ఏ ప్రాంతం నుంచైనా హైదరాబాద్ చేరుకోవడం సులభం. ఇక్కడి నుంచి 165 కిలోమీటర్ల దూరంలో ఆదిలాబాద్‌లో ఉంది బాసర పుణ్యక్షేత్రం. సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ నుంచి రోజూ బాసరకు రైలు వెళుతుంది. సొంత వాహనంలో అయితే 3 గంటల్లో బాసర చేరుకోవచ్చు. ఉదయం హైదరాబాద్ నుంచి రైలు లేదా బస్సులో బయలు దేరితే మధ్యాహ్నానికి అక్కడికి వెళ్లవచ్చు.
బాసరలోని శ్రీ జ్ఞానసరస్వతి ఆలయంలో అక్షరాభ్యాసం చేసుకున్న వారు చదువుల్లో రాణిస్తారని ప్రతీతి. బాసర నుంచి 65 కిలోమీటర్ల దూరంలో నిజామాబాద్ జిల్లాలో ఉన్న శ్రీరాంసాగర్ చేరుకోవచ్చు. బాసర- శ్రీరాంసాగర్ మధ్య మన రాష్ట్రంలో అధునిక వ్యవసాయానికి పేరెన్నిక గన్న అంకాపూర్‌లో కాసేపు ఆగితే, వ్యవసాయం అంటే మనకున్న అపోహలన్నీ చెల్లాచెదురవుతాయి. అంత పచ్చగా ఉంటుంది. అంకాపూర్ వ్యవసాయానికే కాదు రుచికరమైన జొన్నరెట్టె, నాటుకోడికూరకు పెట్టింది పేరు.
శ్రీరాంసాగర్ రిజర్వాయర్ చెంతన సూర్యాస్తమయాన్ని తిలకించడం ఓ అందమైన అనుభవం. అక్కడి నుంచి 25 నిమిషాలు ప్రయాణిస్తే నిర్మల్ పట్టణం చేరుకుంటారు. కుంటాలలో ఉండేందుకు సౌకర్యం లేదు కాబట్టి నిర్మల్‌లో రాత్రి బస చేయవచ్చు. మరుసటి రోజు ఉదయాన్నే నిర్మల్‌లోని అందమైన బొమ్మలను చూసి నేరడిగొండ మీదుగా కుంటాలకు వెళ్లిపోవచ్చు. ఈ ప్రాంతంలో పొచ్చెర, కనకాయి గొలుసుల గుండం, ఘన్‌పూర్ అనే మరో నాలుగు జలపాతాలున్నా కుంటాల అందాలే వేరు.
మన రాష్ట్రంతో పాటు మహారాష్ట్ర నుంచి కూడా పెద్ద సంఖ్యలో పర్యాటకులు ఇక్కడికి వస్తూ ఉంటారు. పిల్లలకే కాదు పెద్దలకు కూడా జలపాతంలో ఈదులాడకుండా, కేరింతలు కొట్టకుండా ఉండటం కష్టమే. హైదరాబాద్ నుంచి శనివారం బయలుదేరి ఈ మూడు ప్రాంతాలూ చూసుకొని ఆదివారం రాత్రికి తిరిగి హైదరాబాద్ చేరుకోవచ్చు.

వివరాలకు: 08752-243503, కార్యాలయం: 243550, కార్యనిర్వాహణాధికారి: 243903. రైల్వే స్టేషన్: 243504, 9490003748. బస : దేవస్థాన అతిథి గృహాలు అందుబాటులో ఉంటాయి.
No comments:
Post a Comment