విహారాలు

India

Gamyam

Saturday, January 8, 2011

పేరు చిన్న-సొగసుమిన్న

సౌత్ అమెరికాలోని రిపబ్లిక్ ఆఫ్ చిలీ తూర్పున ఏండెస్ పర్వతాలు, పశ్చిమాన పసిఫిక్ సముద్రం సరిహద్దులుగా గల దేశం. ఇది చక్కటి పర్యాటక ప్రాంతం. దీని పసిఫిక్ సముద్ర తీరం 6435 కిలోమీటర్లు. కొన్ని ద్వీపాలు కూడా ఉన్నాయి కాబట్టి ఇక్కడ చక్కటి బీచెస్‌ని చూడచ్చు. ప్రపంచంలోని అత్యంత పొడిగా ఉండే 105000 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం గల అటకామా ఎడారి చిలీ దేశంలో వుంది. సముద్ర తీరం, అగ్ని పర్వతాలు, నదులు, సరోవరాలు, ద్వీపాలు, ఉష్ణ కుండాలు ప్రాచీన శిథిలాలుగల ఈ దేశంలో టూరిస్టులని ఆకర్షించే అన్ని అంశాలున్నాయి.
ఇక్కడ చూడదగ్గ ప్రదేశాలలో వాల్పరైసో నగరం ఒకటి. ఇది చాలా పేద నగరం. బయటకి కనబడే కరెంట్ తీగలు, సన్నటి రోడ్లుగల ఈ ఊరుని ఓ రోజులో చూడచ్చు.


రపానూయి (ఈస్ట్రన్ ఐలండ్) చూడదగ్గ ద్వీపం. పురాతన శిథిలాలు ఇక్కడ చాలా చూడచ్చు. ఇక్కడ యోయే జాతి ప్రజలు జీవిస్తున్నారు. స్కూబా డైవింగ్ లాంటి సముద్ర క్రీడలు, గుర్రపుస్వారీ ప్రత్యేక ఆకర్షణలు.
ప్రపంచంలోని అతి పెద్ద స్విమ్మింగ్‌పూల్ దుబాయ్‌లోనో, లాస్ వేగాస్‌లోనో ఉందని చాలామంది భావిస్తారు. కానీ అది చిలీలోని అల్లరోబోలోని శాన్ ఆల్ఫాన్సో డెల్మార్ అనే రిసార్ట్‌లో ఉంది. 2006 డిసెంబర్‌లో ఆరంభించిన ఇది 19 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న స్విమ్మింగ్ పూల్. చాలామంది దీన్ని కరేబియన్ సీగా భ్రమపడే అవకాశాలున్నాయి. 6కోట్ల 60 లక్షల గేలన్ల నీటిని ఇది పసిఫిక్ మహాసముద్రంనించి తీసుకుంటుంది. ఈ రెంటికీ మధ్య దూరం కొన్ని అడుగులు మాత్రమే. మనుష్య నిర్మిత బీచ్‌లు దీని పక్కనే ఉన్నాయి. దీని ఎదురుగా ఉన్న హైరైజ్ కాంజో బిల్డింగ్స్‌లోని అపార్ట్‌మెంట్లని తక్కువ కాలానికి యాత్రికులకి అద్దెకిస్తారు. సముద్రం ఒడ్డునే ఈ ఉప్పునీటి స్విమ్మింగ్ పూల్ నిర్మాణానికి కారణం సముద్రంలోని నీరు బాగా చల్లగా ఉండి ఈతకి కష్టం. ఈ స్విమ్మింగ్ పూల్‌లోని నీరు ఈతకు అనుకూలమైన ఉష్ణోగ్రతలో ఉంటుంది. దీంట్లో చిన్న పడవలని కూడా ఉపయోగిస్తారు. ఈ స్విమ్మింగ్ పూల్‌ని ప్రతిరోజూ శుభ్రపరుస్తారు. ఇందులో అక్కడక్కడ వేడి నీటి తొట్టెలు కూడా ఉన్నాయి. ఆఫ్ సీజన్‌లో తక్కువమంది యాత్రికులు ఉన్నప్పుడు వాటిని ఉపయోగిస్తారు. ఇందువల్ల నీటిని వేడిచేసే ఇంధనం ఆదా అవుతుంది. ఇక్కడే ఉన్న ఓ బార్‌కి ఓ వైపుగల పెద్ద అక్వేరియంలో అనేక రకాల చేపలు ఆకర్షణీయంగా కనిపిస్తాయి. టెన్నిస్ కోర్టులు, గోల్ఫ్‌కోర్ట్స్ కూడా ఇక్కడ పర్యాటకుల సౌకర్యంకోసం ఉన్నాయి.

http://www.internationaleducationmedia.com/images/chile_statues.jpg
ఈ దేశంలో ఎడారి ప్రాంతంలో జనాభా పెద్దగా ఉండదు. పసిఫిక్ మహాసముద్రం వైపే జనాభా ఉంటుంది. స్పానిష్ ఆక్రమణలో చిలీ 300 ఏళ్లకి పైగా ఉండటంవల్ల ప్రజలు స్పానిష్ భాషనే మాట్లాడతారు. అటకామా ఎడారి మధ్యలో సముద్ర మట్టానికి 7వేల అడుగుల ఎత్తులోగల ఓచోట ఓ పెద్ద ఒయాసిస్, దాని పక్కనే శాన్‌పెడ్రోడి అటకామా అనే గ్రామం కూడా పర్యాటకులకి ఆకర్షణీయంగా ఉంటాయి. ఇక్కడనించి నక్షత్రాలని చూడడానికి టెలిస్కోప్‌లు ఏర్పాటుచేసారు. ఇక్కడి జనాభా 5వేల లోపే.
ఈ ఒయాసిస్‌కి పొరుగున ఉన్న అర్జెంటీనా దేశంనించి బస్సు సర్వీస్, వాహనాలు నడవడానికి చక్కటి రోడ్డు ఉన్నాయి. ఇక్కడ కూడా ప్రాచీన శిథిలాలని, కొద్ది దూరంలో ఉన్న లికన్ కబుర్ అనే అగ్నిపర్వతాన్ని చూడచ్చు. బంగారు, రాగి, వెండి గనులు కూడా చిలీలో ఉన్నాయి. ఆగస్టు 5, 2010న 33 మంది గని కార్మికులు 2300 అడుగుల లోపల భూగర్భంలో చిక్కుకుపోయి, అక్టోబర్ 12న బయటకి రప్పించబడటం ప్రపంచ వార్తయింది.
‘యూనియన్ ఆఫ్ సౌత్ అమెరికన్ నేషన్స్’ అనే సంస్థని స్థాపించిన దేశాల్లో చిలీ ఒకటి.

Pucon Lake District
క్రిస్ట్‌మస్, న్యూఇయర్, ఈస్టర్ సమయాల్లో అత్యధికంగా పర్యాటకులు వెళ్తారు కాబట్టి ఆ సీజన్ మంచిది కాదు. పెరూ, బొలీలియా, అర్జెంటీనా దేశాల్లోంచి చిలీకి రోడ్డు మార్గం, బస్ సర్వీస్ ఉన్నాయి. సాధారణంగా చిలీలోని శాంటియాగో నగరానికి ఎక్కువమంది యాత్రికులు వస్తూంటారు. ఇక్కడికి 90రోజుల టూరిస్ట్ వీసాని ఇస్తారు. యూరప్, అమెరికాలలోని అన్ని ప్రదేశాలనించి విమాన సర్వీసులున్నాయి.

No comments:

Post a Comment