాలంలో ఇతర జలపాతాలు కూడా పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తాయి.

నటరాజు నర్తించిన నేల...

నటరాజస్వామి నర్తించిన ఐదు సభల్లో ఒకటైన చిత్రసభ కూడా కుట్రాలం వద్దనే కలదు. అలాగే ఈ ప్రాంతంలోని షన్బగదేవి ఆలయంలో ప్రతి చైత్ర పౌర్ణమికి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తుంటారు. వీటిని చూసేందుకే పలు ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు ఇక్కడికి తరలివస్తుంటారు. తేనరువి వద్ద తేనెపట్టులు అధికంగా ఉండటంతో దానికా పేరు వచ్చినట్లు చెబుతుంటారు. ఇది ప్రమాదకరమైనది కావటంతో ఆ ప్రాంతంలోకి సందర్శకులను అనుమతించరు.


Melaittirumanancheri
ఇక ప్రతి సంవత్సరం జూన్‌ నుంచి ఆగస్టు నెల వరకూ కుట్రాలం సీజన్‌ ఉంటుంది. ఈ ఏడాది రుతుపవనాలు ముందుగానే రావడంతో తొలి అర్ధభాగంలోనే కుట్రాలం సీజన్‌ ప్రారంభమయ్యింది. మహిళలు కుట్రాలంలో స్నానం చేసేందుకు వీలుగా ప్రత్యేక వసతులను కల్పించారు. జలపాతాల వద్ద తైల మర్దనం కూడా చేస్తారు. అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా ఉండేందుకు స్థానిక అధికార యంత్రాంగం కట్టుదిట్టమైన చర్యలను తీసుకోవటం వల్ల ప్రశాంతంగా ఇక్కడ సందర్శించవచ్చు. అయితే జలపాతం ఉధృతి పెరిగే సమయాల్లో మాత్రం కుట్రాలం జలపాతాల్లో స్నానాలకు సందర్శకులను అనుమతించరు.

దక్షిణ కాశీ.. తెన్‌కాశి...

కుట్రాలం ప్రాంతంలో చాలా ప్రసిద్ధి చెందిన ఆలయాలు కూడా ఉన్నాయి. దక్షిణ కాశీగా పిలవబడే ఈ కుట్రాలంలో తెన్‌కాశి పట్టణానికి 5 కిలోమీటర్ల దూరంలో కుట్రాలనాథుడుగా కొలువైన శివుడు... కోరిన కోర్కెలు తీర్చే స్వామిగా భక్తులచే నిత్యపూజలు అందుకుంటున్నాడు.అలాగే కుట్రాలంలోని షన్బగదేవి ఆలయంలో ప్రతి చైత్ర పౌర్ణమికి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తుంటారు. వీటిని చూసేందుకే పలు ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు ఇక్కడికి తరలివస్తుంటారు. ఈ ఆలయం సమీపంలోని సిద్ధుల గుహ కూడా ప్రసిద్ధి చెందినదే. నటరాజస్వామి నర్తించిన ఐదు సభల్లో ఒకటైన చిత్రసభ కూడా కుట్రాలం వద్దనే ఉంది. చిట్టూరు, మణి ముత్తారు, పచ్చయారు, తామపర్ణి నదుల జన్మస్థలం కూడా కుట్రాలమే..!


ఎలా వెళ్లాలంటే...
కుట్రాలం, తమిళనాడులోని చెన్నై నగరానికి 620 కిలోమీటర్ల దూరంలోనూ, కన్యాకుమారికి 137 కిలోమీటర్ల దూరంలోనూ, తిరునల్వేలికి 40 కిలోమీటర్ల దూరంలోనూ ఉంటుంది. కుట్రాలానికి ఆరు కిలోమీటర్ల దూరంలో తెన్‌కాశి రైల్వే స్టేషన్‌ ఉంటుంది. అలాగే.. తిరుచ్చి, మధురై, రాజపాళయం, కోవిల్‌పట్టి తదితర ప్రాంతాల నుంచి బస్సు సౌకర్యం కూడా కలదు. కుట్రాలంలో సందర్శకుల సౌకర్యార్థం పలు విడిది గృహాలు కూడా అందుబాటులో ఉంటాయి.

Sunday, April 10, 2011

రామేశ్వరం .... అంతా రామమయమే

మన దేశానికి నలువైపుల ఉన్న పవిత్ర క్షేత్రాలలో రామేశ్వరం ఒకటి. ఉత్తరాన బదరీనాథ్, తూర్పున పూరీ జగన్నాథ్, పడమట ద్వారకలుండగా దక్షిణ సరిహద్దు క్షేత్రంగా రామేశ్వరం వెలసింది. మొదటి మూడూ వైష్ణవ క్షేత్రాలు కాగా, రామేశ్వరం ఒక్కటే శైవ క్షేత్రం. కాశీయాత్ర పుణ్యం దక్కాలంటే అక్కడి గంగా జలంతో రామేశ్వరంలోని లింగానికి అభిషేకం చేయాలంటారు. అలాంటి మహిమగల రామేశ్వరానికి స్నేహితులతో కలిసి గత డిసెంబర్ నెలలో వెళ్లొచ్చాం. అందరం వైద్య వృత్తికి చెందిన వాళ్లం. ఆనాటి విశేషాల సమాహారమే ....

మధురై దాకా విమానంలో వెళ్లి, అక్కడ నుండి రామేశ్వరానికి రానూ పోనూ కార్లు బుక్ చేసుకున్నాం. బయలుదేరిన కొద్ది గంటల్లో మండపం అనే ఊరు చేరాం. అక్కడ నుండి రామేశ్వర దీవికి కారు, రైలు లేదా బోటులో వెళ్లొచ్చు. 'కాసేపటిలో మనమంతా పంబన్ బ్రిడ్జి మీదుగా వెళ్లబోతున్నాం. 2.3 కి.మీ. దూరం సాగే ఈ బ్రిడ్జి మన దేశంలో సముద్రంపై నిర్మించిన అతి పెద్ద బ్రిడ్జి' అని మా డ్రైవర్ చెప్పాడు.

డబుల్ లీఫ్ బాస్కూల్ బ్రిడ్జి

బ్రిడ్జి మీదుగా వెడుతుంటే పరవళ్లు తొక్కుతూ బంగాళాఖాతం ఒకవైపు, ప్రశాంతంగా ప్రవహిస్తూ హిందూ మహాసముద్రం మరోవైపు. బ్రిడ్జి మధ్యకు వెళ్లాక కార్లు ఆపి దిగాము. కొద్దిగా వంగి చూస్తే రైల్వే బ్రిడ్జి కన్పిస్తోంది. దాని పొడువు 6, 776 అడుగులు. 1914 నుండీ వాడుకలో ఉందట. దాని ప్రత్యేకత ఏమంటే ఏదైనా ఒక పెద్ద నౌక ఆ దారిలో వెళ్లాలంటే బ్రిడ్జిని రెండు భాగాలుగా చీల్చి నౌక వెళ్లాక మళ్లీ యథాస్థానానికి తేవచ్చు. దీనిని 'డబుల్ లీఫ్ బాస్కూల్ బ్రిడ్జి' అని అంటారు. 2007 వరకు మీటర్ గేజీగా ఉన్న ఈ రైలు మార్గాన్ని ఇప్పుడు బ్రాడ్ గేజీగా మార్చారు. ప్రతి నెలా కనీసం పది నౌకలు ఈ మార్గంలో వెళ్తాయట.

మా అదృష్టం బాగుండి మేము చూస్తుండగానే కింద బ్రిడ్జి మీదుగా ఒక రైలు రామేశ్వరం వైపు అతి మెల్లగా వెళ్తూ కనిపించింది. మా పిల్లలు తెగ బాధ పడ్డారు. 'అరె మనం కూడా ఆ రైలులో ఉంటే సముద్రం ఇంకా దగ్గరగా కనపడేది కదా' అని. అంతలోనే ఒకాయన సంచిలో అప్పుడే దొరికిన పెద్ద శంఖాలు పట్టుకొని వచ్చాడు. అలవాటు ప్రకారం బేరం చేసి చెరొక శంఖం కొనేసాము. రామేశ్వర ద్వీపం కూడా శంఖం ఆకారంలో ఉంటుందని చెప్పాడతను. 2004లో వచ్చిన భూకంప, సునామీలలో కూడా ఈ పంబన్ బ్రిడ్జి చెక్కు చెదరలేదంటే మన ఇంజనీర్ల ప్రతిభకు జోహార్లు అనుకున్నా.

ధనుష్కోటి ప్రయాణంలో ...

ముందు ధనుష్కోటికి వెళ్లి ఆ తర్వాత రామేశ్వరంలో గుళ్లు చూద్దామనుకున్నాం. ధనుష్కోటి చేరాలంటే కొంత దూరం జీపులో ప్రయాణించక తప్పదు. ముందు కెళ్తున్న కొద్దీ చుట్టూ సముద్రం. సన్నటి ఇసుక దారిలో మా జీపు. 'ఇప్పుడు సునామీ లాంటిది వస్తే' అన్న ఊహ నా మదిలో మెదిలింది కానీ పెదవి విప్పలేదు. తీరా ధనుష్‌కోటి చేరాక చూస్తే అక్కడ సముద్రం ఎంతో ప్రశాంతంగా ఉంది. జీపు అతను అర్ధగంటలో అంతా చూసి వచ్చేయండి అన్నాడు. ఇసుకలో కూరుకుపోతున్న కాళ్లను పైకి లాగుతూ గబగబ అందరూ బీచి వైపు పరుగు తీశాము. అంతలో ఒక చిన్న కొట్టు దగ్గర ఒక పండు ముసలావిడ కనపడింది. వచ్చీరాని నా తమిళంలో ఆమెను ధనుష్‌కోటి వివరాలు అడిగాను.

ఇక్కడ నుండి శ్రీలంక 7 కి.మీ. దూరంలో ఉంది. ఇక్కడి నుండే శ్రీరాముడు తన వానర సేన సాయంతో రామసేతు నిర్మించి లంక చేరాడట. క్రీ.శ.1480 వరకు శ్రీలంకకు అందరూ ఇక్కడి భూమార్గం నుండే వెళ్లేవారట. కానీ కాలక్రమేణా ఎన్నో తుపాన్లు ఈ సేతువుని దెబ్బ తీశాయి. ఇప్పుడు అవి చిన్న దీవులుగా మారి 3 నుండి 4 అడుగుల లోతు నీటిలో ఉన్నాయి. ఇక్కడ సముద్రం కూడా 7 నుండి 11 అడుగుల లోతు మాత్రమే ఉంటుంది కాబట్టి పెద్ద పడవలు రాలేవని, చిన్న పడవలపైనే చేపలు పట్టుకుంటామని ముసలావిడ చెప్పింది. ధనుష్‌కోటిలో అక్కడక్కడ చిన్న గుడిసెలు, పాడుబడిన బంగళాలు, రైల్వే స్టేషన్, చర్చీ లాంటివి ఉన్నాయి. 50 ఏళ్ల క్రితం వచ్చిన అతి పెద్ద తుపాను ధనుష్‌కోటిని మొత్తం తుడిచిపెట్టేసిందని, అదృష్టవశాత్తు సరుకుల కోసం రామేశ్వరం వెళ్లిన తనూ, తన చిన్న మనవరాలూ, మరికొందరు ఊరివాళ్లు బతకి బట్ట కట్టామని, స్వంత ఊరిని వదలలేక ఇక్కడే బతికేస్తున్నామని చెప్పింది.

సైకత లింగావిర్భావం

తరువాత మా మజిలీ రామేశ్వరం గుడి. ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రాలలో ఇది ఏడవది. గుడి సముద్ర మట్టానికి కేవలం పది అడుగుల ఎత్తున ఉంది. ఈ గుడి ఆవిర్భావం వెనకున్న కథనం ఇది - శ్రీరాముడు రావణాసురుని సంహరించాక బ్రహ్మహత్యా పాపాన్ని తొలగించుకోవడానికి రామేశ్వరంలో శివలింగం ప్రతిష్టించాలనుకున్నాడట. శివలింగాన్ని తెమ్మని హనుమను కైలాసానికి పంపాడట. ముహూర్త సమయానికి ఆయన తిరిగి రాకపోవడంతో సీతమ్మవారు ఇసుకతో సైకత లింగం తయారుచేయగా శ్రీరాముడు దానిని ప్రతిష్టించాడట. అంతలో కైలాసం నుండి శివలింగం తీసుకుని వచ్చిన హనుమ సైకత లింగాన్ని తోకతో పెకిలించబోగా శ్రీరాముడు వారించి సమీపంలోనే హనుమ తెచ్చిన లింగాన్ని ప్రతిష్టింపచేశాడట.

'హనుమా, నీవు తెచ్చిన శివలింగానికే మొదటి పూజ, అభిషేకం, నైవేద్యం జరుగుతాయి. ఆ తరువాతే నాది' అని శాంతింపచేశాడట. ఆనాటి ఆ సైకతలింగమే శ్రీరామేశ్వర లింగం. హనుమంతుని లింగం శ్రీ విశ్వేశ్వర లింగం. త్రేతాయుగం నాటి ఆలయం శిథిలావస్థకు చేరగా క్రీ.శ. 12వ శతాబ్దంలో సింహళరాజు పరాక్రమ బాహు దీనిని పునర్నిర్మించాడట.

సేతుమాధవ తీర్థం

ఆలయంలోకి ప్రవేశించేముందు సముద్ర స్నానానికి వెళ్లాం. ఈ సముద్ర స్నాన ఘట్టాన్ని 'అగ్ని తీర్థం' అంటారు. ఇక్కడ సముద్రం ఎంత దూరం వెళ్లినా ప్రశాంతంగా ఒక నదిలా ఉంటుంది. సముద్ర స్నానాలు అయ్యాక తడి బట్టలతోనే అందరం గుడిలోకి నడిచాం. దారిలోనే చిన్న బక్కెట్లు పట్టుకొని తీర్థాలనుండి నీళ్లు చేది తలలపై పోస్తామని కొందరు వెంటపడ్డారు. దంపతులకు 500 రూపాయల చొప్పున మాట్లాడుకుని గుడిలోకి వెళ్లాం. రామేశ్వరంలోని ఆలయ ప్రాంగణంలో 22 తీర్థాలు ఉన్నాయి. వెచ్చగా, చల్లగా ఒక్కొక్క తీర్థంలో ఒక్కో రుచిలో ఉన్నాయి నీళ్లు. ఈ తీర్థాలలో అతి పెద్దది సేతుమాధవ తీర్థం. ఇక్కడి నీటిని తలపైన పోసుకుంటే జన్మజన్మల పాపాలు పోతాయట.

అబ్బురపరచే శిల్పకళా వైభవం

రామేశ్వరం గుడిని రామనాథస్వామి ఆల యం అంటారు. ద్రవిడ శిల్పరీతిలో కట్టారు. గుడి పదిహేను ఎకరాలలో విస్తరించి ఉంది. గోపురం వంద అడుగులది. ఎక్కడ చూసినా అందమైన స్తంభాలు, వాటిపై అత్యద్భుతమైన శిల్పాలు కనబడ్డాయి. దేవాలయంలో మూడు మండపాలను మొత్తం 4000 స్తంభాలతో కట్టారు. ప్రధాన ఆలయంలోని గర్భాలయంలో శ్రీరామలింగేశ్వరుడు ఉన్నాడు. దీనికి ముందువైపు సీతారామలక్ష్మణులు, రెండు చేతులలో రెండు శివలింగాలు కలిగి ఉన్న హనుమ, పక్కనే చేతులు జోడించిన సుగ్రీవుడు కనపడతారు. ఉత్తరంగా ప్రత్యేక గర్భాలయంలో శ్రీవిశ్వనాథస్వామి, సమీపంలో ఆయన దేవేరి శ్రీవిశాలాక్షి కొలువు తీరారు. శ్రీరామలింగేశ్వర స్వామికి దక్షిణాన శ్రీపర్వతవర్ధినీ దేవి అమ్మవారూ, వారి ముందు వైపు ఆదిశంకరాచార్యులు ప్రతిష్టించిన శ్రీచక్రం ఉంది.

తీర్థాల నీటి పుణ్యమా అని గుడిలో అన్ని చోట్ల నేల తడితడిగానే ఉంది. ఆలయ శిల్పకళావైభవాలను మళ్లీ ఒకసారి తీరిగ్గా వచ్చి చూడాలనుకున్నాం. ముఖ్యంగా మండపాలను, స్తంభాల వరుసలను చాలా సినిమాల్లో చూసినట్లు అనిపించింది.

అడుగడుగునా రాముడే

రామేశ్వరానికి రెండున్నర కి.మీ. దూరంలో గంధమాదన పర్వతం ఉంది. ఈ దీవిలోనే ఎత్తైన ప్రదేశం అది. లంక చేరడానికి హనుమ ఈ పర్వతం పైనుండే దూకాడట. ఇక్కడి ఆలయంలో శ్రీరాముని పాదాలను, సీతారామలక్ష్మణ విగ్రహాలను వీక్షించవచ్చు. రాముడు ఒక చేయి పైకి లేపిన ముద్రలో కొలువై ఉన్నాడు. పైనుండి రామేశ్వరం బాగా కనిపించింది.
8 కి.మీ. దూరంలో శ్రీకోదండరామాలయం ఉంది. విభీషణుడు శ్రీరాముని శరణు వేడిందీ, అతనిని వారు లంకాధీశునిగా పట్టాభిషేకం చేసిందీ ఇక్కడేనని చెప్పారు. 1964లో వచ్చిన తుపానుకు తట్టుకుని నిలిచిన పురాతన ఆలయపు రాతి గోడలు గుడి ముందు కనపడ్డాయి. ఈ ఆలయంలోనూ సుందరమైన శ్రీరామ సీతా లక్ష్మణ హనుమ విష్ణువు విగ్రహాలున్నాయి.

రామేశ్వరంలో ఇంకా చూడాల్సినవి జడాతీర్థం, లక్షణ తీర్థం, పంచముఖ ఆంజనేయస్వామి ఆలయం, అబ్దుల్ కలాంగారి ఇల్లు .. ఇలా చాలానే ఉన్నాయి. పొద్దున్నుండి తిరిగి తిరిగి అలిసిపోయిన మా పిల్లలు 'ఇక తిరగలేము, ఆకలో రామచంద్రా' అని మొరపెడుతుంటే 'సరే పదండి' అని ఒక సీ ఫుడ్ రెస్టారెంట్లో దూరాము.
రామేశ్వరంలో వసతి, భోజన సౌకర్యం ఎంతో చవకగా, నాణ్యంగా అనిపించాయి. చక్కటి గవ్వలు, శంఖాలు, గవ్వలతో చేసిన దువ్వెనలు, అద్దాలు విరివిగా దొరుకుతాయి. ముఖ్యంగా శ్రీరాముడు అడుగడుగునా కనపడి మమ్మల్ని తరింపచేశాడు.


- డా. ఎం. రమణి
040 - 2339 1994

Sunday, March 27, 2011

సాగర అందాలకు అగ్రస్థానం... కన్యాకుమారి అగ్రము

వివేకానందుని స్ఫూర్తి క్షేత్రం... మహాత్ముని స్మారక చిహ్నం... ఇవి సముద్ర సోయగాలకు నెలవైన కన్యాకుమారి ని విహారకేంద్రగానే కాక, విజ్ఞాన ఖనిగా మార్చిన అద్భుత నిర్మాణాలు. పర్యాటక భారతావనికి చివరి మజిలీగా... త్రివేణి సంగమ పవిత్ర స్థలంగా... ఆధ్యాత్మిక క్షేత్రంగా ప్రసిద్ధిగాంచిన ప్రకృతి అందాల మణిమకుటం కన్యాకుమారి విశేషాలు...

Thiruvalluvar_Statueమూడు సముద్రాల అరుదైన మేలుకయిక కన్యాకుమారి ప్రధాన ఆకర్షణ. భారత దేశానికి దక్షిణ సరిహద్దుల్లోని కన్యాకుమారి పవిత్ర యాత్రాస్థలంగానే కాకుండా ప్రముఖ పర్యాటక కేంద్రంగా విలసిల్లుతోంది. సముద్ర సోయగాలకు నెలవైన కన్యాకుమారిలో ఉదయాన్నే తన నునులేత కిరణాలతో వెలుగులను ప్రసరింపజేసే సూర్యభగవానుడు, అప్పుడే సముద్ర గర్భం నుంచి ఉద్భవించి పైకి ఎగుస్తున్నాడా అన్నట్లు కనువిందు చేస్తుంటా డు. ముఖ్యంగా పౌర్ణ మి రోజు రాత్రి పూ ట ఏకకాలంలో జ రిగే సూర్యా స్తమ యం, చంద్రో దయాలను చూ సి పులకించని యాత్రికుడుండడేమో.

త్రివేణి సంగమ క్షేత్రం...
కన్యాకుమారిలో బంగాళాఖాతం, మరోవైపు అరేబియా మహాసము ద్రం, దిగువన హిందూ మహాసము ద్రం.. వీక్షకుల్ని పరవశింపజేస్తుం టాయి. సముద్రతీర ప్రకృతి రమణీ యతతో అలరారే కన్యాకుమారి సముద్ర తీరంలోని థోరియం ధాతువుతో కూడిన ఇసుక రేణు వులు పరమేశ్వరుడి అద్భుత శక్తికి ఆనవాళ్లుగా చెబుతుంటా రు. అలాగే వారణాసి పరమశివు డికి నివాస స్థలమైనట్లుగా, కన్యా కుమారి పార్వతిదేవికి నివాస స్థలమని స్థానికుల ప్రగాఢ విశ్వా సం. మూడు మహాసముద్రాల నీరు పార్వతీమాత పాదాలను కడుగుతున్నట్లుగా ఉంటుందని భక్తులు నమ్ముతుంటారు.

ప్రధాన ఆకర్షణలివే...
Triveni_Sangamamకన్యాకుమారిలో చూడదగ్గ పర్యాటక ప్రదేశాలు చాలానే ఉన్నాయి. వాటిలో ముఖ్యమైనవి వివేకానంద రాక్‌, తిరువళ్లువర్‌ విగ్రహం, గాంధీజీ స్మారక మంటపం, కుమరి ఆలయం ముఖ్యమైనవి. అలాగే ఈ ప్రాంతంలో అనేక రకాల అరుదైన పుష్పాలు, వృక్షాలను కూడా చూడవచ్చు. ఇంకా పెలికాన్‌, ఫ్లెమింగ్‌, స్పూన్‌బిల్‌, అనేక రకాల బాతులు.. కన్యాకుమారికి వలస వస్తుంటాయి. ఈ విదేశీ పక్షులు కూడా పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంటాయి.

వివేకానంద రాక్‌...
కన్యాకుమారి పర్యాటనలో ముందుగా చెప్పుకోవాల్సింది వివేకానంద రాక్‌. ఇక్కడ క్రీస్తు శకం 1892లో స్వామి వివేకానంద ధ్యానం చేశారు. ఆయన ధ్యానం చేసిన ఈ ప్రదేశంలో నల్ల చలువరాతితో స్మారక కేంద్రం నిర్మించారు. ఇక్కడ 12 అడుగుల ఎత్తుతో ఉండే వివేకానందుడి కాంస్య విగ్రహం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. 1970వ సంవ త్సరంలో అప్పటి రాష్టప్రతి వి.వి. గిరి ఈ విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ వివేకా నందుడి రాక్‌కు కొంత దూరంలో పార్వ తిదేవి పరమశివుడిని పెళ్లాడేందుకు తపస్సుచేసిన ప్రాంతం, అక్కడ శిలారూ పంలోని ఆమె పాద ముద్రిలు కూడా మనకు దర్శనమిస్తాయి.

తరువళ్లువర్‌ విగ్రహం...
Kanya-Kumari-Ammanవివేకానంద రాక్‌కు సమీపంలోని ఈ విగ్రహం 133 అడుగుల ఎత్తుతో ఉంటుంది. దీనిని 2000 సంవత్సరం లో తమిళనాడు ముఖ్యమంత్రి డాక్టర్‌ కరుణానిధి ఆవిష్కరించారు. ఈ తిరు వళ్లువర్‌ విగ్రహం బరువు ఏడువేల టన్నులు కాగా.. చాలా పొడవైన ఈ విగ్రహాన్ని దర్శించేందుకు పర్యాటకులు పడవలలో వెళ్లాల్సిందే. ఇది ఆసియా లోని ఎతె్తైన విగ్రహాలలో ఒకటిగా పేరుగాంచింది.

మహాత్ముని స్మారక చిహ్నం...

కన్యాకుమారిలో చూడదగిన మరో అద్భుత పర్యాటక క్షేత్రం మహాత్మా గాంధీ స్మారక మంటపం. గాంధీజీ అస్థికల పాత్రను ఉంచిన స్థలంలో 1954వ సంవత్సరంలో ఈ స్మారక మంటపాన్ని నిర్మించారు. మహాత్ముడి జయంతి అయిన అక్టోబర్‌ 2 మధ్యాహ్నం 12 గంటల సమయంలో సూర్య కిరణాలు ఆయన అస్థికలను స్పృశించేలా అద్భుతంగా నిర్మించడం విశేషం.

కుమరి ఆలయం...
Mahatma_Gandhi_Mandapamబాణాసురుడిని సంహరించిన అమ్మవారి కుమరి ఆలయం చూడదగ్గ మరో పర్యాటక ప్రదేశం. మూడువైపులా ఎతె్తైన గోడలున్న ఈ ఆలయంలో మూడు ప్రాకారాలు న్నాయి. ఆలయంలోని ముగ్ధ మోహనదేవి విగ్రహం భక్తులను పరవశింపజేసేలా ఉంటుంది. ఒకప్పుడు దేవి ముక్కెరలోని రత్నపు కాంతి నావికులను ఆకర్షించి నావలు రేవులోని బండరాళ్లను ఢీకొనేవని చెబుతుంటారు. బంగాళాఖాతానికి అభి ముఖంగా ఉండే ఈ ఆలయ ద్వారా న్ని ఎల్లప్పుడూ మూసే ఉంచుతారు. సంవ త్సరంలో ఓ నాలుగైదుసార్లు మాత్రమే ఉత్సవాల సందర్భంగా తెరుస్తారు.

ఆలయ చరిత్ర...
పురాణ కథనాల ప్రకారం కుమరి ఆలయంలో దేవతగా కొలువబడుతున్న కన్యాదేవి, పరమశివుడిని వివాహం చేసు కునేందుకు సిద్ధపడిం దట. అయితే ముహూర్తం సమయా నికి కూడా శివుడు రాకపోవ టంతో విందుకు సిద్ధంచేసి పెట్టుకున్న బియ్యం రాశులను, మిగిలిన వస్తువులను అలాగే ఉంచేశారట. కాలక్రమంలో అవే చిన్న చిన్న రాళ్లుగా, బండలుగా మారిపోయాయని స్థానికుల నమ్మకం. అందుకే ఇప్పటికీ కన్యాకుమారి సముద్రం ఒడ్డున బియ్యాన్ని పోలిన సన్నటి రాళ్లు కనిపిస్తుంటాయని చెబుతుంటారు.

ఇందిరాపాయింట్‌...

కన్యాకుమారి చివరి సరిహద్దును ఇందిరాపాయింట్‌ అని పిలుస్తారు. ఈ ప్రదేశాన్ని చూసేందుకు దేశం నలుమూలలనుంచే కాకుండా, విదేశాల నుంచి కూడా పర్యాటకులు తరలివస్తుంటారు. ముఖ్యంగా ఇక్కడి సూర్యోదయం, సూర్యాస్తమయాలు పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తాయి. అలాగే కన్యాకుమారి శివార్లలోని ఉదయగిరి కోట, విట్టకొట్టాయ్‌ కోటలు ఇక్కడ మరో ఆకర్షణ. కన్యాకుమారికి పది కిలోమీటర్ల దూరంలో ఉండే తమి ళులకు ప్రీతిపాత్రమైన స్వామితోప్‌ పతి ఆలయం భక్తులను ఆకట్టుకుంటుంది.

రొయ్యలకూ ప్రసిద్ధి...
ప్రముఖ పర్యాటక ప్రదేశంగా వెలుగొందుతున్న కన్యాకుమారి ‘రాక్‌ లాబ్‌స్టర్స్‌’ అని పిలిచే భారీ సైజు రొయ్యలకు కూడా ప్రసిద్ధి చెందినది. సగటున రెండు కేజీల బరువుండే ఈ లాబ్‌స్టర్ల ధర 5 వేల రూపాయల పైమాటే. కేంద్ర సముద్ర మత్స్య పరి శోధనా సంస్థ వాణిజ్య ప్రాతిపదికన కేజ్‌ కల్చర్‌ద్వారా ప్రత్యేకంగా పెంచ బడే ఈ లాబ్‌స్టర్లను ఎక్కువగా జపాన్‌, హాంకాంగ్‌ లాంటి ప్రాంతాలకు ఎగుమతి చేస్తుంటారు.

Vivekananda_Rockకన్యాకుమారి, మండపం, కేరళలోని విళింజం వంటి తీర ప్రాంతాల్లోనే ఈ లాబ్‌స్టర్లు ఎక్కువగా దొరుకు తుంటాయి. తీరం నుంచి 3 కిలోమీటర్ల దూరం వరకు సముద్రంలో ఉండే రాళ్ల చుట్టూనే ఉంటాయి కాబట్టి వీటికి రాక్‌ లాబ్‌స్టర్స్‌ అనే పేరు వచ్చింది. ఇవి రాళ్ల చుట్టూ ఉంటాయి కాబట్టి రొయ్యల్లా ట్రాలింగ్‌ చేసి మొత్తం ఊడ్చి పట్టేయడం సాధ్యపడదు. వేరే చేపల కోసం వేసిన వలల్లో ఇవి పడుతూ ఉంటాయి. సెప్టెంబరు-జనవరి మధ్య ఎక్కువగా లభించే వీటిని పట్టుకునేం దుకు మత్స్యకారులు కొన్ని ప్రత్యేక పద్ధతులు అవలంభిస్తుంటారు.

ఇలా వెళ్లాలి...
చెన్నై నగరానికి 743 కిలోమీటర్ల దూరంలో ఉండే కన్యాకుమారి ఎలా వెళ్లాలంటే.. విమాన మార్గంలో అయితే, మధురై నుంచి 250 కిలోమీటర్లు, తిరువనంతపురం నుంచి 90 కిలో మీటర్ల దూరం ప్రయాణించి వెళ్లవచ్చు. చెన్నై నుంచే కాకుండా దేశంలోని ప్రధాన నగరాలైన ఢిల్లీ, ముంబయి, కోల్‌కతాల నుంచి కన్యాకుమారికి నేరుగా రైలు సౌకర్యం ఉంది. తమిళనాడులోని అన్ని ప్రధాన పట్టణాలనుంచి రోడ్డు మార్గంలో ప్రయాణించి కన్యాకుమారి చేరుకోవచ్చు. ఇక వసతి విషయానికి వస్తే.. కన్యాకుమారిలో పలు చిన్న, పెద్ద హోటళ్లు అందుబాటులో ఉన్నాయి. అలాగే తమిళనాడు రాష్ట్ర పర్యాటక శాఖవారి హోటల్‌, దేవస్థానంవారి కాటేజీలు, ట్రావెలర్స్‌ బంగళా, అతిథి గృహాలు.. పర్యాటకులకు అందుబాటు లో ఉన్నాయి. 

కర్టసీ : సూర్య Daily

Thursday, January 6, 2011

కొడైకెనాల్ అందాలు




అందాల పర్వత యువరాణి కొడైకెనాల్లో మిమ్మలిని విహరింపచేయటానికి .........



తమిళనాడులోని పశ్చిమ కనుమల్లో కేరళ సరిహద్దు దగ్గర రెండువేలకు పైగా మీటర్ల ఎత్తులో పళని కొండల్లో వుంది.మనదేశంలో అమెరికన్లు ఏర్పాటు చేసిన ఏకైక హిల్ స్టేషన్ ఇదే.పూర్వం గిరిజనులకు మాత్రమే తెలిసిన ఈ ప్రాంతం అమెరికన్ల వాళ్ళే వెలుగులోకి వచ్చింది.అప్పట్లో దక్షిణ తమిళనాడులో వాళ్ళు చాలా క్రైస్తవ మిషనరీలు నడిపేవారు. కాని వాళ్ళు వేడికి తట్టుకోలేక చాలా మంది రోగాల పాలై చాలా ఇబ్బందిపడే వాళ్ళు.దనితో మదురై సమీపంలో ఎదైనా చల్లని ప్రదేశంకోసం వేట ఆరంభించారు.అలా 1845 ప్రాంతంలో ఈ ప్రదేశాన్ని కనుగొన్నరు.



ఒకొక్కళ్ళు వచ్చి అక్కడ నివశించటం మొదలుపెట్టారు.అలా 1860 అక్కడ మొదటి చర్చ్ ను నిర్మించారు.ఇప్పటికి ఆ చర్చ్ అలాగే వుంది.ఒక మేజర్ అప్పట్లో యూకలిప్టస్ మొక్కలు తెచ్చి కొడై అంతా పాతాడు.అందుకే ఇప్పుడు కొడై ఎక్కడ చూసినా అవే కనిపిస్తాయి.ఎత్తుగా ,ఏపుగా వున్న యూకలిప్టస్,ఫైన్ వృక్షాలు కొడైకి వచ్చే వాళ్ళకి స్వాగతం పలుకుతాయి.



1875లో మద్రాసు నుంచి మదురై కి రైలు వెయ్యటంతో ప్రయాణానికి కొంత వెసులుబాటు కలిగింది.తర్వాత 1914 లో కొండ పైకి రోడ్డు మార్గం ఏర్పడింది.


కొడైలో చాలా ప్రదేశాలు కొడై లేక్ సమీపంలోనే వుంటాయి.

  
కొడైకెనాల్ సరస్సు అందాలు



కొడై సరస్సు 5 కి.మీ విస్తీర్ణం కలిగి వుంటుంది.దాని చుట్టూ కాలి నడకన తిరిగేందుకు 45 నిమిషాలు పడుతుంది.ఇది బస్ స్టాండు నుండి 3 కి.మీ దూరంలో వుంది.వేరా లెవింజ్ అనే ఒకప్పటి మదురై కలక్టర్ తన సొంత డబ్బుతో దీనిని కట్టించాడు.ఇది మొత్తం 60 ఎకరాలలో వ్యాపించి వుంది.ఇది వరకు 11.5 మీటర్ల లోతు వుండే ఈ సరస్సు ఇప్పుడు 9 మీటర్లకి కుచించుకు పోయింది.సరస్సులో విహరించటానికి కొడైకెనాల్ బోట్ క్లబ్ & రోయింగ్ క్లబ్ మరియు తమిళనాడు టూరిజం డెపార్ట్మెంట్ వాళ్ళు బోట్లు ఏర్పాటు చేస్తారు.వాటికి 20 నుండి 125 రూపాయల వరకు వసూలు చేస్తారు.


లేక్ దగ్గరే స్వెటర్లు,మొదలగునవి అమ్మే షాపులు వుంటాయి.ఇక్కడ సైకిళ్ళు అద్దెకి ఇస్తారు.అవి తీసుకొని కొడై అంతా తిరగొచ్చు.


ఇక్కడే గుర్రాలు కూడా వుంటాయి ఆసక్తి వున్నవాళ్ళు పిల్ల గుర్రంపై సరస్సు చుట్టు తిరిగితే 100,సగం రౌండ్ కైతే 50 వసూలు చేసారు.ఇప్పుడు ఎంతో నాకు తెలీదు.బోటింగ్ ఉదయం 9 నుంచి సాయంత్రం 5.30 వరకు అనుమతిసారు.ఇక్కడే ఒక పార్కు కూడా వుంది.దాని పేరు బ్రయంట్ పార్క్ అనుకుంట సరిగా గుర్తు లేదు.చాలా అందంగా వుంటుంది.

ఇంకా సరస్సు దగ్గరే రకరకాల చిప్స్,తాజా కేరెట్లు,వేడి వేడి తినుబండారాలు అమ్ముతారు.

మంచు కురిసే వేళలో కొడై అందాలు

కొడై కెనాల్ అందాలు మంచు కురిసేటప్పుడు మరింత అందంగా వుంటాయి మంచులో తడిసిన ముద్దమందారంలా.మంచులో తడిసిన కొడైని చూసే భాగ్యం కలగటం అదృష్టం.

కొడైలో చూడదగ్గ ప్రదేశాలలో పిల్లర్ రాక్స్ ఒకటి. ఇది లేక్ నుంచి సుమారు 8 కి.మీ.వుంటుంది.మబ్బులు మన పైనే తేలియాడుతున్నట్లు వుంటుంది ఇక్కడ.ఇవి 400 అడుగుల ఎత్తున స్తంభాలులా వుండే మూడు రాళ్ళు.ఇక్కడ డ్రై ఫ్లవర్స్ అమ్ముతారు.

కులుకులొలుకు చెలి చెంతనుండగా ఊటి,కొడైకెనల్ ఏలనో అని పాట వుందిగాని కొడై వచ్చెది ఎక్కువమంది కొత్త జంటలే.

పగలు అప్పుడప్పుడు ఎండ వెచ్చదనాన్ని ఇచ్చినా చలి విపరీతం.కనుక కొడై వెళ్ళేవాళ్ళు తప్పక స్వెటర్లు తీసుకువెళ్ళలి.తీసుకువెళ్ళకపోయినా లేక్ దగ్గర చాలా షాపులు వుంటాయి.బేరమాడి కొనుక్కొవచ్చు.


దట్టంగా మచుకురుస్తుంటే చలి తట్టుకోలేము గాని మంచి మంచి అందాలు కొన్ని అప్పుడే బంధించగలం.మేము బస చేసిన కాటేజిలో వాడు రగ్గులు ఇచ్చినా అవి కూడా చల్లగా అయిపోయి ఆ చలి తట్టుకోలేక చచ్చా.

పొద్దున్నే లేచి మొహం కడుకుందామని బాత్రూంకి వెళ్ళితే ఆ గీజరు ఎలా ఆను చెయ్యాలో తెలియలేదు.ఎవరినైనా లేపుదామా అంటే అందరు మంచి నిద్రలో వున్నారు.సర్లే అని ఆ నీళ్ళు తీసుకొని మొహం కడుకొనేటప్పటికి నా మొహం తెల్లగా పాలిపోయింది ఆ దెబ్బకి.నాకు నచ్చిన విషయం ఎమిటంటే హోటల్లో మాత్రం తాగటానికి వేడినీళ్ళు ఇస్తారు.లేదంటే ఎమయ్యేవాడినో.

ఇది కొడై వెళ్ళే దారిలో.


వెళ్ళినరోజు పొద్దున్నే 5 గంటలకి కొడైలోకి అడుగుపెట్టి టీ తాగటంకోసమని డ్రైవర్ సుమో ఆపి డోరు తీసాడు అంతే చలి మొదలయ్యింది.ఆ డోరు మూసేదాక వూరుకోలేదు.ఇదంతా చదివి మరి చలి తట్టుకోలేని వాడివి అక్కడికి ఎందుకు వెళ్ళవు అనుకుంటున్నారా.ఎంత చలైనా నాకు కొత్త ప్రదేశాలు చూడాలంటే చచ్చేంత ఇష్టం అందుకు.

కొడై అందాలు మరికొన్ని

కొడైలో సొంత వాహనం వుంటే అన్నిచోట్లకి తిరగవచ్చు.లేదా టాక్సిలోనో,సైకిల్లు అద్దెకి తీసుకుని తిరగవచ్చు.మరీ ఎక్కువ సమయం వుంటే కాలినడకన వెళ్ళినా కొడై అందాలు ఎంతో ఆహ్లాదం కలిగిస్తాయి.పక్షులని పరిశీలించేవారికి ఈ ప్రాంతంలో అనేక జాతుల పక్షులు కనిపిస్తాయి.

కొడైలో అందరు మొదట వెళ్ళేది కోకర్స్ వాక్ ఇది కొడైకి వాయువ్య దిశగా సాగే నిట్టనిలువు రోడ్.పొద్దునే ఇక్కడికి చాలా మంది వాకింగ్ కి వస్తారు.

ఇక్కడ ఒక అబ్జర్వేటరి వుంది.బైనాక్లురర్లో కొడై అందాలు వీక్షించవచ్చు.దీనికి ఎదురుగా బ్రయంట్ పార్క్ వుంది.కొడైకి 7 కి.మీ దూరంలో సిల్వర్ కేస్కేడ్ జలపాతం వుంది.ఇది కాక ఇంకా బంబర్,గ్లెన్,ఫెయిరీ ఫాల్స్,బేర్ షొలాఫాల్స్ మొదలైన జలపాతాలు వున్నాయి.

తమిళులు మురుగన్ గా పిలిచే సుబ్రమణ్యస్వామి కోవెల కురుంజి ఆండవర్ కోవెల చూడదగ్గది.


అక్కడినుండి పళని కొడలు,వైగై డ్యాముల అద్బుత దృశ్యాలు కనిపిస్తాయి.కనువిందు చేసే మరో ప్రాంతం పెరుమాళ్ పీక్.కొడైకి 12 కి.మీ దూరంలో వున్న ఇదే కొడై కొండల్లో అతి ఎత్తైన శిఖరం.శెంబగనూర్ మ్యూజియం కూడా చూడదగ్గది.

వర్షంలో తడిసిన కొడై మరింత అందంగా వుంటుంది.కాని వర్షం వస్తే ఎక్కడికి వెళ్ళలేం.


కొడైకి వెళటానికి చెన్నై వెళ్ళి అక్కడనుంచి దిండిగల్ కాని మదురైగాని చేరుకుంటే అక్కడినుంచి సులువుగా చేరుకోవచ్చు.కొడైకెనాల్కి అతి దగ్గర రైల్ స్టేషన్ కొడైరోడ్.ఇది కొండ దిగువున వుంటుంది.ఇక్కడనుంచి 60 కి.మీ దూరం ఘాట్ రోడ్లొ ప్రయాణిస్తే కొడైకెనాల్ చేరుకోవచ్చు. అతి దగ్గరలోని విమానాశ్రయం మదురైలో వుంది.ఇక్కడనుంచి కొడై సుమారు 100 కి.మీ వుంటుంది.


కొడైలో ప్రధానమైన టూరిస్ట్ సీజన్ మే,జూన్.కనుక ఈ నెలల్లో వెళ్ళేవాళ్ళు ముందుగా రూము బుక్ చేసుకోవటం మంచిది.అన్ని తరగతులవారికి తగినవిధమైన కాటేజ్లు,హోటెళ్ళు ఇక్కడ వున్నయి.గ్రీన్ లాండ్స్ యూత్ హాస్టల్ ఎంతో అందమైన ప్రాంతంలో,ప్రసాంతమైన ప్రదేశంలో వుంటుంది.మిగతా వాటితో పొలిస్తే కొంత ఖరీదు తక్కువ కూడా.దీనికన్న తక్కువ ధరలో కూడా గదులు లభించే రిసార్ట్లు వున్నాయి.కొడైలో గోల్ప్ కోర్ట్ కూడా వుందండి.
కేరళలోని మున్నార్ కి కొడైకెనాల్ కి కొంత సామీప్యం వుంది.అదే 12 సంవత్సరాలకొక సారి పూసే నీలకురింజి పూలు.నీలి రంగులో చిన్నగా వుండే ఈ నీలికురింజి పువ్వు పుష్కరానికి ఒక్కసారి మాత్రమే పూస్తుంది.అప్పుడు కొండలన్ని నీలి వర్ణం పులుముకుని మైమరపిస్తాయి.

ఇవి కొడైలో కంటే మున్నార్ లొ ఎక్కువగా పూస్తాయి.అప్పుడు కొడైగాని,మున్నార్ కాని నీలి అందాలతో మనసును కట్టిపడేస్తాయి.నాకు తెలిసి రెండు ,మూడు సంవత్సరాల క్రితం ఈ పూలు పూసాయి.మళ్ళి ఆ పూలు చూడాలంటే కొన్నాళ్ళు ఆగాలి.

కొడైలో లభించే హోం మేడ్ చాక్లెట్లు తప్పక రుచిచూడవలసిందే.ఇవి కొడై ఎక్కడైనా మీకు దొరుకుతాయి.ప్రతి వీధిలో ఈ షాపులు వుండాలిసిందే.కొడైలో కోతులు కూడా ఎక్కువే.


దానికి తగ్గట్టు ఈ ఫొజులు చూడండి.కోతి చేష్టలు అంటే ఇవేనేమో.

అన్నట్లు చెప్పటం మరిచాను కొడైలో ఐస్ క్రీం షాపులు కూడా వున్నాయండి.నేను తినలేదు మీరు వెళితే ట్రై చెయ్యండి.ఈ కోతి చూసారా ఐస్ క్రీం లాగించేస్తుంది.

అదండి కొడై గురించిన విశేషాలు.