విహారాలు

India

Gamyam

Sunday, June 19, 2011

బెలూన్ సఫారీలో 'గ్రేట్ మైగ్రేషన్' చూశాం

వేసవి సెలవులు ముగుస్తుండగా పరీక్షా ఫలితాలు వచ్చాయి. నా మనుమలు హరిశంకర్ ఎస్ఎస్‌సిలో 80శాతం మార్కులు, ప్రణబ్ ఐదో తరగతిలో 95 శాతం మార్కులతో పాసయ్యారు. బహుమతిగా ఆఫ్రికా దేశాలు చూపించమన్నారు. అందులో కెన్యా, టాంజానియా దేశాల్ని ఎంచుకున్నాము. అక్కడ నాకు సన్నిహితులైన సాంబశివరావు గారి కుటుంబం ఉండటం కూడా ఒక కారణం.

మే 29న ఎమిరేట్స్ ఎయిర్‌లైన్స్‌లో దుబాయ్ వెళ్లి నాలుగు గంటల విశ్రాంతి తర్వాత సాయంత్రం 3.30 గంటలకు నైరోబి ఎయిర్‌పోర్టులో దిగాము. సాంబశివరావుగారు, వారి మిత్రులు స్వాగతం పలికారు. నైరోబీలో ఔషధ, తోళ్ళ పరిశ్రమలలో ఆయన మూడేళ్ల క్రితం స్థిరపడి తెలుగువారందరికీ తలలో నాలుకలా ఉన్నారు. వారి వ్యాపారాలు ఉగాండా, టాంజానియా దేశాలలో విస్తరించి ఉన్నాయి. కెన్యాలో సుమారు 600 తెలుగు కుటుంబాలు ఉన్నాయి. అందులో ఎక్కువ మంది ఉద్యోగాలలో, మరికొంతమంది కెమికల్స్, ఫార్మా రంగాలలో కాంట్రాక్టర్లుగా ఉన్నారు. అందరూ ఆర్థికంగా స్థిరపడటమే కాకుండా కొత్తగా వెళ్లిన తెలుగువాళ్ళకు సహాయ సహకారాలు అందించడానికి సిద్ధంగా ఉన్నారు.

ఆరోజు సాయంత్రం దాదాపు 25 మంది తెలుగువారితో ఇష్టాగోష్టి సమావేశం రెండున్నర గంటల పాటు సాగింది. చక్కగా అనేక విషయాలు మాట్లాడుకున్నాము. రాత్రికి నాయుడుగారి బిడ్డ పుట్టినరోజు పండగకు 'అంగీత' హోటల్‌లో జరిగిన వేడుకల్ని చూశాము. దాదాపు 50 కుటుంబాలు అందులో ఆనందంగా, ఉత్సాహంగా పాల్గొన్నాయి. ఈ విధంగా నెలకు ఐదారు సార్లు కలుస్తుంటారట. పండగలు, పబ్బాలు జరుపుకుంటారట. తెలుగు సంఘాన్ని ఏర్పాటు చేసుకున్నారు. తెలుగు వాళ్ళంతా కలిసి కల్యాణ వేంకటేశ్వర స్వామి దేవాలయాన్ని నిర్మించుకొని హైందవ సంప్రదాయాల్ని కొనసాగిస్తున్నారు. కెన్యాలో ఉన్న కొత్త పెట్టుబడులు, ఉపాధి అవకాశాల్ని గుర్తించి తెలుగు వాళ్ళకు సహాయ పడాలని కెన్యా ప్రవాసాంధ్రులు ఆలోచించడం చాలా సంతోషం కలిగించింది.

కెన్యా తూర్పు ఆఫ్రికాలో ప్రముఖమైన దేశం. జనాభా నాలుగు కోట్లు, వారు మాట్లాడే భాష స్వాహిలి. దీనికి లిపి లేదు. ఒకప్పుడు బ్రిటిష్ వలస దేశం కావడం వల్ల అందరికీ ఇంగ్లీష్ వాడుక భాష. ప్రజాస్వామ్య దేశం కాబట్టి శాంతిభద్రతలు, అభివృద్ధి స్థిరంగా, పటిష్టంగా ఉన్నాయి. భూమధ్య రేఖపై ఉన్నప్పటికీ సగటు ఉష్ణోగ్రత 20 డిగ్రీలకు మించదు. దేశంలో 70శాతం వ్యవసాయానికి అనుకూలం. కాఫీ, టీ, మొక్కజొన్న, విరివిగా పండుతాయి. ప్రజల అక్షరాస్యత 80 శాతం. ఉపాధి కోసం ఎక్కడికైనా వెళ్లే చొరవ ఉన్నవారు. భారతీయులంటే బాగా అభిమానం. ఇక్కడి భారతీయులు ముఖ్యంగా గుజరాతీలు, సింధీలు, దక్షిణాది ర్రాష్టాల వాళ్లు. ఎంతో అభివృద్ధి చెందినా వారిలో అసూయ కనిపించదు.

కెన్యాకు సరిహద్దులుగా ఉగాండా, టాంజానియా, సోమాలియా, మరో పక్క హిందూ మహాసముద్రం ఉన్నాయి. పొరుగు దేశాలతో మంచి సంబంధాలే కాక వ్యాపార లావాదేవీలు కూడా కలిగి ఉంటుంది ఆ దేశం. భగవాన్ సత్యసాయి బాబా, ప్రపంచ దేశాలన్నిట్లోకి ఒక్క కెన్యాలోనే వారి జీవిత కాలంలో పర్యటించి అనుగ్రహ భాషణం ఇచ్చారు. వారి తల్లి ఈశ్వరమ్మ గారు ఆ తర్వాత విదేశాలకు వెళ్లవద్దని కోరారని చెబుతారు. విక్టోరియా మహారాణిని రాణిగా ప్రకటించింది, ఆమె కెన్యాలో పర్యటిస్తున్న సందర్భంలోనేనంటారు. అమెరికా ప్రెసిడెంట్ తండ్రి కెన్యా నివాసే నన్నది అందరికీ తెలిసిందే. ఐక్యరాజ్య సమితి రెండు ప్రధాన కార్యాలయాలు ఉన్నది కూడా కెన్యా దేశంలోనే.

మసాయి మారా

నైరోబి నుంచి చిన్న విమానంలో గంట ప్రయాణం తర్వాత ఈ వన్యమృగ సంరక్షణ కేంద్రంలో దిగాము. అక్కడ విమానాలు దిగడానికి రన్‌వే కూడా లేదు. గట్టి నేల మీదే దిగింది. మసాయి తెగలుండే ఈ ప్రాంతం 1500 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉంది. ఎక్కువ ప్రాంతం చదునుగా, అక్కడక్కడ చిట్టడవులతో నిండి ఉంటుంది. దీన్ని కెన్యా 'సహజవనరుల సంరక్షణ శాఖ' నిర్వహిస్తుంటుంది. ఈ ప్రాంతంలో అన్ని జాతుల శాకాహార, మాంసాహార జంతువులు, పక్షులు స్వేచ్ఛగా మసలుతుంటాయి. వీటిని వేటాడటం పూర్తిగా నిషేధం. రెండు రోజులు జంతు సఫారీలో వేల కొద్ది జంతువుల్ని, పక్షులను చూశాము.

ముఖ్యంగా సింహాలు, చిరుతలు, హైనాలు, అడవి దున్నలు, జీబ్రాలు, జిరాఫీలు, ఖడ్గ మృగాలు, జింకల్లో అనేక రకాలు, పక్షుల్ని విడివిడిగాను, గుంపులుగాను కూడా చూశాము. వీటి జీవనాధారం, ఆహారపు అలవాట్లు, వేటాడే విధానం, కోపతాపాలు, శత్రువుల్ని, మిత్రుల్ని పసిగట్టే విధానాలను గైడ్ ద్వారా విన్నాం. ముఖ్యంగా తమ బిడ్డల్ని కాపాడుకోవటం కోసం ప్రాణాలకు తెగించి అవి శత్రువుతో పోరాడే విధానాలు ఆశ్చర్యం కలిగించాయి. ఐదు పెద్ద జంతువుల్ని కలిపి బిగ్ 5 అంటారు. అవి సింహం, అడవి దున్న, చిరుత, ఏనుగు, రైనో. ఈ మృగాలన్నిటినీ గుంపుల్లో చూశాం. ఆశ్చర్యం ఏమిటంటే వేటాడే జంతువులన్నీ పక్కపక్కనే ఉన్నా ఆకలి అయినపుడు మాత్రమే వేటాడటం జరుగుతుంది. మిగతా సమయంలో వాటి జోలికి పోవు. పులులు, సింహాలైతే రోజుకు సుమారు 16 గంటలు నిద్రపోపతాయట.

బెలూన్ సఫారీ

450 డాలర్ల చార్జీతో గంటసేపు ఈ బెలూన్ సఫారీని ఏర్పాటు చేశారు. బూటేన్ గ్యాస్‌తో నింపిన పెద్ద బెలూన్‌లో 12 మందిని భూమికి 1000-5000 అడుగుల ఎత్తుకు తీసుకెళ్లి మసాయిమారాలో విస్తృతంగా తిరిగే జంతు జాలాల్ని, ప్రకృతి రమణీయతను చూసే అవకాశం కలిగించారు. దిగిన తర్వాత ఆ చిట్టడివిలో ఏర్పాటు చేసే అల్పాహారాన్ని బుష్ బ్రేక్ ఫాస్ట్ అంటారు. (బుష్ అంటే చిట్టడవి కదా)

గ్రేట్ మైగ్రేషన్

ఇది చూడదగిన జంతు సఫారీ. జూన్ నెల నుంచి ప్రారంభమయ్యే ఈ జంతు వలసలో సుమారు 15-20 లక్షల జంతువులు, ముఖ్యంగా జీబ్రాలు, వైల్డ్ బీస్ట్‌లు టాంజానియా లోని సెరంగిటి ప్రాంతం నుంచి మారా నదిని దాటుకుంటూ కెన్యాలోని మసాయిమారాకు వలస వస్తాయి. ఈ కాలంలో సెరంగిటిలో ఆహార కొరత, కెన్యాలో విస్తృత గడ్డి, ఆహారం లభించడమే ఈ వలసలకి కారణం. అక్టోబర్ నాటికి సెరంగిటిలో బాగా ఏపుగా గడ్డి, ఆహారం దొరకడంతో ఆ జంతువులన్నీ మళ్లీ మసాయిమారా నుంచి సెరంగిటి వెళ్లిపోతాయి. ఈ వలసలో వేలాది జంతువులు తొక్కిసలాటలో చనిపోతాయి. నదిని దాటేటప్పుడు మొసళ్లకు ఆహారంగా మారిపోతాయి. ఈ గ్రేటర్ మైగ్రేషన్ తప్పకుండా చూడాల్సిన దృశ్యం. ఈ జంతువులు కెన్యా చేరేటప్పటికే వాటి కోసం డేగలు, వేటాడే వన్యమృగాలు వచ్చి కాచుకొని ఉంటాయి.

ఏనుగులు, సింహాలు

ఆఫ్రికాలో పులులుండవు. ఇక ఆఫ్రికా ఏనుగుల గురించి ఎంత చెప్పినా తక్కువే. అవి కుటుంబాలుగా కలిసి జీవించడాన్ని గమనించాం. ఒక్కో ఏనుగు రోజుకి డెబ్భై గ్యాలన్ల నీళ్లు తాగుతుంది. ఏనుగులు తమ పిల్లల్ని పుట్టిననాటి నుంచి 20 నెలలపాటు కాచి కాపాడతాయి. పిల్ల్లల్ని గుంపు మధ్యలో ఉంచుతూ వాటి చుట్టూ పెద్ద ఏనుగులు తిరుగుతూ శత్రువుల బారి నుంచి పిల్లల్ని రక్షించుకుంటాయి. ఏనుగులు 60 నుంచి 70 ఏళ్లు జీవిస్తాయి. ముసలితనంలో దవడ పళ్లు ఊడిపోవడంతో ఆహారం తినలేవు. అందుకే ఆ వయసులో నీళ్లు తాగడం నుంచి ఆహారం తినడనికి కూడా తొండమే ప్రధానమవుతుంది. చివరికి పళ్లన్నీ ఊడిపోయి క్షీణించి చనిపోతాయి. సింహాలు కూడా కుటుంబాలుగానే జీవిస్తాయి. ఒక్కో సింహం చుట్టూ మూడునాలుగు శివంగులుంటాయి. శివంగులు వేటాడి ఆహారం తెచ్చిపెడితే సింహాలు పిల్లలకి కాపలా కాస్తాయి. అయితే పిల్లలు పెద్దవయ్యేకొద్దీ వాటిపై తల్లి చూపిస్తున్న ప్రేమను చూసి సింహాలు అసూయతో ఆ పిల్లలపై దాడి చేస్తాయి. అప్పుడు వాటి తల్లి సింహంపై ఎదురుదాడికి దిగుతుంది.

అన్ని రకాల జంతువులూ ఒకే చోట కలిసి జీవిస్తూ ఉంటాయక్కడ. ఆకలేసినప్పుడు మాత్రమే వేటాడతాయి. చిరుతలు గుంపులుగా కలిసి వేటాడతాయి. నీళ్లు దొరకనపుడు జంతువులను వేటాడి వాటి రక్తాన్ని తాగి దాహం తీర్చుకుంటాయి. జీబ్రాలు ఎక్కువ వేగంగా పరిగెత్తలేవు కాబట్టి అవి వీటికి ఆహారంగా మారుతుంటాయి. జీబ్రాలకున్న ప్రత్యేకత ఏమిటంటే.. మన వేలిముద్రల్లాగే వాటి చర్మంపై ఉన్న చారలు మిగతా వాటికంటే భిన్నంగా ఉంటాయి.

సంప్రదాయ గ్రామీణ కెన్యా

చిన్న, చిన్న జనావాసాలు (70-80 ఇళ్లు ఉండేవి) ఇక్కడ చాలా ఉంటాయి. నాగరికతకు దూరంగా ఈ గ్రామాలలో జనం ప్రధానంగా ఆవుల్ని, గొర్రెల్ని, కోళ్ళను పెంచుతుంటారు. బహు భార్యాత్వం ఉంది. ఐదున్నర అడుగులకు మించని ఇళ్ళల్లో ఉంటూ వేట, పాడి జీవనాధారంగా జీవిస్తుంటారు. ప్రభుత్వ సహాయం కూడా తక్కువే. వారానికోసారి జరిగే సంతలో వాళ్ళకు కావాల్సిన వస్తువుల్ని వస్తుమార్పిడి విధానం ద్వారా తెచ్చుకుంటారు.

బయలుదేరే ముందు రోజు కెన్యా రెవెన్యూ మంత్రి జేమ్స్‌ను కలవడం జరిగింది. చాలా స్నేహంగా మాట్లాడారు. కెన్యా దేశంలోని వనరుల గురించి, పెట్టుబడి అవకాశాల గురించి చర్చించాం. ఇటీవల ప్రధాని మన్మోహన్ సింగ్ పర్యటన సందర్భంగా ఎన్నో ఒప్పందాలు చేసుకొని, ఆర్థిక సహాయం ప్రకటించడం కూడా జరిగింది. ఇప్పటికే చాలా మంది తెలుగువాళ్ళు, గుజరాతీలు, పంజాబీలు అక్కడి వివిధ రంగాలలో స్థిరపడ్డారు. అనేక మంది తెలుగువారితో, కెన్యా వారితో మాట్లాడిన తర్వాత అక్కడ విద్య, ఆరోగ్యం, ఫార్మా, మౌలిక సదుపాయాల కల్పన మొదలైన రంగాలలో పూర్తి అవకాశాలున్నట్లు తెలిసింది.
ఆరు రోజుల పర్యటన తర్వాత ఆఫ్రికా గురించి ముఖ్యంగా కెన్యా గురించి నాకు ఎంతో సదభిప్రాయం కలిగింది. ఎన్నో అనుభవాలతో అనుభూతులతో ఎమిరేట్స్ విమానంలో ఆంధ్రాకు తిరిగి వచ్చాం.

కొసమెరుపు

అనుమతి దొరికితే తెలుగుదేశం పార్టీ ఎన్ఆర్ఐ విభాగాన్ని అక్కడ స్థాపిస్తామన్న టాంజానియా తెలుగువాళ్ల మాటలకు నేను చాలా సంతోషించాను.


- డాక్టర్ కోడెల శివప్రసాద్,
మాజీ మంత్రి, నరసరావుపేట

Wednesday, June 15, 2011

ప్రకృతి సోయగం... ఆధ్యాత్మిక సౌరభం... చిక్‌మగళూర్‌

 http://www.karnatakatoursandtravel.com/images/chikmagalore/falls.jpg
భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా కాఫీ తోటలుపెంచింది ఇక్కడే. తుంగ, భద్ర నదులకు పుట్టినిల్లు ఈ ప్రదేశం. కర్ణాటక రాష్ట్రంలోనే అత్యంత ఎత్తులో ఉన్న పర్వతశ్రేణులు ఇక్కడి ప్రత్యేకత. ప్రకృతి రమణీయ దృశ్యాలు కలిగిన కెమ్మనగుండి, కుద్రేముఖ్‌ కొండలు, మాణిక్యధార, కల్లథిగిరి జలపాతాలు పర్యాటకులకు కనువిందు కలిగిస్తాయి. శంకరాచార్యులు అద్వైత ప్రచారం కోసం స్థాపించిన శారదా పీఠం శృంగేరి ఈ జిల్లాలోనే ఉన్నది. దక్షిణ భారత దేశాన్ని పరిపాలించిన పెద్ద సామ్రాజ్యాలలో ఒకటైన హొయసల రాజులు పాలించిన సుందర ప్రదేశం చిక్‌మగళూరు విశేషాలు...

Hanuman_Gundi_Waterfall
చిక్‌మగళూరు పేరు జిల్లా రాజధాని చిక్‌మగళూరు పట్టణం నుండి వ్చంది. చిక్‌మగళూరు అంటే కన్నడ భాష లో చిన్న కూతురు ఊరు అని అర్థం. సేక్రపట్న రాజైన రుక్మాంగద చిన్న కూతురుకు కట్నంగా ఇవ్వబడడం వల్ల ఈ పట్టణానికి చిక్‌మగళూరు అని పేరు వచ్చిందని చెబుతారు. రుక్మాంగద పెద్ద కూతురు పేరు మీద చిక్‌మగళూరుకు 5 కి.మీ దూరంలో హిరెమగళూరు కూడా ఉన్నది.http://www.indiatravelnext.com/images/About%20Chikmagalur.jpg
జిల్లా చరిత్ర...
1670 సంవత్సరంలో చిక్‌మగళూరు జిల్లాలోని బాబా బుడాన్‌ గిరి కొండల పై భారతదేశంలోనే మొట్ట మెదటిసారిగా కాఫీ తోటలు పెంచారు. కాఫీ పెంపకం గురించి ప్రాచుర్యంలో ఉన్న కథ ప్రకారం బాబా బుడాన్‌ మక్కా యాత్రకు వెళుతూ యెమెన్‌ దేశం లోని మొఛా నౌకాశ్రయం నుండి ప్రయాణం చేస్తున్నప్పుడు మెదటిసారి కాఫీని రుచి చూశాడు. కాఫీ రుచిని భారతదేశానికి అందించే ప్రయత్నంలో ఏడు కాఫీ గింజలు తనతోబాటు అరబైఉ దేశాల నుండి తీసుకొని వచ్చాడు. బాబా బుడాన్‌ భారతదేశానికి తిరిగి వచ్చాక చిక్‌మగళూరులో ఈ గింజలు పాతాడు. బాబా బుడాన్‌ పై గౌరవానికి గుర్తుగా ఈ కొండలను బాబా బుడాన్‌ (బాబా బుర్హాన్‌) కొండలని పిలుస్తారు.
http://www.traveldealsfinder.com/wp-content/uploads/Ayyankere-Lake.jpg
సుందర పర్వత కేంద్రాలు...
 https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEhncT1GCq6fJ8lCCQhVsBL8Yad2xbckSxAVVb77CB6hjr1s8JVDFh1JOv3Czu2OFMLUBwd21ceA8T0aMe5RhuYYSAYmcr628sRRfqR1muZZJ7tYbFExHyQKXwgzmNg95pUFGWydPhLKUQK9/s400/chikmagalur-india.jpg
కెమ్మనగుండి: బాబా బుడాన్‌ కొండల మధ్య చిక్‌మగళూరు పట్టణానికి 55 కి.మీ దూరంలో కెమ్మనగుండి పర్వత కేంద్రం ఉన్నది. కెమ్మనగుండి పర్వత కేంద్రంలో వాడేయార్‌ రాజు కృష్ణరాజ వాడేయార్‌ వేసవి విడిది చేసేవాడు కావున ఈ పర్వతశ్రేణులను కె.ఆర్‌. కొండలు అని కూడా పిలుస్తారు. ఈ పర్వత కేంద్రం సముద్ర మట్టానికి 1,434 మీటర్ల ఎత్తులో దట్టమైన అరణ్యాల మధ్య సంవత్సరం పొడవునా సెలయేళ్ళతో హరితంగా ఉంటుంది. పూల తోటలతో, కొండలోయలతో ఉండే ఈ పర్వత కేంద్ర సౌందర్యం వర్ణణాతీతం. అరణ్యాలు అన్వేషణ జరిపే వారికి ఈ పర్వత కేంద్రం నుండి అనేక మార్గాలు ఉన్నాయి. ఈ కొండ ప్రాంతంలో వివిధ ప్రదేశాల నుండి సూర్యాస్తమయాన్ని తిలకించ వలసిందే. కేంద్రం పైన గులాబీ తోటలు అనేకం ఉన్నాయి. పర్వతం నడిబొడ్డు నుండి పది నిమిషాల నడకలో వచ్చే జెడ్‌-పాయింట్‌ నుండి చూస్తే రమణీయంగా ఉండే పశ్చిమ కనుమలలోని శొల గడ్డి భూములు కనిపిస్తాయి.

కుద్రేముఖ్‌ జాతీయ వనం:

Kemmanagundi 

కుద్రేముఖ్‌... జిల్లా రాజధాని చిక్‌మగళూరు కి 95 కి.మీల నైఋతి దిశలో ఉన్నది. కన్నడ భాషలో కుద్రేముఖ్‌ అంటే గుర్రపు ముఖం అని అర్థం. ఈ పర్వతశ్రేణులు గుర్రపుముఖం ఆకారంలో ఉండడం వల్ల కుద్రేముఖ్‌ అని పిలుస్తారు. ఈ కుద్రేముఖ్‌ పర్వతకేంద్రంలో కుద్రేముఖ్‌ జాతీయ ఉద్యానవనం ఉన్నది. అరేబియా సముద్రం వైపు ఉన్న ఈ పర్వతశ్రేణుల పరంపర లోతైన లోయలు, ఎత్తైన శిఖరాలతో చాలా సుందరంగా ఉంటుంది. సముద్రమట్టానికి 1,894.3 కిలోమీటర్ల ఎత్తులో ఉన్న ఈ పర్వత కేంద్రం కుద్రేముఖ్‌లో అపారమైన ఇనుప గనులు ఉన్నాయి. కుద్రేముఖ్‌లో ఉన్న కుద్రేముఖ్‌ ఉక్కు కర్మాగారంలో ఉక్కు కొద్దిగా శుద్ధి చేసి గొట్టాల ద్వారా మంగళూరు పణంబూర్‌ నౌకాశ్రయానికి సరఫరా చేయబడుతుంది.

ముల్లయనగిరి: ముల్లయనగిరి బాబు బుడాన్‌ కొండలలో ఒక భాగం. ఈ కొండ చిక్‌మగళూరు పట్టణానికి 16 కిలోమీటర్ల దూరంలో ఉన్నది. సముద్రమట్టానికి 1930 మీటర్ల ఎత్తులో ఉన్న ఈ పర్వతశ్రేణులు కర్ణాటక రాష్ట్రం లోనే ఎత్తైన పర్వత శ్రేణులు. ఈ పర్వత శిఖరం సూర్యాస్తమయం వీక్షించడానికి చాలా ప్రసిద్ధి. చిక్‌మగళూరు నుండి సితలయనగిరి వెళ్ళే మార్గంలో ఉన్న శివుడి గుడిలో లింగం నిరంతరం నీటిలో ఉంటుంది. నీటి మట్టం ఏ సమయంలోనైన ఒకేలాగ ఉంటుంది. అక్కడ నుండి ముల్లయనగిరికి వెళ్ళే రహదారి చాలా సన్నగా ఉండి రెండు ప్రక్కల వాహనాలు పోవడానికి వీలు లేకుండా ఉంటుంది.ముల్లయనగిరి కొండ చాలా వాలుగా ఉండడం వల్ల పైకి పూర్తిగా వాహనాల మీద చేరుకోలేరు.ముల్లయనగిరి కొండకు ఎక్కే మధ్య భాగంలో ఒక చిన్న గుడి కూడా ఉన్నది. ముల్లయనగిరి కొండల నుండి ఆకాశం నిర్మలంగా ఉన్న రోజులలో అరేబియా సముద్రం కనిపిస్తుంది. పర్వతశ్రేణులను అధిరోహించాలని ఆసక్తి ఉన్నవారికి ఈ కొండ చాలా మంచి ప్రదేశం.

దత్త పీఠం (బాబా బుడాన్‌ గిరి):

Sringeri_Sri_Sharada 

చిక్‌మగళూరు కి ఉత్తరాన బాబా బుడాన్‌ కొండలు ఉన్నాయి. వీటికి చంద్ర ద్రోణ పర్వత అనే పేరు కూడా ఉన్నది. ఈ కొండలకు చాలా పురాతన చరిత్ర ఉన్నది. ఈ కొండలు హిమాలయాలకు నీలగిరి కొండలకు మధ్య ఉన్న ఎత్తైన కొండలలో ఇది ఒకటి. ఈ కొండకు ఈ పేరు 150 సంవత్సరాల క్రితం నివసించిన ముస్లిం ఔలియా మరియు సూఫీ అయిన బాబా బుడాన్‌ (దాదా హయాత్‌ కలందర్‌) వల్ల వచ్చింది.http://gallery.holidaymakers.in/d/17564-2/ayyana-kere-chikmagalur.jpg
జలపాతాల హొయలు...
మాణిక్యధార జలపాతం: ఈ జలపాతం బాబా బుడాన్‌ గిరి దత్తాత్రేయ పీఠానికి దగ్గరలో ఉన్నది. ఈ జలపాతం పడేటప్పుడు నీరు ముత్యాల వలే కనిపిస్తూ చూపరులకు, జలక్రీడలు ఆడేవారికి అమిత అనందాన్ని కలిగిస్తోంది.
http://www.deccanherald.com/images/editor_images1/2010/12/06/chikamagalur-250.jpg
కళ్ళహతిగిరి జలపాతం: కెమ్మనగుండి నుండి 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న కళ్లహతగిరి జలపాతాన్ని కాళహస్తి జలపాతం అనికూడా పిలుస్తారు. 122 మీటర్ల ఎత్తులోనున్న చంద్ర ద్రోణ పర్వతం నుండి పడే ఈ జలపాతం చాలా రమణీయంగా ఉంటుంది. జలపాతం పడే రాళ్ళ మధ్య శివునిగా అర్చించబడే వీరభద్ర దేవాలయం కూడా ఉన్నది.https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEgB0SYTu9k669Pgf8gKIuD8G33pH-fmJrcsUAglkTuKsJeGg3GBvcuhHo8_a_sEz1UmdIB4L7S53o-aeDa2zBeHXiLmsX6ugxrMLeJh6lpm3KMwdZSoZpdTOrOzDig9S-Wk3210n-b4iQRj/s1600/DSC05260.JPG
http://www.goaonweb.com/south-india-tour-packages/images/karnataka-tourism-hills8.jpg
హెబ్బె జలపాతం: కెమ్మనగుండి పర్వత కేంద్రం నుండి 10 కి.మీ దూరంలో ఉన్న ఈ జలపాతం 168 మీటర్ల ఎత్తు నుండి పడుతుంది. ఈ జలపాతం రెండు గతిపథులుగా పడు తుంది. దొడ్డ హెబ్బె (పెద్ద హెబ్బె) జలపాతం, చిక్క హెబ్బె (చిన్న హెబ్బె) జలపాతం. ఇంకా ఇవేకాకుండా శాంతి, హనుమానైఉ గుండి, కదంబి జలపాతాలు పర్యాటకులను మంత్రముగ్ధులను చేస్తాయి.http://travel.paintedstork.com/blog/image/waterfalls_charmadi_2.jpg
పుణ్యక్షేత్రాలకు నెలవు..
శృంగేరి: చిక్‌మగళూరు కి 90 కిలోమీటర్ల పశ్చిమంగా తుం గ నది ఒడ్డున శంకరాచార్యు లు అద్వైత ధర్మప్రచారానికి స్థాపించిన మొట్టమొదటి మఠ మైన శారద పీఠానికి నిల యం శృంగేరి. శృంగేరిలో శా రదాదేవి దేవాలయం ఉన్నది, శారదదేవి ఆలయానికి ప్రక్కన విద్యాశంకరులు స్మారకంగా నిర్మితమైన విద్యాశంకర్‌ దేవా లయం హొయసల రాజుల కాలంలో ప్రారంభించబడివిజయనగర రాజుల చేత పూర్తి చేయబడింది. ఈ విద్యాశంకర దేవాలయంలో 12 రాశులను సూచిస్తూ 12 స్థంభాలు ఉన్నాయి. సూర్యుడు ఏ రాశితో ఉన్నాడో సూర్యకిరణాలు ఆ స్థంభం మీద పడడం విశేషం.
http://www.indianetzone.com/photos_gallery/22/Veeranarayana_13279.jpg
హొరనాడు: చిక్‌మగళూరుకు 100 కిలోమీటర్లల నైఋతి దిక్కులో ఉన్న ఈ గ్రామం లో ప్రసిద్ధమైన అన్నపూర్ణేశ్వరి దేవాలయం ఉన్నది. ఈ దేవాలయం పునరుద్ధరణ ఇటీవలికాలంలోనే జరిగింది. ఆదిశక్తితో ప్రాణప్రతిష్ట చేసిన ఈ గుడిలో ఉన్న ఈ అమ్మవారిని ఆదిశక్త్యకాంబ శ్రీ అన్నపూర్ణేశ్వరిగా భావిస్తారు. ఈ దేవాలయంలో ప్రతి రోజు అన్న సంతర్పణ జరుగుతుంది. అమ్మవారిని దర్శించడానికి వ్చన తీర్థయాత్రీకులకు దేవస్థానం వసతి భోజన సదుపాయాలు కల్పిస్తుంది.

కలస:

Kudremukh_National_Park 

చిక్‌మగళూరుకు నైఋతిదిశలో 92 కిలోమీటర్ల దూరంలో భద్ర నది ఒడ్డున కలస ఉన్నది. భద్ర నది ఒడ్డున ఉన్న పంచ క్షేత్రాలలో (ఐదు సరస్సులు) ఇది ఒకటి. దగ్గరలో ఉన్న చిన్న కొండ పై హొయసల శైలితో నిర్మితమైన శివాలయం కాళేశ్వర దేవాలయం ఉన్నది. కలసలో ఉన్న పెద్ద శిలను మధ్వాచార్య బండ అని పిలుస్తారు. ఈ బండ పై మధ్వాచార్యులు ద్వైత సిద్ధాంతాన్ని బోధించాడని చెబుతారు. ఈ శిలపై ఇప్పుడు మధ్వచార్యుల విగ్రహం చెక్కబడింది.

గురు దత్తాత్రేయ, బాబా బుడాన్‌ స్వామి దర్గాహ్‌: బాబా బుడాన్‌ గిరి కొండలపై నున్న ఇమాం దత్తాత్రేయ పీఠాన్ని హిందువులు ముస్లిములు సమానమైన పవిత్ర స్థలంగా భావిస్తారు. ఈ కొండపై నున్న లాటిరైటు (కంకర) గుహలో దత్తాత్రేయ స్వామి లేదా హజరత్‌ దాదా హయాత్‌ మీర్‌ కలందర్‌ నివసించారని ఇక్కడి ప్రజలు నమ్ముతారు. (బాబా బుర్హాన్‌ సూఫీ సంతుడిని, హిందువులు దత్తాత్రేయ స్వామి అని, ముస్లింలు హజరత్‌ దాదా హయాత్‌ మీర్‌ కలందర్‌ అని పిలుస్తారు) ప్రతి సంవత్సరం ఇక్కడి ఫకీర్లు జాతరను, ఉర్సును నిర్వహిస్తారు.

అమృత్‌పుర:
చిక్‌మగళూరు పట్టణానికి 67 కిలోమీటర్ల ఉత్తరంలో ఉన్న అమృత్‌పుర గ్రామంలో ఉన్న అమృతేశ్వర దేవాలయాన్ని క్రీ.శ. 1196 సంవత్సరంలో అమృతేశ్వర దండనాయక అని పేరు గాంచిన హొయసల రాజు రెండవ వీర బల్లాల్‌ కట్టించాడు. ఈ దేవాలయం చూస్తే హోయసల రాజుల కాలంలో శిల్ప నైపుణ్యం ఎంత ఉచ్ఛ స్థితిలో ఉండేదో అవగతమవుతుంది.

బేలవాడి: చిక్‌మగళూరుకి ఆగ్నేయం లో 29 కిలోమీటర్ల దూరంలో ఉన్న బేలవాడి గ్రామంలో ఉన్న శృంగారమైన వీరనారాయణ దేవాలయం, ఉద్భవ గణపతి దేవాలయం చాలా ప్రసిద్ధం. ఈ గ్రామానికి 10 కిలోమీటర్ల దూరం లోనే హళేబీడు ఉన్నది. ఇలా ప్రకృతి రమణీయతను, ఆద్యాత్మికతను తనలో కలుపుకొని ఉన్న ఏకైక పర్యాటక కేంద్రంగా విరాజిల్లుతోంది చిక్‌మగళూర్‌.

పంచవర్ణ సౌందర్యం... బ్రైస్‌ కెన్యన్‌ నేషనల్‌ పార్క్‌

 http://images.travelpod.com/users/jacobsims/1.1248958003.me-at-bryce-canyon-national-park.jpg
అమెరికాలో ఉన్న ప్రకృతి వరప్రసాదం బ్రైస్‌ కెన్యన్‌ నేషనల్‌ పార్క్‌ను సందర్శించిన ఏ పర్యాటకుడికైనా రంగుల్లో విహరించిన అనుభూతి కలుగుతుంది. ఎరుపు, పసుపు, గులాబీ, నారింజ, ముదురు గోధుమ రంగుల్లో లెక్కకుమించీ కనిపించే గుళ్ళు, గోపురాలు, గుహలు, అంతఃపురాలను పోలిన ప్రకృతి చెక్కిన శిల్పాలు బ్రైస్‌ కెన్యన్‌ నేషనల్‌ పార్కులో చూపరులను ఇట్టే కట్టిపడేస్తాయి. రకరకాల ఆకృతుల్లో, వినూత్నమైన శిల్పాలు నిండి ఉండే ఈ సన్నటి లోయలో చిత్ర విచిత్రమైన రంగులతో రాళ్లన్నీ గుసగుసలాడుతున్నట్లు అనిపిస్తుంటుంది. ప్రకృతి తన అందాన్నంతా ఓ చోట గుమ్మరించి, దానికి రకరకాల రంగులద్ది, చిత్ర విచిత్రమైన శిల్పాలను తయారుచేసి ముచ్చటగా పరచినట్లుగా అద్వితీయమైన అందంతో పులకరింపజేస్తుంటుంది బ్రైస్‌ కెన్యన్‌ పార్కు.
 http://www.idntourism.com/wp-content/uploads/2011/04/Bryce_Canyon_sunset_Utah_United-States.jpg
ఇక్కడ ప్రభాత సమయంలో సూర్యకాంతి ప్రసరిస్తుందో, లేదో తెలియదుగానీ.. అయితే మంచులో తడిసిన రాళ్ల పుష్పాల సౌందర్యం చూసేందుకు రెండు కళ్లూ సరిపోవు. అమెరికాలోని దక్షిణ ఉతాహ్‌లో ఉన్న ఈ బ్రైస్‌ కెన్యన్‌ పార్క్‌లో అతి సూక్ష్మమైన కంటికి కనిపించని ఎన్నో నిక్షేపాలు దాగి ఉన్న కారణంగా ఏ మాత్రం వెలుతురు సోకినా సరే అనేక రంగులు ప్రసరిస్తూ ఆ ప్రాంతమంతా వింత శోభను కలిగిస్తుంది. http://brycecanyon.com/photos/brycecanyon9.jpg
కొన్ని మిలియన్‌ సంవత్సరాల క్రితం భూక్షయం కారణంగా కొట్టుకొచ్చిన మాంగనీస్‌, ఐరన్‌ లాంటి నిక్షేపాలు రాతిపై ఒక పొరగా ఏర్పడటంవల్ల ఈ పార్క్‌ నెలకొన్న ప్రాంతమంతా ఓ ప్రత్యేకతను సంతరించుకుంది. ప్రకృతి వైపరీత్యాలవల్లనో లేక కాలానుగుణంగా సంభవించిన పెను మార్పులవల్ల బ్రైస్‌ కెన్యన్‌ పార్కు నేటి రూపం సంతరించుకుంది. 
http://www.rockymountainmagazine.com/wp-content/uploads/2011/04/Bryce-Canyon-National-Park.jpg
మనుషులు నిలుచున్నప్పుడు ప్రతిబింబించే ఆకారాన్ని పోలిన ఎర్రటి రంగురాళ్లతో ఈ ప్రదేశం అంతా నిండి ఉంటుంది. బౌల్‌ ఆకృతిలో ఏర్పడిన ఈ లోయ ప్రపంచ చిత్రపఠంలో ఓ సుందర దృశ్యకావ్యమని చెప్పవచ్చు. బౌల్‌ ఆకృతిలో ఉన్నందువల్లనే ఈ పార్క్‌కు బ్రైస్‌ కెన్యన్‌ పార్క్‌ అనే పేరు వచ్చిందేమో..!!

Hammer_Bryce_Canyon 

ఈ బ్రైస్‌ లోయలో సూర్యకిరణాలు ప్రసరించటంతో అక్కడి శిలలన్నీ బంగారు వర్ణంతో మిలమిలా మెరిసిపోతుంటాయి. గుత్తులు గుత్తులుగా వెలుతురు పువ్వులు, మైమరిపించే ఇంపైన రంగులు ఏ కాన్వాసుకు అందని అంతు చిక్కని అద్భుతాలు ఈ పార్క్‌ సొంతం. 
 Desktop Wallpaper-s > Nature > Moonrise, Bryce Canyon National Park, Utah

శీతాకాలంలో తెల్లటి వెండిలాంటి మంచు ఓ వైపు, ఎర్రటి శిలలు, నీలాకాశం, పిల్లగాలులు ఈ ప్రాంతంలో అత్యద్భుతమైన దృశ్యాలను ఆవిష్కరిస్తాయి. భూమి శైథిల్యం వల్ల ఏర్పడిన ప్రకృతికి ప్రతిబింబంగా కనిపించే ఈ సహజసిద్ధమైన లోయ అనేక ఆకర్షణల తో నిండిన ఓ నిజమైన ప్రకృతి చిత్రం. 
http://www.idntourism.com/wp-content/uploads/2011/04/Bryce-Canyon-Nationa-park-Utah.jpg
ఉదయిస్తున్న సూర్యుడు, వేల రంగులు మిళితమైన కొండలు, గుట్టలు.. అప్పుడే రంగులు మార్చుకుంటున్న రకరకాల శిలలు, కళ్లముందు ఓ క్షణం కనిపించిన రంగు మరో క్షణానికి కనిపించనంతగా లెక్కకుమించి రంగులను పులుముకునే శిలల రంగుల సౌందర్యం వర్ణనాతీతం.
Natural_bridge 
నిజంగా ఇక్కడ దేవకన్యలు ఎవరైనా నివసిస్తున్నారా అనిపించేంత అద్భుత సౌందర్యం ఈ బ్రైస్‌ లోయకు మాత్రమే సొంతం. భూమి, గాలి, కాలం, వివిధ మూలకాల మధ్య ఉన్న అంతర్గత సంబంధం వల్ల ఏర్పడ్డ బ్రైస్‌ కెన్యన్‌ పార్కు నిజానికి ఓ నమ్మలేని నిజం. సౌందర్యారాధకులకు, కళాకారులకు ప్రాణం లేచివచ్చేలా ఉండే ఈ ప్రదేశం ఓ వింత ఈనుభూతిని కలిగిస్తుంది.
http://www.rvforsaleguide.com/images/bryce-canyon-park-bugsy-picture.jpg
యాంత్రిక జీవనంలో అలసిపోయినవారు అవకాశముంటే తప్పకుండా సందర్శించాల్సిన ఓ అద్భుతమైన ప్రదేశం ఇది. ఒకవేళ సందర్శన వీలుకాకపోయినా, కనీసం తప్పకుండా తెలుసుకోవాల్సిన అందమైన, విజ్ఞానదాయకమైన సజీవ ప్రకృతి కావ్యం బ్రైస్‌ కెన్యన్‌ పార్క్‌. 
 Bryce Canyon National Park in Utah - Winter time

వెలమ రాజుల అండ... దేవరకొండ

4Devarakonda_lowres
వచ్చిపోయే అతిథులతో కళకళలాడుతుండే అతిథి గృహాలు, వేదోచ్ఛారణలమధ్య వెలిగిపోతుండే గుళ్లు, గోపురాలు.. సిరిమువ్వల సవ్వడితో చేసే నాట్య విన్యాసాలు, సంగీత సాహిత్య సమ్మేళనాలు, రారాజుల తీర్పుకోసం వేచి ఉండే ప్రజలతో నిండిన రాజ ప్రాసాదాలతో కళకళలాడుతూ దర్శనమిచ్చే చారిత్రక ప్రదేశం దేవరకొండ దుర్గంవెలమ రాజులు శుత్రుదుర్భేద్యంగా నిర్మించిన దేవరకొండ దుర్గం.. హైదరా బాద్‌ నుంచి నాగార్జున సాగర్‌ వెళ్లే దారిలో మల్లేపల్లి నుంచి ఏడుకిలో మీటర్ల దూరం లోపలికి వెళితే స్వాగతం పలుకుతుంది. ఎనిమిది వందల సంవత్సరాల క్రితం వెలమ రాజుల రాచరిక పరిపాలనా విధానానికి అనుగు ణంగా, భద్రతా సంబంధమైన విషయాలతో శత్రువుల ఊహకు సైతం అందని విధంగా.. రాతి, మట్టి ప్రాకారాలతో నిర్మించిన దేవరకొండ దుర్గం వారి విజ్ఞత ను చాటుతూ మనకు ఈనాటికీ దర్శనమిస్తోంది. సంవత్సరాల తరబడి దుర్గం లోనే ఉంటూ యుద్ధం చేయాల్సి వచ్చిన సందర్భాలలో అందుకు అవసరమైన వనరుల్ని ఏర్పరచుకున్న తీరు.. శత్రు సైన్యంపై దాడి చేసేందుకు అనువుగా నిర్మించిన రహస్య స్థావరాలు... తదితరాలను పరిశీలిస్తే, ఆనాటి పద్మనాయక వెలమ రాజుల పరిజ్ఞానం నేటి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం ముందు దిగదు డుపే అనిపించకమానదు.

దుర్గం చరిత్ర...
2Devarakonda_lowres 

కాకతీయ రాజులవద్ద సేనానులుగా పనిచేసిన పద్మనాయక వంశానికి చెందిన భేతాళ నాయకుడి సంతతివారు ఆ తరువాతి కాలంలో దేవరకొండ రాజ్యాన్ని ఏర్పాటు చేసుకున్నట్లుగా చారిత్రక కథనాల ద్వారా తెలుస్తోంది. వీరి వంశంలో 8వ తరానికి చెందిన రెండవ మాదానాయుడు కాలంలోనే దేవరకొండ దుర్గం నిర్మాణం జరిపినట్లు చరిత్రకారులు చెబుతున్నారు.

మాదానాయుడి తండ్రి సింగమనాయుడు దుర్గం కొంత భాగం నిర్మాణం పూర్తి చేసినా, పూర్థి స్థాయిలో మాదానాయుడి కాలంలోనే రూపొందినట్లు తెలుస్తోం ది. ఇతని కాలంలోనే దేవరకొండ రాజ్యం శ్రీశైలందాకా విస్తరించినట్లు చరిత్ర చెబుతోంది. 525 ఎకరాల విస్తీర్ణం, 500 అడుగుల ఎత్తుగల ఏడు కొండలను కలుపుతూ పద్మనాయకులు ఈ దుర్గాన్ని అత్యద్భుతంగా నిర్మించారు.

సువిశాలమైన ఎత్తైన కొండలు హెచ్చుతగ్గులుండటంచేత అందుకు అనుగు ణంగా చుట్టూ ఒకే ప్రాకారాన్ని కాకుండా, ఒకదాని వెనుక మరొకటిగా అనేక ప్రాకారాలను సంపూర్ణ పరిజ్ఞానంతో నిర్మించారు. ఏడు కొండలను కలుపుతూ పెద్ద పెద్ద బండరాళ్లను చక్కగా చీల్చి చూసేవారిని ఆశ్చర్యంలో ముంచెత్తేలా 6, 8, 10 మీటర్ల ఎత్తుగల ప్రాకారాల గోడలను నిర్మించా రు. దుర్గంలోపల కొండపైన సమృద్ధిగా జలవనరులున్నట్లు తెలుస్తోంది.

సువిశాలం... శతృదుర్భేద్యం...
Devarakonda2 దుర్గంలోపల వంద ఎకరాల సువిశాల వ్యయసాయ క్షేత్రం ఉండటం విశేషంగా చెప్పవచ్చు. ఈ దుర్గంలో 360 బురు జులు, 9 ప్రధాన ద్వారాలు, 32 చిన్న ద్వారాలు, 23 పెద్ద బావులు, 53 దిగుడు బావులు, 6 కోనేరులు, 5 చిన్న కొలనులు, 13 ధాన్యాగారాలు, గుర్రపుశాలలు, ఆయుధాగారాలు ఉండేవని చరిత్ర ద్వారా తెలుస్తోంది. అయితే సరైన రక్షణ లేని కారణంగా వీటిలో నేడు చాలా వరకు శిథిలమైపోయాయి.

ప్రధాన ద్వారాల నిర్మాణంలో కూడా వెలమ రాజులు సంపూర్ణ పరిజ్ఞానాన్ని ఉపయోగించి కట్టినట్లు అర్థమవుతోంది. ఒకవేళ శత్రువులు చొరబడినా వారిని అంతమొందించేందుకు మొదటి ద్వారం నుంచి రెండో ద్వారం చేరేందుకు అతి సమీపంలోనే మూడు మలుపులు తిప్పి వాటిని నిర్మించం ఆశ్చర్యం కలిగిస్తుం ది. ఈ మెలికలు తిరిగిన 3 మలుపులలో దాదాపు 100 మంది సైనికులు శత్రువులకు కనిపించకుండా రహస్యంగా నక్కి ఉండేలా స్థావరాలను సైతం నిర్మించారు.

అంతేగాకుండా.. కొండమీద నెలవైన దుర్గం కాబట్టి, కొండపైకి ఎక్కి గోడను కూలదోయటంగానీ, గోడను ఎగబాకి లోపలికి ప్రవేశించటం సాధ్యపడదు. సింహద్వారాలకు అతి సమీపంలో ‘యు’ ఆకారంలో బలమైన బురుజులను నిర్మించి శత్రువులు లోనికి చొరబడేందుకు ఏ మాత్రం అవకాశం ఇవ్వని విధంగా దుర్గాన్ని నిర్మించారు. మొదటి రెండు ద్వారాలను అతి సమీపంలో నిర్మించి వాటి మధ్య రెండు అంతస్థులుగా సైనిక స్థావరాలను నిర్మించారు.

ఎన్నెన్నో ద్వారాలు...
Devarakonda_lowres మొదటి ద్వారం దాటగానే కొత్తవారు సైతం నోరెళ్లబెట్టే విధంగా రెండు ద్వారా లను నిర్మించారు. ఇందులో ఒకటి డమ్మీ ద్వారం కాగా, మరోటి కోటలోపలికి ప్రవేశించేంది. ప్రతి ద్వారానికి అడుగు భాగాన రెండువైపులా పూర్ణకుంభాలను చెక్కించారు. ఈ కోట ద్వారాలపై చెక్కిన పూర్ణకుంభ కలశాలనే ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం తమ అధికార చిహ్నంగా తీసుకుని ఉండవచ్చునని చారిత్రక పరిశీల కులు భావిస్తున్నారు.

సింహద్వారం దాటి లోపలి వెళ్లగానే ఎడమవైపు నల్లరాతి ఏకశిలా నంది విగ్రహం దర్శనమిస్తుంది. మరికాస్త దూ రం ముందుకెళితే మరో ప్రధాన ద్వారం, ఆ తర్వాత కుడివైపుకు వెళితే శిథిలావస్థ కు చేరుకున్న ధాన్యాగారాలు, సైనికావాసా లు, అధికారుల భవనాలు కనిపిస్తాయి. ఈ ప్రదేశం దాటి విశాలమైన మెట్లు ఎక్కి కాస్త దూరం వెళితే రెండో రాతి ప్రాకారం కనిపిస్తుంది. ఇందులో ఉండే విశేషం ఏంటంటే.. ఆ ప్రాకారం దగ్గరికి వెళ్లేదాకా దానికి అమర్చిన ద్వారం ఎవ్వరికీ కనిపించదు.

అలాగే మెట్లు ఎక్కుతూ పడమరవైపు వెళితే మరో రాతి ప్రాకారం వస్తుంది. అందులో ఎన్నో రహస్య సైనిక స్థావరాలు నిర్మించబడి ఉన్నాయి. దాన్ని దాటి ముందుకెళితే నాలుగో రాతి ప్రాకారం, దానినుంచి పడమర దిశగా పైకి ఎక్కు తూ వెళితే ఐదో ప్రాకారం వస్తాయి. ఐదో ప్రాకారం వద్ద ఇప్పటికీ ఏ మాత్రం చెక్కుచెదరని సింహ ద్వారం మనకు దర్శనమిస్తుంది. ఈ ద్వారం దాటి లోనికి వెళ్లగానే ఓ ఆలయం ఉంటుంది.

దానికి ఉత్తర దిశగా వెళితే రెండు దారులు.. అందులో దక్షిణంవైపు మెట్లు ఎక్కి వెళితే దుర్గంలోని ఎత్తైన కొండపై ఉండే రామాలయానికి చేరుకుంటాం. కొండపైగల 50 ఎకరాల సమతల ప్రదేశంలో రాజమందిరం, అంతఃపురం, సభావేదికలు, రాణివాసాలు, రాజదర్బాలు మనకు ఆహ్వానం పలుకుతాయి.

అక్కడికి నైరుతీ దిశలో గొలుసుబావి ఉంది. రాజవంశీకులు ఈ బావిలోని నీరే తాగేవారట. కోటను వదలి వెళ్లేటప్పుడు విలువైన వస్తువులు, ధనం, నగలు, మోట బొక్కెనలలో నింపి వాటికి బలమైన ఇనుప గొలుసులు కట్టి ఈ బావిలో పడవేసి, గొలుసులను బలమైన రాతి స్థంభాలకు బిగించి వెళ్లేవారని తెలుస్తోంది. ఇందుకు నిదర్శనంగా ఆ గొలుసులు 1980 సంవత్సరందాకా కనిపించేవనీ, ఆ తర్వాత అవి అదృశ్యమయ్యా యని స్థానికులు చెబుతుంటారు. గొలుసుబావికి ఎదురుగా ఉండే కోనేరు.. ఎన్ని కరువులు వచ్చినా ఎండిపోలేదని, దశాబ్దాల నుంచి నీరు ఒకేలాగా ఉందని కూడా స్థానికులు చెబుతుంటారు.

గుళ్లూ.. గోపురాలు...
Devarakonda1 

గొలుసుబావికి ఉత్తరదిశగా కొంతదూరం నడచివెళితే విశాలమైన మట్టి ప్రాకారం మధ్య ఓ శివలింగం, నందీశ్వరుడు, పెకిలించబడిన ధ్వజస్థంభం, ఓంకారేశ్వరస్వామి ఆలయాలు కనిపిస్తాయి. ఈ ఆలయంలో ప్రతి సంవత్సరం మహాశివరాత్రి, వైకుంఠ ఏకాదశి రోజున స్థానిక గ్రామాల ప్రజలు పూజాదికాలు నిర్వహిస్తుంటారు. ఇక ఆనాటి ధాన్యాగారాలలో ఇప్పటికీ ధాన్యం పొట్టు చెక్కు చెదరకుండా కనిపించటం విశేషంగా చెప్పవచ్చు.

దేవరకొండ దుర్గాన్ని శత్రు రాజులు ఎవరూ యుద్ధం ద్వారా స్వాధీనం చేసుకోలేకపోయినప్పటికీ, ఆనాటి రాజకీయ పరిణామాలు, పెరుగుతున్న శత్రువులు.. తదితర కారణాల చేత రెండవ మాదానాయుడి కాలంలో అక్కడి పాలకులు స్వచ్ఛందంగా కోటను వదలి, విజయనగర రాజులవద్ద ఆశ్రయం పొందినట్లుగా చారిత్రక కథనాల ద్వారా తెలుస్తోంది.

ఇదిలా ఉంటే.. భారత పురావస్తు శాఖవారు ఈ దేవరకొండ దుర్గాన్ని స్వాధీనం చేసుకున్నప్పటికీ, వారి నిర్లక్ష్యం కారణంగా విలువైన చారిత్రక సంపద అంతా శిథిలావస్థకు చేరుకుందనే విమర్శలు సర్వత్రా వినిపిస్తున్నాయి. దుర్గంలో గుప్త నిధులకోసం అనేకమంది ఎంతో విలువైన కళాఖండాలను సైతం ధ్వంసం చేస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో పురావస్తు శాఖ ఇప్పటికైనా మేల్కొని మన పూర్వీకుల జాతి సంపదను కాపాడి, తరువాతి తరాల వారికి అందుబాటులో ఉంచేందుకు కృషి చేస్తుందని ఆశిద్దాం.

అందాలొలికే అనంతగిరి

Anantagiri_Hills
రాష్ట్రంలో ఉక్కు నగరంగా పేరుగాంచిన సుందర నగరం విశాఖ. ఈ అందమైన తీర ప్రాంత పట్టాణానికి 40 కిలోమీటర్ల దూరంలో ఉంది అనంతగిరి. ప్రశాంతమైన ప్రకృతి నడుమ... దట్టమైన అడవులు, పచ్చని చెట్లు, సుందర దృశ్యాలతో రంజింపజేసే ఈ ప్రాంతం ప్రకృతి ప్రేమికులకు ఓ సరికొత్తలోకంలోకి తీసుకెళ్తుంది. అనంతగిరిలో వాతావరణం ఎల్లప్పుడూ శీతలంగా ఉండటమే కాకుండా ఎంతో నయానందకరంగా ఉండటం వలన ఇక్కడికి సంవత్సరం పొడవునా పర్యాటకుల తాకిడి ఉంటుంది. రాష్ట్రంలో పేరొందిన హిల్‌ స్టేషన్లలో ఒకటి ఈ అరకు అనంతగిరి. అంబరాన్ని తాకే కొండలు, ఆ కొండలపై పచ్చని చెట్ల సోయగాలు, ఏటవాలుగా ఉండే కనుమలు, లోయలు, జలపాతాలు పర్యాటకులను రంజింపజేస్తాయి. http://vizag.metromela.com/image/vizag/AnanthagiriResort.jpg
ముఖ్యంగా కొత్తగా పెళైన జంటలకు ఈ ప్రదేశం ఓ స్వర్గధామమంటే అతిశయోక్తికాదు. అరకు లోయకు 17 కిలోమీటర్ల దూరంలో, అక్కడి తిరుమల హిల్స్‌ పై భాగం లోని తూర్పు కనుమల్లో భాగంగా ఈ ప్రదేశం పర్యాటకుల మనసును దోచుకుంటోంది. తిరుమల గిరికి వెళ్లేందుకు ఘాట్‌ రోడ్డులలో చేసే ప్రయాణం అద్భుతంగా ఉంటుంది. ఎటుచూసి నా సుగంధ సుమధుర పరిమళాలను అందించే కాఫీ తోటల సౌందర్యం పర్యాటకులను ఆనంద సాగరంలో ఓలాడిస్తుంది. అంతేకాకుండా రకరకాల పండ్ల తోటలు మనసును పరవశింపజేస్తాయి. ఈ ప్రాంతంలో కాఫీ తోటలు, పండ్ల తోటలు మాత్రమే కాకుండా వనమూలికలు కూడా లభ్యమవటం విశేషం.http://incredibleap.com/images/vizag/Ananthagiri-Hills_1364.jpg
దక్షిణ బధ్రీనాథ్‌...
ముఖ్యంగా దక్షిణ బధ్రీనాథ్‌గా పేరుగాంచిన తిరుమలగిరి ప్రాంతంలో భవనాశి సరస్సును అత్యంత పవిత్రమైన తీర్థంగా సేవిస్తుంటారు ఇక్కడికి వచ్చే పర్యాటకులు. ఈ సరస్సు వల్లనే ఈ ప్రాంతానికి దక్షిణ బధ్రీనాథ్‌ అనే పేరు వచ్చిందని కూడా చెబుతారు. అలాగే అనంతగిరి నుంచి ముచికుందా నది పాయలుగా చీలి వేగంగా పరుగులు తీస్తూ అందరినీ ఆకట్టుకుంటోంది. అనంతగిరిలో కాఫీ తోటల పరిమళాలతోపాటు రకరకాల పూల తోటల సుగంధాలతో, పక్షుల కిలకిలారావాలతో, సూర్యోదయ-సూర్యాస్తమయ సమయాల్లో ప్రకృతి వింతశోభతో అలరారుతూ ఉంటుంది.

http://vizag.metromela.com/image/vizag/WaterfallsatAnanthagiri%20Hills.JPG
ఇక్కడ లోతుగా ఉండే లోయలలోకి వేగంగా దుమికే జలపాతాల సౌందర్యం, పలు రకాల పండ్లతో అలరించే మామిడి తోటలు కూడా పర్యాటకులకు ఓ వింత అనుభూతికి గురిచేస్తాయి.http://www.my-india-travelguide.com/pics/anantha-padmanabha-swamy-temple-ananthagiri-hills-andhra-pradesh.jpg
కోరిన కోరికలు తీర్చే... అనంత పద్మనాభుడు...
ప్రకృతి రమణీయతను విశేషంగా కలిగి ఉండడమే కాకుండా ఇక్కడికి వచ్చే యాత్రికులను భక్తి పారవశ్యంలో నింపుతుంది ఇక్కడి అనంత పద్మనాభస్వామి ఆలయం. ఆంధ్రా ఊటీగా స్థానికు లు ప్రేమగా పిలిచే ఈ ప్రాంతం ఎంతో ఆహ్లాదకరంగా ఉండటంతోపాటు ఇక్కడి ఎత్తైన ప్రాంతాలు, సేలయేర్లు, కొండలు, పెద్ద పెద్ద చెట్లు పర్యాటకులను కట్టిప డేస్తున్నట్లుగా ఉంటాయి.
http://www.crazy-cabs.com/images/ananthagiri%20road.jpg
ఇలా వెళ్ళాలి...
అనంతగిరికి చేరుకోవటం ఎలాగంటే... ఈ ప్రాంతానికి రైలు, రోడ్డు మార్గాల ద్వారా వెళ్లవచ్చు. శ్రీకాకుళం రైల్వే స్టేషన్‌ నుంచి 3 కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తే అనంతగిరి చేరవచ్చు. అలాగే ఈ ప్రాంతానికి విశాఖపట్నం నుంచి బస్సు సౌకర్యం కూడా కలదు. హైదరాబాద్‌, విశాఖపట్నం, ఇతర నగరాల నుంచి కూడా బస్సు సౌకర్యం కలదు. ఇక్కడ బస చేసేందుకు ప్రైవేటు కాటేజీలు, హోటళ్లు, ఇన్‌స్పెక్షన్‌ బంగళాలు అందుబాటులో ఉన్నాయి.

Tuesday, June 14, 2011

గోల్డ్ కోస్ట్... సందడే సందడి

డౌన్ అండర్‌గా పేరుపొందిన ఆస్ట్రేలియా చూడటానికి ప్లాన్ చేసుకొని, పోయిన మార్చి నెలలో నేనూ, మావారు మలేషియన్ ఎయిర్‌లైన్స్‌లో, కౌలాలంపూర్ మీదుగా బ్రిస్‌బేన్ చేరాం. మన కంటే అక్కడి టైం ఐదున్నర గంటలు ముందుకు ఉంటుంది కాబట్టి దిగగానే వాచీలో టైం పెంచేసి, కస్టమ్స్ క్లియరెన్స్‌కి వెళ్లాం. చెక్ ఇన్ లగేజీలోని అరిసెలు కస్టమ్స్ వాళ్ళ కళ్ళలో పడ్డాయి. ఇండియన్ కుక్కీస్ అని ఆవిడకు నచ్చచెప్పి బయటపడ్డాం.

ఆస్ట్రేలియాలో టాక్సీల కంటే వెనుక ట్రెయిలర్‌తో కోచ్‌లే ఎక్కువ వాడతారు. ట్రావెల్ ఏజెంట్ చెప్పినట్లుగా మా కోచ్ వచ్చేసింది. లగేజీ ట్రెయిలెర్‌లో వేసి ఎక్కి కూర్చున్నాం. మా డ్రైవర్ నవ్వుతూనే చెప్పాడు, ఈ దేశంలో సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే భారీగా ఫైన్ వేస్తారని. ఆ రాత్రికి మా బస బ్రిస్‌బేన్ నగరంలోనే. హోటల్ చేరేటప్పటికి బాగా రాత్రి అయింది. ఆస్ట్రేలియాలోని అన్ని హోటల్స్‌లో చెక్ ఇన్ అయ్యేటప్పుడు క్రెడిట్ కార్డులో 100 డాలర్లు లాక్ ఇన్ చేసి, మళ్ళీ మనం చెక్ అవుట్ చేసేటప్పుడు అవి రిలీజ్ చేస్తారు. మోంటన్ దీవిలోని టంగలూమా రెసార్ట్‌కి పొద్దునే బయలుదేరాం. ప్రతీచోట రూంతో బాటు ఫ్రీ బ్రేక్ ఫాస్ట్- మెనూ దాదాపు ఒకటే- బ్రెడ్, మఫిన్స్, కార్న్‌ఫ్లేక్స్, బటర్, జామ్స్, ఉడకబెట్టిన గుడ్లు, ఆమ్లెట్స్, హాఫ్ బ్రౌన్ అని వేయించిన బంగాళదుంప, రకరకాల పళ్ళు, జ్యూసులు, యోగర్ట్ అనబడే పెరుగు- రకరకాల ఫ్లేవర్లలో కాఫీ, టీ. నాన్‌వెజ్ ఐటెమ్స్ జోలికి వెళ్ళలేదు. వెదికి మరీ నీళ్ళు తెచ్చి తాగుతుంటే కొంతమంది వింతగా చూసేవారు.

మళ్ళీ ఒక కోచ్ ఎక్కాం, లగేజీతో సహా. ప్రతీ ఏజెంట్ ఒక విషయం గట్టిగా వక్కాణించి చెప్పారు. ఎక్కడ పిక్ అప్ చేయాలన్నా ఆ ప్రదేశంలో కనీసం పది నిమిషాలు ముందుగా వేచి ఉండాలని లేదా ఆ రోజు ట్రిప్ కాన్సిల్ అని. దారిలో ఇంకొంతమంది టూరిస్టులను పికప్ చేసుకుంటూ లాంచీలు ఆగే వార్ఫ్ దగ్గర మమ్మల్ని దింపాడు మా డ్రైవరు. అప్పటికే మేం ఎక్కాల్సిన టంగలూమా వైల్డ్ డాల్ఫిన్ రెసార్ట్ లాంచ్ వచ్చేసి ఉంది. టికెట్స్ చెకింగ్ చేశాక మా లగేజీ టాగ్స్ వేసి వారి బండిలో పెట్టేశారు. "హమ్మయ్య, మోత బాధ తప్పిందిరా నాయనా'' అనుకున్నాం. ముందే పాస్‌పోర్టులు, డబ్బు, కెమెరా, హాండీకాం, ఇతర ట్రావెల్ డాక్యుమెంట్లు అన్నీ ఒక బాగ్‌లో సర్దుకున్నాం. ట్రిప్ మొత్తం హచ్ వారి డాగ్‌లా మమ్మల్ని వదలకుండా అంటిపెట్టుకుని ఉంది ఆ బాగ్. అలా వారు తీసుకెళ్లిన మా లగేజీ రెసార్ట్‌లోని మా హోటల్ రూం బయట సాక్షాత్కరించింది. టూరిస్టులకు ఎంతో సౌకర్యవంతమైన ఏర్పాటు ఇది.

'కూక్కబుర్ర' పక్షులు

లాంచ్ ఎక్కి కాసేపు కింద టీవీ రూంలో, కాసేపు డెక్ పైన చుట్టూ ఉన్న నీళ్ళను చూస్తూ గంట ప్రయాణం గడిపేశాం. రెసార్ట్ వచ్చేస్తోందని దూరంగా మెరుస్తున్న ఇసుక చెప్పింది. అందరం దిగుతుండగానే పసుపు పచ్చటి పూలచొక్కాలు వేసుకుని రిసార్ట్ స్టాఫ్ మాకు స్వాగతం పలికారు. కొంతమంది మెడల్లో రంగురంగుల ప్లాస్టిక్ పూల దండలు వేశారు. టంగలూమాలోని సౌకర్యాల గురించి వివరించి అన్ని ప్రదేశాలను టూకీగా చూపించారు. మా రూం తొమ్మిదవ అంతస్థులో ఉంది. బాల్కనీలో నిల్చుంటే ఎదురుగా సముద్రం, చుట్టూ పచ్చని చెట్లూ ఉన్నాయి. ఆదివారం కావడంతో చాలామంది లోకల్ టూరిస్టులు నీటిలో ఈదుతూ, ఇసుకలో వాలీబాల్ ఆడుతూ ఉన్నారు. క్వాడ్ బైక్ టూర్స్‌లో నాలుగు చక్రాల బండి తోలడం, పారా సెయిలింగ్, జెట్ స్కైయింగ్ ఇలా అన్నీ పిల్లా పెద్దా అని తేడా లేకుండా ఎంజాయ్ చేస్తున్నారు.

మొదటగా మెరైన్ ఎడ్యుకేషన్ సెంటర్ చూశాం. రకరకాల జలచరాలు ఫోటోలు, వాటి వివరాలు ఉన్నాయి. రెసార్ట్ షాప్‌లో దినపత్రికలతో సహా సమస్త వస్తువులు దొరుకుతాయి. ఆస్ట్రేలియాలో విరివిగా కనిపించే కూక్కబుర్ర అనే పక్షుల్ని చూశాం. ఇవి అరిస్తే కోతులు అరిచినట్లు గోలగా ఉంటుంది. రెసార్ట్‌లో ఒక పక్క షిప్ రెక్ ఉంటే వెళ్ళాం. పనికిరాని ఓడల్ని కొన్ని తెచ్చి పెట్టారు. ఎండకు ఎండి, వానకు తడిసి అవి శిథిలాల్లా తయారయ్యాయి. వాటి పైకి వెళ్ళి ఇసుకలోకి పలకలాంటి దానిమీద జారడం (సాండ్ గ్లైడింగ్) చేశాం.

డాల్ఫిన్లకు మేత వేశాం

ఈ రిసార్ట్‌లో ఉన్న జెట్టీ దగ్గరకు ఎన్నో ఏళ్ళుగా మచ్చిక చేస్తున్న వైల్డ్ డాల్ఫిన్లు చీకటి పడుతుండగా వస్తాయి. వాటికి అప్పుడు ఫీడ్ ఇస్తారు. అది చూడడానికి వెళ్లాం. ట్రైనర్లు వచ్చి, కాస్త దూరంలో నిలబడి మైక్‌లో కామెంటరీ మొదలుపెట్టగానే ఒక్కొక్కటిగా డాల్ఫిన్లు రాసాగాయి వింత వింత శబ్దాలు చేస్తూ. అక్కడ ఉన్నవారందరూ చప్పట్లు కొట్టి వాటికి స్వాగతం పలికారు. ట్రైనర్సు మమ్మల్ని క్యూలో నిలబెట్టి, చేతులు శుభ్రపరచుకోవడానికి లిక్విడ్ డిటర్జెంట్, ఫీడ్ చేయడానికి చేపలు ఇచ్చారు. నడుములోతు సముద్రం నీటిలో మునిగి, ఆ లైట్ల వెలుతురులో చేపలను మేము అందిస్తుంటే అంత పెద్ద డాల్ఫిన్లు సుతారంగా వాటిని తీసుకుని తినేసి మళ్లీ వెనక్కు వస్తున్నాయి.

పొద్దునే పక్షుల సందడికి లేచి అలా బీచ్ వెంబడి నడుచుకుంటూ వెళ్ళాం. మసాజ్ పార్లర్లు, టెన్నిస్ కోర్ట్సు, టీటీ టేబుల్స్, ఆర్చరీ పాయింట్స్, స్విమ్మింగ్ పూల్స్- ఇలా అందరికీ ఏదో ఒక ఆనందాన్ని అందించే ప్రయత్నం జరుగుతోంది. సముద్రం నీటిని రీ సైకిల్ చేస్తూ ఎంతో చక్కగా రెసార్ట్‌ని ఎవర్‌గ్రీన్‌గా మెయిన్‌టెయిన్ చేస్తున్నారు. కాసేపు పెలికన్స్ అనే పక్షులను చూసి, వాటికి మేత వేశాం. లాంచ్‌లో గోల్డ్‌కోస్ట్‌కి వెళ్ళాం. అందమైన బీచ్‌లు, బోటింగ్ చేయడానికి కెనాల్ సిస్టమ్స్, ఆకాశాన్నంటే సౌధాలు ప్రశాంతమైన రెయిన్ ఫారెస్ట్, పబ్స్, 24 గంటల షాపింగ్ కోసం ఎన్నో మాల్స్, వన్యప్రాణుల పార్కులు, రకరకాల థీం పార్కులు, వెరసి గోల్డ్ కోస్ట్ ఒక భూతల స్వర్గం. ఇక్కడ మా బస హోటల్ గ్రాండ్ చాన్సిలర్‌లో. బాల్కనీ నుండి చూస్తుంటే పరిసరాలు ఎంతో అందంగా కనిపించాయి. 'క్యూ ప్లస్' అని ప్రపంచంలో అతి ఎత్తయిన నివాసయోగ్యమైన టవర్ చూశాం.

టాంబోరీన్ రెయిన్ ఫారెస్ట్

మరుసటిరోజు టాంబోరీన్ రెయిన్ ఫారెస్ట్‌కి వెళ్ళాం. చిక్కటి అడవిలో నడుస్తూ, రకరకాల చెట్లను చూస్తూ, అతి ఎత్తయిన చెట్లమీద నిర్మించిన కాంటీ లీవర్ బ్రిడ్జి ఎక్కాం. అక్కడ నుండి వ్యూ అద్భుతంగా ఉంది. రంగురంగుల సీతాకోక చిలుకలు, అక్వేరియం చూశాం. అక్కడినుంచి దగ్గరలోని గుహలను చూడడానికి వెళ్ళాం. ఆ గుహలో మిణుగురు పురుగుల్లాంటి గ్లోవార్మ్స్‌ని చూశాం. రాత్రిపూట మాత్రమే కనిపించే జంతువులను, పురుగులను చూశాం. మా హోటల్ దగ్గర ఉన్న 'రిప్లీస్ బిలీవ్ ఇట్ ఆర్ నాట్' అని ప్రపంచంలోని వింతలన్నీ పొందుపర్చిన ఆడిటోరియం, దానికి దగ్గరలోని హాంటెడ్ భవనం చూశాం. అందులో అతి బీభీత్సమైన, భయంకరమైన విశేషాలున్నాయి. అందులో దెయ్యాలు, భూతాలు తిరిగే స్మశాన వాటికలు, శవాల గదులు, మాంసాహారులు, షార్క్ చేపలు, విషం కక్కే పురుగులు, పాములు ఉన్నాయి.

ఒకరోజు పొద్దునే మూవీ వరల్డ్‌కి వెళ్ళాం. పిల్లలు పెద్దలతో క్రిక్కిరిసి ఉంది ఆ థీం పార్క్. టిక్కెట్టు ధర కొంచెం ఎక్కువే కానీ రైడ్స్ అన్నీ ఫ్రీ. కార్టూన్ క్యారెక్టర్స్ ఆధారంగా ఉన్నాయి రైడ్స్. బాట్‌మాన్, బాట్‌వింగ్, సూపర్‌మాన్, లూనీ ట్యూన్స్. పిల్లల కార్టూన్ వేషాలు వేసుకుని కొందరు పెద్దలు ఫోటోలకు పోజులు ఇస్తున్నారు. ఆ తరువాత 'జర్నీ టు సెంటర్ ఆఫ్ ఎర్త్' అనే 4డి సినిమా చూశాం. ఒక యువశాస్త్రవేత్త తన మేనల్లునితో కలిసి భూమి లోపలికి వెళ్ళడం, అక్కడ వారు మాంసాహార మొక్కలు, డైనోసార్లు, లోయలు, మంటలు, నదులు ... వీటి నన్నింటినీ అధిగమించి మళ్ళీ పైకి రావడం- ఇవన్నీ ప్రత్యక్షంగా చూసిన అనుభూతి కలిగింది ఆ సినిమా చూస్తుంటే. మొత్తానికి మా మూవీ వరల్డ్ ట్రిప్ చాలా సందడిగా ముగిసింది.

పెంగ్విన్స్ లోకంలో విహరించాం

మరుసటి రోజు సీ వరల్డ్‌కి వెళ్ళాం. 1958లో ప్రారంభమైన ఈ పార్క్ గోల్డ్ కోస్ట్‌లో చాలా పాపులర్. ఎంట్రీ దగ్గర చిన్న మేప్ ఇచ్చారు. దానిని క్షుణ్ణంగా చదివి, దగ్గరలో ఉన్న స్కైవే స్టేషన్‌లో గోండోలా ఎక్కి పార్క్ అవతలి వైపునకు వెళ్ళాం. టచ్ పూల్, స్నోర్కలింగ్, డైవింగ్ లగూన్ చూసి, షార్క్ బే వెళ్ళాం. గ్లాస్ బాటం బోటు ఎక్కి గైడ్ చెప్పే వివరాలు వింటూ అక్కడ ఉన్న షార్క్‌లను చూశాం. పక్కనే పోలార్ బేర్ ప్రదేశం ఉంది.

అతి శీతలమైన ప్రదేశాలలో ఉండాల్సిన ఎలుగుబంట్లను తెచ్చి ఎంతో చల్లని అనువైన ప్రదేశం వాటి కోసం ఏర్పాటు చేశారు. ప్రపంచంలో అతి పెద్దదైన పెంగ్విన్ పాయింట్‌కి వెళ్ళాం. పరిశుభ్రమైన నీటిలో చకచకా ఈదే ఈ పక్షులు నేలపై రొమ్ము విరుచుకుని నడవడం ఎంతో బాగుంది. దగ్గరల్లో సీ వరల్డ్ థియేటర్‌లో ఒక సినిమా చూశాం. పెంగ్విన్ పక్షి ఒకటి డాన్సింగ్ కాళ్ళతో పుడితే మిగతావి దానిని వెలివేస్తాయి. అదే వాటికి తిండి సంపాదించి పెట్టి, శత్రువుల బారి నుండి కాపాడుతుంది. 4డి గ్లాసెస్ పెట్టుకుని కదిలే కుర్చీలలో కూర్చుని మధ్య మధ్య నీటి తుంపర్లు పడుతుంటే తడుస్తూ పెంగ్విన్స్ లోకంలో విహరించాం.

తరువాత మోనో రైలు ఎక్కి పార్కంతా చుట్టేశాం. పార్క్‌లో పిల్లలకు ప్రత్యేకమైన రైడ్స్, గేమ్స్, రీసెర్చి సౌకర్యాలు, హెలికాప్టర్ సౌకర్యం ఉన్నాయి. మేం చూసిన థీం పార్క్‌లలో ఒకటి గమనించాం. టూరిస్టులు వారి పిల్లల్ని ఎంతో ఓపికగా చూసుకోవడం, వికలాంగులు, వృద్ధులు నిరాశ పడకుండా వీల్ చైర్లలో అన్ని ప్రదేశాలు తిరుగుతూ ఎంతో ఆనందించడం.
మొత్తానికి నాలుగు రోజులు మమ్మల్ని ఎంతో అలరించిన గోల్డ్ కోస్ట్ వదిలి, ఆస్ట్రేలియాలోని ఇంకో నగరానికి పయనమయ్యాం.


- డా ఎం. రమణి,
98491 34064