విహారాలు

India

Gamyam

Thursday, July 8, 2010

ఇతిహాసాల నేలకొండపల్లి

Nkpalli_stupamనేలకొండపల్లి... ఖమ్మం జిల్లాలో ఉన్న ఈ గ్రామానికి ఎంతో చరిత్ర ఉంది. మహాభారతంతో ముడిపడిన కథలొకవైపు, బౌద్ధ అవశేషాల తాలూకు చారి త్రక వాస్తవాలు మరొక వైపు ఈ ప్రాంతానికి ప్రాముఖ్య తనిస్తున్నాయి. అంతేకాకుండా భద్రాచలంలో కొలువై ఉన్న శ్రీ రామచంద్రమూర్తికి ప్రియభక్తుడైన భక్తరామదాసు (కంచర్ల గోపన్న) జన్మస్థలం కూడా కావడం నేలకొండ పల్లికి మరింత ప్రాధాన్యతను తీసుకొచ్చాయి. ఇక్కడి ఒక మైలు దూరంలో విరాటరాజు దిబ్బ, కీచక గుండం అనే స్థలాలు మహాభారత కథతో సంబంధం కలిగి ఉన్నాయి.

పాండవులు అజ్ఞాతవాస సమయంలో విరాట నగరాన్ని పాలించే విరాట రాజు కొలువులో మారువేషాల్లో చేరారు. విరాట రాజు బావమరిది కీచకుడు సైరంధ్రి వేషంలో ఉన్న ద్రౌపదిని కామించగా, వలలుడి వేషంలో ఉన్న భీముడు కీచకుణ్ణి చంపేసాడు. ఆ విరాటనగరం ఈ ప్రాంతమేనని పౌరాణిక గాధ. మహాభారతం జరిగిందని చెప్పబడుతున్న కాలం నాటి అవశేషాలు కూడా ఇక్కడ లభ్యమవుతుండడం దీనిని మరింత బలం చేకూర్చుతోంది. 1977 లో జరిపిన తవ్వకాల్లో బౌద్ధ అవశేషాలు, స్థూపాలు, విగ్రహాలు దొరకడంతో ఈ ప్రాంతంలో బౌద్ధం విలసిల్లిందని రూఢి అవుతున్నది.

ఇటీవలి చరిత్రకు వస్తే... నేలకొండపల్లి భక్త రామదాసుగా ప్రసిద్ధి గాంచిన కంచర్ల గోపన్న ఇక్కడే జన్మించాడు. ఆయన పుట్టిన ఇంటిని భక్త రామదాసు ధ్యాన మందిరంగా పిలుస్తున్నారు. ఇక్కడ కొన్ని తెలుగు సినిమాలు కూడా చిత్రీకరణ జరుపుకోవడం విశేషం. భక్తరస ప్రధానం కొంతకాలం క్రిందట దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు తెరకెక్కించిన ‘శ్రీరామ దాసు’ చిత్రం కూడా ఇక్కడే నిర్మాణం జరిగింది. అంతేకాకుండా ఈ గ్రామంలో పురాతన దేవాలయాలు కూడా ఉన్నాయి.

చారిత్రక దేవాలయాలు...
చారిత్రకంగా ప్రసిద్ధి చెందిన వేంకటేశ్వరాలయం, భీమేశ్వరాలయం, వేణుగోపాలస్వామి, ఉత్తరేశ్వర ఆలయాలు నేలకొం డపల్లికి మరింత ఆకర్షణగా నిలుస్తున్నాయి. ఉన్నవి. వీటిని కనీసం 400 సంవత్సరముల క్రితం నిర్మించారని ప్రతీతి.

రవాణా సౌకర్యాలు...
నేలకొండపల్లి... ఖమ్మం నుండి కోదాడ (నల్లగొండ జిల్లా) వెళ్లే రహదారిపై ఉన్నది. ఖమ్మం నుండి కోదాడ, నల్లగొండ, మిర్యాలగూడ, తిరుపతి, గుంటూరు వంటి ప్రదేశాలకు వెళ్ళే బస్సులు ఇక్కడ ఆగుతాయి. హైదరాబాదు వెళ్ళాలంటే ఖమ్మం లేదా కోదాడ నుండి ఎక్స్‌ ప్రెస్స్‌ బస్సు సౌకర్యం ఉంది. ఖమ్మం నుండి దేశం లోని అన్ని ముఖ్య ప్రదేశాలకు రైలు సౌకర్యం ఉన్నది. అతి దగ్గర విమానాశ్రయం హైదరాబాదు, విజయవాడ లో ఉన్నవి.

No comments:

Post a Comment