మేము, మామిత్ర బృందం తమిళనాడులోని తిరువనంతపురం-కన్యాకుమారి-మధురై-రామేశ్వ రం-తిరుచ్చి (తిరుచురాపల్లి)లను దర్శించడానికి విశాఖ నుండి ముందుగా తిరువనంతపురం బయలుదేరాం.
తిరువనంత పురం
ఇక్కడ ముఖ్యంగా శ్రీ అనంత పద్మనాభస్వామి ఆలయం చూడదగినది. సుమారు ఐదువేల సంవత్సరాల క్రితము కట్టబడినదట. 1729 సంIIలో మార్తాండ వర్మ అనే కేరళరాజు ఈ దేవాలయాన్ని పునరుద్దరించాడట. ఇక్కడ ధీర్ఘ చతురస్రముగానున్న వరండా నిర్మించడానికి 4000 మంది తానీపనివారు, 6 వేల మంది కవ్ఞలు, 100 ఏనుగులనుపయోగించి 7 నెలల్లో పూర్తిచేసారట. ఈ దేవాలయ ప్రాంగణము 7 ఎకరాలు. ధ్వజ స్థంభము ప్రత్యేకమైన టేకుతో బంగారు కవచముతో కలిగి వ్ఞన్నది.
ఇది 80 అడుగుల ఎత్తు. ఈ స్వామి దర్శనము దక్షిణ ద్వారము నుండి ముఖము, ఉత్తర ద్వారమునుండి పాదములు, మధ్య ద్వారము నుండి నాభి చూడవచ్చు. ఈ ఆదిశేషునిపై యోగనిద్రలో వ్ఞంటాడు. విగ్రహము ఎదుటనున్న మండపము పై కప్పు ఒకే గ్రయినేట్ రాయితో మలచినది. ఆలయములోని స్థంబాలపై అనేక రకముల శిల్పాలు చెక్కబడి వ్ఞన్నవి. త్రివాన్కూరు రాజు ప్రతిరోజు ఈ ఆలయాన్ని దర్శించుకుంటారు. ఈ ఆలయం త్రివేండ్రం రైల్వేస్టేషన్ నుండి సుమారు 1 కిలోమీటరు దూరంలో ఉంది. ఈ ఆలయంలోనికి పురుషులను చొక్కాలేకుండా పంచెతో మాత్రమే అనుమతిస్తారు. ఇంకా ఈ పట్టణములో చూడవలసినవి జూపార్కు, బొటాని కల్ గార్డెన్, నేపియర్ మ్యూజియం. ఇక్కడినుండి 80 కి.మీ దూరంలో ఉన్న కాన్యాకుమారికి మాబృందం బస్సులో బయలుదేరాం.
కన్యాకుమారి
బంగాళాఖాతం, అరేబియా సముద్రం, హిందూ మహాసముద్రం కలిసేచోటు. ఈ మూడు సముద్రాలను వేరే వేరే రంగులలో ఇక్కడ చూడవచ్చు.1892 సంవత్సరంలో స్వామి వివేకానంద ఇక్కడి నుండి సముద్రములో 500 మీటర్ల దూరములో 55 మీటర్ల ఎత్తులో ఉన్న శిలపైకి ఈదుకుని వెళ్లి ధ్యానం చేయుటవలన జ్ఞానము పొందెను. దీనిని వివేకనందా రాక్ మెమోరియల్ అని పిలువబడుతుంది. 1970 సంIIలో స్మారక చిహ్నం కట్టి వివేకనందుని కాంశ్య విగ్రహాన్ని నిర్మించారు. ఇక్కడకు వెళ్ళడానికి ఉదయం 7 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు ఫెర్రీ సర్వీసు కలదు. మంగళవారం శెలవ్ఞ. ఐదువేల మంది శిల్పులు రాత్రింబగుళ్లు శ్రమించి చెక్కిన 33 అడుగుల '' తిరువళ్ళువర్ విగ్రహం దీనికి దగ్గరలో ఉంది. అమెరికాలోని ''స్టాచ్యూ ఆఫ్ లిబర్టీని పోలి ఉంటుంది.
కన్యాకుమారి ఆలయం
ఇది సముద్రపు ఒడ్డున వ్ఞన్న ఆలయం. ఈ ఆలయం గూర్చి చాలా కథలు వ్ఞన్నవి. ఇది పార్వతి దేవి అవతరించిన స్థలమట. బాగాసురుడనే రాక్షసుని వధించుటకు విష్ణువ్ఞ సలహాపై దేవేంద్రుడు యజ్ఞం చేయగా అందులో ఒక కన్య ఉద్భవించినదట. ఆ కన్యను శివ్ఞడు వివాహము చేసుకోవాలని దేవతలు ఆతృతతో చూస్తారు. కాని ఆకన్యను వివాహం చేసుకుంటే ఆ రాక్షసుడు వధింపబడడు. నారదుని పన్నాగము వలన వేళకాని వేళ కోడిపుంజు కూయటం వలన వివాహమునకు సుముహూర్తము దాటిపోయినదని శివ్ఞడు భావించి తన స్థానమైన సుచీద్రమునకు వెళ్ళిపోతాడు. అందువలన ఆ కన్య కన్యగానే మిగిలిపోతుంది. ఈ విగ్రహము చాలా అందంగా వ్ఞంటుంది. ఈమె దుస్తులను తరచు మారుస్తూ ఉంటారు. ఉదయం కన్యగాను సాయంత్రం వధువ్ఞగాను అలంకరిస్తారు. ఈమె ముక్కు పుడకలోని వజ్రము చాలా దూరం నుండిమెరుస్తూ వ్ఞంటుంది. ఈ ఆలయంలోని స్థంబాలను మీటితే సంగీతం వినిపిస్తుంది. పౌర్ణమి రోజు సాయంత్రం ఈ దేవాలయం చూడవచ్చు. ఉదయం 4.30 నుండి సాయంత్రము 5.30 వరకు మరల రాత్రి 8.45 గంటల వరకు అమ్మవారి దర్శనము చేసుకోవచ్చు.
గాంధీమందిరము
ఈ సముద్రములో గాంధీగారి అస్థికలు నిమజ్జనం చేసారు. ఆయన జ్ఞాపకార్ధము 1956 సంIIలో ఆయన విగ్రహాన్ని ప్రతిష్టించారు. ప్రతి అక్టోబరు రెండవ తేదీన గాంధీ విగ్రహముపై సూర్యకిరణాలు పడేలా ఏర్పాటుచేసారు.
సుచీంద్రము
కన్యాకుమారి నుండి తిరువనంతపురం వేళ్ళే దారిలో 11 కి.మీ. దూరంలో ఉన్నది. దేవేంద్రుడు శాపవిముక్తి (శుచి) కొరకు ఇక్కడ శివ్ఞని గూర్చి తపస్సుచేయటం వలన సుచీంద్రము అను పేరు వచ్చినది. ఇక్కడ వ్ఞన్న 7 రాతి స్థంభాలను మీటితే 7 రకాల సంగీతం వినిపిస్తుంది. కన్యాకుమారి నుండి సిటీబస్‌లో వెళ్ళి రెండుమూడు గంటలలో తిరిగిరావచ్చు.
కన్యాకుమారిలో వసతి సౌకర్యాలు వివేకనందా శ్రమము వారు ఏర్పాటుచేస్తారు. ముందుగా మనం వారికి తెలియపరచి కొంత అడ్వాన్సును పంపితే వసతి ఏర్పాట్లు చేస్తారు. ఈ ఆశ్రమం నుండి ఆలయమునకు రాక్ టెంపులు వరకు ఉచిత బస్సు సౌకర్యం కూడా ఏర్పాటు చేస్తారు.
కన్యాకుమారి నుండి 246 కి.మీ దూరంలో మధురైకు చేరుకున్నాం.
మధురై
ఇది మధుర మీనాక్షి దేవాలయంకు ప్రసిద్ధి. ఈ ఆలయం ప్రపంచ ప్రసిద్ది చెందినది. దీనికి 11 గోపురాలు వ్ఞన్నవి. ఆలయానికీ దక్షిణానవ్ఞన్న గోపురం ఎత్తు 200 అడుగులు. ఇది ఆలయ ప్రధాన ద్వారం. దీనిపై అష్టలక్ష్మి బొమ్మలు చెక్కబడి వ్ఞన్నవి. ఇక్కడవ్ఞన్న వెయ్యిస్థంబాల మండపం చూడముచ్చటగా వ్ఞంది. ఈ ఆలయం దక్షిణాది ఆలయాల్లో చూడదగినది. మధుర మీనాక్షిని దర్శించుకున్న తరువాత మా బృందం 163 కి.మీ దూరంలోవ్ఞన్న రామేశ్వరాన్ని వీక్షించడానికి బయలుదేరాం.
రామేశ్వరం
రామేశ్వర ప్రయాణం చాలా వింత కొలుపుతుంది. ఏంబన్-రామేశ్వరముల మధ్యనున్న సముద్రపాయపై రైలు బ్రిడ్జి వ్ఞన్నది. దానిపై ప్రయాణిస్తే సముద్ర మధ్య నుండి వెళ్ళే అనుభూతి కలుగుతుంది. రామేశ్వరమునకు సుమారు 150 కి.మీ వరకు కొండలు కనిపించవ్ఞ. దేశంలో నాలుగు అతి ముఖ్య పుణ్యక్షేత్రాలలో రామేశ్వరం ఒకటి. ఇది ఒక ద్వీపములో ఉన్నది. రావణ సంహారము తరువాత అతడు బ్రాహ్మణుడు అగుటచే ప్రాయశ్చిత్తం కొరకు శ్రీరాముడు రామనాధస్వామిని (శివ్ఞని) అర్చిస్తాడు. శుభ ముహూర్త సమయానికి హనుమంతుడు శివ్ఞని విగ్రహము తీసుకొని రాకపోవ్ఞటచే సీతాదేవి ఇసుకతో విగ్రహాన్ని తయారుచేయగా శ్రీరాముడు దానినే పూజిస్తాడు. ఇక్కడే లంకకు వారధి నిర్మించడానికి పూనుకుంటాడు. ఇప్పటికీ ఇక్కడి రాళ్ళు నీటిలో తేలుతుంటాయి. ఇక్కడికి వచ్చిన యాత్రికులకు ఆ రాళ్ళను విక్రయిస్తారు. ఈ దేవాలయ ప్రాంగణములోనున్న నూతులలో నున్న నీటిలో స్నానం చేస్తారు. ఒక్కొక్క బావిలోని నీరు ఒక్కొక్క రుచితో వ్ఞంటాయి. దేవాలయము ఎదుట కొద్దిదూరములో సముద్రము, ఇది కొంత దూరము వరకు లోతు తక్కువ అందువలన అన్ని వయసుల వారు నిర్భీతితో స్నానం చేయవచ్చు. పెద్దగా కెరటాలు వ్ఞండవ్ఞ.
ఇక్కడికి 3.కి.మీ దూరంలోగల గంధమాదన పర్వతము, దానిపై శ్రీరాముని పాదముద్రలు వ్ఞన్నవి. ఈ పర్వతము మీదినుండి రామేశ్వరము ఊరిని, సముద్రాన్ని చూడవచ్చు. ఇక్కడికి 18 కి.మీ దూరంలో వ్ఞన్న ధనుష్కోటి నుండి వానర సైన్యం వారధి నిర్మించిందట. రామేశ్వరములో మన మాజీ రాష్ట్రపతి నివసించిన ఆయన గృహము కూడా వ్ఞన్నది. దానికి ఆనుకొని గవర్నమెంటువారి చేతి వస్తువ్ఞల తయారీ సముదాయం వ్ఞన్నది. ఇక్కడ బ్రాంజ్ మెటల్‌తో చేసిన బొమ్మలు కడుఅందంగాను, చవ్ఞకగాను దొరుకుతాయి. రామేశ్వరం చూస్తే మనకు రామాయణం గుర్తుకు వస్తుంది. ఇంతటి గొప్ప చరిత్ర కలిగిన రామేశ్వరం ను దర్శించడం చాలా అదృష్టం.
ఇక్కడనుండి 265 కి.మీ దూరంలో వ్ఞన్న తిరుచురాపల్లి (తిరుచ్చి)ని చూడటానికి ట్రెయిన్‌లో చేరుకున్నాం. ఇక్కడ ముఖ్యంగా చూడవలసినవి. రాక్‌ఫోర్టు టెంపుల్, శ్రీరంగం తంజావూరు, కుంబకోణం, చిదంబరం.
రాక్‌ఫోర్టు టెంపుల్
ఇది కావేరి నది ఒడ్డున వ్ఞన్నది. ఈ కొండ ఎత్తు 83 కిలోమీటర్లు, 437 మెట్లు ఎక్కాలి. ప్రస్తుతం ఇక్కడ 100 స్థంబాల మండపం వ్ఞంది. ఇక్కడ వ్ఞన్న శివాలయములో శివ్ఞని మాతృభూతేశ్వరుడు అంటారు. ఈ గుడిని 7 స్థంబాలపై 7 శతాబ్ద ములో పల్లవరాజులు నిర్మించారు. గోడలమీద ఈ దేవాలయపు చరిత్ర పెయింటింగ్స్ వ్ఞన్నవి. ఇక్కడ నుండి కావేరి నదిని మొత్తం పట్టణాన్ని చూడవచ్చు.
శ్రీరంగం
తిరుచ్చిరాపల్లికి ఉత్తరాన 7 కి.మీ. దూరంలో శ్రీరంగనాధస్వామి ఆలయం వ్ఞన్నది. 7 గోపురాలు దాటి గుడిలోకి ప్రవేశించవలెను. తూర్పున 146 అడుగుల ఎత్తున వ్ఞన్న గోపురం ఆసియా ఖండంలోనే అతి ఎత్తైన గోపురం. విభీషణుడు ఈ ఆలయాన్ని కట్టించాడట. ఈ ఆలయం ఉదయం 6 గంటల నుండి మధ్యాహ్నం 1.00 వరకు, సాయంత్రం 3 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు తెరచి వ్ఞంచుతారు. శ్రీరంగమునకు తూర్పున జంబుకేశ్వర ఆలయమున్నది. దానిని కూడా తప్పకుండా చూడాలి.
తంజావూరు
తిరుచ్చీ నుండి తంజావూరు 54 కి.మీ దూరం. ఇది నాగరికతకు గుండెవంటిది. ఇప్పటికినీ ఇక్కడ ివీదులు, సందులలో శాస్త్రీయనృత్యశాలలు సంగీతము వినవచ్చు. ఇత్తడి విగ్రహాలు, సామాన్లు తయారీకి ప్రసిద్ది. ఇది 10 నుండి 14వ శతాబ్దము వరకు చోళరాజుల రాజధాని. ఇక్కడ వీరు 74 దేవాలయాలు నిర్మించారు. అందులో అతి ముఖ్యమైనది బృహదీశ్వరాలయం ఇది అత్యంత శిల్పకళలో వ్ఞట్టిపడుతుంది. ఇక్కడ ఈ ఆలయంలో పెద్ద నంది విగ్రహమున్నది. ఈ ఆలయం చూడడానికి చాలా బాగుంటుంది.
కుంబకోణము
ఇది తంజావూరుకి 38 కి.మీ దూరంలో వ్ఞన్నది. ఇది కావేరీ నది ఒడ్డున ఉన్న అతిపురాతన పట్టణము. సముద్ర మధనంలోవ్ఞన్న అమృత కలశమును తీసుకొని వెళుతున్నప్పుడు ఆ పాత్రలోని ఒక మూలపగిలి ఇక్కడి ''మహామ హము అను సరోవరంలో పడినదట. అందువలన ఈ ఊరికి కుంబకోణం అనేపేరు వచ్చినది. ఇక్కడ 18 ఆలయములున్నవి. అందులో కుంచేశ్వరా లయం బహుపురాతనమైనది. చేనేత, సిల్కు వస్త్రములకు ఇత్తడి రాగి, కంచు సామాన్లుకు ప్రసిద్ది.
చిదంబరం
ఇది నటరాజ ఆలయానికి ప్రసిద్ది. నల్లరాతితో 32 ఎకరాల స్థలంలో 10వ శతాబ్దంలో చోళరాజులచే నిర్మించబడినది. ప్రధాన ఆలయము లోని విగ్రహాన్ని సామాన్యులు చూసే అవకాశం లేదు. గర్భగుడి ముందు తెర ఉంటుంది. బయట వ్ఞన్న కంఠాభరణము, లోపల విగ్రహమున్నట్లు సూచిస్తుంది. చిత్+అంబరం=చిదంబరం అనే పేరు వచ్చినది. ఈ ఆలయానికి 4 గోపురాలు వ్ఞన్నవి. ''కనకసభలో పంచలోహ నటరాజ విగ్రహము అత్యంత అద్భుతంగా వ్ఞంది. రైల్వే స్టేషన్‌కు ఎదు రుగా 500 ఎకరముల స్థలములో అన్నామలై యూనివర్సిటీ వ్ఞన్నది. పై క్షేత్రాలన్ని దర్శించుకొని తిరుచ్చి నుండి విశాఖపట్నంకు మధురానుభూతులతో చేరుకున్నాం.
No comments:
Post a Comment