రొటీన్‌లైఫ్‌లో కాస్తంత ఉపశమనం పొందాలంటే అత్యుత్తమ మార్గం వివిధ ప్రాంతాల సందర్శన. ఒకప్పుడు తీర్థయాత్రల పేరిట దూరప్రాంతాల్లోని పుణ్యక్షేత్రా లను సందర్శించే వారు. నేడు ప్రకృతి రమణీయ ప్రాంతాలను, చారిత్రక ప్రాధాన్యం ఉన్న ప్రాంతా లను పర్యటించడం పరిపాటిగా మారింది. ఈ నేపథ్యంలో ఎకో టూరిజం, ట్రైబల్ టూరిజం, మెడికల్ టూరిజం లాంటి సరికొత్త భావనలూ రూపుదిద్దు కు న్నాయి. అలాంటి వాటిలో ఒకటి హెర్బల్ టూరిజం. పర్యటకులకు వివిధ వనమూలికలపై అవగాహన పెంచడం తో పాటు పంచకర్మ లాంటి ఆయుర్వేద చికిత్సలను అందించడం కూడా ఇందులో భాగమే. దేశంలో హెర్బల్ టూరిజానికి కేరళ పేరుపొందుతోంది.
కేరళలోని ప్రకృతి రమణీయ దృశ్యాలతో మానసికారోగ్యాన్ని, ఆయుర్వేదంతో శారీరకారోగ్యాన్ని సొంతం చేసుకోవచ్చు.భారత దేశంలో ెహర్బల్ టూరిజంకు మంచి భవిష్యత్తుంది.యూరోపియన్ మందుల వినిమయం ఎక్కువగా ఉన్నా... భారతదేశంలో ఆయుర్వేదానికి అనాది నుంచే ప్రజలలో మంచి గుర్తింపు ఉంది. శారీరక,మానసిక వ్యాధులను నిర్మూలించడంలో ఆయుర్వేదం ఎంతగానో ఉపయుక్తమైన దంటారు.శిరోధారా అనే పరిజ్ఞానం ఆయుర్వేదంలో ప్రముఖమై నది.ఆయుర్వేద పరిశోధన, వినియోగానికి కేరళకు భారతదేశంలో మంచి గుర్తింపు ఉంది. ేరళలో అనేక అయుర్వేద తయారీ కంపెనీలు ఎప్పటికపప్పుడు వ్యాధి నిర్మూలన కోసం మందులను తయారుచేసేందు కృషి చేస్తున్నాయి.కేరళలోని వెస్ట్రన్ ఘాట్‌లో ఎన్నో వనమూలికలు, మొక్కలు లభిస్తాయి.
ప్రింటింగ్ పరిజ్ఞానం అందుబాటులో లేని కాలంలో గురుకులం వంటి విద్యాలయాల్లో ఆయుర్వేద విజ్ఞానం మౌఖికంగా పరివ్యాప్తి చెందేది. తరువాత వాటిని రచనలోకి తెచ్చారు.కొండకోనల్లో నివసించే వివిధ కొండ జాతి వాళ్లకు ఎంత పరిజ్ఞానం ఉండేదో.. గురుకులం విద్యార్థులకూ అంతే పరిజ్ఞానం ఉండేది. ఆ పరిజ్ఞానమే కాలాలు దాటీ నేటికీ అందుబాటులో ఉంది. నేడు ఈ ఆయుర్వేద చికిత్సలు చేయించుకునేందుకు విదేశీయులు కూడా అధిక సంఖ్యలో కేరళలో పర్య టిస్తున్నారు. వీరి కోసం ఆయా సంస్థ లు ప్రత్యేక ప్యాకేజీలను కూడా ప్రవేశపెట్టాయి. ఒక విధంగా చెప్పాలంటే ఇది కూడా మెడికల్ టూరిజం లాంటిదే.
సాధారణ మెడికల్ టూరిజంలో శస్తచ్రికిత్స లు చేయించుకునే వారు వస్తుంటే, హెర్బల్ టూరిజంలో ప్రధానంగా ఆయుర్వేదం, మూలికా ఔషధాలతో చికిత్సలు పొందదల్చుకున్న వారు వస్తుంటారు.
ఆయుర్వేదానికి ఆద్యుడిగా పేర్కొనే ‘ధన్వంతరి’ని పేర్కొంటారు.‘అగ్నివేశ్ తంత్ర’ అనే పుస్తకంలో ‘అగ్నివేశ’ ఆయుర్వేదాన్ని గురించిన అనేక విషయాలు బహిర్గతం చేశారు. తరువాత ఈ పుస్తకాన్ని ఆంగ్లంలోనూ అనువాదం చేసి ప్రజలకు అందుబాటులోకి తెచ్చారు.
విశ్వవిఖ్యాతం కేరళ ఆయుర్వేదం
సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉంటేనే ఎవరి జీవితమైనా సజావుగా సాగుతుంది. ఈ సృష్టిలో ఆరోగ్యంగా జీవించే హక్కు ప్రతి ఒక్కరి సొంతం. అది ప్రకృతి ప్రసాదిత వరం. సంపూర్ణ ఆరోగ్యాన్ని కోరుకునే వారు ఇపుడు ప్రకృతినే వైద్యునిగా మార్చుకుంటున్నారు. ఇది ఇప్పటి మాట మాత్రం కాదు, చాలా సంవత్సరాల క్రితమే అంటే క్రీస్తుపూర్వం మూడువేల సంవత్సరాల క్రితమే ప్రకృతి నుంచి మానవుడు ఉపశమనం పొందాడన్న సత్యాన్ని అనేక శాస్ర్తీయ వైద్య గ్రంథాలు వివరిస్తున్నాయి. ప్రకృతి ప్రేరేపిత రూపమైన మానవుని శరీరం కూడా పంచభూత తత్వాలకు (గాలి, నీరు, భూమి, ఆకాశం, తేజం) లోబడి పనిచేస్తుందనేది వైజ్ఞానిక సత్యం.
ఈ పంచ ధర్మాలతో నిర్మాణమైన మానవుని శరీర రక్షణకు, ఆరోగ్య పరిరక్షణకు ఆధారమైన, అనుకూలమైన చికిత్సా విధానంపైనే ప్రజలు విశ్వాసాన్ని పెంచుకుంటున్నారు. ప్రకృతి ఒడిలో సేదతీరడానికి యోగ్యమైన చికిత్సా విధానాలను ఆశ్రయించి సత్ఫలితాలను పొందుతున్నారు. ఇతర వైద్యవిధానంతో పాటు నేడు ప్రాచీన, సంప్రదాయ వైద్యం కూడా అన్ని చోట్లా ఆమోదాన్ని పొందుతోంది. సంప్రదాయ వైద్యాన్ని పర్యాటక రంగానికి అనుసంధానం చేసుకుంటూ ఆయుర్వేద వైద్య విధానానికి తగినంతగా ప్రాధాన్యతను, ప్రాచుర్యాన్ని కలిగిస్తున్నాయి.
ఆయుర్వేద వైద్యమంటే...
శరీరం, మనసు, ఆత్మ మూ డింటినీ సవ్యదిశలో ఉంచగలిగేదే ఆయుర్వేద వైద్యవిధానం. ఏ అనారోగ్యమైనా మనిషిని శారీరకంగా, మరోవైపు మానసికంగా కుంగ తీస్తుంది. ‘నిజం-ఆగంధు’ ప్రక్రియ లను అనుసరించి ఆయుర్వేద చికిత్స చేస్తే పూర్తిస్థాయి నివారణ సాధ్యపడుతుందని వైద్యులు అంటున్నారు. ఆయుర్వేదంలో శోధనం, క్షమనం రెండింటికీ ఎంతో ప్రాధాన్యత ఉంది. శోధన ప్రక్రియ ద్వారా వ్యాధి మూలాన్ని సంగ్రహించి క్షమనం ద్వారా శాశ్వత పరిష్కారానికి దోహదం చేసే చికిత్సను చేస్తున్నారు. అలాగే బాడీమసాజ్ ప్రక్రియ కూడా ఆయుర్వేదంలో ముఖ్య భూమికను పోషిస్తోంది.
శారీరక రుగ్మతలకు చికిత్స...
శారీరక రుగ్మతలకు చికిత్స...
వందలాది ప్రకృతి పరమైన తైలాలను ఉపయోగించి శరీరానికి మసాజ్ అందించడం ద్వారా హృదయ భాగం నుంచి కాలి వేళ్ల వరకూ అనేక శారీరక రుగ్మతలకు స్వస్థత చేకూరుతుందని వైద్యుల నమ్మకం. వీటిలో అభియాంగమ్, ఎలకిడి, శిరోధార, నవరాకిడి, పిడిచిల్, తక్రధార లాంటి మసాజ్ చికిత్సల ద్వారా శరీరంలోని రక్త ప్రసరణ సరిగా జరిగేలా, మెడ సంబంధిత నొప్పులు, మానసిక, శారీరక ఒత్తిడి, నరాల బలహీనత, కీళ్ల సంబంధిత వ్యాధులు, పక్షవాతం లాంటి సమస్యలకు శాశ్వత పరిష్కారాన్ని పొందవచ్చని చెపుతున్నారు. ముఖ్యంగా పంచకర్మ విధానం (వాస్తి, విరేచన, వామన, నాస్య, రక్తమోక్ష) ద్వారా మనిషి శరీరాన్ని ఉత్తేజింప చేయవచ్చని ఆయుర్వేద వైద్యనిపుణులు అంటున్నారు.
రిసార్ట్స్‌లోనూ ఏర్పాటు...
కేరళలోని వివిధ రిసార్ట్స్‌లలో నిర్వాహకులు స్పాకేంద్రాల పేరుతో ఆయుర్వేద వైద్యా నికి ప్రాధాన్యం ఇస్తున్నారు. ప్రకృతి ఒడిలో సేద తీరేలా వీటిని ఏర్పాటు చేస్తున్నారు. విదేశీ పర్యాటకులు కూడా పెద్ద సంఖ్యలో వస్తుండడంతో వారికి అవసరమె న అన్ని సౌకర్యాలను ఇందులో కల్పిస్తున్నా రు. కీళ్లనొప్పులు, ఒబెసిటీ, ఆస్థమా, కండరాల నొప్పులు, మైగ్రెయిన్, కంటి సంబంధిత వ్యాధులకు వీటిలో పంచకర్మ చికిత్సలను అందిస్తున్నారు. ఇలాంటి వాటితో కేరళ క్రమంగా హెర్బల్ టూరిజానికి అంతర్జాతీయ కేంద్రంగా ప్రసిద్ధి చెందుతోంది.
రిసార్ట్స్‌లోనూ ఏర్పాటు...
కేరళలోని వివిధ రిసార్ట్స్‌లలో నిర్వాహకులు స్పాకేంద్రాల పేరుతో ఆయుర్వేద వైద్యా నికి ప్రాధాన్యం ఇస్తున్నారు. ప్రకృతి ఒడిలో సేద తీరేలా వీటిని ఏర్పాటు చేస్తున్నారు. విదేశీ పర్యాటకులు కూడా పెద్ద సంఖ్యలో వస్తుండడంతో వారికి అవసరమె న అన్ని సౌకర్యాలను ఇందులో కల్పిస్తున్నా రు. కీళ్లనొప్పులు, ఒబెసిటీ, ఆస్థమా, కండరాల నొప్పులు, మైగ్రెయిన్, కంటి సంబంధిత వ్యాధులకు వీటిలో పంచకర్మ చికిత్సలను అందిస్తున్నారు. ఇలాంటి వాటితో కేరళ క్రమంగా హెర్బల్ టూరిజానికి అంతర్జాతీయ కేంద్రంగా ప్రసిద్ధి చెందుతోంది.