విహారాలు

India

Gamyam

Monday, December 27, 2010

జీవ వైవిధ్యానికి నెలవు.. నాగర్‌హోల్‌ జాతీయవనం

Nagarhole2 
ప్రపంచంలోని జంతుజాలం అంతా ఇక్కడే నివాసం ఏర్పరుచుకున్నదా... అనే సందేహం... నాగర్‌హోల్‌ నేషనల్‌ పార్క్‌ను సందర్శించిన ప్రతి ఒక్కరికీ కలుగకమానదు. ఎందుకంటే... దేశంలో మరే ఇతర పార్క్‌ల్లో లేని విధంగా ఇక్కడ ఎన్నో అరుదైన జంతు, పక్షి జాతులు మనుగడ సాగిస్తున్నాయి. అంతేకాకుండా వృక్షసంపదలో కూడా తన ప్రత్యేకతను చాటుకుంటోంది ఈ పార్క్‌. దక్షిణ భారతదేశంలోనే అతిపెద్ద నేషనల్‌ పార్క్‌గా గుర్తింపు పొందిన ఈ పార్క్‌కు ఏటా సందర్శకుల తాకిడి కూడా ఎక్కువగానే ఉంటుంది. దేశీయ పర్యాటకులే కాకుండా... విదేశీ పర్యాటకులను సైతం ఈ పార్క్‌ అమితంగా ఆకట్టుకుంటోంది. పర్యాటకుల సందర్శన నిమిత్తం అటవీశాఖ ప్రత్యేక సఫారీలు కూడా ఏర్పాటు చేసింది. పలు, జాతీయ, అంతర్జాతీయ సంస్థలు ఇక్కడి జీవజాలంపై ఎన్నో పరిశోధనలు చేపట్టాయి. అలాంటి అరుదైన జాతీయవనాన్ని మనమూ దర్శిద్దాం...


Nagarhole 

రాజీవ్‌ గాంధీ నేషనల్‌ పార్క్‌ గా పేరొందిన నాగరోహోల్‌ నేషనల్‌ పార్క్‌ దక్షిణ భారతదేశంలోనే అతిపెద్ద నేషనల్‌ పార్క్‌. కర్నాటకలోని మైసూర్‌ నగరానికి 94 కిమీల దూరంలో ఉన్న ఈ జాతీయ ఉద్యానవనం కొడగు జిల్లా నుండి మైసూర్‌ జిల్లా వరకు వ్యాపించి ఉంది. బందీపూర్‌ నేషనల్‌ పార్క్‌కి వాయువ్యంగా ఉన్న నాగరోహోల్‌ నేషనల్‌ పార్క్‌కి బందీపూర్‌ నేషనల్‌ పార్క్‌కి మధ్యనున్న కబినీ రిజర్వాయర్‌ ఈ రెండు పార్కులనీ విడదీస్తుంది. మాజీ మైసూర్‌ పాలకులు దీనిని ప్రత్యేకమైన హంటింగ్‌ రిజర్వ్‌ (పరిరక్షించబడిన వేట ప్రాంతం) గా ఉపయోగించేవారు. దట్టమైన చెట్లతో కప్పబడిన ఈ అటవీ ప్రాంతంలో చిన్న వాగులూ, లోయలూ, జలపాతాలూ దర్శనమిస్తాయి. కర్నాటక రాష్ట్రంలోని వన్యప్రాణులను సంరక్షిస్తోన్న ఈ పార్క్‌ 643 చకిమీ మేర వ్యాపించి ఉన్నది. బందీపూర్‌ నేషనల్‌ పార్క్‌ 870 చకిమీ, మదుమలై నేషనల్‌ పార్క్‌ 320 చకిమీ. వాయనాడ్‌ వైల్డ్‌లైఫ్‌ శాంక్చురీ 344 చకిమీ తో కలిపి మొత్తం 2183 చకిమీ మేర వ్యాపించి ఉన్న ఈ స్థలం దక్షిణ భారతదేశంలోని అతిపెద్ద వన్యప్రాణి సంరక్షణ స్థలం.

Nagarhole3 

‘నాగ’ అంటే ‘పాము’, ‘హొలె’ అంటే ‘వాగు’ అన్న రెండు పదాల నుండి నాగరోహోల్‌ అన్న పదం పుట్టింది. 1955లో స్థాపించబడిన ఈ పార్క్‌ దేశంలో అత్యుత్తమంగా నిర్వహించబడుతోన్న పార్కులలో ఒకటిగా గుర్తించబడింది. ఇక్కడి వాతావరణం ఉష్ణంగా ఉండి, వేసవిలో వేడిగానూ, శీతాకాలంలో ఆహ్లాదకరంగానూ ఉంటుంది. ఆరోగ్యకరమైన వ్యాఘ్ర-క్రూరమృగాలు సరైన నిష్పత్తి ఉన్న ఈ పార్క్‌లో బందిపూర్‌ కంటే పులి, అడవిదున్న, ఏనుగుల జనాభా అధికంగా ఉంటుంది. నీలగిరి బయోస్ఫియర్‌ (జీవావరణము) రిజర్వ్‌లో ఈ పార్క్‌ ఒక భాగం. పడమటి కనుమలు, నీలగిరి సబ్‌ క్లస్టర్‌ (6,000 చకిమీ), నాగరోహోల్‌ నేషనల్‌ పార్క్‌ - ఇవన్నీ కూడా ప్రపంచ వారసత్వ ప్రదేశాలుగా ఆమోదం పొందడానికి యునెస్కో ప్రపంచ వారసత్వ కమిటీ పరిగణనలో ఉన్నాయి.

విశాల వనం...
ఈ అడవి వెస్టర్న్‌ ఘాట్స్‌ పర్వత పాదం నుండి కొండ వైపు... అలాగే దక్షిణం వైపు కేరళ వరకు వ్యాపించి ఉన్నది. ఈ అడవి వృక్షసంపద గురించి చెప్పాలంటే దక్షిణ భాగాన తేమతో కూడిన డెసిడ్యూస్‌ (కాలానుగునంగా ఆకులు రాల్చు) అడవి (టెక్టోనా గ్రాండిస్‌, డల్బెర్జియా లాటిఫోరియా), తూర్పు భాగాన, పొడిగా ఉండే ఉష్ణారణ్యం (రైటియా టింక్టోరియా, అకేషియా), ఉపపర్వత లోయలో బురదతో కూడిన అడవి (యూజనియా) ఉన్నాయి. ఎర్రకలప, టేకు, గంధం, సిల్వర్‌ ఓక్‌ ఈ ప్రాంతంలో ముఖ్యమైన వృక్షసంపద. బందీపూర్‌ సరిహద్దులకు దగ్గరగా ఉన్న దక్షిణ భాగాలు సాధారణంగా వాయువ్య భాగాల కంటే పొడిగా ఉంటాయి.
జంతు, వృక్షజాలం...
Nagarhole4 
నాగర్‌హోల్‌లో ఏనుగుల జనాభా ఎక్కువ. పులులు, చిరుత పులులు, అడవి కుక్కలు, ఎలుగుబంట్లు అధికంగా కనిపిస్తాయి. అడవిదున్న, సాంబార్‌ జింక, చీతల్‌ (మచ్చలున్న జింక), కామన్‌ మున్జాక్‌ జింక, నాలుగు కొమ్ముల జింక, మౌజ్‌ జింక, వైల్డ్‌ బోర్‌ (అడవి పంది) లాంటి గిట్టలున్న జంతువుల మీద పెద్ద క్రూరమృగాలు ఆహారం కోసం ఆధారపడతాయి. గ్రే లంగూర్స్‌, లయన్‌ టేల్డ్‌ మకాక్స్‌, బోన్నెట్‌ మకాక్స్‌ ఈ పార్క్‌లోని ఆదిమ జాతులుగా చెప్పవచ్చు. పార్క్‌ బయట, చుట్టూ వ్యాపించి ఉన్న కొండలలో నీలగిరి టార్స్‌, నీలగిరి లంగూర్స్‌ కనపడతాయి. దక్షిణ భాగాన ఉండే ఉష్ణం, తేమతో కూడిన మిశ్రమమైన డెసిడ్యూస్‌ అడవుల నుండి, తూర్పు భాగాన ఉండే బురద కూడిన కొండ లోయ అడవుల వరకు చాలా భిన్నంగా ఉంటాయి.

పొడిగా ఉండే డెసిడ్యూస్‌ అడవిలో టేర్మినాలియా టర్మెన్టోసా, టెక్టోనా గ్రాండిస్‌, లాజస్ట్రోమియా లాన్సివొలాటా, టేరోకార్పస్‌ మార్సపియం, గ్రూవియా తిలేఫోలియా, దళ్బెర్జియా లాతిఫోరియా మరియు ఎంజీసుస్‌ లాతిఫోరియా మొదలగు వృక్ష జాతులతో కూడిన వృక్షసంపద ఉన్నది. ఇతర వృక్ష జాతులలో లాజస్ట్రోమియా మైక్రోకార్పా, అదీనా కొర్డిఫోలియా, బొంబాక్స్‌ మలబార్సియం, స్క్లీషేరా ట్రైజూగా, ఫైకస్‌ జాతికి చెందినా వృక్షాలు కనిపిస్తాయి. పొదలు, మొక్కలు, పొదలలో పెరుగుతూ కనపడే జాతులు - కైడియా కాలిసినా, ఎంబికా అఫీషినాలిస్‌ మరియు గ్మేలీనార్బోరియా. సోలానం, డేస్మోడియం, హెలిక్టర్స్‌ అతిగా వృద్ది చెందు లాంటానా కామరా, యూపటోరియం లాంటి పొదలు అధికంగా కనిపిస్తాయి. బురదతో కూడిన అడవి భాగంలో యూజనియా అధికంగా కనిపిస్తే, తేమతో కూడిన డెసిడ్యూస్‌ అడవుల్లో సాధారణంగా కనపడే ఎనోజీసస్‌ లాటిఫోరియా, కాసియా ఫిస్ట్యూలా, బూటియా మోనోస్పెర్మా, డెన్డ్రోకాలమస్‌ స్ట్రిక్టస్‌, రైటియా టింక్టోరియా, అకేషియా , లాంటి వృక్ష జాతులు పొడిగా ఉండే డెసిడ్యూస్‌ అడవుల్లో కూడా కనపడతాయి. ఎర్రకలప, టేకు వృక్షాలే కాక, వాణిజ్యపరంగా ముఖ్యమైన వృక్ష జాతులు, గంధం, సిల్వర్‌ ఓక్‌ కూడా కనపడతాయి.

Nagarhole1 

అతి ముఖ్యమైన జాతులైన పులి, ఇండియన్‌ బైసన్‌ లేదా గౌర్‌ (అడవి దున్న), ఏషియన్‌ ఏనుగులు చాలా పెద్ద మోతాదులో పార్క్‌ లోపల కనిపిస్తాయి. వైల్డ్‌ లైఫ్‌ కాన్సర్వేషన్‌ సొసైటీకి చెందిన ఉల్హాస్‌ కారంత్‌ నాగరోహోల్‌ అడవుల్లో చేసిన అధ్యయనం ప్రకారం... ఆసక్తికరంగా, వేటాడే జాతులకి చెందిన జంతువులు పులి, చిరుత అడవికుక్కలు సమతుల్యమైన సాంద్రత కలిగి ఉన్నాయని తేలింది. ఈ పార్క్‌లో తోడేళ్ళు, బూడిద రంగు ముంగిస, ఎలుగుబంట్లు, చారల సివంగి, మచ్చల జింక లేదా చీతల్‌, సామ్బర్‌ జింక, మొరిగే జింక, నాలుగు కొమ్ముల జింక , అడివి పందులు కూడా పుష్కలంగా ఉన్నాయి. ఇతర క్షీరదాలైన కామన్‌ ఫాం సివెట (పునుగు పిల్లి జాతి), బ్రౌన్‌ మాన్గూస్‌, స్ట్రైప్డ్‌ నెక్డ్‌ మాంగూస్‌ (ముంగిస జాతి), బ్లాక్‌ నేప్డ్‌ హేర్‌ (చెవుల పిల్లి లేదా కుందేలు జాతి), ఇండీన్‌ పాంగోలిస్‌ (పొలుసులతో కూడిన చీమలు తిను జంతువు), రెడ్‌ జైంట్‌ ఫ్లాఇంగ్‌ స్క్విరల్‌ (ఉడుత జాతి), ఇండియన్‌ పోర్సుపైన్‌ (ముళ్ళ పంది జాతి), ఇండియన్‌ జెయింట్‌ ఫ్లైయింగ్‌ స్క్వారెల్‌ (ఉడుత జాతి) వంటి వివిధ జాతులకు చెందిన జంతువులు ఉన్నాయి.

పక్షి విహంగానికి అనువైన కేంద్రం...
ముఖ్యమైన విహంగ స్థలంగా గుర్తింపు పొందిన ఈ పార్క్‌లో 270 జాతులకి చెందిన పక్షులు ఉన్నాయి. వీటలో శీఘ్రంగా అంతరించిపోతున్న జాతులకి చెందిన ఓరియంటల్‌ వైట్‌ బాక్డ్‌ వల్చర్‌ (రాబందు జాతి), వల్నరబుల్‌ లెస్సర్‌ అడ్జూటంట్‌ (బెగ్గురు కొంగ జాతి), గ్రేటర్‌ స్పాటెడ్‌ ఈగల్‌ (గద్ద జాతి), నీలగిరి వుడ్‌ పిజియన్‌ (పావురం జాతి) వంటి పక్షులు ఉన్నాయి. దాదాపుగా ఆపదకి గురయ్యే జాతుల్లో డార్టర్స్‌ (కొంగ జాతి), ఓరియంటల్‌ వైట్‌ ఐబిస్‌ (కొంగ జాతి), గ్రేటర్‌ గ్రే హెడెడ్‌ ఫిష్‌ ఈగల్‌ (గద్ద జాతి), రెడ్‌ హెడెడ్‌ వల్చర (రాబందు జాతి) వంటి పక్షులు కూడా ఇక్కడ కనువిందు చేస్తాయి. స్థల విశిష్టమైన జాతుల్లో బ్లూ వింగ్డ్‌ పారాకీట్‌ (చిలుక జాతి), మలబార్‌ గ్రే హార్న్‌ బిల్‌ (వడ్రంగి పిట్ట జాతి), వైట్‌ బెల్లీడ్‌ ట్రీపై (కాకిజాతి) వంటి ఎన్నో పక్షులు ఉన్నాయి. ఇక్కడ కనపడే కొన్ని పక్షుల్లో వైట్‌ చీక్డ్‌ బార్బెట్‌, ఇండియన్‌ స్కైమైటార్‌ బాబ్లర్‌ ఉన్నాయి. పొడి ప్రదేశాలలో సాధారణం గా కనపడే పేయింటెడ్‌ బుష్‌ క్వైల్‌ (కొలంకి పిట్ట), సర్కీర్‌ మల్ఖొవా, ఆషి ప్రైనియా (పిచ్చుక జాతి), ఇండియన్‌ రాబిన్‌ (పాలపిట్ట జాతి), ఇండియన్‌ పీఫౌల్‌ (నెమలి జాతి) యెల్లో లెగ్డ్‌ గ్రీన్‌ పిజియన్‌ (పావురం జాతి) లాంటి పక్షులు ఇక్కడ కనిపిస్తాయి.
రకరాకాల పాములు...
సాధారణంగా కనపడే సరీసృపాలలో వైన్‌ స్నేక్‌, కామన్‌ వుల్ఫ్‌ స్నేక్‌, రాట్‌ స్నేక్‌, బాంబూ పిట్‌ వైపర్‌, రసెల్స్‌ వైపర్‌ (సెంజెర జాతి), కామన్‌ క్రైట్‌ (కట్లపాము జాతి), ఇండియన్‌ రాక్‌ పైథాన్‌ (కొండ చిలువ జాతి), ఈందియన్‌ మానిటర్‌ లిజార్డ్‌, కామన్‌ టోడ్‌... ఇక్కడ కనపించే పాము జాతులు. బెంగళూరుకి చెందిన ‘అశోకా ట్రస్ట్‌ ఫర్‌ రిసెర్చ్‌ ఇన్‌ ఇకాలజి అండ్‌ ది ఎన్వైరన్మెంట్‌’ కి చెందిన పరిశోధకులు ఈ ప్రాంతంలోని కీటకాల జనాభాకు సంబంధించిన బయొడైవర్సిటీ (జీవ భిన్నత్వం) పై విస్తృతమైన అధ్యయనాలు చేశారు. ఈ పార్క్‌లో కీటక జీవ భిన్నత్వంలో 96 జాతులకు చెందిన డంగ్‌ బీటిల్స్‌ ( పేడపురుగులు) 60 జాతులకు చెందిన చీమలు కూడా ఉన్నాయి. అసాధారణ జాతులుగా గుర్తించిన చీమలో హార్పెగ్నథొస్‌ సాల్టేటర్‌ అనబడే, ఎగిరే చీమలను గుర్తించారు. ఇవి ఒక మీటరు యెత్తున ఎగరగలవు. టెట్రాపోనేరా రూఫోనిగ్ర జాతికి చెందిన చీమలు అడవికి ఆరోగ్యసూచకంగా ఉపయొగపడవచ్చు, ఎందుకంటే... ఇవి చెదపురుగులని తిని బ్రతుకుతాయి. చచ్చిన చెట్లు ఉండే ప్రాంతాలలో ఇవి పుష్కలంగా కనిపిస్తా యి. ఏనుగు పేడ మీద మాత్రమే బ్రతికే హీలియోకొప్రిస్‌ డొమి నస్‌, ఇండియాలోని అతిపెద్ద పేడపురుగు (ఆం థొఫేగస్‌ డామా) కామన్‌ డంగ్‌ బీటిల్‌, చాలా అరుదుగా కని పించే ఆంథొఫేగస్‌ పాక్టోలస్‌ కూడా ఇక్కడి పేడ పురుగుల జాతు ల్లో ఉన్నాయి.
హాయి... హాయిగా సఫారీ యాత్ర...
బెంగళూరుకి సుమారు 220 కి.మీ. దూరంలో ఉన్న ముర్కల్‌ అతిధి గృహాలలో పర్యాటకులకు అటవీశాఖ విడిది ఏర్పాటు చేసింది. పార్క్‌లోని కార్యాలయం దగ్గర కూడా వసతి ఉన్నది. అటవీశాఖకు చెందిన వాహనాలలో రోజుకి రెండుసార్లు, అంటే వేకువఝామున, సాయం సమయంలో సఫారి యాత్ర ఏర్పాటుచేస్తారు. పాఠశాల విద్యార్థుల కోసం తరచూ విద్యా శిబిరాలు నిర్వహిస్తారు. ఇంకా అటవీశాఖ పాఠశాల విద్యార్థుల పర్యటన కోసం కర్నాటక ప్రభుత్వం ప్రత్యేకమైన రాయితీలు ఇస్తుండడం విశేషం. అయితే జంతువుల కలయిక కాలంలో, వర్షాకాలంలో సఫారి యాత్రలు లేకుండా పార్క్‌ని మూసివేస్తారు. ట్రాఫిక్‌ కదలికలను ప్రొద్దున 6 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు కట్టడి చేసి అడవికి ఇరువైపులా ఉండే గేట్లని మూసివేస్తారు.

ఏకశిలా విగ్రహాతోరణం .... ఉండవల్లి గుహలు

AnantaNarada
ఆంధ్రప్రదేశ్‌లో చూడదగ్గ పర్యాటక కేంద్రాల్లో ఉండవల్లి గుహలకు ఎంతో ప్రత్యేకత ఉంది. ఓ పెద్ద కొండను తొలిచి లోపల గదులుగా నిర్మించిన ఆనాటి శిల్పుల శిల్పాకళా నైపుణ్యానికి ఉండవల్లి గుహలు సజీవ సాక్షాలు. కొండకు ముఖ ద్వారాన్ని ఏర్పరచి అందులోంచి లోపలికి వెళ్లే కొద్దీ అక్కడ చెక్కబడి ఉన్న వివిధ రకాలైన దేవతామూర్తులు, శిల్పాలు ఈ ఉండవల్లి గుహల ప్రత్యేకత.

గుహలోని విశేషాలు ..
బయటినుంచి చూస్తే కొండముందు కట్టబడిన ఓ రాతి భవనం లాంటి నిర్మాణంగా కనిపించినా... లోపలికి వెళితే ఓ అద్భుతలోకం ఆవిష్కరించబడుతుంది. గుహ లోపల నాలుగు అంతస్థులుగా తొలచి అందు లో దేవతా విగ్రహాలతోపాటు వివిధ రకాల శిల్పాలు చెక్క బడి ఉన్నాయి. అలాగే కొండకు వెలుపలి భాగంలో తపోవనంలో ఉన్న మహ ర్షులను పోలి న విగ్రహాలు కన్పిస్తాయి. గుహ లోపల శయనించి ఉన్న అతిపెద్ద మహా విష్ణు వు (అనంత పద్మనాభస్వామి) విగ్రహం పర్యాటకులను విశే షంగా ఆకర్షిస్తుంది.

Undavallicaves 

అతిపెద్ద గ్రానైట్‌ రాయిపై చెక్కబడిన ఈ వి గ్రహంతోపాటు ఇతర దేవతల విగ్రహాలు సె ైతం ఇక్కడ దర్శనమిస్తాయి. ఇతర ఆలయాల్లో త్రి మూర్తులు అయిన బ్రహ్మ, విష్ణువు, శివుడు దేవ తలకు ఉద్దేశించినవి. గుహాంత ర్బాగంలో కమలంలో కూర్చున్న బ్రహ్మ, సప్తర్షులు ఇతర దేవతల విగ్రహాలూ కలవు. ఇవి గుప్తుల కాలం నాటి ప్రధమ భాగానికి చెందిన నిర్మాణ శైలికి లభిస్తు న్న ఆధారాలలో ఒ టి. పర్వతము బ యటి వైపు గుహాలయ పైభా గంలో సప్తఋషు ల వి గ్రహాలు పెద్దవిగా చెక్కారు. ఒకే పర్వతా న్ని గుహలుగానూ దేవ తా ప్రతిమలతో పాటు ఏకశిలా నిర్మితంగా ని ర్మించిన శిల్పుల ఘనత ఏపాటిదో ఇక్కడ చూే స్తనే తెలుస్తుంది. ఈ గుహల నుంచి పూర్వ కాలంలో మంగళగిరి వరకు సొరంగ మార్గం ఉండేదని పూర్వీకులు చెబుతుంటారు. ఈ మార్గం నుండి రాజులు తమ సైన్యాన్ని శత్రురాజులకు తెలియకుండా తరలించేవారని ప్రతీతి. ఈ గుహల నిర్మాణశైలి బౌద్ధ విహారాల శైలిని పోలి ఉంది. ఆలయాల చుట్టూ పచ్చని పంటపొలాలు కనువిందు చేస్తాయి. ఈ గుహలను క్రీశ 430 ప్రాంతంలో పాలించిన విష్ణుకుండుల కాలానికి చెందినవిగా చరిత్రకారులు పేర్కొంటారు.

ఇతర విశేషాలు...
Vishnu 
ఇది పల్లెటూరు కావడం వల్ల ఇక్కడ పర్యాటకులకు అవసరమైన సౌకర్యాలు అంతంతమాత్రంగానే ఉంటాయి. ఉండవల్లి గ్రామానికి సమీపంలో ఉండే ఇతర ప్రాంతాల గురించి చెప్పాలంటే ప్రకాశం బ్యారేజ్‌ ఈ ప్రాంతానికి కేవలం మూడు కిలోమీటర్ల దూరంలోనే ఉంది. కానీ, ప్రకాశం బ్యారేజీ పైన బస్సు సదుపాయం లేదు. అలాగే విజయవాడ కూడా ఈ ప్రాంతానికి అతి సమీపంలోనే ఉంది. మంగళగిరికి 5 కిమీల దూరంలో, అమరావతి సైతం ఈ ప్రాంతానికి అత్యంత సమీపంలోనే ఉంది.

Friday, December 24, 2010

టోక్యో చుట్టేద్దామా...!

tokyo2 
జపాన్‌ పేరు వింటే యంత్రాలు, అద్భుత సాంకేతిక పరిజ్ఞానం, ఆధునిక జీవనశైలి వంటివి గుర్తుకు వస్తాయి. అభివృద్ధి చెందిన దేశంగా గుర్తింపు పొందిన జపాన్‌ రాజధాని టోక్యో. మెయిన్‌ల్యాండ్‌ హోన్షుకు పశ్చిమ దిశలోని జపాన్‌లో ఈ నగరం ఉంది. టోక్యో అంటే పశ్చిమ రాజధాని, దేశ సంప్రదాయాలను ఇది ప్రతిబింబిస్తుంది. జపాన్‌లో 47 నగరాలలో ఒకటిగా పేరుగాంచిన మహానగరం టోక్యో. అంతేకాదు అంతర్జాతీయ నగరం, మెగాసిటీగా ప్రపంచ పటంలో ఎంతో పేరుగాంచింది. ఇక్కడి సంస్కృతి, వారసత్వ సంపద యాత్రికులను అబ్బురపరుస్తాయి. టోక్యోలో చూడదగిన ప్రదేశాలు చాలా ఉన్నాయి. కొన్ని ప్రాంతాల్లో వాస్తు కళాశిల్పుల నైపుణ్యం గత చరిత్రను కళ్లకు కట్టినట్టుగా చూపుతాయి. టోక్యో ప్రజలు పూర్తిగా ఆధునిక జీవనశైలికి అలవాటుపడినా పాత సంప్రదాయాలు మాత్రం మరిచిపోలేదు. వారి అలవాట్లు, పనులు భిన్నంగా ఉంటాయి. ఇంకా టోక్యో గురించి తెలుసుకోవాలనుందా అయితే చదవండి...

టోక్యో నగరం ఆలయాలు, పుణ్యక్షేత్రాలు, సుందరమైన వాస్తు శిల్పాలతో నిండి ఉంది. ఇవన్నీ ప్రశాంతమైన ప్రదేశాలు ఇక్కడ ఆహ్లాదకరమైన వాతావరణం ఉంటుంది. ఇక్కడికి వచ్చే యాత్రికుల నుంచి దానధర్మాలు ఎక్కువగానే వస్తాయి. నగరంలో గోకుకు-జి ఆలయం, సెన్సోజి ఆలయాలు ఎంతో పేరుగాంచినవి. మత వారసత్వ ప్రదేశాలుగా గుర్తింపు పొందిన అసకుసా, మీజి జింగు, యాసుకుని వంటి పుణ్యక్షేత్రాల్లో విడిధి పర్యాటకులకు మరిచిపోలేని అనుభవం. ప్రశాంత వాతావరణం, సామరస్యం నగరంలో కనిపిస్తాయి.
గత వైభవం సజీవంగా...
tokyo 
కళలు, కళాకృతులకు సంబంధించిన శిల్పాలు, కట్టడాలు టోక్యో నగరంలో చాలా కనిపిస్తాయి. యాత్రికులు చూసేందుకు నగరంలో అనేక మ్యూజియాలు, ఆర్ట్‌ గ్యాలరీలు ఉన్నాయి. ఇక్కడి మ్యూజియాలు గత చరిత్ర వైభవాన్ని కళ్లకు కట్టినట్టుగా చూపిస్తాయి. జపాన్‌లో టోక్యో నేషనల్‌ మ్యూజియం అతిపెద్ద, పురాతన మ్యూజియంగా ప్రజాదరణ పొందింది. ఇందులో దేశానికి చెందిన వైభవోపేత కళాఖండాలు ఎన్నో ఉన్నాయి. తప్పకుండా చూడవలసిన ఇతర మ్యూజియాలు.. మోరి ఆర్ట్‌ మ్యూజియం, అసకురా ఛోసో మ్యూజియం, బ్రిడ్జిస్టోన్‌ మ్యూజియం ఆఫ్‌ ఆర్ట్‌, ఫుకగావా ఎడో పిరియడ్‌ మ్యూజియం. ఇంకా చారిత్రాత్మక ప్రదేశాలు.. ఎవోయామా సెమెటరీ, హయాషి మెమోరియల్‌ హాల్‌, ఎడో క్యాస్టిల్‌, హాచికో, స్టాచ్యూ ఆఫ్‌ లిబర్టీ వంటివి చూడవచ్చు.

ఎంటర్‌టైన్‌మెంట్‌ పార్కులు...
tokyo1 
టోక్యోలో తొలి పబ్లిక్‌ పార్క్‌ ఉఎనో. దీనిని 1873లో నిర్మించారు. ఈ పార్క్‌లో అనేక ఆలయాలు, పుణ్యక్షేత్రాలు, బోట్‌ లేక్‌, చారిత్రాత్మక స్మారక చిహ్నాలు, చెర్రీ బ్లాసమ్‌ చెట్లు ఉంటాయి. ఒక రోజు మొత్తం ఈ పార్క్‌లోని ప్రదేశాలను చూసేందుకే సరిపోతుంది. ప్రదేశాలన్నింటిని సందర్శించాలనుకుంటే ఎక్కువ సమయం కేటాయించాల్సిందే. కుటుంబ సమేతంగా వెళ్లి ఈ పార్కులో ఎంజాయ్‌ చేయవచ్చు.

మనిషి సృష్టించిన విచిత్రాలు...
టోక్యోలో ఆధునిక కట్టడాల గురించి తెలుసుకోవాల నుకున్నట్లయితే రెయిన్‌బో బ్రిడ్జి సరైన ప్రదేశం. ఇది తాత్కాళికంగా నిలుపుదల చేసిన బ్రిడ్జి. 1993లో నిర్మించిన రెయిన్‌బో బ్రిడ్జి 918 మీటర్ల పొడవు, రెండు టవర్లకు మధ్య 570 మీటర్ల దూరం ఉంటుంది. ఎనిమిది ట్రాఫిక్‌ లేన్‌లు, రెండు రైల్వే లైన్లను ఈ బ్రిడ్జి ఇముడ్చుకుంది. టోక్యో టవర్‌ మానవుడు సృష్టించిన మరో అద్భుతంగా చెప్పవచ్చు. ఇది తప్పకుండా చూడవలసిన ప్రదేశం

ఏకశిల్ప మహాద్భుతం.. రాక్‌పోర్ట్‌ టెంపుల్‌

trichy
ప్రపంచంలోనే అతిపురాతన దేవాలయం... 300 కోట్ల సంవత్సరాల చరిత్ర... విజయనగర రాజుల అలనాటి సైనిక శిబిరం... పల్లవరాజుల శిల్పకళానైపుణ్యానికి నిలువెత్తు నిదర్శనం. ఇలా చెప్పుకుంటూపోతే ప్రపంచంలో మరే దేవాలయానికి లేని ప్రత్యేతలను తనలో ఇముడ్చుకున్న అరుదైన దేవాలయ సముదాయం రాక్‌ఫోర్ట్‌. ఒకే శిలపై మూడు దేవాలయాలు ఉన్న ఈ అరుదైన ప్రదేశం ప్రపంచంలో మరెక్కడా లేదనే చెప్పాలి. వినాయకుడు, శివుడు ఒకే చోట వెలిసిన... తిరుచ్చిలోని రాక్‌ఫోర్ట్‌ విశేషాలు...

పేరుకు తగ్గట్టు రాక్‌ఫోర్ట్‌ టెంపుల్‌... పర్వతంపై 83 మీటర్ల ఎత్తున శిలలో అత్యద్భుతంగా మలచబడింది. ఈ కొండపై మొత్తం మూడు దేవాలయాలు ఉన్నాయి. ఈ దేవాలయ సముదాయాల నిర్మాణం పల్లవుల హయాంలో ప్రారంభమైనప్పటికీ... ఆ తరువాత విజయనగర రాజుల ఆధ్వర్యంలో మధురై నాయకులు వీటి నిర్మాణాన్ని పూర్తిచేశారు. వీరికాలంలో దేవాలయం ఎంతగానో అభివృద్ధి చెందింది. ఏకశిలను తొలిచి నిర్మించిన రాక్‌ఫోర్ట్‌ పర్వత శిఖరానికి... ఎంతో కఠినతరమైన 437 ఎగుడు మెట్లు ఎక్కితే గాని చేరుకోలేం.
మూడు దేవాలయాల సమాగయంగా ఉన్న రాక్‌ఫోర్ట్‌ తమిళనాడులో తిరుచ్చి (తిరుచిరాపల్లి)లో ఉన్నది.

Rockfort_night 

పర్వత పాదాల వద్ద ‘మనిక వినాయకర్‌’ దేవాలయం ఉండగా... పర్వత శిఖరం వద్ద ‘ఉచ్చి పిల్లయార్‌ కోయిల్‌’ దేవస్థానం ఉంది. ఇక్కడ... ప్రసిద్ధిగాంచిన శివాలయం ‘తాయుమనస్వామి దేవాలయం’ ఉన్నది. శిలను చెక్కి అపురూపంగా మలిచిన ఈ ‘శివస్థలం’ పర్యాటకులను కనురెప్పవేయనీయదు. ఇక్కడ ఉన్న దేవాలయ సముదాయంలో... లలితాంకుర పల్లవేశ్వరం అనే పల్లవులు నిర్మించిన దేవాలయం కూడా ఎంతో ప్రఖ్యాతిపొందినది. ఇక్కడ ఎన్నో అరుదైన శాశనాలు పల్లవ రాజు మంహేంద్ర పల్లవన్‌ గురించి అనేక విశేషాలను తెలియజేస్తాయి. చోళలు, విజయనగర రాజులు, మధురై నాయకులు ఈ దేవాలయాన్ని విశేషంగా అభివృద్ధి చేశారు. అంతేకాకుండా, కొండపై ఉన్న రెండంతస్థుల తాయుమనస్వామి దేవాయలం ఇక్కడి నిర్మాణాల్లోనే తురుపుముక్కగా అనడంలో ఎలాంటి సందేహం లేదు. అద్భుత కళానైపుణ్యం ఈ దేవాలయం సొంతం.

ప్రతిరోజు ఇక్కడ ఆరు రకాల పూజలు జరుగుతాయి. చితిరైలో ప్రతియేటా ఒకసారి బ్రహ్మోత్సవం కూడా జరుగుతుది. ఆదిపూరం, ‘ఫ్లోట్‌ ఫెస్టివల్‌’ జరిగే ‘పంగుని’ ప్రదేశం కూడా ఇక్కడ ఎంతో ప్రఖ్యాతిపొందిన ప్రదేశం. మధురై నాయకులు నిర్మించిన ఈ రెండు దేవాలయాల్లో ఒకటి శివాలయం కాగా, మరొకటి గణేష్‌ దేవస్థానం. అద్భుత శిల్పకళారీతులకు ఆలవాలంగా ఉన్న... 7వ శతాబ్దానికి చెందిన దేవాలయాలు ఇవి. ప్రఖ్యాతిగాంచిన ఎన్నో శిల్పరీతులకు పెట్టింది పేరు. పర్వత పాదాల వద్ద ఉన్న వినాయకుడి దేవస్థానం, అలాగే పర్వత శిఖరం వద్ద ఉన్న అతిపెద్ద శ్రీ తాయుమాన స్వామి దేవాలయాల్లోకి హిందూయేతరులను అనుమతించరు. పర్యాటకుల సందర్శనార్థం ప్రతిరోజూ ఉదయం 6 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు ఈ ఆలయాలను తెరిచి ఉంచుతారు.

వినాయక దేవస్థానం... పౌరాణిక గాధ...
uchipillayarEntrance 
లంకాధీశుడైన రావణుడి అనుంగు సోదరుడైన విభీషణడు... అపహరణకు గురైన సీతాదేవి ని రక్షించేందుకు రాముడి పక్షాన చేరి తన సహాయ సహకారాలను అందిస్తాడు. తరువాత యుద్ధంలో రావణుడి ఓడించిన రాముడు తన ధర్మపత్ని సీతను కాపాడుకుంటాడు. ఈ నేపథ్యంలో తనకు సహాయాన్ని అందించిన విభీషణుడికి ఏదైనా బహుమతి ఇవ్వాలనే ఉద్దేశంతో రాముడు... విష్ణుమూర్తి అవ తారమైన రంగనాథస్వామి విగ్ర హాన్ని ఇస్తాడు. అయితే ఇది గమనించిన దేవతలు... ఒక అసురుడు విష్ణుమూర్తి అవతా రమైన రంగనాథస్వామి విగ్ర హాన్ని తన రాజ్యానికి తీసు కెళ్ళడాన్ని సహించలేక పోతారు. దాంతో, దేవతలు ఎలాగైనా విభీషణుడు ఆ విగ్రహాన్ని తీసు కెళ్ళకుండా ఆపాలని నిశ్చయిం చుకొని విఘ్ననాయకుడైన వినా యకుడి సహాయం కోరుతారు. అప్పుడు వినాయకుడు వారి కోరికను మన్నిస్తాడు. రాముడు ప్రసాదించిన విగ్రహాన్ని తీసుకొని లంకకు బయలుదేరిన విభీషణుడు కావేరీ నది మీదుగా వెళ్తూ... ఆ నదిలో స్నానం చేయాలని భావిస్తాడు. ఆ సమయంలో ఆ విగ్రహాన్ని ఎవరికైనా ఇవ్వాలనుకుంటాడు.

Thayumanavar 

ఎందుకంటే, ఒకసారి ఆ విగ్రహాన్ని నేలపైన పెడితే మళ్లీ తీయడం అసంభవం. దాంతో ఏం చేయాలి? అని మదనపడుతున్న సమయంలో అక్కడే పశువులను కాస్తున్న బాలుడిలా మారువేషంలో ఉన్న వినాయకుడి చేతికి ఆ విగ్రహాన్ని అందించి... విభీషణుడు స్నానానికి ఉపక్రమిస్తాడు. విభీషణుడు నదిలో మునగగానే మారువేషంలో ఉన్న వినాయకుడు ఆ విగ్రహాన్ని కావేరీ నది తీరంలో ఉన్న ఇసుకపై పెడతాడు (ఆ విగ్రహం పెట్టిన చోటే... నేడు ప్రపంచంలోనే అతిపెద్ద దేవాలయంగా విరాజిల్లుతున్న రంగనాథస్వామి దేవాలయం). ఇది గమనించిన విభీషణుడు పశులకాపరిని తరుముతూ వెంబడిస్తాడు. దీంతో ఆ బాలుడు పక్కనే ఉన్న కొండపైకి చచకా ఎక్కేస్తాడు. విభీషణుడు కూడా ఆ కొండపైకి ఎక్కి ఆ బాలుడి నుదిటిపై ముష్టిఘాతం కురిపిస్తాడు. అప్పుడు మారువేషంలో ఉన్న ఆ బాలుడు వినాయకుడిగా మారిపోతాడు. అప్పుడు తన తప్పును తెలుసుకొని వినాయకుడిని క్షమాపణ వేడుకుంటాడు విభీషణుడు. ప్రసన్నుడైన విఘ్నరాజు విభీషణుడి దీవించి లంకకు పంపిస్తాడు. వినాయకుడి ఎక్కిన ఆ కొండనే ఈ రాక్‌ఫోర్ట్‌ టెంపుల్‌. అక్కడ వెలిసిన వినాయకుడి దేవస్థానమే ‘ఉచ్చి పిల్లయార్‌ దేవాలయం’.

తాయుమనస్వామి చరిత్ర...
వినాయుడి దేవస్థానానికి ఉన్నట్టే, ఈ గుడికి కూడా పురాతన గాధ ప్రచారంలో ఉంది. ఒకనాడు శివభక్తురాలైన రత్నవతి అనే ఆవిడ పురిటినొప్పులతో బాధపడుతూ తన తల్లి రాకకోసం ఎదురుచూస్తుంది. ఎంతసేపటికీ తన తల్లి రాకపోవడంతో... ‘నన్ను ఎలాగైనా రక్షించు స్వామీ’ అని శివుడిని వేడుకుంటుంది. అప్పుడు శివుడే స్వయంగా రత్నవతి తల్లి రూపంలో వచ్చి పురుడు పోస్తాడు. అప్పటినుండి ఆయనకు ‘తాయుమనస్వామి’ అనే పేరు స్థిరపడిపోయింది (తాయుం - అన - స్వామి అంటే... తల్లి రూపంలో వచ్చిన భగవంతుడు అని అర్థం). అప్పటినుండి ఈ దేవాలయానికి తాయుమనస్వామి దేవాలయం అనే పేరు సార్థకమైంది. పర్వతపాద ప్రాంతం నుండి సుమారు రెండు వందల అడుగుల ఎత్తులో ఉన్న ఈ దేవాలయం ఎంతో అందంగా, ఆకర్షణీయంగా ఉంటుంది. దేవాయం పైకప్పుపై ఉన్న పెయింటింగ్స్‌ సందర్శకులను మైమరపిస్తాయి. ఈ ఆలయ నిర్మాణం ఆనాటి పల్లవుల శిల్పకళా నైపుణ్యానికి అద్దం పడతాయి. ఇక్కడ శివపార్వతులతో పాటు మహాలక్ష్మి విగ్రహం కూడా ఉండడం విశేషం. ఇక్కడ ఉన్న శివాలయంలో శివుడు అతిపెద్ద లింగాకారంలో ఉంటాడు. అలాగే... పార్వతి దేవి కి ప్రత్యేక గర్భగుడి ఉంది.
చేరుకునేదిలా...
విమాన మార్గం: రాక్‌ఫోర్ట్‌ టెంపుల్‌ నుండి కేవలం 5 కిలోమీటర్ల దూరంలో తిరుచ్చి ఎయిర్‌పోర్టు ఉంది. చెనై్న మీదుగా దేశంలోని అన్ని ప్రధాన నగరాలు విమాన సౌకర్యం ఉంది.

రైలు మార్గం: రైలు మార్గం ద్వారా వచ్చే ప్రయాణీకులు తిరుచ్చి రైల్వేస్టేషన్‌ చేరుకుని అక్కడినుండి రోడ్డు మార్గం ద్వారా రాక్‌ఫోర్ట్‌ టెంపుల్‌ చేరుకోవచ్చు. దక్షిణ రైల్వే పరిధిలో అతిపెద్ద జంక్షన్‌ తిరుచ్చి. ఇక్కడి నుండి చెనై్న, తంజావూర్‌, మధురై, తిరుపతి, ట్యుటికోరిన్‌, రామేశ్వరం తదితర ప్రాంతాలకు మీటర్‌ గేజీ లైను ఉంది. అలాగే బెంగుళూరు, కోయంబత్తూర్‌, మైసూర్‌, కొచ్చి, కన్యాకుమారి, మంగళూరు లను కలుపుతూ బ్రాడ్‌గేజ్‌ లైన్‌ ఉంది. ప్రతిరోజు పదుల సంఖ్యలో ఈ జంక్షన్‌ నుండి వివిధ రైళ్ళు అందుబాటులో ఉంటాయి.

రోడ్డుమార్గం: దాదాపు దక్షిణ భారత దేశంలోని అన్ని ప్రధాన నగరాల నుండి ఇక్కడి రోడ్డు మార్గం ఉంది. ప్రతిరోజూ ఆ నగరాలనుండి ఇక్కడి బస్సులు నడుస్తాయి. ఇక లోకల్‌గా తిరగడానికి సిటీ బస్సులు, టూరిస్ట్‌ ట్యాక్సీ, ఆటో రిక్షా, సైకిల్‌ రిక్షా వంటివి అందుబాటులో ఉంటాయి.

Saturday, December 18, 2010

అందాల తాబేలు దీవి 'మెకినా'

అమెరికాలో నివాసముంటున్న మా పెద్ద కొడుకు సందీప్, కోడలు తులసి గత సంవత్సరం మిచిగాన్ రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలలో పర్యటించి, అక్కడి 'మెకినాక్' దీవి తప్పక చూడవలసిన ప్రాంతమని చెప్పారు. వారి ప్రోత్సాహంతో నేను, నా శ్రీమతి విజయలక్ష్మి, కుమారుడు రత్న ప్రదీప్, మా బావమరిది రాజు గత సెప్టెంబర్‌లో మిచిగాన్‌లోని మిడ్ల్లాండ్ పట్టణం నుండి ట్రావర్స్ సిటీ, ఇతర ప్రాంతాల మీదుగా హురాన్ సరస్సు ఒడ్డున ఉన్న మెకినా సిటీకి బయలుదేరాం. ఆహ్లాదంగా సాగిన ఆ యాత్రా విశేషాలే ఈ ట్రావెలోకం....

మా దారి పొడవునా చెట్ల ఆకులన్నీ కాలానుగుణంగా రంగులు మార్చుకోవడం వలన మా గమ్యం సుమారు 500 మైళ్ళ దూరమూ ప్రయాణం చాలా ఆహ్లాదకరంగా సాగింది. మిచిగాన్‌లో ఎక్కడా లేని విధంగా సుమారు 11000 సరస్సులు ఉన్నాయి. అందుకే ఆ దారంతా సూర్యకాంతిని ప్రతిఫలిస్తూ తళుక్కుమని మెరిసే సరస్సులెన్నో కనిపించాయి మాకు. ఆ అందమైన ప్రకృతిని చూస్తూ మధ్యాహ్నానికి ఓల్డ్ మిషన్ లైట్ హౌస్ చేరాము. 1870లో నిర్మించబడి 67 సంవత్సరాల పాటు నిరంతరాయంగా పనిచేసిన ఈ లైట్‌హౌస్ సరిగ్గా భూమధ్య రేఖకు, ఉత్తర ధృవానికి మధ్య ఉన్నదని తెలిసింది.
మంచుగడ్డగా మారే సరస్సు

అక్కడ కొద్దిసేపు విశ్రమించిన తరువాత, సాయంత్రం నాలుగు గంటలకి మెకినా సిటీకి చేరి రమడా ఇన్‌లో బస చేశాం. మరునాడు 8 గంటలకు మెకినాక్ దీవికి ఫెర్రీలో బయలుదేరాం. మిచిగాన్ రాష్ట్రంలోని రెండు భూభాగాల (అప్పర్, లోయర్ పెనిన్సులాల) మధ్య, హురాన్ సరస్సులో 3.8 చదరపు మైళ్ళ వైశాల్యం కలిగిన ఈ ద్వీపం అమెరికాలోనే ఒక పెద్ద విహార కేంద్రంగా పేరుపొందింది. మెకినా సిటీ నుంచి లేక్ మిచిగాన్, లేక్ హురాన్ సరస్సులను కలిపే జలసంధి మీదుగా ప్రయాణం చేసి 20 నిమిషాలలో ఇక్కడకు చేరుకోవచ్చు. ఇలా వెళ్తున్నప్పుడు ఎడమ వైపు బిగ్ మాక్ అని పిలువబడే మెకినా బ్రిడ్జ్ కనిపిస్తుంది. ప్రపంచంలోని అత్యంత పొడవైన సస్పెన్షన్ బ్రిడ్జీలలో మూడవదైన ఇది మెకినా సిటీని సెయింట్ ఇగ్నాక్‌తో కలుపుతుంది.
ఈ సరస్సు శీతాకాలంలో మంచుగడ్డగా మారుతుందని, అప్పుడు దీనిని దాటడానికి స్నో మొబైల్స్ ఉపయోగిస్తారని తెలిసి ఆశ్చర్యమేసింది. మెకినా సిటీ నుంచి ఇక్కడకు నిర్ణీత సమయాల్లో ఫెర్రీలు, మోటార్ పడవలు నడుపుతూ ఉంటారు.

తాబేలు రూపంలో కన్పించే దీవి

గ్రేట్ లేక్స్ ప్రాంతంలోని ఈ ద్వీపం ఆకాశం నుండి చూస్తే తాబేలు రూపంలో కనిపించడం వలన దీనికి స్థానిక అమెరికన్లు మిట్చి మెకినాక్ (బిగ్ టర్టిల్) అని పేరు పెట్టారు. పూర్వకాలంలో బీవర్ జాతి ఎలుకల చర్మ వ్యాపారానికి ముఖ్య కేంద్రంగా ఉన్న ఈ దీవి తరువాత మత్స్య పరిశ్రమ కేంద్రంగాను, ఆంగ్లేయులు నిర్మించిన కోట వలన ఒక సైనిక స్థావరంగాను, 19వ శతాబ్దపు చివరి నుండి ఒక ఆకర్షణీయమైన వేసవి విడిదిగాను రూపాంతరం చెందింది.
ఫెర్రీ దిగి డౌన్‌టౌన్ ప్రాంతంలోకి అడుగుపెట్టగానే మెయిన్ రోడ్ మీద అమెరికాలో సర్వత్రా కనిపించే కార్లకి బదులు గుర్రపు బగ్గీలు, సైకిళ్ళు తిరగడం గమనించాము. అత్యవసర (ఎమర్జెన్సీ) వాహనాలు తప్ప, 1898 సంవత్సరం నుండి ఇక్కడ మోటార్ వాహనాలు నిషేధించబడ్డాయి. ఈ దీవి చుట్టూ ఎనిమిది మైళ్ల పొడవున ఉండే ఎం-185 రోడ్ అమెరికాలోనే మోటర్ వాహనాలు నడవని ఏకైక స్టేట్ హైవేగా గుర్తించబడింది.

ఈ దీవిలోని స్టేట్ పార్క్, ఇతర ప్రాంతాలను చూడడానికి రెండు గుర్రాల బగ్గీ ఎక్కాము. పర్యాటకులందరూ ఇలాంటి బండ్లు కాని, సైకిళ్ళు కాని ఉపయోగిస్తారు. కాలి నడక ద్వారా కొంతవరకు ఈ దీవిని చూడవచ్చు. మా బండి కోర్ట్ హౌస్, పోలీసు మెడికల్ సెంటర్ల మీదుగా ఎత్తయిన ప్రాంతంలో ఉన్న ఒక కేరేజ్ మ్యూజియం చేరుకుంది. ఈ దీవిలో అత్యంత ఎత్తయిన ఫోర్ట్ హోమ్స్ సరస్సు నుండి 320 అడుగుల ఎత్తులో ఉందని తెలిసింది.

సీతాకోకచిలుకల సంరక్షణ

చిరకాలం నుండి ఈ దీవిలో ఉపయోగిస్తున్న ఎన్నో రకాల గుర్రపు బగ్గీలతో పాటు వారి పూర్వీకులు వాడిన వివిధ వస్తు సామాగ్రిని ఈ మ్యూజియంలో ప్రదర్శనకి ఉంచారు. అవేకాక ఎన్నో రకాల సావనీర్లను విక్రయానికి పెట్టారు. ఆ ప్రక్కనే ఉన్న 'వింగ్స్ ఆఫ్ మెకినాక్ బటర్ ఫ్లయ్' అనే కేంద్రంలో సహజమైన వాతావరణంలో సంరక్షింపబడుతున్న వేలకొద్ది సీతాకోకచిలుకలు చూపరులను ఆకట్టుకుంటాయి.
ఆ తర్వాత మూడు గుర్రాలచే లాగబడే మరొక విశాలమైన బగ్గీలోకి మారి మా పర్యటన కొనసాగించాం. అందులో ఓ వ్యక్తి మాకు గైడ్‌లా వ్యవహరిస్తూ ఈ దీవికి సంబంధించిన ఎన్నో విషయాలు వివరించాడు. దట్టంగా పెరిగిన వృక్షాల వలన చీకట్లు కమ్మిన ప్రదేశంలో స్థానికుల సమాధుల మధ్య ఉన్న సన్నని దారి మీదుగా వెడుతున్నప్పుడు ఏదో హారర్ సినిమా సెట్టింగ్ చూస్తున్న అనుభూతి కలిగింది. సర్రి హిల్స్ మీద ఉన్న బోరియాల్ అడవి దాటే సమయంలో ఇరు ప్రక్కలా ఎన్నో రంగుల అడవి పువ్వులు, స్వచ్ఛమైన నీటితో పారే వాగుల్ని చూస్తూ, వణికించే చలితో పాటు, చిరుజల్లులు కలిగించిన అసౌకర్యాన్ని మేమెవ్వరం పట్టించుకోలేదు. ఇక్కడ చిట్టడవి లాంటి ప్రాంతాల్లో కూడా పర్యాటకులందరూ నిర్భయంగా తిరుగుతున్నారు. ఈ ప్రాంతంలో కయోట్స్, రకోన్స్, ఓటర్, చిప్ మంక్స్, ఫాక్స్ రాబిట్స్ వంటివి తప్ప క్రూర జంతువులు లేవని తెలిసింది.

కనువిందు చేసిన లాండ్ స్కేప్


కొద్దిసేపటికి మేము ఆర్చ్ రాక్ చేరుకున్నాము. భూమి నుండి 142 అడుగుల ఎత్తులో ఉన్న ఇది సున్నపు రాతితో ఏర్పడి ఒంపు తిరిగిన చిన్న శిలాతోరణం లాంటిది. ఇక్కడ ఉన్న వ్యూ పాయింట్ వద్ద నుండి క్రిందికి చూస్తే ఈ దీవికి మూడు ప్రక్కల నీల వర్ణంలో ఒక అనంత సాగరంలా విస్తరించి ఉన్న హురాన్ సరస్సు, దీవి చుట్టూ మెలికలు తిరిగిన రహదారి కనువిందు చేస్తాయి. ఇంత అద్భుతమైన దృశ్యం మరెక్కడా చూడలేమనిపించింది. తర్వాత మా బండి చివరి మజిలీ అయిన మెకినా కోట వద్ద ఆగింది. అమెరికన్ విప్లవ కాలం (1780)లో బ్రిటిష్ వారిచే నిర్మించబడిన ఈ కోట 1815 సంవత్సరంలో అమెరికా వశమై, 1895 వరకు వినియోగంలో ఉందని, సివిల్ వార్‌లో పాల్గొన్న వలంటీర్లు ఇక్కడ శిక్షణ పొందారని చెప్పారు.

ఈ కోటలోని విభాగాలైన స్కూల్ హౌస్ (1879), నార్త్ బ్లాక్ హౌస్ (1798), ఆఫీసర్స్ హిల్ క్వార్టర్స్ (1835), వెస్ట్ బ్లాక్ హౌస్ (1798), స్టోన్ క్వార్టర్స్ (1780), వుడ్ క్వార్టర్స్ (1816), గార్డ్ హౌస్ (1828) భవనాలలో ఆయా కాలాల నాటి యూనిఫారాలు, ఆయుధాలు ధరించిన సైనికులు, కమాండర్లు, ఇతర సైనికాధికారుల బొమ్మలన్నీ ఎంతో సజీవంగా కనిపించాయి. వారు ఉపయోగించిన వస్తు సామగ్రి సోల్జ్జర్స్ బారక్స్ (1859)లో ప్రదర్శనకి ఉంచారు. సట్లర్స్ మ్యూజియంలో పుస్తకాలు, ఇతర సావనీర్లు కొనవచ్చు. ఇక్కడి పెరేడ్ గ్రౌండ్‌లో ప్రతి అర్ధగంటకి ఒకసారి రైఫిల్/కేనోన్ ఫైరింగ్ విన్యాసాలు చూపిస్తారు. మేము అక్కడ ఉన్నప్పుడు ముగ్గురు సైనిక వేషధారులు రైఫిల్ ఫైరింగ్‌లో తమ నైపుణ్యాన్ని ప్రదర్శించారు.

తియ్యని తినుబండారం 'ఫడ్జ్'


ఈ కోట సందర్శన పూర్తి చేశాక మేము మార్కెట్ వీధిలో ప్రవేశించాము. ఇక్కడ లభ్యమయ్యే ఫడ్జ్ అనే (తియ్యని) తినుబండారానికి చాలా పేరుందని తెలిసింది. తర్వాత హార్బర్ మీదుగా సరస్సుకి అభిముఖంగా అత్యంత సుందరమైన పరిసరాలలో ఉన్న ఒక గోల్ఫ్ కోర్స్ వరకు నడిచి వెళ్ళాము. తీరం వెంట కనిపించే హెరోన్స్, గల్స్, గీస్ వంటి నీటి పక్షులను, హార్బర్‌లో నిలిపి ఉంచిన ఎన్నో రకాల మోటర్ బోట్స్‌ను చూస్తూ ఫెర్రీలో మెకినా సిటీకి తిరిగి వచ్చాం.
ఈ దీవిలో ఎటుచూసినా 300 సంవత్సరాల నాటి వస్తు శిల్పకళకు ప్రతిరూపాలైన కలప, రాతి కట్టడాలు, ఎక్కువగా విక్టోరియన్ శకం నాటి నిర్మాణ శైలి ఉన్నవి కనిపిస్తాయి. అమెరికాలో మరెక్కడా లేని కట్టడాలు కొన్ని 18వ శతాబ్దపు చివరలో ఇక్కడ స్థిరపడిన ఫ్రెంచ్ వారి భవనాలు, కూడా మెకినాలో ఉన్నాయి.

గుర్రపు బగ్గీల పరేడ్


ఈ దీవిలో బస చేయడానికి ఎన్నో హోటల్స్ (చిప్సేవా, హార్బర్ వ్యూ ఇన్) ఉన్నాయి. వీటిలో 120 సంవత్సరాల చరిత్ర కలిగిన గ్రాండ్ హోటల్‌కి ఎంతో ప్రాముఖ్యత ఉంది. పేరుకి తగినట్లు నిర్మించబడిన ఈ హోటల్ పోర్చ్ భాగం ప్రపంచంలోనే అత్యంత పొడవైనదిగా గుర్తింపబడింది. 1979 సంవత్సరంలో క్రిస్టఫర్ రీవ్స్ నటించిన 'సంవేర్ ఇన్‌టైమ్' అనే హాలీవుడ్ చిత్ర నిర్మాణం ఇక్కడే జరిగిందని తెలిసింది.
రెండు రోజులు బస చేయగలిగిన పర్యాటకులందరూ ఇక్కడ ప్రకృతి శోభను మరింత తీరికగా ఆస్వాదించవచ్చు. దానితో పాటు ఈ దీవి ప్రాచీన సంప్రదాయాలకు గుర్తుగా నిలిచిన బిడిల్ హైస్ (1780) మెక్ గాల్పిన్ హౌస్ (1780) మాథ్యు గారీ హౌస్ (1846) వంటి గృహాలను, ఆర్ట్ గ్యాలరీలను, మ్యూజియంలను, హన్టేడ్ థియేటర్‌లను కూడా చూడవచ్చు. ఇక్కడి గుర్రపు సంరక్షణ శాల ప్రపంచంలోనే అతిపెద్దది, పురాతనమైనదని చెపుతారు. ప్రతి సంవత్సరం జూన్‌లో ఇక్కడ 'లిలక్ ఫెస్టివల్ ' తరువాత గుర్రపు బగ్గీల పరేడ్ ఎంతో ఘనంగా జరుగుతుందని తెలిసింది.

ఇన్ని ప్రత్యేకతలుండడం వల్ల మెకినాక్ దీవి నిజమైన నాచురల్ థీమ్ పార్క్‌గా అభివర్ణింపబడింది. 2,3 వందల సంవత్సరాల వైభవాన్ని , సంస్కృతిని పరిరక్షించుకుంటూ, పర్యావరణాన్ని కాలుష్యం నుండి కాపాడుకోవడానికి అన్ని చర్యలు తీసుకుంటున్న కారణంగా ఈ మెకినా స్టేట్ పార్క్ అమెరికాలోని పది అత్యున్నతమైన పార్కులతో ఒకటిగా నేషనల్ జియోగ్రాఫిక్ గుర్తించింది.


- డా. ఎన్. అలహా సింగరి
asnamburi@gmail.com

Friday, December 17, 2010

రెండు రోజులు .... మూడు ఆనందాలు .....

ఏ ప్రాంతం నుంచైనా హైదరాబాద్ చేరుకోవడం సులభం. ఇక్కడి నుంచి 165 కిలోమీటర్ల దూరంలో ఆదిలాబాద్‌లో ఉంది బాసర పుణ్యక్షేత్రం. సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ నుంచి రోజూ బాసరకు రైలు వెళుతుంది. సొంత వాహనంలో అయితే 3 గంటల్లో బాసర చేరుకోవచ్చు. ఉదయం హైదరాబాద్ నుంచి రైలు లేదా బస్సులో బయలు దేరితే మధ్యాహ్నానికి అక్కడికి వెళ్లవచ్చు.

బాసరలోని శ్రీ జ్ఞానసరస్వతి ఆలయంలో అక్షరాభ్యాసం చేసుకున్న వారు చదువుల్లో రాణిస్తారని ప్రతీతి. బాసర నుంచి 65 కిలోమీటర్ల దూరంలో నిజామాబాద్ జిల్లాలో ఉన్న శ్రీరాంసాగర్ చేరుకోవచ్చు. బాసర- శ్రీరాంసాగర్ మధ్య మన రాష్ట్రంలో అధునిక వ్యవసాయానికి పేరెన్నిక గన్న అంకాపూర్‌లో కాసేపు ఆగితే, వ్యవసాయం అంటే మనకున్న అపోహలన్నీ చెల్లాచెదురవుతాయి. అంత పచ్చగా ఉంటుంది. అంకాపూర్ వ్యవసాయానికే కాదు రుచికరమైన జొన్నరెట్టె, నాటుకోడికూరకు పెట్టింది పేరు.

శ్రీరాంసాగర్ రిజర్వాయర్ చెంతన సూర్యాస్తమయాన్ని తిలకించడం ఓ అందమైన అనుభవం. అక్కడి నుంచి 25 నిమిషాలు ప్రయాణిస్తే నిర్మల్ పట్టణం చేరుకుంటారు. కుంటాలలో ఉండేందుకు సౌకర్యం లేదు కాబట్టి నిర్మల్‌లో రాత్రి బస చేయవచ్చు. మరుసటి రోజు ఉదయాన్నే నిర్మల్‌లోని అందమైన బొమ్మలను చూసి నేరడిగొండ మీదుగా కుంటాలకు వెళ్లిపోవచ్చు. ఈ ప్రాంతంలో పొచ్చెర, కనకాయి గొలుసుల గుండం, ఘన్‌పూర్ అనే మరో నాలుగు జలపాతాలున్నా కుంటాల అందాలే వేరు.

మన రాష్ట్రంతో పాటు మహారాష్ట్ర నుంచి కూడా పెద్ద సంఖ్యలో పర్యాటకులు ఇక్కడికి వస్తూ ఉంటారు. పిల్లలకే కాదు పెద్దలకు కూడా జలపాతంలో ఈదులాడకుండా, కేరింతలు కొట్టకుండా ఉండటం కష్టమే. హైదరాబాద్ నుంచి శనివారం బయలుదేరి ఈ మూడు ప్రాంతాలూ చూసుకొని ఆదివారం రాత్రికి తిరిగి హైదరాబాద్ చేరుకోవచ్చు. 
వివరాలకు: 08752-243503, కార్యాలయం: 243550, కార్యనిర్వాహణాధికారి: 243903. రైల్వే స్టేషన్: 243504, 9490003748. బస : దేవస్థాన అతిథి గృహాలు అందుబాటులో ఉంటాయి.

శ్రీశైలం- మహానంది- అహోబిలం

చూసేందుకు ఇది పుణ్యక్షేత్రాల దర్శనంలా అనిపిస్తుంది కానీ దట్టమైన నల్లమల అడవుల మధ్యగా సాగే ఈ ట్రిప్ మనసుకు ఎంతో ఆహ్లాదం కలిగిస్తుంది. హైదరాబాద్ నుంచి లేదా గుంటూరు, ప్రకాశం జిల్లాల నుంచి శ్రీశైలం చేరుకోవచ్చు. రాయలసీమ నుంచి వచ్చేవారు అహోబిలం మీదుగా మహానంది, అక్కడి నుంచి అటవీ మార్గంలో శ్రీశైలం చేరుకోవచ్చు. శ్రీశైలంలో మల్లిఖార్జునుడు, భ్రమరాంబ దర్శనం అనంతరం, దగ్గరలోని ఇష్టకామేశ్వరి ఆలయం, పాతాళగంగ చూసుకొని రాత్రి అక్కడే బస చేయవచ్చు. దేవస్థానం సత్రాలతో పాటు టి.టి .డి. కాటేజ్‌లు కూడా ఉన్నాయి.
దేవస్థానం ఫోన్ నెంబర్లు : 08524-288883,288885, 288886. 
గంగ, యమున కాటేజ్ ఫోన్ : 08524-287351.

మహానందీశ్వరం
మరుసటి రోజు దట్టమైన నల్లమల అటవీ ప్రాంతం నుంచి దోర్నాల మీదుగా 160 కిలోమీటర్ల దూరం ప్రయాణించి మహానంది చేరుకోవడం ఓ ఆధ్యాత్మిక అనుభవం. మహానందిలో పర్వతసానువుల్లో కొలువైన నందీశ్వర స్వామి దర్శనం ఆహ్లాదం కలిగిస్తుంది. ఆలయం వెనుక ఉన్న కొండల నుంచి స్వచ్ఛమైన నీరు వేసవిలో సైతం కిందకు ప్రవహిస్తూ ఉంటుంది. నందీశ్వరుని కిందుగా వచ్చే ఆ ధార, ఆలయం ఎదురుగా ఉండే కోనేరులో పడుతుంది. ఆ కోనేరులో భక్తులంతా స్నానాలు చేస్తారు.


వసతి సౌకర్యాలు : తిరుమల తిరుపతి దేవస్థానం నిర్మించిన 28 గదుల సత్రం, మహానంది దేవస్థానం నిర్మించిన 5గదుల సత్రం, పాపిరెడ్డి కాటేజి, నాగనంది సదనంలో 25గదులతో పాటు ఆర్యవైశ్య, బ్రాహ్మణ కులాలకు చెందిన వసతి గృహాలు వున్నాయి. వీటితో పాటు ప్రైవేట్ వసతి, టూరిజం అతిథి గృహాలు వున్నాయి. 
ఫోన్ నెంబర్లు : 
దేవస్థానం కార్యాలయం - 08514 234726, 234727, 234728,
పున్నమి అతిథి గృహం 9441733829

నవనారసింహం

మహానంది నుంచి సుమారు 70 కిలోమీటర్ల దూరంలో అహోబిల క్షేత్రం ఉంది. ఈ క్షేత్రంలో నవ నారసింహులు వెలసి ఉన్నందున నవ నారసింహ క్షేత్రమని పిలుస్తారు. నరసింహ స్వామి కొండ కిందా పైనా వెలసి ఉండటంతో దిగువ, ఎగువ అహోబిలమని పిలుస్తారు. ఇక్కడ నివసించే చెంచులు నృసింహ దేవునికి జుంటి తేనె, అడవి మాంసం నైవేద్యముగా సమర్పించి పూజిస్తారు. నరసింహుడు చెంచులక్ష్మిని పరిణయమాడినట్లుగా భావించి చెంచులు అల్లుడిగా మర్యాదలు చేస్తారు. ఈ ఆలయాలన్నీ ప్రకృతి సోయగాలతో అలరారుతూ ఉంటాయి.


అహోబిల నరసింహస్వామి(ఎగువ అహోబిలం), మాలోల నరసింహస్వామి, వరాహ నరసింహ స్వామి, కారంజ నరసింహ స్వామి, భార్గవ నరసింహ స్వామి, యోగానంద నరసింహ స్వామి, ఛత్రవట నరసింహ స్వామి, పావన నరసింహస్వామి, ప్రహ్లాద నరసింహ స్వామి(దిగువ అహోబిలం)లు నవ నారసింహులుగా పూజలందుకుంటున్నారు. ఎగువ అహోబిలం ఆలయం పక్క నుంచి రమణీయమైన కొండలు, జలపాతాలను చూసుకుంటూ నవనారసింహుల్లోని ముగ్గురు నరసింహ స్వాముల్ని దర్శించుకోవచ్చు. ఓపిక ఉన్న వారు ప్రకృతిని ఆస్వాదిస్తూ ఈ 5 కిలోమీటర్లు నడిస్తే ఎంతో ఆనందం కలుగుతుంది. నడవలేని వారికి డోలీ సౌకర్యం కూడా వుంది. గండశిల నుంచి చూస్తే నల్లమల అందాలన్నీ ఒకచోటు పోగేసుకున్నాయా అనిపిస్తుంది.


ప్రకృతి ఆరాధన స్ఫూర్తిని మనలో కలిగించేందుకే పుణ్యక్షేత్రాలను పర్వతాలు, అడవులు, నదీనదాల చెంత ఏర్పాటు చేశారనేందుకు అహోబిల క్షేత్రం నిదర్శనం. శ్రీశైలం, మహానంది, అహోబిలం క్షేత్రాలు చూసేందుకు కనీసం మూడు రోజుల సమయం కేటాయిచాలి. టూరిజం గెస్ట్‌హౌస్‌తో పాటు దేవస్థానం వసతి కూడా అందుబాటులో ఉంటుంది. 
మఠం వారి మాలోల అతిథి గృహం ఫోన్ నెం:08519-252045, 
ఏపీ టూరిజం వారి హరిత అతిథి గృహం ఫోన్:08519-252060, 
టీటీడీ అతిథిగృహం ఫోన్ నెం:08519-252045, 
అహోబిలం మేనేజర్ కార్యాలయం ఫోన్ నెం: 08519-252025

Wednesday, December 15, 2010

'' డబ్లిన్ '' టు '' క్లిఫ్స్ ఆఫ్ మొహర్ ''

'యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ డబ్లిన్'(యు.సి.డి)లో మాస్టర్స్ డిగ్రీ చేయడానికి గత సంవత్సరం మిత్రుడు వర్మా, నేనూ కలిసి విజయనగరం నుండి ఐర్లాండ్ వచ్చాం. 'యునైటెడ్ కింగ్‌డమ్'కు పశ్చిమాన అట్లాంటిక్ మహాసముద్రంలో సుందరమైన ప్రకృతితో అలరారుతున్న ఐర్లండ్ దీవిలో చదువుకోగలగడం నా అదృష్టంగా భావిస్తాను. 4 నెలల క్రితం ఒక వారాంతంలో డబ్లిన్‌కు 300 కి.మీ. దూరంలో సహజ సిద్ధంగా సముద్రతీరంలో ఏర్పడ్డ నిలువెత్తు రాతి కొండల వరసైన 'క్లిఫ్స్ ఆఫ్ మొహర్' చూడ్డానికి కొందరు మిత్రులతో కలిసి వెళ్లాను. దారి పొడవునా కన్పించిన ఐరిష్ అందాలను, అక్కడి ప్రజల జీవన శైలిని మీతో పంచుకోవడానికే ఈ వ్యాసం.

డబ్లిన్‌లో మేం ఉండే ప్రదేశం పేరు 'బ్లాక్ రాక్'. అక్కడ మా ఇతర స్నేహితులు కొందరు ఐర్లండ్‌లోని అత్యంత అందమైన 'క్లిఫ్స్ ఆఫ్ మొహర్' గురించి తరచూ చెప్పడం వలన ఆ ప్రదేశాన్ని ఎలాగైనా చూడాలని అనుకున్నాను. కానీ ఒకవైపు మాస్టర్స్ డిగ్రీ చదువు, మరోవైపు పార్ట్‌టైం ఉద్యోగంతో బిజీగా ఉండటం వలన, వచ్చిన సంవత్సరానికి గాని అక్కడికి వెళ్లడం వీలు పడలేదు. మా కోర్సు పూర్తయిన తర్వాత నెదర్లాండ్స్ నుండి వచ్చిన మా స్నేహితునితో కలిసి మొత్తం అయిదుగురం 'క్లిఫ్స్ ఆఫ్ మొహర్'ను చూడ్డానికి బయలుదేరాం.

ప్రభుత్వమే సైకిళ్లను అద్దెకిస్తుంది

వెళ్లిరావడానికి ఒక రోజుకి కారుని అద్దెకు తీసుకున్నాం. ఇక్కడ డ్రైవర్‌ని పెట్టుకోవడం చాలా ఖరీదు కనుక మేమే డ్రైవ్ చేసుకుంటూ బయల్దేరాం. కారుకి ఒక రోజు అద్దె వంద యూరోలు. ఒక యూరో దాదాపు మన కరెన్సీలో 60 రూపాయలతో సమానం. సైకిళ్లు కూడా అద్దెకు దొరుకుతాయి. ప్రభుత్వమే సైకిళ్లు అద్దెకిస్తుంది. సైకిల్ అద్దె సంవత్సరానికి 10 యూరోలు మాత్రమే. ప్రజలు ఎక్కువగా సైకిళ్లనే వాడతారు. కార్లు వెళ్లే రహదారి ప్రక్కనే సైకిళ్లు వెళ్లడానికి చిన్న ట్రాక్, పాదచారులు నడవడానికి మరో దారి ఉంటాయి. రోడ్ క్రాస్ చేయాలంటే తప్పనిసరిగా జీబ్రా లైన్ల దగ్గరో లేదా ఫ్లరయోవర్ పైనుండో వెళ్లాలి. అంతే తప్ప మామూలుగా రోడ్డు క్రాస్ చేస్తే నేరం. అలా క్రాస్ చేసేటప్పుడు ఏదైనా ప్రమాదం జరిగితే నడిచి వెళ్లేవారిదే తప్పుగా పరిగణిస్తారు. సైకిలు లేదా కారు తప్ప బైక్‌లు ఎక్కువగా వాడరు. నేను ఉన్న ప్రాంతంలో రెండు మూడు బైక్‌లు తప్ప ఎక్కువ కనిపించలేదు.

అన్ని జంక్షన్స్‌లోనూ సైకిల్ స్టాండ్‌లు పది పన్నెండు వరకూ ఉంటాయి. కాని అద్దెకిచ్చే మనుషులెవరూ ఉండరు. పదియూరోలు చెల్లిస్తే ఒక కార్డు ఇస్తారు. దాన్ని మిషన్‌లో ఉంచితే ఒక సైకిల్ రిలీజ్ అవుతుంది. సైకిల్ తీసుకువెళ్లిన గంటలోపు తెచ్చేయాలి. అయితే అక్కడ మరో సౌకర్యం ఉంది. సైకిల్‌ను ఏ స్టాండులో తీసుకున్నామో అక్కడే తిరిగి ఇవ్వాల్సిన అవసరం లేదు. మనకు దగ్గర్లో ఉన్న ఏ స్టాండులో అయినా సైకిలును అప్పగించేయొచ్చు.

రాత్రి పదకొండుకే సూర్యాస్తమయం

'క్లిఫ్స్ ఆఫ్ మొహర్' చూడ్డానికి ఉదయం ఆరు గంటలకు డబ్లిన్ నుండి బయల్దేరాం. కారుతో పాటు జి.పి.యస్. (గ్లోబల్ పొజిషనింగ్ సిస్టం) కూడా అద్దెకి తీసుకున్నాం. దానికోసం మరో 20 యూరోలు అదనంగా చెల్లించాలి. జి.పి.యస్. పరికరంలో మనం బయలుదేరిన ప్రదేశం, మన గమ్యస్థానం మార్క్ చేస్తే సాటిలైట్ ద్వారా అదే మనకు దారి చూపుతుంది.
మేం వెళ్లింది వేసవి కాబట్టి ఉదయం 5 గంటలకే సూర్యోదయం అయింది. మళ్లీ రాత్రి పదకొండుకే సూర్యాస్తమయం. ఉత్తర ధృవానికి దగ్గర గా ఉండడం వలన వేసవిలో దాదాపు 18 గంటలు సూర్యకాంతి ఉంటుంది.
డబ్లిన్ వచ్చి సంవత్సరం అయినా మొదటిసారి సిటీ నుండి బయటకు రావడం - ఐరిష్ గ్రామాలను చూసే అవకాశం కలగడం చాలా ఎగ్జయిటింగ్‌గా అనిపించింది. సిటీ నుండి బయలుదేరిన అరగంటలోనే హైవే పైకి చేరుకున్నాం. రోడ్లు చాలా విశాలంగా ఉండడం, ఫోర్ వీలర్స్‌కి తప్ప మిగతా వాహనాలకు అనుమతి లేకపోవడంతో గంటకు 150 కి.మీ. వేగంతో డ్రైవ్ చేసుకుంటూ వెళ్లాం.

ఒకప్పుడు బ్రిటిష్ వారి వలస దేశమే

ఐర్లాండ్ జనాభా మొత్తం 5 లక్షలే. జనసాంద్రత చాలా తక్కువ కారణంగా రోడ్డు పొడవునా ఒక్క మనిషి కూడా కనిపించలేదు. అప్పుడే మాకు జి.పి.యస్. పరికరం ఎంత అవసరమో తెలిసి వచ్చింది. నిజానికి జి.పి.ఎస్. లేకపోతే చాలా ఇబ్బంది పడాల్సి వచ్చేది - దారి తప్పినా అడగడానికి మానవ మాత్రుడు కనిపించడు కాబట్టి.
ప్రయాణంలో గమనించిన ముఖ్యవిషయం ఏమిటంటే, ఐర్లాండ్‌లో వ్యవసాయపు పంట ఏదీ కనిపించకపోవటం. దారి పొడవునా కొన్ని ఎకరాల వైశాల్యంలో పందులూ, ఆవుల పెంపకం మాత్రమే కనిపించింది. వాటి మధ్య పెద్ద ఇల్లూ, కార్లూ తప్ప ఇంకేమీ కనిపించలేదు. సిటీ బయట ఇంటికీ - ఇంటికీ మధ్య దూరం అరకిలోమీటరు ఉంటుంది. ప్రజలు పని ఉంటే తప్ప బయటకి రారు - అదీ కారులోనే. ఐర్లాండ్ ముఖ్య ఉత్పత్తులు పోర్క్, బీఫ్ కాక కొన్ని పాల సంబంధితమైనవి మాత్రమే. మిగిలిన నిత్యావసర వస్తువులన్నీ యూరప్ దేశాల నుండి దిగుమతి చేసుకుంటారు.

ఐర్లాండ్ కూడా ఒకప్పుడు మన భారతదేశంలాగా బ్రిటిష్ వలస రాజ్యమే. బ్రిటన్ ఆక్రమించుకున్న ముప్పయికి పైగా దేశాలలో ఇది కూడా ఒకటి. 1921 డిసెంబర్ 6న అది స్వతంత్ర దేశం అయ్యింది.
18వ శతాబ్దం తొలినాళ్లలో ఐర్లాండ్ చాలా బీద దేశం. ఐరిష్ ప్రజలు చాలా కష్ట జీవులు. లండన్‌లోని పరిశ్రమల్లో పనులకోసం అసంఖ్యాకంగా వలసలు పోయినట్లు చరిత్రకారుల కథనం.

అంతా పొగమంచు మయం

బయల్దేరిన రెండున్నర గంటల్ల్లోనే (ఉదయం 8.30కి) క్లిఫ్స్ ఆఫ్ మొహర్ చేరుకున్నాం. ఈ ప్రదేశం ఐర్లాండ్‌లోని మరొక ముఖ్య పట్టణం గాల్వే సమీపంలో సముద్ర తీరంలో ఉంది. క్లిఫ్స్ అంటే నీటితో నిలువుగా కోయబడి, ఏర్పడిన రాతి కొండలని అర్థం. ఈ క్లిఫ్స్ సాధారణంగా సముద్ర తీరాన ఉన్న పర్వత ప్రాంతాల్లో ఏర్పడతాయి.
సముద్ర తీరానికి కనిష్టంగా 120 మీటర్ల ఎత్తు నుంచి, 214 మీటర్ల ఎత్తు వరకూ 8 కి.మీ. పొడవున ఈ క్లిఫ్స్ ఏర్పడ్డాయి. అక్కడి లోకల్ కౌన్సిల్స్ ఈ పర్యాటక ప్రదేశాన్ని మరింతగా అభివృద్ది చేశారు. మేం వెళ్లిన కాసేపటికే వర్షం మొదలయ్యింది. దానికి తోడు విపరీతమైన గాలీ, పొగమంచు కారణం గా కొండపైకి చేరుకున్నా మొత్తం వ్యూని చూసే అవకాశం కలగలేదు. కింద సముద్రం కూడా కనిపించనంత పొగమంచు ఆవరించింది. ఎంతో శ్రమకోర్చి వచ్చిన మాకు వ్యూ స్పష్టంగా కన్పించలేదని కాస్త నిరాశ అనిపించింది.

ఎత్తయిన 'జీబ్రియన్ టవర్'

తర్వాత 'క్లిఫ్స్ ఆఫ్ మొహర్'లో అత్యంత ఎత్తయిన ప్రదేశం 'జీబ్రియన్ టవర్' దగ్గర కొంత సేపు కూర్చున్నాం. ఈ టవర్ 1835లో అప్పటి స్థానిక భూస్వామి 'కొర్నేలియస్ జీబ్రియన్' నిర్మించాడట. ఆ టవర్ చుట్టూ రాళ్లతో నిర్మించిన ప్రహరీ ఉంది. చుట్టూ ఆకుపచ్చని పరిసరాలు ఎంతో అహ్లాదంగా కన్పించాయి. అక్కడి నుండి చూస్తే అట్లాంటిక్ మహాసముద్రంలోని ఆరెన్ ఐలాండ్స్‌గా పిలవబడే మూడు ఐలాండ్స్ కనిపిస్తాయట. కానీ పొగమంచు కారణంగా అవి కూడా మాకు సరిగా కనిపించలేదు.

అక్కడి నుండి కొండ దిగువకు చేరుకున్నాం. సముద్ర తీరాన చిన్న గ్రామం, కొన్ని నౌకలు కనిపించాయి. పైనుండి కన్పించిన ఆరెన్ ఐలాండ్స్‌లోని ఒక ఐలాండ్‌ని చూపించడానికే నౌకలున్నాయని తెలిసింది. ఆ ఐలాండ్‌కి తీసుకెళ్లడానికి, అక్కడ్నించి 'క్లిఫ్స్ ఆఫ్ మొహర్' అందాలను చూపించడానికి మనిషికి 10 యూరోలు అని చెప్పారు. వెంటనే టికెట్లు తీసుకున్నాం.
ఆ చిన్న షిప్‌లో ఐలాండ్స్ చేరుకోవడానికి 45 నిమిషాలు పట్టింది. అప్పటికి సమయం 12 గంటలు కావడంతో దిగిన వెంటనే ఒక చిన్న రెస్టారెంట్‌లో బన్‌లు, సాండ్‌విచ్ లాంటివి తిని లంచ్ పూర్తి చేశామనిపించాం.
'క్లిఫ్స్ ఆఫ్ మొహర్' నుండి అస్పష్టంగా, చిన్నగా కనిపించిన ఆ ఐలాండ్‌లో ఒక ఊరూ, దాదాపు 3 వేల జనాభా ఉండటం ఆశ్చర్యమనిపించింది. అందులోనే చిన్న చిన్న విమానాలు దిగడానికి ఒక ఎయిర్‌పోర్ట్ కూడా ఉంది.

ఆరెన్ దీవిలో గుర్రబ్బండి ప్రయాణం

మా భోజనానంతరం ఆ ఐలాండ్‌లో తిరగడానికి ఒక గుర్రపు బండిని అద్దెకు మాట్లాడుకున్నాం. చిన్న గ్రామమైనా ఎంతో పరిశుభ్రంగా ఉంది. ఊరి మధ్యలో ఒక పాత కోట, అక్కడక్కడా రాళ్లతో కట్టిన ఇళ్లూ, దారికి ఇరువైపులా కాంపౌండు వాలూ కన్పించాయి.
గ్రామానికి మధ్యలో ఒక చిన్న సరస్సు కన్పించింది. మా గుర్రపు బండిని సరస్సు ఒడ్డునే ఆపాం. 'చుట్టూ సముద్రం ఉన్నా ఆ సరస్సులోని నీరు చాలా తియ్యగా ఉంటుందని, సముద్రానికీ, ఈ సరస్సుకూ ఎటువంటి సంబంధం ఉండదని, తాగడానికి ఆ సరస్సు నీటినే వాడతారని' చెప్పారు. ఆ సరస్సులోని నీరు తాగి చూశాం. నిజంగానే అక్కడివాళ్లు చెప్పినట్లు చాలా తియ్యగా ఉన్నాయి. అక్కడ గుర్రపు బళ్లే కాకుండా, సైకిళ్లు కూడా పర్యాటకులకు అద్దె కివ్వడం కన్పించింది. రెండు గంటలపాటు ఆ ఐలాండ్‌లో గడిపి, తర్వాత షిప్‌లో మొహర్ ప్రాంతానికి తిరిగి వచ్చాం. అయితే ఈసారి వచ్చిన మార్గంలో కాకుండా 'క్లిఫ్స్ ఆఫ్ మొహర్' పక్కనుండి షిప్‌ని తీసుకెళ్లారు. పొగమంచు కారణంగా వ్యూని మిస్సయిన మాకు సముద్ర ప్రయాణంలో మొహర్‌ని చూడ్డం నిజంగా చాలా ఆనందం కలిగించింది. అద్భుతమైన ఆ దృశ్యం మా మనోనేత్రం నుండి ఎప్పటికీ చెరిగిపోదనిపించింది.
'క్లిఫ్స్ ఆఫ్ మొహర్'తో పాటు అదనంగా మరో దీవిని కూడా చూడగలిగినందుకు కొండంత తృప్తితో డబ్లిన్‌కి తిరుగు ప్రయాణమయ్యాం.

- వి. రాహుల్
92472 35401
v.rahul.in@gmail.com

జలపాత హోయలు.... రంగనాథుని కటాక్షం వెరసి..... శ్రీరంగ పట్టణం

Ranganathaswamy_Templeకర్ణాటకలో మైసూరు తరువాత చెప్పుకోదగ్గ అతిపెద్ద పర్యాటక కేంద్రం శ్రీరంగపట్టణం. ఇది మైసూర్‌కు పదమూడు కిలోమీటర్ల దూరంలో ఉన్నది... టిప్పు సుల్తాన్‌ కాలంలో అప్పటి మైసూరు రాజ్యానికి రాజధానిగా విరాజిల్లింది. శ్రీరంగ పట్టణంలో ముందుగా చెప్పుకోదగినది రంగనాథస్వామి ఆలయం. ఎంతో చారిత్రక విశిష్టతను తనలో ఇముడ్చుకున్న ఆ ఆలయంతో పాటు ఎన్నో విహార ప్రదేశాలు ఈ పట్టణంలో ఒదిగిపోయాయి. మైసూర్‌ విహారానికి వెళ్లిన ప్రతి పర్యాటకుడు శ్రీరంగపట్టణాన్ని కూడా దర్శిస్తారంటే అతిశయోక్తి కాదు. దేశంలోనే పేరుగాంచిన శ్రీరంగపట్టణ విహార విశేషాలు ..........

కర్ణాటకలోని మాండ్య జిల్లాలో కావేరి తీరప్రాంతంలో ఉన్న శ్రీరంగపట్టణం చుట్టూ కావేరి నది ప్రవహిస్తుండడంతో ఈ నగరం ఓ ద్వీపంలా కనబడుతుంది. ఇక్కడ కొలువైవున్న శ్రీరంగనాధ స్వామి పేరుతో ఈ నగరానికి శ్రీరంగపట్టణం అనే పేరు వచ్చింది. ఈ ఆలయాన్ని 9వ శతాబ్దంలో గంగ వంశపు రాజులు నిర్మించారు. అద్భుత శిల్ప సౌందర్యంతో అలరారుతోన్న ఆ ఆలయం... హోయసల, విజయనగర నిర్మాణశైలికి అద్దం పడుతుంది.

రంగనాథస్వామి దేవాలయానికి ఎదురుగా వినాయకుడి దేవాలయం ఉన్నది. అంతేకాకుండా గంగాధరేశ్వరస్వామి, లక్ష్మీ నరసింహస్వామి, జ్యోతిమహేశ్వర స్వామి వంటి ఎన్నో దేవాలయాలు శ్రీరంగపట్టణంలో కొలువుదీరి ఉన్నాయి.

పట్టణ చరిత్ర...
Tippu_Mausoleum శ్రీరంగపట్టణం... విజయనగర సామ్రాజ్య కాలం నుండి పుణ్యే త్రంగా, సాంస్కృతిక కేంద్రంగా విరాజిల్లుతున్నది. అంతేగాక మైసూ రు రాజ్య రాజధానిగా కూడా విశేష సేవలందించింది ఈ నగరం. రంగ రాయ మహారాజును ఓడించిన వడ యార్‌ రాజు 1610లో శ్రీరంగపట్ట ణాన్ని వశపరుచుకున్నాడు. విజయ నగర సామ్రాజ్యంపై దండెత్తిన వడయార్‌ రాజును విజయనగర సామ్రాజ్య ఆరాధ్య దేవతయైన అలిమేలమ్మ శపించిందనీ, అందువల్ల వడయార్‌ రాజుకు సంతానం కలుగలేదని ఓ కథనం ప్రచారంలో ఉంది. రాజా వడయార్‌ రంగరాయను ఓడించిన తరువాత 1610లో నవరాత్రి ఉత్సవాలను ఘనంగా నిర్వహించాడు. అప్పటినుండి ఇక్కడ నవరాత్రి ఉత్సవా లను ఎందో వైభవోపేతంగా జరపడం ఆనవాయితీగా మారింది. అప్పటినుండి మైసూర్‌ దసరా ఉత్సవాలకు ఒక గుర్తింపు వచ్చింది. చాముండేశ్వరీ దేవిని కొలుస్తూ... పదిరోజుల పాటు జరిగే నవరాత్రి ఉత్సవాలు దేశంలోనే ఎంతో పేరుప్రఖ్యాతులను సంతరించుకున్నాయి.

Shivanasamudram 1610లో రాజా వడయార్‌ వశపరుచున్న శ్రీరంగపట్టణం 1947లో భారత్‌కు స్వాతంత్య్రం సిద్ధించేవరకు మైసూర్‌ రాజధానిగా వెలుగొందింది. రాజా వడయార్‌ తరువాత, హైదర్‌ అలీ, టిప్పు సుల్తాన్‌ల ఆధ్వర్యంలో శ్రీరంగపట్టణం... మైసూరు రాజ్యానికి రాజధాని అయ్యింది. టిప్పు సుల్తాన్‌ తన రాజ్యానికి ‘ఖుదాదాద్‌ సల్తనత్‌’ లేదా ‘సల్తనత్‌ ఎ ఖుదా దాద్‌’ అని పేరు పెట్టాడు. టిప్పు సుల్తాన్‌ శ్రీరంగపట్టణాన్ని రాజధాని చేసుకుని, దక్షిణ భారత్‌ లోని చాలా ప్రాంతా లను తన రాజ్యంలో కలుపు కున్నాడు. ఇండో - ఇస్లామీ య నిర్మాణ శైలిలో టిప్పుసుల్తాన్‌ సమాధి, టిప్పూ ప్యాలెస్‌, దరియా దౌలత్‌, జుమ్మా మసీదు లాంటి నిర్మా ణాలు ఈ నగరానికి శోభను చేకూర్చుతున్నాయి. ఇలాం టి ఎన్నో చారిత్రక కట్టడాలను నిర్మించి తనదైన శైలి పరి పాలనతో దేశవ్యాప్త గుర్తింపు పొందిన టిప్పు సుల్తాన్‌ 1799 లో తన సొంత అనుచరగణం విద్రోహ చర్యవల్ల శ్రీరంగపట్టణ పరిసరాలలోనే బ్రిటిష్‌ వారిచే చంపబడ్డాడు.

చూడదగ్గ ప్రదేశాలు...
Daria_daulatమైసూర్‌ పర్యటన పూర్తిచేసుకొని శ్రీరంగపట్టణంలో అడుపెట్టగానే ఎన్నెన్నో చారిత్రక నిర్మాణాలు ప్రకృతి రమణీయతలు స్వాగతం పలుకుతాయి. రంగనాథ స్వా మి దేవాలయంతో పాటు... టిప్పు సుల్తాన్‌ నిర్మించిన జుమ్మా మసీదు, అంతేకాకుండా రంగన్‌తిట్టు పక్షి అభ యారణ్యం, కరిఘట్ట శ్రీనివాస ఆలయం, దరియా దౌల త్‌ గార్డెన్‌, శివనసముద్ర జలపాతం లాంటి ఎన్నో ప్రదే శాలు విహారాన్ని జీవితాంతం గుర్తుండేలా చేస్తాయి.

దేశంలో రెండవ అతిపెద్ద జలపాతం...
శివనసముద్ర జలపాతం, భారత్‌ లో రెండవ, ప్రపంచం లో 16వ అతిపెద్ద జలపాతం. శ్రీరంగపట్టణానికి అతిచేరువలో ఉన్న చిన్న నగరం శివనసముద్ర. ఇది కావేరి నది ఒడ్డున ఉంది. ఆసియాలో మొట్టమొదటి జల విద్యుత్‌ ఉత్పత్తి కేంద్రం స్థాపించింది ఇక్కడే కావడం విశేషం. 1902 ఇక్కడ విద్యుత్‌ ఉత్పత్తి కేంద్రాన్ని ఏర్పాట చేశారు. కావేరి నదీ మార్గంలో డెక్కన్‌ పీఠభూమి యొక్క రాళ్లు, పర్వత కనుమల్లోనుండి పైనుండి కిందికి దూకుతూ పర్యాటకులను ఆనందడోలి కల్లో ముంచెత్తుతుంది శివనసముద్ర జలపాతం. శివనసముద్ర ద్వీప నగరం... ఇక్కడ కావేరి నదిని జంట జలపాతాలుగా విభజిస్తుంది. ఈ దృశ్యం చూడడానికి కన్నుల పండుగగా ఉంటుంది. ఇది దేశంలో నాల్గవ అతిపెద్ద ద్వీపం ఏర్పరుస్తుంది. ఇక్కడ కూడా శ్రీరంగపట్టణంలో మాదిరిగా ఎన్నో పురాతన ఆలయాలు ఉన్నాయి.

ఇది ఒక పరిచ్ఛేద జలపాతం. పరిచ్ఛేద జలపాతం అనగా... నీటి ప్రవాహం రెండు లేదా మరిన్ని పాయలుగా విడిపోవడానికి ముందు ఒక చరియ మీదగా కిందకి పడటం వలన ఏర్పడతాయి. ఫలితంగా పక్కపక్కనే ప్రవహించే పలు జలపాతాలు ఏర్పడతాయి. ఈ జలపాతం సగటున 849 మీటర్ల వెడల్పు, 90 మీ ఎత్తుతో సెకనుకు 934 క్యూబిక్‌ మీటర్లను కలిగి ఉంది. గరిష్ట నమోదిత ఘన పరిమాణం సెకనుకు 18,887 క్యూబిక్‌ మీటర్లు. ఇది ఒక జీవ జలపాతం. జూలై నుండి అక్టోబరు వరకు రుతు పవన కాలంలో అత్యధిక ప్రవాహాన్ని కలిగి ఉంటుంది.

Ranganthittu_Bird_Sanctuary బెంగుళూరు నగరానికి 139 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ జలపాతానికి ఓ విశిష్టత ఉంది. ఈ జలపాతం యొక్క ఎడమ భాగాన్ని గగనచుక్కీ అని, కుడి భాగాన్ని భారచుక్కీ అని పిలుస్తారు. వాస్తవానికి, భారచుక్కీ జలపాతాలు. గగనచుక్కీ జలపాతాలకు నైరుతి దిశలో కొన్ని కిలోమీటర్లు ఉంటాయి. దీనికి కారణం ఏమిటంటే కావేరీ నది కూడా ఉత్తర దిశలో కొన్ని కిలోమీటర్లు పశ్చిమ, తూర్పు భాగాల్లోకి విడిపోతుంది. పశ్చిమ భాగం ఫలితంగా గగనచుక్కీ జంట జలపాతాలుగా విభజించబడుతుంది. అలాగే తూర్పు భాగం ఫలితంగా భారచుక్కీ జలపాతాలు విభజించబడతాయి. గగనచుక్కీ జలపాతాలను శివనసముద్ర వాచ్‌ టవర్‌ నుండి చాలా దగ్గరగా వీక్షించవచ్చు. దక్షిణాది భాషలకు సంబంధిచిన చలనచిత్రాల్లోని జలపాత దృశ్యాలు చాలావరకు ఇక్కడివే కావడం విశేషం. గగనచుక్కీ జలపాతాలకు... దర్గా హజ్రాత్‌ మార్డాన్‌ గాయిబ్‌ నుండి మరొక మార్గం ఉంది. అక్కడ ఉంచిన హెచ్చరికలను పట్టించుకోకుండా, ప్రజలు రాళ్లపై నుండి కిందకి దిగి, వెనుక నుండి జలపాతాలను చూడటానికి ప్రయత్నిస్తున్నారు, దీనివల్ల ఇక్కడ అప్పుడప్పుడు పలు ప్రమాదాలు చోటుచేసుకుంటాయి.

విద్యుత్‌ ఉత్పాదన...
సింషాపురా తర్వాత ఆసియాలో రెండవ జల విద్యుత్‌ ఉత్పత్తి కేంద్ర ఈ జలపాతం వద్ద ఏర్పాటు చేయబడింది. 1902 ఏర్పాటు చేసిన ఈ జలవిద్యుత్‌ కేంద్రం ఇప్పటికీ నిరాటంకంగా పని చేస్తుంది. మైసూర్‌ దివాన్‌ శేషాద్రి ఐయ్యర్‌ ఈ జలవిద్యుత్‌ కేంద్రాన్ని ప్రారంభించారు. ఇక్కడ ఉత్పత్తి అయ్యే విద్యుత్తును ప్రారంభంలో కోలార్‌ బంగారు గనులకోసం ఉపయోగించారు. దీనివల్ల కోలార్‌ బంగారు గనులు ఆసియాలో జల విద్యుత్తును పొందిన మొట్టమొదటి నగరంగా పేరు గాంచింది.

అరుదైన పక్షులకు ఆలవాలం... రంగన్‌తిట్టు పక్షి అభయారణ్యం...
శ్రీరంగపట్టణానికి అతిదగ్గరలో ఉన్న రంగన్‌తిట్టు పక్షి అభయారణ్యంలో... పెయింటెడ్‌ స్టార్క్‌, ఓపెన్‌-బైల్డ్‌ స్టార్క్‌, బ్లాక్‌ హెడెడ్‌ లిబిస్‌, రివర్‌ టెర్న్‌, గ్రేట్‌ స్టోన్‌ ప్లోవర్‌, ఇండియన్‌ శాగ్‌ లాంటి ఎన్నో అరుదైన పక్షిజాతులు ఈ అరణ్యంలో మనకు దర్శనమిస్తాయి. ‘పక్షి కాశి’ అని పిలువబడే ఈ పక్షి అభయారణ్యం 67 చకిమీ వైశాల్యం కలిగి ఉన్నది. శ్రీరంగపట్టణానికి కేవలం మూడు కిలోమీటర్ల దూరంలో ఈ అభయారణ్యం ఉన్నది. కావేరి నదీ పరీవాహక ప్రదేశాన్ని సందర్శించిన పక్షి శాస్తవ్రేత్త డా సలీం అలీ తొలిసారిగా ఈ ప్రాంతంలో అరుదైన పక్షులు ఉన్నట్టు కొనుగొన్నాడు. ఈ విషయాన్ని వడయార్‌ రాజులకు తెలిపి వారిని ప్రేరేపించాడు. దాంతో వడయార్‌ రాజు 1940లో ఈ ప్రాంతాన్ని పక్షి అభయారణ్యంగా ప్రకటించారు.

శ్రీనివాసుడు కొలువైన ‘కరిఘట్ట’...
శ్రీరంగపట్టణానికి కొన్ని కిలోమీటర్ల దూరంలో ఉన్న నల్లకొండ (బ్లాక్‌ హిల్‌) పై వెలిసిన శ్రీనివాసుడు భక్తులకు అభయాన్ని ప్రసాదిస్తున్నాడు. కరిఘట్ట అని పిలవబడే ఈ ప్రాంతంలో వేంకటేశ్వర స్వామి సంచరించాడని పురాణగాధ. నల్ల కొండ పై వెలిశాడు కాబట్టి ఇక్కడ శ్రీనివాసున్ని ‘కరిగిరివాసుడు’ (కరి అనగా ‘నలుపు’, గిరి అంటే... ‘కొండ’) అని పిలుస్తారు.

అహోం క్రీడావినోదానికి ప్రతీక...

Rang-Ghar
శివసాగర్‌ పట్టణానికి 3 కిలోమీటర్ల దూరాన వున్న రంగ్‌ఘర్‌ ఎంతో చారిత్రక ప్రాధాన్యత గల నిర్మాణం. అహోం రాజుల రాయల్‌ ప్యాలెస్‌ ఉన్న తలాతల్‌ ఘర్‌ నుంచి 5 నిమిషాల్లో కాలినడకన ఇక్కడికి చేరుకోవచ్చు. అహోం రాజులు కట్టించిన ప్రత్యేకమైన ఈ ఆంఫిథియేటర్‌ (క్రీడా విన్యాసాలు ప్రదర్శించే వేదిక) అప్పటి వారి రాజ్యవైభవానికి ప్రతీక. అహోం రాజులు క్రీడలు తిలకిస్తూ ఆనందించే వేదికగా వినియోగించిన ఈ స్థలం... ప్రఖ్యాత రోమన్‌ కొలోసియంను పోలివుంటుంది. రంగ్‌ఘర్‌ అహోం రాజుల కాలంనాటి రెండంతస్తుల పెవిలియన్‌. దీని నిర్మాణపరమైన గుణగణాలు ఎంతో విలక్షణమైనవి. భారీ స్తంభాలపై నిర్మించిన ఈ కట్టడం పై కప్పు నేటి సాంకేతిక విజ్ఞానాన్ని సైతం అబ్బురపరుస్తుంది. ఈ నిర్మాణ వైభవంలో ఇస్లాంపరమైన ప్రభావం కనిపిస్తుంది. భవనం బాహ్య అలంకరణలో భాగంగా ఒక అపురూపమైన విలాస నౌక ఉంది. అహోం రాజులు స్థానికంగా దొరికే వివిధ రకాల సామాగ్రిని దీని నిర్మాణం కోసం ఉపయోగించారు.

అంటుకునే స్వభావ గల ఒక రకమైన వరిధాన్యం (బోరాచాల్‌), గుడ్లును రంగ్‌ఘర్‌ నిర్మాణానికి వాడడం విశేషం. రంగ్‌ఘర్‌ నిర్మాణం పూర్తయి కొన్ని వందల ఏళ్ళ గడిచిన తరువాత కూడా బోరాచాల్‌ ఇప్పటికీ తాజా స్థితిలో మనకు దర్శనమివ్వడం విశేషం. ఇప్పటి భవంతిని అహోం రాజు ప్రమతా సింఘా, క్రీశ 1744-1750 మధ్యకాలంలో ఈ అద్భుత కట్టడాన్ని నిర్మించాడు. రాజకుటుంబాలతో కలిసి ఆయన వివిధ రకాల క్రీడలు ఈ రంగ్‌ఘర్‌లో వీక్షించేవారు. ఇక్కడ రంగలీ బిహు (అహోంలో జరిగే పెద్ద పర్వదినం) సందర్భంగా పక్షుల పోటీలు, దున్నపోతుల పోటీల వంటి రకరకాల పోటీలను నిర్వహించేవారు. క్రీడా ప్రదర్శనలను నిర్వహించే ఇంత పెద్ద ఆంఫిథియేటర్‌ భారత్‌లోనే కాదు, ఆసియాలోకెల్లా ఇదే అతి పురాతనమైనది కావడం గమనార్హం. 2007లో గౌహతిలో జరిగిన జాతీయ క్రీడలకు రంగ్‌ఘర్‌ను అధికారిక లోగో గా ఉపయోగించారు.

కృష్ణమ్మ ఒళ్లో... సరదాల విహారం..

krishanmmam1
పర్యాటక రంగంలో మరో ముందడుగు! కొన్నాళ్లుగా ఊరిస్తూ వస్తోన్న ‘రివర్‌ క్రూయిజ్‌’ ప్రాజెక్టు ఇటీవలే సాకారమైంది. పర్యాటకాభివృద్ధి సంస్థ... నాగార్జున సాగర్‌- శ్రీశైలం మధ్య బోటు ప్రయాణాన్ని చేపట్టింది. ఈ బోటు పేరు ‘ఎం ఎల్‌ అగస్త్య’. 90 సీట్ల సామర్థ్యం ఉన్న ఈ బోటు ఇటీవలే జలప్రవేశం చేసింది. రెండు రోజుల ప్యాకేజీ. ఈ బోటు ప్రయాణంతో కృష్ణమ్మ పరవళ్లు మరింత కనువిందు చేయడం ఖాయం. భారీ వర్షాల వల్ల తొణికిసలాడుతున్న కృష్ణానది ప్రవాహానికి ఎదురెళ్లడం పర్యాటకులకు ఓ అనుభూతిని మిగుల్చుతుంది. చాన్నాళ్ల నుంచీ మరుగున పడి ఉన్న ఈ ప్రాజెక్టు ప్రతిపాదనలు పర్యాటకాభివృద్ధి సంస్థ మేనేజింగ్‌ డైరెక్టర్‌ సందీప్‌ కుమార్‌ సుల్తానియా చొరవతో కార్య రూపం దాల్చాయి.
krishanmmam
హైదరాబాద్‌ నుంచి పర్యాటకులను నాగార్జున సాగర్‌కు తీసుకెళ్లడానికి పర్యాటకాభివృద్ధి సంస్థ ప్రత్యేకంగా రెండు బస్సులను నడపనుంది. శని, ఆదివారాల్లో సికింద్రాబాద్‌ లోని యాత్రీ నివాస్‌ నుంచి ఉదయం 7 గంటలకు, పాత కంట్రోల్‌ రూమ్‌ ఎదురుగా ఉన్న పర్యాటకాభివృద్ధి సంస్థ కేంద్రీయ రిజర్వేషన్‌ కార్యాలయం (సిఆర్‌ఓ) నుంచి 7:30 గంటలకు బస్సులు బయలుదేరుతాయి. నాగార్జున సాగర్‌ చేరిన అనంతరం అక్కడి నుంచి బోటు ప్రయాణం సాగుతుంది. 90 కిలోమీటర్ల మేర ప్రయాణం. సాయంత్రానికి బోటు లింగాలగట్టుకు చేరుకుంటుంది. అనంత రం సాక్షి గణపతి, భ్రమరాంబ మల్లికార్జున స్వామి వారి దర్శనం కల్పిస్తారు. శ్రీశైలంలోని పర్యాటకాభివృద్ధి సంస్థ హోటల్‌లో రాత్రి బస. మరుసటి రోజు తెల్లవారు జామున 6 గంటలకు ‘రోప్‌ వే’ ద్వారా పాతాళగంగకు తీసుకెళ్తారు. అనంతరం తిరుగు ప్రయాణం.

శ్రీశైలం నుంచి నాగార్జున సాగర్‌ చేరుకున్న తరువాత ఎత్తిపోతలు, నాగార్జున కొండ, నాగార్జున సాగర్‌ రిజర్వాయర్‌, మ్యూజియం సందర్శన కల్పిస్తారు. అవి ముగిసిన వెంటనే ప్రత్యేక బస్సులో హైదరాబాద్‌కు తిరుగు ప్రయాణం. ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం, రాత్రి భోజనం, ఎసి గదుల్లో నివాస వసతి పర్యాటక శాఖ ఏర్పాటు చేస్తుంది.

టారిఫ్‌ వివరాలివీ...
హైదరాబాద్‌ నుంచి నాన్‌ ఏసీ బస్సులో...
పెద్దలకు - రూ.2000
పిల్లలకు - రూ.1500
ఏసీ బస్సులో...
పెద్దలకు - రూ.2500
పిల్లలకు - రూ.1800
నేరుగా నాగార్జున సాగర్‌లోనే బోటు ప్రయాణం చేయదల్చుకుంటే...
పెద్దలకు - రూ.1500
పిల్లలకు - రూ.1100

పాపికొండల్లో.. హ్యాపీగా...

papikondalu2
చుట్టూ గోదారమ్మ పరవళ్లు... పచ్చని ప్రకృతి సోయగాలు... కనుచూపు మేర పచ్చటి పర్వత పంక్తులు... గిలిగింతలు పెట్టే చలిగాలులు... కొండల మధ్య మధ్య అందమైన సూర్యోదయం, అంతే అందమైన సూర్యాస్తమయం... రాత్రిళ్లు వెదురు గుడిసెల్లో బస... మధ్యలో క్యాంప్‌ ఫైర్‌... గోదారమ్మ ఒడిలో స్నానం..! ఇవి చాలు పాపికొండల ప్రత్యేకతలు వివరించడానికి! యాంత్రిక జీవనానికి విసిగి వేసారిన జనాలకు చక్కటి ఆహ్లాదాన్ని పంచే పాపికొండల నడుమ పడవ ప్రయాణం అద్భుత జ్ఞాపకాలను మిగుల్చుతోంది.

‘హైదరాబాద్‌ - భద్రాచలం - పాపికొండలు’ ఈ పదాల కలయికే ఆసక్తిక రం. భద్రాచలం మీదుగా... హైదరాబాద్‌ నుంచి పాపికొండలకు పర్యాటకాభివృద్ధి సంస్థ ఇటీవలే ప్యాకేజీని ప్రవేశపెట్టింది. పర్యాటకాభివృద్ధి సంస్థ ఏర్పాటు చేసిన ప్రత్యేక బస్సులో రాత్రి హైదరాబాద్‌లో బయలుదేరితే... భద్రాచలంలో భద్రాద్రి రాముడు, పర్ణశాల సందర్శనం... అనంతరం గోదా రమ్మ ఒడిలో ‘హరిత’ ప్రయాణం... వెదురు గుడిసెల్లో బస... పాపికొండల ప్రయాణానికి చిరునామాగా మారిన పేరంటాల పల్లి సందర్శన... ఇదీ ఈ ప్యాకేజీ.

తొలి అడుగు భద్రాచలంలో...
papikondalu1హైదరాబాద్‌ నుంచి పర్యాటకాభివృద్ధి సంస్థ ఏర్పాటు చేసిన ప్రత్యేక బస్సు ప్రతి శుక్రవారం రాత్రి 9:30 గంటలకు బయలుదేరుతుంది. మరుసటి రోజు తెల్లవారు జామున 5:30 - 6:00 గంటల మధ్య భద్రాచలం చేరుకుంటుంది. అక్కడే హరిత హోటల్‌లో బస. శబరీ నదీ స్నానం, కొండపై కొలువైన భద్రాద్రి రాముని దర్శనం ఉంటుంది. అనంతరం అక్కడి నుంచి 70 కిలోమీటర్ల మేర బస్సులో ప్రయాణం. పర్ణశాల, ఇతర స్థానిక పర్యాటక కేంద్రాల సందర్శనాన్ని పర్యాటకాభివృద్ధి సంస్థ ఏర్పాటు చేస్తుంది.

ప్రయాణం ‘హరిత’మయం...
దీనికి కొనసాగింపుగా... పోచవరం వరకు బస్సు ప్రయాణం ఉంటుంది. దట్టమైన అడవుల్లో గిరిపుత్రులు నివాసం ఉండే పోచవరం గోదావరి నదీ తీరం లో ఉంది. అడవుల్లో అక్కడక్కడ విసిరేసినట్టుగా ఉండే గిరిజనుల ఆవాసాలు చూపు మరల్చుకోనీయవు. అక్కడి నుంచి పాపికొండల ప్రయాణం మొదలవు తుంది. పర్యాటకాభివృద్ధి సంస్థ ఏర్పాటు చేసిన బోటు ‘హరిత’లో జలప్రవేశం.

papikondalu3 180 మందిని తీసుకెళ్లే సామర్థ్యం ఉన్న ఈ బోటులో సుమారు రెండున్నర గంటల మేర ప్రయాణం నిజంగా ‘హరిత’మయమేనని అనిపిస్తుంది. ఎందుకంటే... పచ్చగా అలరారే దట్టమైన అడవుల మధ్య పాయగా చీలిన గోదావరి అలలపై ఈ పడవ పర్యాటకులను తీసుకెళ్తుంది. సూర్యాస్త మయం వేళ, బంగారు రంగులో మెరిసిపోయే గోదావరి నదీ జలాలు, పర్వతాల బారుల వెనుక అస్తమించే సూర్యు డిని తిలకించడం ఓ అద్భుతమే..!

ఇసుక తిన్నెల్లో, వెదురు గుడిసెల్లో...
సుమారు 40 కిలోమీటర్ల మేర ప్రయాణించిన అనంతరం పర్యాటకులు కొల్లూరుకు చేరుకుంటారు. అక్కడ 50 ఎకరాల విస్తీర్ణంలో వ్యాపించిన ఇసుక తిన్నెల్లో వెదురు బొంగులతో వేసిన గుడిసెలు స్వాగతం పలుకుతాయి. పర్యాటకుల రాత్రి బస అక్కడే. సంధ్యవేళ పర్వాతాల మీది నుంచి సుడులు తిరుగుతూ వీచే చల్లని గాలులు ఇబ్బంది పెట్టకుండా పర్యాటక శాఖ సిబ్బంది బ్లాంకెట్లను ఏర్పాటు చేస్తారు. గిరిజనుల సంప్రదాయ వంటకాలతో భోజనం ఉంటుంది. చుట్టూ నీళ్లు, హరితమయమైన పర్వతాల పంక్తి, సోలార్‌ దీప కాంతుల మధ్య డిన్నర్‌.

ఉషోదయం వేళ ఈశ్వరాలయ సందర్శనం...
papikondalu కొల్లూరు నుంచి రెండు కిలోమీటర్ల దూరంలో పాపికొండల మధ్య వెలసిన పేరంటాల పల్లి శైవక్షేత్రం సందర్శన ఉంటుంది. ఏటా కార్తికమాసం, శివరాత్రి పర్వదినాల సమయంలో ఈ శైవక్షేత్రానికి భక్తుల తాకిడి అధికంగా ఉంటుంది. పేరంటాల పల్లి నుంచి హరితలోనే తిరుగు ప్రయాణం ఉంటుంది. లాంచీలో పోచవరం, అక్కడి నుంచి మళ్లీ పర్యాటకాభివృద్ధి సంస్థ బస్సులో భద్రాచలం చేరుకుంటారు. పాపి కొండల ప్రయాణం మిగిల్చే మధు రానుభూతులతో హైదరాబాద్‌కు ప్రత్యేక బస్సులో తిరుగు ప్రయా ణం అవుతారు. ఇది జీవితంలో మరిచిపోలేని విహారంగా మగిలిపోతుంది.

హైదరాబాద్‌ నుంచి ఇదే తొలిసారి...
ప్రస్తుతం పాపికొండల ప్రయాణం రాజమండ్రి నుంచి కొనసాగుతోంది. అది కూడా కేవలం బృం దాలుగా వెళ్లడానికే వీలుంది. హైదరాబాద్‌ నుంచి కూడా ఉన్నా... పాపికొండల మధ్య రాత్రి బస చేసే అవకాశం ఉండేది కాదు. ఈ రెండింటికి భిన్నంగా... పర్యాటకాభివృద్ధి సంస్థ మేనేజింగ్‌ డైరెక్టర్‌ సందీప్‌ కుమార్‌ సుల్తానియా కొత్తగా ఈ ప్యాకేజీని ప్రకటించారు.

ప్రతి వారాంతంలో అంటే శుక్రవారం రాత్రి బయలుదేరి, శని, ఆదివారాల్లో పాపికొండల్లో విహరించి... సోమవారం తెల్లవారు జామునే హైదరాబాద్‌కు చేరుకునేలా సుల్తానియా... ఈ ప్యాకేజీని రూపొందించారు. నగరానికి చెందిన పర్యాటకుల నుంచి ఈ ప్యాకేజీకి చక్కని స్పందన లభిస్తోంది. కిందటినెలలోనే హైదరాబాద్‌-నాగార్జున సాగర్‌-శ్రీశైలం ప్యాకేజీని కూడా ఆయన ప్రవేశపెట్టారు.
ఏపీ టూరిజం ఎండీ... Tourism-MD
సందీప్‌ కుమార్‌ సుల్తానియా

టారిఫ్‌ వివరాలివీ...
ఏసీ బస్సులో...
పెద్దలకు - రూ.2800
పిల్లలకు - రూ.2250
నాన్‌ ఏసీ బస్సులో...
పెద్దలకు - రూ.2250
పిల్లలకు - 1850
సంప్రదించాల్సిన పర్యాటక శాఖ కార్యాల యాల వివరాలు...
హైదరాబాద్‌, బషీర్‌బాగ్‌లోని కేంద్రీకృత రిజర్వేషన్‌ కార్యాలయం, ట్యాంక్‌బండ్‌ వద్ద గల పర్యాటక శాఖ కార్యాలయం, గ్రీన్‌ల్యాండ్‌లోని టూరిజం ప్లాజా, సికింద్రాబాద్‌లోని యాత్రీ నివాస్‌లల్లో ఈ ప్యాకేజీని బుక్‌ చేసుకోవచ్చు. సంప్రదించాల్సిన ఫోన్‌ నంబర్లు... 9848540371, 040- 66746373, 66745986.
- మహేంద్రకర్‌ చంద్రశేఖర్‌ రావు

అద్భుత రమణీయ దృశ్యం... త్రిపుర

Ujjayanta_Palace 
ఈశాన్య రాష్ట్రాల్లో ఒకటైన త్రిపుర ప్రకృతి రమణీయ తతో అలరారుతుంది. ఈశాన్య కొండలపై ఉన్న ఈ చిన్న రాష్ట్రం పచ్చని కొండలతో పాటుగా అనేక వన్యప్రాణి సంరక్షణా కేంద్రాలకు నిలయం. త్రిపుర రాజధాని అగర్త లా. త్రిపుర 1949కి ముందు ప్రత్యేక రాజ్యంగా ఉండేది. స్వాంత్రంత్యం వచ్చిన తర్వాత అంటే 1949లో భారతదే శంలో విలీనమయింది.
శక్తి పీఠాల్లో ఒకటైన త్రిపుర సుందరీ దేవి దేవాలయం రాజధాని అగర్తాలకు సమీపంలోని ఉదయ్‌పూర్‌లో ఉంది. అగర్తలా-ఉదయ్‌పూర్‌ మధ్య దూరం 55 కి.మీ.. త్రిపుర లో ప్రధాన నది మనూ ఒకటి.
త్రిపురలో మొత్తం నాలుగు జిల్లాలు ఉన్నాయి. ధలాయ్‌ జిల్లాకు రాజధాని అంబస్సా, ఉత్తర త్రిపురకు కైలాషాహార్‌, దక్షిణ త్రిపురకు ఉదయ్‌పూర్‌, పశ్చిమ త్రిపురకు అగర్తలా.

అగర్తలా...
రాజధాని అగర్తలాలో ఉజ్జయంత ప్యాలెస్‌, కుంజాబన్‌ ప్యాలెస్‌, స్టేట్‌ మ్యూజియం, ట్రైబల్‌ మ్యూజియం, సుకంతా అకాడమీ, లక్ష్మీనారాయణ్‌ దేవాలయం, ఉమా మహే శ్వర్‌ దేవాలయం, జగన్నాధ్‌ దేవాలయం, రబీంద్రకనన్‌, పుర్బాషా, పోర్చుగీస్‌ చర్చ్‌ వంటివి ఉన్నాయి.


ఉజ్జయంతా ప్యాలెస్‌ను మహారాజా రాధా కిషోర్‌ మాణిక్య 1899-1901 సంవత్సరాల మధ్య కట్టించారు. ఇది రెండ స్థుల భవనం. ప్యాలెస్‌ ముందు భాగంలో మొఘల్‌ తరహా గార్డెన్స్‌ను ఒకదానిని ఏర్పాటుచేశారు. ఉజ్జయంతా ప్యాలె స్‌ అందాలను రాత్రిపూట తిలకించటానికి వీలుగా ఫ్లడ్‌ లైటింగ్‌ సిస్టంను అమర్చారు. ప్రస్తుతం ఇది త్రిపుర శాసన సభ భవనం.


కుంజాబన్‌ ప్యాలెస్‌ను మహారాజా బీరేంద్ర కిషోర్‌ మాణి క్య 1917లో నిర్మించారు. దీనికి ఆ తర్వాత పుష్పబంతా ప్యాలెస్‌గా నామకరణం చేశారు. విశ్వకవి రవీందన్రాధ్‌ టాగోర్‌ త్రిపుర పర్యటనకు 1926లో వచ్చినపుడు ఇక్కడే నివాసం ఉన్నారు. వీటితోపాటుగా వన్యప్రాణి సంరక్షణా కేంద్రాలు త్రిపురలో ఉన్నాయి.


త్రిపుర సుందరీ ఆలయం...
Laxminarayan_Temple 
అగర్తాలకు 55 కి.మీ. దూరంలోని ఉదయ్‌పూర్‌లో త్రిపు ర సుందరీ ఆలయం ఉంది. దుర్గా అమ్మవారి 51 శక్తి పీఠా ల్లో ఒకటి ఉదయ్పూర్‌ త్రిపుర సుందరీ ఆలయం. బెంగాలీ వాస్తు శిల్పిని అనుసరించి దేవాలయాన్ని కట్టారు. మహారా జా ధాన్య మాణిక్య ఈ దేవాలయాన్ని 1501 సంవత్సరం లో కట్టించారని అంటారు.


ఎలా చేరుకోవాలి...
విమాన మార్గం: రాజధాని అగర్తలాలో విమానాశ్రయం ఉంది. ఇక్కడి నుంచి కోల్‌కతా, గౌహతి, సిలిచార్‌లకు ప్రతి రోజూ విమాన సేవలు ఉన్నాయి.
రహదారి మార్గం: గౌహతి 599 కి.మీ., షిల్లాంగ్‌ 499 కి.మీ., సిలిచార్‌ 288 కి.మీ., ధర్మానగర్‌ 200 కి.మీ. గౌహతి నుంచి త్రిపుర రోడ్‌ ట్రాన్స్‌పోర్ట్‌ కార్పొరేషన్‌ బస్సు సేవలను అగర్తలాకు నడుపుతుంది.
రైలు మార్గం: సమీపంలోని రైల్వే స్టేషన్‌ ధర్మానగర్‌. అగర్తలా నుంచి 200 కి.మీ. దూరంలో ధర్మానగర్‌ ఉంది. ధర్మానగర్‌-లుండింగ్‌ మధ్య మీటర్‌ గేజి రైలు రాక పోకలు ఉన్నాయి. రైలు ప్రయాణం చాలా సమయం తీసుకుంటుంది. ఇది అంత అనుకూలం కాదు. ధర్మానగర్‌-అగర్తలా మధ్య రైలు మార్గం నిర్మాణంలో ఉంది. ధర్మానగర్‌-అంబస్సాల మధ్య రైలు మార్గ నిర్మాణం పూర్తైంది.

వసతి: ప్రభుత్వం, ప్రైవేటు రంగాలకు చెందిన అనేక హోటళ్లు అగర్తాలలో ఉన్నాయి.

జైన సంస్కృతి చిహ్నం.. బాహుబలి

Bahubali
మనదేశం భిన్నమతాలకు ఆలవాలం హైందవ, ముస్లిం, క్రైస్తవ, సిక్కు, జైన, బౌద్ధ సంస్కృతులు ఈ నేలలో ఫరిఢవిల్లాయి. చారిత్రక కట్టడాల రూపంలో సంస్కృతుల చిహ్నాలు... దేశవ్యాప్తంగా నేడు ప్రసిద్ధ పర్యాటక కేంద్రాలుగా వెలుగొందుతున్నాయి. వందల, వేల ఏళ్ళనాడే భారతావనిలో జైన మతం విశేష ప్రాచుర్యం పొందింది. ముఖ్యంగా రాజస్థాన్‌, కర్ణాటక రాష్ట్రాల్లో అనేక దేవాలయాలు, సంస్కృతి చిహ్నాలు మనకు దర్శనమిస్తాయి. అలాంటి వాటిలో పేరెన్నికగన్నదే ‘శ్రావణ బెళగొళ’... దేశంలోనే పెద్దదైన ‘బాహుబలి’ విగ్రహం ఇక్కడి ప్రధాన ఆకర్షణ. జైన సంస్కృతీ సంపదను కళ్ళకు కడుతున్న కర్ణాటకలోని ‘శ్రావణ బెళగొళ’ విశేషాలు...

రెండు కొండల మధ్య ప్రృతి సిద్దంగా ఏర్పడిన సరోవరమే బెళగొళ కన్న డంలో బెళ్ళి అంటే తెల్లని అని, గొళ అంటే నీటిగుండం అని అర్థం. జైన సంప్రదాయం ప్రకారం సంసార జీవితాన్ని త్యజించి సన్యాసాశ్రమం స్వీకరించిన వారిలో అత్యంత పూజనీయులైన వారిని శ్రమణులు అంటారు. అలాంటి శ్రమ ణులు చాలామంది ధ్యానంలో శేషజీవితం గడిపి నిర్యాణం పొందడానికి ఈ కొం డలలో, పరిసర ప్రాంతాలలో నివసించారు. శ్రమణులు ఉన్న ప్రదేశం కాబట్టి ఈ బెళగొళను ‘శ్రమణ బెళగొళ’ అనేవారు. క్రమంగా ‘శ్రావణ బెళగొళ’గా మారిం ది. స్థానికులు ‘బెళగొళ’ అనే పిలుస్తారు. చంద్రగిరి, ఇంద్రగిరి కొండల మధ్య ఉన్న బెళగొళను చుడడానికి దేశం నలుమూలల నుండి పర్యాటకులు వస్తారు.



భారీ గోమఠేశ్వరుడు...
Bahuఇక్కడ ఉన్న 58 అడుగుల బాహుబలి (గోమఠేశ్వరుడు) విగ్రహం దేశంలోని జైన తీర్థంకరుల, శ్రమణుల విగ్రహాలన్నింటిలోకి పెద్దది. క్రీశ 983వ సం వత్సరంలో చాముండరాయ అనే మంత్రి గోమఠేశ్వరుని విగ్రహాన్ని ఇంద్రగిరి పర్వతంపై చెక్కించినట్లు చారిత్రక కథనం. దీనికే గోమఠేశ్వరుని ఆలయంగా వాడుక. ఇక్కడ ఆలయం కట్టడం, విగ్రహాన్ని ప్రతిష్టించడం జరగలేదు. కొండ చివరి భాగంలో విగ్రహం మలిచారు. బాహుబలిగా పిలిచే గోమఠేశ్వరుని విగ్ర హాన్ని చెక్కడంలో శిల్పి అర్త్సమేణి కనబరచిన నైపుణ్యం స్వయంగా చూడాల్సిం దే. ధ్యానంలో బాహుబలి ముఖం ప్రశాంతతకు చిహ్నంగా, సర్వం త్యజించిన వ్యక్తి ముఖంలో కనిపించే నిర్వేదాన్ని చక్కగా మలిచారు. ద్యానంలో శిలగా మారిన మనిషి చుట్టూ చెట్లు అల్లుకుపోయినట్లు బాహుబలి భుజాల చుట్టూ చెట్ల తీగలు, ఆకులను అద్భుతంగా చెక్కారు. విగ్రహం కాలిగోళ్ళు వాటి చుట్టూ ఉండే చర్మం గీతలు సహజంగా ఉన్నట్లు చాలా స్పష్టంగా చెక్కారు. మనం విగ్రహం దగ్గర నిలబడితే బాహు బలి పాదం ఎత్తుకు సరిపోతాం.

కనులకు విందు... మస్తకాభిషేకం...
12 ఏళ్ళకొకసారి జరిగే మహామస్తకాభిషేకం సందర్భంగా భక్తులు అభిషే కం చేసేటప్పుడు కింద నిలబడి పాదాలను మాత్రమే అభిషేకించగలం. గోమఠేశ్వరునికి క్యాన్ల కొద్దీ పలు, తేనె, పెరుగు, అన్నం, కొబ్బరి పాలు, నెయ్యి, చక్కెర, బాదం పప్పు, కుంకుమ పువ్వు, నాణేలు, పసుపు, డ్రైఫ్రూ ట్స్‌, పండ్లతో విగ్రహం మొత్తం తడిసేదాకా అభిషేకం చేస్తారు. పూజారులు విగ్రహం పై నుండి అభిషేకం చేయడానికి వీలుగా స్ట్రక్చర్‌ కడతారు. దీని మీదకు వెళ్ళి అభిషే కం తంతు పూర్తి చేస్తారు. పర్యాటకులకు మహామస్తకాభి షేకం సమ యంలో చూడటం కంటే మామూలు రోజుల్లో వెళ్ళడమే అనువుగా ఉంటుంది. ఈ ఆల యం కొండమీద ఉం టుంది. ఈ కొండ ఎక్కువ ఎత్తు లేకపోయి నా ఎక్కడం కొంచెం కష్ట మే. మెట్లు ఎత్తుగా ఉండడంతో యువకులు కూడా మధ్యలో విశ్రాంతి తీసుకుంటూ ఎక్కుతారు. మొత్తం మీద పదిహేను-ఇరవై నిమిషాల తరువాత కొండపైకి చేరుకుంటారు....

బాహుబలి చరిత్ర...
Jain_Inscriptగోమఠేశ్వరుడు జైనమతం అవలంభించి ధ్యానముద్రలోకి వెళ్ళడానికి ఒక కథ వాడుకలో ఉంది. బాహుబలిగా పిలిచే గోమఠేశ్వరుడు ఋషబుని కుమారుడు (రామాయణంలో శ్రీరాముని వంశానికి మూల పురుషుడు ఋషబుడని ఉంది.) ఇతడికి ఇద్దరు భార్యలు. రాజ్యాన్ని పిల్లలందరికీ సమానంగా పంచాడు. పెద్ద భార్య పెద్ద కొడుకు భరతునికి రాజదాని కోసల పట్టణాన్ని అప్పగించి మిగిలిన కొడుకుల రాజ్యభారం బాధ్యత కూడా అప్పగించాడు. భరతునికి రాజ్యాన్ని విస్తరించాలన్న కోరిక కలిగింది. తమ్ముళ్ళందరిపై దండయాత్ర చేశాడు. బాహుబలి మినహా అందరూ రాజ్యాన్ని భరతుని వశం చేసి తపస్సు చేసుకోవడానికి తండ్రి వద్దకు వెళ్ళిపోయారు. అన్న దురాక్రమణ సహించలేని బాహుబలి భరతుని ఎదిరిస్తాడు. స్వతహాగా శాంతికాముకుడైన బాహుబలి యుద్దంలో అనవసరమైన ప్రాణనష్టాన్ని వద్దని ద్వంద్వ యుద్దం చేసి గెలుస్తాడు. భరతుడిని చేతులతో పైకెత్తి నేలకు కొట్టబోయి, అంతలోనే పునరాలోచనలో పడతాడు. ఇహపరమైన సుఖాల కోసం పాపపు పనులు చేయడం ఎందుకని భరతుని వదిలివేసి, రాజ్యాన్ని అతడికే అప్పగించి తపస్సు చేసుకోవడానికి వెళ్ళిపోతాడు. ఇంద్రగిరి కొండపై బాహుబలి తపస్సు చేసి మోక్షం పొందిన ప్రాంతంలోనే దేవాలయ నిర్మాణం జరిగినట్లు భావిస్తారు.

జైన విశిష్టత...
Belagola మన దేశంలో బౌద్దజైన మతాలు రెండూ దాదాపుగా ఒకే సమయంలో ప్రాచుర్యంలోకి వచ్చినప్పటికీ బౌద్దం వ్యాపి చెందినంతగా జైనం విస్తృతం కాలేదు. జైన మతంలో సన్యాసులు పాటించిన నియమాలు మరీ కష్టమైనవి కావడంతో దీన్ని ఆచరించడానికి ఎక్కువ మంది ముందుకు రాలేదు. కఠిన నియమాల కారణంగానే శ్వేతాంబరులు, దిగంబరులు అని రెండు వర్గాలుగా విడిపోయారు. శ్వేతాంబరులు ఉత్తర భారతదేశంలో కొన్ని చోట్ల ఉన్నారు. వీరు సంసార జీవితం కొనసాగిస్తారు. దిగంబరులు సన్యాసులు. వీరు దైవ చింతనలో ఉంటూ శరీరాన్ని ృశింప చేసి నిర్యాణం పొందే దీక్షలో ఉంటారు.

అంతా శాసనాలమయం...
బాహుబలి విగ్రహం తర్వాత ఇక్కడ చూడాల్సిన ప్రాంతాలన్నీ దాదాపుగా జైనమత ప్రాధాన్యం ఉన్నవే. జైన తీర్థంకరుల దేవాలయాలు ఉన్నాయి. వీటిలో చంద్రగిరి పర్వతం మీద అశోకుడు నిర్మించినట్లు నిర్మించినట్లు చెబుతున్న చంద్రగుప్త బస్తీ ముఖ్యమైనది. ఇందులో సెమీ ప్రిషియస్‌ స్టోన్స్‌ పొదిగి అద్భుతంగా చెక్కిన ఎనిమిది విగ్రహాలు పర్యాటకులను అమితంగా ఆకట్టుకుంటాయి. ఇక్కడ ఉన్నన్ని శాసనాలు మన దేశంలో మరే ప్రాంతంలోనూ లేవు. చరిత్ర పరిశోధకులు 523 శాసనాలను గుర్తించారు. ఇందులో చిన్న కొండ మీద 271,ె పద్ద కొండ మీద 172, 80 శాసనాలు బెళగొళలో, మరో 50 బెళగొళ పరిసర గ్రామాల్లో ఉన్నాయి. ఇవన్ని కూడా క్రీశ 600-19వ శతాబ్దం మధ్యనాటివే. లెక్కకు మించిన శాసనాలే కాక లెక్కలేనన్ని దేవాలయాలు కూడా ఇక్కడ ఉన్నాయి. జైనతీర్థాంకురుల స్మృతి చిహ్నాలుగా పర్యాకులను ఆకర్షిస్తాయి.

ఇలా వెళ్లాలి...
శ్రావణ బెళగొళ కర్నాటక రాష్ట్రం హసన్‌ జిల్లాలో ఉంది.బెంగుళూరుకు పశ్చిమంగా 146కి.మీ.దూరంలో ఉన్న ఈ ప్రదేశానికి 11కి.మీ.దూరంలో ఉన్న చెన్నరాయ పట్టణం ప్రధాన కేంద్రం. ఇక్కడికి అన్ని ముఖ్యమైన పట్టణాలను కలుపుతూ రవాణా సౌకర్యాలు ఉన్నాయి. బెంగుళూరు-మంగుళూరు హైవే రూట్‌లో వస్తుంది. రైల్వే ద్వారా చేరాలంటే హసన్‌ రైల్వే స్టేషన్‌లో దిగి రోడ్డు మార్గం గుండా ప్రయాణించాలి. ఇక విమానయానం ద్వారా వచ్చే ప్రయాణీకులు బెంగుళూరు ఎయిర్‌పోర్ట్‌లో దిగి రోడ్డు మార్గం ద్వారా చేరాలి. యాత్రికులు బెళగొళలో పర్యటించడానికి అవసరమైన సమగ్ర సమాచారం కోసం ఇక్కడ ఉన్న జైనమఠం అడ్రస్‌లో సంప్రదించవచ్చు.

వర్ణించతరమా..! షే లోయ అందాలు

Shey-Valley 
ఎప్పుడూ అల్లకల్లోలంగా ఉండే జమ్మూ ప్రాంతంలోని లడక్‌లో ఉన్న అందమైన గ్రామాల్లో ‘షే లోయ’ చెప్పుకోదగినది. లే ప్రాంతానికి 15 కి.మీ దూరంలో ఉన్న షే లోయలు లడక్‌ భూభాగాన్ని ఆక్రమించాయి. రాకీ పర్వతాల మధ్య భాగంలో కుడి వైపున ఉన్న అన్ని లోయల తరహా లోనే షే లోయలు కూడా కొలువు దీరి ఉన్నాయి.

సూర్యుడి ప్రతాపం, గాలి, నీటి ప్రవాహాలు, మంచు తదితర ప్రకృ తి అంశాల ఒరవడితో నేల కోతకు గురైన దృశ్యాలు ఈ ప్రాంతం నుం చి చక్కగా కనిపిస్తాయి. కూరగాయ లు, పళ్లను పండించేందుకు వేసవి కాలం అనువైనది.

ఇక్కడి మరో రమణీయమైన ప్రదేశం షే ప్యాలెస్‌. అన్ని ప్యాలెస్‌ ల లాగానే ఇది కూడా పర్వతాలపై నిర్మించబడింది. షే రాజు తప్పు చేసిన వారికి జైలు శిక్ష విధించే వారు కాదట. ఆయన బౌద్ధ స్థూపాలు నిర్మించాలని ఆదేశించి, నేరస్థులకు వైవిధ్యపూరితం గా శిక్షలు విధించేవారట. తద్వారా నేరస్థులు నేరాలను మాని, మంచి మార్గాన్ని అవలంబిస్తారని ఈ విధంగా ఆదేశించేవారట.

రాజ కుటుంబీకులు వింటర్‌ ప్యాలెస్‌గా వాడు కునే ఈ షే ప్యాలెస్‌ను 16వ శతాబ్దంలో నిర్మిం చారు. మట్టి, ఇటుకలు, చెక్క సామగ్రితో నిర్మిం చబడిన ఈ ప్యాలెస్‌ తర్వాతి కాలంలో స్టాక్‌కు బదిలీ చేయబడింది. ఈ ప్యాలెస్‌లోకి అడుగి డగానే లోహంతో చేసిన అందమైన స్థూపం దర్శ నమిస్తుంది. ప్రస్తుతం ఈ ప్యాలెస్‌ భారత పురా వస్తు శాఖ సంరక్షణలో ఉన్నది. ఆ ప్యాలెస్‌ లోని కొన్ని వస్తువులు వాడకంలో లేక శిధిలావస్థలో ఉన్నాయి. ఇక్కడ ఉన్న గౌతమ బుద్ధుని నిలువె త్తు విగ్రహం లడక్‌ అందాలకు, ఆనాటి రాచరిక వైభవానికి నిదర్శనంగా నిలుస్తున్నది.

Saturday, December 4, 2010

Hindu Temples Around the World


1. Lord Venkateshwara Temple, Birmingham, UK

Hindu Temples Around the World - Phani Kiran: World Informatives

2. Malibu Hindu Temple, Malibu, California, US
Hindu Temples Around the World - Phani Kiran: World Informatives

3. Shiva-Vishnu Temple, Livermore, California, US
Hindu Temples Around the World - Phani Kiran: World Informatives

4. Lord Vishnu Temple, Angkor, Cambodia

The largest temple of the world, raised during the reign of Suryavarman-II in 12th century, is, in fact, located in Angkor, a major archaeological site of Cambodia. It is dedicated to Lord Vishnu. It is also one of the two temples intact in Angkor, Cambodia. The other is a Buddhist Temple. The largest temple of Lord Vishnu in Angkor is built according to Khmer architecture, original to Cambodia.
Hindu Temples Around the World - Phani Kiran: World Informatives

5. Prambanan Shiva Temple, Central Java, Indonesia
Hindu Temples Around the World - Phani Kiran: World Informatives

6. Sri Venkateswara Swami Temple of Greater Chicago - Aurora, Illinois, US
Hindu Temples Around the World - Phani Kiran: World Informatives

7. BAPS Shri Swaminarayan Mandir - Toronto, Canada
Hindu Temples Around the World - Phani Kiran: World Informatives

8. Sri Siva Vishnu Temple, Washington DC, US
Hindu Temples Around the World - Phani Kiran: World Informatives

9. BAPS Shri Swaminarayan Mandir, London (Neasden Temple), US
Hindu Temples Around the World - Phani Kiran: World Informatives

10. Sri Murugan Temple Batu Caves, Penang, Malaysia
Hindu Temples Around the World - Phani Kiran: World Informatives

11. Sri Venkateswara Temple, Bridgewater, NJ, US
Hindu Temples Around the World - Phani Kiran: World Informatives

12. Mother Temple of Besakih, Bali, Indonesia
Hindu Temples Around the World - Phani Kiran: World Informatives

13. Murugan Temple, Sydney, Australia
Hindu Temples Around the World - Phani Kiran: World Informatives

14. Venkateswara Swami temple, Riverdale near Atlanta, Georgia, US
Hindu Temples Around the World - Phani Kiran: World Informatives

15. Sri Venkateswara Swami Temple, Helensburgh, Sydney, Australia
Hindu Temples Around the World - Phani Kiran: World Informatives

16. Velmurugan Gnana Muneeswarar Temple, Rivervale Crescent Sengkang, Singapore
Hindu Temples Around the World - Phani Kiran: World Informatives

17. Sri Meenakshi Devasthanam - Pearland, Texas, US
Hindu Temples Around the World - Phani Kiran: World Informatives

18. Ekta Mandir, Irving, Texas, US
Hindu Temples Around the World - Phani Kiran: World Informatives

19. Sri Venkateshwara Temple - New Jersey, US
Hindu Temples Around the World - Phani Kiran: World Informatives

20. Sri Lakshmi Temple - Ashland, MA, US
Hindu Temples Around the World - Phani Kiran: World Informatives

21. Sri Venkateswara Swami Temple, Pittsburgh, US
Hindu Temples Around the World - Phani Kiran: World Informatives

22. Shiva Vishnu Temple of South Florida Inc, FL, US
Hindu Temples Around the World - Phani Kiran: World Informatives

23. Shiva - Vishnu Temple of Melbourne, Melbourne, Australia
Hindu Temples Around the World - Phani Kiran: World Informatives

24. Sri Murugan Temple, London, UK
Hindu Temples Around the World - Phani Kiran: World Informatives

25. Quad City Hindu Temple , Rock Island, IL, US
Hindu Temples Around the World - Phani Kiran: World Informatives

26. Sri Prasanna Venkateswara Swami Temple, Memphis, Tennessee, US
Hindu Temples Around the World - Phani Kiran: World Informatives

27. Sri Srinivasa Perumal Temple, Singapore
Hindu Temples Around the World - Phani Kiran: World Informatives

Thank You !