ఉత్తర భారతదేశంలోని ప్రముఖమైన పర్యాటక ప్రాంతాల్లో ఆగ్రాను ప్రముఖంగా చెప్పవచ్చు. ఉత్తర్రపదేశ్‌లోని యమునానదీ తీరాన వెలసిన ఈ నగరంలో ప్రపంచ ప్రఖ్యాతి చెందిన అనేక పర్యాటక ప్రదేశాలున్నాయి. అయితే ఆగ్రా పేరు చెప్పగానే మొదటగా గుర్తుకు వచ్చేది తాజ్‌మహల్. ప్రపంచం యావత్తూ చూడాలని తపించే పాలరాతి కట్టడం కాకుండా ఈ నగరంలో ఇంకా అబ్బురప రిచే పర్యాటక ప్రదేశాలు ఎన్నో ఉన్నాయి. వాటిలో చెప్పుకోదగ్గ ప్రదేశం ఫతేపూర్ సిక్రీ నగరం.
తాజ్‌మహల్‌తో పాటు ఆగ్రా కోట, ఫతేపూర్ సిక్రీ లాంటి పర్యాటక ప్రాంతాలు ఆగ్రాను ప్రముఖ పర్యాటక ప్రాంతంగా మార్చాయి. యునెస్కోచే ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తింపు పొందిన ఈ ప్రదేశాలు ప్రపంచపర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. ఇక ఫతేపూర్ సిక్రీ విషయానికి వస్తే... భారతదేశాన్ని మొఘలులు పాలించిన కాలంలో ఆగ్రాలో పైన పేర్కొన్న ప్రపంచ ప్రఖ్యాత కట్టడాలెన్నో నిర్మించారు. అక్బర్ కాలంలో నివాసయోగ్యంగా నిర్మించబడిన ఓ సుందర నగరమే ఈ ఫతేపూర్ సిక్రీ.
అక్బర్ కాలంలో 1571 నుంచి 1585 వరకు ఈ నగరం రాజధానిగా విలసిల్లింది. ఈ నగరాన్ని సందర్శించిన పర్యాట కులకు ఇక్కడ నిర్మించబడిన అనేక కట్టడాలు విపరీ తంగా ఆకట్టుకుంటాయి. ఈ నగరంలోని బులం ద్ దర్వాజా, ఐదు అంతస్థుల పంచమహల్, సలీం చిష్తీ సమాధిలాంటివి చూడదగిన ప్రదేశాలు. అద్భుతమైన నగిషీలతో నిర్మించ బడిన ఈ నగరంలో కట్టడ వైభవం అడుగడుగునా సందర్శకుల ను విశేషంగా ఆకట్టుకుంటుంది. ఈ పర్యాటకకేంద్రాన్ని సంద ర్శించడానికి భారతీయ పర్యాటకులే కాక విదేశీ పర్యాటకులు సైతం ఎంతో మక్కువ చూపుతారు.
No comments:
Post a Comment