అమెరికాలో నివాసముంటున్న మా పెద్ద కొడుకు సందీప్, కోడలు తులసి గత సంవత్సరం మిచిగాన్ రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలలో పర్యటించి, అక్కడి 'మెకినాక్' దీవి తప్పక చూడవలసిన ప్రాంతమని చెప్పారు. వారి ప్రోత్సాహంతో నేను, నా శ్రీమతి విజయలక్ష్మి, కుమారుడు రత్న ప్రదీప్, మా బావమరిది రాజు గత సెప్టెంబర్‌లో మిచిగాన్‌లోని మిడ్ల్లాండ్ పట్టణం నుండి ట్రావర్స్ సిటీ, ఇతర ప్రాంతాల మీదుగా హురాన్ సరస్సు ఒడ్డున ఉన్న మెకినా సిటీకి బయలుదేరాం. ఆహ్లాదంగా సాగిన ఆ యాత్రా విశేషాలే ఈ ట్రావెలోకం....
మా దారి పొడవునా చెట్ల ఆకులన్నీ కాలానుగుణంగా రంగులు మార్చుకోవడం వలన మా గమ్యం సుమారు 500 మైళ్ళ దూరమూ ప్రయాణం చాలా ఆహ్లాదకరంగా సాగింది. మిచిగాన్‌లో ఎక్కడా లేని విధంగా సుమారు 11000 సరస్సులు ఉన్నాయి. అందుకే ఆ దారంతా సూర్యకాంతిని ప్రతిఫలిస్తూ తళుక్కుమని మెరిసే సరస్సులెన్నో కనిపించాయి మాకు. ఆ అందమైన ప్రకృతిని చూస్తూ మధ్యాహ్నానికి ఓల్డ్ మిషన్ లైట్ హౌస్ చేరాము. 1870లో నిర్మించబడి 67 సంవత్సరాల పాటు నిరంతరాయంగా పనిచేసిన ఈ లైట్‌హౌస్ సరిగ్గా భూమధ్య రేఖకు, ఉత్తర ధృవానికి మధ్య ఉన్నదని తెలిసింది.
మంచుగడ్డగా మారే సరస్సు
అక్కడ కొద్దిసేపు విశ్రమించిన తరువాత, సాయంత్రం నాలుగు గంటలకి మెకినా సిటీకి చేరి రమడా ఇన్‌లో బస చేశాం. మరునాడు 8 గంటలకు మెకినాక్ దీవికి ఫెర్రీలో బయలుదేరాం. మిచిగాన్ రాష్ట్రంలోని రెండు భూభాగాల (అప్పర్, లోయర్ పెనిన్సులాల) మధ్య, హురాన్ సరస్సులో 3.8 చదరపు మైళ్ళ వైశాల్యం కలిగిన ఈ ద్వీపం అమెరికాలోనే ఒక పెద్ద విహార కేంద్రంగా పేరుపొందింది. మెకినా సిటీ నుంచి లేక్ మిచిగాన్, లేక్ హురాన్ సరస్సులను కలిపే జలసంధి మీదుగా ప్రయాణం చేసి 20 నిమిషాలలో ఇక్కడకు చేరుకోవచ్చు. ఇలా వెళ్తున్నప్పుడు ఎడమ వైపు బిగ్ మాక్ అని పిలువబడే మెకినా బ్రిడ్జ్ కనిపిస్తుంది. ప్రపంచంలోని అత్యంత పొడవైన సస్పెన్షన్ బ్రిడ్జీలలో మూడవదైన ఇది మెకినా సిటీని సెయింట్ ఇగ్నాక్‌తో కలుపుతుంది.
ఈ సరస్సు శీతాకాలంలో మంచుగడ్డగా మారుతుందని, అప్పుడు దీనిని దాటడానికి స్నో మొబైల్స్ ఉపయోగిస్తారని తెలిసి ఆశ్చర్యమేసింది. మెకినా సిటీ నుంచి ఇక్కడకు నిర్ణీత సమయాల్లో ఫెర్రీలు, మోటార్ పడవలు నడుపుతూ ఉంటారు.
తాబేలు రూపంలో కన్పించే దీవి
గ్రేట్ లేక్స్ ప్రాంతంలోని ఈ ద్వీపం ఆకాశం నుండి చూస్తే తాబేలు రూపంలో కనిపించడం వలన దీనికి స్థానిక అమెరికన్లు మిట్చి మెకినాక్ (బిగ్ టర్టిల్) అని పేరు పెట్టారు. పూర్వకాలంలో బీవర్ జాతి ఎలుకల చర్మ వ్యాపారానికి ముఖ్య కేంద్రంగా ఉన్న ఈ దీవి తరువాత మత్స్య పరిశ్రమ కేంద్రంగాను, ఆంగ్లేయులు నిర్మించిన కోట వలన ఒక సైనిక స్థావరంగాను, 19వ శతాబ్దపు చివరి నుండి ఒక ఆకర్షణీయమైన వేసవి విడిదిగాను రూపాంతరం చెందింది.
ఫెర్రీ దిగి డౌన్‌టౌన్ ప్రాంతంలోకి అడుగుపెట్టగానే మెయిన్ రోడ్ మీద అమెరికాలో సర్వత్రా కనిపించే కార్లకి బదులు గుర్రపు బగ్గీలు, సైకిళ్ళు తిరగడం గమనించాము. అత్యవసర (ఎమర్జెన్సీ) వాహనాలు తప్ప, 1898 సంవత్సరం నుండి ఇక్కడ మోటార్ వాహనాలు నిషేధించబడ్డాయి. ఈ దీవి చుట్టూ ఎనిమిది మైళ్ల పొడవున ఉండే ఎం-185 రోడ్ అమెరికాలోనే మోటర్ వాహనాలు నడవని ఏకైక స్టేట్ హైవేగా గుర్తించబడింది.
ఈ దీవిలోని స్టేట్ పార్క్, ఇతర ప్రాంతాలను చూడడానికి రెండు గుర్రాల బగ్గీ ఎక్కాము. పర్యాటకులందరూ ఇలాంటి బండ్లు కాని, సైకిళ్ళు కాని ఉపయోగిస్తారు. కాలి నడక ద్వారా కొంతవరకు ఈ దీవిని చూడవచ్చు. మా బండి కోర్ట్ హౌస్, పోలీసు మెడికల్ సెంటర్ల మీదుగా ఎత్తయిన ప్రాంతంలో ఉన్న ఒక కేరేజ్ మ్యూజియం చేరుకుంది. ఈ దీవిలో అత్యంత ఎత్తయిన ఫోర్ట్ హోమ్స్ సరస్సు నుండి 320 అడుగుల ఎత్తులో ఉందని తెలిసింది.
సీతాకోకచిలుకల సంరక్షణ
చిరకాలం నుండి ఈ దీవిలో ఉపయోగిస్తున్న ఎన్నో రకాల గుర్రపు బగ్గీలతో పాటు వారి పూర్వీకులు వాడిన వివిధ వస్తు సామాగ్రిని ఈ మ్యూజియంలో ప్రదర్శనకి ఉంచారు. అవేకాక ఎన్నో రకాల సావనీర్లను విక్రయానికి పెట్టారు. ఆ ప్రక్కనే ఉన్న 'వింగ్స్ ఆఫ్ మెకినాక్ బటర్ ఫ్లయ్' అనే కేంద్రంలో సహజమైన వాతావరణంలో సంరక్షింపబడుతున్న వేలకొద్ది సీతాకోకచిలుకలు చూపరులను ఆకట్టుకుంటాయి.
ఆ తర్వాత మూడు గుర్రాలచే లాగబడే మరొక విశాలమైన బగ్గీలోకి మారి మా పర్యటన కొనసాగించాం. అందులో ఓ వ్యక్తి మాకు గైడ్‌లా వ్యవహరిస్తూ ఈ దీవికి సంబంధించిన ఎన్నో విషయాలు వివరించాడు. దట్టంగా పెరిగిన వృక్షాల వలన చీకట్లు కమ్మిన ప్రదేశంలో స్థానికుల సమాధుల మధ్య ఉన్న సన్నని దారి మీదుగా వెడుతున్నప్పుడు ఏదో హారర్ సినిమా సెట్టింగ్ చూస్తున్న అనుభూతి కలిగింది. సర్రి హిల్స్ మీద ఉన్న బోరియాల్ అడవి దాటే సమయంలో ఇరు ప్రక్కలా ఎన్నో రంగుల అడవి పువ్వులు, స్వచ్ఛమైన నీటితో పారే వాగుల్ని చూస్తూ, వణికించే చలితో పాటు, చిరుజల్లులు కలిగించిన అసౌకర్యాన్ని మేమెవ్వరం పట్టించుకోలేదు. ఇక్కడ చిట్టడవి లాంటి ప్రాంతాల్లో కూడా పర్యాటకులందరూ నిర్భయంగా తిరుగుతున్నారు. ఈ ప్రాంతంలో కయోట్స్, రకోన్స్, ఓటర్, చిప్ మంక్స్, ఫాక్స్ రాబిట్స్ వంటివి తప్ప క్రూర జంతువులు లేవని తెలిసింది.
కనువిందు చేసిన లాండ్ స్కేప్
కొద్దిసేపటికి మేము ఆర్చ్ రాక్ చేరుకున్నాము. భూమి నుండి 142 అడుగుల ఎత్తులో ఉన్న ఇది సున్నపు రాతితో ఏర్పడి ఒంపు తిరిగిన చిన్న శిలాతోరణం లాంటిది. ఇక్కడ ఉన్న వ్యూ పాయింట్ వద్ద నుండి క్రిందికి చూస్తే ఈ దీవికి మూడు ప్రక్కల నీల వర్ణంలో ఒక అనంత సాగరంలా విస్తరించి ఉన్న హురాన్ సరస్సు, దీవి చుట్టూ మెలికలు తిరిగిన రహదారి కనువిందు చేస్తాయి. ఇంత అద్భుతమైన దృశ్యం మరెక్కడా చూడలేమనిపించింది. తర్వాత మా బండి చివరి మజిలీ అయిన మెకినా కోట వద్ద ఆగింది. అమెరికన్ విప్లవ కాలం (1780)లో బ్రిటిష్ వారిచే నిర్మించబడిన ఈ కోట 1815 సంవత్సరంలో అమెరికా వశమై, 1895 వరకు వినియోగంలో ఉందని, సివిల్ వార్‌లో పాల్గొన్న వలంటీర్లు ఇక్కడ శిక్షణ పొందారని చెప్పారు.
ఈ కోటలోని విభాగాలైన స్కూల్ హౌస్ (1879), నార్త్ బ్లాక్ హౌస్ (1798), ఆఫీసర్స్ హిల్ క్వార్టర్స్ (1835), వెస్ట్ బ్లాక్ హౌస్ (1798), స్టోన్ క్వార్టర్స్ (1780), వుడ్ క్వార్టర్స్ (1816), గార్డ్ హౌస్ (1828) భవనాలలో ఆయా కాలాల నాటి యూనిఫారాలు, ఆయుధాలు ధరించిన సైనికులు, కమాండర్లు, ఇతర సైనికాధికారుల బొమ్మలన్నీ ఎంతో సజీవంగా కనిపించాయి. వారు ఉపయోగించిన వస్తు సామగ్రి సోల్జ్జర్స్ బారక్స్ (1859)లో ప్రదర్శనకి ఉంచారు. సట్లర్స్ మ్యూజియంలో పుస్తకాలు, ఇతర సావనీర్లు కొనవచ్చు. ఇక్కడి పెరేడ్ గ్రౌండ్‌లో ప్రతి అర్ధగంటకి ఒకసారి రైఫిల్/కేనోన్ ఫైరింగ్ విన్యాసాలు చూపిస్తారు. మేము అక్కడ ఉన్నప్పుడు ముగ్గురు సైనిక వేషధారులు రైఫిల్ ఫైరింగ్‌లో తమ నైపుణ్యాన్ని ప్రదర్శించారు.
తియ్యని తినుబండారం 'ఫడ్జ్'
ఈ కోట సందర్శన పూర్తి చేశాక మేము మార్కెట్ వీధిలో ప్రవేశించాము. ఇక్కడ లభ్యమయ్యే ఫడ్జ్ అనే (తియ్యని) తినుబండారానికి చాలా పేరుందని తెలిసింది. తర్వాత హార్బర్ మీదుగా సరస్సుకి అభిముఖంగా అత్యంత సుందరమైన పరిసరాలలో ఉన్న ఒక గోల్ఫ్ కోర్స్ వరకు నడిచి వెళ్ళాము. తీరం వెంట కనిపించే హెరోన్స్, గల్స్, గీస్ వంటి నీటి పక్షులను, హార్బర్‌లో నిలిపి ఉంచిన ఎన్నో రకాల మోటర్ బోట్స్‌ను చూస్తూ ఫెర్రీలో మెకినా సిటీకి తిరిగి వచ్చాం.
ఈ దీవిలో ఎటుచూసినా 300 సంవత్సరాల నాటి వస్తు శిల్పకళకు ప్రతిరూపాలైన కలప, రాతి కట్టడాలు, ఎక్కువగా విక్టోరియన్ శకం నాటి నిర్మాణ శైలి ఉన్నవి కనిపిస్తాయి. అమెరికాలో మరెక్కడా లేని కట్టడాలు కొన్ని 18వ శతాబ్దపు చివరలో ఇక్కడ స్థిరపడిన ఫ్రెంచ్ వారి భవనాలు, కూడా మెకినాలో ఉన్నాయి.
గుర్రపు బగ్గీల పరేడ్
ఈ దీవిలో బస చేయడానికి ఎన్నో హోటల్స్ (చిప్సేవా, హార్బర్ వ్యూ ఇన్) ఉన్నాయి. వీటిలో 120 సంవత్సరాల చరిత్ర కలిగిన గ్రాండ్ హోటల్‌కి ఎంతో ప్రాముఖ్యత ఉంది. పేరుకి తగినట్లు నిర్మించబడిన ఈ హోటల్ పోర్చ్ భాగం ప్రపంచంలోనే అత్యంత పొడవైనదిగా గుర్తింపబడింది. 1979 సంవత్సరంలో క్రిస్టఫర్ రీవ్స్ నటించిన 'సంవేర్ ఇన్‌టైమ్' అనే హాలీవుడ్ చిత్ర నిర్మాణం ఇక్కడే జరిగిందని తెలిసింది.
రెండు రోజులు బస చేయగలిగిన పర్యాటకులందరూ ఇక్కడ ప్రకృతి శోభను మరింత తీరికగా ఆస్వాదించవచ్చు. దానితో పాటు ఈ దీవి ప్రాచీన సంప్రదాయాలకు గుర్తుగా నిలిచిన బిడిల్ హైస్ (1780) మెక్ గాల్పిన్ హౌస్ (1780) మాథ్యు గారీ హౌస్ (1846) వంటి గృహాలను, ఆర్ట్ గ్యాలరీలను, మ్యూజియంలను, హన్టేడ్ థియేటర్‌లను కూడా చూడవచ్చు. ఇక్కడి గుర్రపు సంరక్షణ శాల ప్రపంచంలోనే అతిపెద్దది, పురాతనమైనదని చెపుతారు. ప్రతి సంవత్సరం జూన్‌లో ఇక్కడ 'లిలక్ ఫెస్టివల్ ' తరువాత గుర్రపు బగ్గీల పరేడ్ ఎంతో ఘనంగా జరుగుతుందని తెలిసింది.
ఇన్ని ప్రత్యేకతలుండడం వల్ల మెకినాక్ దీవి నిజమైన నాచురల్ థీమ్ పార్క్‌గా అభివర్ణింపబడింది. 2,3 వందల సంవత్సరాల వైభవాన్ని , సంస్కృతిని పరిరక్షించుకుంటూ, పర్యావరణాన్ని కాలుష్యం నుండి కాపాడుకోవడానికి అన్ని చర్యలు తీసుకుంటున్న కారణంగా ఈ మెకినా స్టేట్ పార్క్ అమెరికాలోని పది అత్యున్నతమైన పార్కులతో ఒకటిగా నేషనల్ జియోగ్రాఫిక్ గుర్తించింది.
- డా. ఎన్. అలహా సింగరి
asnamburi@gmail.com

No comments:
Post a Comment