చల్లని సాయం సమయం... పున్నమి వెన్నెల్లో... ఇసుక తిన్నెలపై... అప్పుడప్పుడూ వచ్చి పలకరించి వెళ్లే అలలు... ఒంటికి హాయిగొలిపే పిల్ల తిమ్మెరలు... వింటేనే ఎంతో హాయిగావుంది కదూ... అలాంటి అద్భుత వాతావరణంతో పాటు... శతాబ్దాల చారిత్రక విశిష్టతను, అరుదైన కట్టడాలను, సర్వమత సౌభ్రాతృత్వాన్ని తనలో ఇముడ్చుకుని వందల ఏళ్ళుగా భారత పర్యాటక రాజధానిగా విరాజిల్లుతోంది గోవా. పోర్చుగీసు పాలన నుండి విముక్తిపొంది... స్వతంత్ర భారతావనిలో భాగమై స్వర్ణోత్సవ వేడుక జరుపుకుంటున్న ఈ విశ్వవిఖ్యాత విహారేకంద్రం గురించి మరోసారి మననం చేసుకుందాం...
కొంకణ తీరాన కొలువై ఉన్న గోవా... వైశా ల్యం రీత్యా దేశంలో రెండవ అతిచిన్న రాష్ట్రం. అయితే... పర్యాటకంగా అభివృద్ధి చెందిన విహారకేంద్రాల్లో గోవాయే భారత టూరిజం క్యాపిటల్ అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. గోవా రాజధాని పనజీ. 16వ శతాబ్దంలో పోర్చు గీసు వర్తకులు గోవాలో స్థావరం ఏర్పరుచుకొని కొద్దికాలంలోనే అధికారాన్ని బలవంతంగా హస్తగ తం చేసుకొన్నారు. అప్పటినుండి 450 ఏళ్ళ పరా యి పాలనలో ఉన్న గోవాను 1961 డిసెంబర్ 19వ తేదీన భారత ప్రభుత్వం జరిపిన సైనిక చర్య తో గోవా భారత్‌లో విలీనమైంది.
ఇదీ చరిత్ర...
గోవా ప్రాంతాన్ని మౌర్యులు, శాతవాహనులు, దక్కన్ నవాబులు పాలించారు. 13వ శతాబ్దంలో ఇది ఢిల్లీ సుల్తానుల వశమైంది. 13వ శతాబ్దపు చివరిలో విజయనగర రాజు మొదటి హరిహర రాయలు గోవాను జయించారు. 14వ శతాబ్దపు చివరిలో బహమనీ సుల్తానులు దీన్ని కైవసం చేసు కున్నారు. 16వ శతాబ్దంలో పోర్చుగీసు వర్తకులు గోవాలో స్థావరం ఏర్పరచుకుని, కొద్ది కాలంలోనే అధికారాన్ని హస్తగతం చేసుకున్నారు.
1498లో క్రొత్త సముద్రమార్గాన్ని కనుక్కొన్న మొదటి ఐరోపా వర్తకుడు వాస్కో డ గామా కేరళలోని కోజికోడ్‌లో అడుగుపెట్టాడు. తరువాత అతడు గోవా చేరాడు. సుగంధ ద్రవ్యాల వ్యాపారమే పోర్చుగీసు వారి అప్పటి లక్ష్యం. కానీ 1501లో తిమ్మయ్య అనే స్థానిక రాజు తరపున పోరాడిన అల్ఫోంసో డి అల్బుకర్క్ అనే పోర్చుగీసు అడ్మిరల్ బహమనీ రాజులనోడించాడు. గోవాను తమ నావలకు స్థావ రంగా చేయాలన్నది అప్పుడు వారి అభిమతం.
Portuguese prisoners of war, captured during the invasion of Goa by Indian military forces, are lined up at military barracks in Panaji on 28 December 1961. |
అప్పటి నుండి అక్కడే స్థిరపడిన పోర్చుగీసువారు స్థానికులను పెళ్లి చేసుకున్నారు. భారత దేశానికి స్వాతంత్య్రం వచ్చాక కూడా పోర్చుగీసు వారు గోవాను వదులుకోడానికి ఒప్పుకోలేదు. దాంతో 1961లో ‘ఆపరేషన్ విజయ్’ పేరుతో భారత సైన్యం గోవాను డిసెంబర్ 19న హస్తగతం చేసుకున్నది.
గోవాతో పాటు డామన్, డయ్యులు కూడా భారతదేశం అధీనంలోకి వచ్చాయి. కానీ 1974 వరకు పోర్చుగీసు ప్రభుత్వం గోవాను భారతదేశంలో అంతర్భాగంగా అంగీకరించలేదు. 1987 మే 30న గోవాను కేంద్రపాలిత ప్రాంతంగా కాక ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పరచారు. ఇది భారతదేశంలో 25వ రాష్ట్రం అయ్యింది.
ఆహారం
వరి అన్నం , చేపల కూర ఇక్కడి ప్రధాన ఆహారం. కొబ్బరి, మసాలా దినుసులు, జీడిమామిడి, మిర్చి వంటి ద్రవ్యాలు వాడి తయారు చేసే రుచికరమైన వంటకాలు సందర్శికులను ఎంతగానో సంతృష్టపరుస్తాయి. జీడిమామిడి, కొబ్బరి కల్లు నుండి తయారు చేసిన ’ఫెన్నీ’ అనే డ్రింక్ ఇక్కడి ప్రత్యేకత. సీ ఫుడ్ ఇష్టపడే వారికి గోవాను వదిలి రాబుద్ధి కాదు. అవకాశం వచ్చినప్పుడే కదా ఉపయోగించుకోవాలి. ఈ టూర్‌లో వున్నప్పుడే బోలెడన్ని రకాల వంటకాలు రుచి చూడొచ్చు.
ఇలా వెళ్లండి...
గోవాలో రెండు రైల్వే మార్గాలున్నాయి. ఒకటి స్వాతంత్య్రానికి పూర్వం నిర్మించిన వాస్కోడిగామా - హుబ్లీ మార్గం. రెండోది 20 వ శతాబ్దంలో నిర్మించిన కొంకణ్ రైల్వే మార్గం. ఇక్కడ సైకిళ్ల లాగే టూ వీలర్స్ కూడా అద్దెకిస్తారు. వీటికి అద్దె రోజుకు 400 పైనే వుంటుంది.
బస్‌లో... హైదరాబాద్ నుండి గోవాకి ఎపి టూరిజం వారి ఐదురోజుల టూర్ ప్యాకేజీలు అందుబాటులో ఉన్నాయి. ఎసి, నాన్ ఎసి, హైటెక్ కోచ్... ఇలా చాలా రకాలున్నాయి.
రైలులో... హైదరాబాద్ నుండి కాచిగూడ టు యశ్వంత్‌పూర్ ఎక్స్‌ప్రెస్ ఉంటుంది. ఇది వాస్కోడిగామా స్టేషన్‌కు తరువాతి రోజు మధ్యాహ్నం చేరుకుంటుంది. విజయవాడనుండైతే అమరావతి ఎక్స్‌ప్రెస్ (హౌరా-వాస్కోడిగామా) ప్రతి సోమ, మంగళ, గురు, శని వారాల్లో ఉంటుంది.
బీచ్‌ల నగరం...
నైట్ రివర్ క్రూయిజ్ షిప్ మీద మండోవి నదిలో వెన్నెల విహారం, షిప్ డెక్ మీద డాన్సులూ, గానా భజానా... పెద్దలూ, పిల్లలూ, జంటలూ అందరూ కలిసి ఆహ్లాదంగా గడపొచ్చు.
మిరమర్ బీచ్‌కి 45 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఆరంబోలా బీచ్ మారుమూల ప్రాంతం కావడం వల్ల విజిటర్స్ తక్కువ. ఎక్కువ మంది ఫారినర్స్ సన్‌బాత్ చేస్తూ కనిపిస్తారు.
తర్వాత చూడాల్సింది చపోరా కోట.
సముద్రం పక్కన కొండాపై నిర్మించిన ఆ కోట ఒక విజువల్ ట్రీట్. హిందీ సినిమా ‘దిల్ చాహతా హై’ లో ఒక పాటను ఇక్కడే షూట్ చేశారు.
గోవాలో చాలా ఫేమస్ అయినది కలన్‌గుటే బీచ్. దీన్ని క్వీన్ ఆఫ్ బీచ్స్ అంటారు. ఇది చాలా రద్దీగా వుంటుంది. పారాసైలింగ్ లాంటి వాటర్ స్పోర్ట్‌స ఇంట్రెస్ట్ ఉంటే ఇక్కడ చక్కని కాలక్షేపం.
తర్వాత ‘బగ బీచ్’ నైట్ లైఫ్‌కి చాలా ఫేమస్. ఇక్కడ కొన్ని పబ్స్ రాత్రి 11 గంటల తర్వాతే ప్రారంభమయ్యేవి కూడా ఉన్నాయి. కాని వాటిల్లో కపుల్స్‌కు మాత్రమే ప్రవేశం.
గోవా పేరు ఇలా...
గోవా లేదా గోమాంటక్ అని పిలిచే ఈ రాష్ట్రానికి ఆ పేరు ఎలా వచ్చిందనే విషయంపై స్పషష్టమైన ఆధా రాలు లేవు. ఈ ప్రాంతానికి మహాభారతం లోనూ, ఇతర ప్రాచీన గ్రంధాలలోనూ గోపరాష్ట్రం, గోవరాష్ట్రం, గోపకపురి, గోపక పట్టణం, గోమం చాల, గోవపురి వంటి పేర్లు వాడుకలో ఉండేవి. కాలగమనంలో గోవా పేరు స్థిరపడిపోయింది. ఇక్కడ దేశంలో మరెక్కడా లేనన్ని హిందూ దేవాలయాలు ఉన్నాయి.
పర్యాటకమే ప్రధాన వనరు....
ఇక్కడి ప్రజల తలసరి ఆదాయం భారతదేశంలోని ఇతర ప్రాంతాల్లో కంటే ఒకటిన్నర రెట్లు ఎక్కువగా ఉంది. దీనికి కారణం ఇక్కడి ఆర్థిక రంగం వృద్ధిచెందడమే. పర్యాటక రంగం గోవా ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకగా ఉంది.
భారతదేశానికి వచ్చే విదేశీ యాత్రికుల్లో 12 శాతం మంది గోవాను దర్శిస్తున్నారు. గోవాలో మాండవి, జువారి, తెరెఖోల్, ఛపోరా, బేతుల్ అనే నదులు ప్రవహిస్తున్నాయి. జువారి నది ముఖద్వారాన ఉన్న మార్ముగోవా నౌకాశ్రయం సహజ నౌకాశ్రయం.
ఇవి ఇక్కడ ఎంతో ఫేమస్...
గోవాలో ఫెన్నీ అని జీడి పండ్లతో, కొబ్బరితో చేసిన డ్రింక్ చాలా ఫేమస్. అక్కడికి దగ్గరలో బిగ్‌ఫుట్ అనే ప్రదేశంలో ఓ సాధువు ఒంటికాలితో తపస్సు చేశాడట. ఆ ప్రదేశంలో మనం కూడా కాలు పెట్టి ఏదైనా కోరుకుంటే అది తప్పక నెరవేరుతుందని అంటారు.
మంగేశ్ టెంపుల్‌లో శివలింగం బదులు శివుని విగ్రహానికి చేస్తుంటారు. ప్రఖ్యాత గాయని లతా మంగేశ్వర్ ఈ ఆలయాన్ని డెవలప్ చేశారట.
భారతదేశానికి వచ్చే విదేశీ యాత్రికుల్లో 12 శాతం మంది గోవాను దర్శిస్తున్నారు. గోవాలో మాండవి, జువారి, తెరెఖోల్, ఛపోరా, బేతుల్ అనే నదులు ప్రవహిస్తున్నాయి.
జువారి నది ముఖద్వారాన ఉన్న మార్ముగోవా నౌకాశ్రయం సహజ నౌకాశ్రయం.
సెయింట్ జేవియర్ చర్చ్‌లో 400 ఏళ్ళ కిందటి జేవియర్ మమ్మీ ఇప్పటికీ చెక్కుచెదరకుండా సమాధి స్థితిలో ఉన్నట్టు కనిపిస్తుంది. పూర్తిగా పోర్చుగీస్ స్టయిల్‌లో కట్టిన ఆ చర్చ్ కూడా చాలా పెద్దది, పురాతనమైనది. తర్వాత డోనా పౌలా బీచ్ ఒక అద్భుతమైన సీనిక్ వ్యూ.
గోవా మొత్తం రెండు భాగాలుగా ఉంటుంది. నార్త్ గోవా, సౌత్ గోవా.
నార్త్ గోవాలో చూడదగ్గ ప్రదేశాలు నార్వాలో వెయ్యి సంవత్సరాల సప్తకోటేశ్వర ఆలయం, మేయమ్ లేక్, మపుసా టౌన్ గుండా వగాటోర్, అంజున, కలన్‌గుటే బీచ్‌లు, అగౌడా ఫోర్ట్, పాంజిమ్ హాండీక్రాఫ్ట్‌స ఎంపోరియమ్. సౌత్ గోవాలో లేదా ఓల్‌డ గోవాలో చూడదగ్గ ప్రదేశాలు పోర్చ్‌గీస్ శైలి చర్చ్‌లు, బోమ్ జీసెస్ బాసిలికా, సె కేధిడ్రిల్, వాక్స్ వరల్డ్ మ్యూజియం, క్రిస్టియన్ ఆర్ట్ మ్యూజియం, మంగేశ్ టెంపుల్, శాంతాదుర్గ టెంపుల్, పురాతన గోవా మ్యూజియం, మార్‌గోవా, కోల్వా బీచ్, డోనా పౌలా బే, మిరామర్ బీచ్‌లు.
250-year old Portuguese House 'Casa Araujo Alvares'
Archeological Museum
India's second wax museum.
ఇక దక్షిణ గోవా దీన్నే పాత గోవా అని కూడా అంటారు. ఇక్కడ చూడాల్సిన ప్రదేశాలకొస్తే... పోర్చుగీస్ శైలిలో నిర్మించిన చర్చిలు, బోమ్ జీసెస్ బాసిలికా, సె కేథిడ్రిల్, వాక్స్ వరల్‌డ మ్యూజియం, క్రిస్టియన్ ఆర్ట్ మ్యూజియం, మంగేశ్ టెంపుల్, శాంతాదుర్గా ఆలయం, పురాతన గోవా మ్యూజియం, మార్‌గోవా, కోల్వా బీచ్, డోనా పౌలా బే, మిరామర్ బీచ్ ఉన్నాయి. భారత పోర్చుగీసు శైలిలో నిర్మించిన పాతకాలపు ప్రాసాదాలు గోవాలో మరొక ఆకర్షణ. కానీ ఇవి ప్రస్తుతం చాలా వరకు శిధిలావస్థలో ఉన్నాయి. పాంజిమ్‌లోని ఫౌంటెన్ హాస్ అనే ప్రాంతం సాంస్కృతిక ప్రాంతంగా గుర్తింపబడింది. గోవా జీవనాన్ని, నిర్మాణాలను ప్రతిబింబించే పేట అని దీన్ని చెప్పొచ్చు.
కొన్ని హిందూ దేవాలయల్లో కూడా ఈ శైలి కనిపిస్తుంది.
December 19, 2011, the day Goa celebrates the golden jubilee of its liberation from Portuguese rule, a new museum called Goa Chakra displaying over 70 of these almost-forgotten modes of transport, will be thrown open.
No comments:
Post a Comment