విహారాలు

India

Gamyam

Monday, May 2, 2011

హిమశిఖరాల సొగసు.. షిల్లాంగ్‌

lubha_bridge_jaintia_hills
అంబరాన్ని తాకే కొండలు, పాతాళాన్ని మరిపించే ప్రకృతి సిద్ధమై న లోయలు, ఎక్కడ చూసినా పరుచుకున్నట్లు కనిపించే పచ్చదనం, ఎత్తయిన పర్వత శిఖరాల అంచులనుండి జాలువారే జలపాతాలు చూడా లంటే... షిల్లాంగ్‌ను సందర్శించాల్సిందే. భారతదేశపు ఈశాన్య ప్రాంతంలో అతి చిన్న రాష్ర్టమైన మేఘాలయా రాజధాని ఈ షిల్లాంగ్‌.
http://www.flonnet.com/fl2221/images/20051021002208801.jpg
 The Elephant Falls near Shillong. 
The area, known as the "Scotland of the East", is a tourist attraction. 


షిల్లాంగ్‌ ప్రకృతి అందాలను చూసి, ఆ దేవదేవుడైన మేఘరాజు మైమరచిపోయి తన పరివారంతో పర్యావరణ అందాలను పరికించడానికి కొండలపైకి అరుదెంచాడా అన్న ట్లుంటుంది. ఇక్కడి వాతావరణాన్ని గమనిస్తే, కొండల మీద పాము మెలికను తలపించే కాలిబాటలు, దట్టమైన అడవులు కనువిందు చేస్తాయి.
 http://www.indiatravelblog.net/wp-content/uploads/2011/03/shillong_city-view.jpg
ఇక్కడ ఎల్లప్పుడూ వర్షం తుంపరలు పడుతూ ఎంతో ఆహ్లాదాని కి గురిచేస్తాయి. ప్రతిరోజూ ఇక్కడ వర్షం కురవడం షిల్లాంగ్‌ ప్రత్యేకత. ఇక్కడ వీచే చల్లని గాలులతో కదిలే పూదోటలు చెట్ల ఆకుల సవ్వడులు ఓ చిత్ర విచిత్రమైన సంగీతాన్ని ఆలపిస్తున్నట్లుగా ఉంటుంది. వీనులవిందైన ఆ సవ్వడి మనస్సుకు ఎంతో ఉత్తేజాన్ని కలుగజేస్తుంది.
http://www.sulekha.com/mstore/wordsmith/albums/default/shillong1.jpg
షిల్లాంగ్‌లోని అడవులలో వందల కొద్ది పక్షి జాతులు, వాటికి పోటీపడేలా జంతు జాతులు పర్యాటకులను విశే షంగా ఆకర్షిస్తుంటాయి. పక్షులు, జంతువులు కలిసి సంగీత కచేరీ చేస్తున్నట్లు గా ఉంటాయి వాటి ధ్వనులు. ఇలాంటి ప్రకృతి సహజ ధ్వనుల మధ్య పెరిగి నందుకేనేమో... మేఘాలయా జాతి ప్రజలలో కూడా సంగీతం సహజంగానే వచ్చినట్లుంటుంది.
http://www.north-east-india-tourism.net/Images/Cherrapunji.jpg
Cherrapunji ...  56 kms. from Shillong


మేఘాలయా ప్రజల పాటలు, సంగీత వాయిద్యాలు కూడా అన్నీ విశేషాలుగానే చెప్పుకోవచ్చు. ఇక్కడి ప్రతి కుటుంబంలోనూ... ఒక గాయకుడు, వాయిద్య కారుడు తప్పకుండా ఉంటారు. ప్రతి పది కుటుంబాల కు కలిసి ఒకే మ్యూజికల్‌ బ్యాండ్‌ కూడా ఉంటుంది. ఈ రకంగా, ప్రకృతి సంగీతంలో మమేకమైన ఈ ప్రజలు, వారు పాడే పాటలో్లనూ, వాయిద్యాల లోనూ ఆ సంగీతాన్ని ప్రపంచానికి వినిపిస్తున్నారు.


   
మేఘాలయాలో మూడో వంతు అటవీమయం కాగా... పశ్చిమాన ‘గారో’ పర్వత శ్రేణులు, తూర్పున ‘ఖాసి’, ‘జైంతియా’ పర్వతశ్రేణులు ఉన్నాయి కానీ, ఇవి మరీ ఎత్తైనవి కావు. ‘షిల్లాంగ్‌ శిఖరం’ అన్నింటికంటే ఎత్తైనది (1,965 మీటర్లు).
http://farm4.static.flickr.com/3163/2376773934_2a966462c6.jpg?v=0
ఇలా వెళ్లాలి:  షిల్లాంగ్‌కు 40 కిలోమీటర్ల దూరంలో ఉమ్రోయ్‌ ఎయిర్‌పోర్టు ఉంది. వారంలో నిర్దేశిత రోజులో్ల కలకత్తా నుంచి ఉమ్రోయ్‌కు విమానాలుం టాయి. అలాగే గౌహతిలోని గోపినాథ్‌ బోర్డోలోయ్‌ ఎయిర్‌పోర్టు నుంచి ఇక్క డికి చేరుకోవచ్చు. మేఘాలయా నుంచి మాత్రం రైలు సౌకర్యం లేదు. అయితే దేశంలోని అన్ని ముఖ్య పట్టణాల నుంచి గౌహతికి మాత్రం రెగ్యులర్‌గా రైళ్ళు నడుస్తుంటాయి.
కర్టసీ : సూర్య Daily

No comments:

Post a Comment