కార్గిల్.. ఈ పేరు చెబితే.. యుద్ధ వాతావరణం కళ్ళముందు కదలాడుతుంది. హిమాలయ పర్వతాల నడుమ.. పాకిస్తాన్ వాస్తవాధీన రేఖకు అతిచేరువలో ఉన్న ఈ ప్రాంతానికి వెళ్లాలంటే.. ఎవరైనా ఒకటికి రెండుసార్లు ఆలోచిస్తారు. ఎందుకంటే.. అక్కడ ఎప్పుడు ఎలాంటి పరిస్థితిని ఎదుర్కోవాల్సివస్తుందోనని ఒకింత భయంతో వెనకడుగు వేస్తారెవరైనా.. అయితే.. ఇది నాణేనికి ఒకవైపు మాత్రమే. మరో పార్శ్వాన్ని స్పృశిస్తే.. కార్గిల్ ప్రకృతి అందాల కన్నె పడుచు. హిమాలయాల ఒడిలో ఉన్న కార్గిల్ పూర్వం నుంచి వాణిజ్య వ్యాపారాలకు ఖ్యాతి గాంచింది. శ్రీనగర్‌కి పశ్చిమాన 204 కిలోమీటర్ల దూరంలో, సముద్రపు ఒడ్డునుంచి 2704 మీటర్ల ఎత్తులో ఈ నగరం ఉంది. కాశ్మీర్-చైనా వ్యాపార సంబంధాలకు ఈ నగరం పునాది. 1949లో కేంద్రీయ ఆసియా వ్యాపారం సమాప్తం అయిన తరువాత కూడా ఇక్కడి పాతబజారులో ఆసియా, టిబెట్ వస్తువులకి అధిక డిమాండ్ ఉంది. హిమాలయ పర్వతశ్రేణుల మధ్య కార్గిల్ ఉండటంతో పర్యాటకులకు ఆసక్తికరమైన యాత్రాస్థలంగా ఉంది. ఇక్కడ బార్లీ, గోధుమలు, వివిధరకాల కూరగాయలను పండిస్తారు.
ఎన్నెన్నో ప్రత్యేకతలు...
ఇక్కడ ట్రైనింగ్, క్యాంపింగ్, నౌకాయానంతో పాటు పర్వతారోహణ సౌకర్యాలు కూడా ఉన్నాయి. ఇక్కడి ఒకరోజు ప్రయాణం తరువాత సురూఘాట్ చేరుకుని హిమాలయ పర్వతాలను చూడవచ్చు. కార్గిల్ నుంచి గోమా కార్గిల్ మధ్య రెండు కిలోమీటర్ల ప్రయాణంలో ఉత్కంఠభరితమైన దృశ్యాలు అబ్బురపరుస్తాయి. అంతేకాకుండా సరూ నదిపై ఉన్న పాత వంతెన మీదుగా ‘పోయెన్’ గ్రామాన్ని చేరుకోవచ్చు. దీని అవతలి వైపు వాఖా నది ఉంది. కార్గిల్ మార్కెట్‌లో పొగాకుతో పాటు హుక్కా కూడా దొరుకుతాయి. రోజువారీ వస్తువులతోపాటు పర్వతారోహణకు అవసరమైన వస్తువులను కూడా ఇక్కడ అమ్ముతారు. యాత్రికుల అవసరాలకు అనువైన వస్తువులన్నీ లభ్యమవుతాయి. ఈ మార్కెట్‌లో వస్తువుల కొనుగోలుకి మధ్యాహ్న వేళలో వెళితే సికిందర్ సైన్యంలో భాగమైన మినారోజ్ ప్రజాతివారిని కూడా చూడవచ్చు.
ఇక్కడ చూడాల్సినవివే...
మలబేక్ చంబా: ఈ ప్రాంతంలో 9 మీటర్ల ఎత్తున్న పెద్ద రాతి బండ ఉంది. దీనిని మైత్రేయ్ అని అంటారు. ఇది బౌద్ధ కళకు ఉత్కృష్టమైన తార్కాణం.
మల్‌బేక్ గోంపా: ఇది ఈ ప్రాంతంలో అతి పెద్ద రాతి బండ. ఇది ప్రాచీన కాలంలో యాత్రీకులకు దారి చూపేదట.
షెగాల్: వాఖా నదీ తీరాన ఉన్న ఈ ప్రాంతపు ప్రత్యేకత ఇక్కడ ఉన్న ఓ గుహ. మరొకవైపు నుంచీ చూస్తే ఇది ఓ చిన్న రంధ్రాన్ని పోలి వుంటుంది.
ఉరమ్యాన్ జాగ్: పెద్ద పెద్ద పర్వతాలతో ఉన్న ఈ ప్రదేశంలో పూర్వం బౌద్ధమతస్తులు ధ్యానం చేసుకునేవారు.
ఇక్కడికి ఎలా చేరుకోవాలి?
జమ్మూ-కాశ్మీర్ పర్యాటక సంస్థ, శ్రీనగర్ నుంచి లేహ్ వరకు నిర్ణీత బస్సు లను నడుపుతోంది. అం తేకాకుండా శ్రీనగర్, లే్‌హ నుంచి కార్గిల్ వర కు టాక్సీలు కూడా ఉం టాయి. మల్‌బేక్ చేరు కోవడానికి టాక్సీ, జీప్‌లు కూడా అందుబాటులో ఉంటాయి.
No comments:
Post a Comment