పర్యాటక రంగంలో... దేశంలోనే ముందంజలో ఉన్న రాష్ట్రం రాజస్థాన్. ఎడారి అందాలు, కోటలు, బురుజులు వంటి ఎన్నో అద్భుత కట్టడాలకు ఈ ఎర్ర నేల ఎంతో ప్రసిద్ధిగాంచింది. విదేశీ పర్యాటకులను ఆకర్షించడంలోనూ రాజస్థాన్ ముందువరుసలో నిలుస్తున్నది. అక్కడ కొలువైన అందాలు ఆ రాష్ట్రాన్ని పర్యాటక దిగ్గజంగా మలిచాయి. ఎన్నో రాచరిక వ్యవస్థలకు పుట్టినిల్లయిన రాజస్థాన్‌లో ఆ రాజుల కళాపోషణకు గుర్తుగా అనేక సౌధాలు, కోటలు వెలిశాయి. అలాంటి చారిత్రక కట్టడాల్లో ఎంతో ప్రత్యేకతను సంతరించుకున్న రాచరిక సౌధం ‘ఉమైద్ భవన్ ప్యాలెస్’ విశేషాలు...
ఉమైద్ భవన్ ప్యాలెస్... వ్యక్తిగత నివాసాల్లో ప్రపంచంలోనే అతిపెద్దదిగా పేరిందిన కట్టడాల్లో ఒకటి. ఇది రాజస్థాన్‌లోని జోధ్‌పూర్ నగరంలో ఉంది. ప్రస్తుతం తాజ్ హోటల్స్ గ్రూప్ ఈ ప్యాలెస్ బాగోగులు చూస్తున్నది. మొత్తం 347 గదులున్న ఈ ప్యాలెస్‌ను జోధ్‌పూర్ మహారాజు... మహారాజా ఉమైద్ సింగ్ నిర్మించారు. రాజా ఉమైద్ సింగ్ అధికారం నివాసంగా ఉన్న ఈ అద్భుత ప్యాలెస్ కు ఆయన ముని మనవలు ప్రస్తుత యజమానులు. ఈ ప్యాలెస్ చిత్తర్ హిల్స్‌పై నిర్మించినందువల్ల ఉమైద్ భవన్ ప్యాలెస్‌ను దీని నిర్మాణ సమయంలో చిత్తర్ ప్యాలెస్ అని కూడా పిలిచేవారు. తరువాత రాజా ఉమైద్ సింగ్ పేరు మీద ఉమైద్ భవన్ ప్యాలెస్‌గా నామకరణం చేశారు. చిత్తర్ హిల్, జోధ్‌పూర్‌లోనే అత్యంత ఎతె్తైన ప్రదేశం. నవంబర్ 18, 1929వ సంవత్సరంలో ఈ భవన నిర్మాణాన్ని చేపట్టి 1943లో పూర్తిచేశారు.
నిర్మాణం...
ఐదు వేల మంది నిర్మాణ కార్మికులు 15 ఏళ్ళపాటు శ్రమకోర్చి నిర్మించిన ఈ అందమైన భవనం జోధ్‌పూర్‌కు ఆగ్నేయ దిశలో ఉంది. నిర్మాణంలో కాంక్రీట్‌గాని, సిమెంట్ గాని ఉపయోగించకుండా కేవలం రాళ్ళతో నిర్మించడం ఉమైద్ ప్యాలెస్ ప్రత్యేకత. రాళ్లలోని పాజిటివ్, నెగెటివ్ ముక్కలను ఒకదానికి ఒకటి అనుసంధానం చేస్తూ... ఈ భవనాన్ని నిర్మించడం అప్పట్లోనే పరిణితి చెందిన శాస్త్ర సాంకేతిక విజ్ఞానాన్ని ఉపయోగించడం ఆశ్చర్యం కలిగిస్తుంది. ఈ రాజప్రాసాద నిర్మాణానికి కావాల్సిన రాళ్ళను తరలించడానికి అప్పట్లోనే ఇక్కడకి ఒక రైలు మార్గాన్ని కూడా వేశారు. ఇక్కడ ఏ సీజన్‌లోనైనా 23 డిగ్రీల ఉష్ణోగ్రతకు హెచ్చుతగ్గులు లేకుండా ఉండడం శాస్తవ్రేత్తలకు ఇప్పటికీ అంతుచిక్కని విషయం. 26 ఏకరాల విస్తీర్ణంలో నిర్మించిన ఈ ప్యాలెస్ మూడున్నర ఎకరాలు భవన నిర్మాణానికి కేటాయించగా మిగిలిన ప్రాంతంలో గార్డెన్‌గా తీర్చిదిద్దారు.

దేశవిదేశాలకు చెందిన ఆర్కిటెక్ట్‌లు ఈ నిర్మాణానికి డిజైన్లను అందించారు. ప్రపంచ ప్రఖ్యాత ఇంజనీర్ హెన్రీ లాంచెస్టర్, భారతీయ ఇంజనీర్ బుద్ధమాల్ రాయ్ ఈ భవన నిర్మాణానికి నమూనాలందించారు. ఉమైద్ ప్యాలెస్ లోని మధ్య గుమ్మటం 105 అడుగుల ఎత్తులో ఉంటుంది. ఈ నిర్మాణంలోని టవర్స్ అన్నీ రాజ్‌పుత్‌ల నిర్మాణశైలిని కళ్ళముందుంచుతాయి. హీరానంద్ యు. బాటియా రెసిడెంట్ ఇంజనీర్‌గా పనిచేసిన ఈ ప్యాలెస్ నిర్మాణానికి అప్పట్లోనే అక్షరాల 94 కోట్ల రూపాయలు ఖర్చయ్యిందట. భవనం ఇంటీరియర్ డిజైన్‌ను ‘మాపుల్స్ ఆఫ్ లండన్’ వారు చేపట్టగా... వారు వస్తున్న ఓడను జర్మన్లు సముద్రంలో ముంచారు.
దాంతో మహారాజా ఉమైద్ సింగ్ ఆ పనిని పోలెండ్‌కు చెందిన మరో ప్రముఖ డిజైనర్ స్టీఫాన్ నార్‌బ్లిన్‌కు అప్పగించారు. లావిష్ ఇంటీరియర్ స్టైల్‌ను ప్రతిబింబించే విధంగా నిర్మించిన ఈ కట్టడంలో బంగారు, వెండి పూతతో ఎంతో అద్భుతంగా నిర్మించారు. స్వయానా చిత్రకారుడు కూడా అయిన స్టీఫాన్ నార్‌బ్లిన్ చిత్రించిన చిత్రాలు భవన ఇంటీరియర్‌కు మరింత ఆకర్షణను చేకూర్చాయి. చిత్తర్ ప్యాలెస్, తన పూర్వీకుల జ్ఙాపకార్థం నిర్మించారు. అంతేకాకుండా, ఓటమి ఎరుగని మహారాజుగా గుర్తింపు తెచ్చుకున్న రావు జోధా నిర్మించిన మెహరంగధ్ కోట కూడా తన పూర్వీకుల జ్ఙాపకార్థమే నిర్మించారు.
మెహ్రంగద్ కోట...

మెహ్రంగద్ కోట రాథోఢ్ వంశ పరిపాలను గుర్తు. అయితే ఈ కోటపైన కట్టడాలను రావు జోధా చాలాసార్లు మార్పులు చేశారు. ఆయన చేసిన మార్పుల్లో చాలావరకు మొఘల్ సామ్రాజ్య నిర్మాణ శైలికి అద్దం పడు తుండగా... మరోవైపు అద్భుతంగా మలిచిన ఆర్చీలు, గుమ్మటాలు, బొటానికల్ పెయింటింగ్స్, వాటర్ కోర్సులు అన్నీ రాజా ఉమైద్ సింగ్ చిత్త ర్ ప్యాలెస్ రాజ్‌పుత్ నిర్మాణ శైలిని అడుగడుగా ప్రతిబింబిస్తాయి. రాష్ట్ర కూటుల రాచరికానికి ప్రతీక ఈ ప్యాలెస్. పురాతన హిందూ నిర్మాణశైలికి అద్దం పట్టే అద్భుత రాతికట్టడమైన కైలాష్‌నాథ్ దేవాలయం వీరి కళాభిరుచికి నిదర్శనాలు.
ఉమైద్ భవన్ ఇప్పుడో స్టార్ హోటల్...
ప్రస్తుతం తాజ్ గ్రూప్ ఆధ్వర్యంలో రాజస్థాన్‌లోనే అతిపెద్ద స్టార్ హోట ల్‌గా ఉన్న ఈ ప్యాలెస్‌లో కొంత భాగాన్ని ఇప్పటికీ మహారాజా ఉమైద్ సిం గ్ వారసులు వారి నివాసానికి ఉపయోగిస్తున్నారు. ప్రస్తుతం ఈ ప్యాలె స్‌కు మహారాజా గజ్‌సింగ్-2 వారసుడుగా చలామణి అవుతున్నారు. 1972లో ఈ ప్యాలెస్ హోటల్‌గా రూపాంతరం చెందింది. 1978లో ఈ హోటల్ నిర్వహణ బాధ్యతలను... భారత్‌లోనే అతిపెద్ద హోటల్ గ్రూప్ అయిన ఐటీసీ వారికి అప్పగించారు. ఈ హోటల్‌కు వచ్చే పర్యాటకులు మునుపెన్నడూ ఎరుగని అత్యాధునిక వసతి సౌకర్యాలను అనుభవిస్తారు.
రాజమహల్‌లో ఉన్న అనుభూతిని పొందుతారు. హోటల్‌లో ఎక్కడ చూసినా అత్యంత ఖరీదైన ఫర్నిచర్ మన కు దర్శనమిస్తుంది. నేటి పర్యాటక అవసరాలకు అనుగుణంగా యాత్రి కులకు అన్నిరకాల సౌకర్యాలు అందించడం ఈ హోటల్ ప్రత్యేకత. ఈ హోటలను సందర్శించే పర్యాటకులను... హోటల్ మధ్యనున్న 110 అడు గుల ఎతె్తైన గుమ్మటం విశేషంగా ఆకట్టుకుంటుంది. చెప్పాలంటే... ఈ హోటల్‌కు ఇదే ఒక ప్రత్యేక ఆకర్షణ. ఈ హోటల్‌లో అన్ని రకాల ఆహారప దార్థాలను వండి వార్చడానికి ఎన్నో రెస్టారెంట్లు కొలువుదీరి ఉన్నాయి. ది ట్రోఫీ బార్, రిసాలా రెస్టారెంట్, ది మర్వర్ హాల్, ది పిల్లర్స్ రెస్టారెంట్, కెబాబ్ కార్నర్ వంటి ఎన్నో ఫుడ్ పాయింట్స్ మీకు దర్శనమిస్తాయి. విదేశీ యాత్రికులకు కావలసిన వంటకాలు కూడా ఇక్కడ లభ్యమవుతాయి.

ఈ హోటల్ గుమ్మటాల మధ్య నుండి సూర్యాస్తమయాన్ని చూడడం ఒక మరుపురాని అనుభూతి. ఆ అనుభూతిని అనుభవించాలనేగాని మాటల్లో వర్ణించలేము. అంతేకాకుండా ప్యాలెస్ ముందు పచ్చగా పరుచుకున్న లాన్లు ఎంతో ఆహ్లాదకర వాతావరణాన్ని అందించడమే కాకుండా హోటల్‌కు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. బిల్డింగ్ మధ్యలో ఉండే స్విమ్మింగ్ పూల్ హోటల్‌కే ప్రధాన ఆకర్షణగా నిలుస్తున్నదని చెప్పవచ్చు. అంతేకాకుండా హోటల్‌ను ఆనుకొని ఒక ప్రైవేట్ మ్యూజియం కూడా ఉన్నది. ఈ మ్యూజియంలో దేశవిదేశాలకు సంబంధించిన ఫర్నిచర్, గడియారాలు, బొమ్మలు వంటి రకరకాల వస్తువులు కొలువుదీరి ఉంటాయి. ఇందులో జోధ్‌పూర్ మహారాజు వారి పరిపాలన కాలంలో సేకరించిన వివిధ రకాలైన, విలువైన వస్తువుల కూడా ఉంటాయి. విహారం లేదా వ్యాపారం నిమిత్తం జోధ్‌పూర్‌కు వచ్చే పర్యాటకులు ముందుగా ఈ ప్యాలెస్ హోటల్‌కే ఎక్కువ ప్రాధాన్యతనిస్తారు.
గత కొన్నేళ్ళుగా ఈ ప్యాలెస్ దేశీయ పర్యాకులనే కాకుండా విదేశీ పర్యాటకులను కూడా అమితంగా ఆకట్టుకుంటోంది. ముఖ్యంగా బిజినెస్ కాన్ఫరెన్సులకు ఈ హోటల్ ప్రముఖ విడిదిగా మారిందని చెప్పవచ్చు. ఇందులో బిజినెస్ మీటింగ్ కావలసిన విశాలమైన మీటింగ్ ఏరియా ఉంది. అంతేకాకుండా మీటింగ్ కావలసిన ఫర్నిచర్ ఎప్పుడూ అందుబాటులో ఉంటుంది. జోధ్‌పూర్ సందర్శించే పర్యాటకులు ఈ హోటల్ సందర్శించకుండా వెనుదిరిగారంటే... వారు పూర్తి విహారానుభూతిని ఆస్వాదించలేదనే అర్థం. ప్రపంచంలోనే ఫస్ట్ క్లాస్ హోటల్‌గా రేటింగ్ పొందిన ఉమైద్ భవన్ ప్యాలెస్‌కు గత కొంతకాలంగా పర్యాటకుల తాకిడి విపరీతంగా పెరిగింది.


1952లో సొంత రాజ్యాంగం ఏర్పరుచుకున్న వారు, వరుసగా 1967, 1993, 1998లో జరిగిన రిఫరెండముల్లో యథాతథంగా కొనసాగేందుకు ఇష్టపడ్డారు. పోర్టోరికన్‌లకు అమెరికన్ పార్లమెంట్‌లో పాల్గొనేందుకు మాత్రం అవకాశం లేదు. వారికి ప్రత్యేకమైన పతాకం ఉంది. పతాకలో ఎర్ర గీతలు ప్రభుత్వమనే అవయవానికి జవసత్వాల్నిచ్చే రక్తమని, నీల త్రిభుజం... ప్రభుత్వంలోని న్యాయ, రాజ్యాంగ, పరిపాలన విభాగాలని, నక్షత్రం సార్వభౌమత్వానికి చిహ్నమనీ భావిస్తారు.

సోదరులు పవిత్రస్థలమైన మక్కాలో ప్రపంచంలోనే ఓ అరుదెైన ఆవిష్కరణ రూపుదిద్దు కుంది. గత బుధవారం ప్రారంభించిన ఆ అరుదెైన కట్టడం ఇప్పుడు పర్యాటకులను విశేషం గా ఆకట్టుకుంటోంది. ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా ఎన్నో క్లాక్ టవర్స్ ఉన్నాయి. వాటన్నింటినీ తల దన్నే రీతిలో మక్కాలో ఇప్పుడు ప్రపంచంలోనే ఎతైన క్లాక్ టవర్ గా గుర్తింపు పొందింది. ముస్లింలు ప్రతిరోజు 5 సార్లు నమాజ్ చేస్తారని అందరికీ తెలిసిన విషయమే... అయితే నమాజ్ టైం కాగానే టంచనుగా మోగుతూ ముస్లిం సోదరులను నమాజ్‌కు సన్నద్ధం చేయడం ఈ బడా గడియారం ప్రత్యేకత.
అసఫ్‌జాహీ కాలంలో ప్రస్తుతం జిల్లాకు రూపు రేఖలు ఏర్పడ్డాయి. నిజాం కాలంలో ఈ ప్రాంతం సిర్పూర్, తాండూర్ ఉప జిల్లాగా ఉండేది. 1905 లో ఆదిలాబాద్ జిల్లా స్వతంత్ర జిల్లాగా ఏర్పడింది. అంతకు ముందు ఆసిఫాబా ద్ జిల్లాగా కొనసాగింది. నాటి నుంచి ఆదిలాబాద్ అంటేనే అడవుల జిల్లా.. ప్రకృతి అంద చందాలకు నిలయాలు ఇక్కడి అభయ అరణ్యాలు. వాటర్ ఫా ల్స్, ప్రకృతి రమణీయతను చాటుతుంటాయి. కవ్వాల్ అభయ అరణ్యాలు జం తువులకు ఆలవాలం అయిన ప్రాణహిత బ్లాక్, శివారం అభయ అరణ్యం లోగి లి, ఆదిలాబాద్ సెలయేటి గలగలలు, పక్షుల కిల కిల రావాల నడుమ వన్య ప్రాణులు సంచరిస్తుంటాయి. వన్య ప్రాణులకు ఇక్కడ కొదవ లేదు. పులులు, ఎలుగు బంట్లు, నిల్వాయిలు, చిరుతలు, దుప్పులు, నెమళ్ళు, లేళ్లు, నక్కలు, కొండ చిలువలు తదితర వన్య ప్రాణులతో పాటు టేకు, జిట్రేగి, వెదురు మొ దలగు అపారమైన అటవీ సంపద విస్తారంగా ఉంది.
హైదరాబాద్, నాగ్‌పూర్ ఏడవ జాతీయ రహదారిలో ఉన్న నేరడిగొండ మండల కేం ద్రం నుంచి 12 కిలో మీటర్ల దూరంలో ఈ జలపాతం ఉంది. గోదావరి ఉప నది అయిన కడేం వాగు సహ్యాద్రి పర్వత పంక్తులపెై 40 మీటర్ల (138 ఫీట్లు) ఎత్తు నుంచి జాలువారుతూ కుంటాల జలపాతంగా మారుతుంది. జలపాతం దూకే చోట చిన్న రాతి గుహ ఉంది. అందులో సోమేశ్వరుడు, నంది, పాన వట్టం ఉన్నాయి. ఏక కాలంలో ఒకరు మాత్రం వెళ్లగలిగే వీలు ఉన్న ఈ గుహలో 10 మంది వర కు కూర్చో వచ్చు. జలపాతం దిగువన కుడి వెైపున చెట్టుకింద కాకతీయుల నాటి దేవత విగ్రహాలు కనిపిస్తాయి. ప్రస్తుతం ఇది పర్యటక ప్రాంతంగా ప్రకటించడంతో సూదూర ప్రాం తాల నుంచి సందర్శకులు వచ్చి ఇక్కడి అడవుల అందాలను తిలకించి మంత్ర ముగ్ధులవు తున్నారు. రాష్ట్ర ప్రభుత్వంతో పాటు జిల్లా అధికార యంత్రాంగం వచ్చి పోయే పర్యటకుల సౌకర్యార్థం అన్ని వసతులను కల్పిస్తుంది.
కళలకు కళాకారులకు ప్రసిద్ది గాంచినదే నిర్మ ల్ ప్రాంతం. ప్రాణం లేని బొమ్మలకు నిర్మల్ కొయ్యబొమ్మల తయారీ కళాకా రులు నిర్జీవమైన ప్రతిమలకు ప్రాణం పోస్తున్నారు. జీవం ఉట్టిపడేలా ఆకృ తు లను తయారు చేస్తూ ఆకట్టుకుంటున్నారు. గేట్ ఆఫ్ ఆదిలాబాద్‌గా నిర్మల్ పేరు గాంచింది. అచ్చంగా కూరగాయలు, పండ్లు, పక్షుల మాదిరిగా ఎన్నో రకా ల బొమ్మలు ఇక్కడి కళాకారులు తయారు చేస్తున్నారు. ప్రపంచ వ్యాప్తంగా ప్రసిద్ది గాంచిన ఈ బొమ్మలను దగ్గరకు వచ్చి చూస్తే గాని అవి కొయ్య బొమ్మలుగా గుర్తించలేము. రాష్ట్రంలోనే కాకుండా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఈ కొయ్య బొమ్మలు ప్రసిద్ది గాంచాయి. పెయింటింగ్‌లకు పెట్టింది పేరుగా నిర్మల్‌ను చెప్పుకొవచ్చు. కాకతీయ కళాతోరణం, చారిత్రక చార్మినార్‌తో పా టు జాతీయ నాయకుల కళా రూపాలు తయారిలో మంచి ప్రావీణ్యం ఇక్కడి కళాకారులు సంపాదించారు. వీరి చేతిలో రూపుదిద్దుకున్న బొమ్మలు దేశ విదే శాలకు ఎగుమతి అవుతున్నాయి.
ఆదివాసులది అడవి బ్రతు కు, అడవిలోనే అనేక ఘోరాలు అన్యాయాలు జరుగుతుండేవి. గిరిజనులపెై నిజాం ప్రభుత్వం చేస్తున్న అన్యాయాలను, దోపిడిని అరికట్టేందుకు నిజాంకు వ్యతిరేకంగా సాయుధ పొరాటం చేసేందుకు ముం దుకు వచ్చిన ఆదివాసి ముద్దుబిడ్డ, గిరిజనుల ఆరాధ్య దెైవం కొమరంభీం ఆ అడవి బ్రతుకునుంచే జరుగుతున్న దోపిడిపెై అనేక విషయాలు నేర్చుకున్నాడు. ప్రభుత్వం పెై పోరా డి ఆదివాసుల భూములను వారి పంటలను దక్కించుకున్నాడు. అటవీ భూములను నెైజాం ప్రభుత్వం భూస్వాములకు పట్టాలు చేస్తున్న కార్య్ర మంలో ఆసిఫాబాద్ ప్రాంతంలోని ఆదివాసులు తీవ్ర అన్యాయానికి గుర య్యారు. కొమరంభీంది ఆసిఫాబాద్ దగ్గర్ సంకెపల్లి గ్రామం. భీం కూలీ పనిచేస్తూ చదవడం రాయడంతో పాటు రాజకీయాల గురించి, గిరిజనుల తిరుగుబాటు గురించి తెలుసుకున్నాడు.
మేఘాలయా రాష్ట్ర రాజధాని షిల్లాంగ్‌కు 56 కిలోమీటర్ల దూరంలో ఉన్న చిరపుంజీ ఓ అందమైన ప్రకృతి నిలయం. అంతర్జాతీయ భౌగోళిక గుర్తింపు పొందిన ప్రదేశం... సంవత్సరమంతా సగటున వర్షించే మేఘాలు ఇక్కడి కొండల చాటున పచ్చని తివాచీని పరుచున్నట్లుంటాయి. ఈ ప్రాంతం పర్యాటకులకు స్వర్గధామంగా... ఓ అందమైన అనుభూతిని కలిగిస్తుంది. దాదాపు ప్రతిరోజూ వర్షం కురిసే ఈ ప్రాంతంలో మేఘాలు ప్రసవానికి సిద్ధమైన నిండు చూలాలులా హఠాత్తుగా వర్షిస్తుంటాయి. సముద్రమట్టం నుంచి దాదాపు 1300 మీటర్ల ఎత్తులో ఉండే ఈ ప్రాంతంలోనే దేశంలో అత్యధికంగా వర్షం పడే ప్రాంతంగా పేరు సంపాధించిన మాసిన్రామ్ ఉండడం విశేషం. దాదాపు ఓ చిన్న పట్టణంగా విరాజిల్లుతున్న ఈ ప్రదేశం ప్రకృతి శోభను సొంతం చేసుకున్న కొత్త పెళ్లి కూతురిలా మనసుల్ని ఇట్టే కట్టి పడేస్తుంది. దట్టమైన మేఘాల అంచుల్ని మనం అక్కడ చేతులతోనే తాకవచ్చన్నట్లుంటాయి. ప్రకృతిని ఇంత దగ్గరగా చూడవచ్చా అనిపించేలా ఉంటుంది ఇక్కడి అందమైన వాతావరణం... కలుషిత, శబ్దకాలుష్య వాతావరణానికి దూరంగా ప్రకృతి రమణీయ దృశ్యాల అనుభూతులను మాటలతో వర్ణించలేము... ఒక్కసారైనా వెళ్లి అక్కడి సహజందాల సౌందర్యాన్ని వీక్షించిరావలసిందే...
చిరపుంజీ ని చిర్రాపుంజి అని కూడా పిలుస్తారు. ఇది మేఘాలయాలోని తూర్పు ఖాశీ హిల్స్ జిల్లాలోని ఒక ముఖ్య పట్టణం. భూమి మీద అతి తేమగా ఉండే ప్రదేశంగా ఇది ఖ్యాతిగాంచింది. అయితే ఇప్పుడు దీనికి సమీపంలో ఉండే మాసి న్రామ్ అత్యధిక వర్షపాతం ఉంటోంది. చిరపుంజీ అసలు పేరు సొరా, దీన్ని చురా అని బ్రిటిష్ వారు పిలిచేవారు. కాలక్రమేణా అది చిరపుంజీగా మారింది.
అధిక వర్షపాతం ఉన్నా... తాగునీటికి ఇబ్బందే: నిత్యం వర్షాలు పడ్డా కూడా, చిరపుంజీ తాగు నీటి సమస్యను ఎదుర్కొంటోంది. ఇక్కడ వారు తాగునీటి కోసం ఎన్నో మైళ్లు వెళ్లాల్సి ఉంటుంది. అడవులు భారీగా ఆక్రమణకు గురికావడంతో, విస్తారంగా పడే వర్షాల కారణంగా, మట్టిపైపొరలు కొట్టుకుపోయాయి. దాంతో ఈ అడవుల్లో నీటిపారుదలకు తీవ్ర విఘాతం ఏర్పడింది. మేఘాలయా రాష్ట్ర ప్రభుత్వం చిరపుంజీకి సోహ్రా అన్న స్థానిక పేరును తిరిగి పెట్టడానికి నిశ్చయించుకుంది. చిరపుంజీలోని స్మశానవాటికలో డేవిడ్‌స్కాట్ (1802-31 వరకు ఈశాన్య భారతానికి సంబంధించిన బ్రిటిష్ అధికారి) కు సంబంధించిన స్మారక చిహ్నం ఒకటి ఉంది.
భారీ వర్షపాతానికి కారణం ఇదే: చిరపుంజి భారత వేసవి ఋతుపవనాలు... బంగాళాఖాతం నుండి వర్షాలను అందుకుంటుంది. రుతుపవన మేఘాలు బంగ్లాదేశ్‌లోని పర్వతసానుల గుండా ఎలాంటి అడ్డంకులు లేకుండా సుమారు నాలుగువందల కిలోమీటర్లు ప్రయాణిస్తాయి. ఆ తరువాత అవి ఖాసీ పర్వతాలను ఢీకొంటాయి. రెండు నుంచి ఐదు కిలోమీటర్ల పరిధిలో ఇవి అనూహ్యంగా సముద్రమట్టానికి 1370మీటర్లు ఎత్తు పెరగడమే దీనికి కారణం. భౌగోళిక పరంగా లోతైన లోయలుండటంతో బాగా దిగువకు ప్రయాణించే మేఘాలు (150 నుంచి 300 మీటర్లు) చిరపుంజీ మొత్తం పరుచుకుంటాయి. ఆ గాలులు వర్షాల మేఘాలను ద్రోణివైపు లేదా నునుపైన తలాల వైపుకు నెడతాయి. మేఘాలు వేగంగా పైకి పోతుండటంతో పైన వాతావరణంలో మార్పులు సంభవిస్తాయి. 




చాలామంది దేవతల చరిత్ర మాదిరే ‘శ్రీ జ్వాలాముఖి మహాదేవి’ జన్మ వృత్తాంతం తెలియజెప్పే చారిత్రక ఆధారాలు కానీ... ప్రశస్తిని ప్రకటించే స్థల పురాణాదులుగానీ ఏవీ లభ్యం కాలేదు. కానీ జనం నోట వినిపించే ‘జనశృతి’ మాత్రం విస్తృతంగా వుందనేది తెలుస్తోంది. కొన్ని వందల ఏండ్లకు పూర్వం ఒంగోలు సమీపానవున్న పెళ్లూరు సంస్థా నానికి... వెంకటగిరి రాజాలకు మధ్య వైషమ్యాలు ఏర్పడి, వైరంగా పరిణ మించాయి. వెంకటగిరి రాజ్య సైన్యశక్తిని ఎదుర్కొనే బలం పెళ్లూరు సంస్థానా నికి లేకపోవడంతో... అనుభవజ్ఞులు, మిత్రులను పెళ్లూరు వారు సలహా కోర డం జరిగింది. ‘మానవ శక్తి చాలనప్పుడు దైవశక్తిని ఆశ్రయించడం తప్ప చేయగలిందేమీ లేదనే’ శ్రేయోభిలాషుల సలహాల మేరకు, మంత్రశక్తితో మహా శక్తిని వశం చేసుకోవడానికి యజ్ఞం ప్రారంభించారు. ఖర్చుకు వెనుకాడక మహాయజ్ఞ నిర్వహణను చేపట్టారు. ఆ యజ్ఞం వలన మహాశక్తి ఉద్భవిస్తే మను గడ కష్టమవుతుందని భావించిన వెంకటగిరి రాజులు... క్షుద్ర పూజలు ద్వారా యజ్ఞానికి అంతరాయం కల్పించారు. సరిగ్గా ఆ సమయంలో హోమాగ్ని నుం చి ఉల్కలు ఉవ్వెత్తున రేగుతుండగా... ఆ ఉల్కలు, జ్వాలలు మధ్య అఖండ తేజస్సుతో... అరుణారుణ కాంతితో... అద్వితీయరూపంతో... ఆవిర్భవిం చింది ‘‘మహాశక్తి’’. 