విహారాలు

India

Gamyam

Wednesday, December 21, 2011

సౌరాష్ట్ర సుందర సీమ... సపుతర

ఉత్తరభారత దేశంలో అత్యంత అభివృద్ధి చెందిన రాష్ట్రం ఏదంటే... ఎవరైనా ఇట్టే చెప్పే సమాధానం గుజరాత్‌. అయితే... ఆ రాష్ట్రం పర్యాటకంగా వెనుకబడే ఉందని చెప్పుకోవాలి. కానీ, ఇప్పుడు ఆ రాష్ట్రంలో అభివృద్ధి చెందుతున్న రంగాల్లో పర్యాటకరంగం కూడా చేరిపోయింది. విహారేకంద్రాలు ఎక్కువగా లేకపోవచ్చు కానీ, పుణ్యక్షేత్రాలకు ఆ రాష్ట్రం పెట్టింది పేరు. ఈ రాష్ట్రంలో ఉన్నన్ని ఆధ్యాత్మిక ప్రదేశాలు మరే రాష్ట్రంలోనూ లేవంటే అతిశయోక్తి కాదేమో! గుజరాత్‌ పొడవునా లెక్కలేనన్ని పవిత్ర స్థలాలు ఉన్నాయి. ప్రతిరోజూ లక్షలాదిమంది పర్యాటకులు వాటిని సందర్శిస్తుంటారు. గుజరాతీల ఆధ్యాత్మిక దృక్పథానికి ఇదే నిదర్శనం. పర్యాటకరంగంలో వెనకబడి ఉన్నప్పటికీ... కొన్ని పర్యాటక కేంద్రాలు మాత్రం పర్యాటకులను ఆకర్షించడంలో అగ్రభాగాన నిలుస్తున్నాయి. అలాంటి వాటిలో... గుజరాత్‌లోని ఏకైక పర్వతప్రాంతం సపుతర ఒకటి. వారాంతపు విడిదిలో ఇది రాష్ట్రంలోనే నెంబర్‌ వన్‌ అని చెప్పవచ్చు.
http://www.indianmirror.com/tourism/images/suputaramainimg.jpg
సౌరాష్ర్ట నుండి సూరత్‌ దాకా ఏకంగా 1600 కిలోమీటర్ల తీరరేఖ గుజరాత్‌ సొంతం. అందువల్ల ఇక్కడ బీచ్‌లకు కొదువలేదు. చోర్వాద్‌, సోమనాథ్‌, ద్వారక, అహ్మద్‌పూర్‌, మాండ్వీ, తిథల్‌, డ్యూమస్‌ వంటి ఎన్నో బీచ్‌లు ఉన్నాయి. కానీ పర్యాటక అభివృద్ధికి అవసరమైన చర్యల తీసుకోవడంలో వెనుకబాటుతనం కారణంగానే ఇన్ని మంచి బీచ్‌లు ఉండి ఎవరినీ ఆకర్షించలేకపోతున్నాయి. కానీ గుజరాత్‌లోని సపుతర మాత్రం ఇందుకు పూర్తి భిన్నం. ఇది కూడా ఏళ్ళ తరబడి నిరాదరణకు గురైందే. కానీ ఇప్పటికైనా గుజరాత్‌ సర్కారు దీనిపై దృష్టి సారించింది. దీనిని ఓ మంచి పర్యాటక కేంద్రంగా మలిచేందుకు నడుం బిగించింది. ఇప్పుడు మరో కొన్నేళ్లలో సపుతర మంచి పర్యాటక కేంద్రంగా ఎదిగేందుకు అన్ని చర్యలూ చేపట్టింది.

ఎక్కడుంది...

 http://travel.vandeindia.com/wp-content/uploads/2009/09/Saputara-Lake.jpg
సపుతర సముద్ర మట్టానికి కిలోమీటరు ఎత్తున ఉంది. గుజరాత్‌లోని చాలామందికి ఇది పెద్ద హిల్‌ స్టేషనేమీ కాదు. షిరిడీ వెళ్లే దారిలో మహారాష్ర్టకు కాస్త సమీపంలో ఉంటుంది. దక్షిణ గుజరాత్‌లోని వాఘాయ్‌ అనే ఈ చిన్న పట్టణంలో సాదాసీదాగా గిరిజన జనాభా, దట్టమైన అడవి ఉంటాయి. అహ్మదాబాద్‌, బరోడా, సూరత్‌ల నుంచి సమీపంలో ఉంటుంది. 
http://www.uniquelifecare.com/images/places/Saputara_Lake.jpg
కాబట్టి చాలామంది పర్యాటకులు ఈ మార్గాన్నే ఎంచుకుంటారు. మరో రోడ్డు అహ్వా నుంచి ఉంటుంది. ఇది గుజరాత్‌లోకెల్లా అత్యంత చిన్న జిల్లా అయిన దంగ్‌కు ప్రధాన పట్టణం. అహ్వా నుంచి బస్సు మార్గాన ఇక్కడికి మూడు గంటలు పడుతుంది. కానీ ఆ రోడ్డు కాస్త ప్రమాదకరం. రోలర్‌కోస్టర్‌ రైడ్‌ను తలపిస్తుంది. 
http://www.saputara.net/saputararesorts/shilpihillresort/shilpi.jpg
1966 లో ముంబై రాష్ర్టం నుండి గుజరాత్‌ విడిపోయాక సపుతరను రాష్ర్టంలోకెల్లా ఏకైక వేసవి విడిదిగా ప్రకటించాలని గుజరాత్‌ నిర్ణయించింది. కానీ, వేసవి, శీతాకాలం, వర్షాకాలం అని తేడా లేకుండా అన్ని కాలాల్లో పర్యాటకులకు కనువిందు చేస్తోంది ఈ పర్వత ప్రాంతం. ప్రకృతి ఒడిలో సాహసాలు చేయాలనుకునేవారికి ఇది సరైన ప్రాంతం. http://i654.photobucket.com/albums/uu267/aruddharaj/Saputara%20-%20hill%20resort%20of%20Gujarat/Gira-waterfall-saputara.jpg
రూట్‌ గైడ్‌...
అహ్మదాబాద్‌, బరోడా, సూరత్‌ ల నుంచి పుష్కలంగా బస్సులుంటాయి. లేదంటే వాఘై, అహ్వాల నుంచి కూడా రావచ్చు. అదీ కుదరకపోతే... అహ్మదాబాద్‌ నుంచి బిలిమోరా (400 కిలోమీటర్లు) వెళ్లే రైలులో తక్కువ ఖర్చుతో ఇక్కడి చేరుకోవచ్చు. ఆ తరువాత లోకల్‌ ఎస్టీ బస్సు ఎక్కితే సపుతర చేరుకున్నట్టే! సొంతవాహనంలో బయలుదేరితే గనక పెట్రోల్‌ ట్యాంక్‌ ను నిండుగా కొట్టించడం పొరపాటున కూడా మరిచిపోవద్దు. తర్వాత వాఘై, అహ్వాల్లో మరోసారి ట్యాంక్‌ నింపుకుంటే చాలా మంచిది. ఎందుకంటే సపుతరలో పెట్రోల్‌ పంపు లేదు మరి!

ప్రకృతి అందాల విందు....
Saputara2 

సపుతరలో ముందుగా చెప్పుకోవాల్సింది ‘గాంధీ శిఖర్‌’. ఈ శిఖరాగ్రానికి ట్రెక్కింగ్‌ చేయడం ఎంతో ఆహ్లాదాన్ని ఇస్తుంది. కిందనుంచి నదిమీద పడుతున్న తొలి కిరణాలు ఆస్వాదిస్తూ ట్రెక్కింగ్‌ చేయడం మాటల్లో వర్ణించలేని అనుభూతిని మిగులుస్తుంది. పచ్చని కొండలమీదుగా అవి పరుచుకునే అద్భుతదృశ్యాన్ని అలా చూస్తూ మైమరిచిపోవడం ఇక్కడికి వచ్చే పర్యాటకులకు సర్వసాధారణమైన అనుభవం. వర్షాకాలంలో ఇక్కడ ఎంత వర్షం పడుతుందో లెక్కగట్టాలంటే కొంచె కష్టమే మరి. ప్రతి సీజన్‌లో సుదీర్ఘంగా వానపడ్డాక అత్యంత దట్టమైన పచ్చదనం ఈ ప్రాంతాన్ని నిండా పరుచుకుపోతుంది. వేసవిలో గవర్నర్స్‌ హిల్స్‌ మీదుగా వెళ్తుంటే పశ్చిమాన సూర్యుడు సపుతర చెరువు లోకి కుంగుతుంటాడు.

చూస్తుండగానే దట్టంగా చీకట్లు పరుచుకొని వెలు గులు విరజిమ్ముతాయి. ఈ అద్భుతం చూడటానికి రెండు కళ్లూ చాలవు. సపుతర బస్టాండ్‌ చేరుకోగానే ముఖ్యమంత్రి నరేంద్ర మోడి చిరునవ్వుతో నిలుచున్న రెండు అతిపెద్ద భారీ హోర్డింగ్‌లు దర్శనమిస్తాయి. ఏదో ఒక రోజు అమితాబ్‌ బచ్చన్‌ కూడా మోడితో కలిసి కన్పించడం కూడా ఎంతో దూరంలో లేదు. ఎందుకంటే గుజరాత్‌ పర్యాటక శాఖ బిగ్‌ బీ ని తమ బ్రాండ్‌ అంబాసిడర్‌గా నియమించుకుంది. ఈ పర్యాటక కేంద్రాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేయడం తమ ప్రధాన లక్ష్యమని గుజరాత్‌ ప్రభుత్వం ఇటీవలే అసెంబ్లీలో కూడా ప్రకటించింది. కాస్త సమయం పట్టినా సపుతర పర్యాటకులకు మరింత అందాల విందు చేయడం ఖాయం. సపుతర ఇప్పటిదాకా పూర్తిగా అభివృద్ధి చెందకపోయినా వారాంతాల్లో సరదాగా కుటుంబమంతా కలిసి వెళ్లేందుకు ఎంతో అనువైన ప్రదేశం.

సందర్శించాల్సినవి ఇవీ...

 http://www.holidayiq.com/images/property/resortimg/1997_3.jpg 
ఇక్కడ చూడదగ్గ ప్రాంతాలు చాలానే ఉన్నాయి. బోటింగ్‌ క్లబ్‌, ఎకో పాయింట్‌ అటవీ నర్సరీ, ఆర్టిస్టుల విలేజీ, లేక్‌వ్యూ గార్డెన్‌, మ్యూజియం, నాగేశ్వరాలయం, పూర్ణ శాంక్చురీ, సన్‌సెట్‌ పాయింట్‌, రోజ్‌ గార్డెన్‌, స్టెప్‌ గార్డెన్‌, సపుతర చెరువు, సన్‌రైజ్‌ పాయింట్‌, టౌన్‌ వ్యూ పాయింట్‌, వంశద నేషనల్‌ పార్క్‌, వ్యాలీ వ్యూ పాయింట్‌ మిలీనియం గార్డెన్‌ టేబుల్‌ పాయింట్‌, గవర్నర్స్‌ హిల్‌ ఇలా చెప్పుకుంటూ పోతే జాబితా కాస్త పెద్దగానే ఉంటుంది. దాంగ్‌ జిల్లాలోని 300 పైచిలుకు గ్రామాల్లో 94 శాతం గిరిజనులే ఉంటారు. గమిట్‌, కంబీ, వర్లీ, వసవస్‌ వంటి స్థానిక గిరిజన సమూహాలు వంట చెరుకు కొట్టి, తేనె సేకరించి జీవనోపాధి పొందుతుంటారు. http://i1.trekearth.com/photos/60273/table_top_hill.jpg
ఇక ఆర్టిస్టుల గ్రామం ఇలాంటి గిరిజన సమూహాల వారే స్థాపించుకున్నారు. వారు అడవి నుంచి వెదురు సేకరించి పలు సాంప్రదాయ కళారూపాలను తయారు చేసి విక్రయిస్తుంటారు. ఆర్టిస్టుల గ్రామం సపుతర - నాసిక్‌ మెయిన్‌ రోడ్డు పై ఉంది. లోయ నడుమ భాగంలో సపుతర చెరువు ఉంటుంది. ఇది 21 మీటర్ల లోతున లోయ అంతటా పరుచుకుని ఉంటుంది. సపుతరలో ఉష్ణోగ్రతలో పెద్దగా మార్పులేవీ ఉండవు. కాబట్టి ఇక్కడికి రావాలంటే మార్చి నుండి నవంబర్‌ వరకు ఎప్పుడైనా రావచ్చు.

No comments:

Post a Comment