అవి కొండలే కావచ్చు... కాని మనసుల్ని దోచే అరు దైన కళాఖండాలు ఆ కొండల మాటున దాగి ఉన్నాయి. అవి రాళ్లే కావచ్చు... కాని జవ్వనులైన జవరాళ్లలా నాట్యం చేస్తాయి. ప్రపంచానికి భారతదేశం అందించిన వరాలీ శిల్పాలు. నిజజీవితంలోని విభిన్న కోణాల్ని ఇక్కడి శిలలు అణువణువునా ఆవిష్కరిస్తున్నాయి. ఛందేలా రాజపుత్రుల కృషికి ఇవి దర్పణాలుగా నిలుస్తాయి.

ఉత్తర భారతంలో ఇతర సాంస్కృతిక స్థానాల వలె ఖజురాహో దేవాలయాలు క్రీశ 1100-1400 ల మధ్య ముస్లిం చొరబాటు దారుల చేత నేలమట్టం కాలేదు. చాలా కాలం నిర్లక్ష్యం తరువాత 19 వ శతాబ్దం లో బ్రిటీష్ వారు వీటిలో కొన్నింటిని కనిపెట్టారు. తవ్వకాలు మొదలు పెట్టారు. జులై-మార్చి మధ్య కాలం ఖజురహో సందర్శించడానికి అనువైన సమయం. ఈ పురాతన ఖజురహో దేవాలయాలు యునెస్కో వారసత్వ సంపదగా గుర్తింపబడినాయి. ఇక్కడ నిర్మించిన దేవాలయాలు, హిందూ మరియు జైన దేవాలయాల సమూహం. దీనికి ఆ పేరు హిందీ భాష నుండి మూలంగా వచ్చినది. హిందీలో ఖజూర్ అనగా ఖర్జూరము.
శృంగార జగత్తు ఖజురహో...

కాలక్రమంలో ఈ గ్రామం చుట్టూ చెట్లు పెరిగిపోయి ఒక అడివిలా మారిపోయింది. 1839 లో మళ్లీ ఖజురహో వెలుగు చూసింది. ఆనాడు చందేలా రాజులు మొత్తం 80 దేవాలయాలు నిర్మించగా నేడు 22 దేవాలయాలు మాత్రమే కన్పిస్తున్నాయి. ఈ ఆయలయాల మీద ఉన్న శిల్పాలు అపురూపమైనవే కాదు శృంగారాన్ని ఉద్దీపింపజేసేవిగా ఉంటాయి. వెయ్యేళ్లపాటు ఇంతటి కళా ప్రాశస్త్యాన్ని తనలో దాచుకున్న ఖజురహోను మరింతగా ప్రాచుర్యంలోకి తేవడానికి మధ్యప్రదేశ్ ప్రభుత్వం ప్రపంచవ్యాప్తంగా పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తోంది. ఇందుకోసం ఈ చిన్నగ్రామంలో విమానాశ్రయాన్ని కూడా ఏర్పాటు చేయడం విశేషం.
ఆలయాలకు ఆలవాలం...

ఘంటాయ్ గుడి: ఇది కూడా జైన దేవాలయం. ఇందులో వర్ధమాన మహావీరుడి తల్లి యొక్క 16 స్వప్నాల్ని ఆవిష్కరించే చిహ్నాలు ఉన్నాయి. గరుడ పక్షిపై ఉన్న జైన దేవత చిహ్నం కూడా ఇక్కడ ఉంది.
పార్శ్వనాధ దేవాలయం: ఇక్కడ ఉన్న జైన దేవాలయాల్లో కెల్లా అతిపెద్ద దేవాలయం ఇది. ఉత్తరం దిక్కున ఉన్న కుడ్యాలపై చిత్రాలు ఎంతో ఆకర్షణీయంగా ఉన్నాయి. నిజజీవితంలోని రోజువారీ కార్యక్రమాల్ని ఇవి ప్రతిబింబిస్తాయి. మొదటి తీర్ధాంకరుడైన ఆదినాధుడి వృషభానికి ఎదురుగా ఉన్న సింహాసనం ఎంతో ఆకర్షణీయంగా ఉంది. 1860లో ఇక్కడ పార్శ్వనాధుడి విగ్రహాన్ని ప్రతిష్ఠించారు.
చతుర్భుజ దేవాలయం: విష్ణుమూర్తిని గర్భగృహంలో కలిగిన దేవాలయమిది.
దూల్‌దాహ దేవాలయం: ఇది శివాలయం. అప్సర, కిన్నెర కింపురుషాదుల కూడ్య చిత్రాలు చాలా ఆకర్షణీయంగా ఉంటాయి.
మాతానాగేశ్వర దేవాలయం: ఇది శివాలయం ఎనిమిది అడుగుల ఎత్తున్న లింగం ఇక్కడ ప్రసిద్ధి.
లక్ష్మణ దేవాలయం: ఇది వైష్ణవాలయం. ఇక్కడ త్రిమ్తూరులైన బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల విగ్రహాలు ఉన్నాయి. విష్ణుమూర్తి అర్ధాంగి లక్ష్మీదేవి విగ్రహం కూడా ఉంది. విష్ణుమూర్తి అవతారాలైన నరసింహావతారం, వరాహావతరాలతో కూడిన విగ్రహం ప్రసిద్ధి చెందింది. ఇలాంటి వరాహావతారం - వరాహ దేవాలయంలో కూడా - తొమ్మిది అడుగుల ఎత్తుతో అలరారుతోంది.
విశ్వనాథ దేవాలయం: మూడు తలల బ్రహ్మ విగ్రహం ఇక్కడ ఉంది.
చిత్రగుప్త దేవాలయం: ఇది సూర్య దేవాలయం. ఉదయించే సూర్యుడిని దర్శిస్తూ తూర్పు ముఖాన ఈ దేవాలయం ఉంది.
చౌంసత్ యోగిని దేవాలయం: ఖజురహోలోని గ్రానైట్‌తో తయారైన ఏకైక దేవాలయం ఇది. అన్నింటిలోకెల్లా అత్యంత ప్రాచీనకాలానికి అంటే క్రీశ900 శతాబ్దానికి చెందింది. ఇది కాళిమాతకు చెందిన ఆలయం.
కాందారియ మహాదేవ్ దేవాలయం: ఖజురహోలోని అతిపెద్ద దేవాలయం ఇది. దీని ఎత్తు 31 మీటర్లు. ఇది శివాలయం.
నృత్యోత్సవాలు...
ఖజురహో లోని శిలలపై చెక్కిన శిల్పాలు ప్రదర్శించే నృత్యభంగిమలు అన్నీ ఇన్నీకావు. అలా నాట్యాలాడే శిల్పాలను తలదన్నే రీతిలో ఖజురహో నృత్యోత్సవాలు ఏటా కన్నుల పండువగా జరుగుతాయి. భారతీయ శాస్ర్తీయ నృత్య కళాకారులకు ఈ ఉత్సవాలు ప్రధాన వేదికగా నిలుస్తాయి. ఇవి ఏటా ఫిబ్రవరి / మార్చిలో జరుగుతాయి. వారం రోజుల పాటు జరుగే ఈ ఉత్సవాలకు దేశవిదేశాల నుండి పర్యాటకులు విశేషంగా తరలివస్తారు.
చూడాల్సినవివే...

ఎలా చేరుకోవాలి?
రోడ్డు మార్గం: సాత్నా, హర్పలూర్, ఝాన్సీ, మహోబా నుంచి ఖజురహోకు బస్సులు ఉన్నాయి.
రైలు మార్గం: ఖజురహో నుంచి 94 కిలోమీటర్ల దూరంలో హర్పలూర్, 61 కిలోమీటర్ల దూరంలో మహోబా నుంచి రైళ్లు ఉన్నాయి. ఢిల్లీ, చెన్నై నుంచి వచ్చే యాత్రీకులకు ఝ్సానీ నుంచి రైలు సదుపాయాలు ఉన్నాయి. ముంబై, కోల్‌కతా, వారణాసిల నుంచి వచ్చే వారిి ముంబై అలహాబాద్ మార్గం ద్వారా సాత్నా నుంచి ఉన్నాయి.
స్థానిక రవాణా మార్గాలు: ఖజురహోలోని దేవాలయాన్ని సందర్శించాలంటే స్థానికంగా ఉండే రవాణా మార్గాలపై ఆధారపడక తప్పదు. ఇక్కడ ప్రధా నంగా సైకిళ్లపై స్థానిక ప్రాంతాల్ని సందర్శించే పర్యాటకులు ఎక్కువ. కాబట్టి సైకిల్ రిక్షాలు, సైకిళ్లు అద్దెకు దొరకుతాయి.
No comments:
Post a Comment