విహారాలు

India

Gamyam

Tuesday, January 10, 2012

ఔషధ గుణాల జలపాతం కుట్రాళం

మిళనాడులోని టెంకాశికి తూర్పుగా 73 కి.మీ. దూరంలో తిరునల్వేలి వుంది. తిరునల్వేలి నుంచి దక్షిణానికి కన్యాకుమారి వరకు ఉత్తరాన విరుద్ధనగర్‌ మధురైల మీదుగా చెన్నైకి రైలు మార్గం వుంది. కన్యాకుమారి నుంచి టెంకాశికి బస్సులు వున్నాయి. కన్యాకుమారి నుంచి తిరుసల్వేలికి రైళ్ళు ఉన్నాయి. కుట్రాళం అందాలను చూడాలి అనుకుంటే ఒకరోజు మొత్తం కేటాయించవలసి వుంటుంది.
http://www.bloggersbase.com/images/uploaded/original/15c41340297d1c85951872256416766d6da97163.jpeg
కుట్రాళం జలపాతం వున్న ప్రాంతం అంతా పడమటి కనుమలలోని ఒక భాగం. ఈ కొండలలో ఎక్కడో పుట్టిన ఒక జలధారి వర్షపు నీటితో కలిసి పెద్ద ప్రవాహంలాగా పారుకుం టూ వచ్చి ఇక్కడ వున్న కొండ చివర నుంచి జలపాతంలాగా పడుతూ ఉంటుంది. కొండ మీద వున్న అడవులలో పెరిగే రకరకాల ఔషధుల మొ క్కలు, చెట్లను కలుపుకుంటూ ఉంటుంది. ఇక్కడ నీరు ఎంతో నిర్మలంగా స్వచ్ఛంగా వుంటుంది. ఈ నీటిలో శారీరకంగా కలిగే అనేక జబ్బులను నయం చేసే గుణం వుంది. దీర్ఘరోగంతో బాధపడుతూ వుండేవారు ప్రతిరోజూ ఈ ప్రవాహంలో స్నానం చేస్తూ వుంటారు. ఈ జలపాతం పడే చోట చిన్న కోనేరులాగా ఏర్పడింది. ఈ జలపాతం నిజానికి మూడు దశలుగా వుంటుంది. ఇక్కడ స్నానం చేసే కొలనులాంటిది ఆఖరు దశ. ఈ కొలనుకు కొంచెం ఎగువగా అంటే కొండకు పై భాగాన మరొక జలపాతం వుంది. ఇదే నీరు అక్కడ కూడా ఎత్తు నుంచి పడుతూ ఉంటుంది. దీనిని తమిళంలో ‘అంజివళి’ అంటారు. ఇక్కడకు వెళ్ళాలంటే కొంచెం కొండ ఎక్కి వెళ్ళాలి.http://www.filmapia.com/sites/default/files/filmapia/pub/place/courtallam-kutralam-waterfallssouth-indias-most-natural-spa-21359659.jpg
ఈ అంజివళికి సుమారు అయిదు, ఆరు కి.మీ. దూరంలో ఈ అయిదు ధారలు జన్మించిన చోటు వుంది. ఈ స్థలం కూడా ప్రవాహానికి అసలు జన్మస్థలంకాదు.చుట్టూ వున్న కొండలలో పడ్డ వర్షపు నీరు పల్లంగా వున్న ఈ ప్రాంతానికి అన్ని వైపుల నుంచి ప్రవహించుకుంటూ వచ్చి ఇక్కడ అయిదు ధారలుగా ప్రవహిస్తూ వుంటాయి. చెట్ల మధ్యగా రాళ్ళమీదుగా వున్న ఎగుడు దిగుడు కాలిబాట. అందువల్ల ఇక్కడి వరకు వచ్చి వెళ్ళడానికి కనీసం ఐదు గంట లకు తక్కువ పట్టదు. అందువల్ల ఇక్కడకు ఎవరు రారు.
ఈ జలపాతం వున్న కొండలు పడమటి కనుమలలోని భాగం అని చెప్పబడ్డది. ఈకొండల వరుస దక్షిణంగా మరొక నలభై మై ళ్ళు సాగిపోయి కన్యాకుమారికి సుమారు 30 కి.మీ. ముందుగా తూర్పు కనుమల కొనకు కలుస్తాయి.

టెంకాశికి తూర్పుగా 60 కి.మీ. దూరంలో వున్న తిరునల్వేలి చాలా పెద్ద నగరం. దక్షిణ తమిళనాడులో ఈ తిరునలివేలి పెద్ద జంక్షన్‌. ఈ ఊరిలో కూడా నెల్లియప్పన్‌ దేవాలయం అనే గొప్ప ఆలయం వుంది. పూర్తి దారు శిల్పాలయిన ఈ ఆలయం చాలా బాగుంటుంది. గుడి ఆవరణ చాలా పెద్దది. ఈ ఆలయానికి ఆనుకుని తమిళనాడులోని రెండవ పెద్ద నది అయిన పెరియార్‌ నది ప్రవహిస్తుంది.
http://www.bloggersbase.com/images/uploaded/original/d16d74e3473958a47dc3604e23658d7a41fadcb9.jpeg
కొండ మీద వున్న అడవులలో పెరిగే రకరకాల ఔషధుల మొక్కలు, చెట్లను కలుపుకుంటూ ఉంటుంది. ఇక్కడ నీరు ఎంతో నిర్మలంగా స్వచ్ఛంగా వుంటుంది. ఈ నీటిలో శారీరకంగా కలిగే అనేక జబ్బులను నయం చేసే గుణం వుంది. 
- Courtacy - సూర్య Daily 

No comments:

Post a Comment