విహారాలు

India

Gamyam

Thursday, January 20, 2011

కనువిందు చేసే... కాన్‌కన్‌

 
అందాలొలికే శిల్పాలు, జెల్‌-హా-జాతీయవనం, ప్రశాంత వాతావరణంలో చల్లని పిల్లగాలుల పలకరింపు, సకల వర్ణాలతో కనువిందు చేసే మత్స్యసంపద... వెరసి ఓ అందమైన దీవి... అదే కాన్‌కన్‌ ఐలాండ్‌

 

అమెరికాలోని షికాగో నుంచి ఆరు గంటల ప్రయాణం చేస్తే కాన్‌కన్‌ చేరు కోవచ్చు. బీచ్‌కు దగ్గరలో ఉండే విల్లా (రెసిడెన్సీ) లో బస చేస్తూ... మరుపురాని విహారానందాన్ని సొంతం చేసుకోవచ్చు. ప్రపంచంలోనే గొప్ప ఆర్కియాలాజికల్‌ వండర్‌గా చెప్పబడే ‘షిజెనిట్జా’ కు ప్రసిద్ధిగాంచిన ప్రదేశం కాన్‌కన్‌. ఇది క్రీశ 490 నాటి కట్టడం. పురాతనకాలం నాటి ‘మాయన్‌ సివిలైజేషన్‌’ కు చెందిన షిజినెట్జా ఓ అద్భుత చారిత్రక ప్రదేశం. ఈ మ్యూజియంలో అందమైన శిల్పాలు, హస్తకళలు ఎంతో రమ్యంగా ఉంటాయి. ఇక్కడ చెప్పుకునే మరో అద్భుత ప్రదేశాలు షెల్‌-హ-నేషనల్‌పార్క్‌, నేచురల్‌ ఎన్విరాల్‌మెంటల్‌ పార్క్‌. ఇక్కడి ఎక్వేరియంలో ఎన్నో రకాల రంగు రంగుల చేపలుంటాయి. ఇక్కడ జరిగే డాల్ఫిన్‌ షో ఎంతో పేరుగాంచింది.

కోజుమెల్‌ దీవి...
Park-Cancun 

‘కోజుమెల్‌’ ఐలాండ్‌ మెక్సికోలోనే అతి పెద్ద దీవి. ఈ దీవి స్క్యూబా డైవింగ్‌, స్నార్‌కెలింగ్‌లాంటి వాటర్‌స్పోర్ట్‌‌సకి ఎంతో అనువైనది. అందుకే ఈ దీవిని వాటర్‌స్పోర్ట్‌‌స ‘ప్యారడైజ్‌’ అంటారు. ఇక్కడ షార్క్‌లను చాలా దగ్గర నుండి చూడవచ్చు.విశాలమైన ఈ ఐలాండ్‌ చుట్టిరావడానికి ఇక్కడ జీప్స్‌, బైక్స్‌ వంటివ వాహనాలు అద్దెకు దొరుకుతాయి.. ఇక్కడ మరో ప్రధాన ఆకర్షణ ‘ఎక్స్‌క్యారెట్‌’ అనే ఇకలాజికల్‌ థీమ్‌ పార్క్‌. పక్షులు, రకరకాల పూలచెట్లు, వందలకొద్దీ సీతాకోక చిలుకలకు నిలయం ఈ పార్క్‌.
Cancun1

చల్లగాలులు, సముద్రపు అలల నడుమ ప్రకృతి అందాల వీక్షణం మాటల్లో చెప్పలేని అనుభూతి. ప్రపంచం మొత్తంలో కేవలం కోజుమెల్‌ లో మాత్రమే డాల్ఫిన్స్‌తో స్విమ్‌ చేయగలిగే అవకాశం లభిస్తుంది. ఎక్స్‌క్యారెట్‌ పార్క్‌లో ఈ అవకాశాన్ని వినియోగించుకోవచ్చు. డాల్ఫిన్‌తో కలిసి ఈదడమా? అని భయపడకండి! అవి మనల్ని ఏమీ చేయవు. ఎందుకంటే వాటికి ముందే శిక్షణ ఇస్తారు కాబట్టి అవి పర్యాటకులతో ఎంతో స్నేహంగా మెలుగుతాయి. సీ లెవల్‌ నుంచి 30 అడుగుల కింద నీళ్ళల్లో లక్షలాది చేపలు, రకరకాల సముద్ర జీవులను చూస్తూ అండర్‌ వాటర్‌ వాకింగ్‌ మర్చిపోలేని అనుభవం.

చేపలవేట... మెక్సికన్‌ వంట...
kankan 

ఫిషింగ్‌ పట్ల ఆసక్తి ఉంటే ఫ్లై ఫిషింగ్‌, స్పోర్ట్‌ ఫిషింగ్‌, డీప్‌ ఫిషింగ్‌ లాంటి చాలారకాల ఫిషింగ్స్‌ చేయవచ్చు. కాన్‌కన్‌లో తప్పకుండా చేయాల్సింది బోట్‌ సెయిలింగ్‌.మెక్సికో అంటే గుర్తొచ్చేది ఘుమఘుమలాడే వంటకాలు. ప్రపంచంలోనే ఎంతో ప్రసిద్ధిగాంచిన మెక్సికన్‌ వంటలు నోరూరిస్తాయి. వివిధ రకాల మసాలాలతో తయారయ్యే వంటలు ఒక్కసారైనా రుచిచూడాల్సిందే.

RIU Cancun *  Conveniently located Resort in Cancun Mexico

ఆహారపదార్ధాలను అందంగా అలంకరించే పద్ధతులు, వాటి రుచి ఆహా... ఓహో అనిపిస్తాయి. బరీతోస్‌, ఫహిటాస్‌, సాల్సాలాంటి తినుబండారాలు ప్రపంచవ్యాప్తంగా చాలా మంది ఇష్టపడతారు. సంవత్సరం పొడవునా పర్యాటకులు సందర్శించడానికి వీలున్న ప్రదేశం కాన్‌కన్‌. ఏ కాలలోనైనా వెళ్ళొచ్చు. అయితే చలికాలంలో అయితే మరింత అనువుగా ఉంటుంది. ఇక్కడ చలికాలం డిసెంబర్‌ నుంచి ఏప్రిల్‌ వరకు ఉంటుంది.

No comments:

Post a Comment