విహారాలు

India

Gamyam

Thursday, April 28, 2011

గిరిజన సౌరభం.... ప్రకృతి సోయగం నాగాలాండ్‌

nagaland-kohima-warcemetry 
ఆకాశాన్నంటే.. పర్వతాలు.. పాతాళాన్ని తలపించే లోయలు.. పచ్చదనంతో కళకళలాడే.. పచ్చికబయళ్ళతో పర్యాటకులను అలరించే ప్రకృతి సోయగాలకు ఆలవాలం నాగాలాండ్‌.. దేశంలో అత్యధికంగా గిరిజన జాతులు ఉన్న నాగాలాండ్‌ పర్వతప్రాంతాల్లో.. ప్రకృతి మనోహరంగా శోభిల్లుతోంది.

భారతదేశంలో ఆంగ్లభాష అధికారభాషగా ఉన్న ఒకే ఒక్క రాష్ట్రం నాగాలాండ్‌. బర్మా - టిబెట్‌ దేశాలకు చెందిన సుమారు 16 జాతులకు చెందిన గిరిజన జాతులకు ఈ రాష్ట్రం ఆలవాలం. చిత్ర విచిత్ర వేషధారణలతో.. తమదైన వింత ఆచారాలతో పర్యాటకులను వీరు అబ్బురపరుస్తుంటారు. చేతులకు కంకణాలు, ఛాతీకి కవచాలు, చేతిలో రంగురంగుల ఆయుధాలు పట్టుకుని తిరుగాడే గిరిజనులు నాగాలాండ్‌లో కోకొల్లలు. జాతీయ రహదారిపై దిమాపూర్‌ నుంచి మూడు గంటలు ప్రయాణిస్తే నాగాలాండ్‌ రాజధాని కోహిమా చేరుకోవచ్చు. సముద్రమట్టానికి 1,495 మీటర్ల ఎత్తులో ఉండే ఈ కోహిమాకు ఎంతో చారిత్రక ప్రాధాన్యం ఉంది. రెండో ప్రపంచ యుద్ధ కాలంలో జపాన్‌ సేనలు కోహిమాను ఆక్రమించి, బసచేశాయి. ఆ సమయంలో ప్రాణాలు పోగొట్టుకున్న అమరవీరులకు గుర్తుగా నిర్మించిన స్మారక కేంద్రం పర్యాటకుల కంటతడి పెట్టిస్తుంది.

చూడాల్సినవివే...
Kachari-Kingdom నాగాల జీవన పద్ధతులను, చరిత్రనూ కళ్ళకు కట్టినట్టు చూపే స్టేట్‌ మ్యూజియం టూరిస్టులు చూడాల్సిన ప్రదేశాలలో మొదటిది. చారిత్రక ప్రాధాన్యం ఉన్న విగ్రహాలు, స్థూపాలు, నగలు, తోరణాలను ఇక్కడ పొందుపరిచారు. ఒకప్పుడు పండుగలప్పుడు వాడిన అతిపెద్ద డ్రమ్‌ (డప్పువాయిద్యం) ను ప్రత్యేకంగా ఒక షెడ్డులో భద్రపరిచారు. ఈశాన్య రాష్ట్రాలలో కనిపించే అరుదైన పక్షులు.. ప్రత్యేకంగా నిర్మించిన ఒక హాలులో సర్వాంగ సుందరంగా కనువిందు చేస్తాయి. కోహిమా సమీపాన అరదుర కొండపై ఉన్న కేథలిక్‌ చర్చికి ఓ ప్రత్యేకత ఉంది. దేశంలోనే అతిపెద్ద శిలువ ఈ చర్చిలోనే ఉండడం విశేషం. చెక్కతో మలచిన అపురూపమైన శిలువ పర్యాటకులను అమితంగా ఆకట్టుకుంటుంది. శిలువే కాదు.. ఈ చర్చి కూడా చాలా పెద్దదే.

వాణిజ్య రాజధాని దిమాపూర్‌...
నాగాలాండ్‌కు రాజధాని కోహిమానే అయినా.. దాదాపు అంతటి ప్రాధాన్యం ఉన్న మరో నగరం దిమాపూర్‌. నాగాలాండ్‌ వాణిజ్య రాజధానిగా పేరొందిన దిమాపూర్‌.. చుట్టుపక్కల ఉన్న మణిపూర్‌, అస్సాం, అరుణాచల్‌ప్రదేశ్‌, మేఘాలయ, త్రిపుర, మిజోరం రాష్ట్రాలకు కూడా చాలా దగ్గర. రాష్ట్రం మొత్తం మీద ఉన్న ఒకే ఒక్క విమానాశ్రయం దిమాపూర్‌లో ఉండటం మరో విశేషం. గతించిన కచారి రాజుల కాలం నాటి కట్టడాలు దిమాపూర్‌లో అక్కడక్కడా కనిపిస్తాయి. దిమాపూర్‌కు ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్న రుజాఫెమా మరో చక్కటి సందర్శనా క్షేత్రం. గిరిజనులు తయారుచేసే చిత్రవిచిత్రమైన వస్తువులు ఇక్కడ అనేకం లభిస్తాయి.

ప్రకృతి అందానికి మరోరూపం.. ఖొనోమా..
khonoma కోహిమాకు పది కిలోమీటర్ల దూరంలో ఉన్న ఖొనోమా అనే చిన్న గ్రామం ప్రకృతి సౌందర్యానికి పెట్టింది పేరు. ఆహ్లాదకరమైన గ్రామ పరిసరాలు విహారానికి ఎంతో అనువైన ప్రదేశాలు. పచ్చటి వరి పొలాలతో ప్రకృతి మాత నడయాడే ఖొనోమాకు టూరిస్టుల తాకిడి ఎక్కువ. ఇక్కడ సుమారు ఇరవై రకాల వరి పంట పండిస్తారంటే నమ్మశక్యం కాదు. సముద్ర మట్టానికి 2,438 మీటర్ల ఎత్తున ఉండే జుకోవాలీ ట్రెక్కింగ్‌కు అనువైన ప్రదేశం. ఇది కోహిమాకు 30 కిలోమీటర్ల దూరంలో ఉంది. వెదురుపొదలతోనూ, తెలుపు, పసుపు పచ్చ రంగుల లిల్లీ పువ్వులతోనూ లోయ అంతా ఆహ్లాదకరంగా ఉంటుంది.

షాపింగ్‌ అనుభూతి...
కోహిమా నగరం నడిబొడ్డున, బస్‌స్టేషన్‌ ఎదురుగా ఉన్న సేల్స్‌ ఎంపోరియం నాగా చేతివృత్తుల ఉత్పత్తులకు ప్రసిద్ది. రంగురంగుల శాలువాలు, చేతిసంచీలు, చెక్కతో మలచిన బొమ్మలు, వెదురుబుట్టలు ఇక్కడ లభ్యమవుతాయి.

ఇలా వెళ్లాలి...
విమానమార్గం: నాగాలాండ్‌లో ఉన్న ఒకే ఒక్క విమానాశ్రయం దిమాపూర్‌. కోల్‌కతా, గౌహతి నుంచి ఇక్కడికి విమాన సౌకర్యం ఉన్నది.

రైలుమార్గం: దిమాపూర్‌ రైల్వే స్టేషన్‌ నుంచి ఉత్తరభారతంలోని పెద్ద పట్టణాలకు రైలు సౌకర్యం ఉన్నది.
రోడ్డు మార్గం: దిమాపూర్‌ నుంచి కోహిమాకు టాక్సీలున్నాయి. గౌహతి, షిల్లాంగ్‌, కోహిమా నుంచి బస్సు సౌకర్యం ఉన్నది.


కర్టసీ : సూర్య Daily

మనసుదోచే '' మల్పె '' బీచ్‌

Malpe_Beach1
నీలి నింగి.. ఎటుచూసినా.. జలనిధి. నాట్యం చేస్తున్నట్లుండే కొబ్బరి, తాటి చెట్లు. క్షణానికోసారి పలకరించి వెళ్లే అలలు. చల్లగాలి సవ్వడి తప్ప మరో శబ్దం లేని ఏకాంత ప్రదేశం... నూతన జంటలకు అపురూప విహారానుభూతిని అందించే అరుదైన ప్రదేశం.. మర్పే బీచ్‌. కర్ణాటకలోని ఉడుపికి ఆరు కి.మీ దూరంలో ఉన్న మల్పె బీచ్‌. మెత్తని ఇసుక తిన్నెలతో కాళ్లను తాకే చల్లని నీటి అలలతో మనసును ఉత్సాహపరుస్తుంది. ప్రేమికులు, నవదంపతులే కాదు చిన్నాపెద్దా అందరూ చూసి మైమరిచిపోయిన అందమైన బీచ్‌ ఇది.

కర్ణాటకలో ప్రవహించే ఉదయవరా నదినే మల్పె నది అంటారు. మల్పె అనే ఊరిలోని సముద్ర తీరంలో ఉదయవరా నది కలవడంతో దీనిని మల్పె బీచ్‌ అని పిలుస్తుంటారు. నీలి రంగులో ఉండే ఇక్కడి అలలు మనసును ఈత వైపుకు లాగుతుంటాయి. ఇక్కడి జాలర్లు తమ వలలలో నిండుగా చేపలను పట్టుకుని వెళ్లే దృశ్యం మనసుకు ఆనందం కలిగిస్తుంది.

Malpe_Beach 

మల్పె కర్ణాటకలోని ముఖ్యమైన రేవు పట్టణం. చిన్న కార్గో బోట్ల ప్రయాణానికి గాను ఈ మల్పె నదిని ఉపయోగించుకుంటారు. ఇక్కడి ప్రకృతి అందాలు మనసుకు ప్రశాంతతను, ఉత్సాహాన్నిస్తాయి. ఈ బీచ్‌ సమీపంలోనే చిన్న ద్వీపాలు, తీరాలు కూడా ఉంటాయి. వెళ్లాలనుకునే వారు బోటు సిబ్బంది సహాయంతో వెళ్లి చూసిరావచ్చు.

సముద్రంలో రేగే తుపానుల తాకిడి నుంచి తట్టుకోవడానికి, కాసేపు సేదతీరడానికి ఈ ప్రాంతం చక్కగా అనుకూలిస్తుంది. ఇక్కడి ప్రజల జీవనాధారంగా చేపలనే ఎంచుకున్నారు. చేపల పెంపకం, సముద్రంలో వాటిని పట్టుకోవడం వంటివి వీరికి వెన్నతో పెట్టిన విద్య.

 
 
కర్టసీ : సూర్య Daily

ప్రకృతి రమణీయత కలిగిన జలపాతం .... కుంటాల

Kuntala-Water-Falls1
ఆంధ్రప్రదేశ్‌లోనే అత్యంత ప్రకృతి రమణీయత కలిగిన జలపాతం కుంటాల. ఉత్తర తెలంగాణాలోని ఆదిలాబాద్‌ జిల్లాలో ఉన్న ఈ జలపాతం పర్యాటకులను ఆకట్టుకోవడంలో మొదటిస్థానాన్ని ఆక్రమించింది. దక్షణ భారతదేశంలోనే అతిపెద్దదైన గోదావరి నదికి ఉప నదిఅయిన కడెం నదిపై అలరారుతున్న ఈ జలపాతం రాష్ట్రానికే తలమానికంగా ఉంది. దేశవ్యాప్తంగా అత్యంత ప్రాచూర్యాన్ని పొందిన ఈ జలపాతం రాష్ట్రంలోనే అతి ఎత్తయిన జలపాతం కూడా కావడం విశేషం.


రాష్ట్రంలోనే అత్యంత ఎతైన కొండల నుంచి అడవులను చీల్చుకుంటూ ప్రకృతి రమణీయతనంతా తనలో ఇముడ్చుకొని.. కొండ కోనల నుంచి జాలు వారుతున్న అందాల జలపాతం కుంటాల. సహాజ సిద్దమైన.. దట్టమైన అడవులు, ఎతె్తైన రాళ్లను చీల్చుకుంటు దాదాపు 45 అడుగుల ఎత్తు నుంచి భీకర శబ్దంతో కిందికి జాలువారుతూ పర్యటకులను మంత్ర ముగ్దులను చేస్తుంటుంది కుంటాల జలపాతం. ఆదిలాబాద్‌ జిల్లా కేంద్రానికి సుమారు 45 కిలోమీటర్ల దూరంలో ఉన్న నేరడిగొండ మండల కేంద్రం నుంచి సుమారు 12 కిలోమీటర్ల దూరం కుడివైపు వెళ్తే అందమైన కుంటాల జలపాతం కనిపిస్తుంది.


Kuntala-Water-Falls కడెం నది పరివాహాక ప్రాంతంలో ఉండే ఈ జలపాతం ప్రతి యేట వర్షకాలంలో భీకర శభ్దంతో భయంకరంగా కనిపిస్తూ పర్యటకుల గుండెల్లో గుబులు రేపుతుండగా.. జనవరి తర్వాత చల్లటి సెలయేర్లు, తెల్లటి నురగలతో కొండ కోనలపై నుంచి జాలువారుతు ఆదిలాబాద్‌ మనిహారంగా నిలుస్తున్నది. సహ్యాద్రి పర్వత శ్రేణుల నుంచి జాలువారుతున్న ఈ జలపాతాన్ని చూడడానికి జిల్లా నుంచే కాకుండా పొరుగున ఉండే నిజామాబాద్‌, కరీంనగర్‌, వరంగల్‌, ెహదరాబాద్‌తో పాటు మహారాష్టల్రోని నాందేడ్‌, యవత్‌మల్‌, చంద్రాపూర్‌ లాంటి జిల్లాల నుంచి పర్యటకులు భారీగా తరలి వస్తుంటారు. సెలవు దినాలతో పాటు వేసవిలో సైతం పర్యటకులు ఇక్కడి ప్రకృతి కమనీయతను ఆస్వాదించడానికి సుదూర ప్రాంతాల నుంచి వాహానాలలో తరలివచ్చి ఉదయం నుంచి సాయంత్రం వరకు ఇక్కడే వంట వార్పు చేసుకొని వన భోజనాలు చేసి వెళ్తుంటారు. అటవీ ప్రాంతంలో ఉన్న ఈ జలపాతం పూర్వ పరాలను పరిశీలిస్తే అప్పటి శకుంతల దుష్యంతులకు విహార వెడిది కేంద్రంగా ఉండేదని శకుంతల జలపాతంగా మొదట దీనిని పిలువగా ఆతర్వాత ‘కుంతల’ జలపాతంగాను పిలువబడి కాల క్రమేనా ‘కుంటాల’ జలపాతంగా మారింది.


సోమేశ్వరాలయం...
ఈ జలపాతానికి అతి దగ్గరలో సోమేశ్వరాయం ఉంది. మహ శివరాత్రి రోజున ఈ దేవాలయాన్ని అత్యంత సుందరంగా అలంకరిస్తారు. కుంటాల జలపాతంలోని ఎతె్తైన.. నీళ్లు జాలువారే ప్రదేశ సమీపంలోనే ఉన్న గుహలో సోమేశ్వరుడు కొలువై భక్తుల మొక్కులు చెల్లిస్తున్నాడు. ప్రతియేట మహాశివరాత్రి పర్వదినాన ఇక్కడ జాతర అంగరంగవైభవంగా జరుగుతుంది. ఆ సమయంలో వందలాది మంది శివభక్తులు వచ్చి.. అతి ప్రమాదమని తెలిసి కూడా గుహలో పూజలు చేసి తరించడం గమనార్హం. ఈ గుహ నుంచి ఇచ్చోడ ప్రాంతంలోని సిరిచెల్మ మల్లేశ్వర స్వామి ఆలయం వరకు సోరంగ మార్గం ఉందనే వాదన కూడా ఉంది. ఈ గుహను ప్రజలు సోమన్న గుహగా కూడా చెప్పుకుంటారు. ప్రకృతి సహాజ సిద్దమైన జలపాతంగా ఉన్న కుంటాలను రాష్ట్రప్రభుత్వం మరింత అభివృద్ధి పరచాల్సి ఉంది. రెండేళ్ల క్రితం అటవీ శాఖ ప్లానింగ్‌ విభాగం ‘ఎకో టూరిజం’ పేరుతో కొంత అభివృద్ది చేసినప్పటికీ పర్యాటకులకు మరినిన సౌకర్యాలు కల్పించాల్సివుంది.


చారిత్రక విశేషం...
03ADB22 భార్య శకుంతల నుంచి పేరుతో ఈ జపాతాన్ని ‘కుంటాల’ అనే పేరు వచ్చిందని స్థానికుల అభిప్రాయం.. ఈ జలపాతం పరిసర ప్రాంతాలను వీక్షించి మైమరిచిపోయిన శకుంతల తరుచుగా ఈ జలపాతంలో జలకాలాడేదని ఇక్కడి ప్రలు నమ్ముతారు. ఈ ప్రాంతం.. మూడు జలపాతాలు, గుండాలుగా ఉన్నాయి. ఈ గుండాల్లో ముఖ్యమైన గుండాన్ని స్థానికులు సోమన్న గుండంగా పిలుస్తారు. ఈ జలపాతం వద్ద ప్రకృతి సిద్ధమైన రాతిగుహల్లో శివలింగాలు ప్రతిష్టమై ఉండటం వలన ప్రతి సంవత్సరం శివరాత్రి రోజున భక్తులు ఈ శివలింగాలను సందర్శించుకొని పూజలు నిర్వహిస్తారు. దీనినే ఇక్క డ సోమన్న జాతరగా పిలుస్తారు. శివరాత్రి పర్వదినాన్ని ఇక్కడ రెండు రోజుల పాటు జరుపుకోవడం ఆనవాయితీ. ఇది అనాదిగా వస్తున్న ఆచారం కూడా. ఇదే జిల్లాలో... చదువుల తల్లి సరస్వతీ దేవి కొలువై ఉన్న బాసర దేవాలయాన్ని సందర్శించే భక్తుల టూర్‌ షెడ్యూల్లో కుంటాల జలపాతం కూడా ఉంటుంది. జపాతానికి చుట్టూ ఉన్న అడవి ఉష్ణమండల శుష్క ఆకురాలు వనాల రకానికి చెంది అన్ని జాతుల వృక్షాలు కిలిగి అధికంగా టేకు చెట్లతో నిండి ఉన్నది. ఈ అడవిలో చాలా రకాల అటవీ జంతువులు, పక్షులు ఉన్నాయి.


ఇలా వెళ్ళాలి...
ఆదిలాబాద్‌ జిల్లా కేంద్రానికి 60 కిలోమీటర్ల దూరంలో ఈ జలపాతం ఉన్న నేరేడిగొండ అనే గ్రామానికి 12 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌కు సుమారు 275 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ పర్యాటక కేంద్రానికి బస్సు, రైలు సౌకర్యం కలదు. బస్సు ప్రయాణాన్ని ఎంచుకుంటే హైదరాబాద్‌ - నాగపూర్‌ జాతీయ రహదారి మీదుగా నగర శివారులోని మేడ్చైఉ నుండి బయలుదేరి కామారెడ్డి, ఆర్మూర్‌, నిర్మైఉ (నిజామాబాద్‌ జిల్లా)ల మీదుగా కుంటా చేరుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్‌ రోడ్డు రవాణా సంస్థ ఇక్కడికి బస్సు సౌకర్యం కూడా కల్పిస్తోంది. రైలు మార్గం గుండా వెళ్తే సికింద్రాబాద్‌ నుండి ఆదిలాబాద్‌ చేరుకొని అక్కడి నుండి బస్సు ద్వారా కుంటాలా చేరుకోవచ్చు.


స్విమ్మింగ్‌ నిషేధం...
45 మీటర్ల ఎత్తు నుంచి జాలువారే నీళ్ళు,ఆ చప్పుడు పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంటుంది. దట్టమైన అడవులలో, సహ్యాద్రి పర్వత పంక్తుల్లో గోదావరికి ఉపనది ఆయన కడెం నదిపై ఈ జలపాతం ఉంది. జలపాతం దిగువభాగంలో సమతలంగా ఉన్న బండరాళ్ళు ప్రత్యేకత ఆకర్షణగా నిలుస్తున్నాయి. జలపాతం వద్ద ఉన్న లోయలు కూడా చాలా లోతుగా ఉండి నీళ్ళు సుళ్ళు తిరిగే దృశ్యం ముచ్చటగొలుపుతుంది. ఇక్కడ నీటిలో స్విమ్మింగ్‌ చేయడం నిషేధం. ఎందుకంటే ఎంతో లోతైన ఈ జలపాతంలో ఈదటం చాలా ప్రమాదకరం.
కర్టసీ : సూర్య Daily

Sunday, April 24, 2011

సాంచి - బౌద్ధభిక్షువుల ప్రార్థనలతో, బౌద్ధ సంఘ నివాసంతో పునీతమైన నేల.

రెండు పురా పర్యటనలు ధమ్మమూ ఆదిమమూ

భోపాల్‌కి సాంచి చాలా దగ్గర. గంటన్నర ప్రయాణం. మధ్యప్రదేశ్ గ్రామాల మధ్య నుంచి విదిశ వెళ్ళే రహదారి మీద ప్రయాణం. విదిశ అనే పేరు వినగానే 'వనలతాసేన్'ను వర్ణిస్తూ 'విదిశలో అలుముకున్న చిక్కని చీకట్లలాగా ఆమె కురులున్నాయి' అన్న జీవనానంద దాస్ వాక్యం గుర్తొచ్చింది. మేం వెళ్తున్న దారిలో ఒకచోట మైలురాయి మీద కర్కాటక రేఖ (Tropic of cancer) అని రాసి ఉంది. కర్కాటక రేఖను దాటుతున్నానని తెలియగానే నాకేదో విచిత్రమైన అనుభూతి కలిగింది. బండి ఆపమని చెప్పి దిగి ఆ ఊహాజనిత రేఖమీద కొన్ని క్షణాలు నిల్చున్నాను.

సాంచి మధ్యప్రదేశ్‌లోని రాయిసెన్ జిల్లాలో ఉన్న ఒక మామూలు గ్రామం. ఊళ్లో అడుగుపెట్టాక కూడా ఏ విశిష్ట సంవేదనలూ కలగవు. సాంచి స్థూపం కొండమీద ఉందని తెలిసినప్పుడు కొద్దిగా ఆశ్చర్యమనిపించింది. నేనంతదాకా చూసిన బౌద్ధ చైత్యాలు అమరావతి, నాగార్జునకొండ, ఘంటశాల వంటివి నేలమీద నిర్మించిన చైత్యాలు. కారు మలుపులు తిరుగుతూ పైకెక్కుతుండగా అప్పుడప్పుడే లేత చిగుళ్ళతో రంగులు పోసుకుంటున్న మాఘమాసపు అడవి మధ్య ఆ కొండ సాక్షాత్కరించింది. చుట్టూ లేతాకుపచ్చని నీలపు కాంతిలో పొలాలు, నేల, నింగి కలగలిసి ఒక నీటిరంగుల పూత నా ముందు ప్రత్యక్షమయింది. నాకు తెలియకుండానే నాలో ఏదో ప్రశాంత భావన ఉదయించడం మొదలయ్యింది.

బుద్ధుడు ప్రత్యక్షమైనట్టే ఉంది

కారు పార్కింగ్ ప్లేస్‌లో ఆపుతూ డ్రైవరు 'అదిగో అదే సాంచి' అన్నాడు. ఆ ఎండ వెలుతురులో నా ముందు స్థూపం ప్రత్యక్షం కాగానే నాకు చెప్పలేని వివశత్వం కలిగింది. పరుగు పరుగున ఆ ప్రాంగణం దగ్గరికి పోయి నిల్చొన్నాను. నా ముందు ధ్యానమూర్తి అయిన బుద్ధుడు ప్రత్యక్షమయినట్టే ఉంది. మనకెంతో పరిచితమైన ధ్యానబుద్ధ ప్రతిమలో ఏదో విశేషముంది. ఆ మూర్తిని చూస్తున్నప్పుడు మనలో ఏదో అనిర్వచనీయ భావన మేల్కొంటుంది. దాదాపు మూడు వందల అడుగుల ఎత్తున కొండమీద నిర్మించిన ఈ స్థూపం భారతదేశంలోని బౌద్ధ స్థూపాలన్నిటిలోనూ కూడా అత్యంత సురక్షితంగా నిలబడ్డ నిర్మాణం. కాలం తాకిడికి చెక్కు చెదరని బుద్ధవాక్యం లాగా కనిపిస్తుంది.

క్రీ.పూ. 3వ శతాబ్దం నుంచి క్రీ.శ. 10వ శతాబ్దం దాకా దాదాపు 1300 ఏళ్ళ పాటు ఈ స్థూపం ఎందరో బౌద్ధభిక్షువులకీ, బౌద్ధ మతాభిమానులకీ, బౌద్ధ సాంఘికులకీ ఆశ్రయంగా నిలబడుతూ వచ్చింది. ఆశ్చర్యమేమిటంటే బుద్ధుడి జీవితంలోని ఏ ప్రముఖ సంఘటనతోటీ సాంచికి సంబంధం లేదు. బుద్ధుడు తన జీవితకాలంలో ఇక్కడ అడుగు పెట్టలేదు. ఏడవ శతాబ్దంలో భారతదేశాన్ని పర్యటించిన చీనా యాత్రికుడు జువాన్ జుంగ్ భారతదేశంలో తాను చూసిన ప్రతి ఒక్క బౌద్ధస్థలం గురించి ఎంతో సవివరంగా నమోదు చేశాడు గాని సాంచి గురించి కనీసం ప్రస్తావించలేదు. అయినా కూడా బౌద్ధభిక్షువుల ప్రార్థనలతో, బౌద్ధ సంఘ నివాసంతో పునీతమైన నేలగా సాంచి చరిత్రలో నిలబడింది.

అశోకుడు నిర్మించాడు


సాంచి గురించి మొదటి ప్రస్తావన సింహళ బౌద్ధ గ్రంథాలైన 'మహావంశం', 'దీపవంశం'లలో ఉంది. అవి చెప్పేదాన్ని బట్టి అశోకుడు మౌర్యచక్రవర్తి కాకముందు ఉజ్జయినిలో రాజప్రతినిధిగా పరిపాలన సాగిస్తున్నప్పుడు ఇప్పటి విదిశకు చెందిన ఒక వర్తకుడి కుమార్తెను పెళ్లి చేసుకున్నాడు. ఆమె పేరు దేవి. ఏళ్ళ తరువాత అతడి కుమారుడు మహేంద్రుడు విదిశలో ఉన్న మహారాణి దేవిని చూడడానికి వెళ్లినపుడు ఆమె విదిశగిరి దగ్గర తాను నిర్మించిన బౌద్ధారామానికి అతణ్ణి తీసుకువెళ్ళి చూపించినట్టుగా ఆ గ్రంథాలు ప్రస్తావిస్తున్నాయి. బహుశా అశోకుడు క్రీస్తుపూర్వం 3వ శతాబ్దంలో విదిశ నుండి ఉజ్జయిని వెళ్ళేటప్పుడో, ఉజ్జయిని నుండి విదిశ వెళ్ళేటప్పుడో ఈ అడవిలో ఈ కొండని చూసి ఉంటాడు. ప్రజల్ని ప్రబోధించగల వాక్యాలు ఎక్కడ ఏ కొండమీద రాస్తే నలుగురూ చదువుతారో అశోకుడికి తెలిసినట్టుగా ఈ దేశంలో మరెవరికీ తెలియదు. బహుశా అశోకుడి చూపులోనే ఆ 'దృష్టి' ఉంది. అందుకనే మొదటిసారి అతడీ కొండని చూసినప్పుడు అతడికి ఈ కొండమీద ఒక బౌద్ధస్థూపం కూడా కనబడి ఉండాలి. తన అంతరంగంలో దర్శించిన ఆ స్థూపాన్ని తక్కిన దేశమంతా చూసేటట్టు అతడు ఈ స్థూప నిర్మాణం చేపట్టాడు.

అయితే సాంచి మౌర్య సామ్రాజ్య వైభవాన్ని కూడా దాటి బతికింది. మౌర్య సామ్రాజ్యం పతనమయ్యాక కొద్దికాలం ఇబ్బందిపడ్డప్పటికీ ఆ తరువాత వచ్చిన శుంగవంశుల కాలంలో ఆ నిర్మాణం మరింత విశాలమైంది. ఆ కాలంలో అశోకుడు నిర్మించిన స్థూపాన్ని పెద్దది చేయడం, చుట్టూ పిట్టగోడ, మెట్లు, హర్మిక నిర్మించడం జరిగింది. ఈసారి ఆ స్థూపాన్ని మరింత సుందరంగా తీర్చిదిద్దే పని శాతవాహనుల వంతయింది. వాళ్ళ కాలంలోనే ఈనాడు మనం చూస్తున్న తోరణాలు నిర్మాణమయ్యాయి. మళ్లా హర్షుడి కాలంలో సాంచి మరొక వైభవాన్ని చవిచూసింది.

జనరల్ టేలర్ కనుగొన్నాడు

సాంచి ఎప్పటినుంచి నిర్జనంగా మారిందో స్పష్టంగా తెలియదు కాని 13వ శతాబ్దపు తరువాతి కాలానికి చెందిన నిర్మాణాలేవీ ఇక్కడ కనిపించడం లేదు. ఇక్కడ నుంచి బౌద్ధభిక్షువులు నెమ్మదిగా తరలిపోయారు. అందుకు స్పష్టంగా చెప్పగల కారణాలేవీ లేవు. 1818లో ఈస్టిండియా కంపెనీకి చెందిన జనరల్ టేలర్ ఈ శిథిలాల్ని కనుగొనేదాకా సాంచి భారత చరిత్రలో ఒక విస్మృత పదం. సాంచిని ఇప్పుడున్న రూపంలో మనం చూడడానికి కారకులైనవాళ్లు అలెగ్జాండర్ కన్నింగ్‌హామ్, కెప్టెన్ ఎఫ్.జి మైసే, మేజర్ కోల్ ముఖ్యంగా సర్ జాన్ మార్షల్. సాంచిలో స్థూపాలు సురక్షితంగా బయటపడడంతో పాటు, దుర్భరమైన నిజాలు కూడా వెలుగులోకి వచ్చాయి. ముఖ్యంగా అశోకుడు స్థాపించిన స్తంభాన్ని జమీందారు ముక్కలు చేసి చెరకు గానుగగా మార్చుకున్నాడు లాంటివి.

శ్రమణజీవితఫలం గుర్తుకొచ్చింది

నేను పిచ్చివాడిలా ప్రదక్షిణంగా, అప్రదక్షిణంగా ఆ స్థూపం చుట్టూ అటూ ఇటూ తిరుగుతూ, నా చేతుల్లోకి చిక్కుతున్నట్టే చిక్కి మరుక్షణమే జారిపోతున్న ఆ అపురూపమైన ప్రశాంతి ఎటువంటిదో బోధపరచుకునే ప్రయత్నం చేశాను. ఇది ఎటువంటి జీవిత ప్రయత్నాలకు సార్థక్యంగా, సత్ఫలితంగా లభించగల కానుక అయి ఉండవచ్చునని ఆలోచించాను. బుద్ధుడి దీర్ఘ సంభాషణల్లో 'సామంజ ఫలసుత్త'మనే అందమైన, ఆలోచనాపూరితమైన సంభాషణ ఉంది. నాకా సంభాషణ గుర్తొచ్చింది. ఒకప్పుడు ఒక కార్తీక పున్నమి రాత్రి మగథ చక్రవర్తి అజాతశత్రు రాజగృహంలో తన ఇంటి మేడ మీద వెన్నెల్ని చూస్తూ ఇంత అందమైన రాత్రి ఎవరైనా ఒక వివేకవంతుడు సన్నిధికి పోయి కూర్చుంటే ఆయన చెప్పే మాటలు వింటే ఎంత బాగుంటుందో అనుకుంటాడు. అటువంటి వివేకవంతుడు ఎవరన్నా ఉన్నారా అని తన మంత్రుల్ని ప్రశ్నిస్తాడు. ఒక్కొక్కరూ ఒక్కొక్కరి గురించి చెప్తారు.

కాని జీవక కుమారబచ్చ అనేవాడు తన మామిడితోటలో విడిది చేసిన బుద్ధుడి గురించి చెప్తాడు. అప్పుడు అజాతశత్రువు బుద్ధుణ్ణి చూడడానికి వెళ్ళి ఆయనతో సంభాషణకు పూనుకుంటాడు. ఆ రోజు అతడు బుద్ధుణ్ణి అడిగిన ప్రశ్న శ్రమణజీవిత ఫలమేమిటని. బుద్ధుడు అతనికి ఎన్నో పార్శ్వాలలో, ఎన్నో ఉదాహరణలతో ఎంతో వివరంగా చెప్తాడు దాని గురించి. అది చదివినప్పుడు నాకర్థమైందేమిటంటే, ఒక మనిషి సామాజిక నిశ్రేణిలో భాగంగా ఉండకుండానే, ఈ నిచ్చెన మెట్ల వ్యవస్థ తాలూకు బానిసత్వం నుండి బయటపడి అదే సమయంలో తనకూ, సమాజానికీ కూడా ఎంతో ప్రయోజనకరమైనటువంటి జీవితాన్ని జీవించవచ్చునని చెప్పాడని. ఒక ఇంటిమీద నిల్చొన్న మనిషి కింద రహదారుల మీద మనుషులు అటూ ఇటూ తిరుగుతూ, ఇళ్ళలోకి వస్తూ వెళ్తూ ఉండడాన్ని చూస్తూ 'మనుషులు ఇలా ఇళ్ళల్లో ప్రవేశిస్తున్నారు. ఇలా బయటికి వెళ్తున్నారు, ఇలా వీధుల్లో నడుస్తున్నారు, ఇలా నాలుగు రోడ్ల కూడళ్ల దగ్గర చేరుతున్నారు' అని అనుకున్నట్టే మృత్యువు గురించి, మనుషుల ప్రవేశాల గురించీ, నిష్క్రమణల గురించి కూడా ఆలోచించడానికి వీలవుతుందన్నాడాయన.

శ్రమణజీవితంలో ఉండే వివిధ రకాల ప్రయోజనాల గురించి చెప్తూ, బుద్ధుడు ఇంకో మాట అన్నాడు. ఆ జీవితం పనికిమాలిన సంభాషణలకి దూరంగా ఉండే జీవితమన్నాడు. ఆ జీవితంలో 'రాజుల గురించీ, దొంగల గురించీ, మంత్రుల గురించీ, సైన్యాల గురించీ, భయాల గురించీ, తిండి గురించీ, తాగుడు గురించీ, వస్త్రాల గురించీ, శయ్యల గురించీ, హారాల గురించీ, అత్తరుల గురించీ, బంధువుల గురించీ, వాహనాల గురించీ, గ్రామాల గురించీ, నగరాల గురించీ, దేశాల గురించీ, స్త్రీల గురించీ, నాయకుల గురించీ' అనవసర సంభాషణలు ఉండవన్నాడు. దాని గురించీ, దీని గురించీ ఊహాగానాలు ఉండవన్నాడు. మనం మన కార్యస్థానాల్లో, మన సమాచార, వార్తా ప్రసార మాధ్యమాల్లో, మన సోషల్ నెట్‌వర్కింగ్ సైట్లలో చేస్తున్నదదే అని గుర్తొచ్చాక సాంచి మరింత గొప్పగా అనిపించింది.

భీమ్ బేట్క గుహలు

సాంచి నుండి భోపాల్ తిరిగి వస్తుండగా భోపాల్ దగ్గరలోనే భీమ్‌బేట్క గుహలున్నాయని తెలిసింది. ఎప్పుడో పదేళ్ల కిందట నేనా గుహల గురించి చదివాను. అప్పుడు నాలో రగిలిన కుతూహలం మళ్లా బయటికొచ్చింది. ఒక్కసారి నా మనసు క్రీ.పూ. 3వ శతాబ్దం నుంచి క్రీ.శ. 300వ శతాబ్దానికి (అవును 300 శతాబ్దమే) పరుగులు పెట్టింది.

ఇట్లాంటి స్థలాలకి మనం అసలు ఎందుకు వెళ్ళాలి? ఠాగూర్ ఒకచోట రాస్తాడు. మనం ఇట్లాంటి స్థలాలకు వెళ్లినపుడు మనం మనలోని పరిమిత జ్ఞానాల నుంచి, సంకుచిత దృక్పథాల నుంచి బయటపడతామనీ; అపరిమితమైన దాంతో, గంభీరమైన దాంతో శాశ్వతమైన దాంతో మనని మనం అనుసంధానించుకుంటామనిన్నీ, అవకాశాల కోసం వెతుకులాడే పరుగు నుంచి కొద్దిసేపైనా పక్కకు తిరిగి ఇటువంటి తీరికవేళల కోసం, సోమరివేళల కోసం ప్రయత్నాలు చేయాలన్నాడాయన. బషో యాత్రా వర్ణనలు చదివి వాటిని తెలుగులోకి తెచ్చిన తరువాత, నాకు కూడా ఇట్లాంటి సోమరివేళల కోసం వెతుకులాట మొదలయ్యింది.

భీమ్ బేట్క గుహలు వింధ్య పర్వతాల్లో ఉన్న గుహల సముదాయం. సముద్ర మట్టానికి దాదాపు రెండువేల అడుగుల ఎత్తున ఉన్న ఈ గుహల్లో తొలి భారతీయ మానవుడు నివసించిన జాడలున్నాయి. అక్కడ కనీసం ఒక లక్ష ఏళ్ళ కిందటనే మనిషి జీవించిన ఆనవాళ్లున్నాయి. అన్నిటికన్నా ముఖ్యం అక్కడ గుహల్లో ఆదిమానవుడు చిత్రించిన చిత్రాలున్నాయి. ఈ చిత్రాలు కనీసం 30 వేల ఏళ్ల నాటివి.

ఇప్పుడు కవితలు రాసే యువకవులు నగరాల్లో కూర్చుని తమ పల్లెటూళ్ల గురించీ, బాల్యం గురించీ, ఎడ్ల గురించీ, వ్యవసాయ పనిముట్ల గురించీ రాస్తున్నట్టే ఒకప్పుడు వాల్మీకి, కాళిదాసు వంటివారు వ్యావసాయిక సమాజంలో భాగంగా కవిత్వం రాస్తూ తమ అరణ్య జీవిత జ్ఞాపకాల్ని తలపోసుకున్నారు. వైదిక, వేదాంత, తాంత్రిక, దార్శనిక పరిభాషల్లో 'గుహ' అంటే అత్యంత పవిత్రస్థలం. జీవిత రహస్యాలు గోచరించే స్థలం. నేడు మనకు వాక్కులో దివ్యజ్ఞానానికి ఆనవాళ్లుగా మిగిలిన గుహలు నిజంగా ఎలా ఉంటాయో, అక్కడ మానవుడు ఎలా జీవించి ఉంటాడో చూడాలంటే భీమ్ బేట్క వెళ్లాలి!

చరిత్ర వెనక్కి జరిగింది

1870లో స్పెయిన్‌లో అల్టామీర గుహల్లో ఆదిమ మానవుడు చిత్రించిన చిత్రాలు బయటపడడం యూరప్‌నే కాదు, ప్రపంచాన్నే కుదిపేసింది. అంతదాకా దావిన్సీని, రాఫేల్‌ని, రూబెన్స్‌ని మాత్రమే ఆరాధిస్తూ వచ్చిన యూరోపియన్ చిత్రకారుణ్ణి పికాసోగా మార్చిన గుహలవి. ఆదిమ మానవుడు వస్తుపరంగా మనకన్నా వెనకబడి ఉండవచ్చునేమోగానీ, సాంకేతికంగా శిల్ప దృష్టిపరంగా మనకన్నా ఎన్నో యుగాల ముందున్నాడని ఆ చిత్రాలు ప్రపంచానికి చాటాయి. అల్టామీర గుహాచిత్రలేఖనాలు బయటపడ్డ కొద్ది రోజులకే ఫ్రాన్స్‌లో, ఆఫ్రికాలో, చైనాలో కూడా ప్రాచీన గుహాచిత్రలేఖనాలు బయటపడ్డాయి. వీటన్నిటిలోనూ ఆఫ్రికన్ గుహాచిత్రలేఖనాలు అత్యంత ప్రాచీనాలు.

అయితే 1957లో ఉజ్జయినిలోని విక్రమ్ విశ్వవిద్యాలయానికి చెందిన వి.ఎస్. వకాంకర్ భీమ్‌బేట్క గుహల్లోని చిత్రలేఖనాల్ని బయటపెట్టడంతో భారతదేశ కళాచరిత్ర, మానవభావావేశ చిత్రణ 30 సహస్రాబ్దాలు వెనక్కి జరిగింది. భారతదేశంలోని తక్కిన గుహాచిత్రలేఖనాలు అన్నీ ఒక ఎత్తు, భీమ్‌బేట్క గుహాచిత్రాలొక్కటీ ఒక ఎత్తు. అందుకనే వకాంకర్ భీమ్‌బేట్కని 'ప్రాగైతిహాసిక మానవుడి స్వర్గం'గా అభివర్ణించాడు. అందుకనే యునెస్కో ప్రపంచ వారసత్వ సంపదగా భీమ్ బేట్కని గుర్తించింది.

భారతదేశంలో ఈ గౌరవం పొందిన గుహాసముదాయం ఇదొక్కటే. ప్రపంచంలో దీనితో సమానమైన గౌరవం పొందిన గుహాసముదాయాలు కొన్ని ఉన్నాయి. కలహారి ఎడారిలోని బుష్‌మన్‌ల గుహాచిత్రాలు, ఫ్రాన్స్‌లోని పాతరాతియుగపు గుహాచిత్రాలు. ఒక మానవ నివాసాన్ని ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తించడానికి యునెస్కో పది ప్రమాణాలు పెట్టుకుంది. అందులో భీమ్‌బేట్క రెండు ప్రమాణాలకు నిలబడుతోందని యునెస్కో చెప్పింది. ఒకటి, ఇక్కడ మానవుడికీ ప్రకృతికీ మధ్య సుదీర్ఘంగా ఒక నిరంతర ఆదానప్రదానం జరిగిందన్న నిరూపణ ఉండడం, రెండవది, ఈ ప్రాంతంలో ఇప్పటికీ నివసిస్తున్న ఆదివాసుల జీవన విధానాన్ని బట్టి గత 300 శతాబ్దాలుగా వేట, ఆహార సేకరణ ముఖ్య వృత్తులుగా వికసించిన ఆర్థిక వ్యవస్థ కొనసాగుతూ వస్తున్నది అన్నది.

అగస్త్యుణ్ణి కానన్నాను

అడవి దారమ్మట పలాశ, మోదుగు వృక్షాల్ని చూస్తూ భీమ్ బేట్క చేరాను. డ్రైవరు కారు ఆపి 'ఇక్కడి నుంచి మీరు నడిచి వెళ్ళాలి' అన్నాడు. వింధ్యపర్వతాల్లో అడుగుపెట్టాను అని స్ఫురించగానే నాకు చెప్పలేని వివశత్వం కలిగింది. ఒకప్పుడు అగస్త్యుడు ఉత్తరం నుంచి ఈ వింధ్య దాటే దక్షిణానికి అడుగుపెట్టాడు. ఆయన తిరిగి వెళ్లడం కోసం వింధ్య అప్పటి నుంచీ తలొగ్గి ఎదురుచూస్తూనే ఉంది. కాని వింధ్యని శాశ్వతంగా అణచడం కోసం అగస్త్యుడు ఈ దారిన తిరిగి వెళ్లలేదు. బహుశా అప్పణ్ణుంచీ తనను చేరవస్తున్న ప్రతి మానవుడిలోనూ వింధ్య ఒక అగస్త్యుణ్ణి గుర్తుపట్టే ప్రయత్నం చేస్తూనే ఉంటుందనుకుంటాను. అందుకనే ఆ పర్వత సముదాయం నన్ను 'నువ్వు అగస్త్యుడివేనా?' అని అడిగినట్టనిపించింది. నేను చిరునవ్వుతో 'అగస్త్యుణ్ణి కాదు! అవిసె చెట్టుని మాత్రమే' అన్నానా కొండలతో (సంస్కృతంలో అగస్త్యమంటే అవిసె చెట్టు అని కూడా అర్థం.)

సుమారు నాలుగు గంటల పాటు ఆ గుహలంతటా కలియ తిరిగాను. ఆ గుహా సముదాయం ఒక ప్రాచీన మెట్రోపోలిస్ లాగా అనిపించింది. అది దాదాపుగా 700 గుహల సముదాయం. అందులో 243 గుహల దాకా భీమ్‌బేట్క చుట్టుపక్కల ఉన్నాయి. ఇవి క్రీ.పూ. 30 వేల సంవత్సరాల నాటివనే వాళ్లూ ఉన్నారు. కాదు ఐదువేల ఏళ్ళ నాటివే అనే వాళ్లూ ఉన్నారు. పూర్తిగా నిర్ధారణ కాకున్నా అవి రాతియుగం కాలం నాటి వనడంలో సందేహం లేదు. మన కళలు, సాహిత్యం, మతాల మీద మధ్యరాతియుగం ప్రభావాలే బలంగా ఉంటాయి. ఆ రకంగా చూసినట్లయితే భారతీయ సాహిత్యం మీద, మతాల మీద, భారతీయ జీవిత దృక్పథం మీద మధ్యరాతియుగ ప్రభావం ఇప్పుడిప్పుడే వెలుగులోకి వస్తోంది.

మధ్యరాతియుగంలో భారతదేశం ఐదు ప్రధాన భూభాగాలుగా ఉండేది. వేదాల్లో పంచజనుల ప్రస్తావన తరచూ కనిపిస్తుంది. ఈ పంచజనుల ప్రస్తావన చాలామంది అనుకునేటట్లుగా ఐదు కులాల ప్రస్తావన కాదు. ఇది మధ్యరాతియుగపు భారతీయ జీవిత జ్ఞాపకాల నుంచి ఉత్పన్నమైన భావన. భారతదేశపు తూర్పు, పడమర, ఉత్తర, దక్షిణ మధ్యభాగాలకు చెందిన జనజీవితాన్ని సూచించే మాట అది. అప్పట్నుంచీ, ఇప్పటిదాకా కూడా భారతదేశం భౌగోళికంగా, సాంస్కృతికంగా ఐదు భాగాలుగా వికసిస్తూ ఉన్న ఏకజాతి, ఏకదేశం, ఏకస్ఫూర్తి. ఈ ప్రతిపాదనకు గంభీరమైన ప్రాతిపదికగా భీమ్ బేట్క గుహలు నిలబడి ఉన్నాయి.

అది చిత్రకేంద్ర సంస్కృతి

  అనేక ప్రాచీన గుహాచిత్రాల్లో, అయితే మనుషులకి ప్రాతినిధ్యం ఉంది, లేదా జంతువులకు మాత్రమే ప్రాతినిధ్యం ఉంది. బహుశా ఈ సమస్య అనాదికాలం నుంచి కళనీ, సాహిత్యాన్నీ కూడా పట్టి పీడిస్తూనే ఉంది. ఇప్పటికీ మన ఆధునిక, అత్యాధునిక చిత్రకళలో కూడా అయితే ప్రకృతి ఉంటుంది లేదా మనుషులు మాత్రమే ఉంటారు. కాని భీమ్‌బేట్క గుహల్లో చిత్రించిన చిత్రాల్లో జంతువులు, మనుషులు కూడా సమాన ప్రాతినిధ్యం పొందారు. ఆ మాటకొస్తే ఆ చిత్రలేఖనాల్లో కేవలం ప్రకృతి లేదు, కేవలం మనిషి లేడు. ప్రకృతి, మనిషి సమానంగా పాల్గొనే ఒక జీవనక్రతువు మాత్రమే ఉంది. బహుశా ఈ స్ఫూర్తినే ఋగ్వేదం కూడా అనుసరించి ఉంటుందనుకోవచ్చు. ఋగ్వేదమానవుడి గురించి రాస్తూ రేమండ్ పణిక్కర్ తన 'వేదిక్ ఎక్స్‌పీరియన్స్'లో ఈ విషయాన్నే పదేపదే వివరిస్తాడు. కాగా, ఋగ్వేదమానవుడు ప్రకృతి, మానవుడు పాల్గొనే ఇటువంటి క్రతువులకి ఆలంబనగా 'వాక్కు'ని స్వీకరించాడు. అది శబ్దకేంద్ర సంస్కృతి. వింధ్య పర్వతాల్లో నివసించిన ప్రాచీన భారతీయుడు ప్రకృతి - మనిషి పాల్గొనే క్రతువుకి ఆలంబనగా చిత్రలేఖనాన్ని స్వీకరించాడు. ఇది చిత్రకేంద్ర సంస్కృతి.

నేనక్కడ సంచరిస్తున్నంతసేపూ ఆ గుహల్లో ఆదిమానవులు గుంపులుగుంపులుగా తిరుగుతున్నట్టూ, తింటున్నట్టూ, పాడుతున్నట్టూ, ఆడుతున్న ట్టూ ఊహించుకున్నాను. కింద లోయల్లో రకరకాల వన్యమృగాలు ఘీంకారాలతో, క్రేంకారాలతో అరుస్తూ అటూఇటూ పరుగెడుతున్నట్టుగా అనిపించిం ది. నా రక్తంలో ఎక్కడో లోపల నిద్రిస్తున్న 300 శతాబ్దాల కిందటి, అంటే సుమారు 1200 తరాల కిందటి నా పూర్వమానవుల భావోద్వేగాల్ని నా జన్యుస్మృతుల్లోంచి తట్టి లేపే ప్రయత్నం చేశాను. ఆనాటి మానవుడు ఏమి కోరుకుని ఉంటాడు? ఏమి కలగని ఉంటాడు? మధ్యయుగాల భారతీయ చిత్రకళ గురించి రాస్తూ ఆచార్య సుశీలాపంత్ ఇట్లా అన్నాడు.

ఆదిమానవుడి అడుగుల్లోకి...

'భారతీయ శిలాచిత్రలేఖనాల విశిష్టలక్షణమేమిటంటే, అవి తమ యుగస్వభావానికి అద్దం పడతాయి. అవి మొత్తం ఉపఖండానికే చెందిన ఒక ఉమ్మడి దృగ్విషయం. వాటిలో భారతీయ సాంస్కృతిక ఏకత్వం ప్రతిబింబిస్తూంటుందని మనం చెప్పవచ్చు ... ఈ చిత్రకళ తక్కిన ప్రాచీన భౌతిక అవశేషాల్లాగే మానవుడి నాగరికతా ప్రయాణంలో మొదటి అడుగుల్ని గుర్తు చేస్తుంది. తన తదనంతర తరాల ప్రయోజనం కోసం చరిత్రపూర్వ మానవుడు తన మొత్తం ప్రపంచాన్నంతటినీ ఇక్కడ చిత్రించి పెట్టాడు. మానవుడి అభివృద్ధి అతడుండే స్థలాన్ని బట్టీ, అతడు జీవించే కాలాన్ని బట్టీ ఎట్లా ప్రభావితమవుతుందో ఈ చిత్రకళ చూపిస్తుంది. తక్కిన పురావస్తుసాక్ష్యాల్లో మనకు లభ్యంకాని రహస్యాలకోసం ఈ గుహసముదాయాల్లో మనం వెతకవలసి ఉంటుంది ... మానవుడి చరిత్రకీ, సమాజానికీ, ఆర్థికవ్యవస్థకీ, మతానికీ, క్రతువులకీ, వలసలకీ సంబంధించిన ఎన్నో ప్రశ్నలకు ఇక్కడ సమాధానం లభ్యమయ్యే అవకాశం ఉంది. అయితే ఇతిహాసపు చీకటికోణం అట్టడుగునపడి కనిపించని కథల్ని ఈ మౌనచిత్రాలు వినిపించాలంటే మనమింకా ఎంతో మట్టి తవ్వవలసి ఉంటుంది. బూజు దులపవలసి ఉంటుంది.'
తిరిగి వెనక్కి వస్తూంటే నాకో మన్వంతరం పూర్తయినట్టనిపించింది. సాంచి స్థూపం పరిపూర్ణమానవుడి పరిపూర్ణ ప్రజ్ఞానానికి స్మారకచిహ్నమయితే, భీమ్‌బేట్క గుహలు ఆదిమానవుడి ఆదిమ జీవితకాంక్షకు, జిగీషకు నిలువెత్తు సాక్ష్యాలుగా నాకు గోచరించాయి. మానవ చరిత్రలో నేనొక పూర్తి అధ్యాయాన్ని ఏకబిగిన చదివేసాననిపించింది.


* వాడ్రేవు చినవీరభద్రుడు
వ్యాసకర్త సెల్ : 94909 57129

FOREIGN టికెట్ .. ఫారిన్ లొకేషన్స్

‘డాడీ ఫారిన్ పోదామా...?’
అని కూతురడిగితే...
ఏ డాడీకయినా గుండెల్లో రైళ్లు పరిగెడతాయి...
ఐ మీన్ గుండెల్లో విమానాలు ఎగురుతాయి..!
కాని ఈ డాడీ చాలా స్మార్ట్ డాడీ.
‘ఓ తప్పకుండా అందరం పోదాం పదండి’ అని సినిమా హాల్‌కి తీసుకెళ్లాడు.
ఫారిన్ లొకేషన్లు అన్నీ చూసి ఫ్యామిలీ ఫారిన్ రిటర్న్ అయినట్టుగా తెగ సంబరపడిపోయింది.
మధ్యతరగతి కుటుంబాలకు సినిమా ఎన్నో కిటికీలను తెరుస్తుంది.
అందులో ఫారిన్ లొకేషన్స్ ఒకటి. ఈ సమ్మర్‌లో తొందరగా
ఏసీ సినిమా హాల్లో ఓ టిక్కెట్టు కొయ్యండి... ఫారిన్ ట్రిప్ కొట్టండి.
సినిమా తీసేవాళ్లను, చూసేవాళ్లను రీఛార్జ్ చేసే ఆ టేకాఫ్
మీ సండేకి ఎన్నో హ్యాపీ లాండింగ్స్ కలిగిస్తుందని నమ్ముతూ...




తెలుగు సినిమాలకు, ఆ మాటకొస్తే భారతీయ సినిమాలన్నింటికీ చాలా ఏళ్ల పాటు, నిన్న మొన్నటి వరకూ ఫారిన్ అంటే ఎయిర్ పోర్టే. చినబాబు విదేశాలలో చదువు ముగించుకొని ఇవాళే వస్తున్నారు అని ఏ పనివాడో వంటవాడో అంటాడు. హీరో తల్లి అబ్బాయి కోసం ఇష్టమైన వంటకాలు చేయిస్తూ బిజీగా ఉంటుంది. తండ్రి సూట్ వేసుకొని దర్పంగా రెడీ అయ్యి కారులో బయలుదేరి ఎయిర్‌పోర్ట్‌కొస్తాడు. కాసేపటికి విమానం ల్యాండ్ అవుతున్న స్టాక్ షాట్ పడుతుంది. ఇదే విమానం ఇలాగే కొన్ని వందల సినిమాల్లో ల్యాండ్ అయి ఉంటుంది గతంలో. కట్ చేస్తే - ఫ్లయిట్ దిగి వస్తున్నట్టుగా కళ్లకు నల్ల కళ్లద్దాలు పెట్టుకొని హీరో వస్తాడు. ఆ తర్వాత అతడు ఇంటికి రావడం, మరదలు పిల్లను కాదని హీరోయిన్‌తో ప్రేమలో పడటం కథ మలుపులు తిరగడం... ఇంతే మనకు తెలిసిన ఫారిన్ ట్రిప్.
కాని మరి మనం ఇలా ఎంతకాలమని స్టూడియో నాలుగ్గోడల మధ్య మగ్గిపోవాలి. ఎంతకాలమని అట్టముక్కల మధ్య పాటలు పాడుకోవాలి.
అలా ఆమ్‌స్టర్‌డ్యామ్ పోలేమా? తులిప్ పూల మధ్య పరుగులు తీయలేమా? కొత్త లొకేషన్లతో సరికొత్తగా రీచార్జ్ కాలేమా? అయ్యాం. అవుతున్నాం. ఇప్పుడైతే కేవలం లొకేషన్ల ఆసరాతోనే బతుకుతున్నాం.
*******
కాశ్మీర్ కొంతకాలం బతికించింది మనల్ని. పలానా చిత్రం యూనిట్ బయలుదేరి పాటల కోసం కాశ్మీరు వెళుతోంది అని సినిమా మ్యాగజైన్లలో వార్తలొస్తే నోరు తెరుచుకొని చూసేవాళ్లు అభిమానులు. కాశ్మీరు లోయలో కన్యాకుమారిలో... అని హీరోయిన్ అంటే ఓ చందమామా అని ప్రేక్షకులు అన్నారు. అక్కడి గుల్‌మార్గ్‌లో, చెమ్మ నిండిన నల్లటి రోడ్డు మీద, అటూ ఇటూ మంచుముద్దలు పేరుకొని ఉండగా, చేతులకు గ్లౌవ్స్ వేసుకున్న హీరో హీరోయిన్లు పాటలు పాడుకుంటుంటే వెచ్చగా ఉండేది. హాయిగా ఉండేది. దాల్ లేక్‌లో జివ్వుమని కొండగాలి కత్తిలా మదిలో గుచ్చుకునేది. కాని బోర్ కొట్టింది. అంతేకాదు అక్కడ ఏకె ఫార్టీసెవన్ ఫార్టీనైన్‌సార్లు మోగడం మొదలుపెట్టింది. ప్యాకప్. ఎక్కడికెళ్లాలి. ఊటీ వద్దు. ఎన్నిసార్లు తీస్తాం. బృందావన్ గార్డెన్స్? ఆ ఏం చూస్తాం... పై నుంచి కింద వరకూ మెట్ల మీద నుంచి దొర్లుతూ రంగులు మారే నీళ్లేగా? లాభం లేదు దేశం దాటాల్సిందే. ఫారిన్ లొకేషన్‌లోకి వెళ్లాల్సిందే.
*******
మన ఎన్టీఆర్ ఇష్టపడిన ఒకే ఒక ఫారిన్ లొకేషన్ ఉంది. అది మెడ్రాస్! ఆయన దానిని దాటి వచ్చేవారు కాదు. అంతకు మించిన లొకేషన్ ఏముంది అనేవారు. పొద్దున ఒక సినిమా. మధ్యాహ్నం ఒక సినిమా. రాత్రికి ఒక సినిమా. మూడు స్టూడియోల్లో మూడు షిఫ్ట్‌ల్లో ఎక్కువ రోజులు వృధా చేయకుండా యాక్ట్ చేశారు కాబట్టే అన్ని వందల సినిమాలు పూర్తి చేయగలిగారు. ప్రేక్షకులను రంజింప చేయగలిగారు. కాని అటువంటి ఎన్టీఆరే మొదటిసారిగా ‘సాహసవంతుడు’ సినిమాలో తెలుగు ప్రేక్షకులకు ఫారిన్ లొకేషన్‌ను పరిచయం చేశారు. అదేమిటో తెలుసా? నేపాల్. నేపాల్ మనకంటే పేద దేశమే అయినా మన కంటే బుజ్జి దేశమే అయినా అది అమెరికా ఆస్ట్రేలియా కాకపోయినా మన వరకు అది తొలి ఫారిన్ లొకేషనే. బహుశా దీనికి కొన్నేళ్ల ముందే దేవ్ ఆనంద్ హరేరామా హరేకృష్ణ సినిమాను పూర్తిగా నేపాల్‌లో తీయడం కూడా ఒక కారణం కావచ్చు. కథలో భాగంగా ఏదో పని మీద ఎన్టీఆర్ నేపాల్ వెళతారు. అక్కడ విలన్‌తో ఫైటింగ్‌లు చేస్తారు. అయితే ఇందులో ఒక మైనస్ ఉంది. ఎన్టీఆర్ తెర మీద ఉంటే కళ్లు లొకేషన్ మీదకు వెళ్లవు. ఎన్టీఆర్ మీదకే వెళతాయి. ఎన్టీఆర్‌ను అమెరికాకు తీసుకెళ్లినా అంతే. స్టాట్యూ ఆఫ్ లిబర్టీ ఎన్టీఆర్ విగ్రహం కంటే చాలా చిన్నది.
*******
సక్సెస్ రెండు రకాలుగా వస్తుంది. ఒకటి సామాన్యమైన విషయాన్ని అసామాన్యంగా చెప్పడం. రెండు అసామాన్యమైన విషయాన్ని చాలా సామాన్యంగా చెప్పడం.
ఒక దశలో సినిమాలు రొటీన్ అయిపోయాయి. అదే ప్రేమ కథ. అదే ప్రతీకారం. తెలుగులో అయినా హిందీలో అయినా అదే సుత్తి. కథను ఎలాగూ మార్చలేము. కనీసం లొకేషన్ మారిస్తే? ఈ సూత్రాన్ని మనవాళ్లకంటే ముందు కనిపెట్టినవాడు రాజ్‌కపూర్. సినిమాకు సీన్ మార్చాలని కనిపెట్టింది అతడే. అందుకే ‘సంగమ్’ సినిమాను ఒక అందమైన ఫారిన్ ట్రిప్‌లా మార్చేశాడు. అందులో కథ అంతా ఇండియాలోనే జరుగుతుంది. వైజయంతీమాల, రాజ్‌కపూర్‌ల హనీమూన్ ట్రిప్ మాత్రం యూరప్‌లో. కొత్త పెళ్లి జంట యూరప్ అంతా ముచ్చటగా తిరిగేస్తుంటే ఆ రోజుల్లో వాళ్లనలా చూడ్డం పెద్ద వండర్.

పావలా టికెట్‌తో మొత్తం యూరప్‌ను చూడటం కూడా వేడుకే. అందుకే సంగమ్ సూపర్ డూపర్ హిట్. ఆ తర్వాత అనేక సినిమాలు. షమ్మీ కపూర్ యాహూ అంటూ రంగంలో దిగాడు. ‘యాన్ ఈవెనింగ్ ఇన్ పారిస్’.. అంటూ పారిస్ వీధుల్లో ప్రేక్షకుల్ని తిప్పాడు. అందులో కథ ఏమీ ఉండదు. పారిస్ లొకేషన్లు... పాటలు.... దీవానేకా... నామ్‌తో పూఛో... అని రఫీ గొంతు ఐఫిల్ టవర్‌ను డీకొట్టి ప్రేక్షకులకు హృదయాలను తాకుతూ ఉంటే షమ్మీకపూర్ అందంగా మెడ ఎగరేస్తుంటే షర్మిలా టాగోర్ తన లావణ్యమైన దేహానికి పొదుపుగా బికినీ చుట్టి పరుగులు తీస్తుంటే అదే పెద్ద రీచార్జ్. ఆ తర్వాత కొంతకాలానికి యష్‌చోప్రా వచ్చి చలో స్విట్జర్లాండ్ అన్నాడు.

దేఖ ఏక్ ఖ్వాబ్ తుమ్హే సిల్‌సిలే హుయే అని ఎరట్రి పూల మధ్య సిల్‌సిలా సినిమా కోసం అమితాబ్, రేఖలను పరుగులెత్తిస్తుంటే జనం రీచార్జ్ మీద రీచార్జ్ అయ్యారు. ఆ ఫ్రెష్ బ్రీజ్‌కు హమ్మయ్యా అని ఏసీ లేకుండానే చల్లబడ్డారు. ఒక రకంగా ఫారిన్ లొకేషన్లను సున్నితమైన కథలకు వాడుకోవచ్చని చెప్పినవాడు యష్‌చోప్రానే. అందుకే స్విట్జర్లాండ్ గవర్నమెంట్‌వాళ్లు యష్ వస్తున్నాడంటే చాలు రెడ్ కార్పెట్ పరుస్తారు. ఆ దేశంలోని మహామహులకు జరగని మర్యాదలు యష్‌కు జరుగుతుంటాయి. ఇక ఢామ్‌ఢమాల్ అని ఫారిన్‌లో క్లయిమాక్స్‌లు మొదలెట్టింది మాత్రం ఫిరోజ్‌ఖానే. ‘ఖుర్బానీ’ సినిమాను లండన్‌లో తీసి పిచ్చ సంచలనం సృష్టించాడు. అంతేకాదు లండన్‌లో రీరికార్డింగ్, మిక్సింగ్ లాంటి పెద్ద పెద్ద మాటలను అతడే ప్రవేశ పెట్టాడు. మొత్తం మీద హిందీలో ఫారిన్ ట్రిప్ సెటిల్ అయ్యింది. కానీ తెలుగులో ఈ ‘సక్సెస్ సూత్ర’ కుదురుకోడానికి కొంత టైమ్ పట్టింది. పైన అనుకున్నాం కదా, ఎన్టీఆర్ ఇమేజ్ లొకేషన్‌లను మింగేసేదని.
*******
అక్కినేని రెండుసార్లు హార్ట్ పరేషన్! కోసం అమెరికా వెళ్లారుగాని ఒక్కసారి కూడా షూటింగ్ కోసం ఆ దేశానికి వెళ్లలేదు. అండమాన్ అమ్మాయి కోసం ఆయన చేసిన ఒకే ఒక్క ఫారిన్ లొకేషన్ అండమాన్. అయితే ఏ కారణం చేతనో అండమాన్ మన దేశంలోనే ఉండిపోయింది కనుక అది ఫారిన్ లొకేషన్ అనిపించుకోదు. కాని వాళ్లబ్బాయి నాగార్జున మాత్రం ఇక్కడ కాలు బయటకు తీస్తే ఏదో ఒక విదేశంలో ఏదో ఒక హీరోయిన్‌తో కలిసి పెట్టేవాడు. క్రిమినల్ సినిమాలో తెలుసా మనసా అని మనీషా కోయిరాలాతో ఆయన పాడుతుంటే లొకేషన్‌బ్యూటీతో పాటు మనీషాబ్యూటీ కూడా కలిసిపోయి ఆ పసుప్పచ్చ చీర చెంగు నాగార్జున ముఖాన జాలువారి సున్నితమైన సరసోద్వేగాలు రీచార్జ్ కావడం తెలుగు ప్రేక్షకులు చూశారు. కాని ఇలాంటి మూడ్‌లో పానకంలో పుడకలాగా సూరిబాబు లవంగంలాంటి బ్రహ్మానందం తగిలితే బతుకు జనతాబారే. మన్మథుడులో ఫారిన్ లొకేషన్‌ను కామెడీ కోసం చాలా బాగా వాడుకున్నారు.

ఆ సినిమాలో బ్రహ్మానందం తర్టీ ఇయర్స్‌గా పారిస్‌లో ఉంటున్నాడు. నాగార్జునా, సొనాలీ బిందే... సారీ... బింద్రే అక్కడకు వెళితే వాళ్లకు తారసపడ్డాడు. అప్పుడు సూరిబాబు డైలాగు- ఇదేమిటో తెలుసా? పారిస్. ఇండియాను టేప్ రికార్డర్‌లో పెట్టి ముప్పయ్యేళ్లు ఫాస్ట్‌ఫార్వర్డ్ నొక్కితే ఎలా ఉంటుందో ఇది అలా ఉంటుంది.

మరోసారి మరో డైలాగు- పారిస్‌లో దొంగలు పడరు. ఇక్కడ రోడ్డు మీద బ్యాగ్ పడేసి ఆరు నెలల తర్వాత వచ్చి చూసినా అలాగే ఉంటుంది. అతడి మాటలు నమ్మి హీరో హీరోయిన్లు బ్యాగ్ పక్కన పెడతారు. కట్ చేస్తే వర్టికల్ రాబరీ. అనగా నిలువు దోపిడీ.
సూరిబాబు లవంగంలాంటి వాళ్లను ఫారిన్‌కు జత చేయడం త్రివిక్రమ్ కనిపెట్టిన మంచి ఫార్ములా. సక్సెస్ అయిన ఫార్ములా.
*******
దగ్గర్లో ఉంటే పని ఈజీ. మద్రాసు నుంచి ఇండస్ట్రీని షిఫ్ట్ చేయాల్సిందే అని పట్టుపడితే కొంతకాలం తిరుపతిలో సినిమాలు చుట్టేశారు మనవాళ్లు దగ్గరని. అలాగే ఫారిన్ లొకేషన్ అంటే చాలానాళ్లు సింగపూర్‌లో చుట్టేశారు మనవాళ్లు, అరవం వాళ్లు. అరాకొరా లొకేషన్ దొరికినా పూర్తి సినిమా తియ్యడంలో సిద్ధహస్తుడైన బాలచందర్ అందమైన అనుభవంను సింగపూర్‌లో తీసి ప్రేక్షకులకు ఒక అందమైన అనుభవాన్ని కలిగించాడు. కమల్ హాసన్, రజనీకాంత్, జయప్రద... బోలెడన్ని పాటలు... కాసేపు క్యాన్సర్. జనం ఉర్రూతలూగారు ఆ సినిమాలో.

ఊరికే కాలక్షేపానికి చిన్న జోక్. అందమైన అనుభవంలో రజనీకాంత్‌కు పిల్లిగడ్డం ఉంటుంది. ఒకమ్మాయి వచ్చి అతణ్ణి ఇష్టపడుతున్నానని చెప్పి నీ పిల్లి గడ్డం చాలా బాగుంది అంటుంది. నీకు నచ్చిందా అని అడుగుతాడు రజనీకాంత్. చాలా అంటుందా అమ్మాయి. అయితే తీసుకో అని టక్కున ఆ గడ్డాన్ని పీకి ఆ అమ్మాయి చేతిలో పెడతాడు రజనీకాంత్. ఇలాంటి కామెడీ కొంచెమే అయినా బాలచందర్ మొత్తం సీరియస్ సినిమాని కూడా తీశాడు ఫ్రాన్స్‌లో. 47 రోజులు గుర్తుందిగా. కొత్తగా పెళ్లయి ఫారిన్ వెళ్లిన అమ్మాయి మొగుడి చేతిలో ఎన్ని కష్టాలు పడగలదో ఆ రోజుల్లోనే ఊహించి తీశాడు బాలచందర్. అవన్నీ ఇప్పుడు పేపర్లలో న్యూస్‌గా వస్తున్నాయి. అయితే చాలా త్వరగానే సింగపూర్ మీద మనవాళ్లకు మోజు తీరిపోయింది. మనం ఇంకా అమెరికాకు వెళ్లాల్సి ఉంది.

*******
డేరింగ్ డాషింగ్ కృష్ణ తెలుగులో చాలావాటికి ఆద్యుడైనట్టే అమెరికా లొకేషన్లకు కూడా ఆద్యుడు. అమెరికాలో తీసిన మొదటి సినిమా హలో కృష్ణ హలో రాధ. కాని ఆ సినిమా రిలీజైనట్టుగానీ ఎవరైనా చూసినట్టుగానీ ఎవరికీ తెలియదు. అప్పట్నించి అమెరికా అంటే మనవాళ్లకు యాంటి సెంటిమెంట్. అమెరికాలో సినిమా తీస్తే ఢమాల్ అని నమ్ముతుంటారు నిన్నమొన్నటి వరకూ. అమెరికా అల్లుడు, అమెరికా అబ్బాయి, పడమటి సంధ్యారాగం... ఇంచుమించు యావరేజ్ అబౌ యావరేజ్ తప్ప హిట్ కాలేకపోయాయి. జంధ్యాల అమెరికాలో కృష్ణగారబ్బాయి రమేష్‌తో పూర్తిగా తీసిన చిన్నికృష్ణుడు వారం కూడా ఆడలేదు. అదే జంధ్యాల విజయశాంతితో తీసిన పడమటి సంధ్యారాగం టివీలో పదే పదే ప్రసారం అవుతూ ప్రస్తుతం ఒక క్లాసిక్‌గా స్థిరపడింది. కె.రాఘవేంద్రరావు భారీగా ఖర్చుపెట్టి కొత్తవాళ్లతో అమెరికాలో తీసిన పరదేశి సినిమా కూడా అమెరికా సెంటిమెంట్‌తో చతికిల పడింది. అయితే ఈ సెంటిమెంట్‌ను వైవిఎస్ చౌదరి బ్రేక్ చేశాడు. అమెరికాలో తీసిన దేవదాసు పెద్ద హిట్ అయ్యింది. అయినప్పటికీ ఏదో దోషం కొడుతూనే ఉంది. ఇటీవల వచ్చిన జై చిరంజీవ, సలీమ్‌వంటి సినిమాలు కూడా అమెరికా గాలికి అల్లాడాయి.
*******
న్యూజిలాండ్‌లో స్థిరపడిన లక్కీ అలీ ఇండియాకి పాడ్డానికి వచ్చి తన పాటలనూ పనిలో పనిగా న్యూజిలాండ్‌నూ పాపులర్ చేసి వెళ్లాడు. క్రికెట్‌లో కివిస్ జట్టును న్యూజిలాండ్‌లో క్రికెట్ మ్యాచ్‌లనూ చూడ్డం తప్ప అక్కడకు వెళ్లి సినిమాలు షూట్ చేయాలని ఎవరికీ తోచలేదు. కాని త్వరలోనే సినీ కొలంబస్‌లో బస్‌లో కాకపోయినా విమానంలో అక్కడ కాలుమోపారు. బాగున్నారా బాగున్నారా బావగారూ బాగున్నారా అని దుమ్ము లేపారు. ఆ తర్వాత నాగార్జున సంతోషంగా అక్కడ సగం సినిమా లాగించేశాడు.

న్యూజిలాండ్‌లో నాగార్జున, గ్రేసీ సింగ్‌ల మధ్య సన్నివేవాలు చాలా ఫ్రెష్‌గా అనిపించి సినిమాకు బలం చేకూర్చాయి. మంచి కథకు మంచి లొకేషనే సగం బలం అని నిరూపించాయి. న్యూజిలాండ్‌లో తీసిన కామెడీ కోటా శ్రీనివాసరావు హింసరాజు, బ్రహ్మానందం గిరి ఫ్రమ్ మంగళగిరి చాలా పెద్ద హిట్. నిజజీవితంలో జరిగిన సంఘటనలను ఏ సన్నివేశంలో ఇమిడ్చినా ప్రేక్షకులకు కనెక్ట్ అయిపోతుంది. సంతోషంలో ఒక పెళ్లి పార్టీ జరుగుతుంటుంది. అక్కడే నాగార్జున ఉంటాడు. నాగార్జునతో గిరి ఫ్రమ్ మంగళగిరి పాత్ర ఇంట్రడక్షన్ డైలాగ్ ఇలా ఉంటుంది-

ఏమండీ... ఇక్కడకు ట్రైన్లుగానీ రావు కదా.

ఆ డైలాగ్ వినగానే చాలామంది నవ్వుతారు.
ఎందుకంటే అంతకు కొన్నాళ్ల ముందే వరంగల్‌లో గూడ్సుబండి ఒకటి వంతెన మీద నుంచి నడిరోడ్డు మీదకు దూకి కకావికలం సృష్టించింది. ఆ భయం చాలామందిని వెంటాడింది. గిరి పాత్రలో ఆ భయాన్ని చూసి అందరూ నవ్వుకుంటారు.
లొకేషన్ ఏదైనా పంచ్ మనది పడితే తప్పకుండా సక్సస్ అందుతుంది. ఇదే న్యూజిలాండ్ ఇటీవల ప్రభాస్ డార్లింగ్ కోసం ఫస్ట్‌హాఫ్ అంతా మెరిసింది.
*******
ఫారిన్ ట్రిప్‌లంటే విలన్‌లను కూడా గుర్తుకు తెచ్చుకోవాలి. హిందీ సినిమాల్లో చాలామంది విలన్‌లు ఎయిర్ స్ట్రిప్ మీద చిన్న డకోటా విమానంలాంటి విమానాల్లోంచి దిగుతుంటారు. మరి వాళ్లు ఏ దేశం నుంచి వస్తారో ఏమో. అలాగే క్లయిమాక్స్‌ల్లో కూడా విచిత్రమే. హీరో మరికాసేపట్లో అటాక్ చేస్తాడనగా ఎస్‌బాస్‌గాళ్లతో మన బాస్ ఇలా అంటాడు- తొందరగా సర్దండి. హెలికాప్టర్ రాగానే మనం దేశం దాటేయాలి. మనం వెర్రి ముఖాలేసుకొని చూస్తుంటాం. హెలికాప్టర్‌లో ఒక దేశం నుంచి మరో దేశానికి వెళ్లగలరా ఎవరైనా? దానికి పర్మిషన్ ఉందా? అది సాధ్యమా? ఎవరూ ఆలోచించరు. అయితే విలన్‌లు పెట్టుకునే ఈ ఫారిన్ ట్రిప్ దాదాపుగా సఫలం కాదు. ఎందుకంటే హీరో విలన్‌ని పట్టుకుంటాడు. విలన్ ఒకవేళ హెలికాప్టర్ ఎక్కి దాన్ని స్టార్ట్ చేసినా చివరి నిమిషంలో దానిని పట్టుకొని వేళ్లాడుతూ ఎలాగోలా అతడి భరతం పడతాడు. కాని ఇటీవలి కాలంలో ఇలాంటి ఫారిన్ ట్రిప్‌లు కనపడటం లేదు. ఔట్ డేటెడ్ అయిపోయాయి.
*******
నిజానికి ఫారిన్ ట్రిప్ అంటే చాలా సరదా ఉండాలి. సంతోషం ఉండాలి. నవ్వు తమాషా. అలాంటి ఫారిన్ ట్రిప్ ఒకే ఒకసారి కనిపిస్తుంది తెలుగులో. జయం మనదేరా సినిమా ఫస్ట్ హాఫ్ అంతా ఇలాంటి సరదా ఉంటుంది. ధమ్స్‌ప్ తాగి లాటరీలో ఫ్రీగా ఫారిన్ ట్రిప్ కొట్టేస్తారు సౌందర్య, సౌందర్య బామ్మ రమాప్రభ. వీళ్లిద్దరితో పాటు తనికెళ్ల భరణి, ఎల్బీ శ్రీరామ్, ఏవిఎస్, ఆలీ, బ్రహ్మానందం ఐఫిల్ టవర్ పీసా టవర్ చుట్టేస్తారు. వీళ్లల్లో ఒక్కరూ ఇంతకు ముందు విమానం ఎక్కినవారు కాదు. ఒక్కరూ విదేశం చూసినవారు కాదు. అందుకే అలీ హోటల్‌లో దిగగానే ఒకమ్మాయి హౌస్ కీపింగ్ అని వస్తుంది. అమ్మాయి.. పైగా హౌస్ కీపింగ్ అంటూ ఉందంటే ఇదేదో కీపింగ్ వ్యవహారమే అనుకొని రా కీప్ చేస్తా అంటాడు అలీ చేతులు చాస్తూ. చంప ఛళ్లు మంటుంది. ప్రేక్షకుల్లో నవ్వు వస్తుంది. గంభీరమైన సెకండాఫ్‌ను ఈ ఫస్ట్ హాఫ్ బేలెన్స్ చేసింది. ఫారిన్ లొకేషన్స్ లేకపోతే ఈ కామెడీ పండేది కాదు.
*******
మారీచుడు చచ్చిపడిన చోటే మారిషస్ అనేవాళ్లు ఉన్నారుగానీ ఆ మాట అటుంచితే మారిషస్ చాలా సినిమాల హీరోయిన్లకు బాత్‌టబ్‌లా ఉపయోగపడింది. అక్కడి క్రిస్టల్ క్లియర్ బీచ్‌లలో హీరో హీరోయిన్ పాడుకుంటుంటే చూస్తున్న ప్రేక్షకులు ఏదో లోకానికి వెళ్లినట్టు మైమరచిపోతారు. మారిషస్‌లో సవాలక్ష సినిమాల పాటలు తీశారు. హలో బ్రదర్‌లో మనసిచ్చి గిచ్చి బరువాయే పాట మారిషస్ అందాలనూ రమ్యకృష్ణ సౌందర్యాన్ని పోటీ పడీ ప్రదర్శించింది. షూటింగ్ వత్తిడితో సెట్‌ల హైరానాతో విసిగిపోయిన నిర్మాత ఇటు టూ ఇన్ వన్‌గా ఉంటుందని పాటలు మారిషస్‌లో తీయడానికి ఓకే అంటున్నాడు. రిలాక్స్ కావచ్చు. షూటింగూ జరుగుతుంది కనుక ఇదొక గొప్ప సౌలభ్యం. మారిషస్ దాకా ఎందుకు అనుకునేవాళ్లు మలేసియాలో కూడా పాటలు తీశారు. తీస్తున్నారు. కౌలాలంపూర్ ట్విన్ టవర్స్ మనం ఎన్నిసార్లు చూళ్లేదు.
*******
ఇప్పుడు బ్యాంకాక్ రంగప్రవేశం చేసింది.
దీనిని పూరిజగన్నాథ్ చాలా పాపులర్ చేశాడు. ఇవివి సత్యనారాయణ ఈ లొకేషన్‌ను తుక్కుతుక్కుగా సినిమాలో ఉపయోగించుకున్నాడు. ఎవడి గోల వాడిది పెద్ద హిట్. ఈ సినిమా అంతా బ్యాంకాక్‌లోనే నడుస్తుంది. ప్రతి సన్నివేశం అలరిస్తుంది. ఇందులో బ్రహ్మానందం ప్రొఫెషనల్ కిల్లర్. లక్ష్మీపతి అతడి అసిస్టెంట్. కోవై సరళను చంపడానికి బ్రహ్మానందం సుపారీ తీసుకున్నాడు. ఆమెను ఎలాగైనా చంపాలి. కాని ప్రతిసారీ ఎవరో ఒకరు అడ్డం వస్తున్నారు. ఒకసారి బీచ్‌లో కోవై సరళ పుస్తకం చదువుకుంటూ ఉంటుంది. ఆమెను చంపడానికి చాటు చేసుకొని కూచుంటాడు బ్రహ్మానందం. అయితే ఇంతలో టూ పీస్ బికినీ వేసుకున్న ఒక అమ్మాయి అడ్డం నిలుచుంటుంది. వెళ్లి దాన్ని అడ్డం తీసేయమంటాడు బ్రహ్మానందం తన అసిస్టెంట్‌ను. మీరే స్థలం మార్చుకోవచ్చుకదా అంటాడు అసిస్టెంట్. నేను ఇక్కడే ఫిక్స్ అయ్యా అంటాడు బ్రహ్మానందం. దాంతో లక్ష్మిపతి వెళ్లి ఆ అమ్మాయి డ్రాయర్‌ని లాగేయబోతాడు. అది చూసిన కోవై సరళ లక్ష్మిపతిని పట్టుకొని నాలుగు బాదుతుంది. ఆ బాదుడు ఎంతకూ ఆగదు. అతడు చస్తాడేమోనని బ్రహ్మానందం ప్రవేశిస్తాడు. తాను ఏమీ ఎరగనివాడిలా లక్ష్మిపతికి బుద్ధి చెప్తూ ఒక డైలాగ్ మొదలుపెడతాడు...

‘‘సిగ్గులేదురా... పవిత్ర భారతదేశంలో పుట్టి... థాయిలాండ్ వచ్చి ఒక అమ్మాయి డ్రాయర్ లాగుతావా...! ఆ అమ్మాయిని చూడ్రా... చూడు.. ఒంటినిండా బట్టల్లేక చిన్న పీలికలాంటి డ్రాయర్ వేసుకుంటే... దాన్ని కూడా లాగిపారేయడానికి నీకు మనసెలా ఒప్పిందిరా..?

ఒరేయ్... ఆడదానికి లవర్ కన్నా... లివర్ కన్నా... డ్రాయర్ ముఖ్యంరా... లాయర్ ఫీజు తీసుకొని ధర్మాన్ని కాపాడతాడు. డ్రైవర్ డబ్బు తీసుకొని డ్రైవింగ్ చేస్తాడు. కానీ ఏ స్వార్థం లేకుండా ఆడదాని శీలం కాపాడుతుంది రా డ్రాయర్. అలాంటి డ్రాయర్‌ని అతి దారుణంగా లాగేస్తావా...! ఆడదానికి ఆరడుగుల చీర కన్నా... ఆరు అంగుళాల డ్రాయర్ రక్షణనిస్తుందిరా.. అందుకే డ్రాయరో రక్షతి రక్షతహ అన్నార్రా...

అలాంటి ట్రాయర్‌ని మేనర్స్ లేకుండా లాగేస్తావా... అని లక్ష్మీపతిని ఫుట్‌బాల్ ఆడేస్తుంటాడు.

ఈ సినిమా మొత్తం ఇలాంటి నవ్వులు పువ్వులే బ్యాంకాక్ బీచ్‌లలో ఇసుకపూసుకొని దొర్లుతుంటాయి. పూరి జగన్నాథ్ దాదాపు అన్ని సినిమాల్లోనూ బ్యాంకాక్ పాటలు తీశాడు. చిరుతను మొత్తంగా అక్కడే షూట్ చేశాడు. బ్యాంకాక్ వెళ్లడానికి వీసా అక్కర్లేదుట. అందుకే అందరూ సులువుగా అక్కడికి చేరుకుంటారట. ఇప్పుడు మనకు అందుబాటులో ఉన్న బడ్జెట్ ఫారిన్ ట్రిప్ అదే.
చలో బ్యాంకాక్ అందామా.
*******
ఫారిన్ లొకేషన్లు ఎంత బాగా ఉన్నా నేపథ్యాన్ని ఎంత బాగా కలర్‌ఫుల్ చేసినా అవి అన్నిసార్లూ కథకు కనెక్ట్ కావాలని లేదు. కథకు ప్లస్ అవుతాయని లేదు. చిరంజీవితో మృగరాజు ఫారిన్ లొకేషన్స్‌లోనే తీశారు. కాని ఫ్లాప్ అయ్యింది. అదే చిరంజీవితో జై చిరంజీవ కూడా వర్కవుట్ కాలేదు. ఇటీవల రామ్‌చరణ్‌తో ఆరెంజ్ తీస్తే ఆ సినిమా కూడా క్లిక్ కాలేదు. ఆ కథకు ఆస్ట్రేలియా వల్ల మేలు జరగలేదు. తాజాగా తీన్‌మార్ పరిస్థితీ అదే. దీని కథేమిటి? ఈకాలం పిల్లలు ప్రేమను లైట్ తీసుకుంటున్నారు. గతంలో అయితే అంటే ఫ్ల్యాష్‌బ్యాక్‌లో అయితే ఒకే బాణం ఒకే అమ్మాయి అన్నట్టుగా బతికేవారు అని చెప్పడం. అట్ ద సేమ్‌టైమ్ గాఢమైన ప్రేమ కలగాలేగాని ఈ కాలం పిల్లలు కూడా దానిని సీరియస్‌గా తీసుకుంటారు అని గట్టిగా చెప్పడం.

యాక్చువల్‌గా దీనిని లోకల్‌లో తీయాలి. ఈకాలం ప్రేమను ఏ తిరుపతిలోనో తీయాలి. గతకాలం ప్రేమను ఏ మద్రాసులోనో. అప్పుడే కనెక్ట్ అయి ఉండేవారు. కాని సినిమా మొత్తం ఫారిన్‌లో తీశారు. అద్భుతమైన లొకేషన్లు. అందమైన కార్లు. నీలాకాశం. పచ్చటి కొండలు. ఇటాలియన్ ఫుడ్. ఇంగ్లీషు ముఖాలు. చూడ్డానికి హాయిగా ఉంటుంది. కాని ప్రేక్షకులు ఎక్కడా కనెక్ట్ కారు.

ఈ సందర్భంగా బాలీవుడ్ హీరో, డెరైక్టర్ అయిన మనోజ్ కుమార్‌ను గుర్తుకు చేసుకోవాలి. ఆయన తన అసిస్టెంట్స్‌కు ఒకే మాట చెప్పేవాడు. అదేమిటంటే లొకేషన్ల వల్ల సినిమాలు ఆడవు అని.
హిందీలో హృషీకేశ్ ముఖర్జీలాంటి వాళ్లు తెలుగులో కె.విశ్వనాథ్, బాపు, వంశీ లాంటి వాళ్లు తక్కువ లొకేషన్లలో సినిమాలు తీసి జనాన్ని మెప్పించారు.
మొత్తం మీద ఒకటి.
సినిమాలో లొకేషన్ ఉండాలిగాని లొకేషనే సినిమా కాకూడదు.
- ఇన్‌పుట్స్: బుర్రా నరసింహ
సెట్ కన్నా.. ఫారినే బెటర్!
యూరప్‌లో రెండు పాటలు తీయాలనుకోండి... ముందు అక్కడున్న ‘లైన్ ప్రొడ్యూసర్స్’ (వీరే ఫారిన్ షూటింగ్ కో ఆర్డినేటర్స్) ద్వారా పర్మిషన్‌కి అప్లై చేసుకోవాలి. లండన్ మినహాయించి, అన్ని యూరప్ దేశాల్లో పర్మిషన్లు ఈజీగానే వస్తాయి కానీ... ఆస్ట్రేలియా, కెనడా లాంటి దేశాల్లో పర్మిషన్ అంటే వారం ముందే అప్లై చేసుకోవాలి. పదహారు మందితో ఏడు రోజుల పాటు యూరప్‌లో రెండు పాటలను చిత్రీకరించాలంటే... పర్‌హెడ్ లక్షా 10 వేల నుంచి లక్షా 20 వేల వరకూ ఖర్చు అవుతుంది. ఫ్లైట్ ఛార్జీలు, పర్మిషన్లకు, అకామడేషన్లకు అయ్యే ఖర్చది. అంటే నిర్మాతకు మొత్తంగా 18 లక్షల నుంచి 20 లక్షల దాకా ఖర్చవుతుంది. అదే... లండన్, ఆస్ట్రేలియా, కెనడా లాంటి దేశాల్లో అయితే... పర్ హెడ్ లక్షా 40 వేల నుంచి లక్షా 50 వేల దాకా అవుతుంది. అంటే నిర్మాతకు 25 నుంచి 27 లక్షల దాకా లెక్క తేలుతుంది. కాకపోతే మన దగ్గర స్టూడియోల్లో సెట్ వేసి పాట తీయాలంటే... సెట్టుకు 30 నుంచి 40 లక్షలు అవుతుంది. అంటే ఒక పాటకు నిర్మాత 45 లక్షల దాకా ఖర్చుపెట్టాల్సి వస్తుంది. అదే ఫారిన్‌లో అయితే రెండు పాటలను నాచురల్ లొకేషన్లలో రిచ్‌గా 25 లక్షల్లో తీసుకుని వచ్చేయొచ్చు. ఆ విధంగా చూసుకుంటే ఫారిన్‌లో పాటలు నిర్మాతలకు లాభమే అని చెప్పాలి. ఎక్వీప్‌మెంట్ మాత్రం ఇక్కణ్ణుంచే తీసుకెళతారు.
20 ఫారిన్ పాటలు
హైర హైర హైరబ్బా... (జీన్స్)

టెలిఫోన్ ధ్వనిలా నవ్వేదానా... (భారతీయుడు)


చమ్మచక్క చమ్మచక్క జున్ను ముక్క చంప నొక్క (బొబ్బిలి రాజా)


మధుమాసపు మంజుల రాగమా... (ఆయనకిద్దరు)


సారి సారి సారి అంటుందోయ్ కుమారీ... (బావగారూ బాగున్నారా)


నిన్నా కుట్టేసినాది మొన్నా కుట్టేసినాది (నరసింహనాయుడు)


కిళిమాంజారో... (రోబో)


నువ్వంటే నాకిష్టమనీ... (సంతోషం)


బంగాళాఖాతంలో నీరంటే నువ్వేలే... (బద్రి)


గలగల పారుతున్న గోదారిలా... (పోకిరి)


పడ్డానండీ ప్రేమలో మరీ... (స్టూడెంట్ నం 1)


ఈ తూరుపు ఆ పశ్చిమం (పడమటి సంధ్యారాగం)


నువ్వు నువ్వు నువ్వే నువ్వు... (ఖడ్గం)


అందాల ఆడబొమ్మ ఎంత బాగుంది ముద్దు గుమ్మ (సమరసింహారెడ్డి)


దాయి దాయి దామ్మ (ఇంద్ర)


జీవితం స్వప్నసాగర గీతం (చిన్ని కృష్ణుడు)


నీవే నీవే నీవే నీవే... (డార్లింగ్)


సిడ్నీ నగరం చేసే నేరం... (ఆరెంజ్)


నా మనసునే మీటకే నేస్తమా (మన్మథుడు)


ఈ హృదయం కరిగించి వెళ్లకే.. (ఏమాయ చేశావె)


ప్రియదర్శిని రామ్

Tuesday, April 19, 2011

గోదావరి అలలపై అందాల విందు .... పాపికొండల విహారయాత్ర

గలగల పారే గోదావరి హొయలు.. పచ్చని ప్రకృతి.. చుట్టూ కొండలు.. ఇసుక తిన్నెలపై భోజనం.. గోదారి తీరాన అడవి తల్లి బిడ్డలైన గిరిజనలు.. నదీ ప్రవాహంలో లాంచీ ప్రయాణం.. ఇదీ పాపికొండల విహారయాత్ర శోభ. శ్రీరామగిరి నుండి పాపికొండల వరకు సాగే లాంచీ ప్రయాణం.. మరుపురాని ఓ మధురానుభూతి. వేసవిలో పర్యాటకులు ఎక్కువగా ఇష్టపడే ఈ గోదారి విహారయాత్ర గురించి ...

* వేసవిలో అందాల విందు
* కనువిందైన ప్రకృతి సోయగం
* పరవశింపజేసే విహారయాత్ర
* పాపికొండల్లో బోటు ప్రయాణం ఆహ్లాదం

* గోదారి అలలపై మరుపురాని ప్రయాణం


papi4ఖమ్మం జిల్లాలోని వి.ఆర్‌.పురం మండలం శ్రీరామగిరి గ్రామం నుంచి సుమారు మూడు గంటల పాటు గోదావరి నదిలో ప్రయాణం, చుట్టూ చూడచక్కని గిరిజన గ్రామాలు, అందమైన ప్రకృతి నడుమ ఉరుకులు, పరుగుల జీవితానికి ఒక్కపూట మన మనస్సుని పరవశింపజేస్తుందంటే ఆ ఆనందం మరువలేనిదని చెప్పడంలో అతిశయోక్తి కాదేమో. ఎక్కడో మహరాష్టల్రోని నాసిక్‌ వద్ద జన్మించి ఎన్నో ఉపనదులను తనలో కలుపుకుని కూనవరం వద్ద గోదావరి, శబరి నదులలో సంగమమై శ్రీరామగిరి గ్రామం నుంచి లాంచీలో ప్రయాణిస్తే పేరంటాలపల్లికి నుంచి పాపికొండలకు చేరుకోవచ్చు.


యాత్రసాగేదిలా...
ముందుగా భోగరాముడు కొలువై ఉన్న శ్రీరామగిరిని కలుపుకొని రహదారి మార్గంలేని ఎన్నో గిరిజన గ్రామాలను అభయారణ్యాలను కలుపుకొని మూడు జిల్లాల సంగమమైన పాపికొండలలతో మిళితమైన పేరంటాలపల్లి గ్రామంలో బాలానంద స్వామి కొలువుతీరిన శ్రీరామకృష్ణ మునివాటంలో శివుడిని దర్శించి పచ్చని ఎతె్తైన కొండలపై నుంచి జాలువారే జలపాతాలను, గుడివెనుక రాళ్లనుంచి పారే నీటి పరవళ్లు, అక్కడి నుండి ఇసుక తిన్నెలను ప్రయాణికులకై భోజన వసతి.


papi2పేరంటాలపల్లి విహారయాత్ర, రాష్ట్రంలోని రెండవ భద్రాద్రిగా పేరుపొందిన శ్రీరామగిరి పుణ్యక్షేత్రం వద్ద యాత్రికులకు శ్రీసుందర సీతారాముల వారి దర్శనం కలుగుతుంది. ఎతైన కొండలు గుట్టల మధ్య సుమారు 170 మెట్లు ఎక్కిన తర్వాత కనులు పరవశింపజేసే సుమారు 500 సంవత్సరాల క్రితం మాతంగి మహర్షిచే ప్రతిష్ఠింపబడిన శ్రీ సీతారామలక్ష్మణ, ఆంజనేయ సుందర విగ్ర హాలను భక్తులు దర్శిస్తారు. ఆ దేవమూర్తు లను చూడగానే నిజంగా సీతారామ లక్ష్మణ అంజనేయస్వాములను మనం చూస్తున్నట్లు అనుభూతి కలుగుతుంది. ఎతె్తైన కొండలు నుంచి వచ్చే పిల్లగాలులు, మనస్సును పరవశింపచేస్తాయి. పక్కనే ఎతె్తైన రెండు పర్వతాలు వాలి, సుగ్రీవుల గుట్టలు భక్తులకు కనువిందు చేస్తాయి.


ఝటాయువు గురుతులు...
papi3వాలి, సుగ్రీవుల కొండల నుండి మరో పర్లాంగు దూరంలో చొక్కనపల్లి గోదావరి రేవులో ఝటా యువు పక్షి పడిపోయిన గుర్తులు కనిపిస్తుంటా యి. అక్కడే శ్రీరాముడు ఝటాయువుకు పిండ ప్రదానం చేసాడని పురాణాలు వెల్లడిస్తు న్నాయి. శ్రీరామగిరి నుంచి బయలుదేరిన లాంచీ రెండు గంటల పాటు గోదావరి తీరాన ఉన్న అమాయక గిరిజనులైన కొండరెడ్ల ప్రజలను పలకరిస్తుంది.


పరవశింపజేసే పాపికొండలు...
మూడు గంటల పాటు లాంచీ ప్రయాణం అనంతరం రాష్ట్రంలోనే ప్రసిద్ధి పొందిన పాపికొండల సోయగాలు కనపడగానే యాత్రికులు తమను తాము మార్చిపోయి మంత్రముగ్ధులవుతారు. పాపికొండల వద్ద గోదావరి ప్రవాహం చాల ఇరుకుగా ఎంతో లోతుగా ఉంటుంది. శివలింగం అలంకారం, ఆలయం చుట్టూ ఫలవృక్షాలు, పూలమొక్కలు, అమాయక కొండరెడ్ల గిరిజనుల అప్యాయత ఆధరణ నవనాగరిక సమాజానికే తలమానికం. ఇక్కడ శ్రీరాముని వాకిటం అనేక ఆశ్రమం ఉంది. ఇందులోనే శివాలయం కూడా ఉంది. 1800 శతాబ్ధంలో రాజమండ్రి నుంచి ఒక మునిశ్వరుడు లాంచీపై బయలు దేరి భద్రాచలం వస్తూ పేరంటాలపల్లి వద్ద రాత్రి కావడంతో అక్కడ బస చేశారు.


papi6ఆయన కలలో భగవంతుడు కనిపించి ఇక్కడ ఆలయాన్ని నిర్మించమని ఆదేశించడంతో అందుకు అనుగుణంగా ఆయన ఇక్కడే నివాసం ఉండి ఆ ఆలయాన్ని నిర్మించినట్లు ఈ ప్రాంతవాసులు చెబుతారు. ఈ ప్రాంత గిరిజనులకు విద్యా బుద్దులు, వైద్య సౌకర్యం కల్పించిన మునిశ్వేరుడిని వారు ఆరాధ్యదైవంగా భావిస్తారు. ఈ శివాలయంలో కొండలపై నుంచి జలపాతం చుట్టూ పనస, పొక చెక్క వంటి అనేక మొక్కలతో ఆప్రాంతం ఎంతో ఆహ్లాదంగా ఉంటుంది. అక్కడి నుంచి లాం చీలపై మరొక 5 కిలోమీటర్ల దూరం లాంచీపై వెళ్తే పర్యా టకులను పరవశింపజేసే పాపి కొండలు దర్శనమిస్తాయి. భద్రా చలం వద్ద సుమారు 2 కిలోమీటర్ల వెడల్పు ఉన్న గోదావరి పాపి కొండలు వంపు సొంపులతో చిన్న ఏరులా గోచరిస్తుంది. ఎతైన కొండల మధ్య వంపులు తిరిగి ప్రవహించే గోదావరిని చూపి పర్యాటకులు పరవశించిపోతారు. టూరిజం శాఖ ఈ పేరంటాలపల్లి, పాపికొండల యాత్రకు మరింత అభివృద్ధి చేసి టూరిజం ప్యాకేజీ ప్రకటిస్తే యాత్రికులు మరింతగా వచ్చే అవకాశం ఉంది.
- చింతపల్లి వెంకటనర్సింహారెడ్డి, ఖమ్మం
కర్టసీ : సూర్య Daily

దేవతలు కొలువుదీరిన కుమావన్‌..!

అంబరాన్ని తాకే హిమలయాలు.. వాటినుండి గలగలమంటూ పారే సెలయేళ్ళు.. క్రమశిక్షణకు మారుపేరుగా.. ఒకే వరుసలో సైనిక పటాలాన్ని తలపిస్తూ.. ఏపుగా పెరిగిన పైన్‌ వృక్షాల అందాలు.. అందమైన లోయలు.. ఆ లోయల్లో వివిధ రకాల పుష్పజాతుల సోయగాలు.. వీటన్నింటి కలయికే... భూలోకంలో స్వర్గాన్ని గుర్తుచేసే.. కుమావన్‌ పర్వతాలు..

kumaon2హిమాలయాల్లో దేవతలు నివాసం ఉంటారని అంటారు. పరమశివుడికి ఆవాసమైన పవిత్ర కైలాస పర్వతం ఈ హిమ పర్వతాల్లోనే ఉందని విశ్వసిస్తుంటారు. అలాగే.. పవిత్ర నదులైన గంగ, యమున, సింధు, బ్రహ్మపుత్ర నదుల జన్మస్థానం కూడా హిమాలయా పర్వాతాల్లోనే..! పవిత్ర రుద్రాక్ష మొక్కలతోపాటు వందలాది ఔషధ మొక్కలకు కూడా నిలయం ఈ హిమాలయాలే. హిందూ పురాణాలన్నింటిలోనూ హిమాలయాలకు విడదీయలేని అనుబంధం ఉంది.

కుమావన్‌ అందాలు...

వాయువ్యంలో కాశ్మీర్‌ మొదలుకుని ఈశాన్య భారతదేశం వరకు విస్తరిం చిన ఈ హిమాలయా పర్వతాలలో పైన మనం చెప్పుకున్న కుమావన్‌ ప్రాంతం అత్యంత సుందరమైనది. ప్రస్తుత ఉత్తరాఖండ్‌ రాష్ట్రంలో ఉన్న ఈ కుమా వన్‌ పర్వతాల్లో.. హిమాలయాలలోనే అత్యంత పవిత్రమైనవిగా చెప్పబడే పుణ్యక్షేత్రాలున్నాయి. కాశ్మీరీ అందాల కు ఆలవాలమైన సౌర్‌ లోయ కూడా కుమావన్‌లో భాగమే. ఆ లోయనుంచి ఎటు చూసినా పచ్చటి ప్రకృతే మనకు దర్శనమిస్తుంది. ఎతైన పర్వతాలు, ఆ పర్వతాల మధ్య మెలికలు తిరిగిన కాలిబాటలు, ఆ బాటల వెంట.. అడగడుగా ఓ దేవతా మందిరం.. ఇలా వర్ణించేందుకు వీలులేనంతటి విశేషాలను తనలో దాచుకున్నదే కుమావన్‌.

ప్రకృతి, దేవతల ప్రతిరూపాల ను ఇక్కడి కొండలు, గుట్టలు, లోయలలో నిక్షిప్తమై ఉన్నాయి. అలాంటి మందిరాల్లో ఒకటి.. చితాయ మందిరం. ఈ ఆలయం ముందు కొన్ని వందల గుడిగంటలు వేలాడగట్టి ఉండడం విశేషం. ఈ ఆలయాన్ని దర్శించుకునే భక్తులు ఓ అరుదైన ఆచారాన్ని అవలంభిస్తారు. అక్కడి దేవతకు మన కష్టాలను విన్నవించుకునేందుకు కాగితాలను వాడతారు. తమ కోరికలను ఆ కాగితాలపై రాసి.. గంటతో సహా మందిర ప్రాంగణంలో వేలా డదీస్తారు. ఇలా చేస్తే.. ఆ దేవత తమ విన్నపాలను తప్పనిసరిగా మన్నిస్తుందని భక్తులు విశ్వసిస్తుంటారు.

ఎటు చూసినా సరస్సులే...

ప్రకృతి సహజంగా ఏర్పడిన సుమారు 50 సరస్సులు కుమావన్‌ పర్వతాల అందాలకు మరింత శోభనిస్తుంటాయి. దాదాపు ప్రతి పర్వతం మధ్యన ఒక సరస్సు ఉంటుంది. ఆ పర్వతం మీద పడిన వర్షపు నీరు, కరిగిన మంచు ఈ సరస్సుల గుండా ప్రవహిస్తాయి. ఆ సరస్సుల్లో అత్యంత స్వచ్ఛమైన నీరు, ఆ నీటిలోపల చుట్టూ ఉన్న ప్రకృతి అందాల ప్రతిబింబాలు.. కనువిందు చేస్తాయి. కుమావన్‌లో మొత్తం 73 పర్వతాలున్నాయి. ప్రతి పర్వతం నేరుగా ఆకాశంలోకి చొచ్చుకుని వెళుతున్నట్లు కనబడుతుంది. ఇవేకాకుండా 17 హిమఖండాలు కూడా ఉన్నాయి. దేవతల కోసమే ఈ ప్రదేశం ఏర్పడిందా! అన్నట్టు ఉండే ఈ అందమైన ప్రదేశంలో అడుగడుగునా ఓ దేవాలయాన్ని దర్శనమిస్తుం ది. అలా మొత్తంగా 40 శైవ మందిరా లు, మరో 48 దేవీ మందిరాలు ఇక్కడ పూజలందుకుంటున్నాయి.

వన్యప్రాణులకూ నిలయమే...
కుమావన్‌ దేవతల నివాసమే కాదు. వన్యప్రాణులకూ ఆలవాలమే. పక్షి ప్రేమికులకు ఇది ఓ రకమైన స్వర్గమే. ఇక్కడ సుమారు 300 రకాల పక్షి జాతులు మనకు దర్శనమిస్తాయి. ఉదయం, సాయంత్ర వేళల్లో ఆ పక్షుల కిలాకిలారావాలు వీనులవిందు చేస్తాయి. పక్షులతో పోటీపడి రంగులు వెదజల్లే సీతాకోక చిలుకలకు కూడా ఈ దేవతల భూమే నిలయం.

kumaon_houseఈ సుందర వనాలలో విహరించేందుకు దిగివచ్చిన దేవకన్యల్లా ఉంటాయవి. అక్కడ వీచే గాలులకు పరవశిస్తూ, అలా విహరిస్తూ, ఒక్కో పూవునుంచి మరో పూవుకు మకరందం కోసం ఆ సీతాకోక చిలుకలు కళ్లకు పసందు చేస్తూ, మనసుకు హాయినిస్తాయి. దాదాపు 3 వేల మీటర్ల ఎత్తు ఉండే ఈ కుమావన్‌ పర్వత శ్రేణులలో పలు వన్యప్రాణి రక్షిత ప్రదేశాలున్నాయి. వాటిలో దాదాపు 50 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉన్న బిస్సార్‌ రక్షిత ప్రదేశం విశేషమైనది. ఈ ప్రాంతంలో ఇది ఒక సౌందర్య ప్రాంతం. ఇక్కడ చిరుతలు, కస్తూరి మృగాలు, జింకలు, భల్లూకాలవంటి ఎన్నో వన్యప్రాణులు విహరిస్తుంటాయి.

అలాగే మంచుతో కప్పబడి ఉండే పర్వతాలలోని గోవింద వన్యప్రాణి సంరక్షిత ప్రదేశం కూడా చూడదగ్గదే. ఇక్కడ హిమాలయాలకు మాత్రమే పరిమితమైన నల్ల భల్లూకం, మంచు చిరుత, కస్తూరు, కోళ్ల వంటి పక్షులు, తాహిర్‌లు కనువిందు చేస్తాయి. ఇక్కడి పర్వతాలలో స్వరరోహిణి, నల్లశిఖరం అనేవి ప్రత్యేకంగా చూడదగ్గవి.ఇంతటి ప్రకృతి విశేష ప్రదేశాలను తనలో దాచుకుని.. అలకానంద, మందాకిని, గంగ, యమునా నదుల పుట్టినిల్లుగా భాసిల్లుతున్న ఈ ప్రదేశం నేడు విధ్వంసానికి గురవుతోంది. అభివృద్ధి పథకాల పేరుతో కొంతమేరకు అడవులను ధ్వంసం చేయగా.. కలప కోసం మరికొంత అడవిని నాశనం చేస్తున్నారు. ఫలితంగా ఈ దేవతల భూమి నేడు జీవులపాలిట మరుభూమిగా మారిపోతోతుండడం బాధాకరమైన విషయం. 

కర్టసీ : సూర్య Daily

సింధు నాగరికతకు ఆలవాలం... లడక్‌

ladakh-scenic-beautyప్రపంచంలో మరే ప్రాంతానికి లేని ఎన్నో ప్రత్యేకతలు లడక్‌ సొంతం. జమ్మూకాశ్మీర్‌ రాష్ట్రంలోని ఈ ప్రాంతం.. ప్రపంచంలో ఎతైన పర్వతశ్రేణుల జాబితాలో ఉన్న హిమాలయాలు, కారకోరమ్‌ మధ్య విస్తరించివుంది. లడక్‌లోని అత్యంత సమస్యాత్మకమైన కార్గిల్‌ ప్రాంతం సముద్ర మట్టానికి తొమ్మిది వేల అడుగుల ఎత్తున ఉండగా, కారకోరమ్‌ సమీపాన ఉన్న సాసెర్‌ కంగ్రి ప్రాంతం 25 వేల అడుగుల ఎత్తులో ఉంది. హిమాలయాల నుంచి వచ్చే శీతలపవనాలతో సంవత్సరమంతా ఇక్కడి వాతావరణం చల్లగా ఉంటుంది.

జీవజలం...

kumaon2చలికాలంలో పర్వతప్రాంతాలపై ఉన్న మంచు కరగడం ద్వారా వచ్చే నీరే లడక్‌ ప్రాంత ప్రజల వ్యవసాయానికి ప్రధాన జీవనాధారం. వర్షాలు కురిసినా అవి అననుకూల వర్షాలు కావడంతో అంతగా ఉపయోగం ఉండదు. కావున ఇక్కడి ప్రజలు వర్షాలకంటే.. ఎండలనే ఎక్కువ ఇష్టపడతారు. ఎందుకంటే ఎండ బాగా కాస్తే మంచు కరిగి నీరుగా మారి తమ పంటలకు అందుతుండడం వల్ల ఎండలు కాయాలని కోరుకుంటారు. ఇక్కడ ఏడాదిలో 300 రోజులు ఎండ కాస్తుంది. అయితే వేసవికాలంలో 27 డిగ్రీల సెల్సియస్‌ ఉండే ఉష్ణోగ్రత శీతాకాలంలో మైనస్‌ 20 డిగ్రీలకు పడిపోతుంది.

చూడాల్సిన ప్రదేశాలు...
సింధులోయ నాగరికత చిహ్నాలెన్నింటినో లడక్‌.. తనలో దాచుకున్నది. లడక్‌లోని లెహ్‌ ప్రాంతానికి ఎంతో చారిత్రక ప్రాధాన్యం ఉంది. 17వ శతాబ్దంలో సెంగె నంగ్యాల్‌ ఇక్కడ నిర్మించిన తొమ్మిదంతస్తుల రాజసౌధం ఇప్పటికీ చెక్కుచెదరకుండా ఉంది. ఇండస్‌కు కొన్ని కిలోమీటర్ల దూరంలో ఉన్న ‘షె’ పట్టణంలో ఎన్నో రాజభవనాలు, పురాతన ఆలయాలు ఉన్నాయి. వీటిలో చాలా భవనాలను 1980లో పునర్‌నిర్మించారు. దీనికి సమీపంలోనే ఉన్న బాస్గో, టింగ్మోస్గాంగ్‌ ప్రాంతాలు 15వ శతాబ్దంలో ఓ వెలుగు వెలిగాయి. అప్పటి వైభవానికి చిహ్నంగా శిథిలావస్థలో ఉన్న కట్టడాలు, ఆలయాలు ఈ ప్రాంతంలో కనబడతాయి.

kashmir.dal-lake-himalayasలడక్‌ ప్రాంతాన్ని గతంలో ఎందరో పాలించారు. వారిలో ఫియాంగ్‌, హెమిస్‌, చిబ్రా అనేవారు ప్రసిద్ధులు. బౌద్ధమతానికి ముందు వీరు పలు మతాలకు ప్రాణం పోసినట్టు ఆధారాలున్నాయి. లడక్‌ ప్రాంతంలో అనేక తెగలు కూడా చిరకాలం వర్థిల్లాయి. ఆ సమయంలో ఎన్నో దేవాలయాలను సైతం నిర్మించారు. ఇలాంటి వాటిలో అల్చి ప్రార్థనాస్థలం ఒకటి. ఐదు దేవాలయాల సమూహమిది. ఆలయాల లోపల అద్భుతమైన వర్ణ చిత్రాలు ఆశ్చర్యం గొలుపుతాయి. ఇవి 11, 12 శతాబ్దాలకాలం నాటివిగా చెబుతారు. ఈ ఆలయంలో జాదికాలు నిలిచిపోయి చాలా ఏళ్ళు అవుతున్నా, లికిర్‌ మత ప్రముఖులు కొందరు వీటిని ఇప్పటికీ సంరక్షిస్తుండడం విశేషం.

కర్టసీ : సూర్య Daily

Sunday, April 10, 2011

రామేశ్వరం .... అంతా రామమయమే

మన దేశానికి నలువైపుల ఉన్న పవిత్ర క్షేత్రాలలో రామేశ్వరం ఒకటి. ఉత్తరాన బదరీనాథ్, తూర్పున పూరీ జగన్నాథ్, పడమట ద్వారకలుండగా దక్షిణ సరిహద్దు క్షేత్రంగా రామేశ్వరం వెలసింది. మొదటి మూడూ వైష్ణవ క్షేత్రాలు కాగా, రామేశ్వరం ఒక్కటే శైవ క్షేత్రం. కాశీయాత్ర పుణ్యం దక్కాలంటే అక్కడి గంగా జలంతో రామేశ్వరంలోని లింగానికి అభిషేకం చేయాలంటారు. అలాంటి మహిమగల రామేశ్వరానికి స్నేహితులతో కలిసి గత డిసెంబర్ నెలలో వెళ్లొచ్చాం. అందరం వైద్య వృత్తికి చెందిన వాళ్లం. ఆనాటి విశేషాల సమాహారమే ....

మధురై దాకా విమానంలో వెళ్లి, అక్కడ నుండి రామేశ్వరానికి రానూ పోనూ కార్లు బుక్ చేసుకున్నాం. బయలుదేరిన కొద్ది గంటల్లో మండపం అనే ఊరు చేరాం. అక్కడ నుండి రామేశ్వర దీవికి కారు, రైలు లేదా బోటులో వెళ్లొచ్చు. 'కాసేపటిలో మనమంతా పంబన్ బ్రిడ్జి మీదుగా వెళ్లబోతున్నాం. 2.3 కి.మీ. దూరం సాగే ఈ బ్రిడ్జి మన దేశంలో సముద్రంపై నిర్మించిన అతి పెద్ద బ్రిడ్జి' అని మా డ్రైవర్ చెప్పాడు.

డబుల్ లీఫ్ బాస్కూల్ బ్రిడ్జి

బ్రిడ్జి మీదుగా వెడుతుంటే పరవళ్లు తొక్కుతూ బంగాళాఖాతం ఒకవైపు, ప్రశాంతంగా ప్రవహిస్తూ హిందూ మహాసముద్రం మరోవైపు. బ్రిడ్జి మధ్యకు వెళ్లాక కార్లు ఆపి దిగాము. కొద్దిగా వంగి చూస్తే రైల్వే బ్రిడ్జి కన్పిస్తోంది. దాని పొడువు 6, 776 అడుగులు. 1914 నుండీ వాడుకలో ఉందట. దాని ప్రత్యేకత ఏమంటే ఏదైనా ఒక పెద్ద నౌక ఆ దారిలో వెళ్లాలంటే బ్రిడ్జిని రెండు భాగాలుగా చీల్చి నౌక వెళ్లాక మళ్లీ యథాస్థానానికి తేవచ్చు. దీనిని 'డబుల్ లీఫ్ బాస్కూల్ బ్రిడ్జి' అని అంటారు. 2007 వరకు మీటర్ గేజీగా ఉన్న ఈ రైలు మార్గాన్ని ఇప్పుడు బ్రాడ్ గేజీగా మార్చారు. ప్రతి నెలా కనీసం పది నౌకలు ఈ మార్గంలో వెళ్తాయట.

మా అదృష్టం బాగుండి మేము చూస్తుండగానే కింద బ్రిడ్జి మీదుగా ఒక రైలు రామేశ్వరం వైపు అతి మెల్లగా వెళ్తూ కనిపించింది. మా పిల్లలు తెగ బాధ పడ్డారు. 'అరె మనం కూడా ఆ రైలులో ఉంటే సముద్రం ఇంకా దగ్గరగా కనపడేది కదా' అని. అంతలోనే ఒకాయన సంచిలో అప్పుడే దొరికిన పెద్ద శంఖాలు పట్టుకొని వచ్చాడు. అలవాటు ప్రకారం బేరం చేసి చెరొక శంఖం కొనేసాము. రామేశ్వర ద్వీపం కూడా శంఖం ఆకారంలో ఉంటుందని చెప్పాడతను. 2004లో వచ్చిన భూకంప, సునామీలలో కూడా ఈ పంబన్ బ్రిడ్జి చెక్కు చెదరలేదంటే మన ఇంజనీర్ల ప్రతిభకు జోహార్లు అనుకున్నా.

ధనుష్కోటి ప్రయాణంలో ...

ముందు ధనుష్కోటికి వెళ్లి ఆ తర్వాత రామేశ్వరంలో గుళ్లు చూద్దామనుకున్నాం. ధనుష్కోటి చేరాలంటే కొంత దూరం జీపులో ప్రయాణించక తప్పదు. ముందు కెళ్తున్న కొద్దీ చుట్టూ సముద్రం. సన్నటి ఇసుక దారిలో మా జీపు. 'ఇప్పుడు సునామీ లాంటిది వస్తే' అన్న ఊహ నా మదిలో మెదిలింది కానీ పెదవి విప్పలేదు. తీరా ధనుష్‌కోటి చేరాక చూస్తే అక్కడ సముద్రం ఎంతో ప్రశాంతంగా ఉంది. జీపు అతను అర్ధగంటలో అంతా చూసి వచ్చేయండి అన్నాడు. ఇసుకలో కూరుకుపోతున్న కాళ్లను పైకి లాగుతూ గబగబ అందరూ బీచి వైపు పరుగు తీశాము. అంతలో ఒక చిన్న కొట్టు దగ్గర ఒక పండు ముసలావిడ కనపడింది. వచ్చీరాని నా తమిళంలో ఆమెను ధనుష్‌కోటి వివరాలు అడిగాను.

ఇక్కడ నుండి శ్రీలంక 7 కి.మీ. దూరంలో ఉంది. ఇక్కడి నుండే శ్రీరాముడు తన వానర సేన సాయంతో రామసేతు నిర్మించి లంక చేరాడట. క్రీ.శ.1480 వరకు శ్రీలంకకు అందరూ ఇక్కడి భూమార్గం నుండే వెళ్లేవారట. కానీ కాలక్రమేణా ఎన్నో తుపాన్లు ఈ సేతువుని దెబ్బ తీశాయి. ఇప్పుడు అవి చిన్న దీవులుగా మారి 3 నుండి 4 అడుగుల లోతు నీటిలో ఉన్నాయి. ఇక్కడ సముద్రం కూడా 7 నుండి 11 అడుగుల లోతు మాత్రమే ఉంటుంది కాబట్టి పెద్ద పడవలు రాలేవని, చిన్న పడవలపైనే చేపలు పట్టుకుంటామని ముసలావిడ చెప్పింది. ధనుష్‌కోటిలో అక్కడక్కడ చిన్న గుడిసెలు, పాడుబడిన బంగళాలు, రైల్వే స్టేషన్, చర్చీ లాంటివి ఉన్నాయి. 50 ఏళ్ల క్రితం వచ్చిన అతి పెద్ద తుపాను ధనుష్‌కోటిని మొత్తం తుడిచిపెట్టేసిందని, అదృష్టవశాత్తు సరుకుల కోసం రామేశ్వరం వెళ్లిన తనూ, తన చిన్న మనవరాలూ, మరికొందరు ఊరివాళ్లు బతకి బట్ట కట్టామని, స్వంత ఊరిని వదలలేక ఇక్కడే బతికేస్తున్నామని చెప్పింది.

సైకత లింగావిర్భావం

తరువాత మా మజిలీ రామేశ్వరం గుడి. ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రాలలో ఇది ఏడవది. గుడి సముద్ర మట్టానికి కేవలం పది అడుగుల ఎత్తున ఉంది. ఈ గుడి ఆవిర్భావం వెనకున్న కథనం ఇది - శ్రీరాముడు రావణాసురుని సంహరించాక బ్రహ్మహత్యా పాపాన్ని తొలగించుకోవడానికి రామేశ్వరంలో శివలింగం ప్రతిష్టించాలనుకున్నాడట. శివలింగాన్ని తెమ్మని హనుమను కైలాసానికి పంపాడట. ముహూర్త సమయానికి ఆయన తిరిగి రాకపోవడంతో సీతమ్మవారు ఇసుకతో సైకత లింగం తయారుచేయగా శ్రీరాముడు దానిని ప్రతిష్టించాడట. అంతలో కైలాసం నుండి శివలింగం తీసుకుని వచ్చిన హనుమ సైకత లింగాన్ని తోకతో పెకిలించబోగా శ్రీరాముడు వారించి సమీపంలోనే హనుమ తెచ్చిన లింగాన్ని ప్రతిష్టింపచేశాడట.

'హనుమా, నీవు తెచ్చిన శివలింగానికే మొదటి పూజ, అభిషేకం, నైవేద్యం జరుగుతాయి. ఆ తరువాతే నాది' అని శాంతింపచేశాడట. ఆనాటి ఆ సైకతలింగమే శ్రీరామేశ్వర లింగం. హనుమంతుని లింగం శ్రీ విశ్వేశ్వర లింగం. త్రేతాయుగం నాటి ఆలయం శిథిలావస్థకు చేరగా క్రీ.శ. 12వ శతాబ్దంలో సింహళరాజు పరాక్రమ బాహు దీనిని పునర్నిర్మించాడట.

సేతుమాధవ తీర్థం

ఆలయంలోకి ప్రవేశించేముందు సముద్ర స్నానానికి వెళ్లాం. ఈ సముద్ర స్నాన ఘట్టాన్ని 'అగ్ని తీర్థం' అంటారు. ఇక్కడ సముద్రం ఎంత దూరం వెళ్లినా ప్రశాంతంగా ఒక నదిలా ఉంటుంది. సముద్ర స్నానాలు అయ్యాక తడి బట్టలతోనే అందరం గుడిలోకి నడిచాం. దారిలోనే చిన్న బక్కెట్లు పట్టుకొని తీర్థాలనుండి నీళ్లు చేది తలలపై పోస్తామని కొందరు వెంటపడ్డారు. దంపతులకు 500 రూపాయల చొప్పున మాట్లాడుకుని గుడిలోకి వెళ్లాం. రామేశ్వరంలోని ఆలయ ప్రాంగణంలో 22 తీర్థాలు ఉన్నాయి. వెచ్చగా, చల్లగా ఒక్కొక్క తీర్థంలో ఒక్కో రుచిలో ఉన్నాయి నీళ్లు. ఈ తీర్థాలలో అతి పెద్దది సేతుమాధవ తీర్థం. ఇక్కడి నీటిని తలపైన పోసుకుంటే జన్మజన్మల పాపాలు పోతాయట.

అబ్బురపరచే శిల్పకళా వైభవం

రామేశ్వరం గుడిని రామనాథస్వామి ఆల యం అంటారు. ద్రవిడ శిల్పరీతిలో కట్టారు. గుడి పదిహేను ఎకరాలలో విస్తరించి ఉంది. గోపురం వంద అడుగులది. ఎక్కడ చూసినా అందమైన స్తంభాలు, వాటిపై అత్యద్భుతమైన శిల్పాలు కనబడ్డాయి. దేవాలయంలో మూడు మండపాలను మొత్తం 4000 స్తంభాలతో కట్టారు. ప్రధాన ఆలయంలోని గర్భాలయంలో శ్రీరామలింగేశ్వరుడు ఉన్నాడు. దీనికి ముందువైపు సీతారామలక్ష్మణులు, రెండు చేతులలో రెండు శివలింగాలు కలిగి ఉన్న హనుమ, పక్కనే చేతులు జోడించిన సుగ్రీవుడు కనపడతారు. ఉత్తరంగా ప్రత్యేక గర్భాలయంలో శ్రీవిశ్వనాథస్వామి, సమీపంలో ఆయన దేవేరి శ్రీవిశాలాక్షి కొలువు తీరారు. శ్రీరామలింగేశ్వర స్వామికి దక్షిణాన శ్రీపర్వతవర్ధినీ దేవి అమ్మవారూ, వారి ముందు వైపు ఆదిశంకరాచార్యులు ప్రతిష్టించిన శ్రీచక్రం ఉంది.

తీర్థాల నీటి పుణ్యమా అని గుడిలో అన్ని చోట్ల నేల తడితడిగానే ఉంది. ఆలయ శిల్పకళావైభవాలను మళ్లీ ఒకసారి తీరిగ్గా వచ్చి చూడాలనుకున్నాం. ముఖ్యంగా మండపాలను, స్తంభాల వరుసలను చాలా సినిమాల్లో చూసినట్లు అనిపించింది.

అడుగడుగునా రాముడే

రామేశ్వరానికి రెండున్నర కి.మీ. దూరంలో గంధమాదన పర్వతం ఉంది. ఈ దీవిలోనే ఎత్తైన ప్రదేశం అది. లంక చేరడానికి హనుమ ఈ పర్వతం పైనుండే దూకాడట. ఇక్కడి ఆలయంలో శ్రీరాముని పాదాలను, సీతారామలక్ష్మణ విగ్రహాలను వీక్షించవచ్చు. రాముడు ఒక చేయి పైకి లేపిన ముద్రలో కొలువై ఉన్నాడు. పైనుండి రామేశ్వరం బాగా కనిపించింది.
8 కి.మీ. దూరంలో శ్రీకోదండరామాలయం ఉంది. విభీషణుడు శ్రీరాముని శరణు వేడిందీ, అతనిని వారు లంకాధీశునిగా పట్టాభిషేకం చేసిందీ ఇక్కడేనని చెప్పారు. 1964లో వచ్చిన తుపానుకు తట్టుకుని నిలిచిన పురాతన ఆలయపు రాతి గోడలు గుడి ముందు కనపడ్డాయి. ఈ ఆలయంలోనూ సుందరమైన శ్రీరామ సీతా లక్ష్మణ హనుమ విష్ణువు విగ్రహాలున్నాయి.

రామేశ్వరంలో ఇంకా చూడాల్సినవి జడాతీర్థం, లక్షణ తీర్థం, పంచముఖ ఆంజనేయస్వామి ఆలయం, అబ్దుల్ కలాంగారి ఇల్లు .. ఇలా చాలానే ఉన్నాయి. పొద్దున్నుండి తిరిగి తిరిగి అలిసిపోయిన మా పిల్లలు 'ఇక తిరగలేము, ఆకలో రామచంద్రా' అని మొరపెడుతుంటే 'సరే పదండి' అని ఒక సీ ఫుడ్ రెస్టారెంట్లో దూరాము.
రామేశ్వరంలో వసతి, భోజన సౌకర్యం ఎంతో చవకగా, నాణ్యంగా అనిపించాయి. చక్కటి గవ్వలు, శంఖాలు, గవ్వలతో చేసిన దువ్వెనలు, అద్దాలు విరివిగా దొరుకుతాయి. ముఖ్యంగా శ్రీరాముడు అడుగడుగునా కనపడి మమ్మల్ని తరింపచేశాడు.


- డా. ఎం. రమణి
040 - 2339 1994

Friday, April 8, 2011

హాయి హాయిగా. . హార్సిలీ కొండల్లో. .

 
ఆకాశాన్ని తాకుతున్నట్లుండే ఎతె్తైన పర్వతశ్రేణులు... కనుచూపుమేర పరుచుకున్న పచ్చదనం... అక్కడ అడుగుపెట్టగానే చల్లని పిల్లతిమ్మెరలు ఒడలికి ఒక విచిత్ర అనూభూతిని కలిగిస్తాయి... చల్లని వాతవరణం... చుట్టూ పచ్చని చెట్లు... రంగురంగుల పక్షుల కిలకిలరావాలు... ఆ అనుభూతే వేరు. రాష్ట్రంలో ఉన్న ఎకైక వేసవి విడిదికేంద్రం హర్సిలీ హిల్స్‌. సముద్రమట్టానికి 1314 మీ ఎత్తులో ఉన్న ఈ అద్భుత విహారకేంద్రం... పచ్చని అడువులు, ఔషధ గుణాలు కల చెట్లుతో అలరారుతోంది. గ్రీష్మతాపంతో తల్లడిల్లుతోన్న ప్రజలు ఆహ్లాదకర వాతావరణంలో సేదదీరడానికి, మధురానుభూతులను మిగుల్చుకోవడానికి వచ్చే జనసందడితో నేడు హార్సిలీ హిల్స్‌ కళకళ లాడుతోంది


ఆహ్లదకర వాతావరణం, ప్రకృతి సౌందర్యం హార్సిలీహిల్స్‌ ప్రత్యేకతలు. ఇక్కడికి వేళ్ళే కొండ దారి.. వంకలు తిరిగి ఎంతో అందంగా వుంటుంది. రెండువైపులా నీలగిరి వంటి అనేక జాతుల చేట్లు, కొండ చుట్టూ అడవులు, కం టికి ఇంపుగా కనిపించే సువిస్తారమైన పచ్చదనం మదిని పులకరింప చేస్తాయి.

మత్తేకించే పూల ఘమఘమలు...
h-Hillsహార్సీలీహిల్స్‌.. సువాసనలను వెదజల్లే సంపంగి పూలకు ప్రసిద్ది. సంపెంగ సువాసనలతో హర్సిలీ హిల్స్‌ ఘమఘమలు పర్యాటకులను మరో ప్రపంచం లోకి తీసుకేళ్తాయి. వీటితోపాటిగా చందనం, ఎర్రచందనం, కలప, రీటా, శీకా కాయ, ఉసిరిగ చెట్లు ఇక్కడ కోకొల్లలుగా వున్నాయి.

ఆ పేరు ఎలా వచ్చిందంటే...
ప్రస్తుతం చిత్తూరు జిల్లాలో వున్న ఈ ప్రాంతం.. ఒకప్పుడు కడప జిల్లాలో వుం డేది. కడప అసలే వేడి ప్రదేశం. బ్రిటీషు హయంలో కలెక్టర్‌గా వున్న డబ్ల్యూ.డి హర్సీలీ వేసవి తాపాన్ని తట్టుకునేందుకు ఎక్కువగా ఇక్కడికి వచ్చేవారు. ఆయ నకు విశ్రాంతి నిలయంగా వున్న ఈ ప్రాంతం కొన్నాళ్ల తరువాత మెల్లగా ఆయ నకు వేసవి నివాసంగా మారిపోయింది. అన్ని ఆధికారిక కార్యక్రమాలు అక్కడి నుంచే సాగేవి. దీంతో ఈ కొండ ప్రాంతాలకు ‘హర్సీలీహిల్స్‌’గా పేరు ముద్ర పడిపోయింది. 1863లో ఆయన వేసివి విడిదిగా ఇక్కడ ఒక ఇంటిని నిర్మిం చారు. దీనిని ఫారెస్టు బంగ్లా అంటారు. అ తరువాత కార్యలయ భవనం నిర్మిం చారు. ఈ భవనాలు ఇప్పటికీ నివాసా యోగ్యంగా వుండి వాడుకలో వుండడం విశేషం! ఫారెస్టు బంగ్లాలోని 4 గదులలో ఒక దానికి హర్సీలీ పేరు పెట్టారు.

ఆహ్లాదాన్నిచ్చే చల్లగాలులు...
చల్లని పిల్లగాలులు పర్యటకుల శరీరాన్ని తాకుతూ వేళ్తుంటే ఆ అనుభూతే వేరు. తూర్పు కనుమలలోని దక్షిణ భాగంలో విస్తరించిన కొండలే హర్సీలీ కొండలు. చలికాలంలో 3 డిగ్రీల సెంటీగ్రేడ్‌ నుంచి మండువేసవిలో 30 డిగ్రీల సెంటీగ్రేడ్‌ వరకు ఉష్ణోగ్రత వున్న ఈ ప్రాంతం, చల్లటిగాలిలో తేలుతూ వచ్చే సంపెంగల సువాసనలు పర్యాటకులను ఈ ప్రాంతానికి మళ్ళీమళ్లీ రప్పిస్తాయి. దట్టమైన చెట్లు, విస్తారమైన పచ్చిక బయళ్లు జనాన్ని అకర్షిస్తాయి. ఇలా వివిధ రకాల చెట్లు, చేమల మధ్య చెంచుజాతి కి చెందిన వారు ఈ ప్రాంతలో జీవనం సాగిస్తున్నారు. హర్సీలీకొండల వాలుపై సంపెంగ పూల మొక్కలను నాటింది ఈ చెంచులే.

చూడముచ్చటైన చెంచు జానపదం...
h-Hills1ఈ విహర స్థలానికి ఏనుగు మల్లమ్మ కొండ అనే పేరు కూడా ఉంది. జాన పదుల కథనం మేరకు పూర్వాశ్రమమంలో మల్లమ్మ అనే చిన్నారిని గజరాజు రక్షిస్తూ వుండేవాడట. కొండమీద చెంచులకు ఏ ఆపద వచ్చినా, జబ్బులు వచ్చినా చిన్నారి మల్లమ్మ అభయ హస్తం ఇచ్చి కాపాడేదట. ఉన్నట్టుండి ఒక రోజు చిన్నారి మల్లమ్మ అదృశ్యంమైంది. కొండా, కోనా, వాగు-వంకా, చెట్లు - పుట్ట వెతికి వేసారిపోయిన చెంచులు ఆమెకు కోవెల కట్టి, తమ ఇలవేల్పుగా చేసుకొని ఈ నాటికి కొలుస్తూనే వున్నారు. నేటికి కొండమీద వున్న బస్టాండ్‌ సమీపంలోని మల్లమ్మ కోవెలలో నిత్యం ధూపదీప పూజార్చనలు జరుగుతూ వుండడం చెంచుల అచంచల భక్తికి నిదర్శనం. ఏటా చెంచులందరూ... పర్యా టకులు, పరిసర గ్రామీణులతో కలిసి నేటికి ఏనుగు మల్లమ్మ జాతర అంగరం గ వైభవంగా జరుపుతారు.

అరుదైన వన్యసంపద...
h-Hills3 భూతల స్వర్గాన్ని తలపించే అందాలతో పాటు 152 సంవత్సరాల వయస్సు కల్గిన ‘కళ్యాణి’ - అనే పేరుగల యూకలిప్టస్‌ చెట్టు ఇక్కడ ప్రధాన అకర్షణలలో ఒకటి. 1859లో డబ్ల్యూ.డి.హర్సీలీ నాటిన ఈ వృక్ష రాజం ఎత్తు 40 మీటర్ల పైమాటే. దుప్పులు, అడవికోళ్ళు, నక్కలు, ఎలుగుబంట్లు, గజరాజులు, కుందే ళ్ళు, కొండ ఎలుకలు, జింకలు, చిరుతపులులు, లేళ్ళు, అడవి పిల్లు లతో కూడిన అత్యంత అకర్షణీయ మైన వన్యమృగ కేంద్రం పర్యాటకు ల మనసును కట్టిపడేస్తుంది. ఆంధ్ర ప్రదేశ్‌ పర్యాటక శాఖ ఏర్పాటు చేసి న ‘పున్నమి’ వేసవి విడిది బంగ్లా ముందు కాండాలు కలిసిపోయి రెం డుగా చీలి ఏపుగా పెరిగిన రెండు మహవృక్షాలు చూపరులను అలరి స్తాయి. మొసళ్ళు మిసమిసలాడు తూ పర్యాటకుల వైపు ఎగబాకే క్రోకడైల్‌ పూల్‌ చూపరుల ఒళ్లు జలదరింపజేస్తుంది. రంగురంగుల ఈకలతో చిటారి శబ్దాలు చేసే పక్షి కేంద్రంతో పాటు జింకల పార్కు అల రిస్తుంది. ప్రేమికులు మనసు విప్పి మదిలోని ఊసులను గుసగుసలాడడానికి హర్సీలీహిల్స్‌లో వేదికాగా మారిన ‘గాలిబండ’ పైనుంచి మంచుకురిసే వేళా సూర్యోదయం, సూర్యాస్తమయం చూసే పర్యాటకులకు గుండె ఝల్లుమన డం ఖాయం. ఇక ఏనుగు మల్లమ్మ కోవెల అందాలు చెప్పనలివి కానివి.

సాహసవీరుల ఖిల్లా...
h-Hills2 హర్సీలీహిల్స్‌ సాహసవీరులకు అరుదైన అవకాశం కల్పిస్తుంది. ట్రెక్కింగ్‌, రాక్‌క్లైంబింగ్‌, బంజీ రన్నింగ్‌, గోర్బింగ్‌, రాపెల్లింగ్‌, బర్మాబ్రిడ్జి వాకింగ్‌, బర్మాలూప్స్‌, ఎర్త్‌కేక్‌ లాంటి సాహసకృత్యాల కోసం విదేశాలకు, లేదా పక్కరాష్ట్రాలకు పరుగు తీయాల్సిన అవసరం లేదు. ఆంధ్రప్రదేశ్‌ పర్యాటక శాఖ ఇలాంటి అవకాశాలను హర్సీలీ హిల్స్‌పై కల్పించడంతో పాటు పగలు, రాత్రివేళల్లో అక్కడే గడేపే విధంగా ప్యాకేజీలను రూపోందించింది. ఇక వసతి, భోజన సౌకర్యాలను కూడా ఆశాఖ ఏర్పాటు చేసింది. పిల్లలు ఆడుకొవడానికి వీలుగా ప్లేగ్రౌండ్‌, పెద్దలకు బార్‌, సిమ్మింగ్‌పూల్‌ మొదలు ఆర్డర్‌ ఇస్తే గంటలో వేడి వేడిగా వండివార్చే హోటల్స్‌ ఇక్కడ వున్నాయి. అంతేకాక పర్యాటకుల జిహ్వ చాపల్యానికి తగినరీతిలో... మైమరిపించే రాయలసీమ స్పెషల్‌ ‘సంగ టి-నాటుకొడి కూర’ క్షణాల్లో అందించే ప్రైవేట్‌ కుక్స్‌ కూడా ఇక్కడ ఉండడం విశేషం.

వసతి సౌకర్యాలు...
పర్యాటక శాఖ పున్నమి రిసార్ట్‌‌స, హరితా హిల్స్‌ రిసార్ట్‌‌స, గవర్నర్‌ బంగ్లా, ఫార ెస్టు బంగ్లా, చిత్తూరు సహకార సమాఖ్య అతిధి గృహం, ఎ.డి.సి క్వార్టర్స్‌ ఇలా లెక్కకు మించిన కాటేజీలు ఇక్కడ వున్నాయి. వీటితో పాటు హెల్త్‌ కబ్ల్‌, మసాజ్‌ సెంటర్‌ కాన్షరెన్సు హల్‌, స్విమ్మింగ్‌ పూల్‌ కూడా అందుబాటులో వున్నాయి. పర్యాటకులకు మరిన్ని వివరాలు అందించడానికి 09440272241, 08571 27932324 నెంబర్లుకు సిద్ధంగా ఉన్నాయి.

ఇలా చేరుకోవాలి...
విమానల ద్యాదా వచ్చే దూరప్రాంత పర్యాటకులు బెంగళూరు లేదా తిరుపతి విమానశ్రయాలకు చేరుకొని, అక్కడి నుంచి రోడ్డు మార్గం ద్యారా మదనపల్లికి చేరుకొని హార్సీల్‌హిల్స్‌ వెళ్ళవచ్చు. రైలు మార్గం ద్వారా వచ్చే ప్రయాణీకులు మదనపల్లె రోడ్‌ రైల్వే స్టేషన్‌లో దిగి అక్కడి నుండి రోడ్డు మార్గం ద్వారా హార్సీలీ హిల్స్‌ చేరుకోవచ్చు. మదనపల్లి నుంచి దాదాపు ప్రతి అరగంటకు ఒక బస్సు వుంది. అలాగే అద్దె వాహనాల్లో కూడా కొండ మీదకు వేళ్ళవచ్చు.

- ఎస్‌.ఎం.రఫీ, మదనపల్లి
కర్టసీ : సూర్య Daily

లిటిల్‌ ఫ్రాన్స్‌ ఆఫ్‌ ఇండియా. . పాండిచ్చేరి

రెండు దేశాల సంస్కృతులు, వేషభాషలు మనదేశంలో ఎక్కడైనా వాడుకలో ఉన్నాయంటే.. అది గోవా తరువాత పాండిచ్చేరి మాత్రమే. ప్రస్తుతం మనదేశలంలో ‘లిటిల్‌ ఫ్రాన్స్‌’గా కొనియాడబడుతోన్న పాండిచ్చేరి స్వాతంత్య్రానికి పూర్వం ‘ఫ్రెంచి కాలనీ’ అయిన పాండిచ్చేరిలో.. ఎన్నో గతవైభవ చిహ్నాలతో పాటు.. హిందూ సంస్కృతి మూలాలను కూడా తనలో నిక్షిప్తం చేసుకుంది. అగస్త్య మహర్షి ఆశ్రయం పొందిన స్థలంగా పురాణగాథలు వెల్లడి చేస్తున్న ఈ ప్రాంతం.. దేశంలోనే ప్రముఖ పర్యాటక కేంద్రంగా వెలుగొందుతోంది.


తమిళంలో ‘పుదు - చ్చేరి’ అంటే ‘క్రొత్త - ఊరు’ అని అర్ధం. దీనికి సమీపమైన ఫ్రెంచి ఉచ్ఛారణ ప్రకారం దీనిని ఫ్రెంచివారు ‘ౌ్కఠఛీజీఛిజ్ఛిటడ‘ అని పిలిచారు. ఎప్పుడో పొరబాటున ఆంగ్లంలో ’ఠ’ బదులు ’’ అని వ్రాయడం వల్ల దీనిని ఆంగ్లంలో ‘పాండిచ్చేరి’ అని పిలువడం మొదలయ్యిం దని అంటారు. తరువాత అదే పేరు వాడుకలోకి వచ్చిందట. ప్రస్తుతం ఆంగ్లంలో అధికారికంగా ‘పుదుచ్చేరి’ అని పేరు మార్చే ప్రయత్నం జరుగుతున్నది.

ఇదీ చరిత్ర...
Auroville_puducherry పురాణకాలంలో ఇక్కడ అగస్త్యమహర్షి ఆశ్రమం ఉండేదని చెబుతారు. ఇక్కడ ఒక సంస్కృత విద్యాలయం కూడా ఉండేదని కొన్ని పురాతన ఆధారాల వల్ల తెలుస్తోంది. క్రీశ 2 వ శతాబ్దంలో వ్రాయబడిన ్క్ఛటజీఞజూఠట ౌజ ్టజ్ఛి ఉటడ్టజిట్చ్ఛ్చ ఖ్ఛ్చి లో ‘పొడుకె’ అనే వాణిజ్యకేంద్రం గురించి వ్రాయబడినది. ఇదే ప్రస్తుత పుదుచ్చేరికి 2మైళ్ళ దూరంలో ఉన్న ‘అరికమేడు’ అని ‘హంటింగ్‌ ఫోర్డ్‌’ అనే రచయిత అభిప్రాయం. అప్పటినుండి రోమ్‌ ప్రాంతంతో పుదుచ్చేరి దగ్గరి రేవులకు సముద్ర వర్తక సంబంధాలుండేవి. రోమ్‌కు చెందిన కొన్ని పాత్రలు అరికమేడులో త్రవ్వకాలలో బయటపడ్డాయి. క్రీశ 4 వ శతాబ్దానంతరం ఈ ప్రాంతం వరుసగా పల్లవ, చోళ, పాండ్య, విజయనగర రాజుల రాజ్యాలలో భాగంగా ఉంది. 1673 లో ఫ్రెంచి ఈస్టిండియా కంపెనీ వారు ఇక్కడ నెలకొలిపిన వర్తక స్థావరం క్రమంగా ఫ్రెంచివారి అధికార కేంద్రమయ్యింది. తరువాత ఫ్రెంచి, బ్రిటిష్‌, డచ్‌ వారి మధ్య అధికారం కోసం జరిగిన అనేక యద్ధాలు, ఒప్పందా ల ప్రకారం పుదుచ్చే రి పై అధికారం మారుతూ వచ్చింది. 1850 తరువాత పుదుచ్చేరి, మాహె, యానాం, కరైకాల్‌, చందేర్‌ నగర్‌లు ఫ్రెంచివారి స్థావరాలుగా ఉన్నాయి. 1954 వరకు ఇదే పరిస్థితి సాగింది.

విభిన్న సంస్కృతుల సమాహారం...
shore-temples భిన్న సంస్కృతులు కలిగిన విలక్షణ నగరం పాండిచ్చేరి. స్వాతంత్య్రానికి పూర్వం ఫ్రెంచి వారి ఏలుబడిలో ఉన్న ఈ ప్రదేశంలో ఇప్పటికీ ఆ పోకడలు మనకు గోచరిస్తాయి. ఆనాటి వైభవ చిహ్నాలు.. గత చరిత్రకు సాక్ష్యాలుగా ఎన్నెన్నో కట్టడాలు ఇప్పటికీ పర్యాటకులను విశేషంగా ఉకట్టుకుంటున్నాయి. చదువుల కాణాచిగా, ఆధ్యాత్మికవాదుల మజిలీగా, ప్రకృతి ప్రేమికులకు విహార కేంద్రంగా భూలోకపు స్వర్గాన్ని తలపిస్తున్న ఈ అద్భుత ప్రదేశంగా పేరున్న పాండిచ్చేరిని మించిన ఆధ్యాత్మిక విహారకేంద్రం మరోటి లేదంటే అతిశయోక్తి కాదేమో! దక్షిణ భారత దేశంలో ఒక కేంద్ర పాలిత ప్రాంతమైన పాండిచ్చేరి (పుదుచ్చేరి).. పుదుచ్చేరి, కరైకాల్‌, యానాం, మాహె అనే నాలుగు విడి విడి జి ల్లా ల సముదాయం. వీటి లో పాండిచ్చేరి పట్ట ణం బంగాళాఖాతం తీరాన, తమిళనాడు రాష్ట్రం అంత ర్భాగంగా 293 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో విస్త రించి ఉంది. కరైకాల్‌ బం గాళాఖాతం తీరంలో, తమిళనాడు రాష్ట్రం అంతర్భాగంగా 160 చదరపు కిలోమీటర్ల పరిధిలో విస్తరించి ఉంది.

అలాగే.. బంగాళాఖాతం తీరంలోనే, మన రాష్ట్ర అంతర్భాగంగా, కాకినాడకు సమీపంలో 30 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో యానాం విస్తరించి ఉంది. ఇక చివరిదైన మాహె.. అరేబియన్‌ సముద్ర తీరాన 9 చదరపు కిలోమీటర్ల పరిధిలో విస్తరించి ఉంది. పాండిచ్చేరిలోని నాలుగు జిల్లాల జనాభా మొత్తం సుమారు 10 లక్షలకు పైబడే ఉంటుంది.

ఇక్కడ చూడాల్సినవివే..
పాండిచ్చేరిలో చూడాల్సిన పర్యాటక ప్రదేశాలు అనేకం ఉన్నాయి. వాటిలో బీచ్‌, బొటానికల్‌ గార్డెన్‌, మ్యూజియం ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే ఉన్నాయి. ముఖ్యంగా చెప్పుకోవాల్సింది సెరినిటీ బీచ్‌. ఒకటిన్నర కిలోమీటర్లు పొడవుండే ఈ బీచ్‌ సౌందర్యం మాటల్లో చెప్పలేనిది. ఈ సెరినిటీ బీచ్‌లో ముఖ్యంగా రెండు చారిత్రక కట్టడాలు ఉన్నాయి. అందులో ఒకటి జాతిపిత మహాత్మాగాంధీ విగ్రహం, మరొకటి యుద్ధ స్మారక చిహ్నం. బీచ్‌కు కొంచెం దూరంలో ఉండే లైట్‌ హౌస్‌ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఎందుకంటే, ఇది 150 సంవత్సరాల క్రితం కట్టబడిందంటే నమ్మలేంి్ట. పాండిచ్చేరి స్పెషాలిటీ ఒక్క బీచ్‌ మాత్రమే కాదు.. అనేక చారిత్రక కట్టడాలు, వాటి వెనుక ఉన్న చరిత్ర, ఫ్రెంచ్‌ సంస్కృతి, పచ్చదనం.. ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే ఉన్నాయి.

తరువాత చెప్పుకోవాల్సింది.. బొటానికల్‌ గార్డెన్‌. దీన్ని ‘ఐలాండ్‌ ఆఫ్‌ పీస్‌’ అని పిలుస్తారు. 22 ఎకరాల విస్తీర్ణంలో విస్తరించి ఉన్న ఈ బొటానికల్‌ గార్డెన్‌ ప్రశాంతతకు, పచ్చదనానికి చిహ్నమని చెప్పవచ్చు. భారతదేశంలోని పూల మొక్కలే కాకుండా, విదేశాల నుంచి తెచ్చిన ఎన్నో రకాల పూల మొక్కలను ఇక్కడ మనకు దర్శనమిస్తాయి.

ఈ బొటానికల్‌ గార్డెన్‌లో ఓ ఆక్వేరియం కూడా ఉంది. అందులోని అరుదైన ‘ఆర్నమెంటల్‌ చేపలు’ భలే అందంగా అలరిస్తుంటాయి. పాండిచ్చేరికి వెళ్లేవారు ఈ గార్డెన్‌ను దర్శించకపోతే... వారి విహారం పూర్తి కానట్టే లెఖ్ఖ. ఇక్కడ మరో చెప్పుకోదగ్గ ప్రాంతం పాండిచ్చేరి మ్యూజియం. భారతి పార్కులోగల ఈ మ్యూజియంలోని శిల్ప సంపద ఒకదాన్ని మించి మరొకటి మనల్ని కట్టిపడేస్తుంది.

ఇలా వెళ్లాలి...
పాండిచ్చేరికి ఎలా వెళ్లాలంటే.. విమానంలో అయితే పాండిచ్చేరికి 135 కిలోమీటర్ల దూరంలో చెనై్న ఎయిర్‌పోర్టు ఉంది. ఇక్కడ నుండి విల్లుపురం రైల్‌ జంక్షన్‌ మీదుగా పాండిచ్చేరి చేరుకోవచ్చు. పాండిచ్చేరికి సమీపంలో విల్లుపురం, మధురై, త్రివేండ్రం.. రైల్వే స్టేషన్‌లు ఉన్నాయి. ఈ మూడింటిలో ఎక్కడినుండైనా సులభంగా పాండిచ్చేరి చేరుకోవచ్చు. 
కర్టసీ : సూర్య Daily