ఆంధ్రప్రదేశ్‌లో చూడదగ్గ పర్యాటక కేంద్రాల్లో ఉండవల్లి గుహలకు ఎంతో ప్రత్యేకత ఉంది. ఓ పెద్ద కొండను తొలిచి లోపల గదులుగా నిర్మించిన ఆనాటి శిల్పుల శిల్పాకళా నైపుణ్యానికి ఉండవల్లి గుహలు సజీవ సాక్షాలు. కొండకు ముఖ ద్వారాన్ని ఏర్పరచి అందులోంచి లోపలికి వెళ్లే కొద్దీ అక్కడ చెక్కబడి ఉన్న వివిధ రకాలైన దేవతామూర్తులు, శిల్పాలు ఈ ఉండవల్లి గుహల ప్రత్యేకత.
గుహలోని విశేషాలు ..
బయటినుంచి చూస్తే కొండముందు కట్టబడిన ఓ రాతి భవనం లాంటి నిర్మాణంగా కనిపించినా... లోపలికి వెళితే ఓ అద్భుతలోకం ఆవిష్కరించబడుతుంది. గుహ లోపల నాలుగు అంతస్థులుగా తొలచి అందు లో దేవతా విగ్రహాలతోపాటు వివిధ రకాల శిల్పాలు చెక్క బడి ఉన్నాయి. అలాగే కొండకు వెలుపలి భాగంలో తపోవనంలో ఉన్న మహ ర్షులను పోలి న విగ్రహాలు కన్పిస్తాయి. గుహ లోపల శయనించి ఉన్న అతిపెద్ద మహా విష్ణు వు (అనంత పద్మనాభస్వామి) విగ్రహం పర్యాటకులను విశే షంగా ఆకర్షిస్తుంది.అతిపెద్ద గ్రానైట్ రాయిపై చెక్కబడిన ఈ వి గ్రహంతోపాటు ఇతర దేవతల విగ్రహాలు సె ైతం ఇక్కడ దర్శనమిస్తాయి. ఇతర ఆలయాల్లో త్రి మూర్తులు అయిన బ్రహ్మ, విష్ణువు, శివుడు దేవ తలకు ఉద్దేశించినవి. గుహాంత ర్బాగంలో కమలంలో కూర్చున్న బ్రహ్మ, సప్తర్షులు ఇతర దేవతల విగ్రహాలూ కలవు. ఇవి గుప్తుల కాలం నాటి ప్రధమ భాగానికి చెందిన నిర్మాణ శైలికి లభిస్తు న్న ఆధారాలలో ఒ టి. పర్వతము బ యటి వైపు గుహాలయ పైభా గంలో సప్తఋషు ల వి గ్రహాలు పెద్దవిగా చెక్కారు. ఒకే పర్వతా న్ని గుహలుగానూ దేవ తా ప్రతిమలతో పాటు ఏకశిలా నిర్మితంగా ని ర్మించిన శిల్పుల ఘనత ఏపాటిదో ఇక్కడ చూే స్తనే తెలుస్తుంది. ఈ గుహల నుంచి పూర్వ కాలంలో మంగళగిరి వరకు సొరంగ మార్గం ఉండేదని పూర్వీకులు చెబుతుంటారు. ఈ మార్గం నుండి రాజులు తమ సైన్యాన్ని శత్రురాజులకు తెలియకుండా తరలించేవారని ప్రతీతి. ఈ గుహల నిర్మాణశైలి బౌద్ధ విహారాల శైలిని పోలి ఉంది. ఆలయాల చుట్టూ పచ్చని పంటపొలాలు కనువిందు చేస్తాయి. ఈ గుహలను క్రీశ 430 ప్రాంతంలో పాలించిన విష్ణుకుండుల కాలానికి చెందినవిగా చరిత్రకారులు పేర్కొంటారు.
ఇతర విశేషాలు...
ఇది పల్లెటూరు కావడం వల్ల ఇక్కడ పర్యాటకులకు అవసరమైన సౌకర్యాలు అంతంతమాత్రంగానే ఉంటాయి. ఉండవల్లి గ్రామానికి సమీపంలో ఉండే ఇతర ప్రాంతాల గురించి చెప్పాలంటే ప్రకాశం బ్యారేజ్ ఈ ప్రాంతానికి కేవలం మూడు కిలోమీటర్ల దూరంలోనే ఉంది. కానీ, ప్రకాశం బ్యారేజీ పైన బస్సు సదుపాయం లేదు. అలాగే విజయవాడ కూడా ఈ ప్రాంతానికి అతి సమీపంలోనే ఉంది. మంగళగిరికి 5 కిమీల దూరంలో, అమరావతి సైతం ఈ ప్రాంతానికి అత్యంత సమీపంలోనే ఉంది.
No comments:
Post a Comment