తమిళనాడు రాష్ట్రంలో సేలం పట్టణానికి సమీపంలో ఉన్న ఏర్కాడు దేశంలోని హిల్‌స్టేషన్లలో ఒకటిగా పేరుగాంచింది. చెన్నై నగరానికి 370 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఏర్కాడును పేదల ఊటీ అని ముద్దుగా పిలుస్తుంటారు ఇక్కడి ప్రజలు. సెర్వ రాయన్ పర్వత శ్రేణుల్లో సముద్ర మట్టానికి 1,500 మీటర్ల ఎత్తులో ఉండే ఏర్కాడులో.. వేసవికాలంలో గరిష్ట ఉష్ణోగ్రత 30 డిగ్రీల సెల్సియస్‌గా, కనిష్ట ఉష్ణోగ్రత 16 డిగ్రీల సెల్సియస్‌గా ఉండటంతో ఇక్కడ ఎప్పుడూ చల్లగా ఉంటుంది. ఏడాది పొడవునా పర్యాటకులు ఈ హిల్‌స్టేషన్‌ను సందర్శి స్తుంటారు.
ఆ పేరు ఎలా వచ్చిందంటే...
తమిళ భాషలో ‘ఏరి’ అంటే సరస్సు అని, ‘కాడు’ అంటే అడవి అని అర్థం. ఏరి-కాడు అనే పదాలే క్రమంగా ఏర్కాడుగా రూ పాంతరం చెందినట్లు స్థానికులు చెబుతుంటారు. ఏర్కాడు కాఫీ తోటలకు కమలా పండ్లకు ప్రసిద్ధి. ఏర్కాడులో బొటానికల్ సర్వే ఆఫ్ ఇండియా సారధ్యంలో నిర్వహించబడే ఆర్కిడారియం పర్యాటకులకు కనువిందు చేస్తుంటుంది.
అలాగే ఏర్కాడులోని అతి ఎత్తైన ప్రదేశం...
సెర్వరాయణ్ దేవా లయం చూడదగ్గ ప్రదేశం. ఇది సముద్ర మట్టానికి సుమారు 5300 అడుగుల ఎత్తులో ఉంటుంది. ఏర్కాడు కొండల ప్రాం తం షెవరాయ్ హిల్స్‌గా పిలువబడుతోంది. ఇక్కడ అడవి దున్న లు, జింకలు, ఎలుకలు, కుందేళ్లు, నక్కలు, మాంగూస్, ఉడుత లు, పావురాళ్లు, పాములు, బుల్‌బుల్ పిట్టలు, పక్షులు.. ఇలా అనేక రకాల అడవి జంతువులు చూపరులను విశేషంగా ఆకట్టుకుంటాయి.
ఏర్కాడులో అడుగుపెట్టగానే ఆకర్షించే మరో అద్భుత ప్రదేశం అందమైన సరస్సు, అందు లో పడవ షికార్లు కొడుతుంటే కలిగే అను భూతి మాటలతో వర్ణించలేము. ఆ తరువాత చిన్న సైజు జంతు ప్రదర్శనశాల, అన్నా పా ర్కు చూడదగ్గవి. అన్నా పార్కులో వివిధ ఆకృ తుల్లో కత్తిరించిన మొక్కలు, వివిధ రంగుల్లో విరబూసిన పువ్వులు, సేదదీర్చే కాంక్రీటు గుడారాలు, దేవతా మూర్తుల ప్రతిమలు ఒకటేమిటీ అక్కడ కొలు వుదీరి ఉన్న ప్రతి దీ విశేషంగా ఆకట్టు కుంటుంది. అలాగే హార్టి కల్చర్ రీసెర్చ్ స్టేషన్ చూడదగ్గ మరో ప్రదేశం.
ఏర్కాడు సరస్సుకు పది కిలోమీటర్ల దూరంలో ఉండే లేడీస్ సీట్ ఎంతో చూటము చ్చటగా ఉంటుంది. లేడీస్ సీట్ వెళ్లేందుకు సేలం నుం చి ఏర్కాడుకు వెళ్లే రహదారిలో మెలికలు తిరిగే రోడ్లలో ప్రయాణం ఉల్లాసభరితంగా సాగుతుంది. ఆ తరువాత పగోడా పాయింట్, సెర్వరాయణ్ టెంపుల్, నార్టన్ బంగళా, బియర్స్ కేవ్ (ఎలుగుబంట్ల గుహ), 1857 సిపాయిల తిరుగుబాటు సంద ర్భంగా కీలకపాత్ర పోషించిన ‘ది గ్రేంజ్ కోట’, 1917లో స్థాపిం చిన మౌంట్ ఫర్డ్ ఉన్నత పాఠశాల చూడదగ్గ ఇతర ముఖ్యమైన ప్రదేశాలు.
ప్రతి సంవత్సరం ఎర్కాడులో సమ్మర్ ఫెస్టివల్ అట్టహాసంగా జరుగుతుంది. ఇది మే రెండో వారంలో ప్రారంభమవుతుంది. ఏర్కాడులో కాఫీ సాగు ఎక్కువగా చేస్తుంటారు. విచిత్రమేమి టంటే... ఇక్కడ భూముల సేద్యం ఉండదు. కాఫీ కాకుండా పస నపండ్లు, బెర్రీలు, కమలాపండ్లు, జామపండ్లను కూడా ఇక్కడ విరివిగా పండిస్తారు.
ఎలా వెళ్లాలి?
విమాన ప్రయాణంలో తిరుచిరాపల్లి వరకు ప్రయాణించి, ఆపై కోయంబత్తూర్ నుంచి బస్సు మార్గంలో ఏర్కాడు చేరుకోవచ్చు. రైలు ప్రయాణంలో అయితే చెన్నై-కోయంబత్తూర్ రైలు మార్గం లో చెన్నై నుంచి 335 కిలోమీటర్ల దూరంలోని సేలం జంక్షన్ మీదుగా బస్సు మార్గం గుండా అక్కడికి 35 కిలోమీటర్లు ఉన్న ఏర్కాడు చేరుకోవచ్చు. తమిళనాడు రాష్ట్రంలోని ప్రధాన పట్టణా ల నుంచి సేలం వరకు కూడా బస్సు సర్వీసు లు అందుబాటులో ఉన్నాయి.
ఇక వసతి విషయానికి వస్తే..
ఏర్కాడులో అనేక స్టార్ హోటళ్లతోపాటు చిన్నా, పెద్దా హోటళ్లు కూడా చాలానే ఉన్నాయి. అలాగే హాలిడే హోమ్స్, రిసార్టులు, గెస్ట్‌హౌజ్‌లకు కూడా కొదువేలేదు. వీటితోపాటు తమిళనా డు రాష్ట్ర పర్యాటక శాఖ ఆధ్వర్యంలో నిర్వ హించే తమిళనాడు, యూత్ హాస్టల్‌లు అందరికీ అందుబాటు ధరల్లో ఉంటాయి.
No comments:
Post a Comment