జర్మనీ ఒకలా చూస్తే పాతగా ఉంటుంది. పూర్వవైభవం ఇంకా సజీవంగా... ఇంకో వైపు మరీ కొత్తగా కనిపి స్తుంది. సూపర్ సిటీస్, షాపింగ్ మాల్స్... ఎలా చూసినా మాత్రం జర్మనీ చాలా అందంగా ఉంటుంది. మంచు కొండ లు, పచ్చని ప్రకృతి మధ్య అందంగా అమరిన పట్టణాలూ, పల్లెలూ... విశాలమైన వైన్‌యార్డ్‌లు, అందమైన ల్యాండ్ స్కేప్‌లూ... ఎప్పటికైనా చూడాలి జర్మనీని అనేలా ఉంటుంది.
మనరాష్ట్రం
నుంచి జర్మనీకి దాదాపు ఎనిమిది గంటల విమాన యానం. జర్మనీలోని
ఫ్రాంక్‌ఫర్డ్ విమానాశ్రయం. ప్రపంచంలోనే అతి పెద్ద విమానాశ్రయం.
జర్మనీలో మొదటగా చూడదగ్గ ప్రదేశం ‘హైడల్ బర్గ్’. ‘నెక్కర్’ నది హైడల్ బర్గ్ నగరం మధ్యలో ప్రవహిస్తోంది. నగరానికి ఒకవైపు చివరగా పచ్చని చెట్లతో నిండిన ఎతైన కొండ ఉంది. అంటే ఈ నగరం అంతా కొండపక్కగా మొదలై, నదికి ఆవలివైపుకి విస్తరించిన నగరంలోకి వెళ్ళడానికి బ్రిడ్జి... చూస్తే పక్కా ప్రణాళిక ప్రకారం నగరాన్ని నిర్మించినట్లుగా ఉంటుంది.
జర్మనీలో అతి సంపన్న నగరం ‘మ్యూనిక్ సిటీ’. దీనికి దగ్గరలోనే ఉన్న ‘నీయిష్ వాన్స్‌టెయిన్ ప్యాలెస్’ ఎతె్తైన కొండ మీద వుంది. కింద నుంచి చూస్తే ఠీవిగా నిలబడినట్లు ఉంటుంది. కొండ మీదకు నడిచి వెళ్ళచ్చు, బస్సులు, గుర్రాలు కూడా వున్నాయి. ప్యాలెస్ ముఖద్వారం వర్ణించనలవి కానిది. రాజుల విలాసవంతమైన జీవితానికి ప్రత్యక్ష నిదర్శనంగా ఉంది. ‘లడ్విగ్’ అనే రాజుకు ఆ ప్రదేశం నచ్చడంతో అక్కడే నివాసం ఉండడానికి ప్యాలెస్ కట్టాడు. అయితే ఆ రాజు నిర్మాణం పూర్తయిన తర్వాత చాలా కొద్ది కాలం మాత్రమే అందులో నివసించాడు. అకాలమరణం రాజు కోరికను అర్ధంతరంగా తుంచివేసింది.
ప్రభుత్వం దానిని మ్యూజియంగా మార్చి అందులో లడ్విగ్ వాడిన వస్తువులను, జీవిత విశేషాలను తెలిపే చిహ్నాలను ప్రదర్శనకు ఉంచింది. సెక్యూరిటీ పకడ్బందీగా ఉంటుంది. జర్మనీ దేశస్థులు మంచి మర్యాదస్తులు. విదేశీయులను అమితంగా గౌరవిస్తారు. జీవితాన్ని బాగా ఎంజాయ్ చేస్తారు. వారానికి ఐదు రోజులు పని చేసి రెండు రోజులు హాలిడే తీసుకుంటారు. బాగా ఖర్చు చేస్తారు. ప్రభుత్వం ఉచితంగా చదువు, నిరుద్యోగ భృతి, వృద్ధాప్యంలో ఆర్ధిక సహాయం చేస్తుంది. కాబట్టి వాళ్ళకు దాచుకోవడమన్న ధ్యాస ఉండదు. అందుకే అవినీతి కూడా ఉండదు.