పర్యాటక రంగం అనగానే మనకు గుర్తుకు వచ్చేది హిమలయ పర్వాతాలే. హిమలయ పర్వాతాలను ఆనుకుని ఉండే నేపాల్ అందాలను చూడడానికి పర్యాటకులు ఎక్కువగా ఆసక్తి కనపరుస్తుంటారు. నేపాల్ వెళ్లి న వారికి ఎప్పుడెప్పుడు వెళ్లి చూద్దామా అనిపించే ప్రాంతం పోఖారా. నేపాల్‌లోని అత్యంత పవిత్ర పర్వతం అన్నపూర్ణ పర్వతం. ఆ పర్వత ప్రాంతంలోనే ఉంది ఫోఖారా. ఇక్కడి మత్య్సపుత్స పర్వతం చూడడం ఒక వింతైన అనుభవం. చేపతోక ఆకారంలో ఆ పర్వాతాలు కనిపిస్తాయి. వేకువజామునే లేచి సూర్యోదయ కిరణాల వెలుగులో అన్నపూర్ణ పర్వత అందాలను తిలకిం చడం మరవలేని అనుభూతిని మిగుల్చుతాయి.
సూర్యుని తొలి కిరణాలకు వెలుగులు ప్రారంభించి సమయంతో పెరిగే సూర్యకిరణాలకు తగిన రీతిలో వెలుగులు విరాజిమ్మే ఆ శిఖరాలను దర్శించిన తర్వాతే మిగిలిన ప్రదేశాలవైపు కళ్లు తిప్పగలం. ఫోఖారాలో ఉన్న ఒక గుహ ప్రత్యేకమైనది. ఇది గుప్తేశ్వరమహాదేవుని నిలయం. దాదాపు 140 మీ పొడవున్న గుహ అది. ఆ గుహనుంచి ప్రయాణిస్తూ బయటకు చేరుకోగానే పాల రంగులో పడుతున్న జలపాతం దర్శనమిస్తుంది. దాని పేరు దేవీజల పాతం. హిమలయాలనుంచి జారిపడే అనేక జలపాతాలలో ఇది అందమై నది. ఇక్కడికి సమీపంలో ఉన్న ఫేవా సరస్సులో పడవులలో ప్రయాణిం చవచ్చు. ఎవరికి వారు నడుపుకుంటూ వెళ్లే పడవల సౌకర్యం ఇక్కడ ఉంది.
పర్వతాల మధ్య ప్రశాంతం గా ఉన్న సరస్సులో పడవ ప్రయాణం ఎంతో ఆనం దంగా ఉంటుంది. సూర్యోదయ సమయంలో అన్నపూర్ణ పర్వత ప్రాంతాల అందాలను అనుభ వించిన వారికి సూర్యస్తమయ సమయంలో ఆ అందాలను తిలకించాలని అనిపించడం సహ జం. ఆ మధురానుభూతిని తిలకించాలంటే శాంతి శిఖరం ఎక్కి తీరాల్సిందే.
ప్రపంచ శాంతిని కోరుతూ నిర్మించిన ఈ శిఖరం ఒక పర్వతం అంచున ఉంటుంది. అక్కడ నిలబడి పశ్చిమం వైపున తిలకిస్తుంటే సూర్యుడు ఎంతసేపటికీ కిందికి దిగుతున్నట్లు అనిపిం చదు. సూర్యుడు పర్వతాలోకి వెళ్లగానే ఆ ప్రాంతమంతా ఒక్కసారిగా చీకటిగా మారుతుంది. ఒక్కసారిగా ఆ ప్రాంతమంతా నిశ్శబ్దం రాజ్యమేలుతుంది.
మరో సాహసం అక్కడి పర్వాతాల మీద తేలికపాటి విమానంలో ఎగరటం. ఇది ఒక చిన్న తొట్టిలాంటి విమానం. అందులో నడిపే పైలెట్ కాక మరొకరు మాత్రమే కూర్చోగలరు. ఇది ఒక గ్లైడర్‌కు కలిపి ఉంటుంది. గ్లైడర్ అంటే ఎతె్తైన ప్రదేశం నుంచి కిందికి నెమ్మదిగా జారు కుంటూ వచ్చే రెక్కల వంటి నిర్మాణం. ఇది కూడా అదే పద్ధతిలో నెమ్మదిగా పర్వతాల మీద ఎగురుతూ కిందికి దిగుతుంది. ఇది మరువ లేని అనుభవం. బంగీజంప్ చేయడానికి కూడా ఇక్కడ సౌకర్యాలున్నాయి. ఇటీవల అనేక సినిమాల్లో ఇలాంటి సాహస దృశ్యాలను పెడుతు న్నారు. అయితే దీనికి కొంత గుండ ెధైర్యం కావాలి. మనం చేసే బంగీ జంప్‌ను చిత్రీకరించి అప్పటిికప్పుడే డీవీడిగా చేసి ఇచ్చే సౌకర్యం కూడా ఉంది. అక్కడి అనేక దృశ్యాలను కూడా డీవీడీల రూపంలో మనం తెచ్చుకోవచ్చు. వాటిని తిలకిస్తూ మధురానుభూతిని పొందవచ్చు.
No comments:
Post a Comment