Wednesday, September 22, 2010
కమనీయం... కూర్గ్ జలపాతం
భారత స్కాట్లాండ్‌గా పేరుగాంచిన కూర్గ్ కర్నాటక రాష్ట్రంలో ప్రసిద్ధిగాంచిన పర్యాటకకేంద్రం. సందర్శకులను విశేషంగా ఆకర్షిస్తున్న ఈ జల పాతం మడికేరి ప్రాంతంలో ఉంది. సముద్రమట్టానికి 1525 మీటర్ల ఎత్తున ప్రకృతి ఒడిలో అద్భుతంగా కుదిరిన కూర్గ్, బెంగుళూరు నగరానికి సరిగ్గా 252 కిమీల దూరంలో ఉంది. ఏటవాలు పర్వతంపెై దట్టమైన అరణ్యం లో, జలజలపారే జలపాత మధుర ధ్వనులతో ప్రకృతి రమణీయతకు మరో పేరుగా పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంటోంది కూర్గ్ జలపాతం.
మంచు దుప్పటిని కప్పుకున్న పర్వతం, దట్టమైన అడవి, ఎకరాల మేర విస్తీర్ణంలో ఆవరించుకున్న టీ, కాఫీ, నారింజ తోటలు... కనురెప్పవాల్చనివ్వని సుందర దృశ్యాలతో మరిచిపోలేని అనుభూ తులు మిగిల్చే అద్భుత విహార కేంద్రంగా విరాజిల్లుతోంది విడిది గా మడికేరి. అంతేకాదు.. ఇక్కడ స్థానికంగా గల దర్శనీయ స్థలాలు మడికేరికి అదనపు ఆకర్షణను చేకూరుస్తున్నాయని చెప్పక తప్పదు. శతాబ్దాల చరిత్రను తనలో దాచుకున్న మడికేరి కోటలో దేవాలయం, ప్రార్థనా మందిరం, చెరసాలలతో పాటు చిన్నపాటి పురావస్తు ప్రదర్శన శాల ఉన్నాయి. ఇక రాజాస్థానం గురించి చెప్పాలంటే, కొడగు రాజులు సాయం కాల విడిదిగా పేరుగాంచింది. రాజాస్థానం నుంచి సూర్యాస్తమయాన్ని వీక్షిం చడం మరుపురాని అనుభూతిగా మిగిలిపోతుంది.
మడికేరిలో ప్రత్యేకించి సందర్శించాల్సినవాటిలో నాగర్‌హోళె జాతీయ ఉద్యానవనం ప్రధానమైంది. ఏనుగులు, పులులు, చుక్కల జింకలు, అడవి దున్నపోతులు తదితర జంతువుల్ని ఇక్కడ వీక్షించవచ్చు. అంతేకాదు పర్యా టకుల సౌకర్యార్థం రాత్రిపూట కూడా బసచేసే ఏర్పాట్లు ఉద్యానవనంలో ఉండడం విశేషం. సీతాదేవిని వెదుకుతూ రామలక్ష్మణులు సంచరించినదిగా చెప్పబడే ఇరుప్పు జలపాతం, అటవీశాఖకు చెందిన ఏనుగులను పట్టేందుకు శిక్షణనిచ్చే కేంద్ర మైన దుబరే, ఇక్కడకు 30 కి.మీల దూరంలోని కావేరీ నది నిలువ నీళ్ళతో మనసుకు ఉల్లాసాన్ని కలిగించే వలనూర్, కావేరి, కనిక, సుజ్యోతి నదులు సంగమించే భాగమండల, ప్రశాంతతకు ఆలవాలమైన నిసర్గధామ పర్యా టక స్థలాలు ప్రకృతి రమణీయతకు అద్దం పడుతున్నాయి.ఇలా ప్రకృతి రమణీయతనంతా ఒకే చోట పోతపోసినట్లు ఉన్న ఈ అద్భుత దృశ్యాలను ఒక్కసారెైనా దర్శించాల్సిందే...
చేరుకునేదిలా...
రెైలు, విమాన మార్గం లేని ఈ ప్రాంతానికి కేవలం రోడ్డు మార్గం ద్వారానే చేరుకోవాలి. అయితే దూరప్రాంత ప్రయాణీకులు బెంగు ళూరు చేరుకొని అక్కడి నుండి రోడ్డు మార్గం ద్వారా మడికేరి చేరుకోవచ్చు. బెంగుళూరు, మైసూరు, మంగళూరు, కన్ననూరు, తెల్లిచెర్రి నుంచి మడికేరికి బస్సు సౌకర్యం ఉన్నది.
Labels:
coorg,
Gouthamaraju,
India,
karnataka,
పర్యాటకం,
విహార ప్రదేశాలు
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment