విహారాలు

India

Gamyam

Showing posts with label Agra. Show all posts
Showing posts with label Agra. Show all posts

Tuesday, January 10, 2012

బృందావనం

బృందావనం అనగానే శ్రీకృష్ణూడు, గోపికలు గుర్తుకు వస్తారు. బాల్యంలో యశోదా తనయుడు ప్రదర్శిం చిన లీలలెన్నో మదిలో మెదలు తారుు. ఇక్కడి సందర్శనీయ ప్రాంతాలెన్నో ఆనాటి కృష్ణలీలలతో ముడిపడినవే. గోపికా వస్ర్తాపహరణం, రాసలీల తదితరాలన్నీ ఇక్కడో చోటు చేసుకున్నట్లు భక్తులు భావిస్తుంటారు. సందర్శిం చేందుకు ఎన్నో ఆలయాలు కూడా ఉన్నాయి. దగ్గర్లోనే మరెన్నో చారిత్రక, పర్యాటక, ఆధ్యాత్మిక ప్రాధాన్యం ఉన్న స్థలాలు కూడా ఉన్నారుు. ఉత్తర భారతదేశ యాత్రలో తప్పని సరిగా దర్శించాల్సిన పుణ్యక్షేత్రమిది.

Vrindavan

బృందావనం అంటే గుర్తుకొచ్చేది శ్రీకృష్ణుడే. ఇది పురాణాలలో యాత్రిక కేంద్రంగా ప్రసిద్ధమైనది. మధుర క్రీ.పూ. 2వ శతాబ్ధంకు పూర్వపుదని అక్కడి ఆర్కియాలజికల్‌ సర్వే వారు తెలిపారు. ఇది యమునా నది ఒడ్డున ఆగ్రాకు 72 కి.మీ. దగ్గరలో జాతీయ రహదారి 2కు జాతీయ రహదారి లక్నోకు 431 కి.మీ. దూరంలో ఢిల్లీకి దక్షిణాన 151 కి.మీ. దూరాన ఉంది. వ్రజ కృష్ణుడు వున్న ప్రదేశం. ఇది విష్ణుమూర్తి 9 అవతారాలలో ఒక అవతారం. ఆయన తన బాల్య చేష్టలను పుట్టుకను ఇక్కడే చూపించాడు. ఈయన ఇక్కడే తన మొదటి చిత్ర విచిత్ర కార్యాలు చూపించాడు. ప్రపంచం అంతా యాత్రికులు మధుర నుంచి ఇక్కడకు వస్తారు. ఆయనను దత్తత తీసు కున్న తల్లిదండ్రులు నంద యశోదులు బృందావన వాసులు. నందుడు కృష్ణుని సురక్షిత ప్రాంతానికి తీసుకువెళ్ళాడు. కృష్ణుడు రాసలీలలు ఆడాడు. గోవర్ధన గిరి ఎత్తాడు.

Place-Mathura 

భక్తులు ఇక్కడకు వచ్చి శ్రీ కృష్ణుని ప్రార్థించుకుంటారు. ఆనాడు గోపికలు ఇక్కడ కృష్ణునితో ఆటలాడుకున్నారు. యమునా నది ఎన్నో పట్టణాలకు ఆధా రం. దీనికి సమీపంలో పట్టణాలు, ఆశ్రమాలు ఇంకా ఎన్నో ఉన్నాయి. ప్రతి గుడి కూడా సాయంత్రం హారతి ఇవ్వడంతో ప్రారంభం అవుతుంది. కృష్ణుడు అర్జునునికి చివరి సందేశం ఇక్కడే ఇచ్చాడు. అదే భగవద్గీత.ప్రాచీన మందిరాలు ఇక్కడ వున్న అతి పెద్ద ప్రాచీన మదన్‌ మోహన్‌ జీ దీనిని ఎ.యస్‌.ఐ. వారు పునరుద్ధరించారు. ఇది బృందావనంలో అతి ప్రాచీనమైన గుడి. ఈ గుడిని ఎక్కుతున్న కొద్ది మన ప్రాచీన ప్రాభవ వైభవ జ్ఞాపకాలను గుర్తుకు తెస్తుంది. ఆ శిథిలాలలో తిరుగుతుంటే క్రీ.శ. 516లో నిర్మించిన దేవళం కనిపిస్తుంది. 1580లో అది ఇంకా వాస్తవ రూపాన్ని ధరించింది. కృష్ణ విగ్రహం రాధా, దామోదరన్‌ గుడిలో వుంది. ఇక్కడ ఎంతో మంది యోగ సమాధులున్నాయి. ఇందులో ఎక్కువ భాగం గోస్వాములవి.

Krishna 

వీరిలో ఏడుగురు గోవర్ధన్‌ పరిక్రమకు చెందినవారు. వారు రోజు 35 కి.మీ. కంటే ఎక్కువ దూరం నడిచి వచ్చేవారు. శ్రీకృష్ణుడు వారికి కలలో కనిపించేవాడు. ఇప్పటికి అక్కడ శ్రీ కృష్ణుడు వారికి కలలో కనిపించేవాడు. ఇప్పటికి అక్కడ శ్రీకృష్ణుని అడుగుజాడలుంటాయి. ఒక యువ గురుస్వామి మీరాబాయిని వ్యంగ్యంగా మాటలాడగా ఆమె అతడు సిగ్గు పడేట్లు చేసింది. ఇక్కడ మీరాబాయి గుడి జీవసమాధి ఉంది. ఇక్కడ ప్రాచీనాతి ప్రాచీనమైన గోవిందరాయ గుడి వుంది. ఇది వాస్తురీత్యా ఎంతో గొప్ప గుడి. రంగ్‌జి సోనేకిపల్‌కి ఇస్‌కాన్‌ వారి గుడులు కూడా వున్నాయి. ఈ పవిత్ర ప్రదేశంలో నిశ్శబ్ధం అన్ని చోట్ల తాండవిస్తుంది. ఇక్కడ గంటల తరబడి శీతాకాలంలో కూర్చోవచ్చు. ఇక్కడ రకరకాల నమ్మ కాలు ఉన్నాయి. ఫ్రిబవరి, మార్చి సమయంలో అక్కడ రాసలీల ఉత్సవం జరు గుతుంది. యుక్త వయస్కుల రాసలీలతో పాటు కోలాటం దృశ్యాలు ఎంతగానో అలరిస్తాయి.

మధుర...
ఇది బృందావన్‌కు 12 కి.మీ. దూరంలో వుంది. ఇది కృష్ణుని జన్మస్థలం. దేవకి, వసుదేవులకు జన్మించాడు. శ్రీకృష్ణుడు చెరసాలలో పుట్టాడు. ఇప్పుడు ఆ చెరసాలను శ్రీ కృష్ణ జన్మభూమి అంటారు. ఇది మధుర కాంప్లెక్స్‌లో వుంది. ఈ గుడిని శ్రీకృష్ణునికి అంకితం చేశారు. ఇది మధుర పద్ధతిలో నిర్మించిన సాంసృ్కతిక భవంతి. ఇక్కడ గవర్నమెంట్‌ మ్యూజియంలో ప్రపంచ ప్రసిద్ధి చెందిన మధుర శిల్పాలను ప్రదర్శిస్తారు. మధుర జైన బుద్ధ సంసృ్కతుల సమ్మేళనం.

గోకుల్‌...
Place-Mathura0 

మధురకు 10. కి.మీ. దూరంలో వుంది. ఇక్కడ కృష్ణుడు పెరిగాడు. దీనికి చేరువలోనే గోకుల ఆగమన్‌ ఉత్‌కల్‌ బంధన్‌, ఉత్న మోక్ష బ్రహ్మఘాట్‌ ఇక్కడ వున్నాయి. శ్రీ కృష్ణుని నోట్లో ప్రపంచం అంతా ఇక్కడే యశోద చూసింది. మఖన్‌లీలా అష్టశఖ లీలలు ఇక్కడ కృష్ణుడు ప్రదర్శించాడు. బరాముని గుడి కూడా ఇక్కడ ఉంది.

గోవర్ధనగిరి....
ఇక్కడకు 30 కీ.మీ. దూరంలో వుంది. ఈ కొండపై చిన్న చిన్న ఇళ్ళు చెట్లతో వున్నవి నిర్మించారు. గిరిరాజ మహరాజ్‌ ముఖర్‌బిండ్‌ ఈ ప్రాంతాన్ని సందర్శించాడు. దీనికి కొంచెం దూరంలో తబలా శబ్ధాలు వినిపిస్తాయి.

- Courtacy - సూర్య Daily

Monday, August 23, 2010

పర్యాటక దిగ్గజం... ఫతేపూర్‌ సిక్రీ

Buland-Darwaja
ఉత్తర భారతదేశంలోని ప్రముఖమైన పర్యాటక ప్రాంతాల్లో ఆగ్రాను ప్రముఖంగా చెప్పవచ్చు. ఉత్తర్రపదేశ్‌లోని యమునానదీ తీరాన వెలసిన ఈ నగరంలో ప్రపంచ ప్రఖ్యాతి చెందిన అనేక పర్యాటక ప్రదేశాలున్నాయి. అయితే ఆగ్రా పేరు చెప్పగానే మొదటగా గుర్తుకు వచ్చేది తాజ్‌మహల్‌. ప్రపంచం యావత్తూ చూడాలని తపించే పాలరాతి కట్టడం కాకుండా ఈ నగరంలో ఇంకా అబ్బురప రిచే పర్యాటక ప్రదేశాలు ఎన్నో ఉన్నాయి. వాటిలో చెప్పుకోదగ్గ ప్రదేశం ఫతేపూర్‌ సిక్రీ నగరం.

తాజ్‌మహల్‌తో పాటు ఆగ్రా కోట, ఫతేపూర్‌ సిక్రీ లాంటి పర్యాటక ప్రాంతాలు ఆగ్రాను ప్రముఖ పర్యాటక ప్రాంతంగా మార్చాయి. యునెస్కోచే ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తింపు పొందిన ఈ ప్రదేశాలు ప్రపంచపర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. ఇక ఫతేపూర్‌ సిక్రీ విషయానికి వస్తే... భారతదేశాన్ని మొఘలులు పాలించిన కాలంలో ఆగ్రాలో పైన పేర్కొన్న ప్రపంచ ప్రఖ్యాత కట్టడాలెన్నో నిర్మించారు. అక్బర్‌ కాలంలో నివాసయోగ్యంగా నిర్మించబడిన ఓ సుందర నగరమే ఈ ఫతేపూర్‌ సిక్రీ.

The_Panch_Mahal
అక్బర్‌ కాలంలో 1571 నుంచి 1585 వరకు ఈ నగరం రాజధానిగా విలసిల్లింది. ఈ నగరాన్ని సందర్శించిన పర్యాట కులకు ఇక్కడ నిర్మించబడిన అనేక కట్టడాలు విపరీ తంగా ఆకట్టుకుంటాయి. ఈ నగరంలోని బులం ద్‌ దర్వాజా, ఐదు అంతస్థుల పంచమహల్‌, సలీం చిష్తీ సమాధిలాంటివి చూడదగిన ప్రదేశాలు. అద్భుతమైన నగిషీలతో నిర్మించ బడిన ఈ నగరంలో కట్టడ వైభవం అడుగడుగునా సందర్శకుల ను విశేషంగా ఆకట్టుకుంటుంది. ఈ పర్యాటకకేంద్రాన్ని సంద ర్శించడానికి భారతీయ పర్యాటకులే కాక విదేశీ పర్యాటకులు సైతం ఎంతో మక్కువ చూపుతారు.