హిమ శిఖరమంటేనే ప్రకృతి అందాలకు నెలవు. అలాంటి అందాల నడుమ సిమ్లా రాజధానిగా విరాజిల్లుతున్న హిమాచల్ ప్రదేశ్‌కి మధ్యలో ఉన్నదే మనాలి... అక్కడి అందాలను చూస్తే మనసుకు ఆహ్లాదం కలుగుతుంది. కాలుష్యానికి అలవాటుపడి ట్రాఫిక్ కూడళ్ల మధ్య చిక్కుకుపోయి, కాంక్రీట్ జంగిల్‌లో కాపురాలు చేస్తున్న హైటెక్ నగరవాసికి ప్రశాంత కూడలి... ఈ మనాలి. అందుకే దీనిని స్విడ్జర్లాండ్ ఆఫ్ ఇండియా అంటారు.
ఉత్తర భారతావనిలో ఘనమైన హిల్ స్టేషన్‌లలో ఒకటిగా చెప్పుకోదగిన కులు లోయ ప్రాంతానికి 32 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైనదే మనాలి. హిమాచల్ ప్రదేశ్ ముఖ్యపట్టణమైన సిమ్లాకు ఉత్తరాన 280 కిలోమీటర్ల దూరంలో ఉంది. సముద్ర మట్టానికి 2050 మీటర్ల ఎత్తులో... బియాస్ నది ఒడ్డున ఉంది. ప్రతి సంవత్సరం దేశ విదేశాల నుంచి టూరిస్టులు వచ్చిపోతుంటారు. మనాలికి మూడు కిలోమీటర్ల పరిధిలో వేడి నీటి కొలనులు ఉండటం విశేషం. చుట్టూ మంచు లోయల మధ్య వేడినీటి కొలనులు ఉండటం నిజంగా ఆశ్చర్యం కలిగించే అంశమే.
నాటి మనువాలయమే...
పూర్వం ‘మను’ అనే ముని నివసించిన ప్రాంతం కాబట్టి అతని పేరునే ‘మనాలి’గా ఏర్పడింది. అయితే ఒకప్పుడు దీనిని మనువాలయగా పిలిచేవారట. అంటే మను నివసించిన ప్రదేశం అని పేరు.
వాతావరణం...
మామూలుగా అయితే శీతాకాలంలో మైనస్ డిగ్రీల ఉష్ణోగ్రత ఉంటుంది. కాబట్టి ఆ సీజన్‌లో ఉన్ని దుస్తులు తప్పనిసరిగా వేసుకుని తిరగాల్సిందే. సమ్మర్‌లో మాత్రం సాధారణ ఉష్ణోగ్రతం ఉంటుంది. అందుకనే ఎక్కువగా పర్యాటకులు ఈ సీజన్‌లోనే ఈ ప్రాంతానికి వెళుతుంటారు. ఎటుచూసినా ఎత్తయిన కొండలు, లోయలు... దట్టమైన అటవీ ప్రాంతాలతో... ప్రకృతి అందాలను రెట్టింపుచేసేలా అందమైన పక్షుల కువకువ ధ్వనులతో అలరారుతుంటుంది. సంవత్సరమంతా సీజన్‌తో నిమిత్తం లేకుండా ఎప్పుడైనా సందర్శించవచ్చు.
సాహసవీరులకు సేదతీర్చే...
ఇక్కడికి వచ్చే ఔత్సాహిక మంచు స్కేటర్స్‌కి ప్రత్యేకంగా శిక్షణ పొందిన సహాయకుల పర్యవేక్షణలో స్కేటింగ్ ప్రాక్టీస్ చేసుకోవచ్చు. అప్పుడప్పుడు సినిమా షూటింగ్‌లు కూడా జరుగుతుంటాయి. సోలాంగ్ నుల్లా, రోహతాంగ్‌లా వ్యాలీప్రాంతాలు ఇక్కడ మంచు స్కయింగ్‌కి అనుకూలం. ఇక్కడ జనాభా మొత్తం 4,200 మంది ఉంటారు. ఇక్కడ ఎక్కువగా హిందీ, హిమాచల్, ఇంగ్లీష్ భాషలు మాట్లాడతారు.
దుస్తులు...
మనాలి ప్రజలు పొడవైన ఉలెన్ కోటు వేసుకుంటారు. దానిని ‘చోళ’ అని పిలుస్తారు. నడుముకు కట్టుకునే బెల్టులా ‘డోరా’ అనే వెయిస్ట్ క్లాత్ కట్టుకుంటారు. ‘సుతాన్’ అనే టైట్ ప్యాంట్లను వేసుకుంటారు. ‘టోప’ అనే బ్లాక్ క్యాప్‌ను ఎక్కువగా పెట్టుకుంటారు. ‘లాచూ’ అనే బుజాలు కప్పుకునే ఒకరకం బ్లాంకెట్ కూడా వేసుకుంటారు. ఇవన్నీ చలినుంచి రక్షించే సాధనాలే అవడం విశేషం.
ఆహారం...
వరి, గోధుమ ఇక్కడి ముఖ్య పంటలు. ఇక్కడి ప్రజలు కోద్ర, సత్యార వంటి ఎనర్జెటిక్ ఫుడ్‌ను ఆహారంగా తీసుకోవడం విశేషం. వీరికి టీ అంటే మక్కువ. ప్రతి ఇంటికి ఒక ఆవు ఉంటుందక్కడ. అందుకనే పాలతో తయారు చేసిన వెన్న, పెరుగు, లస్సీ వంటివి ఇక్కడ విరివిగా ఉపయోగిస్తారు. కులు మనాలి ప్రజలు బార్లీతో తయారుచేసిన ప్రత్యేకమైన వైన్, రెడ్ రైస్‌ను విందులు వినోదాల్లో తరచుగా తీసుకుంటారు. ఈ రెండింటినీ ‘చక్తి’, ‘లుగ్రి’ అని పిలుచుకుంటారు.
వసతులు...
లెక్కకి మిక్కిలిగా ఇక్కడికి వచ్చే యాత్రికుల సౌకర్యార్థం అనేక హోటళ్ళు ఉన్నాయి. ఎంత ఖర్చు పెడితే అంత... అన్నట్లుగా ఇక్కడ అన్ని వర్గాల వారి ఆర్థిక స్థోమతను బట్టి వారి వారి అభిరుచుల మేరకు అన్ని వసతులను అందజేస్తుంటాయి ఇక్కడి హోటళ్ళు. అంతేకాకుండా అన్ని రాష్ట్రాలకు చెందిన వంటకాలను కూడా అందజేయటం ఇక్కడి హోటల్ యాజమాన్యాల ప్రత్యేకత. టూరిస్ట్‌లు కూడా వారి వారి రేంజ్‌ను బట్టి వారికి కావలసిన హోటళ్లలో దిగుతుంటారు.
ఎలా వెళ్లాలంటే...
మనాలికి దక్షిణాన 52 కిలోమీటర్ల పరిధిలో భూంటార్ ఎయిర్‌పోర్ట్ ఉంది. అక్కడినుంచి మనాలి నుంచి ఢిల్లీ వయా సిమ్లాకు విమాన సౌకర్యం ఉంది. 135 కిలోమీటర్ల పరిధిలో జోగీందర్‌నగర్ నుంచి నేరో గేజ్ లైన్ రైలు సౌకర్యం ఉంది. బ్రాడ్ గేజ్ లైన్ చంఢీఘఢ్ దాకా ఉంది. చంఢీఘఢ్ నుంచి 310 కి.మీ.దూరం. ఢిల్లీ నుంచి మనాలి వరకు రోడ్డు సౌకర్యం ఉంది. వీటి మధ్య 585 కి.మీ. దూరం ఉంది. మనాలి నుంచి సిమ్లాకు 270 కి.మీ. దూరం. బస్సు సౌకర్యం ఉంది.
చూడదగిన ప్రదేశాలు బిజిలీ మహదేవ్ దేవాలయం...
సముద్ర మట్టానికి 2460 మీ ఎత్తులో... కులు ప్రాంతానికి 10 కి.మీ. దూరంలో ప్రఖ్యాత బిజిలీ మహదేవ్ దేవాలయం ఇక్కడ పర్యాటకులకు కనువిందు చేస్తుంది. ముఖ్యంగా కులు ప్రాంతంలో ఉన్న లోయల్లో మౌంటెనైఉ టెక్కర్స్‌కి ఆహ్లాదంగా ఉండటమే గాక వాళ్లలోని సాహసాపేక్షను ఈ ప్రాంతంలో పర్వతాలను అధిరోహించి మరీ తీర్చుకుంటుంటారు.
హిడింబి దేవాలయం...
అన్నింటికన్నా ఆశ్చర్యం కలిగించే అంశం ఏమిటంటే ఇక్కడ భారతంలో ఘటోత్కచునికి తల్లి... భీమునికి భార్య అయిన రాక్షస సంతతికి చెందిన హిడింబికి దేవాలయం ఉండటం. పైగా పెద్ద ఎత్తున పర్యాటకులు ఇక్కడికి వచ్చిపోవడం మరో విశేషం. దేశంలో ఎక్కడా లేని విధంగా ఒక రాక్షసికి దేవాలయం కట్టడం మనం ఇక్కడ మాత్రమే చూడగలం. గుడి చాలా పురాతన కట్టడంలా ఉంటుంది. ఒక గుహలో ఉంటుంది. నిత్యం అక్కడ అగ్నిహోత్రం వెలుగుతూనే ఉండటం విశేషం. కొండ చుట్టూ మంచుతో కప్పి ఉంటుంది. ఎత్తయిన కొండలపై మరింత ఎత్తుగా చెట్లు ఆకాశంలో మబ్బులను తాకేలా ఉండటం విశేషం.
రహల్లా జలపాతం...
సముద్ర మట్టానికి 2501 మీటర్ల ఎత్తులో మనాలికి 16 కిలోమీటర్ల దూరంలో రోహతాంగ్ కనుమ ప్రాంతంలో పర్యాటకులు నయాగారా జలపాతం చూసిన అనుభూతిని పొందుతారు. మనాలికి మూడు కిలోమీటర్ల దూరంలోవాయువ్య దిశలో ఓల్డ్ మనాలి ప్రాంతం ఉంది. అక్కడ పురాతన కోటలు... సంప్రదాయ మను దేవాలయం చూడదగిన ప్రదేశాలు. వీటన్నితో మనాలి దేశంలోనే అత్యంత ప్రీతిపాత్రమైన పర్యాటక కేంద్రంగా విరాజిల్లుతోంది.

కర్టసీ : సూర్య Daily
No comments:
Post a Comment