దేశంలో మొదటి పురపాలక సంఘం గుజరాత్‌లోని సూరత్ నగరం కాగా... ఆంధ్రప్రదేశ్‌లో మొదటి పురపాలక సంఘంగా గుర్తింపు పొందిన భీమునిపట్నం రెండవది. నేడు భీమిలిగా ప్రసిద్ధి చెందిన ఈ నగరం ఎన్నో ప్రాచీన కట్టడాలను తనలో నిక్షిప్తం చేసుకుంది. హిందూ బౌద్ధ మతాలకు చెందిన ప్రాచీన నిర్మాణాలే కాకుండా బ్రిటీష్, డచ్‌వారి పాలనకు ఆనవాళ్ళుగా నిలిచే.. అనేక చారిత్ర కట్టడాలకు నిలయం ఈ నగరం. ఉక్కు నగరం విశాఖకు 24 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ భీమునిపట్నం విశేషాలు...
పశ్చిమం వైపు ఎత్తుగా ఉండి... తూర్పు వైపు సముద్రతీరానికి వచ్చేసరికి పూర్తి పల్లంగా ఉండడంతో... పశ్చిమం నుండి భీమిలి సముద్ర తీరాన్ని చూస్తే... కనిపిం చే ప్రకృతి రమణీయత వర్ణనాతీతం. రాష్ట్రం లోనే తొలి మున్సిపాలిటీగా ప్రసిద్ధి చెందిన భీమిలిలో పురాతన కట్టడాలేకాకుండా బ్రిటీష్, డచ్ వారి పాలనకు... ప్రాచీన వారసత్వ సంపదకు ఆనవాళ్ళుగా మిగి లిన అద్భుత ప్రదేశాలు మనకు దర్శన మిస్తాయి.
ప్రాచీన వారసత్వం...
పురాణేతిహాసాలను తనలో ఇముడ్చు కున్న ఎన్నో చారిత్రక గాధలను భీమి లి పట్టణం కళ్ళకు కడుతుంది. నాటి కృతయుగం నుండి కలియుగం వర కు ఎన్నో చరిత్ర సాక్ష్యాలను తనలో నిక్షిప్తం చేసుకుంది. కృతయుగంలో హిరణ్యకశిపుని సంహరించి ఉగ్ర రూపుడైన నరసింహస్వామి... ఆ తరువాత ప్రహ్లాదుని అభ్యర్ధన మేర కు శాంతించి ఇక్కడి సౌమ్యగిరిపై వెలి శాడని పురాణాలు చెబుతున్నాయి. మరో కథనం ప్రకారం ద్వాపరయుగంలో పాండవు లు వనవాసం చేస్తున్న సమయంలో భీమ సేనుడు బకాసురుడిని చంపి అనంతరం సౌమ్యగిరిపై లక్ష్మీ నరసింహస్వామి విగ్రహాన్ని ప్రతిష్టించాడని అంటారు.
అందువల్లనే ఈ పట్టణానికి భీమునిప ట్నం గా పేరొచ్చిందని చరిత్రకారులు చెబుతుంటారు. ఆనా టి ఏకచక్రపురమే ఈనాటి భీమునిపట్నంగా రూపాంతరం చెందినట్లుగా భావిస్తున్నారు. ఈ క్షేత్రం క్రీస్తుశకం 1228 లో నిర్మాణమైనట్లు ఇక్కడి శాసనాల వల్ల తెలుస్తోంది. హిం దూ పురాణాలనే కాకుండా బౌద్ధ విశేషాలను తనలో నిక్షి ప్తం చేసుకుంది భీమునిపట్నం. బుద్ధుని మరణానంతరం అవశేషాలను ఎనిమిది భాగాలుగా చేసి వివిధ ప్రాంతాల్లో భద్రపరిచారట.
అందులోని ఎనిమిదవ భాగం భీమిలి సమీ పంలోని తిమ్మాపురం బావికొండ బౌద్ధకేత్రంలో లభ్యమైంది.కళింగ యుద్ధం తరువాత అహింసావాదిగా మారి బౌద్ధాన్ని స్వీకరించిన అశోకుడు బౌద్ధ మాతానికి వైభవాన్ని తీసుకొచ్చారు. అంతేకాకుండా విజయనగర సామ్రాజ్యాధి నేత శ్రీకృష్ణదేవరాయులు తన జైత్రయాత్రలో భాగంగా పద్మనాభం దగ్గర పొట్నూరులో నెలకొల్పిన విజయస్థూపం నేటికీ పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంటుంది.. విదేశీ యులపై సమరశంఖం రించిన విజయనగరం సంస్థానాధీ శుడు రెండో విజయరామరాజు యుద్ధం చేసిన స్థలం పద్మ నాభం, విప్లవీరుడు అల్లూరి సీతారామరాజు జన్మించిన పాండ్రంగి ప్రాంతాలు భీమిలికి దగ్గరలోనే ఉన్నాయి.
డచ్, ఆంగ్లేయుల కాలంలోనే అభివృద్ధి పథంలో..
విదేశీయులు ఏలుబడిలో భీమునిపట్నం ఎంతో అభివృద్ధి సాధించింది. 17 వ శతాబ్ధంలో వ్యాపారం నిమిత్తం భార త్‌లో అడుగుపెట్టిన డచ్‌చ దేశస్థులు వర్తకానికి కొన్ని అను వైన ప్రదేశాలు ఎంచుకున్నారు.వాటిల్లో భీమునిపట్నం కూడా ఒకటి. ఇక్కడ వర్తక వాణిజ్యాలు సాగించడానికి 1641 వ సంవత్సరంలో హైదరాబాద్ నవాబు కులీకుతుబ్ షా నుండి అనుమతి పొందిన డచ్ దేశస్థులు ఇక్కడ స్థిరని వాసం ఏర్పరుచుకోవడమే కాకుండా భీమునిట్నం అభివృద్ధి కోసం విశేష కృషి చేశారు. 1641లో ఇక్కడ ఒక కోట నిర్మించుకున్న డచ్ దేశీయులు విదేశీ వర్తకానికి శ్రీకారం చుట్టారు.
1754లో జరిగిన మరాఠీ దాడుల్లోనూ, 1781 లో ఫ్రాన్స్, బ్రిటన్‌ల మధ్య జరిగిన యుద్ధంలోనూ డచ్‌కోట పాక్షికంగా ధ్వంసమైంది. 1825 నాటికి భీమిలి రేవు పట్ట ణం బ్రిటిష్‌వారి వశమైంది. 1854లో ఇక్కడ రిప్పన్ కంపె నీని ప్రారంభించారు ఆంగ్లేయులు. అంతేకాకుండా ఈస్టిం డియా కంపెనీకి సంబంధించిన అనేక శాఖలు ఇక్కడే ప్రారంభమైనట్టు చెబుతారు. బ్రిటీష్ వారు చిట్టివలసలో స్థాపించిన బెల్లం కంపెని 1867లో జూట్ ఫ్యాక్టరీగా రూపాంతరం చెందింది. 1880లో పంచదార, నీలమందు ఫ్యాక్టరీలను ప్రారంభించారు.ఇంతింతై వటుడింతై అన్నట్లు దినదినప్రవర్తమానంగా వర్తక వాణిజ్యాలను అభివృద్ధిపరు చుకుంటూ... ఇక్కడ వ్యాపార లావాదేవీల కోసం ఇంపీరి యల్ బ్యాంకును కూడా నెలకొల్పారు. ప్రస్తుతం గెస్ట్ హౌజ్ గా ఉన్న ఆ బ్యాంకు భవనం పర్యాటకులకు కనువిందు చేస్తుంది.
చూడాల్సినవివీ...
భీమిలి కోట...
16-18 శతాబ్ధాల మధ్య యూరప్ నుండి మనదేశానికి వర్తకం చేసుకోవడానికి వచ్చి భీమిలిలో పాగా వేసిన డచ్ వారు 1624లో తొలిసారి ఇక్కడ అడుగుపెట్టినప్పుడు ప్రాంతీయులతో ఘర్షణపడ్డారు. ఆ ఘర్షణలలో 101 మం ది డచ్ సైనికులు 200 మంది ప్రాంతీయులు మరణించా రని విశాఖ శాసనాల వల్ల తెలుస్తోంది. ఆ తరువాత ప్రాంతీ యులకు డచ్ వారికి సంధి కుదిరిన తరువాత వర్తక, వాణి జ్యాలను అభివృద్ధి పరుచుకునే దిశగా 1661 లో ఇక్కడ ఒక కోట నిర్మించుకొన్నారు. ఈ కోట ఇప్పుడు శిధిలమైపో యి అవశేషాలు మిగలగా... ఈ కోటలో ఉన్న గడియారపు స్థంభం, టంకశాల మాత్రం ఇప్పటికీ చెక్కు చెదరకుండా ఉన్నాయి. అద్భుత నిర్మాణ శైలికి అద్దం పట్టిన ఆ కోట అందులో ఉన్న గడియారపు స్థంభం చూసి తీరాల్సిందే.
సెయింట్ పీటర్స్ చర్చి...
అప్పటి జిల్లా కలెక్టర్, మెజిస్ట్రేట్ అయిన రాబర్ట్ రీడ్ ఆధ్వ ర్యంలో జాన్ గ్రిఫిన్ 1855-64 సంవత్సరాల మధ్యకాలం లో ఈ చర్చిని నిర్మించారు. ఈ చర్చి నిర్మాణ శైలి, లోపలి వస్తువులు, తూర్పు వైపున ఉన్న కిటికి మీద ఏసుక్రీస్తుని శిలువ వేస్తున్న సంఘటను చిత్రించిన విధానం చూపరుల ను సంభ్రమాశ్చర్యాలలో ముంచెత్తుతుంది. ఈ చర్చిలో చాలాకాలానికి ముందు నిర్మించిన పాలరాతి శిల్పాలు నయ నానందాన్ని కలిగిస్తాయి.
సముద్ర తీర అతిథి గృహం...
చిట్టివలస జూట్ కర్మాగారం ఆధీనంలో ఉన్న ఈ అతిధి గృహం లో డచ్ వారు నెలకొల్పిన ఇంపీరియల్ బ్యాంక్ ఉండేది. ఆ తరువాత ఈ చిట్టివలస జూట్ మిల్లు వారు దత్తత తీసుకొని ఈ గృహాన్ని చెక్కు చెదరకుండా కాపాడు తున్నారు. భీమిలి వైభవాన్ని చాటిచెప్పడానికి ఈ అతిథి గృహం ఒక ఉదాహరణగా చెప్పవచ్చు. భీమిలి దర్శించడా నికి వచ్చిన ప్రతి సందర్శకుని లిస్టులో ఈ అతిధి గృహం మొదటిస్థానాన్ని ఆక్రమిస్తుందని చెప్పడంలో అతిశయోక్తి లేదు.
మునిసిపాలిటీ సత్రం, షిప్పింగ్ కార్యాలయం...
ఆంధ్రప్రదేశ్‌లోనే మొట్టమొదటి మున్సిపాలిటీ అయిన భీమిలిలో ఆనాడు నిర్మించిన మున్సిపాలిటీ సత్రం ఇప్పటికీ సేవలందిస్తోంది. రెండు రాళ్ళమీద మద్రాసు పెంకులతో కట్టిన ఈ కట్టడం ఎంతో పటిష్టంగా ఉంది.ఈ కట్టడంలో పురపాలక సంఘ కార్యలయం, నౌకాశ్రయ రవాణా కార్యా లయం ఒకే సముదాయంలో ఉన్నాయి. ఈ రెండు భవనా లు ఇక్కడి నౌకాశ్రయానికి సంబంధించిన ఎగుమతులు, దిగుమతులతో పూర్వవైభవాన్ని గుర్తు చేస్తాయి.
ద్వీప స్తంభం, డచ్ శ్మశానవాటిక...
కాకినాడకు శ్రీకాకుళం మధ్య నిర్మించబడిన ఎనిమిది ద్వీప సంభాలలో (లైట్ హౌజ్) ఇది ఒకటి. ఈ ద్వీప స్థంభం 18 వ శతాబ్ధపు భీమిలి నౌకాశ్రయ వైభవాన్ని తెలుపుంది. ఇప్పు డు నిత్యం ప్రజలకు సమయాన్ని తెలియజేస్తున్న గంటస్తంభం ఆంగ్లేయుల కాలంలో నిర్మిం చారు. అంతేకాకుండా అప్పటి పాలకులు స్మృతి చిహ్నంగా సముద్ర తీరంలో డచ్, ఫ్రెంచ్, బ్రిటన్ దేశస్తుల సమాధు లున్నాయి. పట్టణానికి పశ్చిమంగా నిర్మించబడిన ఈ శ్మశా నవాటిక... డచ్ వారు ఈ పట్టణంలో నివసించారని, ఇక్కడే మరణించారనడానికి ఈ సమాధులో సాక్ష్యాలుగా ఉన్నా యి. అంతేకాకుండా వీరి మరణానికి సంబంధించిన కార ణాలను తెలుపుతూ... ఈ స్మశానంలో వారిని ఖననం చేసి న ప్రదేశంలో రాతి ఫలకాలు ఉన్నాయి. బీచ్‌రోడ్డులో ఎర్ర మట్టి దిబ్బలు, బౌద్ధ విశేషాలను చాటిచెప్పే తొట్లకొండ, బావికొండ, పావురాల కొండ ఆనాటి చరిత్రకు ఆనవాళ్లుగా కనిపిస్తాయి.
భీమేశ్వరాలయం...
ఈ పట్టణంలో ఉన్న ప్రాచీన దేవాలయం భీమేశ్వరాల యం. ప్రధాన రహదారి పైన ఉన్న ప్రాచీన దేవాలయం 1170 శాలివాహన శకంలో నిర్మాణం జరుపుకుందని చారి త్రక ఆధారాలున్నాయి. చోళరాజులు దీనికి అనుబంధం గా చోళేశ్వరాలయాన్ని నిర్మించారు.
ఇలా వెళ్లండి...
విశాఖపట్టణానికి అతి సమీపంలో ఉన్న భీమిలికి తరు చుగా సిటీ బస్సులు నడుస్తుంటాయి. 24 కి.మి పొడవున దేశంలోనే పెద్ద బీచ్ రోడ్లలో ఒకటైన విశాఖ - భీమిలి బీచ్ రోడ్డుమీదుగా... ద్విచక్రవాహనాలపై సైతం చేరుకోవచ్చు. అంతేకాకుండా ప్రైవేట్ వాహనాలు కూడా అందుబాటులో ఉంటాయి. విమాన, రైలు మార్గం ద్వారా వచ్చే పర్యాటకు లు విశాఖ మీదుగా భీమిలి చేరుకోవచ్చు.
- ఎస్.కె
No comments:
Post a Comment