విహారాలు

India

Gamyam

Sunday, March 27, 2011

సాగర అందాలకు అగ్రస్థానం... కన్యాకుమారి అగ్రము

వివేకానందుని స్ఫూర్తి క్షేత్రం... మహాత్ముని స్మారక చిహ్నం... ఇవి సముద్ర సోయగాలకు నెలవైన కన్యాకుమారి ని విహారకేంద్రగానే కాక, విజ్ఞాన ఖనిగా మార్చిన అద్భుత నిర్మాణాలు. పర్యాటక భారతావనికి చివరి మజిలీగా... త్రివేణి సంగమ పవిత్ర స్థలంగా... ఆధ్యాత్మిక క్షేత్రంగా ప్రసిద్ధిగాంచిన ప్రకృతి అందాల మణిమకుటం కన్యాకుమారి విశేషాలు...

Thiruvalluvar_Statueమూడు సముద్రాల అరుదైన మేలుకయిక కన్యాకుమారి ప్రధాన ఆకర్షణ. భారత దేశానికి దక్షిణ సరిహద్దుల్లోని కన్యాకుమారి పవిత్ర యాత్రాస్థలంగానే కాకుండా ప్రముఖ పర్యాటక కేంద్రంగా విలసిల్లుతోంది. సముద్ర సోయగాలకు నెలవైన కన్యాకుమారిలో ఉదయాన్నే తన నునులేత కిరణాలతో వెలుగులను ప్రసరింపజేసే సూర్యభగవానుడు, అప్పుడే సముద్ర గర్భం నుంచి ఉద్భవించి పైకి ఎగుస్తున్నాడా అన్నట్లు కనువిందు చేస్తుంటా డు. ముఖ్యంగా పౌర్ణ మి రోజు రాత్రి పూ ట ఏకకాలంలో జ రిగే సూర్యా స్తమ యం, చంద్రో దయాలను చూ సి పులకించని యాత్రికుడుండడేమో.

త్రివేణి సంగమ క్షేత్రం...
కన్యాకుమారిలో బంగాళాఖాతం, మరోవైపు అరేబియా మహాసము ద్రం, దిగువన హిందూ మహాసము ద్రం.. వీక్షకుల్ని పరవశింపజేస్తుం టాయి. సముద్రతీర ప్రకృతి రమణీ యతతో అలరారే కన్యాకుమారి సముద్ర తీరంలోని థోరియం ధాతువుతో కూడిన ఇసుక రేణు వులు పరమేశ్వరుడి అద్భుత శక్తికి ఆనవాళ్లుగా చెబుతుంటా రు. అలాగే వారణాసి పరమశివు డికి నివాస స్థలమైనట్లుగా, కన్యా కుమారి పార్వతిదేవికి నివాస స్థలమని స్థానికుల ప్రగాఢ విశ్వా సం. మూడు మహాసముద్రాల నీరు పార్వతీమాత పాదాలను కడుగుతున్నట్లుగా ఉంటుందని భక్తులు నమ్ముతుంటారు.

ప్రధాన ఆకర్షణలివే...
Triveni_Sangamamకన్యాకుమారిలో చూడదగ్గ పర్యాటక ప్రదేశాలు చాలానే ఉన్నాయి. వాటిలో ముఖ్యమైనవి వివేకానంద రాక్‌, తిరువళ్లువర్‌ విగ్రహం, గాంధీజీ స్మారక మంటపం, కుమరి ఆలయం ముఖ్యమైనవి. అలాగే ఈ ప్రాంతంలో అనేక రకాల అరుదైన పుష్పాలు, వృక్షాలను కూడా చూడవచ్చు. ఇంకా పెలికాన్‌, ఫ్లెమింగ్‌, స్పూన్‌బిల్‌, అనేక రకాల బాతులు.. కన్యాకుమారికి వలస వస్తుంటాయి. ఈ విదేశీ పక్షులు కూడా పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంటాయి.

వివేకానంద రాక్‌...
కన్యాకుమారి పర్యాటనలో ముందుగా చెప్పుకోవాల్సింది వివేకానంద రాక్‌. ఇక్కడ క్రీస్తు శకం 1892లో స్వామి వివేకానంద ధ్యానం చేశారు. ఆయన ధ్యానం చేసిన ఈ ప్రదేశంలో నల్ల చలువరాతితో స్మారక కేంద్రం నిర్మించారు. ఇక్కడ 12 అడుగుల ఎత్తుతో ఉండే వివేకానందుడి కాంస్య విగ్రహం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. 1970వ సంవ త్సరంలో అప్పటి రాష్టప్రతి వి.వి. గిరి ఈ విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ వివేకా నందుడి రాక్‌కు కొంత దూరంలో పార్వ తిదేవి పరమశివుడిని పెళ్లాడేందుకు తపస్సుచేసిన ప్రాంతం, అక్కడ శిలారూ పంలోని ఆమె పాద ముద్రిలు కూడా మనకు దర్శనమిస్తాయి.

తరువళ్లువర్‌ విగ్రహం...
Kanya-Kumari-Ammanవివేకానంద రాక్‌కు సమీపంలోని ఈ విగ్రహం 133 అడుగుల ఎత్తుతో ఉంటుంది. దీనిని 2000 సంవత్సరం లో తమిళనాడు ముఖ్యమంత్రి డాక్టర్‌ కరుణానిధి ఆవిష్కరించారు. ఈ తిరు వళ్లువర్‌ విగ్రహం బరువు ఏడువేల టన్నులు కాగా.. చాలా పొడవైన ఈ విగ్రహాన్ని దర్శించేందుకు పర్యాటకులు పడవలలో వెళ్లాల్సిందే. ఇది ఆసియా లోని ఎతె్తైన విగ్రహాలలో ఒకటిగా పేరుగాంచింది.

మహాత్ముని స్మారక చిహ్నం...

కన్యాకుమారిలో చూడదగిన మరో అద్భుత పర్యాటక క్షేత్రం మహాత్మా గాంధీ స్మారక మంటపం. గాంధీజీ అస్థికల పాత్రను ఉంచిన స్థలంలో 1954వ సంవత్సరంలో ఈ స్మారక మంటపాన్ని నిర్మించారు. మహాత్ముడి జయంతి అయిన అక్టోబర్‌ 2 మధ్యాహ్నం 12 గంటల సమయంలో సూర్య కిరణాలు ఆయన అస్థికలను స్పృశించేలా అద్భుతంగా నిర్మించడం విశేషం.

కుమరి ఆలయం...
Mahatma_Gandhi_Mandapamబాణాసురుడిని సంహరించిన అమ్మవారి కుమరి ఆలయం చూడదగ్గ మరో పర్యాటక ప్రదేశం. మూడువైపులా ఎతె్తైన గోడలున్న ఈ ఆలయంలో మూడు ప్రాకారాలు న్నాయి. ఆలయంలోని ముగ్ధ మోహనదేవి విగ్రహం భక్తులను పరవశింపజేసేలా ఉంటుంది. ఒకప్పుడు దేవి ముక్కెరలోని రత్నపు కాంతి నావికులను ఆకర్షించి నావలు రేవులోని బండరాళ్లను ఢీకొనేవని చెబుతుంటారు. బంగాళాఖాతానికి అభి ముఖంగా ఉండే ఈ ఆలయ ద్వారా న్ని ఎల్లప్పుడూ మూసే ఉంచుతారు. సంవ త్సరంలో ఓ నాలుగైదుసార్లు మాత్రమే ఉత్సవాల సందర్భంగా తెరుస్తారు.

ఆలయ చరిత్ర...
పురాణ కథనాల ప్రకారం కుమరి ఆలయంలో దేవతగా కొలువబడుతున్న కన్యాదేవి, పరమశివుడిని వివాహం చేసు కునేందుకు సిద్ధపడిం దట. అయితే ముహూర్తం సమయా నికి కూడా శివుడు రాకపోవ టంతో విందుకు సిద్ధంచేసి పెట్టుకున్న బియ్యం రాశులను, మిగిలిన వస్తువులను అలాగే ఉంచేశారట. కాలక్రమంలో అవే చిన్న చిన్న రాళ్లుగా, బండలుగా మారిపోయాయని స్థానికుల నమ్మకం. అందుకే ఇప్పటికీ కన్యాకుమారి సముద్రం ఒడ్డున బియ్యాన్ని పోలిన సన్నటి రాళ్లు కనిపిస్తుంటాయని చెబుతుంటారు.

ఇందిరాపాయింట్‌...

కన్యాకుమారి చివరి సరిహద్దును ఇందిరాపాయింట్‌ అని పిలుస్తారు. ఈ ప్రదేశాన్ని చూసేందుకు దేశం నలుమూలలనుంచే కాకుండా, విదేశాల నుంచి కూడా పర్యాటకులు తరలివస్తుంటారు. ముఖ్యంగా ఇక్కడి సూర్యోదయం, సూర్యాస్తమయాలు పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తాయి. అలాగే కన్యాకుమారి శివార్లలోని ఉదయగిరి కోట, విట్టకొట్టాయ్‌ కోటలు ఇక్కడ మరో ఆకర్షణ. కన్యాకుమారికి పది కిలోమీటర్ల దూరంలో ఉండే తమి ళులకు ప్రీతిపాత్రమైన స్వామితోప్‌ పతి ఆలయం భక్తులను ఆకట్టుకుంటుంది.

రొయ్యలకూ ప్రసిద్ధి...
ప్రముఖ పర్యాటక ప్రదేశంగా వెలుగొందుతున్న కన్యాకుమారి ‘రాక్‌ లాబ్‌స్టర్స్‌’ అని పిలిచే భారీ సైజు రొయ్యలకు కూడా ప్రసిద్ధి చెందినది. సగటున రెండు కేజీల బరువుండే ఈ లాబ్‌స్టర్ల ధర 5 వేల రూపాయల పైమాటే. కేంద్ర సముద్ర మత్స్య పరి శోధనా సంస్థ వాణిజ్య ప్రాతిపదికన కేజ్‌ కల్చర్‌ద్వారా ప్రత్యేకంగా పెంచ బడే ఈ లాబ్‌స్టర్లను ఎక్కువగా జపాన్‌, హాంకాంగ్‌ లాంటి ప్రాంతాలకు ఎగుమతి చేస్తుంటారు.

Vivekananda_Rockకన్యాకుమారి, మండపం, కేరళలోని విళింజం వంటి తీర ప్రాంతాల్లోనే ఈ లాబ్‌స్టర్లు ఎక్కువగా దొరుకు తుంటాయి. తీరం నుంచి 3 కిలోమీటర్ల దూరం వరకు సముద్రంలో ఉండే రాళ్ల చుట్టూనే ఉంటాయి కాబట్టి వీటికి రాక్‌ లాబ్‌స్టర్స్‌ అనే పేరు వచ్చింది. ఇవి రాళ్ల చుట్టూ ఉంటాయి కాబట్టి రొయ్యల్లా ట్రాలింగ్‌ చేసి మొత్తం ఊడ్చి పట్టేయడం సాధ్యపడదు. వేరే చేపల కోసం వేసిన వలల్లో ఇవి పడుతూ ఉంటాయి. సెప్టెంబరు-జనవరి మధ్య ఎక్కువగా లభించే వీటిని పట్టుకునేం దుకు మత్స్యకారులు కొన్ని ప్రత్యేక పద్ధతులు అవలంభిస్తుంటారు.

ఇలా వెళ్లాలి...
చెన్నై నగరానికి 743 కిలోమీటర్ల దూరంలో ఉండే కన్యాకుమారి ఎలా వెళ్లాలంటే.. విమాన మార్గంలో అయితే, మధురై నుంచి 250 కిలోమీటర్లు, తిరువనంతపురం నుంచి 90 కిలో మీటర్ల దూరం ప్రయాణించి వెళ్లవచ్చు. చెన్నై నుంచే కాకుండా దేశంలోని ప్రధాన నగరాలైన ఢిల్లీ, ముంబయి, కోల్‌కతాల నుంచి కన్యాకుమారికి నేరుగా రైలు సౌకర్యం ఉంది. తమిళనాడులోని అన్ని ప్రధాన పట్టణాలనుంచి రోడ్డు మార్గంలో ప్రయాణించి కన్యాకుమారి చేరుకోవచ్చు. ఇక వసతి విషయానికి వస్తే.. కన్యాకుమారిలో పలు చిన్న, పెద్ద హోటళ్లు అందుబాటులో ఉన్నాయి. అలాగే తమిళనాడు రాష్ట్ర పర్యాటక శాఖవారి హోటల్‌, దేవస్థానంవారి కాటేజీలు, ట్రావెలర్స్‌ బంగళా, అతిథి గృహాలు.. పర్యాటకులకు అందుబాటు లో ఉన్నాయి. 

కర్టసీ : సూర్య Daily

గౌతమి బుద్ధుని ఘనమైన గురుతు ... గుంటుపల్లి

తెలుగునాట గౌతమ బుద్ధిని ఆనవాళ్లకు కొదువలేదు. అమరావతి, భట్టిప్రోలు, నాగార్జున కొండ, ఘంటసాల... ఇలా చెప్పుకుంటూ పోతే సిద్ధార్థుని అడుజాడలు ఎన్నో చోట్ల మనకు దర్శనమిస్తాయి. అలాంటి ప్రఖ్యాతిగాంచిన బౌద్ధ క్షేత్రాలలో గుంటుపల్లి ఒకటి. పశ్చిమ గోదావరి జిల్లా కామవరపు కోట మండలంలోని ఈ చారిత్రక గ్రామం... ప్రసిద్ధ బౌద్ధ క్షేత్రంగా వెలుగొందుతోంది. మనరాష్ట్రంలోని అత్యంత ప్రాచీన బౌద్ధక్షేత్రాలలో ఒకటైన గుంటుపల్లి విశేషాలు... 

Guntupalli_big-boudhalayaప్రాచీన కాలంలోనే బౌద్ధమత జీవన విధానం ఆంధ్రదేశంలో నలుదిశలా ఫరిఢవిల్లింది. రాజులు, చక్రవర్తులు ఎందరో సిద్ధార్థుని అడుగుజాడల్లో నడిచి ప్రజలకు నిస్వార్ధ సేవచేశారు. ఆ క్రమంలో ఆంధ్ర దేశంలో బయల్పడిన అనేక బౌద్ధ నిర్మాణ శిథిలావశేషాలు బౌద్ధమత చరిత్రలో ఆంధ్రుల విశిష్టస్థానానికి నిద ర్శనంగా నిలుస్తున్నాయి. ఇటువంటి క్షేత్రాలలో బహు శా భట్టిప్రోలు అన్నింటికంటే ప్రాచీనమైనది. గుంటుపల్లి కూడా సుమారు అదే కాలాని కి చెందినది. క్రీపూ 3వ శ తాబ్దానికే ఇవి ముఖ్యమైన బౌ ద్ధక్షేత్రాలుగా విరాజిల్లాయి. గుంటుపల్లిని కొన్నేళ్ల క్రితం వరకు కేవలం బౌద్ధ క్షేత్రంగానే భావించారు. కానీ కొన్ని సంవత్సరాల క్రితం లభ్యమె ైన మహామేఘవాహ న సిరిసదా శాసనం ఖారవేలుని శాసనాల వల్ల ఇక్కడ జైనమతం కూడా విలసిల్లిందని నిరూపితమైంది.

చారిత్రక నేపథ్యం...
గుంటుపల్లి ఊరి కొండలపైన ఉన్న బౌద్ధారామాలు చారిత్రికంగా చాలా ముఖ్యమైనవి. ఇవి చారిత్రికమైన, పరిరక్షింపబడవలసిన పురాతన అవశేషాలు గా భారత పురావస్తు శాఖ నిర్ణయించింది. కొండమీద చైత్యగృహము, ఆరామ మంటపాలు, స్తూపాలు ఉన్నాయి. వీటిలో ఒక స్తూపంలో ధాతుకరండం దొరి కింది. ఈ తీర్ధం భక్తులను విశేషంగా ఆకర్షించేదనడానికి ఇక్కడ కనిపించే ఎన్నో ఉద్దేశిక స్తూపాలే నిదర్శనం. కొండలపైన అంచులో తొలిచిన గుహాల యం, బౌద్ధారామాలు, పైన ఉన్న ప్రార్ధనా స్తూపాలు, రాతి స్తూపం వంటి కట్టడాలు క్రీపూ 300 నుండి క్రీశ 300 మధ్యకాలంలో నిర్మించినట్లు భావిస్తున్నారు.

Guntupalli_Buddist_sitఅలంకరణలకు ప్రాముఖ్యం లేకుండా కట్టిన కట్టడాలు, బుద్ధుని ప్రతిమ వంటివి లేకపోవడం వంటి అంశాలవలన ఇవి బౌద్ధమతం ఆరంభకాలం (హీనయాన బౌద్ధం) నాటి ఆరామాలని విశ్లేషకుల అభిప్రాయం. బౌద్ధం ఆరంభకాలంలో శిల్పాలంకరణకు ఆదరణ ఉండేది కాదు. దృశ్య కళలు ఇంద్రియ వాంఛలను ప్రకోపింపచేస్తాయని బుద్ధుడు వాటిని నిషేధించాడు. సుందర కావ్య నిర్మాణాన్ని కూడా నిరసించా రు. వాటి ప్రయోజనం ధర్మానురక్తిని కల్గించడానికే పరిమి త మవ్వాలి కాని రసానుభూతి కాదు. మౌలిక బౌద్ధంలో క్రమశిక్షణ అంత కఠినంగా ఉండేది. జీలకర్రగూడెం, కంఠ మనేనివారి గూడెం గ్రామాలలో కూడా మరికొన్ని బౌద్ధా రామాలు కనుగొన్నారు.

ఇవీ.. ఇక్కడి ప్రముఖ నిర్మాణాలు...

గుహాలయం: క్రీపూ 3-2వ శతాబ్దానికి చెందిన ఈ చైత్యం అతి ప్రాచీనమైనది. గుండ్రంగా ఉన్న ఈ గుహ లోపల స్తూపం (ప్రస్తుతం ధర్మ లింగేశ్వర శివలింగంగా భావిస్తున్నది), చుట్టూరా ప్రదక్షిణామార్గం ఉన్నాయి. ఈ గుహ పైభాగంలో వాసాలు, ద్వారానికి కమానులు (చెక్క మందిరాల్లాగా) చెక్కబడి ఉన్నాయి. ఈ గుహాలయానికి బీహార్‌లోని సుధామ, లోమస్‌ఋషి గుహాలయాలతో పోలికలుండడం విశేషం.

పెద్ద బౌద్ధ విహారం:
Dharmalingeshwaraswamyఇది ఇసుకరాతి కొండ అంచులో తొలచిన గుహల సముదాయం. బౌద్ధ భిక్షువులకు నివాస స్థానం. గుహలు ఒకదానికొకటి గుండ్రని కిటికీలతో కలుపబడి ఉన్నాయి. గుహల్లోకి ఊరే నీరు, వర్షపు నీరు కాలువల ద్వారా పగులులలోనికి ప్రవహిస్తుంది.

మొక్కుబడి స్తూపాలు: కొండపైని వివిధ ఆృతులలో, ముఖ్యంగా గుండ్రంగా సుమా రు అరవై మొక్కుబడి స్తూపాలున్నా యి. ఇవి రాళ్ళతో లేదా ఇటుకలతో కట్టబడిన పీఠ ములపై నిర్మింపబడినవి. వీటిమధ్య మొక్కు బడి చైత్య గృహాలు కూడా ఉన్నాయి.

రాతి స్తూపములు: ్ర పూ 2వ శతాబ్దానికి చెందిన ఈ స్తూపం పైభాగం అంతా రాతి ఫలకాలతో కప్పబడి ఉంది. క్రీ పూ 19వ శతాబ్దం కాలంలో దీనిలో కొంత భాగం త్రవ్వకాలు జరిపారు. అంతకు మునుపే నిధులు వెదికేవారి బారినపడి ఇది నాశనమై ఉంది. దీని గుమ్మటం ఎత్తు 2.62 మీ., వ్యాసం 4.88 మీటర్లు.

శిధిల మంటపం: ఇది నాలుగు విరిగిన స్తంభాలతో ప్రస్తుతం నామమాత్రంగా ఉన్న కట్టడం. పూర్వం బౌద్ధ భిక్షువుల సమావేశ మందిరం. ఇక్కడ లభించిన శిలా స్తంభ శాసనంలో క్రీ పూ 1 నుండి క్రీ శ 5వ శతాబ్దం వరకు లభించిన దానముల గురించి వివరణ ఉంది. ఈ కట్టడం అసలు పొడవు 56 అడుగులు, వెడల్పు 34 అడుగులు.

చైత్య గృహం:
Mokkubadi_Sthupaluఇది గజపృష్టాకారంలో 17.6 మీటర్లు పొడవు, 4.42 మీటర్లు వెడల్పు కలిగి ఉంది. దీని గోడ 1.32 మీటర్లు ఎత్తువరకు లభించింది. దీని ప్రవేశ ద్వారములకు ఇరువైపుల దేవ కోష్టములలో బుద్ధుని, బోధిసత్వుని ప్రతిమలు ఉండవచ్చును. దీని అలంృత అధిష్టానము నాసిక్‌, కార్లే గుహలను పోలి ఉంది.

ఇటుకల స్తూప చైత్యం: ఇది కూడా క్రీపూ 3-2వ శతాబ్దానికి చెందిన కట్టడం. కొండ తూర్పు చివర ఎతె్తైన సమతల ప్రదేశంలో నిర్మింపబడింది. దీనిని చేరుకొనే మెట్ల వరుసను క్రీ పూ 2-1వ శతాబ్దానికి చెందిన ఒక ఉపాసిక కట్టించాడని చరిత్రకారుల అభిప్రాయం. ఈ చైత్య గృహం 11 మీటర్ల వ్యాసం కలిగి ఉన్నది. స్తూపం చుట్టూ 1.8 మీటర్ల వెడల్పు గల ప్రదక్షిణాపధం ఉన్నది.

ఇటీవల వెలుగులోకి వచ్చినవి...
డిసెంబర్‌ 4, 2007వ సంవత్సరంలో... ఈ గుహాసముదాయంలో క్రీస్తుశకారంభానికి చెందినదిగా బావిస్తున్న ఒక బ్రహ్మలిపితో ఉన్న శాసనం లభ్యమైంది. ఈ శాసనం ద్వారా పలు చారిత్రక సంఘటనలు వెలుగు చూశాయి. నాడు తెలుగులో నూతనంగా రూపొందుతున్న తెలుగు నుడికారాలు, గుణింతాల రూపాలను ఈ చలువరాతి ఫలకం ఆవిష్కరించినది. ప్రసిద్ద బౌద్దాచార్యుడైన మిడిలకుడు అనే బౌద్ద సన్యా సి ఈ ఫలకాన్ని గుంటుపల్లి గుహలలో నివసించే బౌద్ద బిక్షులకు దానం చేసిన ట్లు చెబుతున్న ఈ శిలాఫలకంలో ప్రాృత భాషలో ఉన్నది. కేంద్ర పురావస్తు శాఖ ఆంధ్ర రాష్ట్ర విభాగం ఈ శిలా శాసనాన్ని వెలుగులోకి తెచ్చింది.

Tuesday, March 15, 2011

వెండితెర వెన్నెల నగరం..కేన్స్‌

cannesవేసవి సెలవుల్లో అంతర్జాతీయ సినిమా పండుగలో పాల్గొనాలనుకునేవారికి కేన్స్‌, టొరంటో నగరాలను మించి విడిది లేదు. నిజానికి కేన్స్‌... ఫ్రాన్స్‌ రాజధాని కాదు. ప్యారిస్‌కు దగ్గర్లో లేదు. అయినా ప్రపంచ పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తుంది. దానికి ప్రధాన కారణం వేసవిలో ఇక్కడ జరిగే అంతర్జాతీయ చిత్రోత్సవాలే... ప్రపంచ సినిమాకది కేంద్రం కూడా కాదు. కానీ, భారీ బడ్జెట్‌తో వెండితెరపై అద్భుతాలను ఆవిష్కరించే మహా దర్శకులు, నటీనటులకు... ఒక రకంగా చెప్పాలంటే ప్రతి సినీ జీవి కేన్స్‌తో అనుబంధం ఉండాలని కోరుకుంటాడు. కేవలం సినిమా పండుగకే కేన్స్‌ ప్రసిద్ధి అనుకుంటే పొరపాటే. అక్కడ ఇంకా చాలా విశేషాలున్నాయి.

మే నెలలో పన్నెండు రోజుల సినిమా పండుగకు కేన్స్‌ వేదిక. ఫ్రాన్స్‌లోని సముద్ర తీరాన ఉన్న ఈ నగరం, యూరప్‌లో ఎంతో ప్రాచుర్యం పొందిన నగరాల్లో ఒకటి. ఈ ప్రపంచంలో కేన్స్‌ చలనచిత్రోత్సవాన్ని మిచిన చిత్రోత్సవం మరొకటి లేదు. ఈ సినిమా పండుగకోసం దాదాపు రెం డు లక్షలమంది అక్కడికి చేరుకుంటారు. వారిలో దాదాపు 40 వేల మంది నమోదు చేసుకున్న ప్రతి నిధులు కాగా... మరో 4 వేల మంది అక్రిడేషన్‌ గల పాత్రికేయులు. మీడియా కవరేజ్‌లో దీనికి ఎంతో ఖ్యాతి. ప్రపంచం మొత్తం మీద భారీగా మీడియా కవరేజీ పొందే ఉత్సవాల్లో ఇది మూడవది. మొదటిది ఒలింపిక్స్‌ అయితే రెండవది సాకర్‌ ప్రపంచ కప్‌.

ఎటు చూసినా... సినిమా... సినిమా...
InterContinental_Carlton_Caమనకు తెలిసిన ప్రపంచం నుండి కేన్స్‌ ఉత్సవానికి వెళ్లడం గొప్ప అనుభవం. ‘నైస్‌ కోట్‌డి అజర్‌’ విమానాశ్రయంలో దిగడం తో ఈ అద్భుత అనుభవాల ప్రస్థానం మొదలవు తుంది. కేన్స్‌లో వైవిధ్యమైన ఆహారం దొరుకుతుంది. రకరకాల రుచులు, కోరిన తరహా ఆహార పదార్థాలు లభిస్తాయి. వాటిని చూస్తేనే కడుపు నిండిపోతుందా అనిపిస్తుంది. మే నెలలో కేన్స్‌ సినిమానే తింటుంది. సినిమానే తాగుంది. సినిమానే శ్వాసిస్తుంది. అక్కడ సర్వం సినీమయం. సినీ గ్లామర్‌ నుండి తప్పించుకోవడం అక్కడ అసాధ్యం. బోలేవార్డ్‌ డి లా క్రోసిటీలో ఉన్నా, ఇంకా అనేక బొటిక్‌లు, హోటళ్లకు వెళ్లినా సినిమా సందడే. పసందైన విందులూ, వినోదాలు, భారీ తెరలపై టీవీ ప్రదర్శనలు, ఇతర కార్యక్రమాలతో ఊరు ఊరంతా ఉర్రూతలూగిపోంతుంది. ప్రపంచం మొత్తం మీద అత్యంత సందడి గా సాగేది కేన్స్‌ సినిమా పండుగ. ఊర్రూతలూపే సినీ ఉత్సవం.

festival-de-cannes1 కేన్స్‌ ఒకప్పుడు చేపల పరిశ్రమకు ప్రసిద్ధి చెందిన ఓడ రేవు. ఇప్పుడు వెండితెర వేల్పులకు, సరదా సంబరాలకు వేదికగా మారింది. రెండువారాల పాటు ఇక్కడి తళుకు బెళుకులు చూడాలే తప్ప మాటల్లో వర్ణించలేం. కేన్స్‌కు ఇంతటి ఉత్సవ శోభ రావడానికి ప్రత్యేక కారణం ఏమిటో చూడాలి. సనీ ఉత్సవం జరిగే వేదికల ముందు జనం బారులు తీరి కేరింతలు కొడుతుంటే, అది టీవీల్లో చూసే జనం కూడా తామూ అక్కడికి వెళ్తే బాగుంటుందని అనుకుంటే ఇక సందర్శకుల సంఖ్య పెరగడంలో వింతేముంది. కేన్స్‌ ఎర్రతివాచీ మీద నడవడం గౌరవమని ప్రపంచ సినీ ప్రముఖులు భావిస్తారు. ఈ పండుగ రోజుల్లో బీచ్‌లలో పార్టీలు సంబరాలు షరామామూలే. వైన్‌ పొంగి ప్రవహిస్తుంది. షాంపేన్‌ ఫౌంటెయిన్‌లా వర్షిస్తుంది. మందు చిందులతో సముద్రతీరం సరదాగా సాగరమే అవుతుంది. ఓ వైపు అందాల తారలు, మరోవైపు సినీ దిగ్గజాలు, మరోవైపు మజా మజా పార్టీలు, తైతక్కలు, సంగీత హోరులో డ్యాన్సులూ, బీచ్‌లలో ఒకటే పార్టీలు. ఇదీ సినిమా పండుగ సందర్భంలో కేన్స్‌ దృశ్యం.

మరో సినీ ప్రపంచం... టొరంటో
festival-de-cannes కెనడాలోని ఒంటారియో రాష్ట్రంలోని పట్టణం టొరంటో. ఇది ఇంచుమించు కేన్స్‌ పరిమాణంలో ఉంటుంది. అయితే కేన్స్‌కు ఉన్న చరిత్ర దీనికి లేదు. ఆ స్థాయిలో ఇక్కడ చలనచిత్రోత్సవం కూడా జరుపరు. కానీ, ప్రతిఏటా ‘టొరంటో అంతర్జాతీయ చిత్రోత్సవం (టిఫ్‌)’ జరుగుతుంది. అయితే ఇది ఉత్తర అమెరికాలో అతిపెద్ద చలనచిత్రోత్సవం. అంతకన్నా ముఖ్యంగా ‘టిఫ్‌’ ప్రజల చలనచిత్రోత్సవం. ఈ చిత్రోత్సవానికి వచ్చిన ప్రతి సినిమాను సామాన్య ప్రేక్షకులు, మీడియా వ్యక్తులు, పరిశ్రమల ప్రతినిధుల కోసం అనేకసార్లు ప్రదర్శిస్తారు. అందువల్లే ఈ చిత్రోత్సవాన్ని ప్రజల చిత్రోత్సవంగా కీర్తిస్తుంటారు. టొరంటో నగరం కెనడా దేశ వినోదపు రాజధాని. ప్రపంచంలోని విభిన్న సంస్కృతుల కలయికల పసందైన నగరం. నగరంలోని స్విష్‌ బ్లూర్‌-యార్క్‌ విల్లే ప్రాంతంలో చలనచిత్రోత్సవం జరుగుతుంది.

సెప్టెంబర్‌లో ఇక్కడ అంతర్జాతీయ చిత్రోత్సవం ప్రారంభమైనా ఈ నగరంలో ఏడాదంతా ఏదో ఒక ఉత్సవం జరుగుతూనే ఉండి మహా సందడిగా కనిపిస్తుంది. 1976లో టిఫ్‌ ప్రారంభమైంది. యార్క్‌ విల్లే ‘హిప్పీ హంట్‌’ సంగీతానికి ప్రసిద్ధి. కెనడా దేశపు ప్రముఖ సంగీతకారులుగా ఖ్యాతి గడించిన జోని మిచెల్‌, గార్డాన్‌ లైట్‌ఫూట్‌, నీల్‌ యంగ్‌ తదితరులు తొలినాళ్లలో ఇక్కడి కాఫీ హౌజుల్లో ప్రదర్శనలు ఇచ్చేవారు. టొరంటో చలనచిత్రోత్సవంతో ఈ నగరం ఇప్పుడు సెలెబ్రిటీ సిటీగా పేరు తెచ్చుకుంది. టొరంటో డౌన్‌టౌన్‌లోని బ్లూర్‌-యార్క్‌ విల్లే సంప్రదాయానికి, ఆధునికతకు సంగమంగా కనిపిస్తుంది. కాగా, గత ఏడాది టిఫ్‌ ఉత్సవాలను నగరంలోని మరో ప్రాంతమైన ‘బెల్‌లైట్‌ బాక్స్‌’లో చిత్రోత్సవాలను జరిపారు. ఈ కొత్త ప్రదేశంలో ఒకేచోట మల్టీప్లెక్స్‌ థియేటర్లు, సమావేశ హాళ్లు ఉండడం విశేషం.

కర్టసీ : సూర్య Daily

Monday, March 14, 2011

సహ్యాద్రి శోభ, సెరియేళ్ళనాదంతో ఆకర్షించే.. మంగళూరు


New_Mangaloreసముద్ర తీరప్రాంతం, చుట్టుప్రక్కల అంతా కొబ్బరిచెట్ల సోయగాలు, ప్రకృతి రమణీయ దృశ్యాలు, సహ్యాద్రి కొండల వంపుసొంపులు, అక్కడ ప్రవహించే సెలయేళ్ళ శోభకు మంగళూరు పెట్టింది పేరు. బీచ్‌లు, దేవాలయాలు, పరిశ్రమలు, బ్యాంకింగ్‌, విద్యాసంస్థలకు ప్రసిద్ధి చెందిన మంగళూరు కర్ణాటక రాష్ట్రంలోనే ప్రసిద్ధిగాంచిన పర్యాటకకేంద్రం. రాష్ట్రానికే గాక, భారతదేశానికి తొలి నౌకాశ్రయాన్నిచ్చిన నగరం మంగళూరు. దక్షిణ కన్నడ జిల్లా రాజధాని అయిన ఈ నగరం... అధికార, పరిపాలనా కేంద్రంగా విలసిల్లుతోంది.

నేత్రావతి, గుర్‌పుర్‌ నది ఒడ్డున ఈ ప్రాంతం ఉండటంవల్ల అరేబియా స ముద్ర జలాలు కొద్దిగా వెనక్కు వస్తుంటాయి. అంతేకాక, మలబార్‌ తీరం లో మంగళూరు కూడా ఒక భాగమే కావటం గమనార్హం. రాష్ట్ర భాష అయిన కన్నడ, ఉడిపికి ప్రాంతీయ భాష అయిన తుళు, కేరళకు సరిహద్దుల్లో ఉండటంవల్ల మళయాలం, కొంకణి జనా భా కూడా ఉండటం వల్ల కొంక ణి భాషలు మంగళూరులో వాడుకలో ఉన్నాయి. ప్రాంతీయ భాషలే కాకుం డా... హిందీ, ఆంగ్లం కూడా మాట్లాడతారు.

మంగళూరుకు ఆ పేరు ఎలా వచ్చిందంటే...
Kadri_Park నగర దేవతైన మంగళాదేవి పేరే నగరం పేరుగా స్థిరపడినట్లు పూర్వీకులు చెబుతుంటారు. అదే విధంగా అనేక శతాబ్దాలుగా ఈ నగరం వివిధ సంస్కృ తులకు నిలయం కావటంతో, అక్కడ నివసించే భిన్నజాతులవారు తమ తమ మాతృ భాషలలో మంగళూరుకు అనేకమైన పేర్లు పెట్టారు. అలా స్థానిక భాషలో మంగళూరును కుడ్ల అని పిలు స్తారు. కుడ్ల అంటే కూడలి అని అర్థం.

అలాగే నేత్రావతి, ఫల్గుణి నదుల సంగమస్థానం కావటంవల్ల మంగళూరుకు ఆ పేరు వచ్చినట్లుగా చెబుతుంటారు. కొంకణి భాషలో మంగళూరును కొడియల్‌ అని పిలుస్తుంటారు. ఇక ముస్లింలలో ఒక వర్గంవారైతే ఈ నగరాన్ని మైకల అని ముద్దు గా పిల్చుకుంటారు. దక్షిణ కేరళ ప్రాంత ప్రజలు మాత్రం మంగళాపురంగా పిలుస్తారు. ఇదిలా ఉంటే.. 2006లో సువర్ణ కర్ణాటక పేరుతో మంగళూరును మంగలూరుగా కర్ణాటక ప్రభుత్వం మార్పుచేసింది.

సముద్ర మట్టానికి 45 మీటర్ల ఎత్తులో ఉండే మంగలూరు పట్టణం అరేబియా సముద్రంలో భాగమైన కొంకణ తీరంలో ఉం డే గోవాకు దగ్గర్లో ఉంది. 3వ జాతీ య రహదారుల ద్వారా మంగళూరు దేశానికి కలుపబడుతుంది. మహారాష్ట్ర లోని పణవెల్‌ నుంచి ప్రారంభమై కేరళలోని క్రణగాణురు జంక్షన్‌ వరకూ మంగళూరు రహదారి వెళుతుంది. ఎన్‌.హెచ్‌-48 మంగళూరు నుంచి బయ లుదేరి కర్ణాటక రాజధాని తూర్పువైపుకు బెంగళూరుదాకా వెళుతుంది. ఎన్‌. హెచ్‌-13 ఈశాన్య మార్గంలో షోలాపూర్‌ మీదుగా మడికరి, మైసూర్‌ పట్టణా లమీదుగా పోతుంది. మంగళూరు నుంచి బెంగళూరువరకూ మధ్య ప్రతిదినం 300 బస్సులు నడుస్తుంటాయి.

దర్శనీయ స్థలాలెన్నో..!
Ullal_Beach మంగళూరు చుట్టుప్రక్కల అనేక దర్శనీయ స్థలాలు ఉన్నాయి. వాటిలో పణం బూర్‌ బీచ్‌, ఉల్లాల్‌ బీచ్‌, నేత్రావతి బ్రిడ్జి, కద్రి ఉద్యానవనం, లాల్‌బాగ్‌, సుల్తాన్‌ బత్తెరీ, మంగళాదేవి ఆలయం, కద్రి దేవాలయం, సెయింట్‌ అలోసియస్‌ చర్చి, కాలేజీ, కొత్త మంగళూరు రేవు, గోకర్ణనాథేశ్వర ఆలయం, శరవు మహా గణప తి ఆలయం.. తదితరాలు ముఖ్యందా చూడాల్సిన పర్యాటక ప్రాంతాలు.

రవాణా మార్గాల విషయానికి వస్తే.. కర్ణాటక రోడ్డు రవాణా సంస్థ మంగళూ రు నుంచి సుదూర ప్రాంతాలకు బస్సులను నడుపుతోంది. మంగళూరు- బెంగళూరు మధ్య ఫ్యాసింజర్‌ రైల్వే సౌక ర్యం లేని కారణంగా కేఎస్‌ఆర్టీసీ బస్సుల్ని నడుపుతోంది. ఇక్కడి నుండి అంకోలా, హుబ్లీ, బెల్గాం, పూణె, ముంబాయి వంటి ప్రధాన నగరాలకు కూడా బస్సు సౌకర్యం ఉండడం విశేషం.

విమానమార్గం విషయానికి వస్తే.. మంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయం నగర నడిబొడ్డుకు ఈశాన్యదిశగా 20 కిలోమీటర్ల దూరంలో ఊరి పొలిమేరలైన బజ్‌పేలో ఉంది.

కర్టసీ : సూర్య Daily

భాగ్యనగరానికి వన్నెతెచ్చిన గోల్కొండ కోట

అంతా ‘ధ్వని’ మాయ ..!
Fateh_Darwaazaహైదరాబాద్‌ పేరు చెప్పగానే... ముందుగా గుర్తుకు వచ్చేది చార్మినార్‌, ఆ తరువాత గోల్కొండ కోట. కాకతీయులు, బహమనీ సుల్తానులు, కుతుబ్‌ షాహీల ఏలుబడిలో ఎంతో ఘనత వహించిన ఈ అద్భుత కోట రాష్ట్రానికే గాక, దేశంలో ప్రఖ్యా తిగాంచిన పర్యాటకకేంద్రంగా వెలుగొందుతోంది. భాగ్యనగరానికి వన్నెతెచ్చిన ఈ కోటలో ఇప్పటికీ అంతుబట్టని విషయాలెన్నో..! అందులో ఒకటి ఫతే దర్వాజా ధ్వని మాయ. శాస్త్ర విజ్ఞానానికీ అంతుచిక్కని ‘విజయ ద్వార’ రహస్యం ఇప్పటికీ ఓ వింతే...

నాలుగు వేరు వేరు కోటలు, 87 అర్ధ చంద్రాకారపు బురుజులతో కలిపి 10 కిలోమీటర్ల పొడవుతో కూడిన గోడలు, 8 సింహ ద్వారములు, 4 వంతెనలు (డ్రా బ్రిడ్జి), లెక్కలేనన్ని రాచమందిరాలు, మసీదులు, గుళ్ళు, అశ్వశాలలతో అలారారుతున్న గోల్కొండ కోట ప్రత్యేకత ప్రవేశద్వారం (ఫతే దర్వాజ) నుండే మొదలవుతుంది.

ఫతే దర్వాజా (విజయ ద్వారం)...
Golconda సింహద్వారాలలో అన్నింటికంటే కిందిది. అన్నింటికంటే బయటగా ఉండే ఫతే దర్వాజా (విజయ ద్వారం) నుంచే మనం గోల్కొండ కోటలోకి ప్రవేశించాల్సి ఉంటుంది. ఔరంగజేబు విజయం తరువాత ఈ ద్వారం గుండానే తన సైన్యాన్ని నడిపించాడట. ఏనుగుల రాకను అడ్డుకునేందుకు కోటకు ఆగ్నేయ దిక్కున పెద్ద పెద్ద ఇనుప చువ్వలు ఏర్పాటు చేశారు.

ధ్వనిశాస్త్రంలో ఆరితేరిన నిపుణులచే నిర్మించిన ఈ ఫతే దర్వాజాను చూసిన ఎవరికయినా సంబ్రమాశ్చ ర్యాలు కలుగక మానవు. ఎందుకంటే... గుమ్మటం కింద ఒక నిర్ణీత ప్రదేశం లో నిలబడి చప్పట్లు కొడి తే కిలోమీటరు అవతల ఉండే గోల్కొండ కోటలో అతి ఎత్తయిన ప్రదేశంలో ఉన్న బాలా హిస్సారు దర్వాజా వద్ద చాలా స్పష్టంగా వినిపిస్తుంది. ఈ విశేషాన్ని ఒకప్పుడు ఇక్కడి నిర్వాసితులు ప్రమాద సంకేతాలు తెలిపేందుకు ఉపయోగించేవారట. కానీ, ఇప్పుడు మాత్రం సందర్శకులకు వినోదం పంచేదిగా అది చరిత్రలో మిగిలిపోయింది.

బాలా హిస్సారు దర్వాజా...
Golconda1 అన్ని ముఖ ద్వారాలలోకెల్లా బాలా హిస్సారు దర్వాజా ఎంతో మనోహరమైంది. ఆర్చీల మూల ఖాళీలలో ఉన్న సన్నటి రాతి పలకల మీద కాల్పనిక మృగాలు, సింహ పు బొమ్మలు ఈ రక్షణ ద్వారానికి ప్రత్యేక అలంకా రాలుగా చెప్పుకోవచ్చు. బాలా హిస్సారు దర్వాజా నుండి కొండపైకి వెళ్ళేందుకు 380 ఎగుడు, దిగుడు రాతిమెట్లు ఉంటాయి. ఆ మెట్లు అన్నీ ఎక్కిన తరువా తనే మనకు బాలా హిస్సారు బారాదరీ అని పిలవబడే ఒక మంటపం కనిపిస్తుంది.

దర్బారు హాలుగా ఉపయో గించే ఈ కట్టడంలో 12 ఆర్చీలు, మూడు అంతస్తులు ఉన్నాయి. దానిని వంపు తిరిగిన గదులుగా దృఢమైన స్థంబాలతో విభజించారు. ఎత్తులో ఉన్న ఒక గదికి ఆనుకొని ఉన్న మూడు ఆర్చీల ద్వారా వెనుక ద్వారం తెరచుకుంటుంది. ఒక ఎత్తయిన మిద్దెపైన మనకు రాతి సింహాసనం కనిస్తుంది.

కొండలలో విసిరేసినట్లున్న ఈ మంటపంలో అబుల్‌ హసన్‌లు తమ ఉంపుడుగత్తెలను ఉంచేవారని చాలామంది నమ్ముతారు. బారాదరీలో మనకు మరో విశిష్టత కనిపిస్తుంది. అదేంటంటే... జంట గోడల మధ్య ఉన్న ఖాళీలు గాలిని పీల్చి, పీడనం పెరిగేటట్లుగా గదిలోనికి వదులుతూ, సహజసిద్ధమైన కూలరులాగా ఉంటుంది. ఇన్ని విశిష్టతలు కలిగిన ఈ కోట భాగ్యనగరానికి ప్రధాన విహారకేంద్రంగా వెలుగొందుతోంది.

కర్టసీ : సూర్య Daily

Wednesday, March 9, 2011

గోదారి ఒడ్డున ప్రకృతి పడుచు... పట్టీసీమ

అందమైన గోదారి నడుమ అహ్లాద కరమైన వాతావరణంలో పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తోన్న ప్రకృతి సౌందర్య కేంద్రం పట్టిసీమ. పట్టిసీమలో విడిది చేయకుండా... పాకింకొండలు-భద్రాచలం బోటు ప్రయాణం పరిపూర్ణం కాదంటే అతిశయోక్తి కాదు. ఇక్కడ వెలిసిన శ్రీ వీరభద్రస్వామి ఆలయంలో ప్రతి సంవత్సరం జరిగే మహాశివరాత్రి తిరునాళ్ళు తప్పకుండా దర్శించాల్సిన ఉత్తవాలు. ప్రకృతి అందాలతోనే కాక చారిత్రకంగా, ఆద్యాత్మికంగా విశిష్ట స్థానాన్ని సంపాదించుకున్న పట్టిసీమ పర్యాటక విశేషాలు...

Pattiseema_3స్థానికులు ‘పట్టిసం’ అని కూడా పిలుచుకునే విశిష్ట విహారకేంద్రం పశ్చిమగోదావరి జిల్లా పోలవరం మండలంలోని పట్టిసీమ. కొవ్వూరుకు 25 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ ప్రదేశం గోదావరి ఒడ్డున, ఇసుకతిన్నెల నడుమ ప్రకృతి అందాలతో అలరారుతోంది.పాపికొండల మధ్య సాగే గోదావరి బోటు ప్రయాణంలో ఇది ప్రధాన విడిది కేంద్రం. ఇక్కడ గోదావరి ఒడ్డున దేవకూట పర్వతంపైన వీరభద్రస్వామి వారి ఆలయం, భావనారాయణ స్వామివార్ల ఆలయాలు ఉన్నాయి. తెలుగు సినిమాలలో అత్యధికంగా చిత్రీకరణ జరిగిన మంచి అందమైన దేవాలయం ఇది. ఎప్పుడూ సినిమా షూటింగులతో రద్దీగా ఉండే దీన్ని పట్టిసం, పట్టిసంనిధి, పట్టిసీమ అని కూడా పిలుస్తుంటారు. గోదావరి మధ్యనున్న చిన్న లంక మాదిరి ప్రదేశంలో శ్రీ వీరభధ్రస్వామి దేవస్థానం ప్రశాంత వాతవరణంలో అతి సుందరంగా ఉంటుంది. ఇక్కడ మహాశివరాత్రి పర్వదినాన ప్రతియేటా ఐదురోజులపాటు బ్రహ్మాండమైన ఉత్సవాలు జరుగుతాయి. ఈ తిరునాళ్ళకు లక్షలాదిగా భక్తులు తరలి వస్తుంటారు.

సినిమా షూటింగ్‌కు ప్రసిద్ధిగాంచిన దేవాలయం...
పాపి కొండల మధ్య సాగే గోదావరి నది ఒడ్డున ఉన్న చిన్న కొండపై ఈ వీరభద్రస్వామి దేవస్థానం కొలువై ఉంది. చుట్టూ గోదావరి మధ్యలో దేవాలయం ఉండడంతో ఇక్కటి వాతావరణం ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుంది. అలాగే ప్రస్తుతం విస్తరణ పనుల్లో భాగంగా ఆలయం చుట్టూ పెంచిన చెట్ల పెంపకంతో ఈ ప్రాంతాన్ని సందర్శించిన వారిని ఈ దేవాలయం విశేషంగా ఆకర్షిస్తుంది. ఈ కారణంగానే దాదాపు అన్ని కాలాల్లో ఇక్కడ సినిమా షూటింగ్‌లు జరుగుతుంటాయి.

ఆధ్యాత్మికతను నెలవు వీరభద్రస్వామి దేవస్థానం...
ఇక్కడ వెలిసిన వెలసిన వీరభద్రస్వామి ఆలయం మరీ అంత పెద్దది కాకపోయినా సమీప గ్రామాల్లో ఈ ఆలయం విశిష్ట స్థానం సంపాదించుకుంది. ఏడాది మొత్తంలో జరిగే చిన్నా చితకా ఉత్సవాలతో పాటు మహా శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని ఇక్కడ ఐదు రోజుల పాటు ఘనంగా ఉత్సవాలు నిర్వహిస్తారు. ఈ ఉత్సవాలకు చుట్టు పక్కల గ్రామాల నుంచి లక్షలాదిగా భక్తులు తరలి వస్తుంటారు. ఒకప్పుడు దేవాలయము శిధిలమవడం వల్ల దేవాలయానికి పూర్తి మరమ్మత్తులు చేశారు. దేవాలయం చుట్టూ అందమైన తోటలు, పూలమొక్కలు, గడ్డి పెంచుతున్నారు.

Pattiseemaఒకప్పుడు ఇక్కడ కనీసం మంచి నీళ్ళు కూడా దొరకని పరిస్థితి ఉండేది. కాని ఇప్పుడు దేవాలయములో అన్ని రకాల సౌకర్యాలున్నాయి. భక్తులు విడిది చేసేందుకు ఇక్కడ గదులు నిర్మించారు. త్రాగుగునీటి వసతులు, భోజనశాలలు, గోదావరి పడవల రేవు, స్నానాలరేవులను రెండేళ్ళ క్రితం కొత్తగా ఏర్పాటు చేశారు. చుట్టూ గోదావరి, మధ్యలో దేవాలయం ఉండడంతో ఇక్కటి వాతావరణం గంభీరంగానూ, అందంగానూ ఉంటుంది. అలాగే ప్రస్తుతం విస్తరణ పనుల్లో భాగంగా ఆలయం చుట్టూ పెంచిన చెట్ల పెంపకంతో ఈ ప్రాంతాన్ని సందర్శించిన వారిని ఈ దేవాలయం విశేషంగా ఆకర్షిస్తుంది.

ఆలయ చరిత్ర...
దక్షయాగంలో సతీదేవి అగ్నికి ఆహుతికాగా, రౌదమ్రూర్తియైన పరమశివుడు తన శిరస్సునుండి ఒక జటాజూటాన్ని పెరికి నేలకు వేసి కొట్టగా అందులోనుండి వీరభద్రుడు ఆవిర్భవించిచాడు. అప్పుడు... దక్షుని యాగాన్ని ధ్వంసం చేయమని శివుడు ఆనతీయగా వీరభద్రుడు ప్రమధగణాలతో హుటాహుటిన దక్షుని యాగ శాలకు వెళ్ళి యఙ్ఞకుండమును ధ్వంసముచేసి అడ్డువచ్చినవారిని సంహరిస్తూ దక్షుని శిరస్సు ఖండించాడు. ఆ రౌద్రమూర్తి దేవకూట పర్వతముపై ప్రళయ తాండవం చేస్తుండగా... అతని చేతిలోని ‘పట్టిసం’ అనే కత్తి జారి దేవకూట పర్వతముపై పడింది. వీరభద్రుని రౌద్ర తాండవాన్ని ఎవరూ ఆపలేక చివరకు అగస్త్యమహామునిని వేడుకున్నారు.

Pattiseema_2అప్పుడు అగస్త్యమహాముని వచ్చి వీరభద్రుని వెనకనుంచి ఆలింగనముచేసుకొని విడిపోయిన అతని జటాజూటాన్ని ముడివేసి అతన్ని శాంతింపచేశాడని పురాణ గాధ.అక్కడే రుద్ర సంభూతుడైన వీరభద్రుడు భద్రకాళీ సమేతుడై వెలిశాడట. ఈ ఆలయంలో మూల విగ్రహముపై అగస్త్యుని చేతిగుర్తులు, శిరస్సుపై ముడిని మనం చూడవచ్చును. పట్టిసం జారిపడినది కనుక ఈక్షేత్రానికి పట్టిసాచల క్షేత్రమని పేరు వచ్చింది.కాలక్రమేణా అది పట్టిసం, పట్టిసీమగా మారింది.కొవ్వూరు నుండి గోదావరి గట్టున 26వ కిలోమీటరు వద్ద ఉన్న ఈ ేత్రానికి... గోదావరి నదిలోనికి ఏటవాలుగ చక్కని రోడ్డు వుంది.అక్కడనుంచి పడవలలో నది దాటి నదిమధ్యలో గల పట్టిసం కొండకు చేరవచ్చు. వర్షాకాలం మినహాయించి నదీ ప్రవాహాన్ని బట్టి ఇక్కడ ఇసుక తిప్పలు ఏర్పడతాయి.

ఇలా చేరుకోవచ్చు...
పశ్చిమగోదావరి జిల్లాలోని ప్రముఖ నగరమైన రాజమండ్రి నుండి పట్టిసీమ సుమారు 30 కిలోమీటర్ల దూరంలో ఉంది. రాజమండ్రి నుంచి పట్టిసీమకు ఎల్లప్పుడూ బస్సులు అందుబాటులో ఉంటాయి. అలాగే ప్రకృతిని ఆస్వాదిస్తూ వెళ్లాలనుకునే వారికి రాజమండ్రి నుంచి పాపికొండల మధ్య ప్రవహించే గోదావరిపై ప్రయాణించే లాంచీలు కూడా అందుబాటులో ఉంటాయి. విమానం ద్వారా వచ్చే దూరప్రాంత ప్రయాణీకులు రాజమండ్రిలోని కోరుకొండ విమానాశ్రయం నుండి చేరుకోవచ్చు. ఇక రైలు ప్రయాణీకులు రాజమండ్రి లేదా నిడదవోలు స్టేషన్ల ద్వారా ఇక్కడికి చేరవచ్చు. కొవ్వూరు కూడా దగ్గరి రైల్వే స్టేషన్‌ అయినప్పటికీ అక్కడ తగినన్ని ఎక్స్‌ప్రెస్‌ రైళ్ళు ఆగవు. 

కర్టసీ : సూర్య Daily

ఆంధ్రభోజుని అందాల నగరం... హంపి

అహో ఆంధ్రభోజా... శ్రీకృష్ణ దేవరాయా..!
ఈ శిథిలాలలో చిరంజీవివైనావయా..!!
ఈ పాట విన్నప్పుడల్లా హంపి ఎలావుంటుంది? అనుకుంటుంటాం. విజయనగర సామ్రాజ్య వైభవాన్ని నేటికీ తనలో దాచుకుంది హంపి నగరం. మేము హంపి చూడాలని ఎప్పటినుండో అనుకుంటూనే అలాగే గడిచిపోయింది.. శ్రీకృష్ణదేవరాయల 500వ పట్టాభిషేక మహోత్సవానికి కూడా వెళ్లి ఆ హంపీ వైభవం చూడాలనుకున్నాం. కాని అప్పుడూ కుదర్లేదు. ఇదిగో ఈ నెల మా ఇంట్లోని అందరం కలిసి హంపీ చూడడానికి వెళ్లాం. అక్కడికి వెళ్లాక ప్రతిశిల్పం దగ్గర ఘంటసాల మృదుమధుర గీతం మనకు అడుగడుగునా విన్పిస్తుంది.

krishna-devarayalaఅనంతపురం నుండి బళ్లారి జిల్లా హోస్పేటకు సరాసరి వెళ్లాం. అక్కడి నుండి హంపి 13 కిమీ ఒక అర్ధగంటలోపే హంపికి చేరాం. అప్పటికే అనంతపురం నుండి ఓ మిత్రుడిద్వారా వసతి ఏర్పాటు చేసుకున్నాం. ఈ వసతి ని ఏర్పాటు చేసిన కమలానగర్‌లో ఉంటున్న శ్రీనివాస్‌, హనుమంతుగార్లకు ముందుగా కృతజ్ఞతలు చెప్పుకోవాలి. మేం ఉదయం 11 గంటలకు రూముకు చేరి భోజనం అయ్యాక హంపీని చూడడానికి బయల్దేరాం.

నేడు ఈ హంపీ నగరం శిథిల నగరంగా కన్పిస్తున్నా... ఇప్పటికీ అద్భుతంగా, ఏమాత్రం ఆకర్షణ తరగని గనిలా శిల్ప సౌందర్యంతో ఉట్టి పడుతూ ఉంది. నగరం చుట్టూ గ్రానైట్‌ కొండలూ, రాళ్ల గుట్టలూ మధ్యలో పారుతున్న తుంగభద్రానది. ఈ నది ఒడ్డున పొడవుగా అందమైన దేవాలయాలు, సుంద రమైన రాజప్రాసాదాలు, శిథిలమైనా తమ అందాల్ని ఒలకబోస్తున్న శిల్పాలు. పర్యాటకులకు, కళాభిమానులకు ఈ హంపీ నగరం ఒక స్వర్గధామం. హంపీలో ఒక్కో మలుపు వైపూ ఒక్కో ఆకర్షణ. అద్భుతమైన దృశ్యకావ్యాలు. ఇప్పుడే ఇంత అందంగా ఉంటే ఆనాడు రాయల కాలంలో ఇంకెంత సొగసుగా ఉండేదో ఈ నగరం అన్పించకమానదు.

అందుకే ‘హంపీ’ కట్టడాలు యునెస్కో ప్రపంచవారసత్వ జాబితాలో చోటు సంపాదించుకున్నాయి. అయితే ఈ కట్టడాలను పరిరక్షించే విషయంలో కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం అలసత్వం చూపుతోందని ఈ ఫిబ్రవరి 15 న కర్ణాటక ప్రభుత్వానికి ఆ రాష్ట్ర హైకోర్టు అక్షింతలు వేసింది. హంపీ చారిత్రక, స్మారక చిహ్నాలను పరిరక్షించే విషయంలో ఆ రాష్ట్ర ప్రభుత్వం చూపే నిర్లక్ష్యాన్ని తప్పుపట్టింది. ఏదేమైనా ఈ హంపీ జాతిసంపద. తప్పకుండా పరిరక్షించాల్సిందే..!!

విజయనగర సామ్రాజ్యంలో ‘హంపి’ తళుకులు...
devaraibulid మహమ్మదీయులు మనదేశం దక్షిణ ప్రాంతంలోకి రావడం వలన అంతకు ముందు వందలాది సంవత్సరాల పాటు సాగిన అనేక నిర్మాణ కార్యక్రమాలకు అంతరాయం కలిగింది. ఈలోగా మహోత్తుంగ తరంగంలా విజయనగర సామ్రాజ్యం పైకి వచ్చింది. 14 వ శతాబ్ది మధ్య కాలం నాటికి ముస్లింల రాకకు ఆనకట్టవేసింది. దక్షిణ భారతదేశ మంతా విస్తరించింది. హంపి (విజయనగర) ని రాజధానిగా చేసుకొని ఏకఛత్రాధిపత్యంగా ఏలారు విజయనగర చక్రవర్తులు.

విరివిగా ఆలయాలను నిర్మించారు. తర్వాతి కాలంలో వారి రాజధానులైన పెనుకొండ (అనంతపురం జిల్లా) చంద్రగిరి (చిత్తూరు జిల్లా), వారి సామంతరాజ్యాల రాజధానులైన వెల్లూర్‌ (ఉత్తర ఆర్కాటు) జింజి (దక్షిణ ఆర్కాటు), తంజావూర్‌, మధురై, ఇక్కెరి (షిమోగా) లలోనూ, అనంతపురం జిల్లాలోని తాడిపత్రి, లేపాక్షిలలోనూ విరివిగా ఆలయాలు నిర్మించారు. ఈ ఆలయాల్లో అపూర్వమైన గోపురాలు, అందమైన శిల్ప సముదాయాలూ, మండపాలూ ఉన్నాయి. నిజానికి విజయనగర రాజుల హయాంలో కట్టినన్ని ఆలయాలు చోళరాజుల కాలంలో కూడా కట్టలేదు.

Lowtas-Mahalవిజయనగర రాజులు కట్టించిన ఆలయాల నగరం విజయనగరానికే విద్యానగరమన్న పేరుంది. శృంగేరీ పీఠాధిపతి అయిన విద్యాశంర (విద్యా తీర్థ) స్వామివారి ప్రధాన శిష్యుడూ, విజయనగర సామ్రాజ్య స్థాపనకు కారకుడైన విద్యారణ్యస్వామిపట్ల గౌరవ సూచకంగా విద్యా నగరం అన్న పేరువచ్చింది. ఈ విద్యారణ్యుడు అప్పటి విజయనగర సామ్రాజ్యాధీశుడైన హరిహర, బుక్కరాయుల సోదరులకు గురువుగా నిలిచి విజయనగర హిందూ సామ్రాజ్యానికి నాంది పలికాడు. ఆయన ఆధ్వర్యంలో 1వ విరూపాక్షరాజు 1336 ఏప్రిల్‌ నెలలో విరూపాక్షస్వామి సమక్షంలో పట్టాభిషిక్తుడయ్యాడు. తుంగభద్ర నదికి ఆవల ‘ఆనెగొంది’ అనే గ్రామంలో చాలా ఎత్తుగా భద్రంగా పెద్ద కోటను నిర్మించారు. నదికి ఇటువైపున హంపీని రాజధానిగా ఏర్పాటు చేసుకొని బుక్కరాయ సోదరులు పరిపాలన సాగించారు.

ఇక వీరి కాలంలోనే విజయనగర సామ్రాజ్య ఉత్తర భాగంలోని నిర్మాణాలకు అంతకు పూర్వపు ఇసుక రాతిని వద్దని కఠిన శిలను ఎన్నుకోవడం చాలా ముఖ్యమైన పెద్దమార్పు. ఈ కారణంగానే ఆనాటి శిల్పులు కొత్త ముడి వస్తువుని ఎన్నుకొని కొంగ్రొత్త పోకడలుపోయి విశిష్టమైన విజయనగర శిల్పయుగాన్ని సృష్టించారు. అసంఖ్యాకంగా ఉన్న ఆలయాలకు, తుంగభద్ర నదీతీరాన పెద్దరాతి కొండ నడు మ పురాతన విరూపాక్ష ఆలయం చుట్టూ నిర్మించిన హంపి నగరపు కోటకు, వాటి గోడలకు, ద్వారాలకు అక్కడ కొండలలో లభ్యమైయ్యే గట్టి రాతిని వాడారు. విజయనగర శిల్పులు భారతీయ వాస్తుకళా వికాసంలో కొత్తపుం తలు తొక్కి తర్వాత తరాల వారికి పురాతన శిల్ప సంప్రదాయాన్ని జవసత్వాల తో నిండుగా అందించారు.

విరూపాక్ష ఆలయం...
krihsandevar-tempహంపీలోని విరూపాక్ష ఆలయం చాలా పెద్దది. ఇక్కడ ప్రధాన దైవం విరూపాక్షుడు. శివుడినే ఇక్కడ విరూపాక్షస్వామి అంటారు. ఇప్పటికీ ఇక్కడ పూజలు జరుగుతున్నాయి. హంపీ వీధికి పశ్ఛిమ దిశగా ఎతె్తైన గోపురం దేవాలయం లోపలికి స్వాగతం పలుకుతుంది. ఈ ఆలయం క్రీశ 10-12 శతాబ్దాలలో కట్టి ఉంటారనీ, చాళుక్యుల తర్వాత వచ్చిన హోయసలులు కూడా కొన్ని పునరుద్ధరణ చేశారనీ చరిత్ర కారుల అంచనా. అయితే ప్రధాన ఆల యాన్ని విజయనగర రాజులు పునరుద్ధ రించి అందంగా తీర్చిదిద్ది అభివృద్ధి చేశారు. ఈ ఆలయానికి చుట్టూ మూడు ప్రాకారాలున్నాయి.

తూర్పున ఉన్న ఎతె్తై న గోపురం దాటి లోపలికి వెళ్తే మొదటి ప్రాకారం వస్తుంది. అది దాటి వెళ్తే స్తంభాలతో కప్పబడిన వసారా వస్తుంది. ఇది దాటి వెళ్తేనే గర్భగుడి వస్తుంది. ఈ ఆలయ కప్పుమీద, స్తంభాల మీద అందమైన వర్ణచిత్రాలు చెక్కారు. శృం గేరీ పీఠాధిపతిని సకల రాజమర్యాదల తో పల్లకీలో విరూపాక్ష దేవాలయా నికి తీసుకొస్తున్నట్లుగా చాలా గొప్ప గా వర్ణసముదా యంతో చిత్రించా రు. ఈ గర్భగుడికి ఒక ప్రత్యేకత ఉంది. తుంగభద్రా నది నుండి చిన్న పాయ ఒకటి ఆలయంలోకి ప్రవేశించి గర్భగుడికి నీరు అంది స్తూ బయటి ప్రాకారం ద్వారా మళ్లీ బయటికి వెళ్లిపోతుంది. అక్కడి నుంచి యాత్రికులు కోదండ రామా లయానికి, యంత్ర ఆంజనేయ గుడికి వెళ్తారు.

Virupaksha-temple-gopఅలాగే అక్కడి నుంచి విఠలేశ్వరా లయానికి నైరుతీగా నడిచి వెళ్తుంటే దారిలో ఒక తులాభారం తూచే రాతి కట్ట డం కన్పిస్తుంది. దీనిని రెండు గ్రానైట్‌ స్తంభాలను కలుపుతూ పైన భూమికి సమాంతరంగా ఒక రాతికమ్మీ ఉంది. ఈ నిర్మాణాన్ని ‘రాజ తులాభారం’ అం టారు. కొన్ని ముఖ్యమైన రోజుల్లో ఇక్కడ రాజు తన ఎత్తు బంగారు, వజ్రవైఢూ ర్యాలను తూచి బ్రాహ్మణులకు దానం చేశేవాడట. ఇది పూర్తిగా గ్రానైట్‌రాతితో కట్టడంతో ఇప్పటికీ చెక్కు చెదరకుం డా ఉంది. ఇంకొక దేవాలయం ‘హజారా రామాలయం’. దీర్ఘచతురస్రాకారం గా ఉన్న ఈ ఆలయాన్ని అంతకు ముందు రాజవంశీయులు ఎవరో ప్రారం భించగా దీనిని శ్రీకృష్ణ దేవరాయలు పూర్తి చేశారంటారు.

అయితే ఈ ఆలయాన్ని రాజప్రతినిధుల కోసం అప్పట్లో నిర్మించారట. ఈ ఆల య బయటగోడల మీద శ్రీకృష్ణుడి లీలలు, రామాయణ కథ మొత్తం చిన్నచిన్న శిల్పాలతో చాలా అందంగా చిత్రిం చారు. ఆలయం లోపల నల్ల గ్రానైట్‌రాయి తో స్తంభాలపై అందమైన శిల్పాలను చె క్కారు. ఈ ఆలయం దగ్గరే ఆ శిల్పాలను చూస్తూ చాలా సేపు ఆగిపోతాం. ఈ ఆల యం మీద రామాయణ గాథకు సంబం ధించి శిల్పాలు లెక్కకు మించి ఉండడం తో ఈ ఆలయాన్ని సహస్ర రామాల యం... అంటే ‘హజారా రామాలయం’ అనే పేరువచ్చిందంటున్నారు.

విఠలాలయం...
హంపీలో ఎక్కువగా దాక్షిణాత్య శిల్పరీతులననుసరించి నిర్మించిన ఆలయాల లో చెప్పుకోదగ్గది విఠలాలయం. ఆనాటి అతిపెద్ద ఆలయాలలో ఇది ఒకటి. మండపాలు, గరుడ కల్యాణమండపాలు, ప్రాకారమూ, గోపురమూ అన్నీ కలసిన ఒక బ్రహ్మాండమైన సముదాయంగా నిర్మించాలనుకుని ఆ విఖ్యాత సార్వభౌముడు శ్రీకృష్ణ దేవరాయలు 1513వ సంవత్సరంలో ప్రారంభిం చాడు. కానీ 1565లో సామ్రాజ్యం విచ్ఛిన్నమైయ్యేవరకూ పూర్తికాలేదు. ఆ తర్వాత విజయ నగర సామ్రాజ్యాన్ని రాయలు అనంతపురం జిల్లా పెనుకొండ కు మార్చాడు.

Vittala-templeవిఠలాలయం సముదాయం చుట్టూ ప్రాకారం ఉంది. ఈ ప్రాకారానికి తూర్పున, దక్షిణాన, ఉత్తరాన గోపుర ద్వారాలున్నాయి. మండపాలు, ఉప మండపాలు, చుట్టూ పరివార ఆయతనాలున్నాయి. అన్నీ విజయనగర ఆలయాలలో మాదిరిగా ఇక్కడి మండపాలు, గోపురాలు చాలా పెద్దవి. దాదాపుగా అన్నీ వెయ్యి స్తంభాల మండపాలే. కుడ్య స్తంభాల మధ్య భాగాలు నాజూకుగా ఉన్నాయి. కొన్ని చోట్ల ఒకే రాతి నుంచి చెక్కిన మధ్య స్తంభమూ, చుట్టూ ఉప స్తంభాలూ లేదా జంతువులు ఉన్నాయి. ఈ స్తంభాలమీద మీటితే ‘సరిగమపదనిస’ స్వరాలు పలుకుతాయట! ఇప్పటికికూడా! అయితే వచ్చిన యాత్రికులంతా ఆ స్తంభాల మీద రాళ్లతో కొట్టి పరీక్షిస్తున్నారని ఇపుడు కర్నాటక గవర్నమెంటు గట్టి సెక్యూరిటీని ఇక్కడ ఏర్పాటు చేసింది. ఇక్కడే ‘ఏకశిలారథం’ ఒక అత్యద్భుమైన కట్టడం. ఒకేరాతిలో చెక్కిన రథం, పైన రెండు గోపురాలతో అద్భుతంగా చెక్కారు. పైన రెండు గోపురాలు నేడు శిథిలమైనా ఈ ఏకశిలారథం చక్కగా ఉంది. ఈ ఏకశిలా రథాన్ని చూడగానే మనకు ఒక పాట గుర్తుకొస్తుంది...

‘ఏకశిల రథముపై లోకేసు ఒడిలోనే... ఓర చూపుల దేవి ఊరేగిరాగా... రాతి స్తంభాలకే చేతనత్వం కలిగి సరిగమ పదనిస స్వరములే పాడగా...’ అంటున్న ఘంటశాల మన మదిలో మెదులుతాడు..
ఈ ఏక శిలాస్తంభ పరివారాలు విజయనగర రాజుల శైలి విశిష్టతలలో ఒకటి. కొన్ని పాత ఆలయాల వెలుపలి ప్రాకారాల మధ్య బ్రహ్మాండమైన గోపురాలను చేర్చారు. వీటిని ‘రాయ గోపురాలు’ అని పిలుస్తారు. ఇక సూర్యాస్తమయం అవుతుండగా మెల్లగా రూముకు తిరిగి వచ్చాం. రెండో రోజు ఉదయాన్నే టిఫిన్‌ చేసి హంపీ నగరం రెండో వైపునకు బయలు దేరాం.

Enugula-saalaఇక్కడ ఏకశిలతో కట్టిన ‘ఉగ్రపరసింహ’ మూర్తి పెద్ద శిలలో తొలిచారు. పక్కనే ‘బీదలింగ’ మనే శివలింగం ఉంది. ఆ లింగం ప్రతిమ కింద నుండి విరివిగా జల వస్తూ ఆ జల అక్కడి పంటపొలాలకు వెళ్లడం చూస్తాం. తరువాత ‘శ్రీకృష్ణాలయం’ కూడా అక్కడే ఉంది. ఇది చిన్నికృష్ణుని ఆలయం. ఇపుడు పూర్తిగా శిథిలమైపోయి ఉంది. కళింగదేశంపై రాయలు విజయానికి చిహ్నంగా కట్టించాడని ఇక్కడ శాసనం ఉంది. ఈ ఆలయం పరివార ఆలయాలతో, మండపాలతో, స్తంభఋ౎లతో, మాలికలతో, అందమైన గోపురం ఉన్న మనో జ్ఞమైన ఆలయం. అయితే ఇపుడు శిథిలమైనా తప్పక చూడాల్సిందే. గర్భగు డిలో విగ్రహంలేదు. ఈ ఆలయానికి ఎదురుగా పెద్ద వీధి ఉంది. ఈ వీధికి రువైపులా చిన్న చిన్న గదుల్లా కట్టిన రాతికట్టడాలున్నాయి. ఇవి దాదాపు వంద లాది ఉంటాయి. ఇక్కడే ఈ వీధుల్లోనే రత్నాలూ, వజ్రవైఢూర్యాలు రాశులు పోసి అమ్మేవారట!

Tungabhadra-nadi ఇంకా ఇక్కడ చూడాల్సినవి క్వీన్‌బాత్‌ కట్టడం, లోటస్‌ మహల్‌, ఏనుగుల గజ శాల, సరస్వతీ దేవాలయం, పుష్కరిణి, పురావస్తు శాఖవారి మ్యూజియం తప్పక చూడాల్సినవి. మ్యూజియం హంపీ నగరానికి దగ్గరలోని కమలాపురం లో ఉంది. ఇవన్నీ చూసుకొని ఇకరాత్రికి తిరుగు ప్రయాణం అయ్యాం.ఎలా వెళ్లాలి? దేశం నుండి బళ్లారికి విమాన, రైలు బస్‌ సౌకర్యం అన్ని ప్రాంతాలనుండి ఉన్నాయి. బళ్లారి నుండి హోస్పేటకు 60 కిమీ హోస్పేట నుండి హంపి 13 ిమీ ఇక్కడ మొత్తం హంపి నగర సందర్శనకు టూరిస్ట్‌ గైడ్లు విరివిగా ఉన్నారు. ఆటోలు, కార్లు అందుబాటులో ఉన్నాయి. అయితే కొన్ని ప్రాంతాలలోకి కారు ఆటోలు వెళ్లవు. తప్పనిసరిగా ద్విచక్ర వాహనం, సైకిళ్ల మీదనే వెళ్లాలి. వీటిని కూడా అద్దెకు ఇస్తారు ఇక్కడ. ఎక్కువగా విదేశీయులు మనకు తారసప డతారు. వాళ్లంతా సైకిల్‌, ద్విచక్రవాహనంమీద తిరుగుతారు. అలా కూడా మొత్తం చూడొచ్చు. విజయనగర రాజుల మొదటి కోట ‘ఆనెగొంది’ కోటకు వెళ్లాలంటేమాత్రం తుంగభద్ర నదిమీద చిన్న పుట్టీల (గుండ్రంగా ఉండే పడవ లాంటివి) మీద వెళ్లాల్సిందే.

- దామర్ల విజయలక్ష్మి, అనంతపురం
కర్టసీ : సూర్య Daily

ఘనమైన ప్రకృతి అందం... గణపతిపూలే

Ganapati_Phuleసముద్ర తీరానికి ప్రత్యేక అం దాన్నిచ్చే పర్వతాలతో కూడిన ప్రకృతి రమణీయ ప్రాంతం మహారాష్ట్ర లోని గణపతిపూలే. సముద్ర అలలు పర్వత పాదాలను తాకే అపురూప దృశ్యాలు ఇక్కడ కొత్త అందాలను సృష్టిస్తాయి. అలల తాకిడి వల్ల ఇక్కడి సముద్ర తీరాలు పసిడి, ధవళ కాంతులీనుతాయి.గణపతిపూలేలో స్వయంభు గణపతి దేవాలయం ఉంది. గౌరీ నందనుడైన గణపతి పేరునే ఈ ఊరికి గణపతిపూలే అని పేరు వచ్చింది. దేశంలోని అష్ట గణపతుల దేవాలయాల్లో గణపతిపూలే ఒకటి. గణపతిపూలేను పశ్చిమ ద్వార దేవతగా పిలుస్తారు.గణపతిని దర్శించుకోవటానికి వచ్చే భక్తులు ఆయన వెలసిన కొండ చుట్టూ ప్రదక్షిణ చేసి వస్తారు. గణపతిపూలే ప్రకృతి అందాలతో శోభిల్లుతుంది. పచ్చ దనంతో కూడిన అడవులు ఇక్కడ ఉన్నాయి. గణపతిపూలేలో మామిడి, వక్క, అరటి, కొబ్బరి వంటి వనాలు ఉన్నాయి. పశ్చిమ తీరం వెంట ఇటువంటి వనా లు ఎక్కువగా ఉంటాయి.

ఇతర దర్శనీయ ప్రాంతాలు...
మాల్గుండ్‌:మరాఠీ కవి కేశవ్‌ సూత్‌ జన్మించిన ప్రాంతం ఇది. సూత్‌ సేవలను గుర్తించుకునే విధంగా కేశవ్‌ సూత్‌ స్మారక్‌ అనే మందిరాన్ని నిర్మించారు.

పావస్‌:ప్రకృతి రమణీయతకు నెలవైన ప్రాంతం పావస్‌. ప్రముఖ ఆథ్యాత్మిక వేత్త స్వామి స్వరూపానంద్‌ ఇక్కడే జన్మించారు.

రత్నగిరి...
పశ్చిమ కోస్తా తీరంలో అందమైన ప్రాంతంతో పాటుగా జిల్లా కేంద్రం రత్న గిరి. ప్రముఖ స్వాత్రంత్య సమరయోధుడు బాల గంగాధర్‌ తిలక్‌ జన్మస్థలం ఇదే. ఆయన సేవలను గుర్తుపెట్టుకునే విధంగా తిలక్‌ స్మారక్‌ను ఇక్కడ ఏర్పా టుచేశారు. ఆంగ్లేయులకు వ్యతిరేకంగా తిలక్‌ స్వదేశీ ఉద్యమాన్ని నడిపించారు. సమీపంలో రత్నదుర్గ్‌ కోట కూడా ఉంది.

వసతి...
గణపతిపూలేలో మహారాష్ట్ర పర్యాటక సంస్థకు చెందిన హో టల్‌తో పాటుగా ఇత ర వసతి సదుపాయా లు ఉన్నాయి.
ఎలా చేరుకోవాలి?
విమానమార్గం:బెల్గాంలో (299 కిలో మీటర్లు) విమానాశ్ర యం ఉంది.
రైలు మార్గం:రత్నగిరి (45 కిమీ), భోక్‌ (35 కిమీ) సమీపంలోని రైల్వే స్టేషన్లు.
రహదారి మార్గం: ముంబయి 375 కి.మీ., పూణె (331 కి.మీ.), కొల్హాపూర్‌ (144 కి.మీ.) దూరంలో గణపతిపూలే ఉంది.

కర్టసీ : సూర్య Daily

పల్లవుల శిల్పకళావైభవం... భైరవకోన

భైరవ కోన 9వ శతాబ్దానికి చెందిన ఓ అద్భుత శివాలయం. ప్రకాశం జిల్లాలోని చంద్రశేఖరపురం మండలం, కొత్తపల్లి గ్రామానికి దగ్గరలో ఉంది. పల్లవులకాలంనాటి అద్భుత శిల్పకళకు సాక్షీభూతంగా నిలుస్తున్న, ప్రసిద్ధి గాంచిన పురాతన గుహలకు నెలవు భైరవకోన...

Bhairavakona1సుమారు 250 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉన్న ఈ నల్లమల అరణ్యంలో ఎక్కడచూసినా దేవీదేవతల శిలారూపాలే కనిపిస్తుంటాయి. ముఖ్యంగా ఓ కొండలోనే ఎనిమిది ఆలయాలు చెక్కిన వైనం ఎంతో అపురూ పంగా అనిపిస్తుంటుంది. ఇక్కడున్న దుర్గాంబ ఆలయంలో అమ్మవారి విగ్రహం మీద కార్తీకపౌర్ణమి రోజున చంద్రకిరణాలు పడటం భైరవకోనకున్న మరో విశేషం. అందుకే ఆరోజున భక్తులు విశేషంగా ఇక్కడకు తరలివస్తుంటారు. శివరాత్రికి పక్కనే ఉన్న జలపాత సేలయేటిలో స్నానంచేసి శివరూపాల్ని దర్శించుకుంటారు.

కొండల్ని తొలిచి ఆలయాలుగా చెక్కడం అన్నది భారతదేశంలో ప్రాచీనకాలంనుంచి ఉన్నదే. ఆంధ్రప్రదేశ్‌ లో వీటి జాబితా చాలానే ఉంది. గుంటుపల్లి, ఉండవల్లి, మొగల్రాజపురం (విజయవాడ), బొజ్జనకొండ, శ్రీపర్వతం, లింగాలమెట్ట గుహలన్నీ ఈ కోవకు చెందినవే. అయితే ప్రకాశంజిల్లాలోని సీతారామపురం మండలంలోని భైరవకోన గుహలకు పౌరాణిక, చారిత్రక ప్రాశస్త్యం ఉంది. వీటిలో అడుగడుగునా పల్లవ శిల్పకళ కనిపిస్తుంటుంది. ఒకే కొండలో మలిచిన ఎనిమిది శివాలయాలనూ ఏకకాలంలో ఇక్కడ దర్శించుకోవచ్చు. వీటిలో ఏడు దేవాలయాలు తూర్పుముఖంగా, ఒక్కటి మాత్రం ఉత్తర ముఖంగా చెక్కబడ్డాయి.

bhiravaవీటన్నింటిలోనూ గర్భాలయాలూ, వరండాలూ స్తంభాలూ అన్నీ ఆ కొండ రాయితోనే మలచగలగడం విశేషం.శివలింగాలను మాత్రమే గ్రానైట్‌ శిలలతో చెక్కి ప్రతిష్ఠించారు. ఈ గుహాలయాల్లో నెలకొన్న ప్రధానదైవం భర్గేశ్వరుడు. ఈ ప్రాంతానికి క్షేత్రపాలకుడు భైరవుడు.ఆయనపేరుమీదే దీన్ని భైరవక్షేత్రంగా పిలుస్తున్నారు.అయితే ఒకప్పుడు ఈ ప్రాంతాన్ని కాలభైరవుడు అనే చక్రవర్తి పాలించాడనీ అందుకే ఇది భైరవకోన అయిందనీ అంటారు. అందుకు సాక్ష్యంగా ఈ ప్రాంతం చుట్టూ కోటల ఆనవాళ్లు అనేకం కనిపిస్తుంటాయి.

శివలింగాలన్నీ ఒక్కచోటే...
ఇక్కడ కొలువుతీరిన శివలింగాలు సుప్రసిద్ధ క్షేత్రాల్లోని శివలింగాల్ని పోలి ఉండటంతో వీటిని కూడా ఆ పేర్లతోనే పిలుస్తున్నారు. మధ్యప్రదేశ్‌లోని అమరనాథ్‌లో కన్పించే శశినాగలింగం, మేరు పర్వత పంక్తిలోని రుదల్రింగం, కాశీగంగాతీరంలోని విశ్వేశ్వరలింగం, తిరుమల కొండల్లోని నగరికేశ్వ రిలింగం, భర్గేశ్వరలింగం (ఇక్కడి ప్రధానదైవం) రామనాథపురం సముద్రతీర ప్రాంతంలోని రామే శ్వరలింగం, శ్రీశైలంలోని మల్లికార్జునలింగం, మందరపర్వతంలోని పక్షఘాతలింగం పేర్లతో వీటిని ఆరాధిస్తున్నారు.

ఒకేచోట త్రిమూర్తులు...
bhairava-konaఇక్కడ ఉత్తరముఖంగా ఉన్నదే మొదటిగుహ. దీనికి ఎదురుగా నంది ఉంటుంది. తలపాగాలు ధరించిన ద్వారపాలక శిల్పాలు ఈ గుహ ప్రధాన ఆకర్షణ.మిగిలినవన్నీ తూర్పు ముఖంగానే ఉంటాయి. అయితే అన్నింటికన్నా ఏడో గుహాల యం సుందరంగా కనిపిస్తుంటుంది. ఎనిమిదో గుహలో లింగంతోపాటు బ్రహ్మ, విష్ణువుల బొమ్మలు కూడా చెక్కివుండడం విశేషం. త్రిమూర్తులు ఒకేచోట ఉన్న అరుదైన ప్రదేశంగా ఇది అత్యంత ప్రాచుర్యం పొందింది.అంతేకాదు ఈ ప్రాంతం అనేక ఔషధ మొక్కలకు పుట్టినిల్లు కూడా.ఆయుర్వేద వైద్యానికి అవసరమైన ఎన్నో మూలికల్ని ఇక్కడనుంచే సేకరిస్తుంటారు.

పల్లవ గుహాలయాలు...
waterఇక్కడి ఆలయాలకు మహాబలిపురంలోని ఆలయ నిర్మాణ శిల్పశైలికి సారూప్యం ఉండటంతో ఈ గుహాలయాలను పల్లవుల కాలానికి చెందినవిగా భావిస్తున్నారు. క్రీశ 600-630 కాలానికి చెందిన మహేంద్రవర్మ పాలనలోనే ఈ గుహాలయాలు ప్రారంభించి ఉంటారన్నది చరిత్రకారుల అభిప్రాయం. అయితే ఐదోగుహలోని స్తంభాలమీద ఉన్న నరనరేంద్రుడు, శ్రీత్రిభువనాదిత్యం...వంటి పదాలను చూస్తుంటే ఈ ఆలయాల నిర్మాణం ఏడో శతాబ్దం నుంచి చాళు క్యులకాలం వరకూ అంటే 11వ శతాబ్దంవరకూ కొన సాగి ఉంటుందని అంచనా. ఇక్కడ ఈ గుహాలయాలతో పాటు చుట్టుపక్కల ఉన్న గుండాలనూ దోనల్నీ చూడొచ్చు. సోమనాథ, పాల, కళింగ దోనలు; పార్వతి, కాముని, సరస్వతి, త్రివేణి, పాచికల గుండాలు ఇక్కడ దర్శనీయస్థలాలు. అయితే అటవీప్రాంతం కావడంతో ఇవన్నీ తిరగాలంటే కాలినడక తప్పనిసరి.
కోనకు ఇలా వెళ్ళాలి...
భైరవకోనకు వెళ్లాలంటే ప్రకాశం జిల్లా అంబవరం, కొత్తపల్లి చేరు కుంటే అక్కడినుండి ఉదయం నుంచి రాత్రి 10 గంటలవరకూ బస్సు సౌకర్యం ఉంటుంది. అటవీప్రాంతం కాబట్టి నిర్వాకులు ఇక్కడ నిత్యాన్నదానాన్ని ఏర్పాటుచేశారు. ఓ చిన్న అతిథి గృహం కూడా ఉంది. 

కర్టసీ : సూర్య Daily