సంవత్సరం మొత్తంలో ట్రెక్కింగ్ చేయడానికి అనువెైన నెలగా సెప్టెంబర్‌ను చెబుతారు. కొద్దిపాటి సమస్యలున్నా... కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే మరువలేని ట్రెక్కింగ్ అనుభూతి మీ సొంతమవుతుంది. నిజానికి జూలెై-ఆగస్ట్ మాసాలు కూడా ట్రెక్కింగ్‌కు ఎంతో అనువెైనవి. అయితే ఆ సమయంలో వర్షాలు ఎక్కువగా ఉండడం వలన పర్వాతారోహణ సాధ్యపడదు. హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ వంటి ఉత్తరాది రాష్ట్రాల్లో నెలకొని ఉన్న పర్వతప్రాంతాలు పచ్చదనంతో మైమరిపిస్తాయి. ట్రెక్కింగ్ చేయడానికి దేశంలోనే ఎంతో అనువెైన ప్రదేశాలుగా ఈ పర్వతసానువులను చెబుతారు.
ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్‌లో జూలెై ఆగస్టునెలల్లో పర్వతారోహణ కార్యకలాపాలు ప్రారంభమైనపపటికీ వర్షాలు తగ్గుముఖం పట్టిన సెప్టెంబరు మాసంలోనే ఈ కార్యక్ర మాలు ఉధృతమవుతాయి. ెసెప్టెంబరు నెల వచ్చేసరికి పర్వతమార్గాల్లో మంచుకరిగిపోతుంది. కొండలెక్కడాకీ, కష్టతరమైన శిఖరాలధిరోహించడానికి సెప్టెంబరు-అక్టోబరు చాలామంది పర్యాటకులు ఉత్సాహాన్ని చూపిస్తారు. ఈ మాసాల్లో ఈ రాష్ట్రాల్లో ట్రెక్కింగ్ సందడి మొదలవుతుంది. వర్షాకాలంలో దిగువ పర్వత సానువుల్లో చిక్కగా దట్టంగా పరుచుకున్న పచ్చదనం సందర్శకులను మైమరిపిస్తుంది. పర్వతారోహకులకు ఇది మరుపురాని అనుభూతిని మిగులుస్తుంది. అయితే పచ్చదనంతో కూడుకున్న సుందర ప్రకృతి వెనుక అపాయాలూ పొంచివున్నాయి.
కావున ట్రెక్కింగ్ చేసేవారు కొద్దిపాటి జాగ్రత్తలు తీసుకుంటే మంచిది. ముఖ్యంగా ఈ సమయంలో బండలపెై విపరీతమైన నాచు కప్పబడుతుంది. వర్షపు జల్లులు పడేప్పుడు ఈ సానువుల్లో సంచరించేటప్పుడు చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. ఎందుకంటే నాచువల్ల చాలా జారు డుగా వుంటుంది... వర్షం లేనప్పుడెైతే ఫరవాలేదు కానీ, చిరుజల్లులు పడుతున్నప్పుడు జారిపడే అవకాశాలు ఉంటాయి. అంతేకాకుండా జలగలు, విష సర్పాలు మరో సమస్య. పచ్చటి పచ్చిబీళ్ళలో అదే రంగులో సంచరించే విషసర్పాలు, రక్తం పీల్చే జలగలు ట్రెక్కిం గ్‌కు ఆటంకాలు కలిగిస్తాయి.
అయితే మనిషి అడుగుల చప్పుడు వినిపిస్తే... సర్పాలు దూరంగా వెళ్ళిపోతాయి. కానీ జలగలదే అసలు సమస్య. సిక్కింలో వర్షాకాలం ముగుస్తున్న సమయాన్ని జలగల నిలయంగా చెప్పుకోవచ్చు. జలగల వల్ల ప్రాణాపాయ స్థితి డ్రెస్సింగ్ విషయంలో కొన్ని జాగ్రత్తలు పాటిస్తే... ఈ జలగల గొడవ కూడా ఉండదు. నిండుగా దుస్తులు వేసుకుంటే జలగలు మీపెై దాడిచేయలేవు. ఇంకా వంతుల వారీగా గ్రూపుకు నాయకత్వం వహించండి. అందువల్ల ఒకే వ్యక్తిపెై భారం పడదు. ఇలాంటి కొన్ని జాగ్రత్తలు జాగ్రత్తలు తీసుకుంటే ఈ ఉత్తరాది పర్వతాల్లో మీ ట్రెక్కింగ్ అనుభూతి కలకాలం గుర్తుండిపోతుంది. మరింకెందుకు ఆలస్యం మీరూ ట్రెక్కింగ్‌కు రెడీ అయిపోండి..!
No comments:
Post a Comment