విహారాలు

India

Gamyam

Tuesday, January 25, 2011

ట్రెక్కింగ్‌ స్పాట్‌... ఖండాలా

Bhaja_Caves
కనుచూపు మేర పచ్చదనం తప్ప మరేమీ కనపడని అద్భుత ప్రదేశం ఖండాల. భారతదేశంలోని ప్రధాన హిల్‌ స్టేషన్లలో ఖండాలా ఒకటి. సహ్యాద్రి పర్వత శ్రేణుల్లో మహారాష్ట్ర పశ్చిమ దిశలో ఎత్తైన కొండలతో, చూపుతిప్పుకోనీయని పచ్చని ప్రకృతి సౌందర్యంతో ఈ ప్రాంతం పర్యాటకుల మనసు దోచుకుంటోంది. ముంబై మహానగరానికి 101 కిలోమీటర్ల దూరంలో, 625 మీటర్ల ఎత్తులో కొలువైయున్న ఖండాలాలో ట్రెక్కింగ్‌ చేసేందుకు దేశ, విదేశీ పర్యాటకులు సైతం ఆసక్తి చూపిస్తుంటారు.

ప్రకృతి ప్రేమికులకు, కొత్త జంటలకు, ప్రేమికులకు స్వర్గధా మంలా అనిపించే ఈ ప్రాంతం అద్భుత అందాల పర్వత ప్రాంతంగా గుర్తింపు పొందింది. గతంలో ఖండాలా ఛత్రపతి శివాజీ సామ్రాజ్యంలో భాగంగా ఉండేది. అనంతరం బ్రిటీష్‌ వారి పాలన వచ్చాక... దక్కన్‌ పీఠభూమి, కొంకణ్‌ మైదానాల మధ్య గల రోడ్డు మార్గంలో గల భోర్‌ ఘాట్‌లో భాగమయ్యింది. బోర్‌ ఘాట్‌కు ఆ కాలంలో రోడ్డు, రైలు రవాణా సౌకర్యాలను కలిగి ఉండేవి. ముంబై-పూణే ఎక్స్‌‌‌రరపెస్‌ రైలు మార్గం, అలాగే ముంబై, పూణేలకు రైలు మార్గం ఖండాలా ద్వారానే సాగేది.

అందాల‘లోనవాలా’...

Karla 

ఖండాలాకు 5 కిలోమీటర్ల దూరంలో లోనవాలా అనే మరో ప్రఖ్యాత హిల్‌ స్టేషన్‌ కూడా చూడదగ్గది. ఖండాలాకంటే పెద్దదైన ఈ ప్రాంతంలోని ప్రకృతి రమణీయత మనల్ని ఉక్కిరిబిక్కిరి చేస్తుంది. కళ్లు తిరిగే లోయలు ఓవైపు, ఆకాశాన్ని తాకుతున్నట్లుగా ఉండే పర్వతాలు మరోవైపు... తుగవులి, లోనా వాలా, భుషి సరస్సుల హొయలు... ఇలా లెక్కలేనన్ని ప్రకృతి సౌందర్య విశే షాలతో లోనావాలా అలరారుతుంటుంది.

పురాతన గుహలు... కర్ల, భజా...
ఖండాలాకు 16 కిలోమీటర్ల దూరంలో కొలువై ఉన్న కర్ల మరియు భజా గుహలు కూడా తప్పకుండా దర్శించాల్సిన ప్రదేశాలు. ఈ రాతి గుహల్లోని రాతి ఆలయాలు క్రీస్తుపూర్వం 2వ శతాబ్దానికి చెందినట్లు చరిత్రకారులు చెబుతున్నారు. బౌద్ధమతానికి చెందిన హీనయానశాఖవారు ఈ రాతి గుహాలయాలను నిర్మించి నట్లు తెలుస్తోంది. అలాగే ఇక్కడికి దగ్గర్లోని అమృతాంజన్‌ పాయింట్‌... తప్పకుండా సందర్శించాల్సిన మరో ప్రదేశం. ఇవే కాకుండా... ముంబయి నుంచి ఖండాలా ప్రయాణ మార్గంలో కూడా అనేక దర్శనీయ ప్రాంతాలు కానవస్తాయి. ఇలాంటి వాటిలో చారిత్రకమైన కోటలు, జలపాతాలు, సరస్సులు అనేకం ఉన్నాయి.

రమణీయ కోట... రజ్‌మాచి...
Khandala 

ముంబయి నుంచి లోనవాలాకు వెళ్లే మార్గమధ్యంలో పర్వతాలు ప్రారంభమయ్యేచోట అందమైన ఓ ఉద్యానవనం వంటివి దర్శనమిస్తాయి. వాటిలో ముఖ్యమై నవి రజ్‌మాచి పార్క్‌, రజ్‌ మాచి కోట గోపురాలు. కోట దిగువ భాగంలో అతి పెద్ద లోయ ఉం టుంది. ఆ లోయలోనే ఒక దేవాల యంతో పాటు హోట ల్‌ కూడా ఉంటుంది. దానికి దగ్గర్లోనే చిన్న పిల్లల ప్రత్యేకంగా రూపొందించిన పార్క్‌ ఒకటి ఉంటుంది. దాని తరువాత వంద అడుగుల ఎత్తునుంచి కిందికి దుమికే ‘కునే’ జల పాతాలు కూడా చూడదగ్గవే. ఇవి ఖండాలాకు లోనవాలాకు మధ్యలో ఉన్నాయి. ఇవేకాకుండా టైగర్స్‌లీప్‌, సాకుర్‌ ప్లాటియా, మంకీ హిల్‌, లో హ్గాడ్‌ దర్శన్‌, శివాజీ పార్క్‌, డ్యూక్స్‌నోస్‌ లాంటి అనేక పర్యాటక ప్రాంతాలు పర్యటనను మధురానుభూతులతో నింపుతాయి.
ఖండాలా ఎలా వెళ్లాలంటే...
Rajmachi_Hill 

ఖండాలాలో ఎయిర్‌పోర్టు లేని కారణంగా, దానికి దగ్గర్లోని పూణే వరకు విమానంలో వెళ్లవచ్చు. అక్కడికి దగ్గర్లోని రైలు మార్గం ద్వారా 69 కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తే లోనవాలా రైల్వే స్టేషన్‌ చేరుకోవచ్చు. లోనవాలాలో ముంబై-పూణే రైలు మార్గంలో ప్రయా ణించే రైళ్లన్నీ అందుబాటులో ఉంటాయి. కాగా.. లోనవాలా నుంచి ముంబై చేరేందుకు కేవలం 3 గంటల సమయం సరిపోతుంది. అదే విధంగా లోనవాలా నుంచి పూణే వెళ్లాలంటే మాత్రం నాలుగు గంటలు ప్రయాణించాల్సిందే. ఇక బస్సు సౌకర్యం విషయానికి వస్తే.. ముంబై-పూణే మార్గంలో ఖండాలాకు అనేక బస్సు సర్వీసులు అందుబాటులో ఉన్నాయి.

No comments:

Post a Comment