విహారాలు

India

Gamyam

Monday, March 14, 2011

సహ్యాద్రి శోభ, సెరియేళ్ళనాదంతో ఆకర్షించే.. మంగళూరు


New_Mangaloreసముద్ర తీరప్రాంతం, చుట్టుప్రక్కల అంతా కొబ్బరిచెట్ల సోయగాలు, ప్రకృతి రమణీయ దృశ్యాలు, సహ్యాద్రి కొండల వంపుసొంపులు, అక్కడ ప్రవహించే సెలయేళ్ళ శోభకు మంగళూరు పెట్టింది పేరు. బీచ్‌లు, దేవాలయాలు, పరిశ్రమలు, బ్యాంకింగ్‌, విద్యాసంస్థలకు ప్రసిద్ధి చెందిన మంగళూరు కర్ణాటక రాష్ట్రంలోనే ప్రసిద్ధిగాంచిన పర్యాటకకేంద్రం. రాష్ట్రానికే గాక, భారతదేశానికి తొలి నౌకాశ్రయాన్నిచ్చిన నగరం మంగళూరు. దక్షిణ కన్నడ జిల్లా రాజధాని అయిన ఈ నగరం... అధికార, పరిపాలనా కేంద్రంగా విలసిల్లుతోంది.

నేత్రావతి, గుర్‌పుర్‌ నది ఒడ్డున ఈ ప్రాంతం ఉండటంవల్ల అరేబియా స ముద్ర జలాలు కొద్దిగా వెనక్కు వస్తుంటాయి. అంతేకాక, మలబార్‌ తీరం లో మంగళూరు కూడా ఒక భాగమే కావటం గమనార్హం. రాష్ట్ర భాష అయిన కన్నడ, ఉడిపికి ప్రాంతీయ భాష అయిన తుళు, కేరళకు సరిహద్దుల్లో ఉండటంవల్ల మళయాలం, కొంకణి జనా భా కూడా ఉండటం వల్ల కొంక ణి భాషలు మంగళూరులో వాడుకలో ఉన్నాయి. ప్రాంతీయ భాషలే కాకుం డా... హిందీ, ఆంగ్లం కూడా మాట్లాడతారు.

మంగళూరుకు ఆ పేరు ఎలా వచ్చిందంటే...
Kadri_Park నగర దేవతైన మంగళాదేవి పేరే నగరం పేరుగా స్థిరపడినట్లు పూర్వీకులు చెబుతుంటారు. అదే విధంగా అనేక శతాబ్దాలుగా ఈ నగరం వివిధ సంస్కృ తులకు నిలయం కావటంతో, అక్కడ నివసించే భిన్నజాతులవారు తమ తమ మాతృ భాషలలో మంగళూరుకు అనేకమైన పేర్లు పెట్టారు. అలా స్థానిక భాషలో మంగళూరును కుడ్ల అని పిలు స్తారు. కుడ్ల అంటే కూడలి అని అర్థం.

అలాగే నేత్రావతి, ఫల్గుణి నదుల సంగమస్థానం కావటంవల్ల మంగళూరుకు ఆ పేరు వచ్చినట్లుగా చెబుతుంటారు. కొంకణి భాషలో మంగళూరును కొడియల్‌ అని పిలుస్తుంటారు. ఇక ముస్లింలలో ఒక వర్గంవారైతే ఈ నగరాన్ని మైకల అని ముద్దు గా పిల్చుకుంటారు. దక్షిణ కేరళ ప్రాంత ప్రజలు మాత్రం మంగళాపురంగా పిలుస్తారు. ఇదిలా ఉంటే.. 2006లో సువర్ణ కర్ణాటక పేరుతో మంగళూరును మంగలూరుగా కర్ణాటక ప్రభుత్వం మార్పుచేసింది.

సముద్ర మట్టానికి 45 మీటర్ల ఎత్తులో ఉండే మంగలూరు పట్టణం అరేబియా సముద్రంలో భాగమైన కొంకణ తీరంలో ఉం డే గోవాకు దగ్గర్లో ఉంది. 3వ జాతీ య రహదారుల ద్వారా మంగళూరు దేశానికి కలుపబడుతుంది. మహారాష్ట్ర లోని పణవెల్‌ నుంచి ప్రారంభమై కేరళలోని క్రణగాణురు జంక్షన్‌ వరకూ మంగళూరు రహదారి వెళుతుంది. ఎన్‌.హెచ్‌-48 మంగళూరు నుంచి బయ లుదేరి కర్ణాటక రాజధాని తూర్పువైపుకు బెంగళూరుదాకా వెళుతుంది. ఎన్‌. హెచ్‌-13 ఈశాన్య మార్గంలో షోలాపూర్‌ మీదుగా మడికరి, మైసూర్‌ పట్టణా లమీదుగా పోతుంది. మంగళూరు నుంచి బెంగళూరువరకూ మధ్య ప్రతిదినం 300 బస్సులు నడుస్తుంటాయి.

దర్శనీయ స్థలాలెన్నో..!
Ullal_Beach మంగళూరు చుట్టుప్రక్కల అనేక దర్శనీయ స్థలాలు ఉన్నాయి. వాటిలో పణం బూర్‌ బీచ్‌, ఉల్లాల్‌ బీచ్‌, నేత్రావతి బ్రిడ్జి, కద్రి ఉద్యానవనం, లాల్‌బాగ్‌, సుల్తాన్‌ బత్తెరీ, మంగళాదేవి ఆలయం, కద్రి దేవాలయం, సెయింట్‌ అలోసియస్‌ చర్చి, కాలేజీ, కొత్త మంగళూరు రేవు, గోకర్ణనాథేశ్వర ఆలయం, శరవు మహా గణప తి ఆలయం.. తదితరాలు ముఖ్యందా చూడాల్సిన పర్యాటక ప్రాంతాలు.

రవాణా మార్గాల విషయానికి వస్తే.. కర్ణాటక రోడ్డు రవాణా సంస్థ మంగళూ రు నుంచి సుదూర ప్రాంతాలకు బస్సులను నడుపుతోంది. మంగళూరు- బెంగళూరు మధ్య ఫ్యాసింజర్‌ రైల్వే సౌక ర్యం లేని కారణంగా కేఎస్‌ఆర్టీసీ బస్సుల్ని నడుపుతోంది. ఇక్కడి నుండి అంకోలా, హుబ్లీ, బెల్గాం, పూణె, ముంబాయి వంటి ప్రధాన నగరాలకు కూడా బస్సు సౌకర్యం ఉండడం విశేషం.

విమానమార్గం విషయానికి వస్తే.. మంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయం నగర నడిబొడ్డుకు ఈశాన్యదిశగా 20 కిలోమీటర్ల దూరంలో ఊరి పొలిమేరలైన బజ్‌పేలో ఉంది.

కర్టసీ : సూర్య Daily

No comments:

Post a Comment