ఇది కొండ పైనున్న వైల్డ్ లైఫ్ శాంక్చ్యువరి. అల్మోరాకు 33 కి.మీ. దూరంలో ఉంది. 7913 అడుగుల ఎత్తున ఉంది. జాతీయ రహదారి ఖురాంపూర్ వయా హవూర్, జయ, మొరాదాబాద్‌ల మీదుగా, జాతీయ రహదారి 87 కతగూడెం, రాష్ట్ర కపర్‌ఖాడ్ వయా భోవాలి, ఖైర్నా, అల్మోరా, జిల్లా రహదారి బిన్సార్‌కు చేరవచ్చు.
ఇది ప్రశాంత వాతావరణంలో కమాన్‌లో ఉన్న వైల్డ్ లైఫ్ శాంక్చ్యువరి. ఇక్కడ పక్షుల కిలకిలారావాలు యాత్రికులను పొద్దున్నే నిద్రలేపుతాయి. నిమిషాల్లోనే వాటిలో అవి సంభాషించుకొని వెళ్ళిపోయాయా అన్నట్లు వెళ్ళిపోయి నిశ్శబ్దాన్ని కలిగిస్తాయి. బిన్సార్ దగ్గరవుతున్న కొద్ది చల్లదనం, ఆహ్లాదాన్ని పొందవచ్చు. సంతోషాన్ని కలిగించే సుగంధం, ఓక్‌లు, దేవదార్ చెట్లు దగ్గరి నుంచి చూడవచ్చు. ఇది ఎన్నో సుందరవిహార, విలాస కేంద్రాల ద్వారా యాత్రికులకు, పర్యాటకులకు ఆనందాన్ని పంచి ఇస్తుంది. కేదారనాథ్, బదరీనాథ్, శివలింగం, త్రిశూల్, నందాదేవి శిఖరాలలో సరిసమానంగా తులతూగుతున్నది.
ఇక్కడ 166 రకాల పక్షి జాతులున్నాయి. ఇది పక్షిపర్యవేక్షకులకు స్వర్గధామం. లాఫింగ్‌త్రాష్, స్పాటెడ్ క్లోవ్, లార్డ్‌పైడ్, వాగ్‌టైల్, ఎల్లోబాక్‌డ్ సన్‌బర్డ్ పక్షి, వైట్‌కాప్‌డ్, రెడ్‌స్టార్ట్ ఇంకా ఎన్నో రకాల పక్షులతో ఎన్నో రంగురంగుల సీతా కోక చిలుకలు ఎంతో అందంగా ఉంటూ ఆహ్లాదంగా ఉంటుంది. ఇక్కడ చిరుత పులులు కూడా ఉన్నాయి.
అల్మోరా...
ఇదిక్కడకు 35 కి.మీ. దూరంలో ఉంది. ఎంతో తక్కువ ఎత్తు అయినా ఎక్కేందుకు గంటల తరబడి కష్టపడాల్సి ఉంటుంది. ఎందుకంటే సుళ్ళు తిరిగే గాలులు వెనక్కుతోసెయ్యటమే కారణం. ముందుకు మూడడుగులు వేస్తే వెనక్కు వెయ్యి అడుగులు అంటే అక్కడ గాలి శక్తి ఎంతటిదో తెలుస్తోంది.
ఇక్కడి పబ్లిక్ మ్యూజియంలో ప్రపంచంలోనే అతి అపురూపమైన ‘ఐపెన్’ జానపద చిత్రకళ ప్రదర్శన. ఇంకా ఎన్నో కళా సంపదలు చూడవచ్చు. అల్మోరాకు 8 కి.మీ. దూరంలో ఇటై గుడి ఉంది. ఇది కుమాన్‌ల దేవత. అల్మోరాలో ఎన్నో షాపింగ్ సెంటర్లున్నాయి. ఇందులో 200 ఏళ్ళనాటి బజారు కూడా ఉంది. అల్మోరాకు వచ్చిన తరువాత నందాదేవి మేళా ప్రతి సంవత్సరం జరుగుతుంది. ఇది వందేళ్ళనాటి నుండి జాతర జరుగుతున్నది.
జగేశ్వర్...
ఇది బిస్సార్‌కు 66 కి.మీ. దూరంలో ఉంది. ఇది లకులశైవానికి కాణాచి. ఇది 8వ జ్యోతిర్లింగం. ఈ ఆలయాలు 8వ శతాబ్ధి నుండి 18వ శతాబ్ధి వరకు కట్యూరి వంశం, చండ్ వంశం వారు నిర్మించారు. దీనికి ప్రధానాకర్షణ ఆలయ సముదాయం. ప్రధాన ఆలయాలలో మృత్యుంజయ లింగం ముఖ్యమైంది. ఇది స్వయంగా జ్యోతిర్లింగం. దండేశ్వర ఆలయ సముదాయం. ఇంకా కొంచెం దూరంలో వృద్ధ జోగేశ్వర ఆలయముంది.
జూ పాయింట్....
ఇది 25 కి.మీ. దూరంలో వ్యూయింగ్ టవర్ మీద నుంచి అనేక రకాల పక్షులతో పాటు సూర్యాస్తమయాన్ని చూస్తాము. ఖలీ ఎస్టేట్ మొదట్లో హెన్రీరామ్ సెసె, జవహర్ నెహ్రూ దీన్ని సందర్శించారు. రవిశంకర్ , ఎంజి పాండేల పాదస్పర్శ ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలతంతో పాటు సంగీత వాయువులను సుసంపన్నం చేస్తున్నది. ఇక్కడ అంతులేని సమాచారముంది అదంతా పూలు పళ్ళు జంతువులకు సంబంధించినది. ఇక్కడకు 25 మైళ్ళ దూరంలో హిమాలయాల వైపు చూస్తే సూర్యోదయం, సూర్యాస్తమయ దృశ్యాలు ఎంతో హృద్యంగా ఉంటాయి.
- Courtacy - సూర్య Daily
No comments:
Post a Comment