ఊహాలోకంలో విహరించే ప్రేమికులైనా, సాయంత్రం వరకు పనిచేసివచ్చే ఉద్యోగులైనా, కాలేజీలకు వెళ్లే విద్యార్థులైనా హైదరాబాద్‌లోని హుస్సేన్ సాగర్ చెంత సేద తీరేందుకు ఇష్టపడతారు. అలా నెక్లెస్ రోడ్డుపైకి వెళ్ళాక వాతావరణానికి తగ్గట్టు అక్కడ దొరికే చిరుతిళ్ళను ఆరగిస్తూ ఆనందించడమూ ఆనవాయితే.నగరంలో వయోభేదం లేకుండా అందరికీ ఆత్మీయ నేస్తమైన నెక్లెస్‌రోడ్డు హైదరాబాద్‌లో సాగర తీరం లేదనే కొరతను కొంతలో కొంత తీరుస్తోంది. పరిసరాలలో చిన్న చిన్న ఇబ్బందులున్నా సర్దుకుపోతూ నగరవాసులు అక్కడ దొరికే చిరుతిళ్ళనే ఆస్వాదించడం విశేషం..

రుచిలో అమోఘం...
పానీపూరీలో రసంతో ఉల్లిపాయ ముక్కలు వేసుకొని తింటుంటే...ఆ టేస్టే వేరు. ఈ ఖరీదైన రోజుల్లో ట్యాంక్ బండ్‌పై యువతీ యువకులు ఇష్టపడే పానీపూరీని పరిశుభ్రంగా అతి తక్కువ ధరల్లో లభిస్తుందంటే ఎవరుమాత్రం తినకుండా ఉంటారు చెప్పండి. ఈ పూరీలను చిన్న చిన్న ట్రావెలింగ్ బల్లపై పెట్టి అమ్మేవారు చాలా మంది ఉన్నా కూడా అందరి వ్యాపారం జోరుగానే ఉండడం విశేషం. సాయంత్రాలలో వీటి వ్యాపారం యమ స్పీడుగా ఉంటుందని హుస్సేన్ సాగర్ వద్ద పానీపూరీ వ్యాపారం నిర్వహించే వారు చెబుతున్నారు.‘రుచికరమైన నీటితో నింపి ఇచ్చే పానీపూరీ అంటే ఎంతో ఇష్టం. ప్రతి రోజు సాయంకాలం ఆఫీసు ముగిసిన వెంటనే స్నేహితులతో కలిసి కాసేపు నెక్లెస్ రోడ్డులో సరదాగా గడుపుతాను. ఈ సందర్భంగా అందరం కలిసి పానీపూరీలను తింటాము. నోట్లో పెట్టుకుంటేనే కరిగిపోయే ఈ గప్‌చుప్‌ల రుచి అమోఘం’ అని సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ శ్రీకాంత్ అన్నారు.
ఆ అనుభూతే వేరు...

రోడ్డున పోయే వాళ్లు ఎంత మంది తింటారో కార్లలో వచ్చే ధనవంతులు కూడా అంతమందే తింటారు.చలికాలంలో మొక్క జొన్నలను అమ్మే వారికి క్షణం తీరిక ఉండదంటే నమ్మండి. ‘వేడి వేడి మొక్కజొన్న తింటూ నెక్లెస్‌రోడ్డులో సరదాగా నడుస్తుంటే ఆ అనుభూతే వేరు. స్నేహితులతో కలిసి కబుర్లు చెప్పుకుంటూ కనీసం వారానికి ఒకసారైనా హుస్సేన్‌సాగర్ చెంతకు వస్తాము. ముఖ్యంగా వీకెండ్స్‌లో నెక్లెస్ రోడ్డుకు స్నేహితులందరం కలిసి వచ్చి కొంత సేపు గడుపుతాము. సరదాగా ఆడుతూపాడుతూ మొక్కజొన్నలను ఆస్వాదిస్తాము’ అని డిగ్రీ విద్యార్థిని సుష్మ పేర్కొంది.
ఐస్‌క్రీమ్ తినాల్సిందే...

కోరుకుంటారు...

పొగలు కక్కే...
మానసిక ప్రశాంతత కావాలంటే ఏ పార్క్‌కు వెళ్ళినా లభిస్తుంది. కానీ నెక్లెస్ రోడ్డు దగ్గర మాత్రమే మానసిక ఉల్లాసంతో పాటూ చక్కని ఇరానీ చాయ్ కూడా దొరుకుతుంది. అక్కడ ఫ్లాస్క్‌ల్లో టీ, కాఫీలను అమ్మేవారు ఉంటారు. చల్లని వాతావరణంలో వేడి వేడిగా చాయ్ తాగుతుంటే ఎంతో హాయిగా ఉంటుంది. ఆఫీసుల నుంచి వచ్చేవారు రిలాక్స్‌డ్‌గా కాఫీ తాగడానికే ఇక్కడకు వస్తారంటే ఆశ్చర్యపోనక్కర్లేదు. రోజంతా పనితో అలసిపోయిన కొందరు యువతీయువకులు సాయంత్రం పూట కొంతసేపు ఇక్కడికి వచ్చి ఛాయ్ తాగుతూ సేద తీరుతూ కనిపిస్తారు. కబుర్లు చెప్పుకుంటూ మానసికోల్లాసాన్ని పొందుతారు.
బోలెడంత ఎంటరటైన్‌మెంట్...

‘నెక్లెస్‌రోడ్డులోని జలవిహార్‌లో కాసేపు గడిపేతే ఆ మధురానుభూతే వేరు. ఇక్కడ జలకాలాటలు ఆడుతూ వీకెండ్‌లో కుటుంబంతో కలిసి ఎంజాయ్ చేస్తాను. మా పిల్లలైతే వారానికి ఒక్కసారైనా జలవిహార్‌కు వెళ్లకపోతే ఊరుకోరు. పిల్లల కోసమైన మేము అక్కడికి వెళ్తాము’ అని హైదరాబాద్ నివాసి ప్రకాష్ చెప్పారు. ఇవేగాకుండా తరచుగా నెక్లెస్‌రోడ్డులో ప్రత్యేకంగా ఎగ్జిబిషన్‌లు, ఎంటర్‌టైన్‌మెంట్ కార్యక్రమాలు జరుగుతుంటాయి. ఇవన్నీ సందర్శకులకు మరచిపోలేని అనుభూతులను మిగులుస్తున్నాయి.
-ఎస్.అనిల్ కుమార్