ఆకాశాన్నంటే.. పర్వతాలు.. పాతాళాన్ని తలపించే లోయలు.. పచ్చదనంతో కళకళలాడే.. పచ్చికబయళ్ళతో పర్యాటకులను అలరించే ప్రకృతి సోయగాలకు ఆలవాలం నాగాలాండ్.. దేశంలో అత్యధికంగా గిరిజన జాతులు ఉన్న నాగాలాండ్ పర్వతప్రాంతాల్లో.. ప్రకృతి మనోహరంగా శోభిల్లుతోంది.
భారతదేశంలో ఆంగ్లభాష అధికారభాషగా ఉన్న ఒకే ఒక్క రాష్ట్రం నాగాలాండ్. బర్మా - టిబెట్ దేశాలకు చెందిన సుమారు 16 జాతులకు చెందిన గిరిజన జాతులకు ఈ రాష్ట్రం ఆలవాలం. చిత్ర విచిత్ర వేషధారణలతో.. తమదైన వింత ఆచారాలతో పర్యాటకులను వీరు అబ్బురపరుస్తుంటారు. చేతులకు కంకణాలు, ఛాతీకి కవచాలు, చేతిలో రంగురంగుల ఆయుధాలు పట్టుకుని తిరుగాడే గిరిజనులు నాగాలాండ్‌లో కోకొల్లలు. జాతీయ రహదారిపై దిమాపూర్ నుంచి మూడు గంటలు ప్రయాణిస్తే నాగాలాండ్ రాజధాని కోహిమా చేరుకోవచ్చు. సముద్రమట్టానికి 1,495 మీటర్ల ఎత్తులో ఉండే ఈ కోహిమాకు ఎంతో చారిత్రక ప్రాధాన్యం ఉంది. రెండో ప్రపంచ యుద్ధ కాలంలో జపాన్ సేనలు కోహిమాను ఆక్రమించి, బసచేశాయి. ఆ సమయంలో ప్రాణాలు పోగొట్టుకున్న అమరవీరులకు గుర్తుగా నిర్మించిన స్మారక కేంద్రం పర్యాటకుల కంటతడి పెట్టిస్తుంది.
చూడాల్సినవివే...
నాగాల జీవన పద్ధతులను, చరిత్రనూ కళ్ళకు కట్టినట్టు చూపే స్టేట్ మ్యూజియం టూరిస్టులు చూడాల్సిన ప్రదేశాలలో మొదటిది. చారిత్రక ప్రాధాన్యం ఉన్న విగ్రహాలు, స్థూపాలు, నగలు, తోరణాలను ఇక్కడ పొందుపరిచారు. ఒకప్పుడు పండుగలప్పుడు వాడిన అతిపెద్ద డ్రమ్ (డప్పువాయిద్యం) ను ప్రత్యేకంగా ఒక షెడ్డులో భద్రపరిచారు. ఈశాన్య రాష్ట్రాలలో కనిపించే అరుదైన పక్షులు.. ప్రత్యేకంగా నిర్మించిన ఒక హాలులో సర్వాంగ సుందరంగా కనువిందు చేస్తాయి. కోహిమా సమీపాన అరదుర కొండపై ఉన్న కేథలిక్ చర్చికి ఓ ప్రత్యేకత ఉంది. దేశంలోనే అతిపెద్ద శిలువ ఈ చర్చిలోనే ఉండడం విశేషం. చెక్కతో మలచిన అపురూపమైన శిలువ పర్యాటకులను అమితంగా ఆకట్టుకుంటుంది. శిలువే కాదు.. ఈ చర్చి కూడా చాలా పెద్దదే.వాణిజ్య రాజధాని దిమాపూర్...
నాగాలాండ్‌కు రాజధాని కోహిమానే అయినా.. దాదాపు అంతటి ప్రాధాన్యం ఉన్న మరో నగరం దిమాపూర్. నాగాలాండ్ వాణిజ్య రాజధానిగా పేరొందిన దిమాపూర్.. చుట్టుపక్కల ఉన్న మణిపూర్, అస్సాం, అరుణాచల్‌ప్రదేశ్, మేఘాలయ, త్రిపుర, మిజోరం రాష్ట్రాలకు కూడా చాలా దగ్గర. రాష్ట్రం మొత్తం మీద ఉన్న ఒకే ఒక్క విమానాశ్రయం దిమాపూర్‌లో ఉండటం మరో విశేషం. గతించిన కచారి రాజుల కాలం నాటి కట్టడాలు దిమాపూర్‌లో అక్కడక్కడా కనిపిస్తాయి. దిమాపూర్‌కు ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్న రుజాఫెమా మరో చక్కటి సందర్శనా క్షేత్రం. గిరిజనులు తయారుచేసే చిత్రవిచిత్రమైన వస్తువులు ఇక్కడ అనేకం లభిస్తాయి.
ప్రకృతి అందానికి మరోరూపం.. ఖొనోమా..
కోహిమాకు పది కిలోమీటర్ల దూరంలో ఉన్న ఖొనోమా అనే చిన్న గ్రామం ప్రకృతి సౌందర్యానికి పెట్టింది పేరు. ఆహ్లాదకరమైన గ్రామ పరిసరాలు విహారానికి ఎంతో అనువైన ప్రదేశాలు. పచ్చటి వరి పొలాలతో ప్రకృతి మాత నడయాడే ఖొనోమాకు టూరిస్టుల తాకిడి ఎక్కువ. ఇక్కడ సుమారు ఇరవై రకాల వరి పంట పండిస్తారంటే నమ్మశక్యం కాదు. సముద్ర మట్టానికి 2,438 మీటర్ల ఎత్తున ఉండే జుకోవాలీ ట్రెక్కింగ్‌కు అనువైన ప్రదేశం. ఇది కోహిమాకు 30 కిలోమీటర్ల దూరంలో ఉంది. వెదురుపొదలతోనూ, తెలుపు, పసుపు పచ్చ రంగుల లిల్లీ పువ్వులతోనూ లోయ అంతా ఆహ్లాదకరంగా ఉంటుంది.షాపింగ్ అనుభూతి...
కోహిమా నగరం నడిబొడ్డున, బస్‌స్టేషన్ ఎదురుగా ఉన్న సేల్స్ ఎంపోరియం నాగా చేతివృత్తుల ఉత్పత్తులకు ప్రసిద్ది. రంగురంగుల శాలువాలు, చేతిసంచీలు, చెక్కతో మలచిన బొమ్మలు, వెదురుబుట్టలు ఇక్కడ లభ్యమవుతాయి.
ఇలా వెళ్లాలి...
విమానమార్గం: నాగాలాండ్‌లో ఉన్న ఒకే ఒక్క విమానాశ్రయం దిమాపూర్. కోల్‌కతా, గౌహతి నుంచి ఇక్కడికి విమాన సౌకర్యం ఉన్నది.
రైలుమార్గం: దిమాపూర్ రైల్వే స్టేషన్ నుంచి ఉత్తరభారతంలోని పెద్ద పట్టణాలకు రైలు సౌకర్యం ఉన్నది.
రోడ్డు మార్గం: దిమాపూర్ నుంచి కోహిమాకు టాక్సీలున్నాయి. గౌహతి, షిల్లాంగ్, కోహిమా నుంచి బస్సు సౌకర్యం ఉన్నది.
కర్టసీ : సూర్య Daily


కడెం నది పరివాహాక ప్రాంతంలో ఉండే ఈ జలపాతం ప్రతి యేట వర్షకాలంలో భీకర శభ్దంతో భయంకరంగా కనిపిస్తూ పర్యటకుల గుండెల్లో గుబులు రేపుతుండగా.. జనవరి తర్వాత చల్లటి సెలయేర్లు, తెల్లటి నురగలతో కొండ కోనలపై నుంచి జాలువారుతు ఆదిలాబాద్ మనిహారంగా నిలుస్తున్నది. సహ్యాద్రి పర్వత శ్రేణుల నుంచి జాలువారుతున్న ఈ జలపాతాన్ని చూడడానికి జిల్లా నుంచే కాకుండా పొరుగున ఉండే నిజామాబాద్, కరీంనగర్, వరంగల్, ెహదరాబాద్‌తో పాటు మహారాష్టల్రోని నాందేడ్, యవత్‌మల్, చంద్రాపూర్ లాంటి జిల్లాల నుంచి పర్యటకులు భారీగా తరలి వస్తుంటారు. సెలవు దినాలతో పాటు వేసవిలో సైతం పర్యటకులు ఇక్కడి ప్రకృతి కమనీయతను ఆస్వాదించడానికి సుదూర ప్రాంతాల నుంచి వాహానాలలో తరలివచ్చి ఉదయం నుంచి సాయంత్రం వరకు ఇక్కడే వంట వార్పు చేసుకొని వన భోజనాలు చేసి వెళ్తుంటారు. అటవీ ప్రాంతంలో ఉన్న ఈ జలపాతం పూర్వ పరాలను పరిశీలిస్తే అప్పటి శకుంతల దుష్యంతులకు విహార వెడిది కేంద్రంగా ఉండేదని శకుంతల జలపాతంగా మొదట దీనిని పిలువగా ఆతర్వాత ‘కుంతల’ జలపాతంగాను పిలువబడి కాల క్రమేనా ‘కుంటాల’ జలపాతంగా మారింది.
భార్య శకుంతల నుంచి పేరుతో ఈ జపాతాన్ని ‘కుంటాల’ అనే పేరు వచ్చిందని స్థానికుల అభిప్రాయం.. ఈ జలపాతం పరిసర ప్రాంతాలను వీక్షించి మైమరిచిపోయిన శకుంతల తరుచుగా ఈ జలపాతంలో జలకాలాడేదని ఇక్కడి ప్రలు నమ్ముతారు. ఈ ప్రాంతం.. మూడు జలపాతాలు, గుండాలుగా ఉన్నాయి. ఈ గుండాల్లో ముఖ్యమైన గుండాన్ని స్థానికులు సోమన్న గుండంగా పిలుస్తారు. ఈ జలపాతం వద్ద ప్రకృతి సిద్ధమైన రాతిగుహల్లో శివలింగాలు ప్రతిష్టమై ఉండటం వలన ప్రతి సంవత్సరం శివరాత్రి రోజున భక్తులు ఈ శివలింగాలను సందర్శించుకొని పూజలు నిర్వహిస్తారు. దీనినే ఇక్క డ సోమన్న జాతరగా పిలుస్తారు. శివరాత్రి పర్వదినాన్ని ఇక్కడ రెండు రోజుల పాటు జరుపుకోవడం ఆనవాయితీ. ఇది అనాదిగా వస్తున్న ఆచారం కూడా. ఇదే జిల్లాలో... చదువుల తల్లి సరస్వతీ దేవి కొలువై ఉన్న బాసర దేవాలయాన్ని సందర్శించే భక్తుల టూర్ షెడ్యూల్లో కుంటాల జలపాతం కూడా ఉంటుంది. జపాతానికి చుట్టూ ఉన్న అడవి ఉష్ణమండల శుష్క ఆకురాలు వనాల రకానికి చెంది అన్ని జాతుల వృక్షాలు కిలిగి అధికంగా టేకు చెట్లతో నిండి ఉన్నది. ఈ అడవిలో చాలా రకాల అటవీ జంతువులు, పక్షులు ఉన్నాయి.
కారు పార్కింగ్ ప్లేస్‌లో ఆపుతూ డ్రైవరు 'అదిగో అదే సాంచి' అన్నాడు. ఆ ఎండ వెలుతురులో నా ముందు స్థూపం ప్రత్యక్షం కాగానే నాకు చెప్పలేని వివశత్వం కలిగింది. పరుగు పరుగున ఆ ప్రాంగణం దగ్గరికి పోయి నిల్చొన్నాను. నా ముందు ధ్యానమూర్తి అయిన బుద్ధుడు ప్రత్యక్షమయినట్టే ఉంది. మనకెంతో పరిచితమైన ధ్యానబుద్ధ ప్రతిమలో ఏదో విశేషముంది. ఆ మూర్తిని చూస్తున్నప్పుడు మనలో ఏదో అనిర్వచనీయ భావన మేల్కొంటుంది. దాదాపు మూడు వందల అడుగుల ఎత్తున కొండమీద నిర్మించిన ఈ స్థూపం భారతదేశంలోని బౌద్ధ స్థూపాలన్నిటిలోనూ కూడా అత్యంత సురక్షితంగా నిలబడ్డ నిర్మాణం. కాలం తాకిడికి చెక్కు చెదరని బుద్ధవాక్యం లాగా కనిపిస్తుంది.
నేను పిచ్చివాడిలా ప్రదక్షిణంగా, అప్రదక్షిణంగా ఆ స్థూపం చుట్టూ అటూ ఇటూ తిరుగుతూ, నా చేతుల్లోకి చిక్కుతున్నట్టే చిక్కి మరుక్షణమే జారిపోతున్న ఆ అపురూపమైన ప్రశాంతి ఎటువంటిదో బోధపరచుకునే ప్రయత్నం చేశాను. ఇది ఎటువంటి జీవిత ప్రయత్నాలకు సార్థక్యంగా, సత్ఫలితంగా లభించగల కానుక అయి ఉండవచ్చునని ఆలోచించాను. బుద్ధుడి దీర్ఘ సంభాషణల్లో 'సామంజ ఫలసుత్త'మనే అందమైన, ఆలోచనాపూరితమైన సంభాషణ ఉంది. నాకా సంభాషణ గుర్తొచ్చింది. ఒకప్పుడు ఒక కార్తీక పున్నమి రాత్రి మగథ చక్రవర్తి అజాతశత్రు రాజగృహంలో తన ఇంటి మేడ మీద వెన్నెల్ని చూస్తూ ఇంత అందమైన రాత్రి ఎవరైనా ఒక వివేకవంతుడు సన్నిధికి పోయి కూర్చుంటే ఆయన చెప్పే మాటలు వింటే ఎంత బాగుంటుందో అనుకుంటాడు. అటువంటి వివేకవంతుడు ఎవరన్నా ఉన్నారా అని తన మంత్రుల్ని ప్రశ్నిస్తాడు. ఒక్కొక్కరూ ఒక్కొక్కరి గురించి చెప్తారు.
అడవి దారమ్మట పలాశ, మోదుగు వృక్షాల్ని చూస్తూ భీమ్ బేట్క చేరాను. డ్రైవరు కారు ఆపి 'ఇక్కడి నుంచి మీరు నడిచి వెళ్ళాలి' అన్నాడు. వింధ్యపర్వతాల్లో అడుగుపెట్టాను అని స్ఫురించగానే నాకు చెప్పలేని వివశత్వం కలిగింది. ఒకప్పుడు అగస్త్యుడు ఉత్తరం నుంచి ఈ వింధ్య దాటే దక్షిణానికి అడుగుపెట్టాడు. ఆయన తిరిగి వెళ్లడం కోసం వింధ్య అప్పటి నుంచీ తలొగ్గి ఎదురుచూస్తూనే ఉంది. కాని వింధ్యని శాశ్వతంగా అణచడం కోసం అగస్త్యుడు ఈ దారిన తిరిగి వెళ్లలేదు. బహుశా అప్పణ్ణుంచీ తనను చేరవస్తున్న ప్రతి మానవుడిలోనూ వింధ్య ఒక అగస్త్యుణ్ణి గుర్తుపట్టే ప్రయత్నం చేస్తూనే ఉంటుందనుకుంటాను. అందుకనే ఆ పర్వత సముదాయం నన్ను 'నువ్వు అగస్త్యుడివేనా?' అని అడిగినట్టనిపించింది. నేను చిరునవ్వుతో 'అగస్త్యుణ్ణి కాదు! అవిసె చెట్టుని మాత్రమే' అన్నానా కొండలతో (సంస్కృతంలో అగస్త్యమంటే అవిసె చెట్టు అని కూడా అర్థం.)
'భారతీయ శిలాచిత్రలేఖనాల విశిష్టలక్షణమేమిటంటే, అవి తమ యుగస్వభావానికి అద్దం పడతాయి. అవి మొత్తం ఉపఖండానికే చెందిన ఒక ఉమ్మడి దృగ్విషయం. వాటిలో భారతీయ సాంస్కృతిక ఏకత్వం ప్రతిబింబిస్తూంటుందని మనం చెప్పవచ్చు ... ఈ చిత్రకళ తక్కిన ప్రాచీన భౌతిక అవశేషాల్లాగే మానవుడి నాగరికతా ప్రయాణంలో మొదటి అడుగుల్ని గుర్తు చేస్తుంది. తన తదనంతర తరాల ప్రయోజనం కోసం చరిత్రపూర్వ మానవుడు తన మొత్తం ప్రపంచాన్నంతటినీ ఇక్కడ చిత్రించి పెట్టాడు. మానవుడి అభివృద్ధి అతడుండే స్థలాన్ని బట్టీ, అతడు జీవించే కాలాన్ని బట్టీ ఎట్లా ప్రభావితమవుతుందో ఈ చిత్రకళ చూపిస్తుంది. తక్కిన పురావస్తుసాక్ష్యాల్లో మనకు లభ్యంకాని రహస్యాలకోసం ఈ గుహసముదాయాల్లో మనం వెతకవలసి ఉంటుంది ... మానవుడి చరిత్రకీ, సమాజానికీ, ఆర్థికవ్యవస్థకీ, మతానికీ, క్రతువులకీ, వలసలకీ సంబంధించిన ఎన్నో ప్రశ్నలకు ఇక్కడ సమాధానం లభ్యమయ్యే అవకాశం ఉంది. అయితే ఇతిహాసపు చీకటికోణం అట్టడుగునపడి కనిపించని కథల్ని ఈ మౌనచిత్రాలు వినిపించాలంటే మనమింకా ఎంతో మట్టి తవ్వవలసి ఉంటుంది. బూజు దులపవలసి ఉంటుంది.'

న్యూజిలాండ్‌లో స్థిరపడిన లక్కీ అలీ ఇండియాకి పాడ్డానికి వచ్చి తన పాటలనూ పనిలో పనిగా న్యూజిలాండ్‌నూ పాపులర్ చేసి వెళ్లాడు. క్రికెట్‌లో కివిస్ జట్టును న్యూజిలాండ్‌లో క్రికెట్ మ్యాచ్‌లనూ చూడ్డం తప్ప అక్కడకు వెళ్లి సినిమాలు షూట్ చేయాలని ఎవరికీ తోచలేదు. కాని త్వరలోనే సినీ కొలంబస్‌లో బస్‌లో కాకపోయినా విమానంలో అక్కడ కాలుమోపారు. బాగున్నారా బాగున్నారా బావగారూ బాగున్నారా అని దుమ్ము లేపారు. ఆ తర్వాత నాగార్జున సంతోషంగా అక్కడ సగం సినిమా లాగించేశాడు.
యూరప్‌లో రెండు పాటలు తీయాలనుకోండి... ముందు అక్కడున్న ‘లైన్ ప్రొడ్యూసర్స్’ (వీరే ఫారిన్ షూటింగ్ కో ఆర్డినేటర్స్) ద్వారా పర్మిషన్‌కి అప్లై చేసుకోవాలి. లండన్ మినహాయించి, అన్ని యూరప్ దేశాల్లో పర్మిషన్లు ఈజీగానే వస్తాయి కానీ... ఆస్ట్రేలియా, కెనడా లాంటి దేశాల్లో పర్మిషన్ అంటే వారం ముందే అప్లై చేసుకోవాలి. పదహారు మందితో ఏడు రోజుల పాటు యూరప్‌లో రెండు పాటలను చిత్రీకరించాలంటే... పర్‌హెడ్ లక్షా 10 వేల నుంచి లక్షా 20 వేల వరకూ ఖర్చు అవుతుంది. ఫ్లైట్ ఛార్జీలు, పర్మిషన్లకు, అకామడేషన్లకు అయ్యే ఖర్చది. అంటే నిర్మాతకు మొత్తంగా 18 లక్షల నుంచి 20 లక్షల దాకా ఖర్చవుతుంది. అదే... లండన్, ఆస్ట్రేలియా, కెనడా లాంటి దేశాల్లో అయితే... పర్ హెడ్ లక్షా 40 వేల నుంచి లక్షా 50 వేల దాకా అవుతుంది. అంటే నిర్మాతకు 25 నుంచి 27 లక్షల దాకా లెక్క తేలుతుంది. కాకపోతే మన దగ్గర స్టూడియోల్లో సెట్ వేసి పాట తీయాలంటే... సెట్టుకు 30 నుంచి 40 లక్షలు అవుతుంది. అంటే ఒక పాటకు నిర్మాత 45 లక్షల దాకా ఖర్చుపెట్టాల్సి వస్తుంది. అదే ఫారిన్‌లో అయితే రెండు పాటలను నాచురల్ లొకేషన్లలో రిచ్‌గా 25 లక్షల్లో తీసుకుని వచ్చేయొచ్చు. ఆ విధంగా చూసుకుంటే ఫారిన్‌లో పాటలు నిర్మాతలకు లాభమే అని చెప్పాలి. ఎక్వీప్‌మెంట్ మాత్రం ఇక్కణ్ణుంచే తీసుకెళతారు. 
ఖమ్మం జిల్లాలోని వి.ఆర్.పురం మండలం శ్రీరామగిరి గ్రామం నుంచి సుమారు మూడు గంటల పాటు గోదావరి నదిలో ప్రయాణం, చుట్టూ చూడచక్కని గిరిజన గ్రామాలు, అందమైన ప్రకృతి నడుమ ఉరుకులు, పరుగుల జీవితానికి ఒక్కపూట మన మనస్సుని పరవశింపజేస్తుందంటే ఆ ఆనందం మరువలేనిదని చెప్పడంలో అతిశయోక్తి కాదేమో. ఎక్కడో మహరాష్టల్రోని నాసిక్ వద్ద జన్మించి ఎన్నో ఉపనదులను తనలో కలుపుకుని కూనవరం వద్ద గోదావరి, శబరి నదులలో సంగమమై శ్రీరామగిరి గ్రామం నుంచి లాంచీలో ప్రయాణిస్తే పేరంటాలపల్లికి నుంచి పాపికొండలకు చేరుకోవచ్చు.
పేరంటాలపల్లి విహారయాత్ర, రాష్ట్రంలోని రెండవ భద్రాద్రిగా పేరుపొందిన శ్రీరామగిరి పుణ్యక్షేత్రం వద్ద యాత్రికులకు శ్రీసుందర సీతారాముల వారి దర్శనం కలుగుతుంది. ఎతైన కొండలు గుట్టల మధ్య సుమారు 170 మెట్లు ఎక్కిన తర్వాత కనులు పరవశింపజేసే సుమారు 500 సంవత్సరాల క్రితం మాతంగి మహర్షిచే ప్రతిష్ఠింపబడిన శ్రీ సీతారామలక్ష్మణ, ఆంజనేయ సుందర విగ్ర హాలను భక్తులు దర్శిస్తారు. ఆ దేవమూర్తు లను చూడగానే నిజంగా సీతారామ లక్ష్మణ అంజనేయస్వాములను మనం చూస్తున్నట్లు అనుభూతి కలుగుతుంది. ఎతె్తైన కొండలు నుంచి వచ్చే పిల్లగాలులు, మనస్సును పరవశింపచేస్తాయి. పక్కనే ఎతె్తైన రెండు పర్వతాలు వాలి, సుగ్రీవుల గుట్టలు భక్తులకు కనువిందు చేస్తాయి.
వాలి, సుగ్రీవుల కొండల నుండి మరో పర్లాంగు దూరంలో చొక్కనపల్లి గోదావరి రేవులో ఝటా యువు పక్షి పడిపోయిన గుర్తులు కనిపిస్తుంటా యి. అక్కడే శ్రీరాముడు ఝటాయువుకు పిండ ప్రదానం చేసాడని పురాణాలు వెల్లడిస్తు న్నాయి. శ్రీరామగిరి నుంచి బయలుదేరిన లాంచీ రెండు గంటల పాటు గోదావరి తీరాన ఉన్న అమాయక గిరిజనులైన కొండరెడ్ల ప్రజలను పలకరిస్తుంది.
ఆయన కలలో భగవంతుడు కనిపించి ఇక్కడ ఆలయాన్ని నిర్మించమని ఆదేశించడంతో అందుకు అనుగుణంగా ఆయన ఇక్కడే నివాసం ఉండి ఆ ఆలయాన్ని నిర్మించినట్లు ఈ ప్రాంతవాసులు చెబుతారు. ఈ ప్రాంత గిరిజనులకు విద్యా బుద్దులు, వైద్య సౌకర్యం కల్పించిన మునిశ్వేరుడిని వారు ఆరాధ్యదైవంగా భావిస్తారు. ఈ శివాలయంలో కొండలపై నుంచి జలపాతం చుట్టూ పనస, పొక చెక్క వంటి అనేక మొక్కలతో ఆప్రాంతం ఎంతో ఆహ్లాదంగా ఉంటుంది. అక్కడి నుంచి లాం చీలపై మరొక 5 కిలోమీటర్ల దూరం లాంచీపై వెళ్తే పర్యా టకులను పరవశింపజేసే పాపి కొండలు దర్శనమిస్తాయి. భద్రా చలం వద్ద సుమారు 2 కిలోమీటర్ల వెడల్పు ఉన్న గోదావరి పాపి కొండలు వంపు సొంపులతో చిన్న ఏరులా గోచరిస్తుంది. ఎతైన కొండల మధ్య వంపులు తిరిగి ప్రవహించే గోదావరిని చూపి పర్యాటకులు పరవశించిపోతారు. టూరిజం శాఖ ఈ పేరంటాలపల్లి, పాపికొండల యాత్రకు మరింత అభివృద్ధి చేసి టూరిజం ప్యాకేజీ ప్రకటిస్తే యాత్రికులు మరింతగా వచ్చే అవకాశం ఉంది.
ఈ సుందర వనాలలో విహరించేందుకు దిగివచ్చిన దేవకన్యల్లా ఉంటాయవి. అక్కడ వీచే గాలులకు పరవశిస్తూ, అలా విహరిస్తూ, ఒక్కో పూవునుంచి మరో పూవుకు మకరందం కోసం ఆ సీతాకోక చిలుకలు కళ్లకు పసందు చేస్తూ, మనసుకు హాయినిస్తాయి. దాదాపు 3 వేల మీటర్ల ఎత్తు ఉండే ఈ కుమావన్ పర్వత శ్రేణులలో పలు వన్యప్రాణి రక్షిత ప్రదేశాలున్నాయి. వాటిలో దాదాపు 50 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉన్న బిస్సార్ రక్షిత ప్రదేశం విశేషమైనది. ఈ ప్రాంతంలో ఇది ఒక సౌందర్య ప్రాంతం. ఇక్కడ చిరుతలు, కస్తూరి మృగాలు, జింకలు, భల్లూకాలవంటి ఎన్నో వన్యప్రాణులు విహరిస్తుంటాయి. 
లడక్ ప్రాంతాన్ని గతంలో ఎందరో పాలించారు. వారిలో ఫియాంగ్, హెమిస్, చిబ్రా అనేవారు ప్రసిద్ధులు. బౌద్ధమతానికి ముందు వీరు పలు మతాలకు ప్రాణం పోసినట్టు ఆధారాలున్నాయి. లడక్ ప్రాంతంలో అనేక తెగలు కూడా చిరకాలం వర్థిల్లాయి. ఆ సమయంలో ఎన్నో దేవాలయాలను సైతం నిర్మించారు. ఇలాంటి వాటిలో అల్చి ప్రార్థనాస్థలం ఒకటి. ఐదు దేవాలయాల సమూహమిది. ఆలయాల లోపల అద్భుతమైన వర్ణ చిత్రాలు ఆశ్చర్యం గొలుపుతాయి. ఇవి 11, 12 శతాబ్దాలకాలం నాటివిగా చెబుతారు. ఈ ఆలయంలో జాదికాలు నిలిచిపోయి చాలా ఏళ్ళు అవుతున్నా, లికిర్ మత ప్రముఖులు కొందరు వీటిని ఇప్పటికీ సంరక్షిస్తుండడం విశేషం.
ముందు ధనుష్కోటికి వెళ్లి ఆ తర్వాత రామేశ్వరంలో గుళ్లు చూద్దామనుకున్నాం. ధనుష్కోటి చేరాలంటే కొంత దూరం జీపులో ప్రయాణించక తప్పదు. ముందు కెళ్తున్న కొద్దీ చుట్టూ సముద్రం. సన్నటి ఇసుక దారిలో మా జీపు. 'ఇప్పుడు సునామీ లాంటిది వస్తే' అన్న ఊహ నా మదిలో మెదిలింది కానీ పెదవి విప్పలేదు. తీరా ధనుష్‌కోటి చేరాక చూస్తే అక్కడ సముద్రం ఎంతో ప్రశాంతంగా ఉంది. జీపు అతను అర్ధగంటలో అంతా చూసి వచ్చేయండి అన్నాడు. ఇసుకలో కూరుకుపోతున్న కాళ్లను పైకి లాగుతూ గబగబ అందరూ బీచి వైపు పరుగు తీశాము. అంతలో ఒక చిన్న కొట్టు దగ్గర ఒక పండు ముసలావిడ కనపడింది. వచ్చీరాని నా తమిళంలో ఆమెను ధనుష్‌కోటి వివరాలు అడిగాను.
తరువాత మా మజిలీ రామేశ్వరం గుడి. ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రాలలో ఇది ఏడవది. గుడి సముద్ర మట్టానికి కేవలం పది అడుగుల ఎత్తున ఉంది. ఈ గుడి ఆవిర్భావం వెనకున్న కథనం ఇది - శ్రీరాముడు రావణాసురుని సంహరించాక బ్రహ్మహత్యా పాపాన్ని తొలగించుకోవడానికి రామేశ్వరంలో శివలింగం ప్రతిష్టించాలనుకున్నాడట. శివలింగాన్ని తెమ్మని హనుమను కైలాసానికి పంపాడట. ముహూర్త సమయానికి ఆయన తిరిగి రాకపోవడంతో సీతమ్మవారు ఇసుకతో సైకత లింగం తయారుచేయగా శ్రీరాముడు దానిని ప్రతిష్టించాడట. అంతలో కైలాసం నుండి శివలింగం తీసుకుని వచ్చిన హనుమ సైకత లింగాన్ని తోకతో పెకిలించబోగా శ్రీరాముడు వారించి సమీపంలోనే హనుమ తెచ్చిన లింగాన్ని ప్రతిష్టింపచేశాడట.
రామేశ్వరానికి రెండున్నర కి.మీ. దూరంలో గంధమాదన పర్వతం ఉంది. ఈ దీవిలోనే ఎత్తైన ప్రదేశం అది. లంక చేరడానికి హనుమ ఈ పర్వతం పైనుండే దూకాడట. ఇక్కడి ఆలయంలో శ్రీరాముని పాదాలను, సీతారామలక్ష్మణ విగ్రహాలను వీక్షించవచ్చు. రాముడు ఒక చేయి పైకి లేపిన ముద్రలో కొలువై ఉన్నాడు. పైనుండి రామేశ్వరం బాగా కనిపించింది.
హార్సీలీహిల్స్.. సువాసనలను వెదజల్లే సంపంగి పూలకు ప్రసిద్ది. సంపెంగ సువాసనలతో హర్సిలీ హిల్స్ ఘమఘమలు పర్యాటకులను మరో ప్రపంచం లోకి తీసుకేళ్తాయి. వీటితోపాటిగా చందనం, ఎర్రచందనం, కలప, రీటా, శీకా కాయ, ఉసిరిగ చెట్లు ఇక్కడ కోకొల్లలుగా వున్నాయి.
ఈ విహర స్థలానికి ఏనుగు మల్లమ్మ కొండ అనే పేరు కూడా ఉంది. జాన పదుల కథనం మేరకు పూర్వాశ్రమమంలో మల్లమ్మ అనే చిన్నారిని గజరాజు రక్షిస్తూ వుండేవాడట. కొండమీద చెంచులకు ఏ ఆపద వచ్చినా, జబ్బులు వచ్చినా చిన్నారి మల్లమ్మ అభయ హస్తం ఇచ్చి కాపాడేదట. ఉన్నట్టుండి ఒక రోజు చిన్నారి మల్లమ్మ అదృశ్యంమైంది. కొండా, కోనా, వాగు-వంకా, చెట్లు - పుట్ట వెతికి వేసారిపోయిన చెంచులు ఆమెకు కోవెల కట్టి, తమ ఇలవేల్పుగా చేసుకొని ఈ నాటికి కొలుస్తూనే వున్నారు. నేటికి కొండమీద వున్న బస్టాండ్ సమీపంలోని మల్లమ్మ కోవెలలో నిత్యం ధూపదీప పూజార్చనలు జరుగుతూ వుండడం చెంచుల అచంచల భక్తికి నిదర్శనం. ఏటా చెంచులందరూ... పర్యా టకులు, పరిసర గ్రామీణులతో కలిసి నేటికి ఏనుగు మల్లమ్మ జాతర అంగరం గ వైభవంగా జరుపుతారు.
భూతల స్వర్గాన్ని తలపించే అందాలతో పాటు 152 సంవత్సరాల వయస్సు కల్గిన ‘కళ్యాణి’ - అనే పేరుగల యూకలిప్టస్ చెట్టు ఇక్కడ ప్రధాన అకర్షణలలో ఒకటి. 1859లో డబ్ల్యూ.డి.హర్సీలీ నాటిన ఈ వృక్ష రాజం ఎత్తు 40 మీటర్ల పైమాటే. దుప్పులు, అడవికోళ్ళు, నక్కలు, ఎలుగుబంట్లు, గజరాజులు, కుందే ళ్ళు, కొండ ఎలుకలు, జింకలు, చిరుతపులులు, లేళ్ళు, అడవి పిల్లు లతో కూడిన అత్యంత అకర్షణీయ మైన వన్యమృగ కేంద్రం పర్యాటకు ల మనసును కట్టిపడేస్తుంది. ఆంధ్ర ప్రదేశ్ పర్యాటక శాఖ ఏర్పాటు చేసి న ‘పున్నమి’ వేసవి విడిది బంగ్లా ముందు కాండాలు కలిసిపోయి రెం డుగా చీలి ఏపుగా పెరిగిన రెండు మహవృక్షాలు చూపరులను అలరి స్తాయి. మొసళ్ళు మిసమిసలాడు తూ పర్యాటకుల వైపు ఎగబాకే క్రోకడైల్ పూల్ చూపరుల ఒళ్లు జలదరింపజేస్తుంది. రంగురంగుల ఈకలతో చిటారి శబ్దాలు చేసే పక్షి కేంద్రంతో పాటు జింకల పార్కు అల రిస్తుంది. ప్రేమికులు మనసు విప్పి మదిలోని ఊసులను గుసగుసలాడడానికి హర్సీలీహిల్స్‌లో వేదికాగా మారిన ‘గాలిబండ’ పైనుంచి మంచుకురిసే వేళా సూర్యోదయం, సూర్యాస్తమయం చూసే పర్యాటకులకు గుండె ఝల్లుమన డం ఖాయం. ఇక ఏనుగు మల్లమ్మ కోవెల అందాలు చెప్పనలివి కానివి.
హర్సీలీహిల్స్ సాహసవీరులకు అరుదైన అవకాశం కల్పిస్తుంది. ట్రెక్కింగ్, రాక్‌క్లైంబింగ్, బంజీ రన్నింగ్, గోర్బింగ్, రాపెల్లింగ్, బర్మాబ్రిడ్జి వాకింగ్, బర్మాలూప్స్, ఎర్త్‌కేక్ లాంటి సాహసకృత్యాల కోసం విదేశాలకు, లేదా పక్కరాష్ట్రాలకు పరుగు తీయాల్సిన అవసరం లేదు. ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ ఇలాంటి అవకాశాలను హర్సీలీ హిల్స్‌పై కల్పించడంతో పాటు పగలు, రాత్రివేళల్లో అక్కడే గడేపే విధంగా ప్యాకేజీలను రూపోందించింది. ఇక వసతి, భోజన సౌకర్యాలను కూడా ఆశాఖ ఏర్పాటు చేసింది. పిల్లలు ఆడుకొవడానికి వీలుగా ప్లేగ్రౌండ్, పెద్దలకు బార్, సిమ్మింగ్‌పూల్ మొదలు ఆర్డర్ ఇస్తే గంటలో వేడి వేడిగా వండివార్చే హోటల్స్ ఇక్కడ వున్నాయి. అంతేకాక పర్యాటకుల జిహ్వ చాపల్యానికి తగినరీతిలో... మైమరిపించే రాయలసీమ స్పెషల్ ‘సంగ టి-నాటుకొడి కూర’ క్షణాల్లో అందించే ప్రైవేట్ కుక్స్ కూడా ఇక్కడ ఉండడం విశేషం.
పురాణకాలంలో ఇక్కడ అగస్త్యమహర్షి ఆశ్రమం ఉండేదని చెబుతారు. ఇక్కడ ఒక సంస్కృత విద్యాలయం కూడా ఉండేదని కొన్ని పురాతన ఆధారాల వల్ల తెలుస్తోంది. క్రీశ 2 వ శతాబ్దంలో వ్రాయబడిన ్క్ఛటజీఞజూఠట ౌజ ్టజ్ఛి ఉటడ్టజిట్చ్ఛ్చ ఖ్ఛ్చి లో ‘పొడుకె’ అనే వాణిజ్యకేంద్రం గురించి వ్రాయబడినది. ఇదే ప్రస్తుత పుదుచ్చేరికి 2మైళ్ళ దూరంలో ఉన్న ‘అరికమేడు’ అని ‘హంటింగ్ ఫోర్డ్’ అనే రచయిత అభిప్రాయం. అప్పటినుండి రోమ్ ప్రాంతంతో పుదుచ్చేరి దగ్గరి రేవులకు సముద్ర వర్తక సంబంధాలుండేవి. రోమ్‌కు చెందిన కొన్ని పాత్రలు అరికమేడులో త్రవ్వకాలలో బయటపడ్డాయి. క్రీశ 4 వ శతాబ్దానంతరం ఈ ప్రాంతం వరుసగా పల్లవ, చోళ, పాండ్య, విజయనగర రాజుల రాజ్యాలలో భాగంగా ఉంది. 1673 లో ఫ్రెంచి ఈస్టిండియా కంపెనీ వారు ఇక్కడ నెలకొలిపిన వర్తక స్థావరం క్రమంగా ఫ్రెంచివారి అధికార కేంద్రమయ్యింది. తరువాత ఫ్రెంచి, బ్రిటిష్, డచ్ వారి మధ్య అధికారం కోసం జరిగిన అనేక యద్ధాలు, ఒప్పందా ల ప్రకారం పుదుచ్చే రి పై అధికారం మారుతూ వచ్చింది. 1850 తరువాత పుదుచ్చేరి, మాహె, యానాం, కరైకాల్, చందేర్ నగర్‌లు ఫ్రెంచివారి స్థావరాలుగా ఉన్నాయి. 1954 వరకు ఇదే పరిస్థితి సాగింది.
భిన్న సంస్కృతులు కలిగిన విలక్షణ నగరం పాండిచ్చేరి. స్వాతంత్య్రానికి పూర్వం ఫ్రెంచి వారి ఏలుబడిలో ఉన్న ఈ ప్రదేశంలో ఇప్పటికీ ఆ పోకడలు మనకు గోచరిస్తాయి. ఆనాటి వైభవ చిహ్నాలు.. గత చరిత్రకు సాక్ష్యాలుగా ఎన్నెన్నో కట్టడాలు ఇప్పటికీ పర్యాటకులను విశేషంగా ఉకట్టుకుంటున్నాయి. చదువుల కాణాచిగా, ఆధ్యాత్మికవాదుల మజిలీగా, ప్రకృతి ప్రేమికులకు విహార కేంద్రంగా భూలోకపు స్వర్గాన్ని తలపిస్తున్న ఈ అద్భుత ప్రదేశంగా పేరున్న పాండిచ్చేరిని మించిన ఆధ్యాత్మిక విహారకేంద్రం మరోటి లేదంటే అతిశయోక్తి కాదేమో! దక్షిణ భారత దేశంలో ఒక కేంద్ర పాలిత ప్రాంతమైన పాండిచ్చేరి (పుదుచ్చేరి).. పుదుచ్చేరి, కరైకాల్, యానాం, మాహె అనే నాలుగు విడి విడి జి ల్లా ల సముదాయం. వీటి లో పాండిచ్చేరి పట్ట ణం బంగాళాఖాతం తీరాన, తమిళనాడు రాష్ట్రం అంత ర్భాగంగా 293 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో విస్త రించి ఉంది. కరైకాల్ బం గాళాఖాతం తీరంలో, తమిళనాడు రాష్ట్రం అంతర్భాగంగా 160 చదరపు కిలోమీటర్ల పరిధిలో విస్తరించి ఉంది.