విహారాలు

India

Gamyam

Wednesday, July 13, 2011

తనివితీరని అందాల గని... తవాంగ్‌

భారతదేశంలో సూర్యుడు మొదటసారిగా ఉదయించే ప్రాంతమైన అరుణాచల్‌ ప్రదేశ్‌లో హిమాచల్‌ పర్వతాలపై ఉంది తవాంగ్‌. అరుణాచల్‌ ప్రదేశ్‌లో బౌద్ధులు అధికం. దీంతో ఈ ప్రాంతంలో అతి ప్రాచీన బౌద్ధ ఆశ్రమాలకు ఆలవాలంగా వెలుగొందుతోంది.

Tawang 

తవాంగ్‌ హిమాలయ పర్వతాలపై దాదాపు 12వేల ఆడుగుల ఎత్తున ఉంది. తవాంగ్‌ అంటే ఎంచుకున్న గుర్రం. తవాంగ్‌లో టిబెటన్ల సంఖ్య ఎక్కువ. టిబెటన్లు ఎప్పుడూ ఇక్కడ ప్రార్ధనలు చేస్తూ బౌద్ధమత ఆరాధనలో నిమగ్నులవుతారు.

తవాంగ్‌ యుద్ధ స్మారకం...
భారత-చైనాల మధ్య 1962లో జరిగిన యుద్ధంలో చైనా సైనికులను ఒంటరిగా పోరాడిన భారతీయ సైనికుడి వీరమరణం పొందిన చోట స్మారకాన్ని ప్రభుత్వం ఏర్పాటుచేసింది. ఈ స్మారకం సీలా పాస్‌లోని జశ్వంత్‌ఘర్‌లో ఉంది.


photo

War Memorial; Tawang

Tawang is in the western part of Arunachal Pradesh, India. With an average altitude of 10,000 feet, this town is 340 km from Tezpur, a picturesque city of Assam, India. Famous for its Buddhist monastery & pristine beauty, Tawang is a tourist's paradise. With more than 100 lakes, almost all of which becomes frozen in winter, and beautiful peace-loving people (mostly of Monpa tribe) with their exotic costume & customs, Tawang is a life-time experience.
The war Memorial at Tawang was erected in the memory of more than 2000 Indian soldiers who laid their lives in defending Tawang in the Sino-Indian war of 1962.

తవాంగ్‌ ఆశ్రమం...
బౌద్ధమతంలో మహాయాన వర్గం వారు ఇక్కడ ఆశ్రమాన్ని ఏర్పాటుచేసుకున్నారు. లాసా తర్వాత అతి ప్రాచీన ఆశ్రమం తవాంగ్‌లో మాత్రమే ఉంది. తవాంగ్‌ ఆశ్రమాన్ని మెరాగ్‌ లామా లోడ్రీ గిమాస్ట్సో నిర్మించారు. ఈ ఆశ్రమం 1681లో నిర్మించారని చరిత్ర చెబుతోంది. ఆశ్రమం పక్కనే బౌద్ధ సన్యాసులు నివసించేందుకు వీలుగా వసతి గృహాలు ఏర్పాటుచేశారు. తవాంగ్‌ ఆశ్రమంలో ప్రాచీన గ్రంధాలయంతో పాటుగా వస్తు ప్రదర్శనశాల కూడా ఉంది. దాదాపు 500 మంది బౌద్ధ సన్యాసులకు వసతి కల్పించేది తవాంగ్‌ ఆశ్రమం. రాత్రిపూట తవాంగ్‌ ఆశ్రమాన్ని విద్యుదీప కాంతులతో చూస్తే చాలా అందంగా ఉంటుంది. ఆశ్రమంలో లోపల 8 మీటర్లు ఎత్తైన బౌద్ధ విగ్రహం ఉంది. లాసాలోని పోతలా ఆశ్రమం తర్వాత అతిపెద్దది తవాంగ్‌ ఆశ్రమం.
http://farm1.static.flickr.com/232/501887126_ba41fdb8b8.jpg
ఉర్గెలింగ్‌ ఆశ్రమం...
ఆరవ దలైలామా ఉర్గెలింగ్‌ ఆశ్రమంలో పుట్టాడని బౌద్ధులు భావిస్తారు. ఈ ఆశ్రమం 14వ శతాబ్దం నుంచి ఉందని బౌద్ధులు అంటుంటారు. తవాంగ్‌ పట్టణం నుంచి ఐదు కిలోమీటర్ల దూరంలో ఉర్గెలింగ్‌ ఆశ్రమం ఉంది.
https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEjaSqHp6qj9xW4_aB_mokbk_-VfAu0VDKBLWD0MxY66N7h78kgkUpxXgOOjhtfZhgHy-4XJCLwqO-4GXPKbK2eMnqrFaySMkbZ42K-1BFZRcW-P_FEhNFEqbB_nHbMktfZRUKHnD_etlCIW/s1600/monastry.jpg
తవాంగ్‌ స్వర్ణ బౌద్ధ స్థూపం...
చైనా సరిహద్దు వద్ద ఉన్నది తవాంగ్‌ స్వర్ణ బౌద్ధ స్థూపం. దీనినే తవాంగ్‌ బౌద్ధ మఠం అని కూడా పిలుస్తారు. తవాంగ్‌ను అధికారికంగా భారత్‌ తమ భూభాగంలోకి గతంలో కలుపుకున్నప్పటికీ 2007లో అది తమదే నంటూ చైనా వివాదాన్ని లేవదీసింది. ఇక్కడే 6వ దలైలామా జన్మించాడన్న కారణంతో అది మాదే అని చైనా అంటోంది. ప్రస్తుత దలైలామా మనగడ్డపై ప్రవాస జీవితం గడుపుతున్నాడన్న విషయాన్ని చైనా మరుస్తోంది.
http://farm4.static.flickr.com/3425/3230411364_d069dd486b.jpg
బ్రిటీష్‌వారు పోతూపోతూ భారత్‌-చైనాలు విభజించటానికి మెక్‌మోహన్‌ రేఖను సరిహద్దుగా మార్చారు.దానితో తవాంగ్‌ మఠము మనకు దక్కింది. అయినప్పటికీ అరుణాచల్‌ ప్రదేశ్‌లోని ఎక్కువ ప్రాంతాలు తమదేనంటూ చైనా వాదిస్తోంది. ఒకప్పుడు ఈ ప్రాంతాన్ని ఈశాన్య సరిహద్దు ఏజెన్సీగా పిలిచేవారు.ఇప్పటిదాకా ఉన్న రికార్డు ప్రకారం తవాంగ్‌ 1951 వరకూ టిబెట్‌ ప్రభుత్వ హయాంలో ఉండేది.స్థానిక అరుణాచల వాసుల వాదన ఏమిటంటే భారత్‌తో ఉండాలన్నది తమ Brahmaputra from Tezpurనిర్ణయం అంటారు. వారు హిందీ పాటలు, వినడం, మాట్లాడటం లేదా అర్థం చేసుకోవడం తెలుసు. అసోం భాషను తాము కనుగొన్నామని అంటారు. బాహ్య ప్రపంచంతో ఈశాన్యంలోని అసోంతో సంబంధం పెట్టుకున్నప్పుడు ఈ భాష ఏర్పడిందంటారు.

తవాంగ్‌ మఠం సముద్రమట్టానికి 3500 మీటర్లు ఎగువన 400 సంవత్సరాలు క్రితం ఏర్పడింది. దలైలామాకు చెందిన మహాయాన బౌద్ధంలోని గాలుపా వర్గానికి చెందిన అనుబంధం తవాంగ్‌. ఇందులో 700 మంది సన్యాసులు నివశించవచ్చు. ఈ మఠంలో బుద్ధుని అవశేషాలు కూడా ఉన్నాయని ప్రతీతి.
మఠానికి అనుబంధంగా వస్తు ప్రదర్శనశాల కూడా ఉంది. ఇందులో ప్రాచీన తాళపత్ర గ్రంధాలు మరియు విలువైన పురాతన వస్తువులు వంటివి ఉన్నాయి. దలైలామా నేతృత్వంలో 1997లో పూర్తిగా దీనిని ఆధునీకరించారు. ఇక్కడి స్థానిక ప్రజలు మోన్పాస్‌ అంటారు. వీరు రాళ్లతో కట్టిన గృహాల్లో నివశిస్తూ వ్యవసాయం చేసుకుంటారు. టిబెట్‌ తరహా నేత పనులు వీరు చేస్తుంటారు.


తవాంగ్‌కు ప్రయాణించే మార్గంలో తేజ్‌పూర్‌ వస్తుంది. ఇది అసోంలో చాలా చిన్న పట్టణం. అరుణాచల్‌లోని మరో బౌద్ద మఠం బొమిడిలాకు వెళ్లే మార్గంలో ఉంది తేజ్‌పూర్‌. బహ్మపుత్రా నది ఎడమ గట్టున ఉంది తేజ్‌పూర్‌. తేజ్‌పూర్‌ గురించి చెప్పాలంటే 1962 నాటి చరిత్రలోకి వెళ్లాలి. చైనా పరిభాషలో దీనిని హిమాలయ తప్పు సంవత్సరం అంటారు. చైనా సైనికులు భారత సరిహద్దును దాటి కాల్పులు జరిపారు. ఈ సమయంలో తేజ్‌పూర్‌లో ఉన్న భారత ఆర్మీ తిప్పికొట్టింది.

ఎలా చేరుకోవాలి...
విమాన మార్గం: తేజ్‌పూర్‌ విమానాశ్రయం (320 కి.మీ)
రైలు మార్గం: రంగపార సమీపంలో రైల్వే స్టేషన్‌. ఈ మార్గంలో మీటర్‌ గేజి రైళ్లు రంగియా నుంచి నడుస్తాయి. రంగియా-గౌహతిల మధ్య దూరం 60 కిలోమీటర్లు.
రహదారి మార్గం: తేజ్‌పూర్‌ (320 కి.మీ.), బొమిడిలా (185 కి.మీ.), దిరాంగ్‌ (143 కి.మీ.). తేజ్‌పూర్‌ నుంచి తవాంగ్‌కు చేరుకోవటానికి 13 గంటల సమయం పడుతుంది. మార్గమధ్యంలో రాత్రిపూట బొమిడిలా లేదా దిరాంగ్‌లలో బస చేయాల్సి ఉంటుంది. తవాంగ్‌కు వెళ్లే మార్గంలో 14వేల అడుగుల ఎత్తున ఉన్న సీలా పాస్‌ అందాలను తనివితీరా చూడవచ్చు. 

1 comment:

  1. Baa Chepparu Tawang gurinchi....... inkha eamainaa untey post cheyandi...... teliyani vallaki telustai elanti vishayalu............Keep going Ramanaraju CGV..............

    ReplyDelete