విహారాలు

India

Gamyam

Showing posts with label Himalayas. Show all posts
Showing posts with label Himalayas. Show all posts

Tuesday, January 10, 2012

పక్షిప్రేమికులకు స్వర్గధామం బిన్సార్‌

ఇది కొండ పైనున్న వైల్డ్‌ లైఫ్‌ శాంక్చ్యువరి. అల్మోరాకు 33 కి.మీ. దూరంలో ఉంది. 7913 అడుగుల ఎత్తున ఉంది. జాతీయ రహదారి ఖురాంపూర్‌ వయా హవూర్‌, జయ, మొరాదాబాద్‌ల మీదుగా, జాతీయ రహదారి 87 కతగూడెం, రాష్ట్ర కపర్‌ఖాడ్‌ వయా భోవాలి, ఖైర్నా, అల్మోరా, జిల్లా రహదారి బిన్సార్‌కు చేరవచ్చు.

Binsara 

ఇది ప్రశాంత వాతావరణంలో కమాన్‌లో ఉన్న వైల్డ్‌ లైఫ్‌ శాంక్చ్యువరి. ఇక్కడ పక్షుల కిలకిలారావాలు యాత్రికులను పొద్దున్నే నిద్రలేపుతాయి. నిమిషాల్లోనే వాటిలో అవి సంభాషించుకొని వెళ్ళిపోయాయా అన్నట్లు వెళ్ళిపోయి నిశ్శబ్దాన్ని కలిగిస్తాయి. బిన్సార్‌ దగ్గరవుతున్న కొద్ది చల్లదనం, ఆహ్లాదాన్ని పొందవచ్చు. సంతోషాన్ని కలిగించే సుగంధం, ఓక్‌లు, దేవదార్‌ చెట్లు దగ్గరి నుంచి చూడవచ్చు. ఇది ఎన్నో సుందరవిహార, విలాస కేంద్రాల ద్వారా యాత్రికులకు, పర్యాటకులకు ఆనందాన్ని పంచి ఇస్తుంది. కేదారనాథ్‌, బదరీనాథ్‌, శివలింగం, త్రిశూల్‌, నందాదేవి శిఖరాలలో సరిసమానంగా తులతూగుతున్నది.
ఇక్కడ 166 రకాల పక్షి జాతులున్నాయి. ఇది పక్షిపర్యవేక్షకులకు స్వర్గధామం. లాఫింగ్‌త్రాష్‌, స్పాటెడ్‌ క్లోవ్‌, లార్డ్‌పైడ్‌, వాగ్‌టైల్‌, ఎల్లోబాక్‌డ్‌ సన్‌బర్డ్‌ పక్షి, వైట్‌కాప్‌డ్‌, రెడ్‌స్టార్ట్‌ ఇంకా ఎన్నో రకాల పక్షులతో ఎన్నో రంగురంగుల సీతా కోక చిలుకలు ఎంతో అందంగా ఉంటూ ఆహ్లాదంగా ఉంటుంది. ఇక్కడ చిరుత పులులు కూడా ఉన్నాయి.

అల్మోరా...
ఇదిక్కడకు 35 కి.మీ. దూరంలో ఉంది. ఎంతో తక్కువ ఎత్తు అయినా ఎక్కేందుకు గంటల తరబడి కష్టపడాల్సి ఉంటుంది. ఎందుకంటే సుళ్ళు తిరిగే గాలులు వెనక్కుతోసెయ్యటమే కారణం. ముందుకు మూడడుగులు వేస్తే వెనక్కు వెయ్యి అడుగులు అంటే అక్కడ గాలి శక్తి ఎంతటిదో తెలుస్తోంది.
ఇక్కడి పబ్లిక్‌ మ్యూజియంలో ప్రపంచంలోనే అతి అపురూపమైన ‘ఐపెన్‌’ జానపద చిత్రకళ ప్రదర్శన. ఇంకా ఎన్నో కళా సంపదలు చూడవచ్చు. అల్మోరాకు 8 కి.మీ. దూరంలో ఇటై గుడి ఉంది. ఇది కుమాన్‌ల దేవత. అల్మోరాలో ఎన్నో షాపింగ్‌ సెంటర్లున్నాయి. ఇందులో 200 ఏళ్ళనాటి బజారు కూడా ఉంది. అల్మోరాకు వచ్చిన తరువాత నందాదేవి మేళా ప్రతి సంవత్సరం జరుగుతుంది. ఇది వందేళ్ళనాటి నుండి జాతర జరుగుతున్నది.

జగేశ్వర్‌...
crop 

ఇది బిస్సార్‌కు 66 కి.మీ. దూరంలో ఉంది. ఇది లకులశైవానికి కాణాచి. ఇది 8వ జ్యోతిర్లింగం. ఈ ఆలయాలు 8వ శతాబ్ధి నుండి 18వ శతాబ్ధి వరకు కట్యూరి వంశం, చండ్‌ వంశం వారు నిర్మించారు. దీనికి ప్రధానాకర్షణ ఆలయ సముదాయం. ప్రధాన ఆలయాలలో మృత్యుంజయ లింగం ముఖ్యమైంది. ఇది స్వయంగా జ్యోతిర్లింగం. దండేశ్వర ఆలయ సముదాయం. ఇంకా కొంచెం దూరంలో వృద్ధ జోగేశ్వర ఆలయముంది.

జూ పాయింట్‌....
ఇది 25 కి.మీ. దూరంలో వ్యూయింగ్‌ టవర్‌ మీద నుంచి అనేక రకాల పక్షులతో పాటు సూర్యాస్తమయాన్ని చూస్తాము. ఖలీ ఎస్టేట్‌ మొదట్లో హెన్రీరామ్‌ సెసె, జవహర్‌ నెహ్రూ దీన్ని సందర్శించారు. రవిశంకర్‌ , ఎంజి పాండేల పాదస్పర్శ ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలతంతో పాటు సంగీత వాయువులను సుసంపన్నం చేస్తున్నది. ఇక్కడ అంతులేని సమాచారముంది అదంతా పూలు పళ్ళు జంతువులకు సంబంధించినది. ఇక్కడకు 25 మైళ్ళ దూరంలో హిమాలయాల వైపు చూస్తే సూర్యోదయం, సూర్యాస్తమయ దృశ్యాలు ఎంతో హృద్యంగా ఉంటాయి. 

- Courtacy - సూర్య Daily 

Wednesday, July 13, 2011

తనివితీరని అందాల గని... తవాంగ్‌

భారతదేశంలో సూర్యుడు మొదటసారిగా ఉదయించే ప్రాంతమైన అరుణాచల్‌ ప్రదేశ్‌లో హిమాచల్‌ పర్వతాలపై ఉంది తవాంగ్‌. అరుణాచల్‌ ప్రదేశ్‌లో బౌద్ధులు అధికం. దీంతో ఈ ప్రాంతంలో అతి ప్రాచీన బౌద్ధ ఆశ్రమాలకు ఆలవాలంగా వెలుగొందుతోంది.

Tawang 

తవాంగ్‌ హిమాలయ పర్వతాలపై దాదాపు 12వేల ఆడుగుల ఎత్తున ఉంది. తవాంగ్‌ అంటే ఎంచుకున్న గుర్రం. తవాంగ్‌లో టిబెటన్ల సంఖ్య ఎక్కువ. టిబెటన్లు ఎప్పుడూ ఇక్కడ ప్రార్ధనలు చేస్తూ బౌద్ధమత ఆరాధనలో నిమగ్నులవుతారు.

తవాంగ్‌ యుద్ధ స్మారకం...
భారత-చైనాల మధ్య 1962లో జరిగిన యుద్ధంలో చైనా సైనికులను ఒంటరిగా పోరాడిన భారతీయ సైనికుడి వీరమరణం పొందిన చోట స్మారకాన్ని ప్రభుత్వం ఏర్పాటుచేసింది. ఈ స్మారకం సీలా పాస్‌లోని జశ్వంత్‌ఘర్‌లో ఉంది.


photo

War Memorial; Tawang

Tawang is in the western part of Arunachal Pradesh, India. With an average altitude of 10,000 feet, this town is 340 km from Tezpur, a picturesque city of Assam, India. Famous for its Buddhist monastery & pristine beauty, Tawang is a tourist's paradise. With more than 100 lakes, almost all of which becomes frozen in winter, and beautiful peace-loving people (mostly of Monpa tribe) with their exotic costume & customs, Tawang is a life-time experience.
The war Memorial at Tawang was erected in the memory of more than 2000 Indian soldiers who laid their lives in defending Tawang in the Sino-Indian war of 1962.

తవాంగ్‌ ఆశ్రమం...
బౌద్ధమతంలో మహాయాన వర్గం వారు ఇక్కడ ఆశ్రమాన్ని ఏర్పాటుచేసుకున్నారు. లాసా తర్వాత అతి ప్రాచీన ఆశ్రమం తవాంగ్‌లో మాత్రమే ఉంది. తవాంగ్‌ ఆశ్రమాన్ని మెరాగ్‌ లామా లోడ్రీ గిమాస్ట్సో నిర్మించారు. ఈ ఆశ్రమం 1681లో నిర్మించారని చరిత్ర చెబుతోంది. ఆశ్రమం పక్కనే బౌద్ధ సన్యాసులు నివసించేందుకు వీలుగా వసతి గృహాలు ఏర్పాటుచేశారు. తవాంగ్‌ ఆశ్రమంలో ప్రాచీన గ్రంధాలయంతో పాటుగా వస్తు ప్రదర్శనశాల కూడా ఉంది. దాదాపు 500 మంది బౌద్ధ సన్యాసులకు వసతి కల్పించేది తవాంగ్‌ ఆశ్రమం. రాత్రిపూట తవాంగ్‌ ఆశ్రమాన్ని విద్యుదీప కాంతులతో చూస్తే చాలా అందంగా ఉంటుంది. ఆశ్రమంలో లోపల 8 మీటర్లు ఎత్తైన బౌద్ధ విగ్రహం ఉంది. లాసాలోని పోతలా ఆశ్రమం తర్వాత అతిపెద్దది తవాంగ్‌ ఆశ్రమం.
http://farm1.static.flickr.com/232/501887126_ba41fdb8b8.jpg
ఉర్గెలింగ్‌ ఆశ్రమం...
ఆరవ దలైలామా ఉర్గెలింగ్‌ ఆశ్రమంలో పుట్టాడని బౌద్ధులు భావిస్తారు. ఈ ఆశ్రమం 14వ శతాబ్దం నుంచి ఉందని బౌద్ధులు అంటుంటారు. తవాంగ్‌ పట్టణం నుంచి ఐదు కిలోమీటర్ల దూరంలో ఉర్గెలింగ్‌ ఆశ్రమం ఉంది.
https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEjaSqHp6qj9xW4_aB_mokbk_-VfAu0VDKBLWD0MxY66N7h78kgkUpxXgOOjhtfZhgHy-4XJCLwqO-4GXPKbK2eMnqrFaySMkbZ42K-1BFZRcW-P_FEhNFEqbB_nHbMktfZRUKHnD_etlCIW/s1600/monastry.jpg
తవాంగ్‌ స్వర్ణ బౌద్ధ స్థూపం...
చైనా సరిహద్దు వద్ద ఉన్నది తవాంగ్‌ స్వర్ణ బౌద్ధ స్థూపం. దీనినే తవాంగ్‌ బౌద్ధ మఠం అని కూడా పిలుస్తారు. తవాంగ్‌ను అధికారికంగా భారత్‌ తమ భూభాగంలోకి గతంలో కలుపుకున్నప్పటికీ 2007లో అది తమదే నంటూ చైనా వివాదాన్ని లేవదీసింది. ఇక్కడే 6వ దలైలామా జన్మించాడన్న కారణంతో అది మాదే అని చైనా అంటోంది. ప్రస్తుత దలైలామా మనగడ్డపై ప్రవాస జీవితం గడుపుతున్నాడన్న విషయాన్ని చైనా మరుస్తోంది.
http://farm4.static.flickr.com/3425/3230411364_d069dd486b.jpg
బ్రిటీష్‌వారు పోతూపోతూ భారత్‌-చైనాలు విభజించటానికి మెక్‌మోహన్‌ రేఖను సరిహద్దుగా మార్చారు.దానితో తవాంగ్‌ మఠము మనకు దక్కింది. అయినప్పటికీ అరుణాచల్‌ ప్రదేశ్‌లోని ఎక్కువ ప్రాంతాలు తమదేనంటూ చైనా వాదిస్తోంది. ఒకప్పుడు ఈ ప్రాంతాన్ని ఈశాన్య సరిహద్దు ఏజెన్సీగా పిలిచేవారు.ఇప్పటిదాకా ఉన్న రికార్డు ప్రకారం తవాంగ్‌ 1951 వరకూ టిబెట్‌ ప్రభుత్వ హయాంలో ఉండేది.స్థానిక అరుణాచల వాసుల వాదన ఏమిటంటే భారత్‌తో ఉండాలన్నది తమ Brahmaputra from Tezpurనిర్ణయం అంటారు. వారు హిందీ పాటలు, వినడం, మాట్లాడటం లేదా అర్థం చేసుకోవడం తెలుసు. అసోం భాషను తాము కనుగొన్నామని అంటారు. బాహ్య ప్రపంచంతో ఈశాన్యంలోని అసోంతో సంబంధం పెట్టుకున్నప్పుడు ఈ భాష ఏర్పడిందంటారు.

తవాంగ్‌ మఠం సముద్రమట్టానికి 3500 మీటర్లు ఎగువన 400 సంవత్సరాలు క్రితం ఏర్పడింది. దలైలామాకు చెందిన మహాయాన బౌద్ధంలోని గాలుపా వర్గానికి చెందిన అనుబంధం తవాంగ్‌. ఇందులో 700 మంది సన్యాసులు నివశించవచ్చు. ఈ మఠంలో బుద్ధుని అవశేషాలు కూడా ఉన్నాయని ప్రతీతి.
మఠానికి అనుబంధంగా వస్తు ప్రదర్శనశాల కూడా ఉంది. ఇందులో ప్రాచీన తాళపత్ర గ్రంధాలు మరియు విలువైన పురాతన వస్తువులు వంటివి ఉన్నాయి. దలైలామా నేతృత్వంలో 1997లో పూర్తిగా దీనిని ఆధునీకరించారు. ఇక్కడి స్థానిక ప్రజలు మోన్పాస్‌ అంటారు. వీరు రాళ్లతో కట్టిన గృహాల్లో నివశిస్తూ వ్యవసాయం చేసుకుంటారు. టిబెట్‌ తరహా నేత పనులు వీరు చేస్తుంటారు.


తవాంగ్‌కు ప్రయాణించే మార్గంలో తేజ్‌పూర్‌ వస్తుంది. ఇది అసోంలో చాలా చిన్న పట్టణం. అరుణాచల్‌లోని మరో బౌద్ద మఠం బొమిడిలాకు వెళ్లే మార్గంలో ఉంది తేజ్‌పూర్‌. బహ్మపుత్రా నది ఎడమ గట్టున ఉంది తేజ్‌పూర్‌. తేజ్‌పూర్‌ గురించి చెప్పాలంటే 1962 నాటి చరిత్రలోకి వెళ్లాలి. చైనా పరిభాషలో దీనిని హిమాలయ తప్పు సంవత్సరం అంటారు. చైనా సైనికులు భారత సరిహద్దును దాటి కాల్పులు జరిపారు. ఈ సమయంలో తేజ్‌పూర్‌లో ఉన్న భారత ఆర్మీ తిప్పికొట్టింది.

ఎలా చేరుకోవాలి...
విమాన మార్గం: తేజ్‌పూర్‌ విమానాశ్రయం (320 కి.మీ)
రైలు మార్గం: రంగపార సమీపంలో రైల్వే స్టేషన్‌. ఈ మార్గంలో మీటర్‌ గేజి రైళ్లు రంగియా నుంచి నడుస్తాయి. రంగియా-గౌహతిల మధ్య దూరం 60 కిలోమీటర్లు.
రహదారి మార్గం: తేజ్‌పూర్‌ (320 కి.మీ.), బొమిడిలా (185 కి.మీ.), దిరాంగ్‌ (143 కి.మీ.). తేజ్‌పూర్‌ నుంచి తవాంగ్‌కు చేరుకోవటానికి 13 గంటల సమయం పడుతుంది. మార్గమధ్యంలో రాత్రిపూట బొమిడిలా లేదా దిరాంగ్‌లలో బస చేయాల్సి ఉంటుంది. తవాంగ్‌కు వెళ్లే మార్గంలో 14వేల అడుగుల ఎత్తున ఉన్న సీలా పాస్‌ అందాలను తనివితీరా చూడవచ్చు. 

Monday, May 16, 2011

అందాలొలుకు(లు)... మనాలి. . .


Kullumanaliహిమ శిఖరమంటేనే ప్రకృతి అందాలకు నెలవు. అలాంటి అందాల నడుమ సిమ్లా రాజధానిగా విరాజిల్లుతున్న హిమాచల్‌ ప్రదేశ్‌కి మధ్యలో ఉన్నదే మనాలి... అక్కడి అందాలను చూస్తే మనసుకు ఆహ్లాదం కలుగుతుంది. కాలుష్యానికి అలవాటుపడి ట్రాఫిక్‌ కూడళ్ల మధ్య చిక్కుకుపోయి, కాంక్రీట్‌ జంగిల్‌లో కాపురాలు చేస్తున్న హైటెక్‌ నగరవాసికి ప్రశాంత కూడలి... ఈ మనాలి. అందుకే దీనిని స్విడ్జర్లాండ్‌ ఆఫ్‌ ఇండియా అంటారు.

ఉత్తర భారతావనిలో ఘనమైన హిల్‌ స్టేషన్‌లలో ఒకటిగా చెప్పుకోదగిన కులు లోయ ప్రాంతానికి 32 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైనదే మనాలి. హిమాచల్‌ ప్రదేశ్‌ ముఖ్యపట్టణమైన సిమ్లాకు ఉత్తరాన 280 కిలోమీటర్ల దూరంలో ఉంది. సముద్ర మట్టానికి 2050 మీటర్ల ఎత్తులో... బియాస్‌ నది ఒడ్డున ఉంది. ప్రతి సంవత్సరం దేశ విదేశాల నుంచి టూరిస్టులు వచ్చిపోతుంటారు. మనాలికి మూడు కిలోమీటర్ల పరిధిలో వేడి నీటి కొలనులు ఉండటం విశేషం. చుట్టూ మంచు లోయల మధ్య వేడినీటి కొలనులు ఉండటం నిజంగా ఆశ్చర్యం కలిగించే అంశమే.

నాటి మనువాలయమే...
పూర్వం ‘మను’ అనే ముని నివసించిన ప్రాంతం కాబట్టి అతని పేరునే ‘మనాలి’గా ఏర్పడింది. అయితే ఒకప్పుడు దీనిని మనువాలయగా పిలిచేవారట. అంటే మను నివసించిన ప్రదేశం అని పేరు.

వాతావరణం...

Rahala_Waterfalls మామూలుగా అయితే శీతాకాలంలో మైనస్‌ డిగ్రీల ఉష్ణోగ్రత ఉంటుంది. కాబట్టి ఆ సీజన్‌లో ఉన్ని దుస్తులు తప్పనిసరిగా వేసుకుని తిరగాల్సిందే. సమ్మర్‌లో మాత్రం సాధారణ ఉష్ణోగ్రతం ఉంటుంది. అందుకనే ఎక్కువగా పర్యాటకులు ఈ సీజన్‌లోనే ఈ ప్రాంతానికి వెళుతుంటారు. ఎటుచూసినా ఎత్తయిన కొండలు, లోయలు... దట్టమైన అటవీ ప్రాంతాలతో... ప్రకృతి అందాలను రెట్టింపుచేసేలా అందమైన పక్షుల కువకువ ధ్వనులతో అలరారుతుంటుంది. సంవత్సరమంతా సీజన్‌తో నిమిత్తం లేకుండా ఎప్పుడైనా సందర్శించవచ్చు.

సాహసవీరులకు సేదతీర్చే...
ఇక్కడికి వచ్చే ఔత్సాహిక మంచు స్కేటర్స్‌కి ప్రత్యేకంగా శిక్షణ పొందిన సహాయకుల పర్యవేక్షణలో స్కేటింగ్‌ ప్రాక్టీస్‌ చేసుకోవచ్చు. అప్పుడప్పుడు సినిమా షూటింగ్‌లు కూడా జరుగుతుంటాయి. సోలాంగ్‌ నుల్లా, రోహతాంగ్‌లా వ్యాలీప్రాంతాలు ఇక్కడ మంచు స్కయింగ్‌కి అనుకూలం. ఇక్కడ జనాభా మొత్తం 4,200 మంది ఉంటారు. ఇక్కడ ఎక్కువగా హిందీ, హిమాచల్‌, ఇంగ్లీష్‌ భాషలు మాట్లాడతారు.

దుస్తులు...
మనాలి ప్రజలు పొడవైన ఉలెన్‌ కోటు వేసుకుంటారు. దానిని ‘చోళ’ అని పిలుస్తారు. నడుముకు కట్టుకునే బెల్టులా ‘డోరా’ అనే వెయిస్ట్‌ క్లాత్‌ కట్టుకుంటారు. ‘సుతాన్‌’ అనే టైట్‌ ప్యాంట్లను వేసుకుంటారు. ‘టోప’ అనే బ్లాక్‌ క్యాప్‌ను ఎక్కువగా పెట్టుకుంటారు. ‘లాచూ’ అనే బుజాలు కప్పుకునే ఒకరకం బ్లాంకెట్‌ కూడా వేసుకుంటారు. ఇవన్నీ చలినుంచి రక్షించే సాధనాలే అవడం విశేషం.

ఆహారం...
Kullumanali1 వరి, గోధుమ ఇక్కడి ముఖ్య పంటలు. ఇక్కడి ప్రజలు కోద్ర, సత్యార వంటి ఎనర్జెటిక్‌ ఫుడ్‌ను ఆహారంగా తీసుకోవడం విశేషం. వీరికి టీ అంటే మక్కువ. ప్రతి ఇంటికి ఒక ఆవు ఉంటుందక్కడ. అందుకనే పాలతో తయారు చేసిన వెన్న, పెరుగు, లస్సీ వంటివి ఇక్కడ విరివిగా ఉపయోగిస్తారు. కులు మనాలి ప్రజలు బార్లీతో తయారుచేసిన ప్రత్యేకమైన వైన్‌, రెడ్‌ రైస్‌ను విందులు వినోదాల్లో తరచుగా తీసుకుంటారు. ఈ రెండింటినీ ‘చక్తి’, ‘లుగ్రి’ అని పిలుచుకుంటారు.

వసతులు...
లెక్కకి మిక్కిలిగా ఇక్కడికి వచ్చే యాత్రికుల సౌకర్యార్థం అనేక హోటళ్ళు ఉన్నాయి. ఎంత ఖర్చు పెడితే అంత... అన్నట్లుగా ఇక్కడ అన్ని వర్గాల వారి ఆర్థిక స్థోమతను బట్టి వారి వారి అభిరుచుల మేరకు అన్ని వసతులను అందజేస్తుంటాయి ఇక్కడి హోటళ్ళు. అంతేకాకుండా అన్ని రాష్ట్రాలకు చెందిన వంటకాలను కూడా అందజేయటం ఇక్కడి హోటల్‌ యాజమాన్యాల ప్రత్యేకత. టూరిస్ట్‌లు కూడా వారి వారి రేంజ్‌ను బట్టి వారికి కావలసిన హోటళ్లలో దిగుతుంటారు.

ఎలా వెళ్లాలంటే...
Manali-Tour మనాలికి దక్షిణాన 52 కిలోమీటర్ల పరిధిలో భూంటార్‌ ఎయిర్‌పోర్ట్‌ ఉంది. అక్కడినుంచి మనాలి నుంచి ఢిల్లీ వయా సిమ్లాకు విమాన సౌకర్యం ఉంది. 135 కిలోమీటర్ల పరిధిలో జోగీందర్‌నగర్‌ నుంచి నేరో గేజ్‌ లైన్‌ రైలు సౌకర్యం ఉంది. బ్రాడ్‌ గేజ్‌ లైన్‌ చంఢీఘఢ్‌ దాకా ఉంది. చంఢీఘఢ్‌ నుంచి 310 కి.మీ.దూరం. ఢిల్లీ నుంచి మనాలి వరకు రోడ్డు సౌకర్యం ఉంది. వీటి మధ్య 585 కి.మీ. దూరం ఉంది. మనాలి నుంచి సిమ్లాకు 270 కి.మీ. దూరం. బస్సు సౌకర్యం ఉంది.
http://www.visitmanalikullu.com/images/bijli_mahadev.jpg
చూడదగిన ప్రదేశాలు బిజిలీ మహదేవ్‌ దేవాలయం...
సముద్ర మట్టానికి 2460 మీ ఎత్తులో... కులు ప్రాంతానికి 10 కి.మీ. దూరంలో ప్రఖ్యాత బిజిలీ మహదేవ్‌ దేవాలయం ఇక్కడ పర్యాటకులకు కనువిందు చేస్తుంది. ముఖ్యంగా కులు ప్రాంతంలో ఉన్న లోయల్లో మౌంటెనైఉ టెక్కర్స్‌కి ఆహ్లాదంగా ఉండటమే గాక వాళ్లలోని సాహసాపేక్షను ఈ ప్రాంతంలో పర్వతాలను అధిరోహించి మరీ తీర్చుకుంటుంటారు.
http://www.indianetzone.com/photos_gallery/9/hadimba_9236.jpg
హిడింబి దేవాలయం...
అన్నింటికన్నా ఆశ్చర్యం కలిగించే అంశం ఏమిటంటే ఇక్కడ భారతంలో ఘటోత్కచునికి తల్లి... భీమునికి భార్య అయిన రాక్షస సంతతికి చెందిన హిడింబికి దేవాలయం ఉండటం. పైగా పెద్ద ఎత్తున పర్యాటకులు ఇక్కడికి వచ్చిపోవడం మరో విశేషం. దేశంలో ఎక్కడా లేని విధంగా ఒక రాక్షసికి దేవాలయం కట్టడం మనం ఇక్కడ మాత్రమే చూడగలం. గుడి చాలా పురాతన కట్టడంలా ఉంటుంది. ఒక గుహలో ఉంటుంది. నిత్యం అక్కడ అగ్నిహోత్రం వెలుగుతూనే ఉండటం విశేషం. కొండ చుట్టూ మంచుతో కప్పి ఉంటుంది. ఎత్తయిన కొండలపై మరింత ఎత్తుగా చెట్లు ఆకాశంలో మబ్బులను తాకేలా ఉండటం విశేషం.

రహల్లా జలపాతం...
సముద్ర మట్టానికి 2501 మీటర్ల ఎత్తులో మనాలికి 16 కిలోమీటర్ల దూరంలో రోహతాంగ్‌ కనుమ ప్రాంతంలో పర్యాటకులు నయాగారా జలపాతం చూసిన అనుభూతిని పొందుతారు. మనాలికి మూడు కిలోమీటర్ల దూరంలోవాయువ్య దిశలో ఓల్డ్‌ మనాలి ప్రాంతం ఉంది. అక్కడ పురాతన కోటలు... సంప్రదాయ మను దేవాలయం చూడదగిన ప్రదేశాలు. వీటన్నితో మనాలి దేశంలోనే అత్యంత ప్రీతిపాత్రమైన పర్యాటక కేంద్రంగా విరాజిల్లుతోంది.

కర్టసీ : సూర్య Daily

Tuesday, May 10, 2011

హిమాలయ ముఖద్వారం.... కార్గిల్

gompa-shergol కార్గిల్‌.. ఈ పేరు చెబితే.. యుద్ధ వాతావరణం కళ్ళముందు కదలాడుతుంది. హిమాలయ పర్వతాల నడుమ.. పాకిస్తాన్‌ వాస్తవాధీన రేఖకు అతిచేరువలో ఉన్న ఈ ప్రాంతానికి వెళ్లాలంటే.. ఎవరైనా ఒకటికి రెండుసార్లు ఆలోచిస్తారు. ఎందుకంటే.. అక్కడ ఎప్పుడు ఎలాంటి పరిస్థితిని ఎదుర్కోవాల్సివస్తుందోనని ఒకింత భయంతో వెనకడుగు వేస్తారెవరైనా.. అయితే.. ఇది నాణేనికి ఒకవైపు మాత్రమే. మరో పార్శ్వాన్ని స్పృశిస్తే.. కార్గిల్‌ ప్రకృతి అందాల కన్నె పడుచు. హిమాలయాల ఒడిలో ఉన్న కార్గిల్‌ పూర్వం నుంచి వాణిజ్య వ్యాపారాలకు ఖ్యాతి గాంచింది. శ్రీనగర్‌కి పశ్చిమాన 204 కిలోమీటర్ల దూరంలో, సముద్రపు ఒడ్డునుంచి 2704 మీటర్ల ఎత్తులో ఈ నగరం ఉంది. కాశ్మీర్‌-చైనా వ్యాపార సంబంధాలకు ఈ నగరం పునాది. 1949లో కేంద్రీయ ఆసియా వ్యాపారం సమాప్తం అయిన తరువాత కూడా ఇక్కడి పాతబజారులో ఆసియా, టిబెట్‌ వస్తువులకి అధిక డిమాండ్‌ ఉంది. హిమాలయ పర్వతశ్రేణుల మధ్య కార్గిల్‌ ఉండటంతో పర్యాటకులకు ఆసక్తికరమైన యాత్రాస్థలంగా ఉంది. ఇక్కడ బార్లీ, గోధుమలు, వివిధరకాల కూరగాయలను పండిస్తారు.

ఎన్నెన్నో ప్రత్యేకతలు...
Kargil1ఇక్కడ ట్రైనింగ్‌, క్యాంపింగ్‌, నౌకాయానంతో పాటు పర్వతారోహణ సౌకర్యాలు కూడా ఉన్నాయి. ఇక్కడి ఒకరోజు ప్రయాణం తరువాత సురూఘాట్‌ చేరుకుని హిమాలయ పర్వతాలను చూడవచ్చు. కార్గిల్‌ నుంచి గోమా కార్గిల్‌ మధ్య రెండు కిలోమీటర్ల ప్రయాణంలో ఉత్కంఠభరితమైన దృశ్యాలు అబ్బురపరుస్తాయి. అంతేకాకుండా సరూ నదిపై ఉన్న పాత వంతెన మీదుగా ‘పోయెన్‌’ గ్రామాన్ని చేరుకోవచ్చు. దీని అవతలి వైపు వాఖా నది ఉంది. కార్గిల్‌ మార్కెట్‌లో పొగాకుతో పాటు హుక్కా కూడా దొరుకుతాయి. రోజువారీ వస్తువులతోపాటు పర్వతారోహణకు అవసరమైన వస్తువులను కూడా ఇక్కడ అమ్ముతారు. యాత్రికుల అవసరాలకు అనువైన వస్తువులన్నీ లభ్యమవుతాయి. ఈ మార్కెట్‌లో వస్తువుల కొనుగోలుకి మధ్యాహ్న వేళలో వెళితే సికిందర్‌ సైన్యంలో భాగమైన మినారోజ్‌ ప్రజాతివారిని కూడా చూడవచ్చు.

ఇక్కడ చూడాల్సినవివే...
మలబేక్‌ చంబా: ఈ ప్రాంతంలో 9 మీటర్ల ఎత్తున్న పెద్ద రాతి బండ ఉంది. దీనిని మైత్రేయ్‌ అని అంటారు. ఇది బౌద్ధ కళకు ఉత్కృష్టమైన తార్కాణం.

మల్‌బేక్‌ గోంపా: ఇది ఈ ప్రాంతంలో అతి పెద్ద రాతి బండ. ఇది ప్రాచీన కాలంలో యాత్రీకులకు దారి చూపేదట.

షెగాల్‌: వాఖా నదీ తీరాన ఉన్న ఈ ప్రాంతపు ప్రత్యేకత ఇక్కడ ఉన్న ఓ గుహ. మరొకవైపు నుంచీ చూస్తే ఇది ఓ చిన్న రంధ్రాన్ని పోలి వుంటుంది.
ఉరమ్యాన్‌ జాగ్‌: పెద్ద పెద్ద పర్వతాలతో ఉన్న ఈ ప్రదేశంలో పూర్వం బౌద్ధమతస్తులు ధ్యానం చేసుకునేవారు.

ఇక్కడికి ఎలా చేరుకోవాలి?
జమ్మూ-కాశ్మీర్‌ పర్యాటక సంస్థ, శ్రీనగర్‌ నుంచి లేహ్‌ వరకు నిర్ణీత బస్సు లను నడుపుతోంది. అం తేకాకుండా శ్రీనగర్‌, లే్‌హ నుంచి కార్గిల్‌ వర కు టాక్సీలు కూడా ఉం టాయి. మల్‌బేక్‌ చేరు కోవడానికి టాక్సీ, జీప్‌లు కూడా అందుబాటులో ఉంటాయి.

Tuesday, April 19, 2011

దేవతలు కొలువుదీరిన కుమావన్‌..!

అంబరాన్ని తాకే హిమలయాలు.. వాటినుండి గలగలమంటూ పారే సెలయేళ్ళు.. క్రమశిక్షణకు మారుపేరుగా.. ఒకే వరుసలో సైనిక పటాలాన్ని తలపిస్తూ.. ఏపుగా పెరిగిన పైన్‌ వృక్షాల అందాలు.. అందమైన లోయలు.. ఆ లోయల్లో వివిధ రకాల పుష్పజాతుల సోయగాలు.. వీటన్నింటి కలయికే... భూలోకంలో స్వర్గాన్ని గుర్తుచేసే.. కుమావన్‌ పర్వతాలు..

kumaon2హిమాలయాల్లో దేవతలు నివాసం ఉంటారని అంటారు. పరమశివుడికి ఆవాసమైన పవిత్ర కైలాస పర్వతం ఈ హిమ పర్వతాల్లోనే ఉందని విశ్వసిస్తుంటారు. అలాగే.. పవిత్ర నదులైన గంగ, యమున, సింధు, బ్రహ్మపుత్ర నదుల జన్మస్థానం కూడా హిమాలయా పర్వాతాల్లోనే..! పవిత్ర రుద్రాక్ష మొక్కలతోపాటు వందలాది ఔషధ మొక్కలకు కూడా నిలయం ఈ హిమాలయాలే. హిందూ పురాణాలన్నింటిలోనూ హిమాలయాలకు విడదీయలేని అనుబంధం ఉంది.

కుమావన్‌ అందాలు...

వాయువ్యంలో కాశ్మీర్‌ మొదలుకుని ఈశాన్య భారతదేశం వరకు విస్తరిం చిన ఈ హిమాలయా పర్వతాలలో పైన మనం చెప్పుకున్న కుమావన్‌ ప్రాంతం అత్యంత సుందరమైనది. ప్రస్తుత ఉత్తరాఖండ్‌ రాష్ట్రంలో ఉన్న ఈ కుమా వన్‌ పర్వతాల్లో.. హిమాలయాలలోనే అత్యంత పవిత్రమైనవిగా చెప్పబడే పుణ్యక్షేత్రాలున్నాయి. కాశ్మీరీ అందాల కు ఆలవాలమైన సౌర్‌ లోయ కూడా కుమావన్‌లో భాగమే. ఆ లోయనుంచి ఎటు చూసినా పచ్చటి ప్రకృతే మనకు దర్శనమిస్తుంది. ఎతైన పర్వతాలు, ఆ పర్వతాల మధ్య మెలికలు తిరిగిన కాలిబాటలు, ఆ బాటల వెంట.. అడగడుగా ఓ దేవతా మందిరం.. ఇలా వర్ణించేందుకు వీలులేనంతటి విశేషాలను తనలో దాచుకున్నదే కుమావన్‌.

ప్రకృతి, దేవతల ప్రతిరూపాల ను ఇక్కడి కొండలు, గుట్టలు, లోయలలో నిక్షిప్తమై ఉన్నాయి. అలాంటి మందిరాల్లో ఒకటి.. చితాయ మందిరం. ఈ ఆలయం ముందు కొన్ని వందల గుడిగంటలు వేలాడగట్టి ఉండడం విశేషం. ఈ ఆలయాన్ని దర్శించుకునే భక్తులు ఓ అరుదైన ఆచారాన్ని అవలంభిస్తారు. అక్కడి దేవతకు మన కష్టాలను విన్నవించుకునేందుకు కాగితాలను వాడతారు. తమ కోరికలను ఆ కాగితాలపై రాసి.. గంటతో సహా మందిర ప్రాంగణంలో వేలా డదీస్తారు. ఇలా చేస్తే.. ఆ దేవత తమ విన్నపాలను తప్పనిసరిగా మన్నిస్తుందని భక్తులు విశ్వసిస్తుంటారు.

ఎటు చూసినా సరస్సులే...

ప్రకృతి సహజంగా ఏర్పడిన సుమారు 50 సరస్సులు కుమావన్‌ పర్వతాల అందాలకు మరింత శోభనిస్తుంటాయి. దాదాపు ప్రతి పర్వతం మధ్యన ఒక సరస్సు ఉంటుంది. ఆ పర్వతం మీద పడిన వర్షపు నీరు, కరిగిన మంచు ఈ సరస్సుల గుండా ప్రవహిస్తాయి. ఆ సరస్సుల్లో అత్యంత స్వచ్ఛమైన నీరు, ఆ నీటిలోపల చుట్టూ ఉన్న ప్రకృతి అందాల ప్రతిబింబాలు.. కనువిందు చేస్తాయి. కుమావన్‌లో మొత్తం 73 పర్వతాలున్నాయి. ప్రతి పర్వతం నేరుగా ఆకాశంలోకి చొచ్చుకుని వెళుతున్నట్లు కనబడుతుంది. ఇవేకాకుండా 17 హిమఖండాలు కూడా ఉన్నాయి. దేవతల కోసమే ఈ ప్రదేశం ఏర్పడిందా! అన్నట్టు ఉండే ఈ అందమైన ప్రదేశంలో అడుగడుగునా ఓ దేవాలయాన్ని దర్శనమిస్తుం ది. అలా మొత్తంగా 40 శైవ మందిరా లు, మరో 48 దేవీ మందిరాలు ఇక్కడ పూజలందుకుంటున్నాయి.

వన్యప్రాణులకూ నిలయమే...
కుమావన్‌ దేవతల నివాసమే కాదు. వన్యప్రాణులకూ ఆలవాలమే. పక్షి ప్రేమికులకు ఇది ఓ రకమైన స్వర్గమే. ఇక్కడ సుమారు 300 రకాల పక్షి జాతులు మనకు దర్శనమిస్తాయి. ఉదయం, సాయంత్ర వేళల్లో ఆ పక్షుల కిలాకిలారావాలు వీనులవిందు చేస్తాయి. పక్షులతో పోటీపడి రంగులు వెదజల్లే సీతాకోక చిలుకలకు కూడా ఈ దేవతల భూమే నిలయం.

kumaon_houseఈ సుందర వనాలలో విహరించేందుకు దిగివచ్చిన దేవకన్యల్లా ఉంటాయవి. అక్కడ వీచే గాలులకు పరవశిస్తూ, అలా విహరిస్తూ, ఒక్కో పూవునుంచి మరో పూవుకు మకరందం కోసం ఆ సీతాకోక చిలుకలు కళ్లకు పసందు చేస్తూ, మనసుకు హాయినిస్తాయి. దాదాపు 3 వేల మీటర్ల ఎత్తు ఉండే ఈ కుమావన్‌ పర్వత శ్రేణులలో పలు వన్యప్రాణి రక్షిత ప్రదేశాలున్నాయి. వాటిలో దాదాపు 50 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉన్న బిస్సార్‌ రక్షిత ప్రదేశం విశేషమైనది. ఈ ప్రాంతంలో ఇది ఒక సౌందర్య ప్రాంతం. ఇక్కడ చిరుతలు, కస్తూరి మృగాలు, జింకలు, భల్లూకాలవంటి ఎన్నో వన్యప్రాణులు విహరిస్తుంటాయి.

అలాగే మంచుతో కప్పబడి ఉండే పర్వతాలలోని గోవింద వన్యప్రాణి సంరక్షిత ప్రదేశం కూడా చూడదగ్గదే. ఇక్కడ హిమాలయాలకు మాత్రమే పరిమితమైన నల్ల భల్లూకం, మంచు చిరుత, కస్తూరు, కోళ్ల వంటి పక్షులు, తాహిర్‌లు కనువిందు చేస్తాయి. ఇక్కడి పర్వతాలలో స్వరరోహిణి, నల్లశిఖరం అనేవి ప్రత్యేకంగా చూడదగ్గవి.ఇంతటి ప్రకృతి విశేష ప్రదేశాలను తనలో దాచుకుని.. అలకానంద, మందాకిని, గంగ, యమునా నదుల పుట్టినిల్లుగా భాసిల్లుతున్న ఈ ప్రదేశం నేడు విధ్వంసానికి గురవుతోంది. అభివృద్ధి పథకాల పేరుతో కొంతమేరకు అడవులను ధ్వంసం చేయగా.. కలప కోసం మరికొంత అడవిని నాశనం చేస్తున్నారు. ఫలితంగా ఈ దేవతల భూమి నేడు జీవులపాలిట మరుభూమిగా మారిపోతోతుండడం బాధాకరమైన విషయం. 

కర్టసీ : సూర్య Daily

సింధు నాగరికతకు ఆలవాలం... లడక్‌

ladakh-scenic-beautyప్రపంచంలో మరే ప్రాంతానికి లేని ఎన్నో ప్రత్యేకతలు లడక్‌ సొంతం. జమ్మూకాశ్మీర్‌ రాష్ట్రంలోని ఈ ప్రాంతం.. ప్రపంచంలో ఎతైన పర్వతశ్రేణుల జాబితాలో ఉన్న హిమాలయాలు, కారకోరమ్‌ మధ్య విస్తరించివుంది. లడక్‌లోని అత్యంత సమస్యాత్మకమైన కార్గిల్‌ ప్రాంతం సముద్ర మట్టానికి తొమ్మిది వేల అడుగుల ఎత్తున ఉండగా, కారకోరమ్‌ సమీపాన ఉన్న సాసెర్‌ కంగ్రి ప్రాంతం 25 వేల అడుగుల ఎత్తులో ఉంది. హిమాలయాల నుంచి వచ్చే శీతలపవనాలతో సంవత్సరమంతా ఇక్కడి వాతావరణం చల్లగా ఉంటుంది.

జీవజలం...

kumaon2చలికాలంలో పర్వతప్రాంతాలపై ఉన్న మంచు కరగడం ద్వారా వచ్చే నీరే లడక్‌ ప్రాంత ప్రజల వ్యవసాయానికి ప్రధాన జీవనాధారం. వర్షాలు కురిసినా అవి అననుకూల వర్షాలు కావడంతో అంతగా ఉపయోగం ఉండదు. కావున ఇక్కడి ప్రజలు వర్షాలకంటే.. ఎండలనే ఎక్కువ ఇష్టపడతారు. ఎందుకంటే ఎండ బాగా కాస్తే మంచు కరిగి నీరుగా మారి తమ పంటలకు అందుతుండడం వల్ల ఎండలు కాయాలని కోరుకుంటారు. ఇక్కడ ఏడాదిలో 300 రోజులు ఎండ కాస్తుంది. అయితే వేసవికాలంలో 27 డిగ్రీల సెల్సియస్‌ ఉండే ఉష్ణోగ్రత శీతాకాలంలో మైనస్‌ 20 డిగ్రీలకు పడిపోతుంది.

చూడాల్సిన ప్రదేశాలు...
సింధులోయ నాగరికత చిహ్నాలెన్నింటినో లడక్‌.. తనలో దాచుకున్నది. లడక్‌లోని లెహ్‌ ప్రాంతానికి ఎంతో చారిత్రక ప్రాధాన్యం ఉంది. 17వ శతాబ్దంలో సెంగె నంగ్యాల్‌ ఇక్కడ నిర్మించిన తొమ్మిదంతస్తుల రాజసౌధం ఇప్పటికీ చెక్కుచెదరకుండా ఉంది. ఇండస్‌కు కొన్ని కిలోమీటర్ల దూరంలో ఉన్న ‘షె’ పట్టణంలో ఎన్నో రాజభవనాలు, పురాతన ఆలయాలు ఉన్నాయి. వీటిలో చాలా భవనాలను 1980లో పునర్‌నిర్మించారు. దీనికి సమీపంలోనే ఉన్న బాస్గో, టింగ్మోస్గాంగ్‌ ప్రాంతాలు 15వ శతాబ్దంలో ఓ వెలుగు వెలిగాయి. అప్పటి వైభవానికి చిహ్నంగా శిథిలావస్థలో ఉన్న కట్టడాలు, ఆలయాలు ఈ ప్రాంతంలో కనబడతాయి.

kashmir.dal-lake-himalayasలడక్‌ ప్రాంతాన్ని గతంలో ఎందరో పాలించారు. వారిలో ఫియాంగ్‌, హెమిస్‌, చిబ్రా అనేవారు ప్రసిద్ధులు. బౌద్ధమతానికి ముందు వీరు పలు మతాలకు ప్రాణం పోసినట్టు ఆధారాలున్నాయి. లడక్‌ ప్రాంతంలో అనేక తెగలు కూడా చిరకాలం వర్థిల్లాయి. ఆ సమయంలో ఎన్నో దేవాలయాలను సైతం నిర్మించారు. ఇలాంటి వాటిలో అల్చి ప్రార్థనాస్థలం ఒకటి. ఐదు దేవాలయాల సమూహమిది. ఆలయాల లోపల అద్భుతమైన వర్ణ చిత్రాలు ఆశ్చర్యం గొలుపుతాయి. ఇవి 11, 12 శతాబ్దాలకాలం నాటివిగా చెబుతారు. ఈ ఆలయంలో జాదికాలు నిలిచిపోయి చాలా ఏళ్ళు అవుతున్నా, లికిర్‌ మత ప్రముఖులు కొందరు వీటిని ఇప్పటికీ సంరక్షిస్తుండడం విశేషం.

కర్టసీ : సూర్య Daily

Monday, November 1, 2010

ప్రకృతి అందాల నిలయం ఫోఖారా

pokhara
పర్యాటక రంగం అనగానే మనకు గుర్తుకు వచ్చేది హిమలయ పర్వాతాలే. హిమలయ పర్వాతాలను ఆనుకుని ఉండే నేపాల్‌ అందాలను చూడడానికి పర్యాటకులు ఎక్కువగా ఆసక్తి కనపరుస్తుంటారు. నేపాల్‌ వెళ్లి న వారికి ఎప్పుడెప్పుడు వెళ్లి చూద్దామా అనిపించే ప్రాంతం పోఖారా. నేపాల్‌లోని అత్యంత పవిత్ర పర్వతం అన్నపూర్ణ పర్వతం. ఆ పర్వత ప్రాంతంలోనే ఉంది ఫోఖారా. ఇక్కడి మత్య్సపుత్స పర్వతం చూడడం ఒక వింతైన అనుభవం. చేపతోక ఆకారంలో ఆ పర్వాతాలు కనిపిస్తాయి. వేకువజామునే లేచి సూర్యోదయ కిరణాల వెలుగులో అన్నపూర్ణ పర్వత అందాలను తిలకిం చడం మరవలేని అనుభూతిని మిగుల్చుతాయి.

సూర్యుని తొలి కిరణాలకు వెలుగులు ప్రారంభించి సమయంతో పెరిగే సూర్యకిరణాలకు తగిన రీతిలో వెలుగులు విరాజిమ్మే ఆ శిఖరాలను దర్శించిన తర్వాతే మిగిలిన ప్రదేశాలవైపు కళ్లు తిప్పగలం. ఫోఖారాలో ఉన్న ఒక గుహ ప్రత్యేకమైనది. ఇది గుప్తేశ్వరమహాదేవుని నిలయం. దాదాపు 140 మీ పొడవున్న గుహ అది. ఆ గుహనుంచి ప్రయాణిస్తూ బయటకు చేరుకోగానే పాల రంగులో పడుతున్న జలపాతం దర్శనమిస్తుంది. దాని పేరు దేవీజల పాతం. హిమలయాలనుంచి జారిపడే అనేక జలపాతాలలో ఇది అందమై నది. ఇక్కడికి సమీపంలో ఉన్న ఫేవా సరస్సులో పడవులలో ప్రయాణిం చవచ్చు. ఎవరికి వారు నడుపుకుంటూ వెళ్లే పడవల సౌకర్యం ఇక్కడ ఉంది.

pokhara-davis
పర్వతాల మధ్య ప్రశాంతం గా ఉన్న సరస్సులో పడవ ప్రయాణం ఎంతో ఆనం దంగా ఉంటుంది. సూర్యోదయ సమయంలో అన్నపూర్ణ పర్వత ప్రాంతాల అందాలను అనుభ వించిన వారికి సూర్యస్తమయ సమయంలో ఆ అందాలను తిలకించాలని అనిపించడం సహ జం. ఆ మధురానుభూతిని తిలకించాలంటే శాంతి శిఖరం ఎక్కి తీరాల్సిందే.

ప్రపంచ శాంతిని కోరుతూ నిర్మించిన ఈ శిఖరం ఒక పర్వతం అంచున ఉంటుంది. అక్కడ నిలబడి పశ్చిమం వైపున తిలకిస్తుంటే సూర్యుడు ఎంతసేపటికీ కిందికి దిగుతున్నట్లు అనిపిం చదు. సూర్యుడు పర్వతాలోకి వెళ్లగానే ఆ ప్రాంతమంతా ఒక్కసారిగా చీకటిగా మారుతుంది. ఒక్కసారిగా ఆ ప్రాంతమంతా నిశ్శబ్దం రాజ్యమేలుతుంది.

మరో సాహసం అక్కడి పర్వాతాల మీద తేలికపాటి విమానంలో ఎగరటం. ఇది ఒక చిన్న తొట్టిలాంటి విమానం. అందులో నడిపే పైలెట్‌ కాక మరొకరు మాత్రమే కూర్చోగలరు. ఇది ఒక గ్లైడర్‌కు కలిపి ఉంటుంది. గ్లైడర్‌ అంటే ఎతె్తైన ప్రదేశం నుంచి కిందికి నెమ్మదిగా జారు కుంటూ వచ్చే రెక్కల వంటి నిర్మాణం. ఇది కూడా అదే పద్ధతిలో నెమ్మదిగా పర్వతాల మీద ఎగురుతూ కిందికి దిగుతుంది. ఇది మరువ లేని అనుభవం. బంగీజంప్‌ చేయడానికి కూడా ఇక్కడ సౌకర్యాలున్నాయి. ఇటీవల అనేక సినిమాల్లో ఇలాంటి సాహస దృశ్యాలను పెడుతు న్నారు. అయితే దీనికి కొంత గుండ ెధైర్యం కావాలి. మనం చేసే బంగీ జంప్‌ను చిత్రీకరించి అప్పటిికప్పుడే డీవీడిగా చేసి ఇచ్చే సౌకర్యం కూడా ఉంది. అక్కడి అనేక దృశ్యాలను కూడా డీవీడీల రూపంలో మనం తెచ్చుకోవచ్చు. వాటిని తిలకిస్తూ మధురానుభూతిని పొందవచ్చు.