దేశంలోకెల్లా ప్రసిద్ధమైన ఎల్లోరా గుహలు మహారాష్ర్టలో ఉన్నాయి. హైదరాబాద్ నుండి మన్మాడు వెళ్ళే రైలు మార్గంలో ఉన్న ఔరంగాబాద్ స్టేషన్‌కు 26 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ గుహలను చూడడానికి రెండు కళ్ళూ చాలవు. అజంతా గుహలు కూడా ఇక్కడకు దగ్గరలోనే ఉన్నాయి.అందుకే అజంతా - ఎల్లోరా గుహల చిత్ర శిల్పాలు భారతీయ కళావేత్తలనే కాకుండా ప్రపంచ కళాకోవిదులను కూడా ఆకర్షించి ప్రశంసలు అందుకున్నాయి. ఇవి ప్రకృతి రమణీయాలైన నదీ పర్వతారణ్య పరిసరాలలో ఉండడం ఒక విశేషం. ఆ పర్వత సానువుల్లో పలు రకాలైన సెలయేర్లూ ఎంతో మోహనంగా అలరిస్తాయి.ఇలాంటి అందమైన ప్రదేశాల్లోనే మునులు తపస్సు చేసుకునేవారేమో! ప్రకృతి కళోపాసకులు, శిల్పులు, బౌద్ధ భిక్షువులు ఇలాంటి సుందర ప్రదేశంలోనే ఆ ళాలక్ష్మికి నీరాజనాలు పలికారు. తరతరాలుగా ఈ ప్రకృతి అందాలు పర్యాటకుల మది దోచుకుంటూనే వున్నాయి. సృష్టికే శోభనిచ్చేంతటి సౌందర్యం ఎల్లోరా సొంతం. అందుకే భారతీయ శిల్పకళా పరిశోధనకు, ఆ విలువైన అందాలను ఆస్వాదించడానికి ఎందరో విదేశీయులు అజంతా ఎల్లోరా గుహలను సందర్శిస్తుంటారు.

ఈ గుహల్లో ఎక్కువ భాగం ధ్యానాది సాధనలు, విద్య గడపడానికి వచ్చిన బౌద్ధ భిక్షువుల కొరకు ప్రత్యేక గదులుగా విభజింపబడ్డా యి. కొన్ని గుహలు రెండు అంతస్తులు, మరికొన్ని 3 అంతస్తులుగా ఉండి గాలి, వెలుతురు ధారాళంగా వచ్చే విధంగా కట్టబడి ఉన్నాయి. ఈ ఎల్లోరా గుహలన్నింటి లో మొదటి గుహ చాలా ప్రాచీనమైనది. రెండో గుహ శిల్పకళ తో కూడిన ఒక చైతన్యశాలగా ఉంటుంది. దీనిలో బుద్ధుడి గురించిన వివిధ మూర్తులు, బోధిసత్వుని మూర్తులున్నాయి. దీనిపై కప్పు పెద్దపెద్ద 12 స్తంభా లపై ఆధారపడి ఉంటుంది. ఈ గుహ గర్భాలయంలో సింహాసనాధీసుడై ఉన్న బుద్ధుని విగ్రహం ఉంది. ఈ శిల్ప విగ్రహం చూపరులను ఆకట్టుకుంటుంది.

అలాగే ఈగుహలో ఒక ప్రత్యేకత కూడా ఉంది. మనం ఒక ధ్వని చేస్తే అది ప్రతి ధ్వనించి ఆ ప్రతిధ్వనుల పరంపరలు మళ్లీ మనకే విన్పిస్తూ మెల్లగా తగ్గుతూ ఒక విధమై న ధ్వని సొంపుతో ముగుస్తాయి. ఈ ధ్వనులు వింటుంటే మళ్లీ మళ్లీ మనం ధ్వని చేయాలన్పిస్తుంది. అంతేకాక ఒక స్తంభాన్ని మనం మోగిస్తే ఇంకొక స్తంభం నుండి ధ్వని విన్పిస్తుంది. నిజంగా ఈ విశ్వకర్మ గృహాలయం చాలా వింత గొలుపుతుంది.
హిందూ మతగుహలు...

ఈ అద్భుతమైన శిల్పాలను చూడడం కోసం యాత్రికులు తప్పకుండా ఈ గుహను చూడాల్సిందే. 21వ గుహను రామేశ్వర గుహాలయం అంటా రు. 22వ గుహ నీలకంఠగుహ అంటారు. ఈ గుహలో సప్త మాతృకలు, గణపతి, నదీ దేవతలు తదితర విగ్రహాలున్నాయి. 25వ గుహలో సూర్యుడు ఏడు గుర్రాలను కట్టిన రథమెక్కి ఉన్న శిల్పం అద్భుతంగా ఉంటుంది. 21, 22 గుహల్లో శివపార్వతుల కళ్యాణం, శివుడు తాండవం చేస్తున్నట్లున్న శిల్పాలున్నాయి. జగన్మోహనమైన ఈ గుహాలయం రాష్ట్ర కూటుల నిర్మాణ శైలిని పోలివుంది. మొత్తం మీద ఎల్లోరాలోని హిందూ మత గుహల్లోని పౌరా ణిక కథలను తెలిపే శిల్పాలన్నీ శైవమత ప్రాధాన్యతను కళ్ళకు కట్టినట్టు చూపుతున్నాయి.
జైనమత గుహలు...

- దామర్ల విజయలక్ష్మి
No comments:
Post a Comment