ఆదిలాబాద్ జిల్లా ప్రకృతి రమణీయతకు పుట్టినిల్లే కాదు పలు విశేషాలు చారిత్రాత్మక స్థలాలకు నిలయం. ఒకప్పుడు దండకారణ్యంలో అంతర్భాగమైన ఆదిలాబాద్ జిల్లా చరిత్ర ఎంతో ఆసక్తికరంగా ఉంది. రాకాసి బల్లులు నడయాడిన నేల ఇది. సామ్రాజ్యాలు ఏర్పాటు చేయడానికి ముందు ఇక్కడి ఘనరాజ్యాలు, నగర రాజ్యాలు ఉండేవి. నేటి కుబీర్, బెైంసా, నేరడిగొండ, మండలం వడూర్ ఘన రాజ్యాలుగా ఉండేవి, వేటికవే స్వతంత్ర దేశాలుగా ఆనాడు వెలసిల్లాయి. మైసాపూరం, కూబీర్ పురం మద్య తరుచు యుద్ధాలు జరిగేవని పురాణాలు చెబుతాయి. కళింగ దేశం రాజు ఖారవేలుడిని తీసుకు వచ్చి విజయం సాధించారు. మౌర్యులు, శుంగులు, కలియులు, పశ్చిమ చాణుక్యులు, రాష్టక్రూటులు, కళ్యాణి చాళుక్యులు, దేవగిరి జాదవ రాజులు కాకతీయ గొండు రాజులు, బహమనీ సుల్తానులు, మహ్మద్ నగర్, నిజాం సాహిద్, గోల్కొండ నవాబులు, మరాఠాలు, హైద్రాబాద్ అసఫ్‌జాహీ వంశీకులు ఈ ప్రాంతాన్ని పాలించారు. చారిత్రకంగా ఎంతో ప్రసిద్ధిగాంచిన ఈ జిల్లా నేటికీ ప్రకృతి రమణీయతతో అలరారుతోంది...
అసఫ్‌జాహీ కాలంలో ప్రస్తుతం జిల్లాకు రూపు రేఖలు ఏర్పడ్డాయి. నిజాం కాలంలో ఈ ప్రాంతం సిర్పూర్, తాండూర్ ఉప జిల్లాగా ఉండేది. 1905 లో ఆదిలాబాద్ జిల్లా స్వతంత్ర జిల్లాగా ఏర్పడింది. అంతకు ముందు ఆసిఫాబా ద్ జిల్లాగా కొనసాగింది. నాటి నుంచి ఆదిలాబాద్ అంటేనే అడవుల జిల్లా.. ప్రకృతి అంద చందాలకు నిలయాలు ఇక్కడి అభయ అరణ్యాలు. వాటర్ ఫా ల్స్, ప్రకృతి రమణీయతను చాటుతుంటాయి. కవ్వాల్ అభయ అరణ్యాలు జం తువులకు ఆలవాలం అయిన ప్రాణహిత బ్లాక్, శివారం అభయ అరణ్యం లోగి లి, ఆదిలాబాద్ సెలయేటి గలగలలు, పక్షుల కిల కిల రావాల నడుమ వన్య ప్రాణులు సంచరిస్తుంటాయి. వన్య ప్రాణులకు ఇక్కడ కొదవ లేదు. పులులు, ఎలుగు బంట్లు, నిల్వాయిలు, చిరుతలు, దుప్పులు, నెమళ్ళు, లేళ్లు, నక్కలు, కొండ చిలువలు తదితర వన్య ప్రాణులతో పాటు టేకు, జిట్రేగి, వెదురు మొ దలగు అపారమైన అటవీ సంపద విస్తారంగా ఉంది.
కుంటాల జలపాతం... : ఆదిలాబాద్ జిల్లాలో సహజ సిద్దమైన అం దమైన జలపాతాల్లో కుంటాల ఒకటి. రాష్ట్రంలోనే ఎతె్తైన జలపాతాల్లో కుంటాల జల పాతం మొదటిది. పూర్వం శకుంతల దుష్యంతుల విహార కేంద్రంగా ఉండేదని పూర్వీకులు చెబుతుంటారు. దీన్ని ముందుగా శకుం తల జలపాతంగా పిలిచే వారు క్రమేణా కుంతల జలపాతంగా ప్రస్తుతం కుంటాల జలపాతంగా పిలు స్తున్నారు. కారడవుల మధ్య సందర్శకులను విశేషంగా ఆకట్టుకుంటుంది.
హైదరాబాద్, నాగ్‌పూర్ ఏడవ జాతీయ రహదారిలో ఉన్న నేరడిగొండ మండల కేం ద్రం నుంచి 12 కిలో మీటర్ల దూరంలో ఈ జలపాతం ఉంది. గోదావరి ఉప నది అయిన కడేం వాగు సహ్యాద్రి పర్వత పంక్తులపెై 40 మీటర్ల (138 ఫీట్లు) ఎత్తు నుంచి జాలువారుతూ కుంటాల జలపాతంగా మారుతుంది. జలపాతం దూకే చోట చిన్న రాతి గుహ ఉంది. అందులో సోమేశ్వరుడు, నంది, పాన వట్టం ఉన్నాయి. ఏక కాలంలో ఒకరు మాత్రం వెళ్లగలిగే వీలు ఉన్న ఈ గుహలో 10 మంది వర కు కూర్చో వచ్చు. జలపాతం దిగువన కుడి వెైపున చెట్టుకింద కాకతీయుల నాటి దేవత విగ్రహాలు కనిపిస్తాయి. ప్రస్తుతం ఇది పర్యటక ప్రాంతంగా ప్రకటించడంతో సూదూర ప్రాం తాల నుంచి సందర్శకులు వచ్చి ఇక్కడి అడవుల అందాలను తిలకించి మంత్ర ముగ్ధులవు తున్నారు. రాష్ట్ర ప్రభుత్వంతో పాటు జిల్లా అధికార యంత్రాంగం వచ్చి పోయే పర్యటకుల సౌకర్యార్థం అన్ని వసతులను కల్పిస్తుంది.
పోచ్చెర జలపాతం... : ఈ జలపాతం చిన్నదే అయినప్పటికి ఎంతో ఆకర్షణీయంగా కనిపి స్తుంది. జాతీయ రహదా రి పక్క నుంచి బోథ్‌కు వెళ్లే మార్గంలో కిలో మీటర్ దూరంలో ఈ జలపాతం ఉంది. పొచ్చర అనే గ్రామ సమీపంలో చిన్నకొండ వాగు రాళ్ల పెై నుంచి దూకే ఈ దృశ్యం చూడ చక్కగా కనిపిస్తుంది. ఏ కాలంలోనెైన పోచ్చర జలపాతానికి చేరుకోవచ్చు. పర్యటకులు ఏ వేళలోనెైన అక్కడికి వెళ్లి జలపాతం అందాలను తిలకించవచ్చు. ఒకప్పుడు ఎలాంటి సౌకర్యాలు లేక పోగా ప్రస్తుతం అధికారులు సందర్శకుల సౌకర్యార్థం అన్ని ఏర్పాట్లను చేశారు.
నిర్మల్ కొయ్య బొమ్మలు... : కళలకు కళాకారులకు ప్రసిద్ది గాంచినదే నిర్మ ల్ ప్రాంతం. ప్రాణం లేని బొమ్మలకు నిర్మల్ కొయ్యబొమ్మల తయారీ కళాకా రులు నిర్జీవమైన ప్రతిమలకు ప్రాణం పోస్తున్నారు. జీవం ఉట్టిపడేలా ఆకృ తు లను తయారు చేస్తూ ఆకట్టుకుంటున్నారు. గేట్ ఆఫ్ ఆదిలాబాద్‌గా నిర్మల్ పేరు గాంచింది. అచ్చంగా కూరగాయలు, పండ్లు, పక్షుల మాదిరిగా ఎన్నో రకా ల బొమ్మలు ఇక్కడి కళాకారులు తయారు చేస్తున్నారు. ప్రపంచ వ్యాప్తంగా ప్రసిద్ది గాంచిన ఈ బొమ్మలను దగ్గరకు వచ్చి చూస్తే గాని అవి కొయ్య బొమ్మలుగా గుర్తించలేము. రాష్ట్రంలోనే కాకుండా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఈ కొయ్య బొమ్మలు ప్రసిద్ది గాంచాయి. పెయింటింగ్‌లకు పెట్టింది పేరుగా నిర్మల్‌ను చెప్పుకొవచ్చు. కాకతీయ కళాతోరణం, చారిత్రక చార్మినార్‌తో పా టు జాతీయ నాయకుల కళా రూపాలు తయారిలో మంచి ప్రావీణ్యం ఇక్కడి కళాకారులు సంపాదించారు. వీరి చేతిలో రూపుదిద్దుకున్న బొమ్మలు దేశ విదే శాలకు ఎగుమతి అవుతున్నాయి.
ఈ బొమ్మలను పొనికి కరత్రో తయారు చేస్తారు. ప్రస్తుతం జిల్లాలో అడవులు అంతరిస్తున్నందున ఈ పొనికి కర్ర దొర కడం కష్టంగా మారింది. కళాకారులు అటవీ శాఖ అధికారులకు ఇక్కడి ప్రజా ప్రతినిధులకు పొనికి కర్ర ను పెంచాలని పలుమార్లు విజ్ఞప్తులు చేసినా స్పందిం చడం లేదు. దీంతో బొమ్మల తయారికి ఇబ్బంది అవుతుండడంతో పొట్ట గడవడం కష్టంగా మారిందని కుటుంబాలను పోషించించుకోవడం గగనం అవుతోందని కళాకారులు వాపోతున్నారు.
జ్ఞాన సరస్వతి దేవి ఆలయం... : భారతావనిలో అతి ప్రసిద్ధి గాంచిన శ్రీ జ్ఞాన సరస్వతి క్షేత్రం ముదోల్ మండలం లోని బాసరలో కొలువెై ఉంది. చదువుల తల్లి శ్రీ జ్ఞాన సరస్వతి దేవాలయాల్లో ఒకటి కాశ్మీర్‌లో ఉండగా రెండవది బాసరలో మాత్రమే ఉంది. గోదా వరి తీరానా కిలో మీటర్ దూరంలో ఉన్న జ్ఞాన సరస్వతి దేవి వేద వ్యాస మహర్షి చేరూపొందించబడింది. గోదావరి నది తీరాన సంచరి స్తూ సరస్వతీ దేవిని ప్రార్థించగా దేవి ప్రసన్నురాలెై తన ప్రతిమ ను ప్రతిష్టించి పూజించమని ఆజ్ఞాపించినట్లు కథనం. ఆ తర్వాత ప్రతిదినం గౌతమి నదిలో స్నానం ఆచరించి సరస్వ తి దేవిని ధ్యానించి మూడు ముష్టుల ఇసుకను మూడు స్థలాల్లో ఉంచాడు. క్రమేణా అవి మూడు మూర్తులు గా మారి మహాసరస్వతి, శ్రీ మహాలక్ష్మీ, శ్రీ మహా కాళీ రూపాలుగా వెలిశాయని మహర్షి వ్యాసుడు ఆ దేవి ని ప్రతిష్టించినందు న, ఆ క్షేత్రంలో నివసించినందున ఈ క్షేత్రం వాసరగా, క్రమేణా బాసరగా పిలువబడు తోంది.
ఈ బాసర గ్రామం మహారాష్ట్ర సరిహద్దులో ఉంది. ఈ దేవాలయానికి సమీపానే పర్వత గుహలో కుమారస్వామి తపస్సు చేసినందున ఈ పర్వతానికి కుమారచల పర్వతం అని పేరు వచ్చింది. ఇక్కడ ప్ర ధాన దేవాలయానికి తూర్పు భాగంలో ఔదుంబర వృ క్ష ఛాయలోని దత్త మందిరంలో సుందరమగు శ్రీ దత్తాత్రేయుని విగ్రహం, దత్త పాదుకలు ఉన్నాయి. శ్రీ మహాకాళి దేవాలయం పశ్చిమభాగాన కలదు. ఆగ్నేయాన అత్యంత మహిమాన్వితమైన అష్టతీర్థ పుష్కరి ణి ఉంది. వ్యాస మందిరం దక్షణ దిశలో కనిపిస్తుం ది. బాసర గ్రామానికి వెళ్లే దారిలో వేదవతి (ధనపు గుండు) అనే పెద్ద శిల కనిపిస్తుంది. దానిని శిలతో కొ ట్టినట్లయితే విచిత్ర ధ్వని వినిపిస్తుంది. గోదావరి సమీ పాన శివాలయం (సూర్యేశ్వర)ఆలయం కనిపిస్తుంది. ఇక్కడికి వచ్చే భక్తుల సౌకర్యార్థం ప్రభుత్వాలు అతిధి గృహలను నిర్మించింది.
నాగోబా దేవాలయం... : జిల్లాలోని కేస్లాపూర్ గ్రామంలో వెలసిన గిరిజనుల ఆరాధ్య దెైవం అయిన నాగోబా దేవతకు రాష్ట్ర వ్యాప్తంగా ఓ ప్రత్యేక గుర్తింపు ఉంది. ఈ జాతరకు జిల్లా నలుమూలల నుంచి కా కుండా పొరుగు రాష్ట్రాలెైన చత్తీస్‌గడ్, ఉత్తరాంచల్, జార్ఖండ్, మహారాష్ట్ర ప్రాంతాల నుంచి వేలాది మంది గిరిజనులు తమ ఇష్ట్ట దెైవాన్ని దర్శించుకునేందుకు హా జరవుతారు. ప్రతియేటా పుష్యమాసంలో అమావాస్య రోజున మేస్రం వంశీయులు ప్రత్యేక పూజలు నిర్వ హించడంతో జాతర ప్రారంభమవుతుంది. వేలాది సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ దేవాలయానికి 22 తె గలకు చెందిన మేస్రం వంశీయులు ఇక్కడ పూజలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తున్నది. పూర్వం మే స్రం వంశానికి నాగాయి మోతి రాణికి నాగేంద్రుడు కలలో సర్పం రూపంలో వచ్చి ఆమెకు జన్మించాడని చరిత్ర చెబుతుంది. ఆ కలను మేస్రం వంశీయులు నమ్మడంతో సర్పం రూపంలో ఉన్న నాగేంద్రు నికి తల్లి నాగాయి మోతిరాణికి తమ్ముడి కూతురు గౌరికి పెళ్లి జరిగిందని చెబుతుంటారు. పుష్య మాసానికి ముందు వచ్చే పౌర్ణమి నుంచి మేస్రం వంశీయులు కాలినడకన గోదావరి నది జలాలను తీసుకు వచ్చి అమావాస్య రోజున ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. అక్కడ ప్రతి యేటా ప్రభుత్వం దర్బార్ నిర్వహించి గిరిజనుల సమస్యలను పరిష్కరిస్తున్నారు.
గిరిజన పోరాట యోధుడు కొమరంభీం...
ఆదివాసులది అడవి బ్రతు కు, అడవిలోనే అనేక ఘోరాలు అన్యాయాలు జరుగుతుండేవి. గిరిజనులపెై నిజాం ప్రభుత్వం చేస్తున్న అన్యాయాలను, దోపిడిని అరికట్టేందుకు నిజాంకు వ్యతిరేకంగా సాయుధ పొరాటం చేసేందుకు ముం దుకు వచ్చిన ఆదివాసి ముద్దుబిడ్డ, గిరిజనుల ఆరాధ్య దెైవం కొమరంభీం ఆ అడవి బ్రతుకునుంచే జరుగుతున్న దోపిడిపెై అనేక విషయాలు నేర్చుకున్నాడు. ప్రభుత్వం పెై పోరా డి ఆదివాసుల భూములను వారి పంటలను దక్కించుకున్నాడు. అటవీ భూములను నెైజాం ప్రభుత్వం భూస్వాములకు పట్టాలు చేస్తున్న కార్య్ర మంలో ఆసిఫాబాద్ ప్రాంతంలోని ఆదివాసులు తీవ్ర అన్యాయానికి గుర య్యారు. కొమరంభీంది ఆసిఫాబాద్ దగ్గర్ సంకెపల్లి గ్రామం. భీం కూలీ పనిచేస్తూ చదవడం రాయడంతో పాటు రాజకీయాల గురించి, గిరిజనుల తిరుగుబాటు గురించి తెలుసుకున్నాడు. ఆ సందర్భంలో ఒక తిరుగుబాటు లో పాల్గొని నిర్బంధం నుంచి తప్పించుకొని చాందా మీదుగా కాకన్‌ఘట్ చేరి అక్కడి నుంచి చిన్నయనల వద్దకు వచ్చాడు. వారు పడిన అవస్థలు దోపి డిల గురించి విన్న భీం చలించి పోయి ఒక నిర్ణయానికి వచ్చాడు. ఆ సంద ర్భంలో వారికి నమ్మకమైన మనిషి లోటును తీర్చేందుకు ముందుకు వచ్చా డు. అడవి మనది, పోడు మనది, పంట మనది, అని భీం ప్రకటించాడు. ఆసిఫాబాద్ అడవుల్లో నెైజాం సైన్యానికి, భీం సైన్యానికి మధ్య దాదాపు 7 నెలల యుద్దం జరిగింది. చివరి సారిగా నెైజాం వాళ్లు 300లకు పెైగా సైన్యం భారీ మందుగుండు సామాగ్రి, వెైద్య బృందం తో తహసిల్దార్ న్యాయకత్వంలో దీపావళి మా సపు పున్నమి రోజున జోడేఘాట్ ఎక్కారు. 5 గంటల హోరాహోరి పోరు జరిగింది.
ఆ సమయంలో గుండి గూ డెం నివాసి మడావి పొద్దు పటేల్, నెైజాం సైన్యానికి భీంను చూపించ గా సైన్యం అతనిని కాల్చి చంపింది. భీం మరణిం చిన తర్వాత 12 గ్రామాల ప్రజలు చెల్లా చెదురయ్యారు. నెైజాం సామం తరాజుకు వ్యతిరేకంగా భీం న్యా యకత్వంలో గోండ్‌లు జరిపిన సాయుధ తిరుగుబాటు 1940నాటికి అణిచి వేయబడింది. భీం న్యాయకత్వం లో గిరిజనులు పోలీసులకు ఎదురొడ్డి నిలి చిన సంఘటన నిజాం ప్రభువును కదిలిం చింది. వారి సమస్యలను పరిష్కరించేందుకు కావాల్సిన సదుపాయాలు కల్పించేందుకు వారి జీవన విధానం పెై పరిశోధన చేసి నివేదిక సమర్పించాలని ఇంగ్లాండ్‌కు చెందిన సామాజిక శాస్త్ర వేత్త ప్రోఫెసర్ హేమన్‌డార్ఫ్ ఆయన సతీమణిని నిజాం ప్రభుత్వం నియమించింది. ఆయన గిరిజనుల్లో ఒక్కడెై గిరిజనుల జీవన విధానాలు వారికి కావాల్సిన పథకాలను సూచిస్తూ ప్రభుత్వానికి నివేధిక సమర్పించారు. నేడు జిల్లాలో జరుగుతున్న అభివృద్ది ఆనాటి కొమరంభీం త్యాగ ఫలమే. భీం వర్థంతి సభను దీపావళి పున్నమి రోజున జోడేఘాట్‌లో నిర్వహిస్తున్నారు. ఈ సందర్బంగా ప్రభుత్వం అక్కడ ప్రజా దర్బార్‌ను ఏర్పాటు చేసి గిరిజనుల సమస్యలను తెలుసుకొని అక్కడికక్కడే పరిష్కరిస్తున్నారు.
No comments:
Post a Comment