వేసవి సెలవుల్లో అంతర్జాతీయ సినిమా పండుగలో పాల్గొనాలనుకునేవారికి కేన్స్, టొరంటో నగరాలను మించి విడిది లేదు. నిజానికి కేన్స్... ఫ్రాన్స్ రాజధాని కాదు. ప్యారిస్‌కు దగ్గర్లో లేదు. అయినా ప్రపంచ పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తుంది. దానికి ప్రధాన కారణం వేసవిలో ఇక్కడ జరిగే అంతర్జాతీయ చిత్రోత్సవాలే... ప్రపంచ సినిమాకది కేంద్రం కూడా కాదు. కానీ, భారీ బడ్జెట్‌తో వెండితెరపై అద్భుతాలను ఆవిష్కరించే మహా దర్శకులు, నటీనటులకు... ఒక రకంగా చెప్పాలంటే ప్రతి సినీ జీవి కేన్స్‌తో అనుబంధం ఉండాలని కోరుకుంటాడు. కేవలం సినిమా పండుగకే కేన్స్ ప్రసిద్ధి అనుకుంటే పొరపాటే. అక్కడ ఇంకా చాలా విశేషాలున్నాయి.
మే నెలలో పన్నెండు రోజుల సినిమా పండుగకు కేన్స్ వేదిక. ఫ్రాన్స్‌లోని సముద్ర తీరాన ఉన్న ఈ నగరం, యూరప్‌లో ఎంతో ప్రాచుర్యం పొందిన నగరాల్లో ఒకటి. ఈ ప్రపంచంలో కేన్స్ చలనచిత్రోత్సవాన్ని మిచిన చిత్రోత్సవం మరొకటి లేదు. ఈ సినిమా పండుగకోసం దాదాపు రెం డు లక్షలమంది అక్కడికి చేరుకుంటారు. వారిలో దాదాపు 40 వేల మంది నమోదు చేసుకున్న ప్రతి నిధులు కాగా... మరో 4 వేల మంది అక్రిడేషన్ గల పాత్రికేయులు. మీడియా కవరేజ్‌లో దీనికి ఎంతో ఖ్యాతి. ప్రపంచం మొత్తం మీద భారీగా మీడియా కవరేజీ పొందే ఉత్సవాల్లో ఇది మూడవది. మొదటిది ఒలింపిక్స్ అయితే రెండవది సాకర్ ప్రపంచ కప్.
ఎటు చూసినా... సినిమా... సినిమా...
మనకు తెలిసిన ప్రపంచం నుండి కేన్స్ ఉత్సవానికి వెళ్లడం గొప్ప అనుభవం. ‘నైస్ కోట్‌డి అజర్’ విమానాశ్రయంలో దిగడం తో ఈ అద్భుత అనుభవాల ప్రస్థానం మొదలవు తుంది. కేన్స్‌లో వైవిధ్యమైన ఆహారం దొరుకుతుంది. రకరకాల రుచులు, కోరిన తరహా ఆహార పదార్థాలు లభిస్తాయి. వాటిని చూస్తేనే కడుపు నిండిపోతుందా అనిపిస్తుంది. మే నెలలో కేన్స్ సినిమానే తింటుంది. సినిమానే తాగుంది. సినిమానే శ్వాసిస్తుంది. అక్కడ సర్వం సినీమయం. సినీ గ్లామర్ నుండి తప్పించుకోవడం అక్కడ అసాధ్యం. బోలేవార్డ్ డి లా క్రోసిటీలో ఉన్నా, ఇంకా అనేక బొటిక్‌లు, హోటళ్లకు వెళ్లినా సినిమా సందడే. పసందైన విందులూ, వినోదాలు, భారీ తెరలపై టీవీ ప్రదర్శనలు, ఇతర కార్యక్రమాలతో ఊరు ఊరంతా ఉర్రూతలూగిపోంతుంది. ప్రపంచం మొత్తం మీద అత్యంత సందడి గా సాగేది కేన్స్ సినిమా పండుగ. ఊర్రూతలూపే సినీ ఉత్సవం.
కేన్స్ ఒకప్పుడు చేపల పరిశ్రమకు ప్రసిద్ధి చెందిన ఓడ రేవు. ఇప్పుడు వెండితెర వేల్పులకు, సరదా సంబరాలకు వేదికగా మారింది. రెండువారాల పాటు ఇక్కడి తళుకు బెళుకులు చూడాలే తప్ప మాటల్లో వర్ణించలేం. కేన్స్‌కు ఇంతటి ఉత్సవ శోభ రావడానికి ప్రత్యేక కారణం ఏమిటో చూడాలి. సనీ ఉత్సవం జరిగే వేదికల ముందు జనం బారులు తీరి కేరింతలు కొడుతుంటే, అది టీవీల్లో చూసే జనం కూడా తామూ అక్కడికి వెళ్తే బాగుంటుందని అనుకుంటే ఇక సందర్శకుల సంఖ్య పెరగడంలో వింతేముంది. కేన్స్ ఎర్రతివాచీ మీద నడవడం గౌరవమని ప్రపంచ సినీ ప్రముఖులు భావిస్తారు. ఈ పండుగ రోజుల్లో బీచ్‌లలో పార్టీలు సంబరాలు షరామామూలే. వైన్ పొంగి ప్రవహిస్తుంది. షాంపేన్ ఫౌంటెయిన్‌లా వర్షిస్తుంది. మందు చిందులతో సముద్రతీరం సరదాగా సాగరమే అవుతుంది. ఓ వైపు అందాల తారలు, మరోవైపు సినీ దిగ్గజాలు, మరోవైపు మజా మజా పార్టీలు, తైతక్కలు, సంగీత హోరులో డ్యాన్సులూ, బీచ్‌లలో ఒకటే పార్టీలు. ఇదీ సినిమా పండుగ సందర్భంలో కేన్స్ దృశ్యం.
మరో సినీ ప్రపంచం... టొరంటో
కెనడాలోని ఒంటారియో రాష్ట్రంలోని పట్టణం టొరంటో. ఇది ఇంచుమించు కేన్స్ పరిమాణంలో ఉంటుంది. అయితే కేన్స్‌కు ఉన్న చరిత్ర దీనికి లేదు. ఆ స్థాయిలో ఇక్కడ చలనచిత్రోత్సవం కూడా జరుపరు. కానీ, ప్రతిఏటా ‘టొరంటో అంతర్జాతీయ చిత్రోత్సవం (టిఫ్)’ జరుగుతుంది. అయితే ఇది ఉత్తర అమెరికాలో అతిపెద్ద చలనచిత్రోత్సవం. అంతకన్నా ముఖ్యంగా ‘టిఫ్’ ప్రజల చలనచిత్రోత్సవం. ఈ చిత్రోత్సవానికి వచ్చిన ప్రతి సినిమాను సామాన్య ప్రేక్షకులు, మీడియా వ్యక్తులు, పరిశ్రమల ప్రతినిధుల కోసం అనేకసార్లు ప్రదర్శిస్తారు. అందువల్లే ఈ చిత్రోత్సవాన్ని ప్రజల చిత్రోత్సవంగా కీర్తిస్తుంటారు. టొరంటో నగరం కెనడా దేశ వినోదపు రాజధాని. ప్రపంచంలోని విభిన్న సంస్కృతుల కలయికల పసందైన నగరం. నగరంలోని స్విష్ బ్లూర్-యార్క్ విల్లే ప్రాంతంలో చలనచిత్రోత్సవం జరుగుతుంది.
సెప్టెంబర్‌లో ఇక్కడ అంతర్జాతీయ చిత్రోత్సవం ప్రారంభమైనా ఈ నగరంలో ఏడాదంతా ఏదో ఒక ఉత్సవం జరుగుతూనే ఉండి మహా సందడిగా కనిపిస్తుంది. 1976లో టిఫ్ ప్రారంభమైంది. యార్క్ విల్లే ‘హిప్పీ హంట్’ సంగీతానికి ప్రసిద్ధి. కెనడా దేశపు ప్రముఖ సంగీతకారులుగా ఖ్యాతి గడించిన జోని మిచెల్, గార్డాన్ లైట్‌ఫూట్, నీల్ యంగ్ తదితరులు తొలినాళ్లలో ఇక్కడి కాఫీ హౌజుల్లో ప్రదర్శనలు ఇచ్చేవారు. టొరంటో చలనచిత్రోత్సవంతో ఈ నగరం ఇప్పుడు సెలెబ్రిటీ సిటీగా పేరు తెచ్చుకుంది. టొరంటో డౌన్‌టౌన్‌లోని బ్లూర్-యార్క్ విల్లే సంప్రదాయానికి, ఆధునికతకు సంగమంగా కనిపిస్తుంది. కాగా, గత ఏడాది టిఫ్ ఉత్సవాలను నగరంలోని మరో ప్రాంతమైన ‘బెల్‌లైట్ బాక్స్’లో చిత్రోత్సవాలను జరిపారు. ఈ కొత్త ప్రదేశంలో ఒకేచోట మల్టీప్లెక్స్ థియేటర్లు, సమావేశ హాళ్లు ఉండడం విశేషం.

కర్టసీ : సూర్య Daily
No comments:
Post a Comment