విహారాలు

India

Gamyam

Tuesday, November 15, 2011

ప్రకృతి సోయగం... పరిశుభ్రతే తొలి నియమం సింగపూర్‌

 http://img100.imageshack.us/img100/5344/dsc40452lg.jpg
పచ్చదనం అంతా అక్కడే సువిశాలంగా పరుచుకొని ఉంటుంది. మనసును మరులుగొలిపే ఎన్నో పర్యాటక అందాలకు నెలవు ఆ దేశం. వైశాల్యం దృష్ట్యా 20వ స్థానంలో ఉన్న ఆ చిన్న దేశం పరిశుభ్రతకు  మారుపేరు. ఇక్కడ కొలువై ఉన్న ఎన్నో ప్రకృతి అందాలు ఏటా లక్షల కొద్ది పర్యాటకులను మంత్రముగ్ధులు చేస్తూనే ఉన్నారు. ఆ దేశ ఆర్థిక వనరుల్లో పర్యాటకరంగానిదే పెద్దపీట. 
http://www.inhabitat.com/wp-content/uploads/fusionopolissingapuraih.jpg 
FUSIONOPOLIS: Singapore's New Green Skyscraper

తరుచూ వర్షం కురుస్తూనే ఉండే ఆ దేశం ఎప్పుడూ నీలిమేఘాలతో దోబూచులాడుతూనే ఉంటుంది. ప్రపంచ పర్యాటక రంగంలో అగ్రభాగాన నిలిచిన ఆ దేశమే సింగపూర్‌. 
http://img216.imageshack.us/img216/2821/2005blk146askygdn8nc.jpg 
Singapore does not sacrifice density or urbanity for greenery, ...

మరి ఆ ప్రకృతి అందాలను ఆస్వాదించేందుకు  అలా వెళ్లొద్దామా..?!

Merlion-Park 
యూరప్‌ దేశాల్లోని వాతావరణ పరిస్థితులను తనలో మమేకం చేసుకున్న సింగపూర్‌లో ప్రజలు ఎక్కువగా, ఇష్టంగా మాట్లాడేది రెండే రెండు బాష లు. అవి ఒకటి మకాన్‌, రెండు సింగ్లీష్‌. ఇంగ్లీష్‌ అనే బాషను విన్నామేగానీ, సింగ్లీష్‌ ఏంటబ్బా.. అని ఆలోచిస్తున్నారా..? మరేం లేదండి.. మలై, ఇండోనేషియా, తమిళం, చైనీస్‌ లాంటి ఇతర భాషలను ఇంగ్లీషుకు మేళవించి సింగపూర్‌ వాసులు మాట్లాడే భాషనే సింగ్లీష్‌ అంటారు. ఇంకా విడమరచి చెప్పుకోవాలంటే సింగపూర్‌ ఇంగ్లీష్‌ అనవచ్చు.ప్రపంచంలోనే అత్యున్నత పర్యాటక కేంద్రంగా విలసిల్లుతున్న సింగపూర్‌లో చూడా ల్సిన ప్రదేశాలు బోలెడు. వాటిల్లో నైట్‌ సఫారీ, సింగపూర్‌ బొటానికల్‌ గార్డెన్స్‌, జూరాంగ్‌ బర్డ్‌ పార్కు, మెర్‌లయెన్‌ పార్క్‌, సెంతోసా ద్వీపం, అండర్‌ సీ వరల్డ్‌... తదితరాలు చాలా ముఖ్యమైనవి.

నిశిరాత్రిలో విహారం... నైట్‌ సఫారీ...
http://www.amsamways.com/home/images/stories/tour_singapore/night_safari.jpg
సాధారణంగా జంతుప్రదర్శన శాలలను చూడాలంటే ప్రపంచంలో ఎక్క డైనా పగటివేళల్లోనే అనుమతిస్తుంటా రు. కానీ సింగపూర్‌లో మాత్రం రాత్రి వేళల్లో కూడా వాటిని సందర్శించవ చ్చు. దీనినే నైట్‌ సఫారీ అని పిలుస్తుం టారు. 
http://jannersdownunder.files.wordpress.com/2009/04/singapore-zoo-9.jpg
రాత్రివేళల్లో తిరిగే జంతువుల ను, పక్షులను చూడాలంటే ప్రత్యేకమై న చీకటి గుహల్లోనే చూడాలి. ఈ అవ కాశాన్ని ప్రపంచంలోనే మొట్టమొదటి సారిగా కల్పించింది సింగపూరే. రాతల్లో జంతువులను వాటి సహజ పరిస్థి తుల్లో చూసే అవకాశం కలగటంతో పర్యాటకులు ఓ వింత అనుభూతికి లోనవుతారు.http://images.travelpod.com/tw_slides/ta00/bb4/2b8/fire-show-night-safari-singapore-singapore.jpg
ఈ నైట్‌ సఫారీలో ప్రత్యేక ఆకర్షణ అక్కడి ఆదివాసుల స్వాగత నృత్యం. బలంగా ఉండే యువకుల విలువిద్యా కౌశల ప్రదర్శన, వెదురుబొంగులు వేగంగా కదులుతుంటే వాటి మధ్య అడుగులు వేస్తూ చేసే నృత్యం చూడ ముచ్చటగా ఉంటాయి. ఇందులో మరో ఆకర్షణ మంటలతో ఆదివాసీలు చేసే నృత్యం. నైట్‌ సఫారీను చూసేందుకు పర్యాటకులు ట్రాములో వెళ్లాల్సి ఉంటుంది. నెమ్మదిగా ట్రాము కదులుతుంటే, జంతువులు వాటి సహజ పరిసరాల లో మనకు చాలా దగ్గరనుంచీ కనిపిస్తాయి.

విహంగాలకు ఆలవాలం... జురాంగ్‌ పక్షి కేంద్రం...
http://singapore-trip.com/wp-content/uploads/2010/12/jurong-bird-park-singapore.jpg
ఆగ్నేయాసియాలోనే అతిపెద్ద పార్క్‌గా ప్రఖ్యాతి చెందిన జురాంగ్‌ పక్షుల కేంద్రం సింగపూర్‌లో చూడాల్సిన మరో అద్భుతమైన ప్రదేశం.
http://resource.isango.com/Uploads/ProductImages/Descriptions/Jurong%20Bird%20Park_Singapore_5093_3.jpghttp://upload.wikimedia.org/wikipedia/commons/thumb/6/68/Pelican_Cove,_Jurong_Bird_Park,_Oct_05.JPG/230px-Pelican_Cove,_Jurong_Bird_Park,_Oct_05.JPG
http://upload.wikimedia.org/wikipedia/commons/thumb/6/68/Pelican_Cove,_Jurong_Bird_Park,_Oct_05.JPG/230px-Pelican_Cove,_Jurong_Bird_Park,_Oct_05.JPG http://upload.wikimedia.org/wikipedia/commons/thumb/6/68/Pelican_Cove,_Jurong_Bird_Park,_Oct_05.JPG/230px-Pelican_Cove,_Jurong_Bird_Park,_Oct_05.JPG
600 జాతులకు చెందిన 8 వేల పక్షులు నెలవైన ఈ పార్క్‌ను ఓ పద్ధతి ప్రకారం చూసేందుకు వీలుగా ఏసీ, పానో రైలు సదుపాయం ఉంది. మెయిన్‌ స్టేషన్‌లో ఎక్కి లోరీ స్టేషన్‌లో దిగి మళ్లీ రైలెక్కి వాటర్‌ఫాల్‌ స్టేషన్‌లో దిగి మళ్లీ అక్కడనుంచి మెయిన్‌స్టేషన్‌ చేరుకోవచ్చు. లోరికీట్‌ పక్షులు (ఎరుపు రంగు చిలుకల్లా ఉండేవి) లోరీ స్టేషన్‌లో దిగినపుడు చూడవచ్చు. ఇక పక్షులకి ఆహారం పెడుతున్నపుడు వాటి హడావుడి చూసితీరాల్సిందే. పక్షులకి మనం కూడా ఆహారం వేస్తూ ఫోటోలు తీయించుకోవచ్చు.http://blog.701panduan.com/images/school-holidays-singapore/jurong-bird-park.jpg
వాటర్‌ఫాల్‌ స్టేషను లో దిగితే 60 జాతులకి చెందిన 1500 పక్షులని వాటి సహజసిద్ధమైన నివాస ప్రాంతా ల్లో చూడగలిగే అరుదైన అవకాశం కలుగుతుంది. ఇక్కడ ప్రత్యేకమైన ఆకర్షణగా మానవనిర్మితమైన అతి ఎతె్తైన జలపాతం సందర్శకులను విశేషంగా ఆకట్టు కుంటుంది. ఈ పార్క్‌లో 200 పెంగ్విన్లని, నిశాచర పక్షుల్ని, పెవికాన్లని, రకరకాల కొంగల్ని కూడా చూడవచ్చు. ఫుజీహాక్‌వాక్‌ స్టేడియంలో గద్దలు, హాక్‌లు, ఫాల్కన్‌ పక్షుల విన్యాసాలు ఆకర్షణీయంగా ఉన్నాయి. పక్షులు వేటాడే విధానాన్ని ప్రత్యక్షంగా చూసే అవకాశం కలు గుతుంది. ఆంఫీథియేటర్‌లో అనేక పక్షుల చేత.. చిన్న రాళ్లతో గుట్టని పగులగొట్టడం, బాస్కెట్‌ బాల్‌ ఆడటం, సందర్శకుడి చేతినుంచి డాలర్‌ నోటు ఎగరేసుకుపోవడం లాంటి ఫీట్లు చేయించడాన్ని చూడవచ్చు.http://www.yuliang11.net/wp-content/uploads/2011/05/duck-tour-singapore.jpg
ఆద్యంతం ఆహ్లాదం... డక్‌టూర్‌...
ఆసియాలోనే మొట్టమొదటిసారి ప్రవేశపెట్టిన సింగపూర్‌ డక్‌టూర్‌ ఒక ప్రత్యేక ఆకర్ష ణ. నీటిమీదా, నేలమీదా ప్రయాణించే ఉభయచర వాహనంలో పన్‌ టెక్‌సిటీ, విక్టోరియా థియేటర్‌ సుప్రీంకోర్ట్‌, వార్‌ మెమోరియల్‌ పార్క్‌, నీటిలో ప్రయాణించి నపుడు ఎప్సలనేడ్‌ మెర్‌లయన్‌ విగ్రహం, తదితర విశేషాలు నేల ప్రయాణంలో చూడవచ్చు. సింగపూర్‌లోని పురాతన చైనా గుడి చూడదగ్గది. ద్వారపాలకులుగా సింహాల విగ్రహాలు ఆకట్టుకుంటాయి. ఇంకా... బుద్ధుడి దంతం ఉన్నదని చెప్పబడే గుడి, సింగపూర్‌ జూ, పాసిక్‌ రిస్‌ పార్క్‌, ఎమ్‌ఎన్‌ టి బొమ్మల మ్యూజియం, నేషనల్‌ మ్యూజియం, వార్‌ మెమోరియ ల్స్‌లాంటివి ఇతర సందర్శనీయ స్థలాలు. ఇక చివరిగా... టూరిస్టు వీసాలు సులభంగా లభించే సింగపూర్‌ చెక్కేయాలంటే.. అక్కడి విమానాశ్రయంలోనే తాత్కాలిక వీసాలను మంజూరుచేసే వ్యవస్థ మనకు తోడ్పడుతుంది.
http://www.findsingapore.net/gallery/var/albums/Singapore-Botanic-Gardens/singapore-botanic-gardens-02.jpg?m=1300717554
పచ్చని అందాలకు నెలవు... బొటానికల్‌ గార్డెన్స్‌...
140 సంవత్సరాల చరిత్ర కలిగిన బొటానికల్‌ గార్డెన్స్‌ సింగపూర్‌లో చూడదగ్గ మరో ప్రదేశం. పదివేల రకాల వృక్షాలు ఒకే ప్రాంగణంలో ఉండటం చూస్తే, ఆశ్చర్యచకితులవుతారు. ఇక్కడి పువ్వులు రంగుల ప్రపంచాన్ని ఆవిష్కరిస్తుంటే, ఇందులోని ఆర్కిడ్‌ ఉద్యానవనం మరో అదనపు ఆకర్షణగా చెప్పవచ్చు. ఆసక్తికలవారు వాటి వివరాలు తెలుసుకునేందుకు అక్కడ కంప్యూటర్‌ తెరలను సైతం ఏర్పాటు చేశారు. అలాగే ఇక్కడ పిల్లలకోసం ఓ ప్రత్యేకమైన గార్డెన్‌ కూడా ఉంది. ఇక్కడ ఉష్ణప్రదేశాల్లో ఉండే మాంసాహార చెట్లు సైతం మనకు దర్శనమిస్తుంటాయి.

అరుదైన ఆకర్షణ... మెర్‌లయెన్‌ పార్క్‌...
 http://www.friendlyplanet.com/media/gallery/asia/singapore/singapore-merlion-park.jpg
సింగపూర్‌ ఇతర ఆకర్షణల విషయానికి వస్తే... నగరంలోని మెర్‌ లయెన్‌ పార్క్‌ తప్పక చూడాల్సినదే. ‘సింహపురి’... ‘సంగపూర్‌’గా రూపాంతరం చెందడం వల్ల కాబోలు సింహం, చేప కలగలసిన శిల్పానికి అత్యంత ప్రజాదరణ అభించింది. లండన్‌ కన్నా పెద్దదైన సింగపూర్‌ ఫ్లైయర్‌ ఎక్కిన వారు 165 మీటర్ల ఎత్తు నుంచి సింగపూర్‌నే కాకుండా, మెరినాబేని కూడా చూడవచ్చు.

బ్యూటిఫుల్‌ ఎక్స్‌పీరియన్స్‌... సెంతోసా ద్వీపం...
https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEjPBzJXSvxhVeZfVwcPOZ_6T6Me7T98a0H7i5uPSJtBNo-8K6UdmXfe89tp63JKyYUbwFuvF-BYbzbP313Q-r5rzoEWtFX-t-SWnDKyjKEC4A2km6rjompRHNM_TrbN8fMR927cWL_ioPU/s1600/sentosa-singapore-tourism-board.jpg
సింగపూర్‌ పర్యటనలో సెంతోసా ద్వీపాన్ని సందర్శించకపోతే ఆ పర్యటనే అసంపూర్ణమని చెప్పాలి. 
http://cache2.artprintimages.com/p/LRG/36/3697/498AF00Z/art-print/pearl-bucknall-sentosa-island-cable-cars-singapore.jpg
ఈ ద్వీపంలోకి కేబుల్‌ కార్‌లో వెళ్లటమే చాలా థ్రిల్లింగ్‌గా ఉంటుంది. భూమి నుంచి అనేక అడుగుల ఎత్తు నుంచి విహంగవీక్షణం చేయగలగడం ఒక మరపురాని అనుభూతి.
http://2011lphslangfest.files.wordpress.com/2011/03/merlion11.jpg
సింగపూర్‌ సాంస్కృతిక చిహ్నమైన మెర్‌లయన్‌ 37 మీటర్ల ఎత్తున్న విగ్రహాన్ని రెప్పవేయకుండా చూడాలనిపిస్తుంది. తొమ్మిదవ అంచె నుంచి సింగపూర్‌ దక్షిణభాగం, సెంతోసా, స్కెలైన్‌ కనిపిస్తాయి. 
http://tourisminsingapore.com/userfiles/Butterfly-Park2.jpg
సీతాకోకచిలుకల పార్క్‌ నయనానందకరంగా దర్శనమిస్తుంది.ఇక్కడ పదిహేనువందల సీతాకోక చిలుకలనే కాకుండా మూడు వేల రకాల అరుదైన అందమైన కీటకాల్ని చూసే అవకాశం కలుగుతుంది. 
http://www.venkia.com/pdata/29233.jpg
అలాగే ఇక్కడి అండర్‌ వాటర్‌ వరల్డ్‌లో 2500 జాతులకి చెందిన 2,500 జలాచరాల్ని చూసే అదృష్టం కలుగుతుంది. 83మీటర్ల సొరంగం నుంచి ట్రావ్‌లేటర్‌ ద్వారా అనేక రంగుల, ఆకారాల జలచరాల్ని చూడడం ఒక వింత అనుభవం. 
http://www.wisatasingapura.sg/wp-content/gallery/national-museum-of-singapore/national-museum.jpg
ఇమేజెస్‌ ఆఫ్‌ సింగపూర్‌ మ్యూజియం సింగపూర్‌ చరిత్ర, జాతులు, జీవనవిధానాలు సమగ్రంగా తెలియజేస్తుంది.
http://travelguideworld.info/wp-content/uploads/2011/10/singapore_Sentosa-hotel_001p1.jpeg

యాత్రికుల స్వర్గధామం గుల్మార్గ్‌

 gulmarg.jpg
కాశ్మీర్‌ పేరు చెప్పగానే మారణహోమాలు, హత్యలు, బాంబుదా డులు, ఎన్‌కౌంటర్లు కళ్లముందు కదలలాడడం ఎంత సహ జమో... అందమైన పచ్చదనం, ప్రకృతి సోయగం గుర్తుకు రావడం కూడా అంతే సహజం. సుందర కాశ్మీరం భారతీయులకే కాదు ప్రపం చ యాత్రికులకూ భూలోక స్వర్గమే. ఉద్యానవనాలు, సరస్సులు, పర్వతాలు, పచ్చిక బయళ్లు ఇలా చెప్పుకుంటూ పోతే... ఆ నేలంతా ఓ సుందర ఉద్యానవనే...ఇంత అందమైన కాశ్మీరంలోని సుందర ప్రదేశాల్లో ప్రపంచంలోనే పేరుగాంచినది గుల్మార్గ్‌ ప్రాంతం. ఈ ప్రాంతం అందాలను ఎన్ని రకా లుగా చెప్పినా తనివితీరదు. ఎన్ని విశేషణాలను ప్రయోగించినా గుల్మా ర్గ్‌ అందాల వర్ణన పూర్తవదు. ఒకవైపు మంచుతో నిండిన కొండలు, మరోవైపు ఆకాశంలోకి నిటారుగా ఎదుగుతూ వరుసలో నిలబడి పచ్చని చెట్లతో... భగవంతుడు గీసిన సుందర ప్రకృతి చిత్రానికి నిదర్శనంగా నిలుస్తుంది గుల్మార్గ్‌.https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEhxQaT30Zog1R_bfhIWWNob09kRZPa19U8oKivG6j83oDaZXhYjbMMpVI6-smL6YueQouIaBi0KMYlaiMPbBm4o5a-WOQk4ALDCW_tn9IB16CIjTGQk95qZ0CuDm39TejoJrmEb0UhG04E/s1600/Gulmarg9.jpg
పూలసోయగం...
గుల్మార్గ్‌లో లభించే పువ్వుల వైవిధ్యం మనకు మరెక్కడా కనిపించదు. పూలరంగులలో, రూపాలలో మహాద్భుతం ఇక్కడ తాండవిస్తుంది. అందుకేనేమో ఇక్కడికి వచ్చిన సందర్శకులెవ్వరూ రంగురంగుల పువ్వులను సేకరించకుండా ఉండలేరు. జహంగీర్‌ చక్రవర్తి తన బహు భార్యలకు బహుమతులుగా పువ్వులను ఇచ్చేందుకు గుల్మార్గ్‌కి వచ్చా డట. ఒక్కొక్క భార్యకు ఒక ప్రత్యేక పువ్వును ఇచ్చేందుకు సేకరించగా, ఇంకా అనేక రకాల పూల జాతులు మిగిలిపోయాయట.‘గుల్‌’ అంటే పువ్వులు, ‘మార్గ్‌’ అంటే పచ్చిక బయళ్ళు. గుల్మార్గ్‌ అంటే పువ్వులతో కూడిన పచ్చిక బయళ్ళు అని అర్థం. ఇక్కడ ‘టీ’ చాలా ప్రసిద్ధి. ‘కహనా’ అనే ఈ ‘టీ’లో బాదామ్‌, ఏలకులు, దాల్చినీ వేసి ‘బ్లాక్‌ టీ’ తాగుతారు. ఇక్కడ అంతా మంచు వెనీలా ఐస్‌క్రీమ్‌ పరచినట్లు ఉంటుంది. మంచి నీళ్లు దొరకవు. మంచు వేడి చేసుకుని తాగాలి.
http://www.ajkashmir.com/GulmargFolder/gulmarg5.jpg
స్కేటింగ్‌కు ప్రసిద్ధి...
 http://ikashmir.net/gallery/data/media/14/gulmarg2.jpg
గుల్మార్గ్‌కి మంచులో స్కేటింగ్‌ చేసేందుకు విదేశీ టూరిస్టులు వస్తారు. ఆ మంచులో కాళ్లు వేస్తే మోకాళ్ల వరకు, కూరుకుపోతూ కొంత నడిచి, గండోలాలో రోప్‌ వే పైన మంచు కొండల మీదకి వెళ్లవచ్చు. ఇక్కడి ప్రజలు కాగితం గుజ్జుతో రకరకాల షో పీసులు, ఎంబ్రాయిడరీ, జరీపని, తివాచీలు తయారు చేస్తారు. ఫాస్మిలాన్‌ అనే దారం రాట్నం మీద వడుకుతారు. రంగుల దారాలు పెన్సిలంత కర్రలకి చుట్టి వరుసగా రంగుల కలయికలో ఉంచి, సంగీతంలో సరిగమల్లా (రంగుకి ఒక ఆకారం చొప్పున) రాసుకుని అది చూసి షాల్స్‌ అల్లుతారు. ‘హమ’ అనే ఊరిలో జరీపని కూడా చేస్తారు. ఈ జరీపనిని ‘మావార్‌’ అంటారు. పూర్వపు రాజులు, బాద్‌షాలు తలపాగాలు, నడుంకి కట్టుకునే పట్టాలు, అంగీలు, జరీపనితో వున్నవి ధరించేవారట. జరీపని వున్న షాల్‌ నేయటానికి ఒకటి నుంచి రెండు సంవత్సరాలు పడుతుంది.http://www.gulmarg.org/blog/wp-content/uploads/2007/06/gulmarg1.jpg
‘ఒక్కర్‌వాల్‌’ ప్రత్యేకత...
వందల సంవత్సరాల నుంచి వస్తున్న ఆచారం ‘ఒక్కర్‌వాల్‌’ అంటే గొర్రెల కాపరులు వేసవిలో పాకిస్తాన్‌ నుంచి గొర్రెల మందల్ని తెచ్చి గుల్మార్గ్‌, సోన్‌మార్గ్‌ల దగ్గరకొస్తారు. వాళ్లు మందల్ని తేవటం అంతా ఆర్మీ పర్యవేక్షణలో జరుగుతుంది. ఈ గొర్రెల కాపరులు కుటుం బాలతో వచ్చి చలికాలం రాగానే వెళ్లిపోతారు. ఇంకో విశేషం ఏంటంటే... ఇక్కడి కొన్ని హిందూ దేవాలయాల్లో ముస్లిం పూజారులు కూడా వున్నారు. ఆర్మీ యూనిట్లలో గుడి, చర్చి, మసీదు, గురుద్వారాలు... అన్నీ ఒకే చోట వుంటాయి.
http://www.freeskihimalaya.com/Master%20English/Gulmarg%20Village%20View.jpg
వింటర్‌స్పోర్ట్స్‌ స్పాట్‌...
హాలిడే స్పాట్‌గా ఖ్యాతి గాంచిన ఈ గుల్మార్గ్‌ రిసార్ట్స్‌... ఎప్పుడు చూసినా యాత్రికులతో కిటకిటలాడుతూ ఉంటాయి. ఇక్కడి కేబుల్‌ కార్‌ విహారం చక్కటి అనుభూతినిస్తుంది. ప్రపంచం లోనే అత్యంత ఎత్తులో ఉండే గోల్ఫ్‌ క్రీడా మైదా నం ఇక్కడే ఉండటం విశేషం. అలాగే స్కైయింగ్‌ క్రీడకు గుల్మార్గ్‌ని ప్రత్యేక విడిదిగా చెప్పుకోవచ్చు. చలికాలపు ఆటల విడిదిగా కూడా గుల్మార్గ్‌కి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు ఉంది.

Sunday, November 13, 2011

ప్రపంచ సుందర నగరం....కొపెన్‌హాగన్‌

Copenhagen_Opera_House 
ప్రపంచ మహానగరాల్లో ఉత్తమ నివాసయోగ్య నగరం డెన్మార్క్‌లోని కొపెన్‌హాగన్‌. అభివృద్ధి, పర్యావరణ పరిరక్షణ చర్యలు చేపట్టడంలోనూ ఉన్నత స్థారుులో నిలిచింది. ఈ నగరం జీలాండ్గ, అమాగర్‌ దీవుల్లో ఉంది. దీనిని మాల్మొ, స్వీడన్‌ల నుంచీ ఓర్సంధ్‌ జలసంధి విడదీస్తుంది. అరుుతే 2000 సంవత్సరంలో ఓర్సంధ్‌ బ్రిడ్గ్జ నిర్మాణం తర్వాత కొపెన్‌హాగన్‌, మాల్మోల మధ్య దూరం చెరిగిపోరుుంది. ఈ రోడ్గ కవ్గు రైల్‌ బ్రిడ్గ్జ కారణంగా రెండు వైపుల నుంచీ ఉద్యోగులు, కార్మికుల రాకపోకలతో మార్కెట్‌ అభివృద్ధి మరింత సాధ్యమైందట. ప్రగతిపథంలో దూసుకుపోతున్న అభివృద్ధి కారణంగానే ప్రపంచంలో నివాసయోగ్య ఉత్తమ 20 నగరాల్లో ఇది మోదటి స్థానంలో ఉన్నట్టు కొంతకాలం క్రితం మోనోకోల్‌ పత్రిక సర్వేలో స్పష్టం చేసింది.
http://upload.wikimedia.org/wikipedia/commons/thumb/5/58/Sluseholmen_canal_scene_2.jpg/250px-Sluseholmen_canal_scene_2.jpghttp://upload.wikimedia.org/wikipedia/commons/thumb/5/58/Sluseholmen_canal_scene_2.jpg/250px-Sluseholmen_canal_scene_2.jpghttp://upload.wikimedia.org/wikipedia/commons/thumb/5/58/Sluseholmen_canal_scene_2.jpg/250px-Sluseholmen_canal_scene_2.jpghttp://upload.wikimedia.org/wikipedia/commons/thumb/5/58/Sluseholmen_canal_scene_2.jpg/250px-Sluseholmen_canal_scene_2.jpghttp://upload.wikimedia.org/wikipedia/commons/thumb/5/58/Sluseholmen_canal_scene_2.jpg/250px-Sluseholmen_canal_scene_2.jpghttp://www.bigfoto.com/europe/copenhagen/copenhagen-38.jpg
http://upload.wikimedia.org/wikipedia/commons/thumb/5/58/Sluseholmen_canal_scene_2.jpg/250px-Sluseholmen_canal_scene_2.jpg
పేరు ఇలా వచ్చింది...
ఈ నగరం అసలు పేరు ‘కొంప్‌మాన్నెహాఫన్‌’. అంటే మర్చెంట్‌ హార్బర్‌ అని అర్థమట. దీనికి ఆంగ్లం పేరు ‘కొపెన్‌హాజన్‌’ అనే జర్మనీ పేరు నుంచి తీసుకున్నారు. అది కాలక్రమణా కొపెన్‌హాగన్‌గా మారింది.


ఆర్థిక స్థితి...
Amalie_Borg_Palace
డెన్మార్క్‌లో ఉత్తమ వాణిజ్య, శాస్తర్రంగాలకు చెందిన కేంద్రం కొపెన్‌హాగన్‌. అలాగే ఓర్‌సండ్‌, స్కాండినేవియా కూడా ఆ నగరం బాటలో నిలిచాయి. ఈ కారణంగానే కొపెన్‌హాగన్‌ ప్రాంతంలో తలసరి ఆదాయం అత్యధికంగా ఉండి ఆర్థికపరంగా అభివృద్ధిపథంలో మరింత దూసుకుపోతోంది. 2005లో అత్యధిక తలసరి ఆదాయం రాజధాని నగరంలోనే ఉందని డెన్మార్క్‌ ఆర్ధిక నిపుణులు ప్రకటించారు. 2006లో ఒక సంస్థ జరిపిన సర్వేలో కొపెన్‌హాగన్‌ అత్యంత ధనిక నగరాల్లో తొమ్మిదవ స్థానంలో నిలిచింది.అంతేగాక కార్మికులకు అత్యధిక నికరరాబడి అందించిన నగరాల్లో నార్వే రాజధాని ఓస్లోతో సమాన స్థాయిలో నిలవడం విశేషం. ఉద్యోగులు, కార్మికులకు పన్ను భారం భారీఎత్తున తగ్గించడమే అందుకు సాధ్యమైందని అన్నారు.
http://www.holidays4all.in/gallery/city/20110816_124505_copenhagen007.jpg
శాస్త్ర, పరిశోధన, విద్య...
డెన్మార్క్‌ రాజధానినగరంలో యూనివర్సిటీ ఆఫ్‌ కొపెన్‌హాగన్‌ను 1479లో నెలకొల్పారు. ఇందులో శాస్త్ర, ఆరోగ్య, చట్ట, సామాజిక శాస్త్రాల్లో పరిశోధనలు జరుగుతున్నాయి. ఇంటర్నేషనల్‌ అలియన్స్‌ఆఫ్‌ రిసెర్చ్‌ యూనివర్సిటీస్‌లో ఈ విశ్వవిద్యాలయం భాగంగా ఉంది. ఇది ప్రపంచ ప్రముఖ విద్యాసంస్థలైన ఆక్స్‌ఫర్డ్‌, కేంబ్రిడ్జ్‌, యేల్‌, కాలిఫోర్నియా విశ్వవిద్యాలయాల సహాయసహకారంతో పనిచేస్తుంది. సుమారు 1500 మంది అంతర్జాతీయ విద్యార్ధులు ఉన్నారు.


మ్యూజిక్‌, ఎంటర్‌టైన్మెంట్‌...
Arken_Museum
కొపెన్‌హాగన్‌ ఒపేరా హౌస్‌లో ప్రతి సంవత్సరం వేసవి కాలంలో జాజ్‌ ఉత్సవం నిర్వహిస్తుంది. ప్రపంచ ప్రముఖ జాజ్‌ విద్వాంసులు ఇందులో పాల్గొంటారు. బెన్‌ వెబ్‌స్టర్‌, రిచర్డ్‌ బూనె, థాడ్‌ జోన్స్‌, ఎర్నీ విల్కిన్స్‌, కెన్నీ డ్రూ, ఎడ్‌ థిగ్జెపెన్‌, బాబ్‌ రాక్‌వెల్‌ వంటి ప్రముఖ అమెరికా జాజ్‌ విద్వాంసులు 1960ల్లో గొప్ప సంగీత కార్యక్రమాన్ని నిర్వహించి భవిష్యత్తులో తరతరాలు ఆ ఉత్సవాన్ని నిర్వహిం చేందుకు స్పూర్తినిచ్చారని అంటారు.


చరిత్ర...
 http://soundcloud.wpengine.netdna-cdn.com/wp-content/uploads/2011/05/copenhagen.jpg
డెన్మార్క్‌లో ఓడరేవుతో ఉన్న చిన్న గ్రామం ఉండేది. అది 12వ శతాబ్దర మధ్యకాలంలో ఎంతో ప్రాధాన్యత సంతరించుకుంది. అందుక్కారణం బిషప్‌ అబ్సాలన్‌ అధీనంలోకి వచ్చి 1167నాటికి ఎంతో అభివృద్ధి చెందింది. ఆ ఏడాదినే కొపెన్‌హాగన్‌ పట్టణ ఆవిర్భావ సంవత్సరంగా పేర్కొంటారు. 1254లో బిషప్‌ జాకబ్‌ ఎర్లాండ్సన్‌ అధీనంలో నగరంగా మారింది. 1801లో అడ్మిరల్‌ పార్కర్‌ నాయకత్వంలో బ్రిటీష్‌ సైన్యం పెద్ద యుద్ధమే చేసింది. దీన్నే కొపెన్‌హాగన్‌ యుద్దమని అంటారు. కొపెన్‌హాగన్‌ రేవు వద్ద డెన్మార్క్‌ నౌకాదళంతో బ్రిటిష్‌దళాలు యుద్ధం చేశాయి. ఈ యుద్ధసమయంలో పార్కర్‌ యుద్ధాన్ని ఆపాలన్న సంకేతాన్ని లార్డ్‌ నెల్సన్‌ గమనించలేదు. 1807లో బ్రిటీష్‌ దళాలు డెన్మార్క్‌ నావికాదళంపై ఆధిపత్యం కోసం కొపెన్‌హాగన్‌పై బాంబు దాడి చేశారు. 1850ల నాటికిగాని పట్టణం మళ్లీ కోలుకోలేదు.
http://www.designaddict.com/design_addict/blog/enclosures/CopenhagenHarbor1.jpg
చూడదగ్గ ప్రదేశాలు...
అమాలీ బోర్గ్‌ ప్యాలెస్‌, ఆర్కెన్‌ మ్యూజియం ఆఫ్‌ మోడర్న్‌ ఆర్ట్‌, కొపెన్‌హాగన్‌ ఒపేరా హౌస్‌, డానిఫ్‌ డిజైన్‌ సెంటర్‌, బాక్కన్‌, క్రిస్టియన్స్‌బోర్గ్‌, జూ, నేషనల్‌ బ్యాంక్‌, హిల్లొర్డ్‌లోని ఫ్రెడ్రిక్స్‌బోర్గ్‌ ప్యాలెస్‌ మొదలైనవి.


నోరూరించే రెస్టారెంట్లు...
 Noma_Restaurent
ఈ నగరంలో అద్భుత రుచులు చూపించే మంచి రెస్టారెంట్లు ఉన్నాయి. అక్కడికి వెళ్లినవారు ‘స్మూరెబ్రిడ్‌’ తినకుండా ఉండరట. ఇది ఇక్కడి సంప్రదాయ ఆహారపదార్ధాల్లో ఒకటి. దీనిని డెన్మార్క్‌ ప్రజలు ఇష్టంగా తింటారు, అతిధులకు తినిపిస్తారట. రెస్టారెంట్‌ ‘నోమా’ ప్రపంచంలో ఉత్తమ రెస్టారెంట్స్‌లో పదో స్థానంలో నిలిచింది.
నగరం   : కొపెన్‌హాగన్‌
దేశం   : డెన్మార్క్‌
విస్తీర్ణం   : 2673 కిలోమీటర్లు
జనాభా   : 1,919,979 (2011 జులై నాటికి)
సంప్రదాయ ఆహారం  :‘స్మూరెబ్రిడ్‌’ 
గుర్తింపు  : ప్రపంచంలో నివాసయోగ్య
     ఉత్తమ 20 నగరాల్లో మొదటి స్థానం

Saturday, November 12, 2011

సిటీ ఆఫ్ పొయెట్స్ అండ్ ఫ్లవర్స్


ఒక దేశం ఆత్మను దర్శించాలంటే- విలాసవంతమైన నగరాల్లో పర్యటిస్తే సరిపోదు. ఆ దేశం గ్రామాల్లో పర్యటించాలి. ఆ గ్రామాల ప్రజల జీవనవిధానాన్ని దగ్గరి నుంచి తెలుసుకోవాలి. వాళ్లు తినే తిండి, వాళ్ల సంస్కృతి, సంప్రదాయాలు, చరిత్రను అర్థం చేసుకోవాలి. మనసుల్ని పంచుకోవాలి. అప్పుడే ఆ దేశం గురించి సంపూర్ణంగా తెలుస్తుంది. అలాంటి అనుభవాలను వివరించేదే ఈ ట్రావెలోకం..

ఒయాసిస్సుల ఒడ్డున పరుచుకుపోయిన పల్లెల్లో జీవించాలనీ, ఎడారిలో ప్రయాణాలు చేయాలనీ ఎప్పటి నుంచో మనసులో ఉంది. ఉమర్ ఖయ్యాం రుబాయిల్లోని బుల్‌బుల్ పిట్టల సంగీతాన్ని వినాలనీ, ద్రాక్ష పళ్ల తోటల్లో తిరగాలనీ, సుల్తానులు కట్టిన ఎత్తయిన గోపురాల్ని చూడాలనీ కలలు కనేవాడిని. ఫిరదౌసీ, సాదీ, హఫెజ్‌లాంటి పార్సీ మహాకవుల రచనల్ని చదువుతున్నప్పుడల్లా వాళ్ల దేశం ఎప్పుడెప్పుడు వెళదామా అని ఉండేది. నా కల నిజమయ్యే రోజు రానే వచ్చింది. ఆంధ్రా యూనివర్సిటీలో చదువుకొంటున్న రేజా బగేరీ అనే స్కాలర్, సమీరా అనే స్టూడెంట్ ఇరానీ దేశీయులు కావటం వల్ల వారి పరిచయంతో వేసవి సెలవుల్లో ఇరాన్ వెళ్లేందుకు వీసా తీసుకున్నాను. "మీరు వచ్చినప్పుడు తప్పకుండా మా ఇంట్లోనే ఉండాలి'' అంటూ వాళ్లిద్దరూ నన్ను ఆహ్వానించారు. మే ఏడున కువైట్ ఎయిర్ లైన్స్ ఎక్కాను.

అది ముంబై నుండి, అరేబియా సముద్రం, ఇరాన్ మంచు పర్వతాల మీదుగా ప్రయాణించి.. మధ్యాహ్నానికి టెహరాన్ చేరుకుంది. అక్కడ సమీరా నాన్నగారు నాజర్ అక్బారీ నాకు స్వాగతం పలికి వాళ్ల ఇంటికి తీసుకెళ్లాడు. కుటుంబ సభ్యులందరికీ పరిచయం చేసి పర్షియన్ తివాచీల మీద తేనీటి విందు ఏర్పాటు చేశాడు. సాయంత్రంబయటికి తీసుకెళ్లాడు. ఎదురుగా అన్నీ కొండల వరుసలే. కొండలపైకి వెళ్లేకొద్దీ, టెహరాన్ నగరమంతా విస్తరించిన ఆకాశహర్మ్యాలు లేత బంగారు ఎండలో మెరుస్తున్నాయి. దూరంగా కనిపిస్తున్న పర్వత శిఖరాలకు మాత్రం దట్టమైన మంచు పట్టుకొని వెళ్లాడుతోంది.. తల్లి వక్షాన్ని వదల్లేని బిడ్డ మాదిరిగా.

అంత ఎత్తులో ఉండే ఆ మంచు రిజర్వాయర్ల వల్లే టెహరాన్ నగరానికి ఆకలి దప్పులు తీరేది. ఆ మంచు కరిగి కాలువలై పారుతూ, చిన్న నదులుగా ఏర్పడి, ఎడారిలో కొంత భాగాన్ని పచ్చగా మార్చడం వల్లనే అక్కడ మానవ ఆవాసం ఏర్పడింది. "మిస్టర్ ఆదినా (నా పేరుకు వాళ్లు పెట్టుకున్న ముద్దుపేరు) చిన్నప్పుడు స్నేహితులతో కలిసి ఈ పర్వతాల్లో తిరిగేవాణ్ని. అప్పట్లో పెద్ద పెద్ద మంచు దిబ్బలు ఉండేవి..'' అంటూ చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తుచేసుకున్నారు నాజర్ అక్బారీ. అక్బారీ సాబ్ నాకంటే రెండేళ్లు పెద్దవాడు. అయినా గుర్రప్పిల్ల మాదిరి పరుగులు తీస్తూ ఎంతో హుషారుగా ఉన్నాడు. ఇరాన్ గురించి మాట్లాడుకుంటూ ఆ పరిసరాల్లో చాలాసేపు తిరిగాం.

సేద్యం పదిశాతమే..

ఈ దేశంలో సగానికిపైగా ఎడారి. కేవలం పదిశాతం భూమే వ్యవసాయానికి, మరో ముప్పయి శాతం పశువుల మేతకీ పనికివస్తుంది. దాదాపు భారతదేశమంత వైశాల్యం ఉన్నా ఇరాన్ జనాభా మాత్రం ఏడుకోట్లే ఉంది. కొండలు, ఎడారులు, ఒయాసిస్సులు, జలపాతాలూ ఎక్కువగా ఉన్నాయి. ఇరాన్ అందమంతా వాటిల్లోనే ఉంది. 90 లక్షల మంది ప్రజలున్న ఈ టెహరాన్‌లో దాదాపు 30 లక్షల మంది కార్లలో తిరుగుతారు. 1980-88 సంవత్సరాల మధ్య ఇరాక్‌తో యుద్ధం కారణంగా నష్టపోయినా వెంటనే కోలుకొని పశ్చిమాసియాలో ఒక ప్రముఖ దేశంగా కొనసాగుతోంది.

మంచుగడ్డల్ని దాస్తారు..

మర్నాడు సాదాబాద్ మ్యూజియం వెళ్లాం. చినార్ వృక్షాల నీడలోని మెల్లాత్ ప్యాలెస్‌లో మధ్యయుగాల ముస్లిం వాస్తుకళ తొణికిసలాడుతోంది. 1979లో ఆయతుల్లా ఖొమైనీ తెచ్చిన విప్లవం తరువాత ఈ భవంతుల్ని ప్రజోపయోగంగా మార్చారు. అంతకుముందు పహ్లవీ వంశపు నవాబులు ఈ రాజప్రాసాదం నుంచి పరిపాలన సాగించేవారు. మ్యూజియం మొత్తం మీద నన్ను ఆకర్షించింది 'ఒమిద్‌వార్ బ్రదర్స్ గ్యాలరీ'. ఈ ఇరానీ సోదరులు 1954లో ప్రపంచయాత్రకు బయలుదేరి, 1964 వరకూ 90 దేశాల్లో తిరిగారు. వెళ్లేటప్పుడు వారి వద్ద 90 డాలర్లు మాత్రమే ఉన్నాయట.

మ్యూజియంలో మినియేచర్ చిత్రాలు, హస్తకళలు ఎంతో ఆకర్షణీయంగా ఉన్నా, నాకు బాగా నచ్చింది మాత్రం వాటర్ మ్యూజియం. నీటి విలువ ఉపయోగం ఎడారి ప్రజలకే ఎక్కువగా తెలుస్తుంది. భూమికిందుగా ప్రవహించే నీటిపాయల్ని కనిపెట్టి, ఆ నీటిని సేకరించే విధానాలు.. కొండల మీదున్న మంచు గడ్డల్ని సేకరించి, వాటిని ఎండాకాలం వరకు దాచిపెట్టే పద్ధతులు మనకు ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి. మెల్లాత్ భవనంలో మార్క్‌ఛాగల్ పెయింటింగ్స్ చూశాం. తోచల్ రోప్‌వే మార్గం ద్వారా మంచుకొండల మీదికి వెళుతున్నప్పుడు లోయల్లో తిరుగుతున్న గొర్రెల మందలు, వంట చేసుకొంటున్న కాపర్ల దృశ్యాలు అపురూపంగా కనిపించాయి.

సఫర్ బే ఖేయిర్ చెప్పారు..

మరుసటి రోజున 'ఇరాన్ ఎస్పరాంతోసెంత్రో'లో నా ఆర్ట్ ఎగ్జిబిషన్ మొదలై మూడు రోజులపాటు సాగింది. కొత్త మిత్రులు పరిచయం అయ్యారు. నా వయసు వాళ్లందరూ గాంధీ, నెహ్రూలను తల్చుకున్నారు. మూడవ రోజున వాళ్లు నా బొమ్మలు కొన్ని తీసుకుని, ప్రయాణ ఖర్చుల కోసం వంద డాలర్లను చేతిలోపెడుతూ.. 'సఫర్ బే ఖేయిర్' (హ్యాపీ జర్నీ) చెప్పారు. అక్బారీ సాబ్ నన్ను మరో రోజంతా టెహరాన్‌లో తిప్పి, తన మాతృభూమి గొప్పదనాన్ని, అభివృద్ధిని చూపించాడు.

ఎంతో బిజీగా ఉండే టెహరాన్‌లో ఎక్కడా శబ్ద కాలుష్యం లేదు. అక్కడి పరిశుభ్రత నన్ను ఆశ్చర్యపరిచింది. ఫిరదౌసి మాన్యుమెంట్ వద్ద పుస్తకాలు కొన్నాను. 'కలర్ ఆఫ్ ద ప్యారడైజ్' సినిమా తీసిన ప్రఖ్యాత ఇరానీ డైరెక్టర్ మాజిద్ మాజ్దేని ఉంచిన జైలు పక్కగా వెళుతున్నప్పుడు 'మాకు పత్రికా స్వాతంత్య్రం లేదు' అంటూ చాలా బాధపడ్డాడు అక్బారీ. "సీ యు సూన్ ఇన్ టెహ్రాన్'' అంటూ నన్ను ఆజాదీ టవర్ వద్ద బస్సు ఎక్కించాడు అక్బారీ.

హస్తకళల నగరం..

నేను యాజ్ద్ నగరానికి బయలుదేరాను. ఇది టెహరాన్‌కి దక్షిణంగా ఉంటుంది. యాజ్ద్‌లో ఉన్న మిత్రుడు రేజా బగేరీని కలిశాను. అతడు ఆష్కజార్ యూనివర్శిటీలోని ఫైన్ ఆర్ట్స్ డిపార్ట్‌మెంట్‌కి హెడ్. ఊరి బయట ఇసుక దిబ్బల మధ్యలో ఉంది వారి కాలేజీ. అక్కడ చదువుకొనే స్త్రీలు ఎక్కువ. ఇతర ముస్లిం దేశాలకంటే ఇరాన్‌లోనే స్త్రీలకి స్వాతంత్య్రం ఎక్కువ అనిపిస్తుంది. భారతీయ చిత్రకళ మీద నా చేత రెండు ఉపన్యాసాలు ఇప్పించాడు రేజా. కాలేజీలో ఆ రోజు జరుగుతున్న ఒక ఫోటోగ్రఫీ ఎగ్జిబిషన్‌కి ముఖ్య అతిథిగా హాజరయ్యాను. యాజ్ద్‌లో ఎండలు ఎక్కువగా ఉండటం వల్ల ఇళ్ల పైకప్పు మీద కిటికీలాంటి నిర్మాణాలు కట్టారు.

పది నుండి పదిహేను అడుగుల ఎత్తులో దీర్ఘచతురస్రాకారంగా ఉండే ఈ కట్టడాలు పెద్ద చిమ్నీల మాదిరి కనిపిస్తాయి. ఈ నిర్మాణం వల్ల బయట నుండి వీచే గాలి ఇంటి మధ్యలోకి వెళుతుంది. గాలి ఎటు నుండి వీచినా అది లోపలికి వెళ్లే విధంగా నిర్మించారు. వీటిని బద్‌గీర్ (విండ్ క్యాచెర్స్) అని పిలుస్తారు. ఒక్కొక్కసారి ఇంటి లోపల అరుగు మీద పెద్ద నీటిపళ్లాన్ని అమర్చటం వల్ల బద్‌గీర్ నుంచి ఇంటిలోపలికి వచ్చే గాలి నీటితో కలిసి ఇంటి మొత్తాన్నీ చల్లబరుస్తుంది. ఓల్డ్‌టౌన్ అంతటా ఇలాంటి ఇళ్లే ఉన్నాయి. సిటీలో ఉన్న చారిత్రక కట్టడాల్ని ఒక్క రోజులోనే చూసేశాను. యాజ్ద్ హస్తకళలకు ప్రసిద్ధి. మధ్య ఆసియా వాసులందరికీ యాజ్ద్ తివాచీలంటే ఎంతో అభిమానం.

ఒయాసిస్సు పక్కనే గ్రామం..

ఇరాన్‌కు శుక్రవారం సెలవు దినం. ఇంగ్లీషు డిపార్ట్‌మెంట్‌లో పరిచయం అయిన ప్రొఫెసర్ ఆలీగేవేష్ గురువారం సాయంత్రం వాళ్ల అమ్మగారి గ్రామం నౌదుషాన్‌కి బయలుదేరుతుంటే నేనూ సిద్ధం అయ్యాను. "ఆల్వేస్ ఎట్ యువర్ సర్వీస్'' అంటూ తన కారులోనే రమ్మన్నాడు. యాజ్ద్ నుండి ఉత్తర దిశలో వంద కిలోమీటర్ల దూరంలో ఉంటుంది నౌదుషాన్. రెండు గంటల ప్రయాణం. అద్భుతమైన ముడుత పర్వతాల పక్క నుంచి దూసుపోయింది కారు. అంతా ఎడారే. దారిలో కొన్ని మసీదులు, గ్రామాలున్నాయి. గ్రామం ఉందంటే అక్కడ ఒయాసిస్సు ఉందనుకోవాలి.

అం దులో దొరికే నీటిని బట్టి అక్కడ జనావాసం ఉంటుంది. ప్రజల జీవన గమనాన్ని నిర్ణయించేది ఒయాసిస్సే. హఠాత్తుగా ఎదురైన ఒక పెద్ద కొండ నీడలో సేదతీరుతూ ఉంది నౌదుషాన్ గ్రామం. మిత్రుడి ఇంట్లో వాళ్ల అమ్మగారు, అన్నయ్యగారి అబ్బాయి ఉన్నా రు. ఇల్లు చాలా విశాలంగా ఉంది. ఇంటి మధ్యలోనే తోట. వెలుతురు తగ్గిపోక ముందే గ్రామాన్ని చూడడానికి బయలుదేరాం. గడ్డిమోపులు మోస్తున్న గాడిదల గుంపులు ఎదురయ్యాయి. ఒక చిన్న పురాతన కోటను దాటుకుని ఊర్లోకి వెళ్లాం. "మా ఊళ్లో మూడువేలమంది నివసిస్తున్నారు. అందరికీ సరిపడా నీరు ఇచ్చేది ఒకే ఒక చిన్న నీటి ఊట'' అన్నాడు ఆలీగేవేష్.
"సార్! కొంచెం వివరంగా చెప్పండి?'' అని అడిగాను.

"ఇక్కడికి 60 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఎత్తయిన కొండల నుండి సాగిన నీటి ఊట, భూమి లోపల ఇక్కడి వరకూ ప్రయాణించి, బల్లపరుపుగా ఉన్న ఈ ప్రదేశంలో బయటికి వచ్చి ప్రవహిస్తోంది. అందువల్లే ఇక్కడ ఒయాసిస్సు ఏర్పడింది. ఒయాసిస్సు చుట్టూ సారవంతమైన భూములు వెలిశాయి. మంచి పంటలు పండుతున్నాయి. దీనివల్లే ఇక్కడ గ్రామం ఏర్పడింది'' అని వివరించాడు.
"అయితే ఈ ఊట ఆగిపోవడం, పూడిపోవటం లాంటి సమస్యలు ఉండవా?'' అన్నాను.
"అలా జరిగినప్పుడు వెంటనే వాటికి మరమ్మతులు చేస్తారు. యాజ్ద్ పనివాళ్లకు ఈ కాలువల్ని తవ్వడంలో మంచి ప్రావీణ్యం ఉంది'' అని చెబుతూ కొంచెం పైభాగంలో ఉన్న పొలాల్లోకి తీసుకెళ్లాడు. ఒక చోట నేల మీద గుండ్రంగా ఉన్న కొన్ని రాళ్లు తొలగించగానే, ఒక మనిషి నిలువుగా కిందికి వెళ్లటానికి సరిపడే బిలం ఉంది.
"ఈ బిలం ద్వారా 15 అడుగుల కింద ప్రవహిస్తున్న ఆ నీటిమార్గంలోకి దిగి అవసరమైన మరమ్మత్తులు చేసి, అదే మార్గంలో పైకి వస్తారు. భూమిలో ప్రవహించే నీటి కాలువపైన ప్రతి 100 మీటర్లకీ ఇలాంటి ఒక బిలం ఉంటుంది. వీటి ద్వారానే మరమ్మత్తులు జరుగుతాయి. ఈ నీటి కాలువను 'కనాత్' అని పిలుస్తున్నారు.

నౌదుషాన్ గ్రామంలోని ప్రతి ఇంటి మధ్యలో చిన్న తోటని పెంచుకుంటున్నారు. తోటని పెంచుకోవడం వల్ల ఆ చెట్లు పై వరకూ పెరిగి విసనకర్రల్లా పనిచేస్తూ ఇంటిలోనికి చల్లని గాలిని, పరిమళాన్ని పంపిస్తుంటాయి. ఆ రాత్రి కాసేపు ఎత్తుగా ఉన్న అరుగుల మీదే కూర్చుని కబుర్లు చెప్పుకున్నాం. ఈ గ్రామంలో సున్నీలు, షియాలు కలిసే ఉంటున్నారు. నిజానికి ఈ ఇద్దరికీ పడదు. కాని పల్లెటూళ్లలో పరస్పర అవసరాల కోసం కలిసిపోక తప్పదు మరి.

సిటీ ఆఫ్ పొయెట్స్ అండ్ ఫ్లవర్స్

తెల్లారగానే పక్కింటి పిల్లల్ని తీసుకుని ఊరిబయట కొండలెక్కటానికి వెళుతుంటే.. "మీరు త్వరగా వస్తే, పిస్తా తోటల్లో తిరుగుదాం'' అన్నాడు మిత్రుడు అలీగేవేష్. రెండు కొండల్ని, కొన్ని పాత కట్టడాల్ని చూసి పది గంటలకే తిరిగొచ్చాం. ఆ మధ్యాహ్నం నౌదుషాన్ పిస్తాతోటలో ఇద్దరు ప్రొఫెసర్లు పనిచేశారు -నేనూ, అలీగేవేష్. ఎండిన కొమ్మల్ని కత్తిరించాం, నీళ్లు పెట్టాం, పనికి అడ్డం వస్తున్న చెట్లని రంపంతో కోశారు. నేను చిన్నతనంలో పొలాల్లో పనిచేయడం గుర్తుకు వచ్చింది. అదొక మధురానుభూతి. వాళ్ల మేనల్లుడిని "ఇండియా వస్తావా?'' అని అడిగాను. "రెండేళ్లు మిలిటరీ సర్వీసు పూర్తి చేయాలి కదా. అప్పుడు తప్పక వస్తాను'' అన్నాడు.

మరుసటి రోజు ఉదయాన్నే యాజ్ద్ మిత్రుల వద్ద సెలవు తీసుకుని సాయంత్రానికి కెర్మాన్ నగరం చేరుకున్నాను. ఇది యాజ్ద్‌కి దక్షిణంగా ఆఫ్ఘనిస్తాన్‌కి దగ్గరగా ఉంటుంది. ఇదంతా బెలూచీ ఒంటెల కాపర్లు తిరిగే ప్రాంతం. ఇక్కడ నాకు రేజా సత్వానీ అనే చిత్రకారుడు ఆతిథ్యం ఇచ్చాడు. అంతర్జాతీయ పద్ధతుల్లో కళాసాధన చేస్తున్న ఆయన వయస్సు 35 సంవత్సరాలు. ఇంకా ఒంటరిగానే ఉంటున్నాడు కాబట్టి అతని స్టూడియోలోనే నా నివాసం. సొంత ఇల్లు కట్టుకుని కొంత సంపాదించాక మాత్రమే ఇరాన్ యు వకులు పెళ్లి గురించి ఆలోచిస్తున్నారు. "గెస్ట్ ఈజ్ ఫ్రెండ్ ఆఫ్ గాడ్.. అనేది మా నమ్మకం. మీరు వారంపాటు మా ఇంట్లో ఉండవచ్చు'' అంటూ ఎంతో ప్రేమగా ఆహ్వానం పలికాడు. అతను నన్ను ప్రతిరోజూ నగరంలోని ఒక ప్రముఖమైన ప్రాంతంలో వదిలిపెట్టి, సాయంత్రానికి మళ్లీ అక్కడికే వచ్చి తన కారులో తీసుకెళ్లేవాడు. ఈలోపుగా నేను ఆ పరిసరాల్లో హాయిగా తిరిగేవాణ్ణి. చేతిలో మొబైల్ ఉంటుంది కాబట్టి ఎలాంటి ఇబ్బంది కలుగలేదు.

సఫావిద్ కాలంలో నిర్మించిన గంజాలీఖాన్ బజార్ నగరానికి మధ్యలో ఉన్న అద్భుతమైన కట్టడం. ఈ బజార్‌లో ఉన్న ఒక గొప్ప నిర్మాణం గంజాలీఖాన్ హమామ్ (బాత్ హౌస్). దీన్ని మ్యూజియంగా మార్చారు. ఇది 17వ శతాబ్దం నాటి సఫావిద్ నవాబుల సామూహిక స్నానాల గదుల సముదాయం. ఎడారి దేశాలన్నిటిలోనూ ఇలాంటి హమామ్‌లు ఉన్నాయి. టర్కీలోని హమామ్‌లైతే విలాసాలకి మారుపేరు. వీటిలోకి నగరంలోని స్త్రీలు, పురుషులు వేరువేరు వేళల్లో స్నానాలకు వచ్చేవారు. సమాజంలోని వివిధ హోదాల వారికి వేరు వేరుగా గదులు ఉన్నాయి. శరీరాన్ని మర్దన చేయడానికి, జుట్టు కత్తిరించుకోవడానికి, దేహదారుఢ్యాన్ని పెంపొందించుకోవటానికి ప్రత్యేక వసతులున్నాయి ఇక్కడ.

'గుల్' పూలదుకాణాలు...

ఇరాన్‌లో భూకంపాలు ఎక్కువ. 2003లో బామ్ అనే చోట వచ్చిన భూకంపంలో 43 వేల మంది మరణించారు. కాబట్టి ఇళ్లు కట్టుకునేవాళ్లు ముందుగా ఐరన్‌తో బిల్డింగ్‌ఫ్రేమ్‌ను దృఢంగా తయారుచేసుకొని దాని ఆధారంతో గోడలు కట్టుకుంటారు. పార్కుల్లో మన ముద్ద బంతిపూలు చూసి సంతోషించాను. కెర్మాన్ బజార్లలో 'గుల్' పేరుతో పూలు అమ్మే దుకాణాలు చాలా ఉన్నాయి. ఒక సాయంత్రం కుర్దిస్తాన్‌కు చెందిన బహాడిస్ రేడ్ అనే చిత్రకారుడి షో చూడటానికి వెళ్లాను. ఇండియా గురించి ఆయనకి బాగా తెలుసు. ఈ యువకుడికి చిత్రకళతోపాటు జానపద నృత్యాలంటే ఎంతో ఇష్టం.

కుర్దు సంగీతాన్ని వినిపిస్తూ ఎంతో ఉద్వేగంతో నాట్యం చేశాడు. తడిపిన రెండు చిన్న గుడ్డముక్కల్ని చేత్తో పట్టుకుని చళ్‌చళ్‌మనిపిస్తూ, గుర్రం మాదిరిగా పాదాలని కదిలిస్తూ గొప్పగా నాట్యం చేశాడు. అనీస్ గ్యాలరీ క్యూరేటర్‌ను కూడా కలిశాను. "మీ దేశపు సంప్రదాయ చిత్రకళ మీద మా గ్యాలరీలో ఒక షో ఏర్పాటు చేయండి'' అని కోరారు నన్ను. ఒక రోజు మహాన్ అనే ప్రదేశానికి వెళ్లాను. అదంతా కొండప్రాంతం. ఇది కెర్మాన్ నగరానికి 50 కిలోమీటర్ల దూరంలో బహు సుందరంగా ఉంది. కొండల మీంచి దూకే జలపాతాల ద్వారానే అక్కడ పంటలు పండుతున్నాయి. గజార్ కాలం నాటి షాహజాదీ నవాబులు పెంచిన వందల ఎకరాల పూల తోటల్లో విహరించడానికి యాత్రికులు ఎక్కువగా వస్తారక్కడికి. ఆ జలపాతాలు మంచుదిబ్బలు కరగడం వల్ల ఏర్పడ్డవే.

మహాన్‌లో ఉన్న పెద్ద మసీదు పేరు 'నిమాతుల్లావలీ'. అక్కడ నాకు కొత్త మిత్రులు ఏర్పడ్డారు. రేజాసత్వానీ నన్ను తన మిత్రుడి ఇంటికి తీసుకెళ్లాడు. ఆ రాత్రికి అక్కడే ఉన్నాం. మంచి విందు ఏర్పాటు చేశాడు. తనకు ఇష్టమైన ఇరానీ గాయని మార్జాన్ ప్రేమ గీతాల్ని ప్లేయర్ మీద వినిపించి, అనువాదం చేస్తూ ఎంతో తన్మయత్వానికి లోనయ్యాడు. ఎండిపోతున్న ఎడారి బావుల వేదన మాదిరిగా ఉంది మార్జాన్ గీతం.

విరహవేదన అనుభవించే 'తోడి రాగిణి' అనే రాజస్తానీ పెయింటింగ్ నా కళ్లముందు మెదిలింది. కెర్మాన్ నగరానికి బయట ఉన్న ఘయీమ్ కొండల లోపల నుండి పెద్ద జలపాతం దూకుతోంది. గడ్డి పరక కూడా మొలవని ఆ కొండల మధ్యలో అంత పెద్ద జలపాతం ఎక్కడ నుండి వస్తుందో తెలియలేదు. ఆ విధంగా ఎడారిని సస్యశ్యామలం చేసిన అల్లాకు కృతజ్ఞతగా కాబోలు కొండ దిగువలో పెద్ద మసీదుకట్టి ప్రార్థనలు చేస్తున్నారు. వర్షం వస్తుందనే భయం లేదు కాబట్టి మట్టి కోటలే నిర్మించారు నవాబులు. ఆ కట్టడాలను దృఢతరం చేయడానికి నీటితో పాటు ఒంటెపాలని కూడా కలిపారట.

రాగిపాత్రల బజారు..

కెర్మాన్ బజార్లో యాత్రికులకు బాగా నచ్చేవి స్థానికంగా తయారైన అందమైన రాగి పాత్రలు. వాటి మీద ఆయుధాలు ధరించి ఉన్న 'పెర్సిపోలిస్' సిపాయిల బొమ్మలున్నాయి. నేను కెర్మాన్‌లో ఉన్న ఆఖరి రోజు సాయంత్రం పూట మిత్రుడు నన్ను తనకి కాబోయే అత్తగారింటికి తీసుకెళ్లాడు. ఆవిడ నాకు గిఫ్ట్‌గా కెర్మాన్ రాగి పాత్రను బహూకరించింది. తర్వాత ఇస్ఫాహాన్ నగరం వెళ్లాను. అక్కడ నాకు ఆహ్వానం పలికిన వ్యక్తి మెహిదీ అనే టూరిస్టు గైడ్.

అతడు రేజాసత్వానీకి మిత్రుడు. ఈ నగరం టెహరాన్‌కు దక్షిణంగా 340 కిలోమీటర్ల దూరంలో ఉంది. 17వ శతాబ్దంలో షా అబ్బాస్ ద గ్రేట్ (1587-1629) పరిపాలించేవాడు. ఆ కాలంలోనే ఇస్ఫాహాన్ కీర్తి దిగంతాలకు వ్యాపించింది. ఎందుకంటే అతని కాలంలో ఇస్ఫాహాన్‌లో 163 మసీదులు, 48 కళాశాలలు, 1800 దుకాణాలు, 263 హమామ్‌లు ఉండేవి. "ఇస్ఫాహాన్ నగరాన్ని చూస్తే, సగం ప్రపంచాన్ని చూసినట్లే'' అనే నానుడి కూడా ఏర్పడిందట ఆ రోజుల్లో. ఆ నగరానికి కేంద్రం కింగ్స్‌స్క్వేర్. పరిసరాల్లోనే అలీ ఖాపు ప్యాలెస్, చెహెల్ సో తేన్ ప్యాలెస్ ఉన్నాయి. అవన్నీ అద్భుతమైన భవనాలే.

క్రీ.శ.1556లో మొగలు చక్రవర్తి హుమయూన్ ఇండియా నుండి ఇరాన్ వచ్చి షా తాహ్‌మాస్ప్ ఆస్థానంలో తల దాచుకున్నాడు. ఆ చారిత్రక సంఘటనకి గుర్తుగా చెహెల్ సో తేన్ ప్యాలెస్ గోడల మీద పెద్ద మ్యూరల్ చిత్రాలు వేశారు. ఖాజోన్ నది మీద ఉన్న పురాతన రాతివంతెన ఇంకా ఉపయోగంలో ఉంది. ప్రకృతిలోకి, నవాబుల చరిత్రలోకి ఒకేసారి ప్రయాణించి ఆనందించడానికి ఈ వంతెన ఎంతో ఉపకరిస్తోంది. ఇస్ఫాహాన్‌లో పర్షియన్ సంస్కృతిని ప్రతిబింబించే నిర్మాణాలు, మ్యూజియంలు కోకొల్లలు. కింగ్‌స్క్వేర్‌కు నాలుగు పక్కలా ఉన్న షాపుల్ని చూసుకుంటూ తిరిగితే చాలు. పర్షియన్ సాంస్కృతిక చరిత్ర మొత్తం మనకి తెలిసిపోతుంది.

మహాకవుల జ్ఞాపకాలు..

నా తిరుగు ప్రయాణానికి ఇక వారం రోజులే మిగిలుంది. ఇప్పటికే మూడు వారాలు నిమిషాల్లా కరిగిపోయాయి. ఇస్ఫాహాన్ నుండి పసార్‌గాడ్ వెళ్లాను. పర్షియా సామ్రాజ్యాన్ని స్థాపించిన రెండవ సైరస్ సమాధి ఇక్కడే ఉంది. 35 అడుగుల ఎత్తులో ఉన్న ఈ నిర్మాణం ఇప్పటికీ చెదిరిపోలేదు. దగ్గరలో కింగ్ షూజా నిర్మించిన కారవాన్ సరాయి శిథిలాల మధ్యన ఎండలో కాసేపు నిలబడ్డాను. ఎదురుగా ఉన్న కొండ మీద ఆనాటి కోటల పునాదులు కనిపిస్తున్నాయి.

సాయంత్రానికి ప్రఖ్యాతిగాంచిన పెర్సిపోలిస్ చేరుకున్నాను. పెద్ద పర్వత పంక్తిని ఆనుకుని ఉన్న గొప్ప నిర్మాణం అది. పరిసరాల అందమే ఆ కట్టడాల నిర్మాణానికి కారణమై ఉంటుంది. ఇక్కడ డేరియస్ రాజు (క్రీ.పూ.522-456) నిర్మించిన తక్త్-ఏ-జంషేడ్ అనే నిర్మాణం అత్యంత విశాలమైనది. లక్షా పాతిక వేల చదరపు మీటర్ల వైశాల్యంలో ఉన్న ఈ శిథిలాలు ఎంతో సౌందర్యవంతంగా ఉన్నాయి. మౌర్యుల కాలం నాటి శిల్పాలకు మూలాలు ఈ శిల్పాలే. పెర్సీపోలిస్ శిథిలాల వద్ద గడిపిన ఆ సాయంత్రం ఎప్పటికీ మరపురానిది.

ఆ రాత్రికి షిరాజ్ చేరుకున్నాను. 'సిటీ ఆఫ్ పొయెట్స్ అండ్ ఫ్లవర్స్' అని షిరాజ్‌కి ముద్దుపేరు. 13వ శతాబ్దం నాటికే కళలకి పేరు మోసిన నగరం షిరాజ్. 18వ శతాబ్దంలో జాండ్ వంశస్తులు షిరాజ్‌ని రాజధానిగా చేసుకున్నారు. షిరాజ్ ఈ నాటికీ ఒక ప్రముఖమైన వ్యాపార కేంద్రంగా ఉంది. మహాకవులైన సాదీ, హఫెజ్‌ల అందమైన సమాధులు నగరానికి కొత్త వెలుగులు ఇచ్చాయి. సాదీ (క్రీ.శ.1210-1290) సమాధిని పెద్ద పూదోట మధ్యలో నిర్మించారు. ఆ పక్కనే ఒక నీటిబుగ్గ ప్రవహిస్తోంది. చిన్న పిల్లలు దాంట్లో దిగి చేపల్ని తరుముతున్నారు. సమాధి చుట్టూ తాపడం చేసిన పాలరాతిపైన గులిస్తాన్‌లోని పద్యాలు చెక్కారు.

నీతివాక్యాలతో నిండిన ఆయన రచనలు ముస్లిం సమాజాన్ని ఎంతగానో ప్రభావితం చేశాయి. స్వర్గానికి ఎనిమిది ద్వారాలు ఉన్నట్లే సాదీ రాసిన గులిస్తాన్ పుస్తకంలో కూడా 8 అధ్యాయాలు ఉన్నాయి. సూఫీ తత్త్వాన్ని ప్రతిబింబించే తన 'గులిస్తాన్' గ్రంథాన్ని ఎన్నటికీ వాడని గులాబీ తోటగా ఆయనే వర్ణించాడు. కవికోకిల దువ్వూరి రామిరెడ్డి ఫార్సీ నుండి తెలుగులోకి అనువాదం చేసిన గ్రంథాల్లో ఇదొకటి. సాదీ ఆసియా ఖండంలో 30 ఏళ్లపాటు తిరిగి ఎంతో విజ్ఞానాన్ని సంపాదించాడు. ఢిల్లీ సుల్తాన్‌ల కాలంలో ఆయన భారతదేశాన్ని కూడా దర్శించారు. తన కవిత్వం ద్వారా దైవానికి దగ్గరగా చేరుకున్న సాత్వికుడు సాదీ. మహాకవి హఫెజ్ (క్రీ.శ.1335-1390)సమాధిని కూడా ఎంతో సుందరంగా నిర్మించారు. ఆయన మీద ప్రేమ, గౌరవం వల్ల అదొక తీర్థయాత్రా స్థలంగా మారింది.

డెమొక్రసీ అంటే ఇష్టం..

షిరాజ్‌లోని షాచరాగ్ మసీదు గొప్ప కట్టడం. సఫావిద్ కాలంలో నిర్మించిన ఈ మసీదు వద్దకి చేరుకొనేసరికి రాత్రి తొమ్మిదైంది. ఉమర్‌ఖయ్యాం సమాధినీ చూద్దామనుకొన్నాను. కాని సమయం లేదు. నేను బయలుదేరాలి. నా వీసా రేపటివరకే పనిచేస్తుంది. షిరాజ్ నుండి బస్ మీద ఇస్ఫాహాన్ రైల్వేస్టేషన్‌కి చేరేసరికి ఏడు గంటలైంది. రాత్రి తొమ్మిది గంటల రైల్లో టెహరాన్‌కి బయలుదేరాను. నా ఎదురు బెర్తుల్లో పరీక్షలకి వెళ్లే కుర్రాళ్లు ఉన్నారు.

"మా దేశం గురించి మీరు ఏమి రాయదలుచుకున్నారు?'' అని అడిగారు నన్ను. "ఇరాన్ చాలా అందమైన దేశమనీ, భారతీయులంటే మీకు ఎంతో ఇష్టమనీ, అమెరికాతో పోటీపడి మీ దేశాన్ని అభివృద్ధి చేసుకుంటున్నారనీ, మరీ ముఖ్యంగా నాకు చాలా మంచి ఇరానీ స్నేహితులు ఏర్పడ్డారని రాస్తాను'' అన్నాను. "సార్, మాకు డెమోక్రసీ అంటే చాలా ఇష్టమని కూడా రాయండి..'' అని ముక్తకంఠంతో చెప్పారు ఆ విద్యార్థులు. తెల్లవారేసరికి టెహరాన్ చేరుకుని నేరుగా అక్బారీసాబ్ ఇంటికి వెళ్లాను. ఆ సమయానికి నా మిత్రుడు నమాజ్ చేసుకుంటున్నాడు. ఆయన 'అల్లాహో అక్బర్' (గాడ్ ఈజ్ గ్రేట్) అంటూ కళ్లు మూసుకుని మూడుసార్లు పలికే లోపుగానే నేను 'నాజర్ అక్బారీ అక్బర్ హో' అంటూ అతని పాదాలకు నమస్కరించి.. ఇండియా వచ్చేశాను.


- ఎం.ఆదినారాయణ, ఆంధ్ర విశ్వవిద్యాలయం, విశాఖపట్టణం
ఫోన్ : 9849883570, auscholargypsy@gmail.com

Wednesday, November 2, 2011

కేరళ ప్రకృతికాంత..వాయనాడ్‌

‘గాడ్స్‌ ఓన్‌ కంట్రీ’ అందాలకు వ్యసనపడకపోతే అది సందర్శకుడి దృష్టిలోపమే... కేరళలో ఏ ప్రాంతానికి వెళ్లినా... ప్రకృతి ఒడిలో తేలియాడిన అనుభూతి కలుగుతుంది. కన్యాకుమారి, అలెప్పీ, కోవలం, వెంబనాడ్‌, కుమారకోం, అలప్పూజ... ఇలా చెప్పుకుంటూ పోతే ఆ రాష్ట్రం మొత్తం విహార కేంద్రాలమయం. ఆ కోవకు చెందిన అద్భుత పర్యాటక ప్రదేశమే వాయనాడ్‌. ప్రకృతి అందాలన్నింటినీ తనలో ఇముడ్చుకున్న వాయనాడ్‌ విశేషాలు...
Attappadi
 
వాయనాడ్‌ ప్రకృతి సౌందర్యానికి మీరు మైమరచిపోయి ఉండకపోతే, మీ కళ్లలో గానీ, మనసులో గానీ, స్పందనలో గానీ ఏదో లోపం ఉందనుకోవాల్సిందే... కేరళ రాష్ట్రానికి 590 కిలోమీటర్ల పొడవైన విస్తార తీరప్రాంతం ఉంది. ఇక్కడి ఇసుక, గాలులు, తరంగాలు ఎన్నో దండయాత్రలు, సాహసయాత్రలు, వివిధ ఖండాలు, సంస్కృతులకు చెందినవారితో జరిగిన వాణిజ్యాలకు సాక్ష్యాలు. అరబ్బులు, పోర్చుగీసులు, చైనీయులు, పర్షియన్లు, డచ్చివారు, బ్రిటిష్‌వారు, ఫ్రెంచ్‌ వారు... ఇలా అందరూ తమ ఓడలను కేరళ తీరంలో లంగరు వేశారు.

పర్యాటకుల స్వర్గధామం...

Nalliyampathy
 
అద్భుతమైన వాయనాడ్‌ పర్యాటకుల పాలిట స్వర్గధామంగా విలసిల్లుతోంది. కేరళలోని పశ్చిమ కనుమల్లోగల హిల్‌స్టేషన్లలో అపారమైన వృక్ష సంపద, వన్యప్రాణులు ప్రతివారినీ ఆకట్టుకుంటుంటాయి. అట్టప్పడి, ఇడుక్కి, పక్షిపాతాళం, పీరుమేడు, సైలెంట్‌ వ్యాలీ, వాగమాన్‌ దేవీకులం, నెల్లియంపత్తి, పొన్ముడి ఇలా హిల్‌స్టేషన్ల పేర్లు చెప్పుకుంటూ పోతే ఆ జాబితా అనంతం. మంచి సుగంధ ద్రవ్యాల నుంచి వెలువడే పరిమళాలు, కళ్లను కట్టిపడేసే పచ్చదనపు సౌరభాలు, మెరుస్తూ ప్రవహించే నదులు, భౌగోళికంగా కనపడే ఎత్తుపల్లాలు, ‘యూ’ ఆకారంలోని మలుపుల గుండా డ్రైవింగ్‌ చేసుకుంటూ వెళ్తే ఆ అనుభూతులు ఇవన్నీ కలిపి మనసుకు ఎక్కడలేని ఉత్సాహాన్ని, ఉల్లాసాన్ని కలబోసి మరీ అందిస్తాయి.సముద్రమట్టానికి 700 నుంచి 2,100 మీటర్ల ఎత్తువరకు ఉన్న వాయనాడ్‌, దక్కన్‌ పీఠభూమి దక్షిణభాగం మీద సగర్వంగా నిలిచి ఉంటుంది. కల్పెట్టా, సుల్తాన్‌ బాతెరి, మనంతావడి, పట్టణాలు పర్యాటకులకు కావల్సిన వసతి, ప్రయాణ సౌకర్యాలను కల్పిస్తాయి.

చరిత్రలో వాయనాడ్‌...
Hotels-in-Wayanad
 
ఈ ప్రాంతాన్ని ప్రముఖ రాజవంశీయుడు కేరళవర్మ పఝస్సి రాజా తదితరులు పాలించారు. 19వ శతాబ్దం తొలినాళ్ళలో బ్రిటిష్‌వారు ఈ పట్టణాన్ని స్వాధీనం చేసుకున్నారు. కురిచియా గిరిజనుల సాయంతో పఝస్సి రాజా బ్రిటిష్‌ వారిపై సాగించిన పోరాట చరిత్రను స్వాతంత్య్రోద్యమ చరిత్రలో సువర్ణక్షరాలతో లిఖించారు. కేరళ సింహంగా పేరొందిన పఝస్సి రాజా సమాధులు మనంతవాడి, వాయనాడ్‌లలో ఉన్నాయి.

విస్తారమైన కాఫీ తోటలు, తేయాకు తోటలు, యాలకులు, మిరియాలు, వెనీలా తోటలను చూస్తుంటే మైమరిచిపోతాం. 14 కిలోమీటర్ల పొడవున్న కొండదారిని తమరస్సెరీ చురమ్‌ అంటారు. ఇదే వాయనాడ్‌కు స్వాగతద్వారం. పొరుగునున్న కోజికోడ్‌ జిల్లాతో వాయనాడ్‌ను కలిపే మార్గం ఇదే. అన్నింటికంటే పైన ఉండేది లక్కిడి హిల్‌ స్టేషన్‌.చరిత్ర పూర్వ యుగం నాటి పటాల్లో ఎడక్కల్‌ గుహలు మనకు కనిపిస్తాయి. ఇక్కడి చరిత్ర పూర్వయుగం నాటి రాతి కట్టడాలు చాలా ప్రసిద్ధి. అందుకే ప్రపంచవ్యాప్తంగా ఉన్న చరిత్రకారులు, జీవశాస్తవ్రేత్తలు, పురాతత్వ శాస్తవ్రేత్తలు, వెల్లువలా ఇక్కడికి వస్తుంటారు. ఇక్కడి గుహల్లో ఉన్న పెట్రోగ్లిఫ్‌లు ఐదువేల సంవత్సరాల కంటే ముందు కాలం నాటివని చెబుతుంటారు.

చూడాల్సినవివే...
బ్రహ్మగిరి పర్వత పాదాల్లో ఉన్న తిరునెల్లి దేవాలయం, పులియర్మాలలోని అనంతానంత స్వామి దేవాలయం, శ్రీమహాగణపతి దేవాలయం, పల్లిక్కున్ను చర్చి వంటివి వాయనాడ్‌లో చూడాల్సిన ప్రదేశాలు. చెంపారా శిఖరం, బాణాసుర సాగర్‌ డ్యాం, కురువు ద్వీపం, సూచిపార, పంతపార మీన్ముట్టి జలపాతాలు ఇవన్నీ కలిసి మెప్పాడి అంబాలావయల్‌ ప్రాంతంలో పర్యటించేవారికి విభిన్న అనుభూతులను అందిస్తాయి. కాబానీ నది వాయనాడ్‌కు జీవనది లాంటిది. కాళింది, మనంతావడి, పనమారం అనేవి దాని ఉపనదులు.
http://www.indialine.com/travel/images/meenmutty-falls-wayanad.jpg
రాష్ట్రంలోని ఆదివాసీలలో 36 శాతం మంది ఇక్కడే ఉంటారు. వారిలో పానియాలు, ఆదియాలు, ఊరలీలు, కురుమలు, కట్టునాయక్కన్లు ఉన్నారు. కర్నాటక నుంచి 13వ శతాబ్దంలో జైనులు ఇక్కడికి వచ్చారు. హిందువుల్లో అగ్రవర్ణాలుగా పేరొందిన నాయర్లు 14వ శతాబ్దంలో వచ్చి, ఇక్కడ వారి భూస్వామ్య వ్యవస్థను నెలకొల్పారు. ఆ తర్వాత ముస్లింలు వచ్చారు. 1950లలో ఉత్తరాది జిల్లాల నుంచి వలస వచ్చిన క్రిస్టియన్లు వాయనాడ్‌ జిల్లాలో మొక్కల పెంపకం సంస్కృతికి ఆద్యులు.http://kunzum.com/wp-content/uploads/2011/05/kerala-wayanad-kuruva-280311-0036.jpg
కన్నూరు జిల్లాలోని ఓ చిన్న తీరప్రాంత గ్రామమైన ముఝప్పిలంగడ్‌ ఇప్పుడు కేరళకు వచ్చే పర్యాటకులకు స్వర్గధామంగా విలాసిల్లుతోంది. భారతదేశంలోనే రెండో అతి విస్తారమైన ఈ బీచ్‌ ఉత్తర కేరళలో కన్నూరుకు దక్షిణంగా 15 కిలోమీటర్ల దూరంలోనూ, తలస్సెరికి ఉత్తరంగా ఏడు కిలోమీటర్ల దూరంలోనూ ఉంది. ఇక్కడున్న అడ్వెంచర్‌ టూరిజం అకాడమీ వారు సీ సర్ఫింగ్‌, పారాగ్లైడింగ్‌ వంటి జల క్రీడలను అందిస్తారు. యూరప్‌కు, తలస్సెరికి ఉన్న చారిత్రక బంధాల కారణంగా యూరోపియన్‌ పర్యాటకులు ఇక్కడికి ఎక్కువగా వస్తూ, ముఝప్పిలంగడ్‌ అందాలను ఆస్వాదిస్తారు. ఇటీవలికాలంలో ఇటు స్వదేశీ పర్యాటకులతో పాటు అటు విదేశీ పర్యాటకులను కూడా పెద్ద సంఖ్యలో ఆకర్షిస్తున్న ఈ పట్టణం ఇప్పుడు ప్రముఖ పర్యాటక కేంద్రంగా భాసిల్లుతోంది.
ముఝప్పిలంగడ్‌ తురుతు (ద్వీపం) అంజరకాండి నది మధ్యలో ఉంటుంది. ఇది బీచ్‌కు చాలా సమీపంలో ఉంది.

ముఝప్పిలంగడ్‌కు అత్యంత సమీపంగా ఉండే ధర్మదాం ద్వీపం మరో అదనపు ఆకర్షణ. కొబ్బరి చెట్లు, పొదలతో నిండి ఉండే ఈ ద్వీపం బీచ్‌ నుంచి చూస్తే చాలా అందంగా కనిపిస్తుంది. పశ్చిమ ప్రాంతంలోని అరేబియన్‌ మహా సముద్ర జలాలతో మూడువైపులా ఇది చుట్టుముట్టి ఉంటుంది. ఈ అందాల ద్వీపం ప్రైవేటు ఆస్తి కావడం దీన్ని సందర్శించడానికి అనుమతి తీసుకోవాల్సివుంటుంది. చరిత్రకారుల కథనం ప్రకారం, ధర్మదాంను ఇంతకుముందు ధర్మపట్టణం అని పిలిచేవారు. దీనికి బౌద్ధమూలాలున్నాయి. త్వరలోనే బీచ్‌ నుంచి ధర్మదాం ద్వీపానికి రోప్‌వే రూపుదిద్దుకుంటోంది.

ఇది పూర్తయితే... ప్రపంచంలోకెల్ల ఇదే అతిపెద్ద రోప్‌వేగా పేరుగాంచనుంది. అంతేకాకుండా పర్యాటకులకు అది అదనపు ఆకర్షణ అవుతుంది. కన్నూరులో ఉన్న తలస్సెరీ, పయ్యాంబళం బీచ్‌లు కూడా తప్పనిసరిగా చూసి తీరాల్సిన ప్రాంతాలే. ఇంతకుముందు ఫ్రెంచి కాలనీగా ఉంటూ, ఇప్పుడు పుదుచ్చేరిలో భాగమైన మాహే కూడా ముఝప్పిలంగడ్‌కు సమీపంలో ఉన్న మరో ఆకర్షణీయమైన ప్రదేశం.

ఈశాన్య సోయగం ..త్రిపుర

thripura
ఈశాన్య రాష్ట్రాల్లో ఒకటైన త్రిపుర ప్రకృతి రమణీయతతో అలరారుతుంది. ఈశాన్య కొండలపై త్రిపుర రాష్ట్రం ఉంది. పచ్చని కొండలతో పాటుగా అనేక వన్యప్రాణి సంరక్షణా కేంద్రాల కు నిలయం త్రిపుర. త్రిపుర రాజధాని అగర్తలా. త్రిపుర 1949కి ముందు ప్రత్యేక రాజ్యంగా ఉండేది. స్వాంత్రంత్యం వచ్చిన తర్వా త అంటే 1949లో భారతదేశంలో విలీనమయింది.శక్తి పీఠాల్లో ఒకటైన త్రిపుర సుందరీ దేవి దేవాలయం రాజధాని అగర్తాలకు సమీపంలోని ఉదయ్‌పూర్‌లో ఉంది. అగర్తలా- ఉదయ్‌ పూర్‌ మధ్య దూరం 55 కి.మీ.. త్రిపురలో ప్రధాన నది మనూ ఒకటి. త్రిపురలో మొత్తం 4 జిల్లాలు ఉన్నాయి. ధలాయ్‌ జిల్లాకు రాజధాని అంబస్సా, ఉత్తర త్రిపురకు కైలాషాహార్‌, దక్షిణ త్రిపురకు ఉదయ్‌పూర్‌, పశ్చిమ త్రిపురకు అగర్తలా.

అందాల అగర్తలా...
Tripura_Sundari_Temple
 
రాజధాని అగర్తలాలో ఉజ్జయంత ప్యాలెస్‌, కుంజాబన్‌ ప్యాలెస్‌, స్టేట్‌ మ్యూజియం, ట్రైబల్‌ మ్యూజియం, సుకంతా అకాడమీ, లక్ష్మీనారాయణ్‌ దేవాలయం, ఉమా మహేశ్వర్‌ దేవాలయం, జగన్నాధ్‌ దేవాలయం, రబీంద్ర కనన్‌, పుర్బాషా, పోర్చుగీస్‌ చర్చ్‌ వంటివి ఉన్నాయి.
ఉజ్జయంతా ప్యాలెస్‌ను మహారాజా రాధా కిషోర్‌ మాణిక్య 1899-1901 సంవత్సరాల మధ్య కట్టించారు. ఇది రెండస్థుల భవనం. ప్యాలెస్‌ ముందు భాగంలో మొఘల్‌ తరహా గార్డెన్స్‌ను ఒకదానిని ఏర్పాటుచేశారు. ఉజ్జయంతా ప్యాలెస్‌ అందాలను రాత్రిపూట తిలకించటానికి వీలుగా ఫ్లడ్‌ లైటింగ్‌ సిస్టంను అమర్చారు. ప్రస్తుతం ఇది త్రిపుర శాసనసభ భవనం.
కుంజాబన్‌ ప్యాలెస్‌ను మహారాజా బీరేంద్ర కిషోర్‌ మాణిక్య 1917లో నిర్మించారు. దీనికి ఆ తర్వాత పుష్పబంతా ప్యాలెస్‌గా నామకరణం చేశారు. విశ్వకవి రవీందన్రాధ్‌ టాగోర్‌ త్రిపుర పర్య టనకు 1926లో వచ్చినపుడు ఇక్కడే నివాసం ఉన్నారు. వీటితో పాటుగా వన్యప్రాణి సంరక్షణా కేంద్రాలు త్రిపురలో ఉన్నాయి.

మహా శక్తి స్వరూపిణి... త్రిపర సుందరీ దేవి...

అగర్తాలకు 55 కి.మీ. దూరంలోని ఉదయ్‌పూర్‌లో త్రిపుర సుందరీ ఆలయం ఉంది. దుర్గా అమ్మవారి 51 శక్తి పీఠాల్లో ఒకటి ఉదయ్పూర్‌ త్రిపుర సుందరీ ఆలయం. బెంగాలీ వాస్తు శిల్పిని అనుసరించి దేవాలయాన్ని కట్టారు. మహారాజా ధాన్య మాణిక్య ఈ దేవాలయాన్ని 1501 సంవత్సరంలో కట్టించారని అంటారు.

ఎలా వెళ్లాంటే...

విమాన మార్గం: రాజధాని అగర్తలాలో విమానాశ్రయం ఉంది. ఇక్కడి నుంచి కోల్‌కతా, గౌహతి, సిలిచార్‌లకు ప్రతిరోజూ విమాన సేవలు ఉన్నాయి.

రహదారి మార్గం:
గౌహతి 599 కి.మీ., షిల్లాంగ్‌ 499 కి.మీ., సిలిచార్‌ 288 కి.మీ., ధర్మానగర్‌ 200 కి.మీ. గౌహతి నుంచి త్రిపుర రోడ్‌ ట్రాన్స్‌పోర్ట్‌ కార్పొరేషన్‌ బస్సు సేవలను అగర్తలాకు నడుపుతుంది.

రైలు మార్గం:
సమీపంలోని రైల్వే స్టేషన్‌ ధర్మానగర్‌. అగర్తలా నుంచి 200 కి.మీ. దూరంలో ధర్మానగర్‌ ఉంది. ధర్మానగర్‌-లుండింగ్‌ మధ్య మీటర్‌ గేజి రైలు రాకపోకలు ఉన్నాయి. రైలు ప్రయాణం చాలా సమయం తీసుకుంటుంది. ఇది అంత అనుకూలం కాదు. ధర్మానగర్‌-అగర్తలా మధ్య రైలు మార్గం నిర్మాణంలో ఉంది. ధర్మానగర్‌-అంబస్సాల మధ్య రైలు మార్గ నిర్మాణం పూరెతైంది.