
జీవజలం...

చూడాల్సిన ప్రదేశాలు...
సింధులోయ నాగరికత చిహ్నాలెన్నింటినో లడక్.. తనలో దాచుకున్నది. లడక్‌లోని లెహ్ ప్రాంతానికి ఎంతో చారిత్రక ప్రాధాన్యం ఉంది. 17వ శతాబ్దంలో సెంగె నంగ్యాల్ ఇక్కడ నిర్మించిన తొమ్మిదంతస్తుల రాజసౌధం ఇప్పటికీ చెక్కుచెదరకుండా ఉంది. ఇండస్‌కు కొన్ని కిలోమీటర్ల దూరంలో ఉన్న ‘షె’ పట్టణంలో ఎన్నో రాజభవనాలు, పురాతన ఆలయాలు ఉన్నాయి. వీటిలో చాలా భవనాలను 1980లో పునర్‌నిర్మించారు. దీనికి సమీపంలోనే ఉన్న బాస్గో, టింగ్మోస్గాంగ్ ప్రాంతాలు 15వ శతాబ్దంలో ఓ వెలుగు వెలిగాయి. అప్పటి వైభవానికి చిహ్నంగా శిథిలావస్థలో ఉన్న కట్టడాలు, ఆలయాలు ఈ ప్రాంతంలో కనబడతాయి.

కర్టసీ : సూర్య Daily
No comments:
Post a Comment