

సంవత్సరమంతా... పర్యాటక శోభ: షిల్లాంగ్ నుంచి చిరపుంజీ ప్రాంతానికి పయనమైన వారికి చుట్టూ
నిలుచున్న పర్వతాలు అత్యంత మధురానుభూతిని కల్గిస్తాయి. ఘాట్ రోడ్‌లో సాగే ఈ ప్రయాణంలో చుట్టూ ఉన్న ఎతె్తైన పర్వతాలు చూస్తూ వాటినుంచి జాలువారే జలపాతాలను తన్మయత్వంతో తిలకించవచ్చు. చిరపుంజీ ప్రాంతం దాదాపుగా లైమ్ రాతి గుహలతో నిండి ఉంటుంది. ఇక్కడ ఉన్న విశేషాల్లో పురాతన ప్రెస్బిటేరియన్ చర్చి, రామకృష్ణ మిషన్ లాంటి వాటిని దర్శించవచ్చు. దగ్గర్లో ఉన్న మాసిన్రామ్ ప్రాంతంలో ఏర్పడిన సహజ శివలింగ రూపం పర్యాటకులను ఆకట్టుకుంటుంది.
ఈ శివలింగాన్ని స్థానికులు మావ్ జింబుయిన్‌గా వ్యవహరిస్తారు. చిరపుంజిని దర్శించాలనుకునే పర్యాటకులు షిల్లాంగ్ నుంచి పయనించాల్సి ఉంటుంది. షిల్లాంగ్ చుట్టు పక్కల ఉన్న ప్రదేశాల్లో కేవలం చిరపుంజి మాత్రమే పర్యాటక ప్రదేశం కాదు. షిల్లాంగ్ చుట్టు పక్కల అనేక పర్యాటక ప్రదేశాలున్నాయి. దాదాపు ప్రతిరోజు టూరిస్టులతో సందడిగా ఉండే షిల్లాంగ్‌లో మ్యాజియం ఆఫ్ ఎంటోమాలజీ అనే సీతాకోక చిలకల పార్క్ పర్యాటకులను మంత్ర ముగ్ధుల్ని చేస్తుంది. ఇక్కడ మేఘాలయలో కన్పించే అన్ని రకాల సీతాకోక చిలకలతో పాటు అంతరించిపోతున్న కొన్ని జాతుల సీతాకోక చిలకల్ని కూడా పరిరక్షిస్తుంటారు. దేశంలోనే ఓ ప్రముఖ హిల్ స్టేషన్‌గా ఉన్న షిల్లాంగ్ కేవలం పర్యాటకులకే కాక సినిమా షూటింగ్‌లకు కూడా అనువైన ప్రదేశం.

భూగోళ రహస్యం: బంగ్లాదేశ్ ముఖంగా ఉన్న ఖాసీ కొండల దక్షిణ కొనకు చిరపుంజీ ఉంది.
బంగాళాఖాతం నుంచి వీచే రుతుపవన గాలులు ఈ కొండశిఖరాలను తాకడం వల్ల చిరపుంజీలో భారీ వర్షాలు కురుస్తాయి. అందుకే ఇది చిత్తడి వాతావరణానికి పుట్టినిల్లుగా భాసిల్లుతోంది. చిరపుంజీలో ఈశాన్య, నైరుతీ రుతుపవనాల నుంచి వర్షాలు కురవడంతో, ఇక్కడ రెండూ కలిసి ఒకే ఒక రుతుపవన కాలంగా ఉంటాయి. ఇది ఖాసీ కొండల నుంచి వీచే గాలులకు వ్యతిరేక దిశలో ఉంటుంది. ఒరనోగ్రాఫిక్ భావన కారణంగా రుతుపవన గాలులు అధిక సంఖ్యలో తేమను నిక్షిప్తం చేస్తాయి. శీతాకాలంలో బ్రహ్మపుత్ర వ్యాలీ గుండా ప్రయాణించేఈశాన్య రుతుపవనాల వల్ల ఇక్కడ వానలు పడతాయి. ఒక సంవత్సర కాలంలో గరిష్ట వర్షపాతానికి సంబంధించి చిరపుంజీ పేరిట రెండు గిన్నిస్ రికార్డులున్నాయి. ఒక ఏడాది కాలంలో ఆగస్టు 1860 మరియు 1861జులై మధ్య, అదే విధంగా ఒక నెల వ్యవధిలో జులై 1861లో గరిష్ట వర్షపాతం నమోదు కావడంలో ఈ రెండు రికార్డులకు గిన్నిస్‌లో స్థానం దక్కింది.

అంటే పై భాగాలు చల్లబడతాయి. ఫలితంగా నీటిభాష్పాలు ద్రవీభవిస్తాయి. చిరపుంజీలో కురిసే వర్షాల్లో అధిక శాతం వర్షాలు, గాలి పెద్దమొత్తంలో నీటి భాష్పాలుగా మారడం వల్లనే సంభవిస్తాయి. ఇక అతి పెద్ద మొత్తం వర్షాలు పడటానికి కారణం, బహుళా అందరికీ తెలిసినదే. అదే ఈశాన్య రాష్ట్రాల్లో కురిసే ఒరోగ్రాఫిక్ వర్షాలు. చిరపుంజీలోని కొన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు సంభవిస్తే మిగిలిన ప్రాంతాలు వర్షపాతంలో తీవ్ర వ్యత్యాసాలు చూపిస్తూ, పూర్తిగా పొడిగా ఉంటాయి. రుతుపవనాల కాలం క్రియాశీలకంగా ఉన్న రోజుల్లో వాతావరణంలో తేమ గరిష్ఠంగా ఉంటుంది. చిరపుంజీలో అత్యధిక శాతం వర్షం కురవడానికి, ఒరోగ్రాఫిక్ లక్షణాలే కారణమని చెప్పవచ్చు. దక్షిణం పక్క నుంచి వచ్చే మేఘాలు ఈ కొండల మీదగా ప్రయాణించినప్పుడు ఇవి లోయ మొత్తం విస్తరిస్తాయి. ఈ మేఘాలు చిరపుంజీ కొండలను నిట్టనిలువుగా ఢీకొట్టినప్పుడు దానికి దిగువన ప్రయాణించే మేఘాలు నునుపైన వక్రతలాల్లోకి నెట్టబడతాయి. ఖాసీ కొండల నుంచి గాలి నేరుగా వీస్తున్నప్పుడు భారీ వర్షాలు కురవడంలో ఆశ్చర్యం అనిపించదు.
రాత్రిపూటే... ఎక్కువ : చిరపుంజీలో కురిసే రుతుపవన వర్షాల్లో అత్యధికం ఉదయం పూటే కురవడం విశేషం.
రెండు రకాల గాలులు ఒకేసారి రావడమే దీనికి కారణం. రుతుపవన కాలంలో బ్రహ్మపుత్ర లోయ నుంచి వీచే గాలులు సాధారణంగా తూర్పు నుంచి ఈశాన్యం వైపుకు వీస్తాయి. కానీ మేఘాలయా నుంచి వీచే గాలులు దక్షిణవైపు నుంచి గాలులు వీస్తాయి. ఈ రెండు రకాల గాలు ఖాసీ కొండల సమీపంలో దగ్గరకు వస్తాయి. ఈ కొండల్లో రాత్రివేళ చిక్కుకున్న గాలులు అవి వేడెక్కిన తరువాత ఉదయం వేళ, పైకి లేవడం ప్రారంభిస్తాయి. ఇది ఉదయం వేళ మాత్రమే వానలు కురవడానికి గల కారణాన్ని పాక్షికంగా వివరిస్తుందని చెప్పవచ్చు. ఒరోగ్రాఫ్ లక్షణాల కారణంగా వాతావరణంలోనా మార్పులు కూడా రుతుపవన కాలంలో జరిగే మార్పులో కీలక పాత్ర పోషిస్తాయి. సీజన్ మొత్తం ఇదే విధంగా కొనసాగుతుంది.
మాతృపాలన: చిరపుంజీలో నివసించే స్థానికులను ఖాసీలంటారు. వీరిలో మాతృవంశ పాలన ఉం
టుంది. పెళ్లి తరువాత భర్త జీవించడం కోసం భార్య వెంబడి ఆమె ఇంటికి వెళతాడు. పుట్టిన పిల్లలు తల్లిపేరును ఇంటిపేరుగా పెట్టుకుంటారు. చిరపుంజీ లివింగ్ బ్రిడ్జ్‌కు పెట్టింది పేరు. ఎన్నో వందల సంవత్సరాల నుంచి చిరపుంజీవాసులు చెట్ల వేళ్లనే బ్రిడ్జిలుగా మార్చే విధానాన్ని అభివృద్ధి చేశారు. వీటిని బ్రిడ్జిలుగా మలచడానికి పది, పదిహేను సంవత్సరాలు పడుతుంది. అయితే ఇవి వందల సంవత్సరాల పాటు ఉంటాయి. ఇప్పటికీ ఉపయోగిస్తున్న ఒక పురాతన బ్రిడ్జి వయస్సు 500 ఏళ్లు ఉంటుందని భావిస్తున్నారు.
రవాణా సౌకర్యాలు: షిల్లాంగ్ చేరుకోవాలనుకునే వారికి సమీపంలోని గౌహతి ప్రధాన కేంద్రం. ఇక్కడే విమానాశ్రయం, రైల్వే స్టేషన్ ఉంది. గౌహతి చేరుకుని అక్కడినుంచి షిల్లాంగ్ వెళ్లాల్సి ఉంటుంది. గౌహతినుంచి షిల్లాంగ్ వెళ్లే వారికోసం మేఘాలయా ప్రభుత్వం హెలికాప్టర్ సౌకర్యాన్ని సైతం అందుబాటులో ఉంచింది. అలాగే మేఘాల యాలోని ఏ ప్రాంతానికి చేరుకున్నా అక్కడినుంచి రాజధాని ప్రదేశమైన షిల్లాంగ్‌కు బస్ సౌకర్యం ఉంది.
No comments:
Post a Comment