Wednesday, December 15, 2010
వర్ణించతరమా..! షే లోయ అందాలు
ఎప్పుడూ అల్లకల్లోలంగా ఉండే జమ్మూ ప్రాంతంలోని లడక్‌లో ఉన్న అందమైన గ్రామాల్లో ‘షే లోయ’ చెప్పుకోదగినది. లే ప్రాంతానికి 15 కి.మీ దూరంలో ఉన్న షే లోయలు లడక్ భూభాగాన్ని ఆక్రమించాయి. రాకీ పర్వతాల మధ్య భాగంలో కుడి వైపున ఉన్న అన్ని లోయల తరహా లోనే షే లోయలు కూడా కొలువు దీరి ఉన్నాయి.
సూర్యుడి ప్రతాపం, గాలి, నీటి ప్రవాహాలు, మంచు తదితర ప్రకృ తి అంశాల ఒరవడితో నేల కోతకు గురైన దృశ్యాలు ఈ ప్రాంతం నుం చి చక్కగా కనిపిస్తాయి. కూరగాయ లు, పళ్లను పండించేందుకు వేసవి కాలం అనువైనది.
ఇక్కడి మరో రమణీయమైన ప్రదేశం షే ప్యాలెస్. అన్ని ప్యాలెస్ ల లాగానే ఇది కూడా పర్వతాలపై నిర్మించబడింది. షే రాజు తప్పు చేసిన వారికి జైలు శిక్ష విధించే వారు కాదట. ఆయన బౌద్ధ స్థూపాలు నిర్మించాలని ఆదేశించి, నేరస్థులకు వైవిధ్యపూరితం గా శిక్షలు విధించేవారట. తద్వారా నేరస్థులు నేరాలను మాని, మంచి మార్గాన్ని అవలంబిస్తారని ఈ విధంగా ఆదేశించేవారట.
రాజ కుటుంబీకులు వింటర్ ప్యాలెస్‌గా వాడు కునే ఈ షే ప్యాలెస్‌ను 16వ శతాబ్దంలో నిర్మిం చారు. మట్టి, ఇటుకలు, చెక్క సామగ్రితో నిర్మిం చబడిన ఈ ప్యాలెస్ తర్వాతి కాలంలో స్టాక్‌కు బదిలీ చేయబడింది. ఈ ప్యాలెస్‌లోకి అడుగి డగానే లోహంతో చేసిన అందమైన స్థూపం దర్శ నమిస్తుంది. ప్రస్తుతం ఈ ప్యాలెస్ భారత పురా వస్తు శాఖ సంరక్షణలో ఉన్నది. ఆ ప్యాలెస్ లోని కొన్ని వస్తువులు వాడకంలో లేక శిధిలావస్థలో ఉన్నాయి. ఇక్కడ ఉన్న గౌతమ బుద్ధుని నిలువె త్తు విగ్రహం లడక్ అందాలకు, ఆనాటి రాచరిక వైభవానికి నిదర్శనంగా నిలుస్తున్నది.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment