విహారాలు

India

Gamyam

Tuesday, July 5, 2011

కోటప్పకొండ... ‘ప్రభలు’...

కోటప్పకొండ.. దాదాపు ఈ పేరు చాలామందికి సుపరిచితం. ఇక్కడ త్రికూటేశ్వరుడు.. యల్లమంద కోటయ్యగా పూజలందుకుంటున్నాడు. ఆధ్యాత్మిక ప్రదేశంగానే కాకుండా.. పర్యాటకకేంద్రంగా కూడా ఎంతో ప్రసిద్ధిగాంచిన దేవాలయం.. శివరాత్రి పర్వదినం నాడు మాత్రం.. భక్తులతో కిటకిటలాడుతూంటుంది. 
ఈ కోటప్పకొండ విశేషాల గురించి తెలుసుకుందాం...

templesగుంటూరు జిల్లా.. నరసారావుపేట, చిలకలూరిపేట పట్టణాలకు అతి సమీపంలో ఉన్న త్రికూటేశ్వర స్వామి దేవాలయంలో.. శివరాత్రి సందర్భంగా.. జరిగే ప్రభల సంబరం అత్యంత పేరు విశిష్టమైన జాతర. ఈ ఉత్సవాన్ని చూడడానికి చుట్టుపక్కల గ్రామాల నుండే కాక.. రాష్ట్రం నలుమూలల నుండి భక్తులు ఎక్కువ సంఖ్యలో వస్తారు. చిన్న చిన్న ప్రభల నుండి.. దాదాపు డెబ్బై, ఎనభై అడుగుల ఎతైన ప్రభలు.. శివరాత్రి సందర్భంగా కోటప్పకొండకు తీసు కొస్తారు. వీటిని ట్రాక్టర్లు, ఎడ్లబండ్ల లో.. డప్పులు, బ్యాండు, రికార్డింగ్‌ డ్యాన్సులతో.. ఇక్కడి తీసుకొస్తా రు. ఈ సందర్భంగా.. కొంత మంది పగటి వేషాలలో భక్తు లను అలరిస్తారు. ఒక్కొక్క ప్రభను ఒక్కో రకంగా అలంకరించి కొండ క్రింద పొలాల్లో ఉం చుతారు. ఇవి పెద్దవే వందల సంఖ్యలో ఉంటాయి. చిన్నవయితే లక్షల సంఖ్యలో కనుపిస్తూ, కొండ పైభాగమునుండి చూసేవారికి సముద్రంలొ తెరచాపల్లా కనువిందు చేస్తూఉంటాయి.

త్రికూట పర్వతాలయం...
shivass ఈ దేవాలయ శిఖరం.. మూడు విభాగాలుగా ఉంటుంది. ఈ క్షేత్రం మొదటి కొండపై ముసలి కోటయ్య గుడి ఉంది. ప్రస్తుతం ఇది శిథిలావస్థలో ఉంది. రెండవది.. త్రికోటేశ్వరస్వామివారి దేవాలయము కలది. ఇక్కడ ఎర్రగా ఉండే కోతులు ఒక ప్రత్యేకత. గుడి పరిసరాలలో భక్తులు ఇచ్చే ప్రసాదాలను తీసుకొంటూ ఒక్కోసారి లాక్కుంటూ తిరుగుతూ సండడి చేస్తాయి. ఇక్కడ ఒక పెద్దపుట్ట, నవగ్రహాలయం, ధ్యాన మందిరం, దేవాలయ వెనుక బాగంలో రెస్ట్‌ రూం ఉన్నాయి. ఇక మూడవ భాగమైన కొండ క్రింద బొచ్చు కోటయ్యగారి మందిరం, కళ్యాణ కట్ట, సిద్ధి వినాయక మందిరాలున్నాయి.

వసతి, రవాణా సౌకర్యాలు...
కొండపై టీటీడీ సత్రం, ప్రభుత్వ అతిథి గృహంతో పాటు.. కొండ దిగువన.. చాలా ఏళ్ళ క్రితం నిర్మించిన బసవ మందిరం ఉన్నాయి. కోటప్పకొండకు దగ్గరలో ఉన్న నరసరావుపేట పాత బస్‌స్టాండ్‌, కొత్త బస్‌ స్టాండ్‌ల నుండి ప్రతి అరగంటకు ఇక్కడకు బస్సు సౌకర్యం ఉంది. ఇవేకాక జీపులు, ఆటోలు లాంటి ప్రైవేట్‌ వాహనాలు సైతం.. ఎప్పుడూ అందుబాటులో ఉంటాయి.

No comments:

Post a Comment