సోదరులు పవిత్రస్థలమైన మక్కాలో ప్రపంచంలోనే ఓ అరుదెైన ఆవిష్కరణ రూపుదిద్దు కుంది. గత బుధవారం ప్రారంభించిన ఆ అరుదెైన కట్టడం ఇప్పుడు పర్యాటకులను విశేషం గా ఆకట్టుకుంటోంది. ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా ఎన్నో క్లాక్ టవర్స్ ఉన్నాయి. వాటన్నింటినీ తల దన్నే రీతిలో మక్కాలో ఇప్పుడు ప్రపంచంలోనే ఎతైన క్లాక్ టవర్ గా గుర్తింపు పొందింది. ముస్లింలు ప్రతిరోజు 5 సార్లు నమాజ్ చేస్తారని అందరికీ తెలిసిన విషయమే... అయితే నమాజ్ టైం కాగానే టంచనుగా మోగుతూ ముస్లిం సోదరులను నమాజ్‌కు సన్నద్ధం చేయడం ఈ బడా గడియారం ప్రత్యేకత.
అబ్రాజ్ అల్ - బెయిట్ టవర్స్‌గా నామకరణం చేసిన ఈ క్లాక్ టవర్ అలారం నమాజ్ టైం కాగానే మోగుతుంది. మక్కాలోని పవిత్రస్థలం కాబా కు దగ్గరలో నిర్మించబడిన ఈ క్లాక్ టవర్ కు నాలుగు వెైపులా ఒకే రకమైన సైజులో గడియారాలు తీర్చిదిద్దారు. ఈ గడియారాలు ఒక్కొక్కటి 43 చమీల వ్యాసార్ధాన్ని కలిగి ఉంటాయి. అబ్రాజ్ అల్ - బేయిట క్లాక్ టవర్ నమాజ్‌ను సమాయాన్ని గుర్తుచేసే... ప్రపంచంలోనే అతిపెద్ద క్లాక్‌టవర్ కావడం విశేషం. మక్కాలోని ‘హోలీ గ్రాండ్ మాస్క్’కు అభిముఖం గా ఉన్న ప్రపంచంలో రెండవ ఎతె్తైన హోటల్ పెై అంతస్థు నుండి 400 మీటర్ల ఎత్తులో ఈ క్లాక్ టవర్‌ను నిర్మించారు.
ఈ పవిత్ర మక్కా క్లాక్‌ను సౌదీ అరేబియా రాజు అబ్దుల్లా బిన్ అబ్దుల్ అజీజ్ అల్ - సౌద్ ఆదేశాల మేరకు నిర్మించారు. 90 మిలియన్ల రంగు గాజు ముక్కలను ఈ క్లాక్ నిర్మాణంలో వాడడం విశేషం. గడియారం నాలువెైపులా పెద్ద పెద్ద అక్షరాలతో ‘అల్లా’ అని ముద్రించి ఉంటుంది. ఈ అక్షరాలు సౌదీ నలుమూలల నుండి దర్శనమిస్తాయి.
సౌదీ రాజు అబ్దుల్ అజీజ్ ఎండోమెంట్ హోటల్ కాంప్లెక్స్‌కు ఈ క్లాక్ టవర్ ఒక ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నది. ఈ హోటల్‌ను ప్రైవేట్ సౌదీ బిన్‌లాడెన్ గ్రూప్ నిర్మించింది. ఇది ప్రపంచంలోనే విశాలమైన ఫ్లోర్ ఏరియా కలిగిన హోటల్‌గా గుర్తింపు పొందింది. సౌదీ మీడియా గణాంకాల ప్రకారం ఈ క్లాక్ టవర్ నిర్మాణానికి 3 బిలియన్ల అమెరికన్ డాలర్లు ఖర్చు చేశారట.
601 మీటర్ల ఎతె్తైన టవర్ మీద ఈ గడియారాన్ని ప్రతిష్టించారు. ఇది ప్రపంచంలోనే రెండవ అత్యంత ఎతె్తైన టవర్ కావడం గమనార్హం.
‘‘పవిత్ర స్థలం హోలీ మాస్క్ కు ఎదురుగా ఉండడం వల్ల ఇందులో ప్రపంచ ప్రామాణిక కాలం బదులు మక్కా టైమ్ ను సెట్ చేశారు. ఇది ప్రపంచంలోని ముస్లింలందరికీ ప్రతీకగా నిలుస్తుంది’’ అని తరుచూ మక్కాను సందర్శించే జెడ్డా నివాసి అయిన హషీమ్ అద్నాన్ తన ఆనందాన్ని వ్యక్తపరిచాడు.
ప్రపంచం నలుమూల నుండి ప్రతియేటా హజ్ యాత్రకు కొన్ని లక్షల మంది యాత్రికుల వస్తుంటారు. వీరి తాకిడి తట్టుకోవడానికి మక్కా పాత నగరాన్ని సుందరంగా తీర్చి దిద్దే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది సౌదీ ప్రభుత్వం. అందులో భాగంగానే ఈ క్లాక్ టవర్ నిర్మాణాన్ని చేపట్టారు. ప్రతి ముస్లిం జీవితంలో ఒక్కసారెైనా మక్కాను సందర్శించాలని కోరుకుంటాడు. దీనివల్ల ప్రతి సంవత్సరం హజ్ యాత్రికుల తాకిడి పెరుగుతుందే కానీ, తగ్గడం లేదు. ప్రతిసంవత్సరం సుమారు 20 లక్షలకు పెైగా హజ్ యాత్రికులు మక్కాను సందర్శిస్తారు. మిగతా టైంలో... సంవత్సరం అంతా కలిపి మక్కాను సందర్శించే యాత్రికుల సంఖ్య సుమారు 35 లక్షలు ఉంటుంది.
ఒకవెైపు ఈ క్లాక్ టవర్ ప్రతిష్టాపన పట్ల కొందరు మక్కా సందర్శకులు ఆనందాన్ని వెలిబుచ్చుతుంటే... మరికొందమంది మాత్రం... మాస్క్‌కు అతి దగ్గరగా నిర్మించిన ఈ కట్టడం మక్కాలోని ఆద్యాత్మికత దెబ్బతీస్తుందేమననే అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు.
‘‘ఎంతో వ్యయప్రయాసలకోర్చి ఎంతో మోడ్రన్‌గా నిర్మించిన ఈ క్లాక్ టవర్ మక్కాలోని ఆద్యాత్మిక వాతావరణానికి ఆటంకం సృష్టించే అవకాశం లేకపోలేదు. ఈ క్లాక్ టవర్ ప్రపంచవ్యాప్త గుర్తింపు పొందితే పొందవచ్చు కానీ, గ్రాండ్ మాస్క్, కాబాలే మక్కాలో అత్యంత గుర్తింపు ఉన్న ప్రదేశాలని నేను భావిస్తాను’’ అని తరుచూ మక్కాను సందర్శించే లినా ఎడ్రిస్ అనే మహిళ ఒకరు తన భక్తిని చాటుకుంది.
ఏదేమైనా ఈ క్లాక్‌టవర మక్కాకు ఆద్యాత్మికతతో పాటు పర్యాటకశోభ మరింత పెంచుతుందనడంలో ఎటువంటి అతిశయోక్తిలేదు.
No comments:
Post a Comment