ప్రపంచంలోనే ఎతైన పర్వతం ఎవరెస్ట్ అని అందరికీ తెలిసిన విషయమే... అదొక్కటే కాకుండా భారత్ - నేపాల్ సరిహద్దులన్నీ హిమా లయాల మయమే..! అందువల్ల ఈ ప్రాంతం ట్రెక్కింగ్‌కు కేరాఫ్ అడ్రస్ అనడంలో ఆశ్చర్య మేముంది..! అలాంటి ప్రఖ్యాత ట్రెక్కింస్పాట్‌లలో కొన్ని ...
ఎవరెస్ట్ ప్రాంతంలో సెలవులు గడపటానికి వెళితే, అక్కడ మంచుతో బాగా కప్పబడిన హిమాలయాల దర్శనం, కొన్ని మంచి షెర్పా పల్లెలను చూస్తూ సాగే అందమైన, స్పూర్తి ప్రదాయకమైన ప్రయాణం.
aerial view of a Nepalese village
ప్రాచీన బౌద్ధరామాలు వంటి వాటిని చూడగలగడం, ఇంకా చూపు తిప్పుకోనివ్వని శిఖరాలు మీరా, ఐలాండ్, పోకల్డే శిఖరం, ఇంకా మరెన్నో చూడవచ్చు.
ప్రపంచ ప్రసిద్దమైన ట్రెక్కింగ్ ప్రదేశం అన్నపూర్ణ ప్రాంతం. ఇక్కడ మూడు ముఖ్యమైన ట్రెక్కింగ్ దారులు ఉన్నాయి. ఇవి ఉత్తరంగా నేపాల్ మధ్యలోకి వచ్చేలా ఉంటాయి. అవి... జామ్సం, అన్నపూర్ణ శాంక్చురీ, అన్నపూర్ణ ప్రాంతమే వలయాల్లా ఉంటుంది. ఇక్కడి విభిన్న సంప్రదాయాలు, ప్రజలు, దీనిని మంచి ట్రెక్కింగ్ ప్రదేశంగా చేశాయి.
Tilicho lake Trekking is one of the newest trekking routes in Annapurna ...
Nilgiri above Jomosom, Annapurnas, Nepal
పోఖరా ది సిటీ అఫ్ లేక్స్ ఈ అన్నపూర్ణ ప్రాంతంలో ట్రెక్కింగ్ మొదలు పెట్టే ప్రాంతం కానీ, లేదా ముగించే ప్రాంతం కానీ అవుతుం ది. సహజ సౌందర్యంతో, చిత్రవిచిత్రం గా కనిపించే ఈ పట్టణం 3000 అడుగుల ఎత్తులో, గొప్ప హిమాలయ పర్వతాల ఒడిలో ఉంది. పర్యాటకులకు స్వర్గధామం అయిన ప్రదేశాలలో ఇది కూడా ఒకటి.
ఖాట్మండు లోయ నుండి ఇది కేవలం 200 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇక్కడకు రోడ్డు మార్గం ద్వారా కానీ లేదా విమానంలో కానీ తేలికగా చేరుకోవచ్చు.
లంగ్‌టంగ్ ప్రాంతం ఆశ్చర్యపరిచే ప్రకృతిని తిలకించడానికి సరైన ప్రదేశం! ఇది మరొక అత్యంత ప్రత్యేకమైన ట్రెక్కింగ్ స్థానం. ఇది ఉత్తర ఖాట్మండులో, హిమాలయాల మధ్యలో, టిబెటన్ సరిహద్దు పై, తేలికగా చేరుకునేలా ఉంది. ఈ ప్రదేశం ఎన్నో రవాల మొక్కలకు, హిమాలయాల రెడ్ పాండాతో సహా ఎన్నో రకాల జాతులకు చెందిన జంతువులకు, ఆలవాలంగా ఉన్నది. పికా, దుప్పి, హిమాలయాల నల్ల ఎలుగుబంటి మొదలైనవి ఇక్కడ ఉన్నాయి. ప్రపంచంలోని అన్ని ప్రాంతాల యాత్రికులకు ఇది ఒక చక్కటి సెలవుల విడిది గా పేరుగాంచింది. ఉత్తర ఖాట్మండులో ఉన్న హేలంబు, అద్భుతమైన షెర్పా, తమంగ్ పల్లెలతో ట్రెక్కింగ్ కు చాలా చాలా అనువుగా ఉంటుంది.
గోసాయికుండ అనేది ఒక చక్కటి సరస్సు. ఇది తనతో పాటుగా ఉన్న ఇతర చక్కటి సరస్సులతో సహా పేరు పొందినది.
No comments:
Post a Comment